భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆ పై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.
Friday, October 10, 2025
Sagarudu - సగరుడు
భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆ పై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.
Aurva Maharshi - ఔర్వ మహర్షి
ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందశి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు. తనే కోపి. తనకన్న తన భార్య మరీ కోపి. కలహప్రియ. కటుభాషిణి కావడంతో ఆమె బాధ భరించలేక ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు.ఆ విషయం మామ యగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు.
ఆయోధ్యను భాషుడను రాజుపాలించుచుండెను. హైహయులు దండెత్తి భాషుని రాజ్యమాక్రమించుకొన్నారు.అంత భాషుడు నిండు గర్భినియగు పట్టమహిషితో కులగురువగు ఔర్వుని ఆశ్రమమును పోయాడు.
సగరుడు చాలాకాలం రాజ్యం చేసి చివరకు ఔర్వుని చేరి తత్త్వముపదేసించమని అర్థించాడు. అంత ఆ మహర్షి అనేక విషయాలు తెలిపాడు. ఔర్వునికి తెలియని విషయాలు లేవు. అతడు మేధావి అస్ఖలిత బ్రహ్మచారి, తపోనిధి, ఉపకారి. అటువంటి మహర్షి చరిత్ర నిజంగా చాలా గొప్పది.
Chyavana Maharshi - చ్యవన మహర్షి
Druvudu - ధ్రువుడు
ధ్రువుడి వంశ చరిత్ర
స్వాయంభువ మనువుకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యల వలన ధ్రువుడు (సునీతి) ఉత్తముడు (సురుచి) అనే ఇద్దరు కుమారులు కలిగారు. కాలప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రి నవ్వు నవ్వి నీకు తండ్రి తొడ పై ఎక్కే అధృష్టం లేదు, అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. నీకా అధృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెబుతుంది.
ధ్రువుడికి నారదుడు నారాయణ మంత్రొపదేశం
అప్పుడు మార్గమధ్యములో నారదుడు కనిపించి ఎక్కడికి వెళ్ళుతున్నావు అని అడుగగా ధ్రువుడు అప్పటి వరకు జరిగిన వృత్తాంతం తన సవతి తల్లి చేత పొందిన అవమానం చెబుతాడు. నారదుడు ధ్రువుడిని ఓదార్చి రాజధాని నగరం పంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ధ్రువుడి పట్టుదలకు మెచ్చి యమునా నది తీరములో ఉన్న మధువనంలో ధర్భాసీనుడవై ప్రాణాయామ నిష్ఠతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రము ఉపదేశిస్తాడు.
శ్రీమహా విష్ణువు దర్శనం
నారాయణుడు ధ్రువుడికి శంఖ చక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమిరగా ధ్రువుడు 12 శ్లోకాలతో నారాయణుడిని స్తుతిస్తాడు. దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్తఋషులు, నిఖిల తారాగణాలు, సూర్యచంద్రులు నిరంతరం ప్రదక్షిణం చేసే ధ్రువక్షితి అనే స్థానం కలిపిస్తున్నానని చెప్పి, ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్యపరిపాలన చేయమంటాడు.
యక్షులతో యుద్ధం
ఒకరోజు తన సోదరుడైన ఉత్తముడు అరణ్యానికి వేటకు వెళ్ళి ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఆ వార్త విన్న సురుచి అగ్నిలో ప్రవేశించి ప్రాణ త్యాగం చేసింది. ఈ రెండు విషయాలు మనస్థాపం కలిగించి ధ్రువుడు హిమయత్పర్వతం లోయలో ఉన్న అలకపురిలో ఉన్న యక్షుల మీద యుద్ధం ప్రకటించాడు. కొద్ది సేపటి తరువాత యుక్షులు మాయ యుద్ధం చేయట మొదలుపెట్టారు. వారితొ మాయాయుద్ధం చేసే దారి తోచక ఆలోచిస్తుంటే మునులు ప్రత్యక్షమై నిఖిపలోకాలకు మూల కారకుడైన నారాయణుడిని స్మరించమని చెబుతారు. నారాయణుడిని స్మరించి నారాయాణాస్త్రం సంధించగా యక్షుల శక్తి సన్న గిల్లి వారి కాళు చేతులు మొండలు విరిగి క్రింద పడి పోయాయి.
ధ్రువుడు ధ్రువ నక్షత్ర ముక్తి
ధ్రువుడు రాజధాని చేరి భూరి దానాలతో యజ్ఞాలు సాగించి కొంత కాలం పరిపాలన చేశాడు. తరువాత రాజ్యాన్ని తన కూమారుడికి అప్పగించి, తపస్సు చేసుకోవడానికి బదరికావనములో పద్మాసీనుడై శ్రీ మహావిష్ణువు స్మరిస్తూ కాలం వెల్లబుచ్చుతుండగా ఒకరోజు నందసునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్యవిమానం మీద ధ్రువుడిని తీసుకొని వెళ్ళడానికి వస్తారు. ధ్రువుడా దివ్యవిమానం ఎక్క లేకపోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెబుతాడు. అలా వెళ్ళుతుండగా ధ్రువుడు నారాయణ సేవకులతో తన తల్లిని చూడవలెనని కోరిక ఉన్నదని తెలుపగా వారి ముందు ఉన్న విమానం పైనున్న సునీతిని చూపించగా ధ్రువుడు ఆనందిస్తాడు.నేటికి మనకు కనిపించే ధ్రువనక్షత్రము ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్యపాలన ఫలంగా లభించనదే అని చెబుతారు.
Uttarashada Nakshatra - ఉత్తరాషాఢ నక్షత్రం
నక్షత్రం - ఉత్తరాషాఢ
అధిపతి - రవి
గణము - మానవ
జాతి - పురుష
వృక్షం - పనస
జంతువు - ముంగిస
నాడి - అంత్య
పక్షి - గరుడము
అధిదేవత - విశ్వేదేవతలు
రాశి - 1, పాదం ధనస్సు, 2, 3, 4 పాదాలు మకరం
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో ఉత్తరాషాఢ నక్షత్రము 21వ నక్షత్రము. ఈ నక్షత్రం పూర్తిగా శుభకరం. ఇందులో 1వ పాదం ధనురాశిలో మిగతా మూడు మకర రాశిలో ఉంటాయి. ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస.
ఈ రాశివారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలా అలా ఎదుగుచూ ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరికెడి అవకాశాలు వీరికి దక్కుతాయి.
వీరు తక్కువగా మాట్లాడెదరు, అణకువ కలిగి ఉంటారు. సొంతవారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసి మెలిసి ఉండదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నేర్చుకొనెదరు.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. పై చదువులు వీరికి కలసి వస్తాయి.
వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిసివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసివస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసివస్తాయి.
వీరు తల్లిదండ్రులని మించిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించిపోతారు. కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, థన సహాయాన్ని చేస్తారు.నక్షత్రములలో ఇది 21వ నక్షత్రం.
ఉత్తరాషాఢ నక్షత్రము జాతకులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు మరియు మృదువుగా మాట్లాడతారు. వీరు ఆధ్యాత్మికంగా ఉంటారు మరియు ఇతరులను గౌరవిస్తారు. వీరు ప్రతి పనిని నిజాయితీగా చేస్తారు మరియు ఆలోచనల పట్ల వీరు స్పష్టంగా ఉంటారు.
ఎన్నడూ ఇతరులను మోసగించడం లేదా ఏదైనా సమస్యను సృష్టించడం చేయరు. చక్కటి హృదయాన్ని కలిగి ఉండటం వల్ల, అనేకసార్లు వీరు తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటారు.
వీరు ఎవరినీ సులభంగా నమ్మరు, అయితే, నమ్మడం ప్రారంభించినట్లయితే, వారి కోసం ఏదైనా చేయగలుగుతారు. వీరు సులభమైన జీవితాన్ని ఇష్టపడతారు మరియు ఎలాంటి నిర్ణయాన్ని కూడా వేగంగా తీసుకోరు.
వీరు ఎవరినైనా విశ్వసించినట్లయితే, వారి వద్ద నుంచి వీరు సూచనలను తీసుకుంటారు. వీరికి ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉంటుంది. జపం, తపం, వ్రతం మొదలైనవి వీరిని జీవితంలో విజయపథంలోనికి తీసుకెళతాయి. ఒక్కసారి ఆధ్యాత్మిక పథంలోనికి నడవడం ప్రారంభించిన తరువాత, అన్ని బంధాలు మరియు వైవాహిక జీవితం పట్ల విముఖత కనిపించవచ్చు.
