శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం
ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥ 01 ॥
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥ 02 ॥
నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥ 03 ॥
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।
మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥ 05 ॥
క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥ 06 ॥
గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।
రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥ 07 ॥
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।
ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥ 08 ॥
॥ ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః ॥
Friday, February 27, 2026
Pleased by Dhruva devotion, Vishnu appeared and Dhruva Praised Lord Vishnu - సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుండు స్తుతించుట
సాక్షాత్కరించిన భగవంతుని ధ్రువుండు స్తుతించుట
ఆ సర్వవ్యాపకమైన ఆ దైవస్వరూపాన్ని కళ్లారా జుర్రుకుంటున్నట్లుగా, ముఖంతో ముద్దు పెట్టుకుంటున్నట్టుగా భావించుకుంటూ మొక్కాడు. చేతులతో కౌగలించుకుంటున్నట్టుగా అనుభూతి పొందుతూ సాగిలపడ్డాడు.
ఇలా అనుభవిస్తూ సాగిలబడి నమస్కరించాడు. రెండు చేతులు జోడించి కీర్తించడానికి సంకల్పించాడు. వర్ణించడానికి ధ్రువుడి చేత కాలేదు. సర్వాంతర్యామి విష్ణువు ధ్రువుడి ఇంగితాన్ని గమనించాడు. వేదాత్మకమైన తన శంఖంతో ధ్రువుడి బుగ్గలను నిమిరాడు. ఆ స్పర్శతో ధ్రువుడికి జీవాత్మ పరమాత్మల వేరుపాటును చక్కగా పసికట్టగల జ్ఞానం కల్గింది. ధ్రువుడు భక్తియందు శ్రద్ధాళువు అయ్యాడు. సమస్తభువన ప్రఖ్యాతుడగు నారాయణుని మహత్తరమహిమచే చెప్పబడ్డవై ధ్రువుడి వేదమయ వాక్కులుగా వెలువడుతున్నాయి. ఆ విష్ణువును ఆ తన మాటల్లో ఇలా స్తుతించాడు. ఓ దైవమా! అనంతశక్తి సమన్వితుడవు, సర్వాంతర్యామివి ఐన నువ్వు, నాలో సంలీనమై ఉన్ననా మాటలకూ, నా శ్వాసకూ, చేతులు, కాళ్లు, చెవులు, చర్మం మొదలైన ఇంద్రియాలకూ, నీ చైతన్యసామర్థ్యంచే దయ చూపిన దైవమవు, పరమాత్మవు అయిన నీకు నమస్కరిస్తున్నాను. అనన్యుడవయిన నువ్వు మహత్తు మొదలైనవి ప్రధానంగా కల ఈ సకల చరాచర ప్రపంచాన్ని మాయ పేరిట నీ స్వతంత్రమైన ఇచ్చతో సృజించావు. ఆ మాయామయ ప్రపంచంలో త్వగాది ఇంద్రియ రూపాల్లో చొచ్చి ఉన్నావు. ఆ యా దేవతల స్వరూపాల్లో అన్నిరకాల కట్టెల్లో దాగి ఉండే నిప్పువలె బహు ప్రకారంగా కనిపిస్తుంటావు.
(ప్రాణేంద్రియములు
1. ప్రాణములు. ఇవి ఐదు. 1.ప్రాణము, 2.అపానము, 3.వ్యానము, 4.ఉదానము, 5.సమానము
2. ఇంద్రియములు - ఇవి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు - రెండు రకాలు.
కర్మేంద్రియములు ; వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ.
జ్ఞానేంద్రియములు : త్వక్కు, చక్షువు, శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము.)
దీనబాంధవా! నిద్రనుంచి లేచినవాడు మళ్లీ ప్రపంచాన్ని చూసినట్లు బ్రహ్మదేవుడు నిన్ను శరణుపొంది నీవు ప్రసాదించిన జ్ఞానం చేత ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శించాడు. మోక్షం కోరేవాడికి శరణాలయిన నీ పాదాలను ఉపకారం మరువని సజ్జనుడు ఎలా మరచిపోతాడు? (మరచిపోడు)
మహాత్మా! నువ్వు చావుపుట్టుకల విముక్తికి నిమిత్తుడవు. అనన్యమైన కల్పవృక్షం వంటివాడవు. భక్తులు ఎవ్వరైనా తాము కోరినదాని కోసం ప్రయత్నించే వాళ్లు నీ మాయకు లోనవుతారు. చతుర్విధ పురుషార్థాల భోగాలకోసం తమను తాము అప్పగించుకుంటారు. అది త్రిగుణమయమైన శారీరక సుఖాలకోసంగా మనస్సున సంకల్పించుకుంటారు. సంసార తాపాన్ని పాపే గుణకథన మాధుర్యం గలవాడా! ఈశా! మాధవుడా! ముకుందా! అలాంటివాళ్లకు ఇంద్రియార్థాల వల్ల కల్గే సౌఖ్యం నరకంలోనూ వర్తిల్లుతుంది.
పద్మనాభా! సాధుజనావన! నీ చరణాలను స్మరించడంవల్లా, మిక్కిలి ప్రేమతో అలరింపచేసే నీ గాథలను వినడంవల్లా, సమకూడిన ఆనందాన్ని తననే ఆహ్లాదింపచేసే బ్రహ్మానందంలోనూ లేవట. యముడి కాలదండంచే భగ్నమై విరిగిపడే విమానాలనుంచి ఎడం లేకుండా నేలకూలే ఆ దివ్యుల గూర్చి ఇక చెప్పుకునేది ఏమి ఉంటుంది.
(దానధర్మాది పుణ్యకార్యాల వల్ల స్వర్గానికి వెళ్లిన వారు తిరిగి భూలోకానికి వస్తారు. కాని మోక్షం కోసం ప్రయత్నించి వెళ్లినవారు భూలోకానికి తిరిగిరారు. స్వర్గానికి మోక్షానికి ఇది భేదం.)
