Saturday, April 25, 2026

Tamasagamas and Antartantric worship - తామసాగమాలు, ఆంతరతాంత్రిక పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - తామసాగమాలు, ఆంతరతాంత్రిక పూజలు

లోకమందింకను వివిధ శాస్త్రములు గంవు. అవన్నియు శ్రుతి స్మృతి విరుద్దము లగుటచేత తామసము లనబడును. వామము కాపాలము కౌలకము భైరవము మున్నగు తంత్రములు గలవు. 

ఈ యాగమతంత్రముల ఫలాశకు వేదాధికారము లేనివారు మోహితులు గావలయునని వీనిని శివుడు రచించెను. (వీరు పాపఫలమును భవించుచు శుద్దులై క్రమముగ పుణ్యులై వేద మార్గ మవలంబింతురు) అంతేకాని యితర కారణము లేదు. 

దక్ష భృగు దధీచి మహర్షుల శాపమునకు కొందఱుబలియైరి. వారు వేదబాహ్యులైన బ్రాహ్మణులు. 

అట్టివారిని సోపానక్రమమున నుద్ధరించుటకు శివుడాగమములను రచించెను. శైవము వైష్ణవము సౌరము సాక్తము గాణాపత్యమునను నాగమములను శంకరుడు రచించెను. వానియందు కొన్ని చోట్ల వేదాను కూలముగను కొన్ని యెడల వేదవిరుద్ధముగను వ్రాయబడెను. 

కనుక నందలి వేదానుకూలములగు నంశములను వైదికు లాచరించుటలో నెట్టి దోషమును లేదు. విప్రుడెన్నడును వేదార్దమునకు భిన్నార్దము గ్రహింపరాదు. వేదాధికారి కానివాడే భిన్నార్దములు గ్రహించును. 

కనుక వెదికుడైనవాడు సర్వప్రకారముల వేదమార్గ మనుష్ఠింపవలయును. వేదధర్మమువలని జ్ఞానమే బ్రహ్మ సాక్షత్కారము గల్గించును. ఈ షణత్రయమును విడనాడి నన్నేశరణు పొందినవారు సర్వభూతదయాళురు మానదంభాహంకారములు లేనివారు-ఇట్టి బ్రహ్మచారులును గహస్థులును వానప్రస్థలును సంన్యాసులును మచ్చిత్తులు-మద్గతప్రాణులునై నా తీర్థములు సేవించుటలో నిమగ్నులగుదురు. 

వారు పరభక్తితో నా యీ సంపత్కరమగు విరాట్స్వరూపమునుపాసింతురు. అట్టి నాయందు నిత్యయుక్తిగలవారి యందు నజ్ఞాతము ముండును. నేను జ్ఞానమను సూర్యప్రకాశముతో వారి యజ్ఞానతమము బాపుదును. నగాధిపా! ఇది నా వైదిక పూజయొక్క మొదటి పద్ధతి. దీనినిట్లు సంక్షేపముగ వెల్లండించితిని.

ఇక రెండవ పూజా విధానము తెల్పుచున్నాను. శ్రీ విగ్రహమందుగాని శుద్ధ ప్రదేశమునగాని సూర్యచంద్రమండలములందుగాని జలములందుగాని బాణలింగమందుగాని యంత్రమందుగాని మహావస్త్రమునగాని శ్రీహృదయ కమలమందుగాని పరాత్పరాదేవిని ధ్యానింపనలయును. 

దేవి సుగుణ-సౌందర్యలావణ్యరేణ్య-కరుణామృత తరంగిణి-సర్వావయవసుందరి-దివ్యా రుణారుణ-తరుణీమణీ-శృంగారరసాధినాయిక-భక్తార్తినివారిణీ-ప్రసన్నవదనాంబుజ-కిశోరచంద్రశేఖర-పాశ-అంకుశ-వర-అభయ ముద్రలుగలది-దివ్యానంద స్వరూపిణియగు దేవిని షోడశోపచారపూజల నర్చింపవలయును. 

అభ్యంతరపూజ యందధికారము గల్గనంతవరఱకు నీ బాహ్యపుజ నాచరింపవలయును. అధికారము గల్గిన పిదప దీనిని వదలవచ్చును. ఉపాధిరహితమైన బ్రహ్మజ్ఞానమే నా స్వరూపము. ఇట్టి నా యాత్మస్వరూపమున చిత్తముతాదాత్మ్యమందుటే యాభ్యంతర పూజ యగును. కనుక జ్ఞానస్వరూపిణినగు నాయందైకాంతిక బావమున చిత్తము నిలుపవలయును. 

ఈ యాత్మజ్ఞానముదక్క మిగిలిన జగమంతయును నట్టిదే. మాయామయయే. కనుక మాత్మస్వరూపిణి-సర్నసాక్షిణినగు నన్నే నిర్వకల్ప భక్తితో యోగయుక్తత్తముతో నిరంతరము ధ్యానింపవలయును. ఓ గిరిరాజా! దీనితర్వాత బాహ్యపూజా విధానము చెప్పబడుచున్నది సావధానముగ వినుము.

బాహ్యపూజా విధానం

No comments:

Post a Comment