Friday, January 2, 2026

Grama Kumkuma Nomu Katha - గ్రామ కుంకుమ నోము కథ

గ్రామ కుంకుమ నోము కథ

ఒక బ్రాహ్మణయువతి ప్రతిదినము గౌరినారాధించుచుండగ నొక దినమున గౌరి యామె స్వప్నమున కనపడి "అమ్మాయీ! నీ భర్తకు కొద్ది రోజులలో ప్రాణాపాయము కలగనున్నది. నీవు ఆ సమయంబునందు గ్రామకుంకుమ నోముపట్టి మధ్యలో వ్రతోల్లంఘనము చేయక పూర్తి చేసినచో నీ మంగళ సూత్రము శాశ్వతముగ నిలిచియుండు" నని చెప్పెను.

ఆమె అటులనే తన భర్తకు ప్రాణాపాయము సంభవింపనున్నదని కొనిన దినమున వీసె ఏబులం(కేజిన్నర), పసుపు, పసుపంత కుంకుమను కావిట్లలో వేయించుకొని పండ్లు పట్టుకొని వెళ్ళిగ్రామములో పంచిపెట్టు చుండెను. ఒక వీధిలో పంచి పెట్టెసరికి ఒక కొడుకువచ్చి "అమ్మా? నాన్నగారికి జబ్బుగానున్నది రమ్మ" ని చెప్పి పిలిచెను. అందుకామె "నాయనా! ఒక్కవిధి అయినద" ని చెప్పి రెండవ వీధికి పోయెను. అంత రెండవ కుమారుడువచ్చి "అమ్మా! నాన్నగారికి చాల జబ్బుగానున్నది రమ్మ" ని జెప్పెను. అప్పుడామె మూడవవీధికి వెడలి పంచి పెట్టసాగెను. అంతట మూడవకుమారుడు వచ్చి "అమ్మా! నాన్నగారిని క్రింద బడవేయుచున్నారు.రమ్మనగా-"ఇక రెండు వీధులున్నవి వచ్చెదనని" చెప్పి ఆమె నాలుగవ వీధికి వెళ్ళెను. నాల్గవ కుమారుడు వచ్చి అమ్మా నాన్నగారికి ప్రాణము పోయినదని చెప్పగా- యిక నొక్క వీధి యున్నదని చెప్పి యామె అయిదవ వీధికి వెళ్లి పంచిపెట్టుకొని, యింటికి వచ్చేసరికి భర్త దిగ్గునలేచి కూర్చుండెను. అప్పుడు ఊరందరు ఆశ్చర్యముతో అమ్మా! ఏమినోము పట్టినావు? ఏమి ప్రతము చేసినావని అడిగిరి. గ్రామకుంకుమ నోము పట్టి అది అయిదు వీధులను పంచిబెట్టుకొని వచ్చేసరికి వారు లేచి కూర్చున్నారని చెప్పినది.

ఉద్యాపనము :- వీసెయేబులం(1-1/2 Kg) కుంకుమ, వీసేయేబులం పసుపు పండ్లు ఊరిలో పంచి పెట్టుకోవలెను.

No comments:

Post a Comment

The Story of Prahlada - ప్రహ్లాద చరిత్రము

ప్రహ్లాద చరిత్రము ఓ ధర్మరాజా! రాక్షస కుమారుడైన ప్రహ్లాదుడు సమస్త జీవులను తనతో సమానంగా భావించేవాడు. పెద్దలు కనిపిస్తే సేవకునిలా వారిని చేరి న...