నారాయణ కవచం
శత్రువులకు భయం కలిగించే వజ్రకవచమూ ఆశ్రయించినవారికి పుణ్యఫలంగా సంపదలను కలిగించేదీ, అలాంటివారికి చెప్పదగినదీ అయిననారాయణ కవచాన్ని విశ్వరూపుడు దేవేంద్రునకు ఏ విధంగా బోధించాడు?
ఈ విధంగా ప్రశ్నించిన పరీక్షిన్నరేంద్రునితో శుకయోగీంద్రుడు ఇలా అన్నాడు.
ఓ రాజా! విను. మునీశ్వరుడైన విశ్వరూపుడు ఇంద్రునకు సాంగంగా నారాయణ అనే కవచాన్ని తెలియచేశాడు. ఆ కవచం విజయాన్నిస్తుంది. దాని స్వరూపం తెలియశక్యంకాదు. అది గొప్ప ఫలాన్నిస్తుంది. మంత్రంవలె అది రహస్యంగా ఉంచదగినది. అది హరియొక్క ఒకానొక మాయాశక్తి. దాన్ని వినిపిస్తాను. సావధాన మనస్సుతో విను. విశ్వరూపుడు తాను పాదాలు చేతులు కడుగుకొని ఉత్తరముఖంగా తిరిగి పవిత్రమయిన ఆసనంపై కూర్చొని అంగన్యాసకరన్యాసాలు చేసి నారాయణకవచాన్ని చేశాడు.
(అంగన్యాసము = జపించే మంత్రంయొక్క అక్షరములను ఆయా అవయవములందు స్థాపించడం; కరన్యాసము= జపించేమంత్రంయొక్క అక్షరములను చేతి వ్రేళ్ళ్యయందు స్థాపించడం. మంత్రజపం చేసే సాధకుడు ఆ మంత్రాధిష్ఠాన దైవాన్ని తనలోకి ఆవాహనం చేసుకొనే ప్రక్రియలు అంగన్యాస, కరన్యాసాలు. తద్వారా ఆ మంత్రజపసాధకుడు ఆ దైవంతో అభిన్న స్థితిని అనుభవిస్తాడు. అలాంటి దశలో మంత్రజపం సాగాలి - అనేది మంత్రశాస్త్ర ప్రసిద్ధమైన అంశం.)
ఈ విధంగా నారాయణ కవచాన్ని కూర్చి పాదాలయందు, మోకాళ్ళయందు, తొడలయందు, పొట్టయందు, హృదయమందు, వక్షఃస్థలమందు, ముఖమునందు, తలయందు ఈ విధంగా ఎనిమిది అంగములందు "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీమంత్రాన్ని న్యాసం చెయ్యాలి. "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ద్వాదశాక్షరీ మంత్రంతో కరన్యాసం చెయ్యాలి. ఈ అంగన్యాస కరన్యాసాలవలన సాధకుడు తాను మంత్రస్వరూపుడవుతాడు. అంతేకాకుండా భగవంతుడనే శబ్దానికి అర్ధమైన మొదట ఓంకారం చివర యకారం కల మహామంత్రంతో వేళ్ళయందు, బొటనవ్రేలియందు అన్ని కీళ్ళయందు న్యాసం చెయ్యాలి. అంతేకాక హృదయంలో ఓంకారాన్ని ; తలపై 'వి' అనే అక్షరాన్ని కనుబొమ్మల మధ్యలో షకారాన్ని తలమీద పిలక ఉండే ప్రదేశంలో 'ణ'కారాన్ని కన్నులయందు 'వే'కారాన్ని అన్ని కీళ్ళల్లోనూ నకారాన్ని, అస్త్రము నుద్దేశించి 'మ'కారాన్ని న్యాసం చేస్తే సాధకుడు మంత్రస్వరూపుడే అవుతాడు. ఇంకా ఓం నమః అస్త్రాయఫట్ అని దిగ్బంధనం చేసి పరమేశ్వరుణ్ణి ధ్యానంలో నిల్పి నారాయణకవచాన్ని పఠించాడు. ఆ కవచం జ్ఞానరూపం, తపోరూపం, ఆరు శక్తులుకలది.