ఓ వెన్నుడ! నీ ఆరాధన విధానంలో నియమంతో మనస్సు పెట్టే వాళ్లయొక్క నీదు మూర్తిపైనే దృష్టిపెట్టిన భక్తవరుల యొక్క సహవాసాన్ని నాకు సమకూర్చు. ఆ సజ్జన సాంగత్యంచేత రుచికరమైన నీ కథామృతపానంచేత ఉన్మత్తుడనవుతాను. ఆ పారవశ్యంతో దాటశక్యంకాని కష్టాల కడలిని సులభతమంగా దాటేస్తాను.
ఓ సర్వాంతర్యామీ! లక్ష్మీవల్లభా! ముక్తిదాయకా! హరీ! ఎప్పుడూ నీ పాదపద్మాల సేవా పరిమళంలో మునిగి తేలే మనస్సు కలవాళ్లు ఎంతో ప్రియమైన తమ శరీరం నశ్వరత్వాన్ని గ్రహిస్తారు. అలాంటి వాళ్లు తమ భార్యల్ని, బిడ్డల్ని మిత్రుల్ని ఇంటిని, బంధువుల బలగాన్ని మరచిపోతారు.
శుద్ధ స్వరూపుడా! పరమాత్మా! భవభయాన్ని దూరంగా తోసేవాడా! పరమముని కీర్తనీయా! అంతంలేని భాగ్యంకలవాడా! పద్మదళనయనా! లక్ష్మీనాథా! నీ స్థూలమైన విశ్వరూపం మానవులు, దేవతలు, పశువులు, జంతువులు, రాక్షసులు, పాములు, పక్షులు మొదలైన పెక్కు ప్రాణి కోటితో నిండి ఉంటుంది. ప్రకృతి, పురుషుడు వంటి సత్, అసత్ భేదాలు కలది. మహత్తత్త్వాదులకి హేతువైనట్టిది అని నాకు తెలుసును. కాని నిత్యం క్షేమదాయకం అయినదీ, ఎపుడూ ఐశ్వర్యరూపంతో ఉండేదీ, అనేక శబ్దాదుల వ్యవహారం లేనిదీ అయిన మిగిలిన బ్రహ్మరూపం గూర్చి నాకు ఏమీ తెలియదు.
యుగాంతవేళ ఈ బ్రహ్మాండాన్ని నీలో కలుపుకొని శేషుణ్ణి తోడుగా చేసుకొని ఆ శేషతల్పం పైననే పరుంటావు. యోగనిద్రాసక్తిలో ఉంటావు. బొడ్డు అనే నదిలో పుట్టిన బంగరు పద్మం దుద్దునుంచి బ్రహ్మను ఒద్దికగా పుట్టిస్తావు. ఆ పద్మం తేజస్సును బయలుపరచే బ్రహ్మ స్వరూపంలో నువ్వే ఉంటావు. ఓ శుభప్రవర్తనుడా! పద్మదళనయనుడా! నిత్య భద్రకరరూపా! అక్షీణ ఆనందరూపా! గోవిందా! నారాయణా! ముక్తిదాయకా! అట్టి నీకు నియమవంతుడనై మొక్కుతాను.
అలా యోగనిద్రలో మునిగి ఉన్నప్పటికిన్నీ జీవులకంటే వేరైన వాడవే. ఆ విలక్షణం అయిన మతిస్థితి విశేషంవల్ల మొక్కవోని స్వశక్తికలవాడవు. ఆ సామర్థ్యంచే విశ్వపాలనంకోసం యజ్ఞాధిష్ఠాతవు అయ్యావు. నువ్వు నిత్య విమోచనుడివి, నిత్యపావనుడవు, సర్వం తెలిసినవాడవు, సర్వానికి ఆత్మరూపుడవు, స్తిమితపరుడువు, మూలపురుషుడవు, ఐశ్వర్యం, ధర్మం, కీర్తి, ధనం, తెలివి, వైరాగ్యాది లక్షణాలుగల భగవానుడవు. త్రిగుణాధిపతివై వర్తిస్తుంటావు. నిర్భాగ్యుడైన జీవుడిలో ఈ గుణాలకు తావుండదు. పరస్పర విరుద్దాలైన పలుసామర్థ్యాల యొక్క కలయిక గల సర్వేశ్వరుడవు. దాంట్లో అవిద్యాదుల వరుసలు లయమవుతూ ఉంటాయి. అలాంటి సర్వవ్యాపక కారకమూ, అద్వితీయమూ, అనంతమూ, మూలభూతమూ, ఆనందమయమూ, నిర్వికారమూ అయిన పరబ్రహ్మ స్వరూపుడవు నీవు. నీకు నమస్మారం. ఓ దేవా! నిష్కాములైన వారు నిన్నే సర్వతోముఖఫలంగా భావిస్తారు. వారికి రాజ్యం మొదలయిన వాంఛలలో పరమార్థమైన ఫలం సర్వాంతర్యామివైన నీ పవిత్రపాదసేవనమే, ఇది నిశ్చయం. కాని గోవు లేగదూడను నిత్యం చనుబాలుకుడిపి, తోడేళ్లవంటి వన్యమృగాల బారినుంచి గోవును కాపాడినట్లు నీవు కాముకులైన దుఃఖితుల కోరికలు తీరుస్తుంటావు. భవభీతినుంచి వాళ్లను దూరం చేస్తుంటావు. ఇలా యథార్థసంకల్పుడు, సద్వివేకి అయిన ధ్రువుడు ఆ దేవదేవుని ప్రస్తుతించాడు. భక్తుల పై వాత్సల్యం కురిపించే ఆ భగవంతుడు ఆ స్తుతుల తనివితో ఇలా మాటిచ్చాడు.
నిశ్చితమైన నియమం పట్టినవాడా! ఓ క్షత్రియ పుత్రకా! నీ మనస్సులో అట్టిట్టాడే సంకల్పం ఏమిటో నేను పసికట్టాను. నిజానికి అది నెరవేర్చరానిదే అయినా తప్పక నెరవేరుస్తాను.
ఆ దుర్లభం ఎట్టాంటిదో విను. కేంద్రస్థానమైనగుంజ చుట్టూ తిరుగుతుండే ఎద్దు వలె గ్రహాలూ నక్షత్రాలూ తారలగుంపులూ అనే కాంతిమండలం, చుక్కలరూపు పొందిన ధర్ముడు, అగ్ని కశ్యపుడు, శక్రుడు, సప్తర్షులు ఏడుగురూ తారకలను కలుపుకుని ఒక ధ్రువకేంద్రం చుట్టువార తిరుగుతూనే ఉంటారు. ఆ భాగం మరొకరు చేరరానిది. పొందరానిది ముల్లోకాల ముంపులోనూ చెక్కు చెదరనిది, మహాకాంతిమంతమైంది 'ధ్రువక్షితి' అనే స్థానం. ఇక రాబోయే 6000 ల ఏళ్లు గడిచాక ఈ చోటును నువ్వు పొందుతావు. ఆ పదం ప్రాప్తించే లోపు నీ తండ్రి వానప్రస్థానికి వెళ్తాడు. ఆ రాజ్యాన్ని నువ్వు న్యాయవంతంగా ఆదరణీయంగా ఇంద్రియాలకు లోను గానివాడవై పరిపాలిస్తావు. నీ తమ్ముడు వేట వ్యసనంవల్ల అరణ్యంలోకి పోయి మరణిస్తాడు. అతణ్జి వెతుకులాడుతూ అతని మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్న ఆతని తల్లి ఆ అడవుల్లోకి పోయి కార్చిచ్చుల్లో చిక్కుకొని నాశమవుతుంది. అదియునుగాక,
(మూలగ్రంథాల్లో 26 వేలనియూ 36 వేల సంవత్సరాలు ధ్రువుడు రాజ్యపాలనం చేశాడని ఉంది.)
పుణ్యశీలీ! ఆ తర్వాత నువ్వు యజ్ఞశరీరధారినైన నన్ను విరివిగా దక్షిణలిచ్చే ఎన్నోయాగాలచేత యజిస్తావు. నిజమైన ప్రాపంచిక సౌఖ్యాలన్నిటిని అనుభవిస్తావు. చివరిక్షణాల్లో నన్నే మనస్సున స్మరించుకుంటావు. సమస్తజనులు చేతులెత్తి మోకరిల్లేది, ఇహలోకంలోకి మళ్లి తిరిగి రాలేనిది, ఋషిమండలంకంటే పైన ఎత్తున ఉన్న ఆ పరంధామాన్ని తగిన సమయంలో చేరుకోగలవు అని ఆ విష్ణుమూర్తి ధ్రువుడు కోరిన కోరికలను తీర్చాడు. అలా ఆ ధ్రువుడి కళ్ల ముందే గరుడ వాహనం ఎక్కి సంతోషంగా తన వైకుంఠపురికి తరలి వెళ్తాడు.
ఓ విదుర! విశిష్టచరిత! ఆ ధ్రువుడుకూడా ఆ విష్ణుపాదకమలాల మీది భక్తివల్ల ఉత్తమవరాలు అందుకున్నప్పటికీ మానసిక సంతృప్తిలేకనే తిరిగి వెల్లిపోయాడు.
ఇలా మైత్రేయముని ధ్రువుడు భక్తి యోగమార్గాన విష్ణువుచే ధన్యుడైన వృత్తాంతం అంతా పూసగుచ్చినట్టు మొదటి నుంచి చివరిదాకా విదురుడికి వినిపించాడు. అది విన్న విదురుడు అతి వినమ్రంగా మైత్రేయుణ్ణి గూర్చి ఇలా పలికాడు.
మునిశ్రేష్టా! విను. కాముకులు పొందలేనిది, విష్ణుపాదసేవకులైన మునులు మాత్రమే చేరకల్గింది అని చెప్పుకునే ఆ నారాయణుని ధామాన్ని ఎన్నో పుట్టుక లెత్తితేగాని పొందరాని ఆ విష్ణుపదాన్ని ధ్రువుడు ఒకే ఒక జన్మలోనే పొందాడు. ఆ ధ్రువుడు పురుషార్థం తెలిసినవాడు. అయినా కోరిక తీరలేదని ఎందుకు అనుకున్నాడు? అనగానే మైత్రేయుడిలా సమాధానం పలికాడు.
పుణ్యుడా! పినతల్లి తనను ఉద్దేశించి పలికిన పారుష్యపు మాటలు అనే అమ్ములు గుచ్చుకున్న మనస్సు కలవాడై వాటినే స్మరించు కోవడంచేత, 'మోక్షాన్ని కోరుకోలేక పోయాననే చింత'ను మనస్సున పెట్టుకున్నాడు.
అంత ఆ ధ్రువుడు ఇలా చింతించాడు. 'ఇంద్రియ నిగ్రహులు, మహామహిములు అయిన సనందాది మునులు అడ్డులేని భక్తితో ఏ చోటనైనా ఏ కాలంలో అయినా ఏ జన్మలోనైనా కొంతకొంతగా సంతరించి పెట్టుకున్న సమాధి యోగంవల్ల ఎవ్వరి పాదపద్మాల గురించి తెలుసు కోగల్గుతారో అలాంటి పరమేశుని, సర్వేశుని, నిర్వికారుని, అపరిమితుని, అజేయుని, ఆదిదేవుని,
నేను ఆరు మాసాలు మాత్రమే సేవించి మహాయోగసాధనతో ఆ హరి పాదపద్మాల నీడను ఆశ్రయించగలిగాను. అయినా అన్యదృష్టితోనే ఉన్నాను. అయ్యో! ఇలాంటి దురదృష్టవంతుణ్ణి నేను. భవబంధాలను తెగ్గొట్టే ఆ నారాయణుని కన్నారా చూచి అశాశ్వతమైన వరా లడిగాను. ఇలాంటి దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? తమ తమ ఉనికి పట్టుకంటే ఉచ్చదశకు చేరుకుంటా ననే అక్కసుతో దేవతలు నా బుద్దిని వ్యాకులపరిచారేమో! ఆనాటి నారదముని వాక్కులన్నీ యథార్థ మయ్యాయి. ఆ ముని మాటలు పెడచెవిన పెట్టిన నేను నీచుణ్జి. స్వాప్నికావస్థానుభూతిలో ఉన్నవాడు, దైవికమైన మాయచేత అన్యదృష్టిని పోయేవిధంగా నేనూ అపరభావం లేదని తెలిసీ అన్నదమ్ముడనే విరోధిత్వంతో వ్యథపొందాను, లోకస్వరూపుడూ, సుప్రసాదుడూ, సంసారతాపం తొలగించేవాడూ, అయిన ఈశ్వరుని కొలిచి ఆ దేవుడిదయను కూడ పొందగలిగాను. ఆయుర్ధాయం మూడిన రోగి చికిత్సను వలె ఎందుకూ పనికిమాలిన, అస్థిరమైన వరాలడిగాను అని మైత్రేయుడు చెప్పి మళ్లీ
(భేద దర్శనుడనయి : ధ్రువుడు - సవతి తల్లిమీది కోపంతో తపస్సుచేశాడు. తాను వేరు తల్లి వేరు - అనే భేదజ్ఞానం తొలగిపోలేదు. తనయందు సకలభూతములందు - ఒక భంగి అనే సమహితత్వం - ధ్రువునిలో రాలేదు. అందుకు తగ్గట్లే వరం లభించింది. అదీ ధ్రువుని బెంగ.)
మహారాజును ఆశ్రయించిన నిరుపేద మితిమీరిన అహంతో ధాన్యం గింజల్ని దానం చెయ్యమని కోరినట్లుంది నా స్థితి. మోక్షఫలాన్ని ప్రతిఫలంగా ఇవ్వగల ఆ విష్ణువే తనివితీరా ప్రత్యక్షమయ్యాడు. కాగా ఆ దేవుణ్ణి ప్రాపించికమైన కోరికలు ప్రసాదించమని వేడాను. నా వంటి వట్టి తెలివి తక్కువ దద్దమ్మ ఎవరైనా ఈ మట్టిమీద పుట్టి ఉంటారా? ఉండరని భావం.
ధ్రువుండు మరల దన పురంబునకు వచ్చుట

Sage Narada instructed the five-year-old Prince Dhruva to chant the twelve-syllabled Vishnu mantra: "Om Namo Bhagavate Vasudevaya" - ధ్రువు౦డు నారదోపదేశంబు వడసి తపంబు సేయుట
ధ్రువు౦డు నారదోపదేశంబు వడసి తపంబు సేయుట
స్వధర్మాన్ని వెల్లడింపచేసే తదేకమైన మతితో ఆ దేవుణ్ణి పూజించుకో, ఆ ఘనుడైన విష్ణుమూర్తి కన్న నీ చింతను తీర్చేవారు మరెవ్వరూ ఉండబోరు అని సునీతి తేల్చి చెప్పింది. ఆ తల్లి మాటలు నచ్చాయి. అవి ప్రయోజనవంతమైన కార్య సాఫల్యానికి మూలకారణా లన్పించాయి. తనను తానే కట్టడి చేసుకున్నాడు. పట్టణం దాటిపోయి వెళ్తున్నట్టి సమయంలో నారదుడికి ఈ విషయం మూలముట్టుగా తెలియవచ్చింది. ధ్రువుడి దగ్గరకు చేరుకున్నాడు. ఆ ధ్రువుడి అభిలషిత కర్తవ్యాన్ని అర్ధం చేసుకున్నాడు. పవిత్రమైన తన చేత్తో ధ్రువుడి తలను నిమిరాడు. అహో! తమ ఆత్మగౌరవ విఘాతాన్ని తట్టుకోలేని క్షత్రియుల తేజం చిత్రం కదా! ఈ చిఱుతవయస్సులో చిన్నతల్లి పరుషమైన మాటలకు బెంగ పెట్టుకొని ఇలా వెళ్లి పోతున్నట్లున్నాడనే భావం చాల చిత్రంగా అన్పించింది. ఓ బుడుతడా! సర్వ భోగభాగ్యాలతో నింపుగల ఇంటిని కాదని ఇలా ఏకాకిగా ఎక్కడికని పోతావు. నీకు కావాల్సిన వాళ్లు చేసిన నిరాకరణం నిన్ను బాగా దిగాలు పరచిందని నా కన్పిస్తుంది. అనగానే ధ్రువుడు ఇలా పలికాడు. సవతితల్లి పలుకులనే ములుకుల తాకిడి గాయాన్ని 'దైవధ్యానయోగం' అనే తృప్తికరమైన మందుతో మాన్పుకుంటాను అన్నాడు. ఆ వాక్కులు విన్న నారదుడు ఆ ధ్రువుడితో ఇలా అనునయంగా చెప్పాడు.
ఓ తండ్రీ! విను. నువ్వు చిఱుతడివి. ఎపుడూ ఆటలమీది అపేక్షతో మనసారా తిరుగుతూ కాలంగడిపే కుర్రవయస్సు నీది. అవమర్యాద, మర్యాదలు పట్టని చిన్నతనం నీది.
అవమానం, మానం గూర్చిన విభేదజ్ఞానం నీకీ చిన్నవయస్సులో ఉండినా ఉండవచ్చు. అయినా సుఖజీవులకు ఆ మంచిచెడు విడమరచి చెప్పే నేర్చు వారివారి పూర్వకర్మానుసారంగా తట్టుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువ సుఖాలు గాని, ఎక్కువ దుఃఖాలుగాని అవిచ్చిన్నంగా పొందుతుంటారు.
కాన వివేకి తనకు దక్కిన సుఖదుఃఖాలు ఈశ్వరాధీనం అనుకుంటాడు. ప్రాప్యమైనంతలో సంతుష్టుడవుతుంటాడు. "నీవుకూడా నీ తల్లి చెప్పినట్టి ధ్యాన యోగశాస్త్ర పద్ధతితో ప్రవర్తించి ఆ జగన్నాథుని దయను సంపాదిస్తాను" అని అంటావనుకో.
నిష్కల్మషుడా! మహా మహా యోగీశ్వరులంతా తెంపులేని భూలోకజన్మల్లో సంసారం పట్టక సదా మనన మతితోనే ఉంటారు. ధర్మబద్ధంగా శ్రద్దాళువులై యోగసాధన చెస్తారు. నిశ్చలసమాధి యోగస్థితిలోనూ ఆ దైవం తెరవును ఆ యోగులు కనుక్కో లేకున్నారు. అందువల్ల నీకు కేవలం ఆరాధన మాత్రాన ఆ దైవం శక్యుడు గాడు. ఈ అదనులో వృథా అయిపోయే ఆ యోగవిద్యాభ్యాసప్రయత్నాన్ని విరమించు. అలా కాదు ముముక్షువును కాదలచాను అంటే ఆ పూనిక పట్టు. కావడికుండలవంటి సుఖదుఃఖాలు రెంటిలో ఏది ఎంత విధివిహితంగా సంప్రాప్తిస్తుందో అంతే ఆత్మసంతృప్తితో ఈ విశ్వంలో మనగల్గినవాడు నిజమైన విజ్ఞానిగా పేరుపొందుతాడు.
ఆ విజ్ఞాని ఇంకా సద్గుణవంతుణ్లి చూసి మురియాలి. గుణవంతుడివలె నటించేవాళ్లమీద దయతలవాలి. సరిసాటి వారితో చేతులు కలపాలి. ఇలా ఉంటుండేవాడు ఆధ్యాత్మికాది కష్టాలు మూటినీ, విడనాడ గల్గుతాడు అని నారదుడు తెలియచెప్పాడు. అది విని ధ్రువుడు ఇలా అన్నాడు. ఓ పావనుడ! ఈ మెతకస్వభావం సుఖదుఃఖ పీడిత మనస్కులకు పొంద వీలుకానిదని అపారదయామయుడవైన నీనోట విన్నాను. అలాంటపుడు శత్రువులకు దడపుట్టించే రాచగుణం నాది. వినమ్రత లేక పోవడం సహజం. అలాంటి నేను సురుచి దురుసు మాటల బాణాల పెట్టువల్ల పగిలిన గుండె కలవాడను. అందువల్ల నా ఎదలో శాంతిపాఠం నిలకడగా పట్టి ఉండదు. కాన మూడులోకాల్లోకి మేల్తరమైంది, మరొకరిది కానిది, వాసయోగ్యమైనది అయిన చోటును పొందాలని ఆశపడుతున్నాను. నా కొక మంచి దోవనుచూపు. నువ్వు పరదైవం అయిన బ్రహ్మ తొడనుంచి పుట్టినవాడవు. వీణావాదనంలో బహు నేర్పరివి. ఈ లోకం శ్రేయస్సు కోసరమే సర్వం సంచరిస్తుండే అపరసూర్యుడివి అనగానే విని
నారదుడు ధ్రువుడితో మళ్లీ ఇలా అన్నాడు. ఓ పుణ్యుడ! ఓ బిడ్డ! విను. నిన్ను ఇపుడు ముక్తి పథానికి ప్రేరేపించినవాడు. ధీరోత్తములలో ముఖ్యుడైన వాసుదేవుడే
నువ్వన్నూ ఆ కీర్తిమంతుణ్ణి తెరపి ఇవ్వని తదేకమైన ధ్యానం వైపుకే మొగ్గు చూపే మనస్సుతో ఆరాధించు.
'కావాలని మనుజుడు ధర్మార్ధ కామమోక్షాలవల్ల కలిగే మంచిని నేనూ లోపల పొందాలి అని కోరుకుంటే ఆ శ్రేయస్సిద్ధికి మూలం విష్ణుపాద పద్మసేవనం తప్ప మరొక దారి కానరాదు.
గుణమనోహరా! శ్రేష్ఠయిన యమునానది ఒడ్డున మధువనం ఉంది. అది అతి పవిత్రమైంది. పుణ్యప్రదమైంది. ప్రసిద్ధమైంది. ఈ క్షేత్రం విష్ణు సన్నిధికలది. అక్కడకు వెళ్లు. నీకు శుభం కల్గుతుంది.
శుభ్రమైన ఆ యమునానది జలాల్లో మునుకలు వేసి, ఆ క్షేత్రంలోని నారాయణమూర్తికి అత్యంత శ్రద్ధతో మొక్కుకో. సంసిద్ధమైన తలంపుతో యమనియమాలను ఆచరించు.
ఇంకా నువ్వు పసివాడవు. వేదం వల్లించడం వంటి తదుచిత కర్మలకు తగని వయస్సువాడవు. అయినా కూడా నీకు యుక్తంగా ఉండే కుశలు, జింక చర్మాలను స్వస్తికం మొదలైన యోగాసనాలను ఏర్పరచుకో. తడవకు మూటి చొప్పున మూడు తడవులు ప్రాణాయామం చెయ్యి. ప్రాణం, ఇంద్రియం, మనస్సు వీటిలోని దోషాల్ని నిలుకడ లేని మనస్సువల్ల దొర్లే పొరపాట్లను తుడిపేసుకో, దిట్టపడ్డ హృదయంతో.
