నారాయణుడిట్లనెను : దానికిపైని లోకాలోకమను పర్వతము గలదు. ఆ పర్వత మధ్యభాగమున సూర్యప్రకాశము పడుచుండును. ఈ పర్వతముపై మేలిమి బంగరు నేల గలదు. అది మానసోత్తరము నుండి మేరువువర కెంత పొడవంత పొడవు గలదు. ఆ బంగారు భూమి నిగ్గుటద్దమువలె నిగ్గులుదేరి యుండును. అందు వేల్పులు తిరుగుచుందురు. అందే వస్తువు పడినను స్వర్ణమయమగును.
ఓ నారదా ! అందువలన నందే ప్రాణియు నుండదు. ప్రజల కగమ్యమైన దగుటచేత నది లోకాలోకమని వ్యాఖ్యానించబడెను. ఈ సువర్ణస్థలము లోకాలోక పర్వతము మధ్యభాగమున సొంపారుచుండును. భగవంతు డీలోకాలోకమును ముల్లోకముల నట్టనడుమ నుండునట్టు లేర్పఱచెను. సూర్యునినుండి ధ్రవతారవఱకుండు కిరణములన్ని యును లోకాలోక పర్వతమునకు వశమై యవి మూడు లోకములను దాటి పోజాలకున్నవి.
దేవఋషీ! ఈ పర్వతరాజమెంతెంతయో యెత్తుగ విశాలముగ నుండుటచేత సూర్యకిరణములు దీనిని దాటి యావలికి పోజాలవు. ఈ పర్వతములోకము లన్నింటికిని మానదండముగ నున్నది. ఇది యేబదికోట్ల యోజనములంత విస్తారముగ గలదని కవులందురు.
ఓయి మునీ ! ఈ లోకాలోకాచలముమొత్తము భూగోళములో నాల్గవవంతు గలదు. స్వయంభువుడగు బ్రహ్మదానికి నలుదెసల నాల్గుస్థానము లేర్పఱచెను. అతడు గిరికి నాల్గు వైపుల దిగ్గజముల నుంచెను. వాని పేర్లు వినుము. ఋషభము, పుష్పచూడము వామనము అపరాజిత మనునవి పేర్లు.
ఎల్లలోకములయునికీ దిగ్గజములు జీవనాడులవంటివందురు. భగవానుడు వానిలోని సంపదలను వీర్యములను పెంపోందింపజేయును. అతడు దాని విశుద్ద సత్త్వమును పెన్నిధుల నినుమడింపచేయును. ఇట్లు భగవానుడగు హరి యచట నెనిమిది సిద్దులను విష్వక్యేనాదులను గూడి విలసిల్లుచుండును. పరమేశ్వరుడెల్లలోకముల మేలుగోరి తన దివ్యాయుధములు దాల్చి యందు వెలుగొందుచుండును.

సనాతనుడగు శ్రీమహావిష్ణువు తన మాయారచితమగు దీనిని కల్పాంతమువఱకు గాపాడు చుండును. వీని లోపలి వైశాల్యమును బట్టి యాలోక పరిమాణము తెల్పబడెను. దానికి బయట లోకాలోక పర్వతము గలదని చెప్పబడెను.
No comments:
Post a Comment