(అష్టాక్షరీమహామంత్రం - ఓం నమో నారాయణాయ
ద్వాదశాక్షరీ మహామంత్రం - ఓం నమో భగవతే వాసుదేవాయ
ఆరు శక్తులు - సమగ్రములైన ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, స్త్రీ, జ్ఞానం, వైరాగ్యం.)
పాదాలు గరుత్మంతుని వీపుపై ఉంచి తన చేతులతో శంఖం, చక్రం, డాలు, ధనుస్సు, కత్తి, బాణాలు, పాశం, గద మొదలయిన సాధనాలను ధరించి, అష్టైశ్వర్యాలతో అష్టబాహువులతో కూడిన విష్ణుమూర్తి నన్ను రక్షించు గాక.
(అష్టైశ్వర్యాలు
అణిమ - మిక్కిలి సూక్ష్యమగుట - దీనిచే రాతిలో దూరగలడు.
లఘిమ - తేలిక అగుట - దీనిచే సూర్యకిరణా లాధారంగా చేసికొని సూర్యలోకం చేరగలడు.
మహిమ - వ్యాపించుట - దీనిచే సమస్త బ్రహ్మాండములందు వ్యాపించి అందలి విషయాలను గ్రహిస్తాడు.
గరిమ - బరువెక్కడం, దించడానికి, ఎత్తడానికి - వీలుకానంత బరువు అవుతాడు.
ప్రాప్తి - తాకటం - భూలోకంలోనుండి చంద్రుని స్పృశింపగలుతాడు.
ప్రాకామ్యము - కోరికకు అద్దులేకపోవటం - దీనిచే నీటిలోవలె భూమిలో ప్రవేశింపగలుగుతాడు
ఈశిత్వము - తన శరీరావయవములను సంకల్ప మాత్రము చేతనే ప్రేరేపించినట్లు భూత భౌతికములను సంకల్పమాత్రం చేతనే ప్రేరేపింప గలుగుతాడు.
వశిత్వము - సర్వమును తన వశములో నుంచు కొనుగలుగుతాడు.
ఇవి అణిమాది అష్టసిద్దులు. అష్టైశ్వర్యాలు - అష్ట విభూతులని ప్రసిద్ధి.)
గొప్పకీర్తికల మత్స్యావతారం, మొసళ్ళ రూపమయిన వరుణ పాశాల వలన నీటి వలన మరణం కలుగకుండా నన్ను రక్షించుగాక.
బ్రహ్మచారి మాయతో నటించేవాడు, బలికి కల్గు మంగళమును ప్రతిఘటించడంలో శౌర్యం చూపించినవాడు, గొప్పవైన మూడడుగులుకల వామనమూర్తి భయంకరమయిన స్థలములందు నన్ను రక్షించుగాక.
శ్రీనృసింహుడు హిరణ్యకశిపుని వధించే సమయంలో అతిభయంకరంగా ఉన్నాడు. ముఖం అట్టహాసంతో ప్రకాశిస్తోంది. పెద్దపెద్దకోరలున్న ముఖం నుండి వెలువడే మంటలతో దిక్కులన్నీ వణికిపోతున్నాయి. ఇంతని చెప్పలేని ఆకారం. అటువంటి నృసింహుడు అడవులలోను, చొరరాని చోట్ట, యుద్దాలలో, మంటలలో అన్ని ఆపదలలో ప్రశస్తమయిన రీతిలో నాకు రక్షణ కల్పించుగాక!
అన్ని లోకాలూ ఆపదలపాలయ్యే విధంగా భూమి మహాసముద్రంలో మునిగిపోయినప్పుడు ఆదివరాహమూర్తి తన కోరతో నీటిలో మునిగిపోకుండా భూమిని పైకెత్తాడు. ఆ ఆదివరాహం అగ్నితో సమానమైనది. ఆ ప్రళయజలాల్లో ఆటలాడింది. భూమికి అది భర్త , దయ కలది. నిరంతరమైన ప్రయాణం సాగే త్రోవలలో అటువంటి ఆదివరాహం నన్ను రక్షిస్తూ ఉండుగాక.
పరశురాముడు క్షత్రియ సంహారం చేశాడు. భృగువంశంలో జన్మించి దానిని శోభింపచేశాడు. సకలసద్గుణాల రాశి; శ్రీమంతుడు - వాటిచేత ప్రతిష్ఠ పొందాడు.
తాటకను చంపి, విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించి, శివునివిల్లు విరిచి, ధైర్యంతో విరాధుడు కబంధుడు ఖరుడు దూషణుడు మొదలైన రాక్షసుల్ని చంపి, సుగ్రీవుణ్జి చేరదీసి, వాలిని చంపి, సముద్ర గర్వం అణచి, వారధి నిర్మించి, రావణకుంభకర్ణాది వీరులను సంహరించి, విభీషణుణ్ణి లంకారాజ్యానికి అభిషిక్తుణ్ణి చేసి, సీతతో అయోధ్యకు వెళ్ళీ రాజ్యసుఖాలు అనుభవించిన శ్రీరామచంద్ర ప్రభువు స్వస్థలం విడిచి దూరప్రాంతాలలో ఉన్న సమయాలలో నన్ను రక్షించుగాక.
అన్ని ప్రమాదాలకూ కారణమయిన శత్రువులను చంపడంకోసం చేసే అభిచార కర్మలనుండి నారాయణుడు రక్షించుగాక. గర్వం కలగకుండా నరుడు యోగభ్రంశం కలగకుండా యోగేశ్వరుడైన దత్తాత్రేయుడు; గర్వంవలన బంధం కలగకుండా కపిలుడు; కామవశులం కాకుండా సనత్కుమారుడు, మార్గాలలో ఉండే దేవతలను తిరస్కరించకుండా హయగ్రీవుడు; దేవతలకు నమస్కారాలను తిరస్కరించకుండా, దేవపూజలలో లోపాలు కలగకుండా కలిగిన లోపాలవలన పాపాలు రాకుండా నారదుడూ, అన్ని నరకాలనుండి కూర్మనాథుడూ, అపథ్యం నుండి ధన్వంతరీ, సుఖదుఃఖాదులు శీతోష్ణాదులు మొదలైన ద్వంద్వాలనుండి ఋషభుడూ, జనాపవాదాలనుండి అగ్నీ, చావుపుట్టుకలకు కారణమయిన కర్మలనుండి బలరాముడూ, కాలంనుండి యముడూ, సర్పాలనుండి, అజ్ఞానంనుండి శేషుడూ, వేద బాహ్యులనుండి బుద్ధుడూ, శనినుండి కల్కి మొ॥రూపాలు ధరించి, ధర్మరక్షణ తత్పరుడయిన శ్రీమహావిష్ణువు నన్ను రక్షించుగాక. ప్రాతఃకాలం, సంగవకాల ప్రాహ్ణ, మధ్యాహ్న, అపరాహ్ణ, సాయంకాలాల్లోను, ప్రదోషార్ధరాత్రాపరరాత్ర ప్రత్యూషానుసంధ్యలను ప్రభాతంబునందు గదాద్యాయుధాలు ధరించిన కేశవ, గోవింద, నారాయణ, విష్ణు, మధుసంహర, త్రివిక్రమ, వామన, హృషీకేశ, పద్మనాభ, శ్రీవత్సధామ, సర్వేశ్వరేశ, జనార్దన, విశ్వేశ్వర, కాలమూర్తులను పేర్లు రూపాలుకల విష్ణువు నన్ను రక్షించాలి. ఓ సుదర్శన చక్రమా! నీవు ప్రళయాగ్నివలె భయంకరమయి సుడులతో అడ్డులేని గతిలో దనుజుల్ని నాశనం చేసే దానవు. ప్రచండమైన గాలివలన చెలరేగే అగ్ని ఎండిన అడవుల్ని భస్మం చేసినట్లు నాశత్రుసమూహాల్ని దగ్ధంచెయ్యి.
నారాయణుని చేతిలోని ఓ గదా! నీవు ప్రళయకాలంలో ఉత్పాత రూపమయిన ఉరుములతో అన్ని దిక్కులూ వ్యాపించిన మహామేఘాల నుండి వెలువడేవీ, కఠినమయిన పిడుగుల తాకిడివలన కలిగినవీ అయిన అగ్ని కణాలు చిమ్ముతూ భగభగలాడే ప్రకాశం కలదానవు. నీవు నా శత్రువుల్ని యుద్దాలలో పిండి పిండి చెయ్యి. కూశ్మాండము మొదలయిన పిశాచాల్ని చూర్ణం చెయ్యి. ఓ పాంచజన్య శంఖమా! సకల పుణ్యాలనిలయం శ్రీకృష్ణుని అధరం. ఆ అధరంతో ఊదబడినది వేణువు. ఆ వేణువు వలె పవిత్రమైన దానవు నీవు. గొప్ప ధ్వని చెయ్యి. ఆ ధ్వనితో పిశాచాదులు పారిపోవాలి. మా శత్రువుల గుండెలు పగిలిపోవాలి. శత్రుస్త్రీల గర్భాలు విచ్చిన్నం అయిపోవాలి. ఓ నందక ఖడ్గమా! నీ తీవ్రమయిన అంచుతో రాక్షస సమూహాల కుత్తుకలు ఉత్తరించగా ఆ కంఠాలు చిమ్మే రక్తంతో పాపాలను కడిగే దానవు. శ్రీమహావిష్ణువు ప్రయోగించగా మా శత్రువుల సమూహాల్ని ముక్కముక్కలు చెయ్యి. ఓ డాలూ! నీవు చంద్రునివంటి బుడిపెలతో ప్రకాశిస్తున్నావు. అన్ని లక్షణాలు తెలిసినదానవు. పుణ్య రూపంనీవు. మా శత్రువుల క్రూరపుచూపుల్ని గొప్పచీకటితో కన్పించకుండా చెయ్యి. భగవంతుని పేర్లూ రూపాలూ, వాహనాలూ, ఆయుధాలూ మమ్మల్ని క్రూరగ్రహాలనుండీ, నర పశు భూతాలనుండీ రక్షించునుగాక. సామవేదమంత్రాలచేత స్తుతింపబడే గరుత్మంతుడు నన్ను రక్షించునుగాక. శ్రీహరియొక్క పేర్లూ, రూపాలూ, వాహనాలూ, దివ్యాయుధాలూ అనుచరులూ మా బుద్ధినీ ఇంద్రియాల్నీ మనస్సుల్నీ ప్రాణాల్నీ సంరక్షించుగాక. ఆదిశేషుడు ఆపదలన్నింటినీ నాశనం చేయుగాక. జగత్తును ఈశ్వరరూపంగా ధ్యానించేవారికి ఆయుధాలనూ అలంకారాలనూ ధరించి భాసించే శ్రీహరి సంశయాలనుండి కలహాలనుండి నన్ను రక్షించుగాక, భయంకరాట్టహాసంతో ప్రకాశించే వదన గహ్వరంతో; అన్ని తేజస్సులనూ తిరస్కరించే గొప్ప తేజస్సుతో అవతరించిన నృసింహుడు అన్ని దిక్కులనుండి లోపలనుండి బయటనుండి కలిగే ఉపద్రవాలనుండి నన్ను రక్షించుగాక! అని నారాయణ కవచం ప్రభావాన్ని ఇంద్రుడు తెలిసికొని, ధ్యానించి, దాని మహిమవలన శత్రువుల్ని ఓడించాడు. అందువలన విమలమనస్కులైన ఎవ్వరైనా ఈ కవచాన్ని ధరించి ప్రతినిత్యమూ చదువుకుంటే అన్ని విధాలయిన ఆపదలనుండి, దుష్కర్మలవలన కలిగే ఉపద్రవాలనుండి రక్షణపొంది మనస్సు ప్రశాంతమై జయం పొందుతారు. ఏ వ్యాధీ వారి జోలికి రాదు.
