పురాణము - అవగాహన - శ్రాద్ధం ఎప్పుడెప్పుడు పెట్టవచ్చు?
పితృకార్యాలు జరిగే ప్రదేశంలో నువ్వులను చల్లితే అక్కడికి దైత్యులు, దానవులు, అసురులు రారని శాస్త్రం. అంత పవిత్రత కలిగిన నువ్వులు ఎక్కడ నుండి ఉత్పన్నమైనవి?
శ్రీ మహావిష్ణువు యొక్క స్వేద జలం నుండి నువ్వులు ఉత్పన్నమైనవి.
మరణం ఆసన్నమైన వారికి దుర్గతి కలుగకుండా హరిసన్నిధానమునకు తీసుకువెళ్లడానికి ముఖ్యంగా ఏవి తోడ్పడుతాయని శాస్త్రం?
తులసి, హరి నామము, గురుభక్తి.
పితృ కార్యాలలో వేటితో తయారుచేసిన పాత్రలను, పళ్ళెములను, వస్తువులను వాడినా లేదా దానం చేసినా మంచిదని శాస్త్రం?
వెండి తో చేసిన పాత్రలను వాడడం, దానం చేయడం మంచిది.
పితృకార్యాలను ఎంతో భక్తితో, శ్రద్ధతో చేస్తారు. ఈ కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని పనులు అస్సలు చేయరాదు. అవి ఏమిటి?
ఆ పూట కోపం అస్సలు పనికి రాదు. కార్యక్రమం చేసే బ్రహ్మ గారిని విసుక్కోవడం లేదా త్వరగా ముగించమని చెప్పడం చేయరాదు. వంట రుచి చూడడం చేయరాదు. వడ్డనలో ఉప్పు వడ్డించరాదు. కుంకుమ ధరించరాదు(విభూతి ధరించవచ్చు). కుక్క, కోడి, పిల్లి మొ౹౹ కనబడకూడదు. మొ౹౹ ముఖ్యమైన ఆచారాలు పాటించాలి.
మరణించిన వారి అస్థికలు, చితా భస్మము నదులలో మరియు ముఖ్యంగా కాశీలో కలపడం వల్ల వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని ధర్మ శాస్త్రము. అయితే వాటిని ఎన్ని భాగాలుగా చేయాలి? ఎక్కడ కలపాలి?
ముఖ్యంగా అస్థికలను 3 భాగాలుగా చేయాలి.
మొదటి భాగాన్ని 11 రోజులలో మనకు దగ్గర ఉన్న నదిలో కలపాలి. రెండవ భాగాన్ని కాశీ గంగలో కలపాలి. మూడవ భాగాన్ని ప్రయాగలో సంగమంలో కలపాలి. ఇలా చేస్తే మరణించిన వారికి గురు ఋణం, దేవ ఋణం, పితృ ఋణం తీరి వారికి స్వర్గం ప్రాప్తిస్తుందని శాస్త్రం.
శ్రాద్ధం ఎప్పుడెప్పుడు పెట్టవచ్చు?
శ్రాద్ధం అంటే కేవలం సం౹౹ కి ఒకసారి వచ్చే తిథి రోజున మాత్రమే కాదు. ఈ క్రింది సందర్భాల్లో పితృ తర్పణాలు విడిచినా శ్రాద్ధంగా చెప్పబడుతుంది.
గ్రహణం విడిచిన తర్వాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణ, వ్యతీపాత యోగం, జన్మ నక్షత్రము నాడు, మొదటి సారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొన్నప్పుడు, పీడ కలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు మొ౹౹ సందర్భాల్లో చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధం గా చెప్పబడుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
puranamu - avagahana - sraaddham eppudeppudu pettavachu? - Scriptural Understanding – When can the Shraddha ceremony be performed? - పురాణము - అవగాహన - శ్రాద్ధం ఎప్పుడెప్పుడు పెట్టవచ్చు?
పురాణము - అవగాహన - శ్రాద్ధం ఎప్పుడెప్పుడు పెట్టవచ్చు? పితృకార్యాలు జరిగే ప్రదేశంలో నువ్వులను చల్లితే అక్కడికి దైత్యులు, దానవులు, అసురులు రార...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment