పురాణాలు వింటే కలిగే శుభ ఫలితాలు
సనాతన ధర్మ శాస్త్రాల ప్రకారం పురాణ శ్రవణం ఒక మహా పుణ్యకార్యంగా భావించబడింది. వేదాలలోని గూఢార్థాలను సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా వివరించేవే పురాణాలు. అందుకే పురాణాలు శ్రద్ధగా వినడం వల్ల ధర్మజ్ఞానం పెరిగి, భగవంతునిపై భక్తి, విశ్వాసం బలపడతాయి.
పురాణాలు కేవలం కథలు మాత్రమే కాదు… అవి ధర్మం, భక్తి, నీతి, జీవన విలువలను నేర్పించే దివ్య గ్రంథాలు. పురాణ శ్రవణం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలిగి, దైవభక్తి పెరుగుతుంది.
మహర్షులు, దేవతలు, మహాభక్తుల జీవిత గాథలు వినడం ద్వారా సత్ప్రవర్తన అలవడుతుంది.
పురాణ శ్రవణే శ్రద్ధా యస్య స్యాద్బ్రాతరస్వహమ్ ।
తస్య సాక్షాత్ప్రసన్నః స్యాత్ శివో విష్ణుశ్చ సానుగః ॥
యత్స్నాత్వా పుష్కరే తీర్థే యాగే సింథౌ చ సంగమే ।
తత్ఫలం ద్విగుణం తస్య శ్రద్ధయా వై శృణోతి యః ॥
యే పఠంతి పురాణాని శృణ్వన్తి చ సమాహితాః ।
ప్రత్యక్షరం లభంత్యేతే కపిలాదానజం ఫలమ్ ॥
అపుత్రో లభతే పుత్రం ధనార్దీ లభతే ధనమ్ ।
విద్యార్థీ లభతే విద్యాం మోక్షార్ధీ మోక్షమాప్నుయాత్ ॥
యే శృణ్వన్తి పురాణాని కోటి జన్మార్జితం ఖలు ।
పాపజాలంతు తే హిత్వా గచ్ఛన్తి హరిమందిరమ్ ॥
పురాణాలు వినడంలో ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో మరియు నిత్యము ఎవరైతే శ్రవణం చేస్తారో, అటువంటి వారి విషయంలో శివకేశవులు మరియు వారి గణాలు సంపూర్ణానుగ్రహం ప్రదర్శిస్తారు.
పుష్కర తీర్థాల్లో, ప్రయాగ మొదలైన నదీసంగమ క్షేత్రాల్లో స్నానాలాచరిస్తే ఏ విధమైన పుణ్యం పొందగలరో దాని రెట్టింపు పుణ్యం పురాణ శ్రోతలకు లభిస్తుంది.
భక్తి శ్రద్ధలతో పురాణ పఠన-శ్రవణాలు చేసేవారు కపిలగోవును దానం చేస్తే అపారమైన పుణ్యరాశి, సకల శుభాలు పొందగలరు.
పుత్రులు లేనివారు పుత్రులను, దరిద్రులు ధనాన్ని, విద్యార్థులు విద్యను, మోక్షగాములు మోక్షాన్ని పొందగలరు.
No comments:
Post a Comment