Monday, January 5, 2026

Tavudu Gowri Nomu Katha - తవుడు గౌరీ నోము కథ

తవుడు గౌరీ నోము కథ

ఒక భాగ్యశాలి ఎనుబది ఏళ్ళ వృద్ధురాలై ఉన్నప్పటికీ ఆమె అత్తమామలనూ, తల్లితండ్రులనూ, బంధువులనూ , బిడ్డలనూ ఎడబాయక సంతోషముగానుండెను. ఆమెను చూసి ఊరివారందరూ ఆశ్చర్యపడుతూ "ఏమి నోచితివమ్మా ! ఎవరినీ వదలకుండా నిండు సంసారముతో ఉన్నావు" అని అడుగగా? "అమ్మలారా! ఇది వాయనమందిన నోము ఫలమే కాని, నోచిన ఫలము కాదు. పూర్వము మాయమ్మ తవుడు గౌరి నోము నోచుకొని నాకు వాయనము ఇచ్చినది. ఇది అంతయూ వాయనపు చలవే" అని చెప్పెను. 

అది విని వారు వాయనమందితేనే ఇంత ఫలము చెందగా నోము నోచినచో ఇంకెంత ఫలము అబ్బునో కదా అని అనుకొని నాటినుండీ ఆ నోము నోచుకొనుచూ దీర్ఘాయురారోగ్య ఐశ్వర్యములతో విలసిల్లుచుండిరి. ఈకథను చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

ఉద్యాపన: తవ్వ నిండుగా బియ్యము పోసి పైన కొద్దిగా తవుడుతో కప్పి , చీరతోనో లేక రవికెలగుడ్డతోనో పుణ్యస్త్రీకి 
దక్షణ తాంబూల ముంచి యుద్యాపనము చేసుకొనవలెను.

No comments:

Post a Comment

Sree Maha Bhagavathamu Part 7 - శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీరస్తు - శీమహాభాగవతము - సప్తమస్కంధము శ్రీమద్విఖ్యాతి లతా, క్రామిత రోదో உ ౦తరాళ! కమనీయ మహా జీమూతతులితదేహ, శ్యామలరుచిజాల! రామచంద్రనృపాలా! ఓ...