తన రక్షణను అర్జించి వచ్చిన వాళ్లకు మంచి దయను చూపడానికి సంసిద్ధమై ఉండేవాడు, ప్రకాశవంతమైన ముఖం, నిర్మలమైన చూపులూ కలవాడూ, కోటేరులాంటి ముక్కు వంపుదీరిన రెండు కనుబొమలు, పాలుగారే బుగ్గలూ కలవాడు, వంకలులేని చక్కనైనవాడు, ఇంద్రనీలంపు సొంపులు ఒలికే ఒంటితీరు కలవాడు, మిసమిసలాడే ప్రాయం కలవాడు, ఎర్రని కన్నులూ, పెదవులూ కలవాడు, కరుణకుకడలి వంటివాడు, ధర్మార్థకామమోక్షాలకు ఆశ్రయుడు, భక్తులకు ఆశ్రయమైనవాడు అందరి బాగు కోరేవాడు, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ఎంచబడేవాడు, యావన్మందికీ దిక్కయినవాడు, సర్వానికీ సాక్షి భూతుడు, మహా మానవలక్షణం కలిగిన పుణ్యశాలి, నీలిమబ్బు చాయవాడు, మార్పులు లేనివాడు
నూటెనిమిది పేటల ముత్యాలపేరు, మకుటం, సందికడియాలు, కడియాలు వంటినగలు దిట్టంగా తొడిగినవాడు, ఆలనలో పెనుపరి అయినవాడు, మొలకు అందం తెచ్చే మొలనూలు, చెవుల్లో నప్పిన కుండలాలు, వక్షాన ఘనంగా అగుపించే కౌస్తుభమణి ధగధగలతో మెరిసిపోతున్న కంఠహారం తాల్చినవాడు, ఉల్లాసకరుడు, మనోహరమైన శంఖం, చక్రం, గద, పద్మము పట్టిన చేతులు కలవాడు, విశ్వవిఖ్యాతుడు, పుట్టుకలేనివాడు, గుప్పున గుబాళించే వనమాలికను వేసుకున్నవాడు, అజ్ఞానాన్ని తరిమికొట్టేవాడు, పసుపు పచ్చటి కొత్తపట్టుదైన పుట్టం కట్టినవాడు, అపరంజి మంజీరాలు పెట్టినవాడు, అత్యంతమైన మంచితనం గూడుకట్టినవాడు, చూడముచ్చటైనవాడు,
మంచిభావాలు నిండిన మనస్సుకూ, నేత్రాలకూ ఉల్లాసం కలిగించేవాడూ, హృదయమనే పద్మం దుద్దులో నివసించే విరివిగా వెలుగులు చిమ్మే, పెద్ద నఖాలనే మణులు అలంకారంగాగల పదపద్మయుగళుడూ, సాటిలేని మృదుహృదయుడూ మహాపురుషుడూ.
అలాంటి పురుష పుంగవుణ్ణి ఆరాధించు. మనసులో నెలకొన్నవాడూ; ప్రీతిగల చూపుకలవాడూ; కోర్కెలు తీర్చ ఉత్తముడూ; అయిన ఆ విష్ణుమూర్తిని ఏకాగ్రచిత్తంతో నిశ్చలంగా నిలిపి స్మరించుకో, గొప్ప ముక్తి సాధనమార్గంతో తపస్సు చెయ్యి. అలా ప్రతిష్టితం అయిన ఆ దివ్యమంగళరూపం తిరుగు ముఖం పట్టదు. అంతేకాదు ఏ మంత్రాన్ని ఏడు పొద్దులు జపిస్తే ఆ దివ్యులను చూడగల శక్తి అలవడుతుందో, అలాంటిదే ఓంకారంతో కూడిన పన్నెండక్షరాల వాసుదేవమంత్రం. ఇది ఏ ప్రదేశంలో ఏ వేళలో ఎలా విభక్తమో, తెలిసిన వివేకులు అనుష్టించే మంత్రం. ఈ మంత్ర మననంవల్ల
("ఓం నమో భగవతే వాసుదేవాయ" అనేది ద్వాదశాక్షరీమంత్రం. దీనికే 'వాసుదేవద్వాదశాక్షరి' అని నామాంతరం.
గడ్దిపరకల బోలిన చామనచాయకల వాసుదేవుణ్ణి గరికపోచలతో అర్చించాలి. చక్కనైన పద్మాలవంటి నేత్రాలు కలవాణ్ణి పద్మాలతో పూజించాలి. తులసిమాలలు తాల్చే వాణ్ణి మూడాకుల తులసిరెమ్మలతో సేవించాలి. నిష్కళంకమైన చరిత్ర కలవాణ్ణి పూలమాలలతో, గరుడపక్షి రెక్కలమీద విహరించేవాణ్ణి ఆకులతో, లోకాలకు మూలదుంపవంటి పరమేశ్వరుణ్ణి వనమూలికలతో, పసుపుపచ్చటి పట్టుపుట్టం కట్టుకునేవాణ్ణి చెట్టుబెరడుపట్టలతో నేసిన నారబట్టలతోనూ, భజించాలి. మన్నుతో, రాయితో, కొయ్యతో దిద్దిన విగ్రహమూర్తుల్లో గాని, ప్రసిద్ధమైన పుణ్యతీర్థాల్లో గాని, క్షేత్రాల్లో గాని ఆ నారాయణుణ్ణి కొలవాలి.
మనస్సు నిగ్రహించుకోవాలి. మృదుస్వభావం కావాలి. సంభాషణలను కట్టడి చేసుకోవాలి. సదాచారం తెలియాలి. స్తుతిమంతుడైన హరియొక్క శ్రేష్ఠ గుణాలను అలవరచుకోవాలి. కందమూలాదులను మితంగా తినాలి. ఈ తీరుగా ప్రవర్తిస్తూ ఉండాలి.
కీర్తనీయుడైన ఆ దైవం తన ప్రకృతితో తన ఇచ్చవచ్చినట్లు అవతారాలు ఎత్తుతాడు. ఊహాతీతంగా కావించే ఆయన లీలలను మనస్సుకు పట్టెటట్లు తలంచుకోవాలి. అంతేకాదు కార్యాచరణ బుద్ధితో చేసే పూజాదిక సేవలన్నింటిని ద్వాదశాక్షర వాసుదేవమంత్రంతోనే ఆ దైవానికి పొందించాలి. ఇలా త్రికరణ శుద్దిగా చేసిన కర్మలతో గుండెల్లో నిలిచిపోయేలా భక్తి పూజలతో ఉపచరించాలి. ఆ భగవన్మాయకు లోనుకాని ఆరాధకులకు, చతుర్విధపురుషార్థాల్లో కోరింది కోరినట్టుగా ప్రసాదిస్తాడు. విరాగి అయినవాడు నిత్యం స్మరిస్తూ భక్తియోగంచేత ముక్తికోసం భజిస్తాడు అని దేవర్షి చెప్పగా విన్నాడు. ఆ ధ్రువుడు నారదుడికి, ప్రదక్షిణలు చేసి నమస్కరించాడు. ఆ తరువాత ఋషిలోకసేవ్యమైనట్టి సకలఫలప్రదమైన, ఆ పరాత్పరుడి పాదపద్మాలచే అలంకరించబడి మధువనానికి వెళ్లాడు.