కష్టపడి పనిచేయడమే కాకుండా, వీరు నిరంతరం పని చేయడానికి ఇష్టపడతారు. విద్య లేదా పని ఇలా ఏవిషయంలోనైనా వీరు ఇతరుల కంటే ముందుంటారు. బాల్యం నుంచి వీరు కుటుంబం యొక్క బాధ్యతలను చేపడతారు. అయితే, వీరు యువకులుగా ఉన్నప్పుడు చక్కటి సంతోషాన్ని పొందుతారు. వీరు అన్ని సమస్యలకు సిద్ధంగా ఉంటారు. ఏదైనా సంబంధం ఏర్పరుచుకోవడానికి ముందు, ఆ వ్యక్తి గురించి వీరు బాగా తెలుసుకుంటారు, లేనిపక్షంలో వీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల జీవిత భాగస్వామికి బాధ్యత మరియు ప్రేమ ఉంటాయి, అయితే అతడి/ ఆమె ఆరోగ్యం వీరికి ఆందోళన కలిగించవచ్చు. వీరు బాగా చదువుకుంటారు మరియు టీచింగ్ లేదా బ్యాంకింగ్ రంగాల్లో వీరు అపరిమితైన విజయాన్ని సాధిస్తారు.
ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము
ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు. వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవ గణానికి చెందినవారు. కాబట్టి వీరు సమయానికి తగ్గ రీతిలో ప్రవర్తించగలిగే చాకచక్యం కలిగి ఉంటారు. ఇక వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయం కలగలుపుగా ఉంటాయి.
ప్రభుత్వపరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. ప్రజా నాయకులుగా, ప్రజా అధికారులుగా రాణించగల నేర్పు వీరికి ఉంటుంది. అగ్ని సంబంధిత, పసుపు వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆటంకం లేకుండా విద్య సాగుతుంది. వీరికి 5 సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత పదేళ్ళ వరకు చంద్ర దశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు.
15 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు.
రాహువు అనుకూలంగా ఉంటే, ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 40 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు క్రమంగా తగ్గుతాయి.
సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. 56 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 75 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.
ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదము
ఉత్తరాషాఢ నక్షత్ర రెండవ పాదములో జన్మించిన జాతకులు మానవ గణానికి చెందిన వారు కనుక సమయానికి తగ్గ రీతిలో ప్రవర్తించగల నేర్పు కలిగి ఉంటారు. ఇక వీరు తండ్రి పట్ల కొంత విముఖత కలిగి ఉంటారు.
తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల, అతిశయం ఉంటుంది. ప్రభుత్వ పరిశ్రమలు, కర్మాగారాలలో ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. వీరు శ్రమించి పట్టుదలతో పని చేయగలరు. వీరు నిర్వహకులుగా చక్కగా పని చేయగలరు. పరిశ్రమలను స్థాపించి నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది.
ఈ జాతకులకు విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 4 సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్ర దశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు.
14 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 21 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు.
రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 39 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి.
సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. 55 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.
ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదము
ఈ పాదములో జన్మించిన వారికి తండ్రి మీద కొంత విముఖత కలిగి ఉంటారు. అయితే తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల మెండుగా ఉంటుంది. వీరికి ప్రభుత్వ పరిశ్రమలు, కర్మాగారాలోని ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.
శ్రమించి పని చేయగల నేర్పు ఉంటుంది. వీరు నిర్వహకులుగా చక్కగా పని చేయగలరు. పరిశ్రమలను స్థాపించి నిర్వహించగల నేర్పు ఉంటుంది. ఈ జాతకులకు స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి రెండు సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్ర దశ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో వీరికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.
12 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగానే సాగిపోతుంది. 19 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు.
37 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. 53 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ సమయంలో ఖర్చులు అధికమవుతాయి. 72 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.
ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగవ పాదము
ఉత్తరాషాఢ నక్షత్ర నాల్గవ పాదములో జన్మించిన వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. మానవ గణానికి చెందిన జాతకులు కనుక వీరికి సమయానుకూలంగా ప్రవర్తించగలిగే నేర్పు ఉంటుంది. ఇక వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయం కలగలుపుగా ఉంటాయి.
