Monday, April 27, 2026

Tala Tala Lokamu - తలాతల లోకము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - తలాతల లోకము

శ్రీనారాయణు ఇట్లు పలికెను: సుతలమునకు క్రింద తలాతలమను లోకము గలదు. అందు గొప్ప దానవపతి త్రిపురాధినాధుడు మయుడనువాడుండును. శివుడు త్రిపురములు గాల్చుతఱి దేవదేవుని దయవలన నితడు రక్షింపబడి రాజ్య సుఖములు పడసెను. 

మయుడు గొప్పమాయావి! మాయావులకు మాయావి! పెక్కురు రక్కసులతనిని తమ కార్యసిద్దికొఱకు సేవించుచుందురు. సుతలమునకు క్రింద మహాక్రోధవశులును కద్రూతనయులునగు నాగరాజులు నివసించు ప్రసిద్ద మహాతలము గలదు. 

నారదా! వీరికి పెక్కుతలలుండును. వీరిలో ముఖ్యులను గీర్తింతును; వినుము. కుహకుడు, తక్షుకుడు సుషేణుడు కాళియుడు. వీరుపెద్ద పడగలుగల్గి మహాబలముగల్గి క్రూరస్వభావముగల క్రూర జాతులు. వీరందఱను గరుత్మంతునికి జంకుదురు. వీరు తమ తమ భార్యాపుత్ర-మిత్ర-కుటుంబముతో గూడి పెక్కుక్రీడలందారితేరి మదించి ప్రవర్తింతురు. 

మహ తలమునకు క్రింద రసాతలమను మహా లోకము గలదు. ఇందు పెద్దఫణములు గల్గిన దైత్యదానవులు వసింతురు. ఇందు సురవైరులు హిరణ్యపురవాసులు కాలేయులనబడు నివాతకవచాది రాక్షసులు వసింతురు. వీరు పుట్టునప్పట్టి నుండియే వీరులు-శూరులు. వీరు శ్రీహరితేజమున మాత్రము నిర్నీర్యులగుదురు. వీరెల్లప్పుడును బిలేశయులవ పగిది వినరమందే వసింతురు. సరమ శక్ర దూతిక. ఈమెమంత్ర వర్ణములుగల వాక్కులకు రసాతలవాసులు గడగడ లాడుదురు. రసాతలము క్రింద నాగలోకపతులు వసించు పాతాళము గలదు.

వాసుకి శంఖ కులిక శ్వేత ధనంజయ మహశంఖ ధృతరాష్ట్ర శంఖచూడ కంబల అశ్వతర దేవోపదత్తక నామములుగల నాగులు ప్రముఖులు. వీరు కోపావేశమున విషములు గ్రక్కుచుందురు. వీరులో నొక కొందరైదుతలలు నేడుతలలు పదితలలు నూఱు పడగలు వేయితలలు గల్గి తమ తమ ఫణా మణి కాంతిరేఖలలతో ఫాతాళమందలి చిమ్మచీకట్లు పారద్రోలుచుందురు. 

నారదా! వీరెల్లరును కోపాటోపముతో బుసలు గొట్టుచుందురు. దీనికి మూలమున ముప్పదివేల యోజనముల వైశాల్యమున నొక భగవత్కళ గలదు. అది తామసకళ. అనంత నామనున నెల్ల దేవతలచేత పూజింపబడుచుండును. అభిమానమునకు లక్షణ మహంకార మందురు. ద్రష్టృ-దృశ్యముల యైక్యమును సంకర్షణ మందురు. అనంతుడనంతమూర్తి; అదిశేషుడు. అతని వేయితలలపై భూమండల మంతయును నిల్చియున్నది. అతని తలలపై నీభూమండల మొక కమలమువలె నొప్పును. లయకాలుడగు రుద్రుడీ చరాచరములను సంహరింపదలచును. 

అపుడతని కన్బొమల నుండి సంకర్షణులను పేర్లగల పదునొకండు ప్యూహముల రుద్రులు ద్బవింతురు. అపుడు ముక్కంటి త్రిశూలము చేబూని మహాభూత భయంకరముగ దోచును. అంత రుద్రుని పదపద్మకాంతులచే కెంపెక్కిన కాలిగోళ్ల కాంతులు పాపఱడుల తలల మణి బింబములపై చెన్నలరును.

అత్తఱి సజ్జను లనన్య భక్తియోగమున తలలు వంచి దోయిలించి మ్రొక్కుచు తమ మొగములు చూచుకొందురు. వారిచెన్నొందు కుండలకాంతులు నిగ్గుటద్దములవంటి చెక్కిళ్లను మఱింత కాంతిమంతముగ జేయును. నాగరాజకన్యకల విలాసములు వంపుసోంపు లందాలు మిక్కిలి యచ్చమైన తళతళ కాంతులు విరజిమ్ముచుందురు. 

వారు తమ నునువెచ్చని భుజదండములకు చందనాగురు కస్తూరి సువాసనలు పూసికొని యలంకరించుకొందురు. వారు పురుషుల యంగములుతాకినంతన కామపరవశలై వలపులేనవ్వులు గురియుచు తలలు వంచి ప్రక్కచూపుల గాంతురు. అనురాగము గల్గినపుడు కమ్మని మైకము మత్తెక్కించుటచే నెఱుపెక్కిన వారి కన్నులు మత్తుగ తిరుగును. 

దయ చూపదలచి నపుడా కన్నులే యాశీస్సులు కురియును. అనంత భగవాను డనంతసత్త్వుడు. అనంత సుగుణవారిధి ఆది దేవుడు మహాద్యుతిమంతుడు. మహాభోగి అతడు సర్వలోకహితముగోరి క్రోధముడిగ సురగణపూజితుడై యచ్చోట విలసిల్లుచుండును. అతనిని ముప్ప్రొద్దులు సురాసులు సిద్దవిద్యాధరగంధర్వలు మునులు నాగులు ధ్యానించుచుందురు. 

అచటి దేవుడనారతము మదించి వ్యాకులత్వ మొందు కన్నులతో నొప్పిన తల వచనామృతముచే తన పార్షదగణములను విబుధులను తనుపును. ఆ దేవుడేనాటికిని వాడని నవనవమగు తులసీదళముల వైజయంతీమాలికను దాల్చి రాణ కెక్కును. ఆ భగవానుడు మత్తెక్కిన గండుతుమ్మెదల శోభను తిరస్కరించు పట్టుపుట్టముగట్టి యొకే కుండలము దాల్చి శోభిల్లును. 

ఆదేవుడు హలముపైతన లావు బూజముమోపి యింద్రునైరావతము పగిది శోభిల్లుచుండును. ఆ దేవేశు డుదారశీలుడని తత్త్వవేత్త లభినుతింతురు.


శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment