Sunday, April 19, 2026

Trishankudi's physical longing for heaven - త్రిశంకుడి సశరీర స్వర్గ వాంఛ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - త్రిశంకుడి సశరీర స్వర్గ వాంఛ

త్రిశంకునకు హరిశ్చంద్రుడుదయించెను. అతడందగాడు. శాస్త్రమున చెప్పిన శుభలక్షణములు గలవాడు. త్రిశంకుడు అట్టి తన కుమారుని రాజుగజేసి యీ మానవశరీరముతోడ స్వర్గ మనుభవింప మది దలంతెను. 

అతడు వసిష్ఠు నాశ్రమమేగి విధివిధానమున నమస్కరించి చేతులు ముకుళించి నెమ్మదితో 

ముని కిట్లనెను: ఓ తాపసోత్తమా! బ్రహ్మపుత్రా! మహానుభావా! సర్వమంత్ర విశారదా! మంచి మనస్సుతో నా విన్నప మాలింపుము. ఈ మానవ శరీరముతో స్వరలోక సుఖములు భోగించవలయునని నాకు కోరిక గల్గినది. 

నందనవనమందు దేవకన్యలతో నల్లిబిల్లిగగూడి యుండుటకు మధుర మైన దేవగంధర్వగానము వినుటకు కోర్కి గల్గినది. ఓ మహామునీ! ఈ శరీరముతోడ స్వర్గమేగ గల్గునట్టి యజ్ఞము చేయించుము. 

మునివర్యా! ఇపుడ నాతో యాగము చేయించుటకు నీవే సమర్థుడవు. వేగమే యజ్ఞముచేసి నన్ను స్వర్గము జేర్పుము.

వసిష్ఠు గిట్లనెయెను : రాజా ! ఈ మానవ శరీరముతో స్వర్గవాసము సాధ్యముకాదు. చచ్చినవాడు తన పుణ్యకర్మ బలముమ స్నర్గమేగును. సర్వజ్ఞా! నీ కోరిక దుర్లభమగుట వలన నాకు భయమగుచున్నది. బ్రతికినవాడచ్చరతో నుంట దుర్లభము 

కనుక మహాత్మా! మొదట యజ్ఞము చేయుచు. చచ్చి స్నర్గమేగగలవు. అను మునివాక్కులు విని రాజు మది కలత జెందెము. త్రిశంకుడు వసిష్ఠునితోమరల నిట్లనెను. ఓ బ్రాహ్మణుడా! వెనుకటి కోపముతో గర్వావేశముతో నీవు నన్ను యజ్ఞము చేయించుటలేదు. 

కనుక నేనిపుడువేరొకపురోహితునితో యజ్ఞము జరిపింతును. రాజుమాటలువినగానే వసిష్ఠునకు కోపము వచ్చెను. ఓరిదుర్మతీ! నీవిపుడే త్వరితముగా నిదే శరీరముతో చండాలుడవు గమ్మని వసిష్ఠుడు రాజును శపించెను. 

ఓరి! నీవు స్వర్గమార్గము చెడగొట్టికొంటివి. గోవధ చేసి నిందితుడవైతివి. బ్రహ్మణ పత్నిని హరించిన నీచుడవు. ధర్మ మార్గమును దూలనాడితివి ఓరి పాపీ! నీవు చచ్చిన పిమ్మట నైనను స్వర్గమునకు వెళ్ళవురా! అను గురు వాక్కులను త్రిశంకుడు విని అదే క్షణమున నదే శరీరముతో చండాలుడయ్యెను. అదే క్షణమున నతని బంగారు కుండలములు రాళ్ళుగా మారెను.

ఒకప్పుడు మంచి గంధములు పరిమళించిన దేహమున నిపుడు భరింపరాని దుర్వాసనలు పుట్టెను. మేనిపై దివ్వపీతాంబరములు నల్ల రంగుగ మారెను. మహాత్ముడగు వసిష్ఠుని శాపము కారణము రాజు శరీర మేనుగు శరీరము వలె నల్లగా మారెను. 

రాజా ! మహా శక్తి నుపాసించు వారి కోపమునకు ఫలిత మిట్లుండును. కనుక శ్రీశక్తి భక్తుల నెన్నడు నవమానింపరాదు. వసిష్ఠుడు విరంతరముగ శ్రీ గాయత్రి జప నిష్ఠాగరిష్ఠుడై బ్రహతేజము మూర్తిభవించియుండెను. తన దేహము చండాల దేహముగ నిందింప-శపింప-బడుట వలన త్రిశంకువు తీపని దుఃఖము జెంది దైన్వముతో తన యింటి కేగక వనములకు వెళ్ళెను. 

త్రిశంకుడంత దుఃఖర్తితో శోకించుచు మనసు చెడి యిపుడేమిచేతును? ఎక్కడికేగుదును? నా దేహము మిక్కిలి నిందిపబడినది. ఇపుడు నా యిశోకము నశించు నుపాయము లేదు. నేనొకవేళ నా యింటి కేగినచో నా కొడుకే మనోవ్వధ నందును. నన్ను చండాలునిగ జూచి నా భార్యయు నన్ను కన్నెత్తి చూడదు. 