ప్రభుత్వ పరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ రంగంలో పని చేయడం వీరికి అనుకూలం. ప్రజానాయకులుగా, ప్రజా అధికారులుగా వీరు సమర్ధతతో పని చేయగలరు. మధ్యవర్తులుగా కూడా నేర్పుతో వ్యవహరించగలరు. అగ్ని సంబంధిత, పసుపు వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల నక్షత్రపు ఫలములు
నక్షత్రపు పేరు నక్షత్రములు ఫలం
పుట్టిన నక్షత్రము కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ ఒంటికి శ్రమ
సంపత్తు నక్షత్రము రోహిణి, హస్త, శ్రవణం డబ్బుల లాభం
ముంపు తెచ్చు మృగశిర, చిత్త, ధనిష్ఠ పనికి చేటు
నక్షత్రము
సంపత్తు నక్షత్రములు ఆరుద్ర, స్వాతి, శతభిష బాగు
వేఱైన నక్షత్రములు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ప్రయత్నము పాడు అగుట
సాధన నక్షత్రములు పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర పని నెఱవేరుట, మంచిది
నైత్య నక్షత్రములు ఆశ్లేష, జ్యేష్ట, రేవతి బంధనం
వీరితో బాగా పడిన అశ్విని, మఖ, మూల హాయి
మిక్కిలి బాగా పడిన భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ హాయి, కలిసి వచ్చును
తన్నో విశ్వే ఉప' శృణ్వంతు దేవాః ।
తద’షాఢా అభిసంయంతు యజ్ఞమ్ ।
తన్నక్షత్రం ప్రథతాం పశుభ్యః' ।
కృషిర్వృష్టిర్యజ'మానాయ కల్పతామ్ ।
శుభ్రాః కన్యా' యువతయ' స్సుపేశ’సః ।
కర్మకృత'స్సుకృతో' వీర్యా'వతీః ।
విశ్వా”న్ దేవాన్, హవిషా' వర్ధయ'౦తీః ।
అషాఢాః కామముపా'యంతు యజ్ఞమ్ ॥
మూడవ పాదం – సత్యవాడలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – సుందరపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి.
Thursday, October 9, 2025
Sukra - శుక్రుడు
జాతి -బ్రాహ్మణ
వర్ణము - తెలుపు, మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక.
ఇతర నామాలు కావ్యుడు, సితుడు, భృగుసుతుడు, దానవాచార్యుడు, ఉశనుడు
శుభ గ్రహాల కలయిక: శుభ గ్రహాలైన గురువు (బృహస్పతి), బుధుడు వంటి గ్రహాలు శుక్రుడితో కలిసి పంచమ స్థానంలో (ఫైన్త్ హౌస్) ఉన్నప్పుడు అది మంచి యోగంగా పరిగణిస్తారు.
శుక్రుడు జాతకంలో బలహీనంగా లేదా అశుభ స్థానాల్లో ఉంటే
ఆర్థిక సమస్యలు, సంబంధాలలో ఇబ్బందులు, మరియు సౌభాగ్యం
లేకపోవడం వంటివి తలెత్తుతాయి. ఈ దోష నివారణకు పరిహారాలు పాటించవలసి ఉంటుంది.
శ్రీకృష్ణుడు కుచేలుడికి అనుగ్రహించిన అపార ధన సంపత్తిని ఉశనుడు అపహరించబూనడంతో ఈశ్వరుడు ఆగ్రహించి శుక్రుడిని సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఉశనుడు తన తపశ్శక్తితో ఈశ్వరుడి ఉదరంలో ప్రవేశించి అతడిని స్తుతించసాగాడు. బోళాశంకరుడైన ఈశ్వరుడు ఉశనుడికి అభయం ఇచ్చి, శుక్ర శోణిత రూపంలో బయటకు పంపాడు. అప్పటి నుండి అతడికి శుక్రుడన్న పేరు సార్థకమయింది. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు మఖ నక్షత్రంలో మన్మధ సంవత్సరంలో ఉశనుడు శుక్రుడిగా అవతరించాడు. శివుడు అతడి స్తుతికి మెచ్చి ధన్వీర్యాలకు అధిపతిగానూ, రాక్షసులకు గురువుగానూ చేసి గ్రహమండలంలో స్థానం కల్పించాడు. అసురుల గురువైన శుక్రుడు వారి అభ్యున్నతి కొరకు ఘోర తపస్సు చేసాడు. ఈశ్వరుడిని మెప్పించి మృతసంజీవనీ విద్యను సాధించాడు. శుక్రుడు సంపదలకు, మంత్రాలకు, రసాలకు, ఔషధులకు అధిపతి. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన శుక్రుడు తన సంపదలను దానవ శిష్యులకు అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. వర్షాలపై ఆధిపత్యం వహిస్తూ అతివృష్టి, అనావృష్టికి కారకుడౌతాడు. వర్షాలను నిరోధించే వారిని శాంతింపచేస్తాడు.