బ్రహ్మకుమారుడు నారదుడు ఉత్తానపాదుడి దగ్గరకు పోయాడు. ఆ రాజుచే పరిపరివిధాల గౌరవం పొందాడు. ఎంతో తృప్తిచెందాడు. ఎత్తయిన పీటమీద సుఖోపవిష్టుడై ఆ రాజువంక చూచి
ఇలా పల్కరించాడు.
ఓ అధిపా! నీ ముఖం వాడిపోయి ఉంది. నువ్వు బాగా చిన్నబోయి ఉండడానికి కారణం ఏమిటి? అన్న నారదుడితో ఆ భూపతి ఇలా బదులు చెప్పాడు.
ఓ నారదా! మంచి వివేకం కలవాడూ, ఏ పాపం పట్టనివాడూ, ఐదేళ్ల అర్భకుడు నా ప్రియపుత్రుడు. ఆ పసివాడి మీదజాలి చూపకపోగా నేను అవమానించాను. తల్లిని తీసుకొని తాను ఎక్కడికో వెళ్లిపోయాడు.
అలా వెళ్లి వెళ్లి భయంకరమైన చిట్టడవుల్లోకి దూరి పోయి ఉంటాడు. నడచినడచి సొలసిపోయి, ఉంటాడు. ఆకలి నొప్పికి మెలికలు తిరిగిపోయి ఉంటాడు. కళకళలాడే ఆ మోము మరీ వాడిపోయి ఉంటుంది. అభం శుభం తెలియని ఆ పసివాడు తోడేళ్లు, పాములు, ఎలుగుబంట్లు, ఇత్యాది వన్యప్రాణుల వాతపడ్డాడేమోనని దుఃఖిస్తున్నాను.
ఓ మునివర్యా! అంతటి ఉత్తముడయిన నా కొడుకును నా ఒడిలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాను. నా కాంత మీది ఆసక్తితో చేసిన ఈ దుండగం నా పనే.
ఆ ఉత్తానపాదుడి మాటలు విన్నాక నారదుడు ఆ రాజుతో ఇలా అన్నాడు. ఆ విష్ణువు దేవతల కిరీటపు రత్నకాంతులతో విలసిల్లే చరణకమలాలు కలవాడు. పద్మదళనేత్రుడు. అట్టి ఆ భగవానుడు పిల్లవాణ్ణి కాపాడుతున్నాడు. సమస్తలోకాలు మెచ్చే యశస్సంపన్నుడు. శుభప్రవర్తనం కలవాడు. అయిన నీ పిల్లవాడి గురించిన దిగులు నీ కెందుకు?
ఆ మహానుభావుడు విష్ణుదేవుని సేవించి సమస్త దిక్పాలకులకూ పొందరాని నిత్యపదానికి అధీశ్వరు డవుతాడు. లోకపావనుడయిన నీ కొడుకు ప్రభావం నీకు తెలియదు రాజా!
అంతేగాక, నీ వంశప్రతిష్టను ఈ జగం అంతా యుగాంతపర్యంతం నిలుపగలడు. అతడు సద్గుణాల సముద్రుడు. నీ రాజధానికి తప్పక తిరిగి వస్తాడు. ఓ శుభచరితా! ఆ ధ్రువుణ్ణి గూర్చిన దిగులు మానుకో.
అని నారదుడు చెప్పిన మాటలమీద మంచినమ్మకం ఏర్పడింది. ఉత్తానపాదుడి మనసు అంతా కొడుకు తలపోతలతోనే నిండిపోయి రాచరికం శూన్యంగా తోచింది. రాచకార్యాలను అసలు పట్టించుకోవడం మానేశాడు.
అటు పై ఆ అడవుల్లో ధ్రువుడు పోగా పోగా అతడికి మధువనక్షేత్రం ఎదురపడింది. ఆ క్షేత్రం మునులు, దేవతలు, యోగులు స్తోత్రం చేసిన సద్గుణాలతో శుద్ధమైన చోటు. దుష్టజీవలోకమనే మబ్బుల్ని విడగొట్టే వాయువు వంటిది. సుకృతాలకు ముఖ్యస్థావరం వంటిది.
తన ముందరనే కనపడుతున్న మధువని చేరుకున్నాడు. యమునా నదిలో స్నానం కావించాడు. వ్రతం పట్టినవాడై మనసును కుదుటపరచుకుని ఆ విష్ణుమూర్తిని పదేపదే ధ్యానించాడు. మూడురాత్రులకు ఒక్కసారి వెలగ, రేగు పళ్లను వ్రతసమాప్తి ఆహారంగా తీసుకుంటూ కాలం వెళ్లబుచ్చాడు. శరీరం నిలుకడను బట్టి ఒక్కనెలపాటు ఇలాగే ఆ మధువనస్వామిని ఆరాధించాడు. ఆ పై రెండో నెల ప్రారంభంనుంచి ప్రతి ఆరుదినాలకూ ఎండుగడ్డి పరకలు, పండిరాలిన ఆకులను మాత్రమే నములుతూ ఆ నారాయణుని పూజించాడు. మూడో నెల మొదటినుంచి తొమ్మిది దినాలకొకసారి ఆ ఆకులలములు మాని జలం మాత్రమే పుచ్చుకుంటూ మాధవుణ్ణి సేవించాడు. నాల్గో నెల మొదలైనప్పటి నుంచి పన్నెండేసి దినాలకొక పర్యాయం ఆ నీటినికూడ తాగడం మాని గాలిని మాత్రమే ఆరగిస్తూ ఊపిరులను అనుకూలపరచుకుంటూ; ఆ పుండరీకాక్షుని సేవలతో తరించాడు. ఐదోమాసం రాగానే శ్వాసను బంధించి మనస్సు అలపు చెందని రీతిన ఒంటి కాలిమీద నిలబడి ఆ పరంధాముణ్ణి ధ్యానిస్తూ జీవంలేని మోడువలె కాలం పుచ్చాడు.