నా యీ కురూపము చూచి నా మంత్రులు నన్నాదరింపరు. ఇక దాయాదులు చుట్ట పక్కములు నన్ను చేరరానేరురు. కొలువరు. ఇందఱిచేత విడువలసిన నేను బ్రతుకుట కన్న చచ్చుటమేలు కనుక నేను విషము మ్రింగియె నీటిలో దుమికియె మెడకుకురిపోసికొనియె ప్రాణములు వదులను. బలము కొలదితప్పక మండు నిప్పులతో దేహము వేల్తును. 

కూడు నీరు మాని యి ప్రాణాలు వదలగలను. వీనిలో నేను చేసికొన్నను జన్మ జన్మముల కాత్మహత్మా పాతకము నన్ను వెంటాడును. ఈ యాత్మహత్మ వలన చండాలత్వము తీరని శాపముగ నన్ను వెంబడించగలదు. అని పెక్కు రీతుల రాజు తన మనస్సులో నాలోచించుకొని ఆత్మహత్య చేసికొనుట తగదని తలంచెను.

ఈ యడవిలోనే నీ దేహముతో స్వయంకృతాపరాధ మనుభవించుట మంచిది. దీని నిపుడే యనుభవించుటవలన నది యిక్కడనే నశించును. ప్రాకబ్ధకర్మము లనుభవింపకున్న నెన్నటికిని తీరవు. నేను చేసిన మంచిగాని చెడుగాని నేనే యనుభవించవలయును. 

కనుక నేనిపుడు పావనపుణ్యతీర్దములు సేవించుచు పుణ్యాశ్రమములందు వసించుచు సాధుల సేవించుచు జగదంబను స్మరింపగలను. ఇట్లు వనములు దిరుగుచు కర్మములు బాపుకొనగలను. నా యదృష్టము పండినచో నొకవేళ నాకు సత్పురుషుల సంగమము గలుగవచ్చును. 

ఇట్లు తలపోసి రాజు తన నగరమున కేగక గంగాతీరమేగి యచట పశ్ఛాత్తాముతో కాలము గడపుచుండెను. అంత హరిశ్ఛంద్రరాజు తన తండ్రి శాపగ్రస్తుడగు టెఱింగి దుఃఖించి మంత్రులను తండ్రివి వెదుక పంపించెను. వారు చండాలరూపముతో పల్మారు నిట్టూర్పుచున్న త్రిశంకునిగని వినయముతో మ్రొక్కి యిట్లనిరి. 

ఓ రాజా! మేము మంత్రులము. నీ కొడుకగు హరిశ్చంద్ర మహారాజు పంపగ నతని యాజ్ఞ తలదాల్చి వచ్చితిమని మమ్మేఱుంగుము. యువరాజకుమారుడు మాతో పల్కినపలుకులు వినుము. మీరు నాతండ్రిని గౌరవించి కొనితెండు. 

కనుక రాజా! దిగులుమాని రాజ్యమునకు రమ్ము. నీ ప్రజలు మంత్రు లెల్లరును నీకు పరిచర్యలు చేయగలరు. గురుని ప్రసన్నుని చేయుదుము. అతడు ప్రసన్నుడైనచో నీ దుఃఖముతొలగిపోవును. గురుడు మహాతేజస్వి. రాజా! ఇట్లు నీ కొడుకు మాతో నెంతగనో చెప్పెను. 

కనుక నీ విపుడు నీ యింటికి త్వరగ బయలుదేరుము. అను వారి మాటలు వినియు చండాలాకృతిగల రాజు తన యింటి కేగుటకు నిశ్చయుంచుకొనలేదు. రాజు మంత్రుల కిట్లనెను: 

ఓ మంత్రులాలా! మీరు నగరమునకు వెళ్ళుడు. మహాత్ములారా! మీరు నామాటగ నిట్లు చెప్పుడు.

పుత్రా! నేను రాను. రాజ్యమును వివేకముతో పాలించుము. బ్రాహ్మణులను సమ్మానింపుము. దేవతలను పూజింపుము. యజ్ఞము లాచరింపుము. మహాత్ములు నిందించు ఈ చండాల వేషముతోనయెధ్యానగరములోనడుగు పెట్టజాలను. 

మంత్రలారా! మీరువెళ్ళుడు. మహాబలుడగుతు నాహరిశ్చంద్ర కుమారుని గద్దెపై నెక్కించి మీరెల్లరు నా యాజ్ఞతో రాజకార్యములు నిర్వహింపుడు. అని త్రిశంకు డాదేశింపగ మంత్రులు మిక్కిలి యేడ్చి రాజునకు వనమునుండి వేగనగరు వైపు నడచిరి. 

వారయోధ్యజేరి యొక శుభమూహర్తమునందు విధి ప్రకారముగ హరిశ్చంద్రు నభిషేకించిరి. అట్లు రాజాజ్ఞచే మంత్రులు తన్నభిషేకించగ హరిశ్చందుడు తన తండ్రిని దలంచుచు తేజము వెలుగులు చిమ్మగ రాజ్యము చక్కగ పాలించెను.

విశ్వామిత్ర - శ్వపచుల కథ

No comments:

Post a Comment