వ్యక్తిగత సంవత్సర సంఖ్య - 7వ సంఖ్య
ఈ 7వ సంఖ్యకు కేతువు అధిపతి. ఈ సంఖ్య కేతు ప్రభావంలో ఉంటుంది.
ఈ సంవత్సరంలో అధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటాయి. ధ్యానం, దైవచింతన పైన ఎక్కువగా దృష్టి పెడతారు. గురువులను, సద్గురువులను కలుసుకొంటారు.
తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో, కోర్టు లిటిగేషన్లలో విజయం కలుగుతుంది. భౌతిక అభివృద్ధిపై ఎక్కువగా దృష్టిపెట్టరు. ప్రాపంచిక విషయాలపట్ల అంటే ఆస్తులు, వ్యవహారాల విషయాలలో స్నేహితులు, పెద్దలు వారి సంస్ధలు, సహాకారం తీసుకొని పాటిస్తే మంచిది.
వ్యాపార విషయంలో జాగ్రత్త పాటించాలి. విదేశీ ప్రయాణ మోజు తీరుగలదు. విద్యార్థులకు విదేశాలలో చదవాలనే కోరిక ఫలించవచ్చు. ప్రేమ వ్యవహారాలలో తలదూర్చకూడదు.
ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఓర్పు, ఆశాదృక్పథం, నమ్మకం కలిగి ఉంటే మంచిది. ఇటువంటి ఆధ్యాత్మిక చింతన మరల 8 సంవత్సరాల తరువాత మాత్రమే వస్తుంది.
జ్యోతిష్యం, న్యూమరాలజీ, తంత్రశాస్త్రాలు, మ్యాజిక్, హిప్నాటిజం లాంటి వాటిమీద మక్కువ గలవారికి ఈ సంవత్సరం అనుకూలం. నీటి గండాలు ఉంటాయి. కనుక జాగ్రత్త వహించాలి.
Tuesday, November 10, 2026
Monday, November 9, 2026
kaarthikamasamlo ae thidhi rojuna em cheyaali? - కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి?
కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి?
దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం కానీ ఈసారి మనకు ఒకరోజు లేటుగా మొదలైంది ఆదివారం దీపావళి మంగళవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.
న కార్తీక సమో మాసో
న శాస్త్రం నిగమాత్పరమ్ |
నారోగ్య సమముత్సాహం
కార్తిక పురాణము

న దేవః కేశవాత్పరః||
అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.
ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం.
కార్తీక శుద్ధ పాడ్యమి : తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ : సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.
తదియ : అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.
చవితి : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.
పంచమి : దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.
షష్ఠి : ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.
సప్తమి : ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.
అష్టమి : ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

నవమి : నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.
దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.
ఏకాదశి : దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.
ద్వాదశి : ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.
త్రయోదశి : సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.
చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.
కార్తీక పూర్ణిమ : కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.
కార్తీక బహుళ పాడ్యమి : ఆకుకూర దానం చేస్తే మంచిది.
విదియ : వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.
తదియ : పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.
చవితి : రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.
పంచమి : చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.
షష్ఠి : గ్రామదేవతలకు పూజ చేయాలి.
సప్తమి : జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.
అష్టమి : కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి : వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.
దశమి : అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.
ఏకాదశి : విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.
త్రయోదశి : ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.
చతుర్దశి : ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.
అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి.

2va adhyayamu - somavara mahima - 2వ అధ్యాయము - సోమవార మహిమ
కార్తిక పురాణము (స్కాంద పురాణాం) - 2వ అధ్యాయము - సోమవార మహిమ
3వ అధ్యాయము - కావేరి కార్తికస్నానఫలము, తత్త్వనిష్ట చరితము
ఓ రాజా! కార్తిక మహాత్యమును వినుము. విన్నంతనే మనో వాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును.
కార్తిక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమారచించువాడు కైలాసనివాసి యగును. కార్తికమాసమున సోమవారమందు స్నానమునుగాని, దానమునుగాని, జపమునుగాని చేసిన యెడల అశ్వమేధయాగముల ఫలమును బొందును. ఇందుకు సందేహములేదు.
