స్వభావము - మృదు, శుభుడు
అధిపతి -పరమశివుడు
లింగము -పురుష
తండ్రి - అంగీరసుడు
తల్లి: - సురూప
భార్య - తార
పిల్లలు -భరద్వాజ, కుచ మరియు కేసరి
వారం - గురువారం లేదా బృహస్పతి వారం
రుచి -తీపి
జాతి -బ్రాహ్మణ
వర్ణము - లేత పసుపు పచ్చ
అధి దేవత -బ్రహ్మ
దిక్కు -ఈశాన్య
వాహనం - ఏనుగు
తత్వం - ఆకాశ
జీవులు -ద్విపాదులు
ప్రకృతి -కఫ
ఋతువు -హేమంత
లోహము -బంగారము
రత్నము -పుష్యరాగము
గ్రహ సంఖ్య -మూడు
గుణం -సత్వ గుణం
ప్రదేశం -గోదావరి నుండి వింధ్య ప్రాంతాలు
జప సంఖ్య - 19000
మిత్రులు -రవి, చంద్ర, కుజులు
శత్రువులు -బుధ, శుక్రులు
సములు - శని
గురు మహా దశ - 16 సంవత్సరములు
గురువు దేవ గురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి, వాచస్పతి, దేవేజ్యుడు, ఆంగీరస, జీవ అనే ఇతర నామాలు ఉన్నాయి.
అత్యంత శక్తి వంతమైన గ్రహం. పురుష గ్రహం, అధి దేవత బ్రహ్మ, రుచులలో తీపికి రుచి కారకుడు
గురువు లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు.
గురువు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ.
గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిని, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు. గురువు ధనస్సు రాశికి, మీనరాశికి ఆధిపత్యం వహిస్తాడు.
ద్వాదశస్థానాలలో గురువు
లగ్నంలో గురువు ఉన్న జాతకుడు అదృష్టవంతుడు, సౌందర్యవంతుడు, నిర్భయుడు, సంతానవంతుడు, చీరంజీవి ఔతాడు.
ద్వతీయ స్థానమున గురువు ఉన్న జాతకుడు స్వచ్ఛమైన వాక్కులు కలవాడు, భోజనప్రియుడు, సుందరవదనుడు, ధనవంతుడు, విద్యావంతుడు ఔతాడు.
తృతీయ స్థానమున గురువు ఉన్న జాతకుడు కష్టజీవి, అమర్యాదస్తుడు, ఖ్యాతి కలిగిన సోదరవర్గం ఉన్నవాడు, పాపకార్యములు చేయువాడు మాయావి ఔతాడు.
చతుర్ధ స్థానమున గురువు ఉన్న జాతకుడు సుఖజీవి, తల్లి, సేవకులు, భార్యా పుత్రులు, బంధువులతో కలిసి జీవించు వాడు, సంపద్వైభవం కలవాడు ఔతాడు.
పంచమస్థానమున గురువు ఉన్న జాతకుడు పుత్రుల వలన క్లేశములు అనుభవిస్తాడు. మేధావి, మంత్రి పదవిని అలంకరించు వాడు ఔతాడు.
షష్టమ స్థానమున గురువు ఉన్న జాతకుడు నిరుత్సాహి, అగౌరవములు పొందువాడు, శతృనాశకుడు, మంత్రభినివేశనం కలవాడు ఔతాడు.
సప్తమమున గురువు ఉన్న జాతకుడుఊతి ఉదారుడు, మంచి కళత్రం కలవాడు, మంచి పుత్రులను కలిగినవాడు, వినయసంపన్నుడు ఔతాడు.
అష్టమ స్థానమున గురువు ఉన్న జాతకుడు కడుబీదవాడు, అతి తక్కువ సంపాదనా పరుడు, పాపి, చిరంజీవి ఔతాడు.
నవమస్థానమున గురువు ఉన్న జాతకుడు ఖ్యాతి వహించిన మంత్రిగానూ, సంతతి కలవాడు, ఐశ్వర్యం కలవాడు, పవిత్రకార్యములందు అనురక్తుడై ఉంటాడు. ఉంటాడు.
దశమ స్థానమున గురువు ఉన్న జాతకుడు రుజువర్తనుడు, పవిత్రకార్యములు చేసి ప్రఖ్యాతి చెందు వాడు, బహుధనవంతుడు, రాజమిత్రుడు ఔతాడు.
ఏకాదశ స్థానమున గురువు ఉన్న జాతకుడు ధనవంతుడు, నిర్భయుడు, వాహనములు కలవాడు, చిరంజీవి, అల్పసంతానవంతుడు ఔతాడు.
ద్వాదశ స్థానమున గురువు ఉన్న జాతకుడు ఇతరులచేత అసహ్యించుకొనబడువాడు, అసంగతములు పలుకువాడు, అప్రమత్తుడు, పాపము చేయువాడు, అలసట పొందువాడు ఔతాడు.
No comments:
Post a Comment