రావణ భవన మధ్యంలో చిత్ర విచిత్రమయిన లతాగృహాలు, నిశాసౌధాలు అన్నీ తిరిగాడు. జానకీదేవి జాడలేదు.
ఈ దుష్ట రాక్షసుని చేతులలో పడడం యిష్టంలేక జానకీదేవి ప్రాణ త్యాగం చేసి ఉండాలీ. ఈ రాక్షస వికృతాకారాలు చూసి గుండె ఆగి మరణించిందేమో!
ఇప్పుడు సీతను చూడకుండా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళడమెలా! ఆ కపిరాజు దండనితి విషయుంలో చాలా తీక్షణదృష్టి కలవాడు. అంతకు ముందుగా - వానరవిరులందరూ కనిపిస్తారు, వారికేం చెప్పాలి. సుగ్రీవుడు పెట్టిన గడువుదాటింది కనక వారంతా ప్రాయోపవేశం చేస్తారు. సముద్రం
దాటివెళ్ళగానే అంగద, జాంబవంతులు ఎదురువస్తే వారికి ఏం చెప్పను, అని చింతించాడు.
అంతలో వివేకం తెచ్చుకుని-
సర్వ అనర్ధాలకూ దుఃఖం మూలం. దుఃఖాన్ని విడిచి పరమ సంతోషంతో ఉండాలి. అదే శ్రేయస్కరం.
మరోసారి అంతటా వెదకుతాను, అనుకుని మళ్ళీ అన్ని వనాలూ, శాలలూ, భవనాలూ వెదుకుతున్నాడు,
రావణుడు బలాత్కరించి తెచ్చిన నాగకన్యాసమూహోన్ని చూశాడు. సీత జాడలేదు.
మళ్ళీ విచారంలో పడ్డాడు.
ఇందరు వానరుల శ్రమకూ ఏవిటి ఫలితం?
రామచంద్రునికి ప్రీతికరమయిన పని చేద్దామని బయలుదేరాను. లంకలో అంగుళం మేర విడవకుండా వెదకగలిగినా అమ్మవారిజాడలేదు.
గృధ్రరాజు సంపాతి చెప్పాడే - సీత లంకలో ఉన్నదని? ఎక్కడుంది ఆవిడ?
మిధిలాధీశుడయిన జనకుని పుత్రిక రావణుని స్వీకరిస్తుందా!
ఒకటి జరిగి ఉండవచ్చు-
రామబాణభీతితో వచ్చే రావణుడు తీవ్రవేగంలో సీతను సముద్రంలో విడిచి ఉండాలి. లేదా సీత స్వయంగానే సాగరమధ్యంలో పడిపోయిందేమో! ఈ దుష్టుడిబాధ పడలేక ప్రాణత్యాగం చేసి ఉండాలి. ఆవిడ శీలరక్షణ దీక్షకు విసిగి ఈ రావణుడే ఆ యిల్లాలిని తిని ఉంటాడా! కాకుంటే - ఈ రాక్షస స్త్రీలే ఆరగించి ఉండరుకదా! రామనామ జపంతో ఆవిడే తనువు చాలించిందా!
కాకుంటే ఆ రావణాంతఃపుర పంజరంలో చిలకలా నిరంతరం రామనామం జపిస్తూ ఉండదా!
ఇప్పుడు వెళ్ళీ రామచంద్రునికి ఏం చెప్పాలి! వెళ్ళిన తరువాయి ఏదో ఒకటి చెప్పక తప్పదు. ఏది చెప్పినా ముప్పే.
అదీకాక - సీతను చూడకుండా వెడితే నేను ఏం సాధించినట్లు?
సీత కనబడలేదు, అని నేను చెప్పగానే రామచంద్రుడు ప్రాణాలు వదులుతాడు. అది చూచి లక్ష్మణుడు మిగలడు. ఈ వార్త విని ఆయోధ్యలో భరత, శత్రుఘ్నులు, వారి తల్లులు అందరూ మరణిస్తారు.
కృతజ్ఞతకు మారుపేరయిన సుగ్రీవుడు మాత్రం జీవిస్తాడా! ఆయనతో పాటు ఆయన భార్య రుమ, తార, అంగదుడు వీరందరూ దేహయాకత్ర ముగిస్తారు.
ఈ దుఃఖంతో వానరులందరూ తలలు బ్రద్దలు కొట్టుకుంటారు! విషం మింగుతారు, ఉరిపోసుకుంటారు, అగ్నిగుండాలలో దూకుతారు,
ఉపవాసాలతో మరణిస్తారు. సీతను చూడకుండా నేను వెడితే అటు ఇక్ష్వాకువంశం, ఇటు సర్వవానరజాతి నాశనం తధ్యం.
అందుచేత నేనిక్కడే వాన ప్రస్ధజీవితం గడిపితే వారందరూ నేనింకా సీతాన్వేషణం చేస్తున్నాననే ఆశతో జీవిస్తారు.
ఏమయినా సరే నేను వెళ్ళక పోవడమే మంచిది. చితి పేర్చుకుని అందులో దూకుతాను. లేదా ఏ చెట్టు క్రిందనో ఉపవాస నియమంతో కూర్చుంటే కాకులూ, కుక్కలూ నా శరీరాన్ని ఆరగిస్తాయి. ఇదొక నిర్యాణ మార్గం,
సీతను చూడకుండా వెడితే నా కీర్తి ఏం కావాలి, అని కొంతసేపు విచారించి:
ఛీ! మరణం కంటె దోషం లేదు. బ్రతికి ఉంటేనే సుఖాలకు ఆస్కారం ఉంది; ఎన్నో శ్రేయస్సులు చూడవచ్చు, ఇప్పుడింక ఈ దశకంఠుని కడతేరుస్తాను. కాదు, వీణ్ణి బలిపశువులా తీసుకుపోయి రాముని ముందు పడేస్తాను.
అనుకుంటూ మళ్ళీ శోకసముద్రంలో మునిగి-
ఇంద్రియ నిగ్రహంతో, ఆహార నియమంతో యిక్కడే శేషజీవితం గడుపుతాను, అందువల్ల అయోధ్యలో వారూ కిష్కింధలో వీరూ సుఖంగా ఉంటారు, అనుకుని ముందుకు సాగాడు.
ఎదురుగా అశోకవనం కనిపించింది. ఇంతవరకూ ఈ వనం చూడలేదు, అనుకుంటూ, ఆదిత్య, వసు, రుద్ర, అశ్వనీ దేవతలకు నమస్కరించి:
తపస్వి జనానికి ఫలసిద్ధివలె ఇక్ష్వాకు కులవర్ధని అయిన సీతాదేవిని రామునికి అందించాలి, అనుకుని:
రామ లక్ష్మణులకు, జానకీదేవికి, ఇంద్ర, రుద్ర, వాయు, యమ దేవతలకు నమస్కారం. సూర్య, చంద్రులకు ప్రణామం. మా ప్రభువు సుగ్రీవునికి అభివాదం, అనుకుంటూ అశోకవనం వయిపుసాగుతూ:
ఈ వనాన్ని రాక్షసులు చక్కగా సంస్కరించి ఉంటారు, అనేకులు రక్షిస్తూ ఉండవచ్చు. వాయువుకూడా యిక్కడ తగు మాత్రంగా చలిస్తూంటాడు.
ఇప్పుడింక నా కార్యసాధనకు దేవతలూ, ఋషులూ సాయపడాలి. చతుర్ముఖ ప్రజాపతితో సర్వదేవగణాలూ, అగ్నిహోత్రుడూ, వాయువూ, వజ్రధారి దేవేంద్రుడూ, పాశహస్తుడయిన వరుణుడూ, సూర్య, చంద్రులూ, త్రినేత్రధారి శివుడూ, అశ్వని దేవతలూ అందరూ నాకు కార్యసిద్ధి యివ్వాలి. సర్వభూతాలూ, భూత నాథులూ, నా యత్నానికి తోడుపడాలి. ప్రసన్న
చంద్రబింబంవంటి మోముగల జానకీదేవి నాకు కనిపించాలి.
పరమదుష్టుడూ, నీచుడూ, క్రూరుడూ అయిన ఈ రావణునిచే అపహరింపబడిన జానకీదేవిని ఎలా చూడగలనో - అనుకుంటూ అశోకవనం వయిపు సాగుతున్నాడు.
అశోకం
రామాయణం సుందరకాండ
జ్యోతిషశాస్త్రము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం

No comments:
Post a Comment