కార్తికమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము రాత్రిభోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము యీ ఆరున్నూ ఉపవాస సమానము లగుననిఋషులు చెప్పిరి.
శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును జేయ వలెను. అందుకు శక్తిలేనివాడు ఛాయానక్షక్తమును జేయవలెను. అందుకు శక్తిలేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను.
ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాతరెట్టింపు కొలతకు తన నీడరాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 1/2 గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన 6టిలో దేనినయినను ఆచరించని యెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు.
కార్తికసోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమును బొందును. స్త్రీలుగాని పురుషులుగాని ఎవరు కార్తికసోమవార మందు నక్షత్రములనుజూచి రాత్రిభోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును.
కార్తిక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును.
ఈ విషయమందొకకథ గలదు. చెప్పెదవినుము, ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును. కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్య్రనిష్ఠురి యనునొక స్త్రీ గలదు. అది చక్కని రూపముతో మంచియౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది.
ఓ రాజా! దీని దుర్గణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును దీనిని విడిచిరి.
దీని భర్త సౌరాష్ట్రదేశస్థుడు, అతని పేరు మిత్రశర్మ, అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేకతీర్థముల సేవించినవాడును, అబద్ధ మాడనివాడును, నిరంతరము దయగల వాడును.
భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి అదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము దానిచేత దెబ్బలు తినుచును గృహస్థ ధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక దానితో కష్టపడుచుండెడివాడు.
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును.
ఈ మిత్రశర్మ భార్యకు కర్కశ యనియు నామముగలదు. భర్తయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత దీనియందు రాగముతో నుండెను.
అంత నొకనాడు దీని రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా యిచ్చినిరంతరము సంభోగమునకు నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించి పిమ్మట నిద్రించగానే తానులేచి పెద్దరాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను.
ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశ స్వయముగా తన భర్త శవమును వీపుమీద వేసికొని తీసికొనిపోయి పాడునూతిలో పడవేసెను.
ఇట్లు భర్తనుచంపి తరుణులును, పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్రప్రవీణులును, వర్ణ సంకరకారకులును అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగముచేయు చుండెడిది.
ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడి యున్న భార్యలను దుర్భోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రత పరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పరద్వేషముకలదై దేవతాద్వేషిఅయి యుండెను.
అది నిరంతరము దయాశూన్యయై ఆడంబరముచేతగాని, నవ్వుచేత గాని, కపటముచేతగాని విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇట్లుండగానే దీనికి యౌవనము పోయి ముసలి తనము వచ్చినది.
తరువాత వ్రణ(రాచకురుపు) వ్యాధి కలిగినది. ఆ కురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను.
తరువాత జారులందరు రూపవంతులు ముదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య యింటికి వచ్చుట మానివేసిరి.
తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆ వ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమ దూతలువచ్చి ఆ కర్కశను పాశములచేతకట్టి యముని కడకు తీసికొనిపోయి యమునికి అప్పగించిరి.
యముడు దానినిచూచి కోపముచేత కళ్ళెఱ్ఱజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు ఇనుముతో చేయబడిన స్తంభమునుకాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను.
అంత యమాజ్ఞ మీద భటులు ఆ కర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆ వేడి స్తంభమును సంభోగించుమనిరి.
తరువాత దాని పాదములు రెండు పట్టుకుని గిరగిర త్రిప్పి రాతిమీద పెట్టికొట్టిరి. తరువాత రక్తమునుకాచి త్రాగించిరి. సీసమునుకాచి రెండు చెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి.
ఆ కర్కశ యిట్లు తన పితృ పితామహులతోను, తన బాంధవులతోను తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములయిన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమియందు జన్మించెను.
భూమియందు పదిహేను మాఱులు కుక్కగా జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను.
ఇట్లుండగా ఒకప్పుడు అ బ్రాహ్మణుడు కార్తికమాసమందు సోమవారము దినంబున పగలంతయు ఉపవాసముచేసి గృహమందు శివలింగాభిషేక పూజాదులనుజేసి నక్షత్రమండలమును జూచి గృహమునకుబోయి దేవనివేదనచేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమిద బలిని ఉంచి కాళ్ళుకడిగికొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను.
ఆకుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్దియైనను దొరక నందున కృశించినదై కార్తిక సోమవారము రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించెను.
ఆ బలి భోజనముచేత కుక్కకు పూర్వజాతి స్మృతికలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము రక్షింపుమని పలికెను. ఆ మాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై
ఓ కుక్కా! మా యింటలో ఏమేమి చేసితివి. రక్షింపుమనుచున్నావు అని అడిగెను.
కుక్క ఇట్లనెను. ఓ బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణ స్త్రీని. పాపములను చేయుదానను, వర్ణసంకరమును చేసిన దానను, అన్యపురుషులను మఱగి నిజభర్తను చంపితిని.
ఈవి మొదలయిన పాపములు అనేకములుజేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికివచ్చి 15 మాఱులు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు గలిగినదో చెప్పుము. విని తరించెదను.
ఆ బ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా! యీ కార్తికసోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక యిప్పుడు నేనువుంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృత గలిగినది.
ఆ మాటను విని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈ కుక్కజాతి నుండి నాకెట్లు మోక్షము గలుగునో చెప్పుమని విప్రుని అడిగెను.
ఆ కుక్క యిట్లు ప్రార్థించగా పరోపకారబుద్ధితో కార్తికసోమవారములందు తాను జేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను.
బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను, మాల్యములను ధరించి ఆభరణాలంకృతయై తనపితరులతో గూడ కైలాసానికి బోయి అచ్చట పార్వతీ దేవి వలె శివునితో గూడ ఆనందించుచుండెను.
కాబట్టి కార్తికమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తిక సోమవారవ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును.
కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తికవ్రతమును నీవు చేయుము.
1 va adhyayamu - janaka vasista samvaadamu - 1 వ అధ్యాయము - జనక వశిష్ఠ సంవాదము
కార్తిక పురాణము (స్కాంద పురాణాం) - 1 వ అధ్యాయము - జనక వశిష్ఠ సంవాదము
2వ అధ్యాయము - సోమవార మహిమ
కార్తిక పురాణము
నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులయిన శౌనకాది మహా మునులు ఒకప్పుడు జనకునకు వసిష్ట మహామునిచేత చెప్పబడిన కార్తిక మాహాత్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమి అని సూతుని అడిగిరి.
సూతుడు ఇట్లుచెప్పెను. శౌనకాది సమస్తమునీశ్వరులారా ! వినుడు. ఈ కార్తికమాహాత్యమును వసిష్ఠమహాముని జనకమహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసారబంధనమును తెంచుకుని మోక్షము పొందుదురు.
ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు బోవుచు వసిష్ఠ మహాముని జనకమహారాజు గృహమునకు జేరెను. అంత జనకమహారాజు వచ్చిన వసిష్ఠుని జూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగదండ ప్రణామముజేసెను. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి మునిపాదోదకమును తనశిరస్సున చల్లు కొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామరపువ్వులవంటి కన్నులు గల వాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తిభావముతో ఇట్లనివిన్నవించెను.
బ్రాహ్మణోత్తమా! మీదర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్య మింకేమియు లేదు. ఇప్పుడు మా పితరులందరును తృప్తి నొందినారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకుదుర్లభము, కనుక ఇప్పుడు మీరాక నాకుశుభములకు కారణమైనది.
సూతుడిట్లు చెప్పెను. తరువాత వసిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిఱునవ్వుతో ఇట్లని పలికెను. రాజోత్తమా! నీకు క్షేమమగుగాక. నేను మా యాశ్రమమునకు బోవు చున్నాను. రేపు మా యింటి వద్ద యజ్ఞము జఱుగును. దానికి ద్రవ్యమును ఈయగోరుదును. ఆరాజిట్లు పలికెను. మునీశ్వరా! యజ్ఞమునకు చాలాద్రవ్యమును ఇచ్చెదను. గాని వినువారి పాపములను బోగొట్టు ధర్మ రహస్యములను నీ వలనవినగోరితిని.
"నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధికఫలము ఇచ్చెడి సూక్ష్మధర్మములను నాకు చెప్పుము. మునీశ్వరా ధర్మజ్ఞా కార్తిక మాసము సమస్త మాసములకంటెను సమస్త ధర్మములకంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుము.
వసిష్ఠుడిట్లు పల్కెను. రాజా! పూర్వ పుణ్యమువలన సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాష గలుగును. లోకోపకారార్తమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్త్వగుణము కలుగును.
రాజా! సూర్యుడు తులరాశియందుండగా కార్తికమాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలయినవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయ్యములగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తిక వ్రతమును తులాసంక్రమణము=సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని, కార్తిక శుక్లప్రతిపత్ మొదలుకొని గాని ఆరంభించి నెలరోజులు చేయవలెను.
ఆరంభమందు ఓ దామోదరా! నేను కార్తిక వ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తిజేయుము. అని సంకల్పము చేసి కార్తిక స్నానమారంభింపవలెను.
మంత్రం:
తులారాశింగతే సూర్యే గంగా త్రైలోక్యపావనీ |
సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణా భవేత్తదా ||
కార్తికమాసమందు సూర్యోదయ సమయమున కావేరీనదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులా రాశిని ప్రవేశించినతోడనే మూడు లోకములను పవిత్రము జేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త నదీజలములయందును ప్రవేశించును.
తులారాశియందు కార్తికమున చెరువులందును, దిగుడుభావులందును నూతులందును, చిన్నకాలువలందును హరినివసించియుండును. రాజా కార్తికమందు వ్రతము అన్నివర్ణాలవారు జేయవచ్చును. బ్రాహ్మణుడు కార్తికమాసమందు గంగకుబోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళుచేతులు కడుగుకొని ఆచమనముచేసి శుద్దుడై మంత్రముల చేత భైరవానుజ్ఞనుబొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను.
తరువాత దేవర్షి పితృతర్పణ మాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠింపుచు బొటనవ్రేలికొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకువచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచికట్టుకొని ఉదకమును వదలి ఆచమనము చేసి శిరస్సునువదలి మిగిలిన శరీరమంతయు తడివస్త్రముతో తుడిచికొని నారాయణ ధ్యానమాచరింపుచు ధౌతవస్త్రమును ధరించవలెను.
తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్థ్వపుండ్రములను ధరించి సంధ్యావందనముచేసి గాయత్రీ జపము చేయవలెను. స్త్రీలు గౌరీ జపము చేయవలెను. తరువాత ఔపాసనముగావించి బ్రహ్మయజ్ఞముచేసి తనతోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించినహరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను.
కార్తికపురాణము పఠించి(లేక)విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చనచేసి వేశ్వదేవమును నెఱవేర్చి భోజనముచేసి ఆచమనముగావించి తరువాత పురాణకాలక్షేపమును జేయవలయును.
సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములనన్నిటిని ఆపివేసి విష్ణ్వాలయమందుగాని, శివాలయ మందుగాని తనశక్తి కొలది దీపములను బెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణుస్తోత్రమునుగాని, శివస్తోత్రమునుగాని పఠించి నమస్కారములాచరించవలయును.
ఎవడు కార్తికవ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును బొందుచున్నాడు. పూర్వజన్మార్జితములున్ను ఈ జన్మార్జితములున్ను అయిన సమస్త పాపములు కార్తికవ్రతమాచరించిన యెడల నశించును.
బ్రాహ్మణుడుగాని క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, ఋషీశ్వరుడు గాని, స్త్రీలుగాని, భక్తిశ్రద్ధలతో కార్తికవ్రతమును జేసిన యెడల వానికి పునరావృత్తిలేని వైకుంఠమునొందుదురు.
ఎవ్వడు కార్తిక వ్రతమాచరించువానిని జూచి సంతోషించునో వానియొక్క పగటికాలమందాచరించిన పాతకమునశించును. ఇందుకు సందేహములేదు.
Kartika Puranam - కార్తిక పురాణము
కార్తిక పురాణము (స్కాంద పురాణాం)
శ్లో! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
శ్లో! శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
కార్తీక దామోదర నామావళి
1 వ అధ్యాయము - జనక వశిష్ఠ సంవాదము
1. ఓం కేశవాయ నమః
2. ఓం నారాయణాయ నమః
3. ఓం మాధవాయ నమః
4. ఓం గోవిన్దాయ నమః
5. ఓం విష్ణవే నమః
6. ఓం మధుసూదనాయ నమః
7. ఓం త్రివిక్రమాయ నమః
8. ఓం వామనాయ నమః
9. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః
11. ఓం పద్మనాభాయ నమః
12. ఓం దామోదరాయ నమః
13. ఓం సంకర్షణాయ నమః
14. ఓం వాసుదేవాయ నమః
15. ఓం ప్రద్యుమ్నాయ నమః
16. ఓం అనిరుద్దాయ నమః
17. ఓం పురుషోత్తమాయ నమః
18. ఓం అధోక్షజాయ నమః
19. ఓం నారసింహాయ నమః
20. ఓం అచ్యుతాయ నమః
21 ఓం జనార్ధనాయ నమః
22. ఓం ఉపేంద్రాయ నమః
23. ఓం హరయే నమః
24. ఓం శ్రీకృష్ణాయ నమః
కార్తికోక్త లఘు షోడశోపచార పూజా విధానము
ఓం శంకరాయ నమః - ఆవాహనం సమర్పయామి .
వృషధ్వజాయ నమః - ధ్యానం సమర్పయామి
గౌరీప్రియాయ నమః - పాద్యం సమర్పయామి
లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి
రుద్రాయ నమః - ఆచమనీయం సమర్పయామి .
గంగాధరాయ నమః - స్నానం సమర్పయామి .
ఆశాంబరాయ నమః - వస్త్రం సమర్పయామి .
జగన్నాధాయ నమః - ఉపవీతం సమర్పయామి .
కపాలధారిణే నమః - శ్రీగంధం సమర్పయామి .
ఈశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి
పూర్ణగుణాత్మనే నమః - పుష్పం సమర్పయామి .
తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి
లోకరక్షకాయ నమః - నైవేద్యం సమర్పయామి
లోకసాక్షిణే నమః - తాంబూలం సమర్పయామి .
భవాయ నమః - ప్రదక్షిణం సమర్పయామి .
కపాలినే నమః - నమస్మారం సమర్పయామి
కార్తికోక్త లఘు షోడశోపచార పూజా విధానము
ఓం శంకరాయ నమః - ఆవాహనం సమర్పయామి .
వృషధ్వజాయ నమః - ధ్యానం సమర్పయామి
గౌరీప్రియాయ నమః - పాద్యం సమర్పయామి
లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి
రుద్రాయ నమః - ఆచమనీయం సమర్పయామి .
గంగాధరాయ నమః - స్నానం సమర్పయామి .
ఆశాంబరాయ నమః - వస్త్రం సమర్పయామి .
జగన్నాధాయ నమః - ఉపవీతం సమర్పయామి .
కపాలధారిణే నమః - శ్రీగంధం సమర్పయామి .
ఈశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి
పూర్ణగుణాత్మనే నమః - పుష్పం సమర్పయామి .
తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి
లోకరక్షకాయ నమః - నైవేద్యం సమర్పయామి
లోకసాక్షిణే నమః - తాంబూలం సమర్పయామి .
భవాయ నమః - ప్రదక్షిణం సమర్పయామి .
కపాలినే నమః - నమస్మారం సమర్పయామి
vyakthigatha samvatsara sankhya - 6va sankhya - వ్యక్తిగత సంవత్సర సంఖ్య - 6వ సంఖ్య
వ్యక్తిగత సంవత్సర సంఖ్య - 6వ సంఖ్య
ఈ 6వ సంఖ్యకు శుక్రుడి అధిపతి. ఈ సంఖ్య శుక్రుడి ప్రభావంలో ఉంటుంది.
ఈ సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉంటారు. అపార్ట్మెంట్స్, బంగారు వస్తువులు, వాహనాలను కొంటారు. ఊహించని ఆస్తి మీకు దక్కగలదు. ఇంటికి సంబంధించి విలాస వస్తువులు, ఫర్నిచర్ లాంటివి కొంటారు.
ఇంటికి సంబంధించిన అనేక పనులలో పురోభివృద్ధి ఉంటుంది. పెళ్ళికాని వారికి పెళ్ళి అయ్యే అవకాశాలు, పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే అవకాశం ఉన్నది. తల్లిదండ్రులను పిల్లలను బంధువులను ఆదరాభిమానంతో చూస్తారు.
వ్యాపారపరంగాను, వ్యవసాయ పరంగాను మంచి ధనరాబడి ఉంటుంది. స్నేహాలు, బంధుత్వాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఎక్కడికి వెళ్ళిన ఇంటిమీద ధ్యాస ఉంటుంది.
ఉద్యోగులకు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. సినీ నటులకు, కళాకారులకు, సంగీతకారులకు, మీడియా రంగం, సిని నిర్మాతలకు మంచి అనుకూలం. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం పొందుతారు. మంచి ర్యాంక్స్ సాధించి ఉన్నత విద్యాలలో చేరగలరు.

vyakthigatha samvatsara sankhya - 5va sankhya - వ్యక్తిగత సంవత్సర సంఖ్య - 5వ సంఖ్య
వ్యక్తిగత సంవత్సర సంఖ్య - 5వ సంఖ్య
ఈ 5వ సంఖ్యకు బుధుడు అధిపతి. ఈ సంఖ్య బుధుడి ప్రభావంలో ఉంటుంది.ఈ సంవత్సరానికి బుధుడు అధిపతి. మొత్తం మీద ఈ సంవత్సరం అందరికి అన్ని రకాలుగా ఆనందాన్ని కలిగిస్తుంది. ఏ సంఘటనలు జరిగినా వీరి మంచికే జరుగుతాయి. వ్యాపారాలలో రాణింపు కలిగి వ్యాపారాలను విస్తరిస్తారు.
పార్టనర్ షిప్ బిజినెస్. వ్యాపార సంబంధ, విలాస ప్రయాణాలు చేస్తారు. విదేశాలను దర్శించవచ్చు. వృత్తి పరంగా కుటుంబపరంగా మంచి ప్రోత్సాహం ఉంటుంది.
ఆర్థికపరంగా చక్కని అనుకూల స్థితి ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్లుపై సంతకాలు చేయాల్సి వచ్చినప్పుడు కొంచం విజ్ఞత ప్రదర్శించాలి.
రచయితలకు, మీడియా వారికి, సినీ నటులకు, అధ్యాపకులకు, పాత్రికేయులకు, కంప్యూటర్ రంగ నిపుణులకు మంచి అనుకూలం. విద్యార్థులు చదువులో మంచి ప్రగతిని సాధిస్తారు. కాంపిటేటివ్ పరీక్షలలో విజయం పొందుతారు. ఎప్పటి నుంచో అమ్మాలనుకొనే వస్తువులు అమ్ముడుపోగలవు.

Subscribe to:
Posts (Atom)
6va adhyayamu vyadhavimukti vruttantamu,deepadanamaahatmyamu, dravidastri swargagamana vruthantham - 6వ అధ్యాయము వ్యాధవిముక్తి వృత్తాంతము,దీపదానమాహాత్మ్యము, ద్రావిడస్త్రీ స్వర్గగమన వృత్తాంతం
కార్తిక పురాణము (స్కాంద పురాణాం) - 6వ అధ్యాయము వ్యాధవిముక్తి వృత్తాంతము,దీపదానమాహాత్మ్యము, ద్రావిడస్త్రీ స్వర్గగమన వృత్తాంతం వశిష్ఠుడు మర...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ దేవి మహత్యం ద్వాత్రిస న...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...