శుక్రుడు శారీరక సుఖము, భార్య, యౌవనం, సౌందర్యం, రాజసము, వినోదము, స్త్రీలు, ఐశ్వర్యం, జలవిహారం, ఆభరణములు, సౌందర్య సాధనములు, చతుష్షష్టి కళలు, వీర్యము, మన్మధుడు, సుగంధద్రవ్యములు, గౌరి, లక్ష్మి ఆలయములు, క్రీడా ప్రదేశములు, పాలు, పాల కేంద్రాలు, పాలకు సంబంధించిన వస్తు విక్రయము, వస్త్రములు దానికి సంబంధించిన వృత్తులు, అలంకార సామాగ్రి, పరిమళ ద్రవ్యములు వాటికి సంబంధించిన వృత్తులు, పానీయములు, పండ్లరసాలు వాటికి సంబంధించిన సంస్థలు, పెట్రోలు వాహనములు, నౌకలు, సముద్ర యానం, రస సంబంధం ఉన్న నిమ్మ, నారింజ, కమలా, బత్తాయి మొదలైన పండ్లు, నేత్ర, సుఖ, చర్మ, కంఠముకు సంబంధించిన రోగములు, దర్జీ, కళాసంబంధ వృత్తులు, సౌందర్య సంబంధిత వృత్తులు, స్నేహితులు, బహుమతులు, హనీమూన్, ప్రేమ, విందులు విలాస విహారాదులు, పూలు, అలంకరణ సామాగ్రి, లౌక్యము, లాభము, ఒప్పందము, ఆకర్షణ మొదలైన వాటికి కారకుడు.
వ్యాధులు- గర్భాశయ, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాధులు మొదలైన వాటికి కారకుడు.
కుజుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి కలుగుతాయి.
బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం,
శనితో కలిసిన సుఖ వ్యాధులు,
రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాధులు,
కేతువుతో కలిసిన సంతాన లేమి.
ద్వాదశ స్థానాలలో శుక్రుడు
1. శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందరశరీరం కలిగిన వాడు, సుఖజీవి, చిరంజీవి ఔతడు.
2. శుక్రుడు ద్వితీయస్థానమున ఉన్న బహువిధములుగా సంపదలు కలవాడు, కవి ఔతాడు.
3. తృతీయముస్థానమున శుకృడు ఉన్న జాతకుడు భార్యాహీనుడు, కష్టవంతుడు, బీదవాడు, దుఃఖవంతుడు, అపకీత్రి కలవాడు ఔతాడు.
4. చతుర్ధస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు వాహనములు కలవాడు, మంచిగృహం కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు కలవాడు ఔతాడు.
5. పంచమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు అపారధనవంతుడు, ఇతరులను రక్షించు వాడు, బహుమేధావి, పుత్రులు కలవాడు ఔతాడు, భార్య వల్ల లాభం, సుఖ సంసార జీవితంలో లాభం
6. షష్టమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు శతృవులు లేని వాడు, ధనమును లేని వాడు, యువతుల చేత వంచింపబడిన వాడు, విచారగ్రస్తుడు ఔతాడు.
7. సప్తమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు మంచి కళత్రం ఉన్న వాడు, పరస్త్రీ ఆసక్తుడు, కళత్రం లేని వాడు, ధనవంతుడు ఔతాడు.
8. అష్టమ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, రాజు ఔతాడు.
9. నవమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాబిడ్డలు, సంతానం, ఆప్తులు కలిగి రాజాశ్రయం కలిగి అభివృద్ధి చెందుతూ ఉంటాడు.
10. దశమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగినవాడు, మిత్రులు కలిగిన వాడు, ప్రభువు ఔతాడు.