1. పగలు 4 జాములు. రాత్రి 4 జాములు. 1 జాము= 3గంటలు; పగలు= 12 గంటలు దాన్ని 5 భాగాలు చేస్తే ఒక్కోభాగం 2.20 నిల వరకు ప్రాతఃకాలం అంటే సూర్యోదయం 6.00 గం॥లకు అయితే 6.00+2. 20= 8.20 నిల వఱకు ప్రాతఃకాలం. రెండో భాగం అంటే 8.20 నుండి 2.20 నిలు. 10.40 వఱకు సంగవకాలం అట్లే 3వ భాగం మధ్యాహ్నమని 4వ భాగం అపరాహ్ణమని 5వ భాగం సాయంకాలమని సాధారణమయిన గణన. ప్రకృతంలో పగలును 2 భాగాలుచేసి మూడవభాగంగా ప్రాహ్ణన్ని చెప్పడం జరిగింది.
2. ప్రదోషం అంటే సూర్యాస్తమయంనుండి 3 ముహూర్తాలు ప్రదోషం. ముహూర్తం= 2 గడియలు; 1గడియ= 24 ని॥లు ముహూర్తం= 48 ని॥లు. ప్రదోషం 48X3= 144 ని॥లు= 2 గం. 24. సూర్యాస్తమయం 6.00 అయితే 6. 00+ 2.24= 8.24 ని॥ల వఱకు ప్రదోషం.
3. ప్రత్యూషమన్నా ప్రభాతమన్నా ఒకటే= వేకువ. అదే అరుణోదయం. తెల్లవారడానికి ముందర 4 గడియలు. 1 గడియ= 24 ని॥లు.
కౌశికుడనే బ్రాహ్మణుడు నారాయణకవచాన్ని శ్రద్ధగా ఉపాసించాడు. తరువాత యోగశక్తితో ఒక ఎడారిలో తనువు చాలించాడు. చిత్రరథుడనే గంధర్వుడు విమానంలో ప్రయాణిస్తుండగా ఆ విమానం నీడ కౌశికుని అస్థిపంజరం మీద పడింది. అంతలో ఆ విమానంతోబాటు గంధర్వుడు అతని భార్యలు నేలమీద పడిపోయారు. ఆ గంధర్వుడు పైకిలేవలేకపోయాడు. చాలా కలత చెందాడు. ఆ సందర్భంలో వాలఖిల్యముని ఆ గంధర్వునితో-
ఇది నారాయణకవచమంత్రాన్ని ఉపాసన చేయడంవలన పుణ్యమైన అస్థి. దీనిని సమీపించడం నీకు శక్యంకాదు. విష్ణుభక్తులను ఏ అడ్డులేకుండా సమీపించడం ఎంతవారికైనా శక్యంకాదు.
పాడైన నీ కీళ్ళను సంధించి; ఆ మంత్రప్రభావాన్ని వారించి నీ ఆపదను తొలగించ గలిగిన ఉపాయం నదీజలాల్లో ఈ అస్థులను ఉంచడమే. అంతకంటె మరొక ఉపాయంలేదు.
అందువలన ఈ పవిత్రమయిన ఎముకల్ని తీసుకొని తూర్పుగా ప్రవహించే సరస్వతీనదీ జలాల్లో వేసినట్లయితే నీ కీళ్ళకట్లు తొలగిపోతాయి - అని చెప్పగా ఆ గంధర్వుడు అలాగే చేసి తన విమానంలో తన స్థానానికి వెళ్ళిపోయాడు. అందువలన
ఎవరు ఈ నారాయణ కవచాన్ని ప్రతిదినమూ వింటారో, చదువుతారో, వారికి ఎదురుపడినపుడు సమస్త ప్రాణులూ నమస్కరిస్తాయి.
ఇంద్రుడు విశ్వరూపుని దగ్గర ఈ నారాయణకవచాన్ని ఉపదేశంపొంది ముల్లోకాల్లోనూ గొప్ప సంపదలను అనుభవించి మహాప్రభావంకలిగి ప్రకాశించాడు.
రాజా! ఆ విశ్వరూపునకు మూడుతలలున్నాయి. వాటిలో ఒకటి మద్యం తాగుతుంది. మరొకటి సోమరసం తాగుతుంది. మరొకటి అన్నం తింటుంది. యజ్ఞం జరిగేటపుడు ఆ విశ్వరూపుడు అందరకూ తెలిసే విధంగా దేవతలకు హవిస్సులిచ్చేవాడు. ఆతని తల్లి రాక్షసవంశంలో పుట్టింది. ఆమె పట్ల భక్తిచేత రాక్షసపక్షపాతం కలిగి విశ్వరూపుడు రహస్యంగా రాక్షసులకు హవిస్సుల నిచ్చేవాడు. ఇది తెలిసి దేవేంద్రుడు భయపడి, ఆ విశ్వరూపుని తలలు ఖండించాడు.
ఈ విశ్వరూపుడు బ్రాహ్మణుడనికాని, మహాత్ముడని కాని, దేవేంద్రుడు ఆలోచించలేదు. పూర్వజన్మపాపప్రభావంచేత ఇలాంటి వంచన చెయ్యకూడదని విశ్వరూపుడాలోచించలేదు కదా! అని కూడా దేవేంద్రుడు భావించలేదు. కోపంతో ఆ విశ్వరూపుడి తలలు ఖండించాడు.
ఇంద్రుడు కోపాన్ని ఓర్చుకోలేక విశ్వరూపుని తలలు కత్తితో ఖండించాడు. సోమపానంచేసే తల కముజుపిట్ట అయ్యింది. సురాపానంచేసే తల పిచ్చుక అయ్యింది. అన్నంతినే తల తీతువుపిట్ట అయ్యింది. ముల్లోకాలకు అధిపతి అయినా ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం తప్పలేదు. బ్రహ్మహత్యాపాతకం ఇంద్రుణ్ణి సమీపించి తనను స్వీకరించమని ప్రార్థించింది. ఇంద్రుడు దోసిలిపట్టి ఆ పాపాన్ని స్వీకరించి ఒక ఏడాదిపాటు దాన్ని అనుభవించాడు. దాన్ని పోగొట్టుకోవాలని నేలను, నీళ్ళను, చెట్లను, స్త్రీలను నా పాపం స్వీకరించండి అని ప్రార్ధించాడు. అపుడు నేల - నాలో ఏర్పడిన గోతులు తమంతతాముగా పూడుకుపోవాలి - అనే వరం అడిగి, పొంది, ఆ పాపాన్ని చవుడునేలరూపంలో స్వీకరించింది. నీళ్ళు - నాలో ఏది కడగబడినా అది పవిత్రం కావాలి - అనే వరం అడిగి, పొంది, బుడగలు, నురుగు రూపంలో పాపాన్ని స్వీకరించింది. చెట్లు - తాము నరకబడినా తిరిగి చిగురించాలి - అనే వరం అడిగి, పొంది, జిగురు రూపంలో ఆ పాపాన్ని స్వీకరించాయి. స్త్రీలు - తాము సదా రతిసుఖాన్ని పొందాలి - అనే వరం అడిగి, పొంది, నెల నెలా రజస్వలలు కావడం అనే రూపంలో ఆ పాపాన్ని స్వీకరించారు.

No comments:
Post a Comment