11. ఏకాదశ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, బహు సుఖవంతుడు ఔతాడు.
12. ద్వాదశము స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతుడు, ధనవంతుడూ ఔతాడు.
Monday, October 6, 2025
Saphala Ekadashi - సఫల ఏకాదశి
సఫల ఏకాదశి రోజున ప్రతి ప్రయోగం విజయవంతమవుతుంది. ఈ రోజున ఆరోగ్యానికి సంబంధించిన ఉపవాసం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ రోజు ఉపవాసం డబ్బు, వ్యాపారంలో లాభాన్ని ఇస్తుంది. పిల్లలను లేనివారికి పిల్లల కొరకు, పిల్లలు బాగా వృద్ధిలోకి రావడానికి ఈ ఉపవాసం పాటిస్తారు. ఉద్యోగంలో విజయానికి ఇది అత్యంత అనుకూలమైన వ్రతం.
ఈ రోజు శ్రీ హరిని ఎలా పూజించాలి?
ఏకాదశి ఉదయం లేదా సాయంత్రం శ్రీ హరిని తెల్ల చందనం లేదా గోపీ చందనం నుదుటిపై పూసుకుని శ్రీ హరిని పూజించండి. శ్రీ హరికి పంచామృతం, పూలు, కాలానుగుణ పండ్లను సమర్పించండి. ఉపవాసం పాటించినట్లయితే, సాయంత్రం ఆహారం తీసుకునే ముందు, నీటిలో దీపదానం చేయండి. ఈ రోజున పేదవారికి వెచ్చని బట్టలు, ఆహారాన్ని దానం చేయడం కూడా శ్రేయస్కరం.
ఉద్యోగంలో విజయం కోసం పూజ
మీ కుడి చేతిలో నీరు, పసుపు పువ్వులు తీసుకుని, మీ ఉద్యోగంలో విజయం కోసం వరం కోసం ఆ శ్రీ మహా విష్ణువును ప్రార్ధించండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి నారాయణ కవచాన్ని పఠించండి. సఫల ఏకాదశి రోజు నుండి, 11 రోజుల పాటు నిరంతరం నారాయణ కవచాన్ని పఠించండి. ఉద్యోగ సమస్యలు తీరుతాయి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు.
డబ్బు సమస్య
డబ్బుకు సంబంధించిన ఏదైనా పని ఆగిపోయినట్లయితే, ప్రతిరోజూ ఉదయాన్నే నీటిలో ఎర్రటి పువ్వులు వేసి సూర్య భగవానుడికి సమర్పించండి. ప్రతిరోజు సాయంత్రం నెయ్యితో దీపం వెలిగించండి. మీ పని త్వరలో పూర్తి అవుతుంది.
సంతానం పొందడం కోసం
వెండి పాత్రలో పంచామృతాన్ని హరికి సమర్పించండి. "ఓం నమో నారాయణాయ" మంత్రాన్ని 108 సార్లు జపించండి. పంచామృతాన్ని ప్రసాదంగా తీసుకుని సంతానం కలగాలని ప్రార్థించండి.
సఫల ఏకాదశి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు మరియు ధర్మరాజు యుధిష్ఠిరుడి మధ్య సంభాషణ సమయంలో సఫల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. ఈ ఏకాదశి ఉపవాసం ద్వారా 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం లభిస్తుంది అని నమ్ముతారు. కాబట్టి, ఈ రోజున ఒక వ్యక్తి ఉపవాసం ఉంటే, అతని/ఆమె బాధలన్నీ ముగుస్తాయి, అదృష్టం అనుకూలంగా ఉంటుంది కోరికలు నెరవేరుతాయి.
సఫల ఏకాదశి కథ
పురాతన కాలంలో చంపావతి నగరాన్ని మాహిష్మత రాజు పరిపాలించేవాడు. అతనికి నలుగురు కుమారులు ఉన్నారు, వారిలో లుంభక చాలా క్రూరమైన వాడు. అతను తన తండ్రి డబ్బును చెడు పనులకు ఖర్చు చేసేవాడు. అతని పనులకు చింతించి, రాజు అతన్ని బహిష్కరించాడు. అయినప్పటికీ లుంభక దోపిడి మరియు దొంగతనాల అలవాట్లు మానలేదు.
Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం
శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...