సర్వ సూక్ష్మ భూతాలకూ పంచేంద్రియాలకూ ఆధారమైన చిత్తంలో శబ్దాది విషయాలకు వేటికీ కుదురు కల్పించలేదు. మహత్తు మొదలైన పరతత్త్వస్వరూపాదులకు ఆశ్రయం ఇచ్చే ప్రకృతి పురుషులకు యజమానుడైనట్టి శాశ్వతబ్రహ్మ స్వరూపుడైనట్టి పరబ్రహ్మమును తన డెందంలో లగ్నం చేసుకున్నాడు. విష్ణువుకన్న మరోరూపం గూర్చిన చింతనలేకుండా తన మనస్సును ఆ పరబ్రహ్మమందే నిలిపి ఉంచాడు. ఆ ఘోరతపస్సుకి ముల్లోకాలూ గజగజలాడి పోయాయి. అంతటితో ఆగక మరింత పెచ్చుగా ఆ పిల్లవాడు నేలమీద ఒంటి కాలిమీద నిలుచుండి కాలిబొటన వ్రేలితో నొక్కుతూ ఉండగా.
అడ్డూ ఆపూలేని మదగజం పాదం మోపిన వైపుకు ఒరగిపోయే ఓడవలె నేల సగం సగంగా అటూ ఇటూ వాలిపోతూ ఊగడం మొదలు పెట్టింది.
ధ్రువుడు తదేకదృప్టితో చరాచరప్రపంచంలోని సర్వజీవుల ప్రాణాయామపు ఉనికిని పొంది ఉన్న ఆ ఈశ్వరునిలో తన ప్రాణాన్ని చేర్చాడు. ఆ ఐక్యతను పొందడానికి ఊపిరిని స్తంభింప చేసిన కారణంగా విష్ణువూ చలించిపోయాడు. ఆ సర్వేశ్వరుని చలనానికి లోకాలన్నీ తూగాడాయి.
చూపులకే జడుపు పుట్టించేలా లోకాలకు ఉప్పతిల్లిన ఆ పెద్ద ఉపద్రవస్థితిని పరికించారు దిక్పాలకులు. ఆ పాలకులంతా భయంతో గుంపుగా ఆ విశ్వశరణ్యుని దర్శించాలని బయలుదేరిపోయారు.
అలా వెళ్లి ఆ నారాయణునికి మొక్కుకుంటూ అంజలి ఘటించి ఇలా మొరపెట్టుకున్నారు.
ఓ హరీ! ఓ పరమాత్మా! కేశవా! చరాచరప్రాణికోటి శరీరాలను తాల్చిన వాడవు నువ్వే. కాని ఈ ప్రకారంగా అందరి శ్వాస ఒక్కమారుగా ఆడక పోవడం ఇంతకు మునుపు ఎన్నడూ మేం కని విని ఎరుగం. ఓ విశ్వనాథ! సర్వ శరణ్య! నీ పాదపద్మాలను అత్యంతప్రీతితో శరణు పొందుతున్నాం. ఈ మా పీడను బాపి ఆదుకోవా!
ఆ నారాయణస్వామి దేవతల మనవిని విన్నాడు. వాళ్ల కిలా ధైర్యం చెప్పాడు. ఆ బుడుతడు ఉత్తానపాదుడనే రాజుబిడ్డ. విశ్వాత్మకుడనైన నా యందు తన మనస్సును లీనం చేసి ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. ఆ ఘోరతపం మూలంగానే మీ ఊర్పుల కదలిక ఆగిపోయింది. అలా అతిక్రమింప వీలులేని ఆతడి తపస్సును వెనక్కి మళ్లింపచేస్తాను. మీ గృహాలకు మీరు వెళ్లండి అని ఆజ్ఞాపించాడు. ఆ దేవతలు ఏ జంకూ లేనివారలై ఆ విష్ణుమూర్తికి నమస్కరించి నిశ్చింతగా తమ దివిసీమకు తిరిగి వెళ్లారు. ఆ తరువాత
వాళ్లంతా అటు వెళ్లగానే నారాయణుడైన ఆ విశ్వప్రభువు, పక్షుల్లో ఉన్నతుడైన గరుడుని వాహనంగా చేసుకొని తన భక్తుడు ధ్రువుణ్ణి చూడాలని వేడుకపడి ఆ వెంటనే తిన్నగా మధువన క్షేత్రానికి కదలివెళ్లాడు. మిక్కుటం అయిన భక్తి యోగసాధనతో ధ్రువుడి బుద్ధి పదనెక్కింది. తన మనస్సనే విచ్చీవిచ్చని తామరమొగ్గలో మెరుపు మెరిసినట్లు తళుక్కుమన్న ఆ సర్వ వ్యాపకమూర్తిమత్వం అంతరాన అంతర్ధానమయింది. ఆ మరుక్షణంలోనే తన ఎదుట ప్రత్యక్షమైంది. ఆ పూర్వ, అపూర్వజ్ఞాన చక్షువులకు ఇంతదాకా పొడగట్టిన ఆ నిండు రూపాన్ని కళ్లు విప్పి తిలకించాడు. తత్తరపడ్డాడు. ఆనందబాష్పాలు రాల్చాడు. ఒళ్లంతా పులకించి పోయింది.

Story of Dhruva - ధ్రువోపాఖ్యానము
ధ్రువోపాఖ్యానము
విదురా! విను. అన్ని లోకాల రక్షణార్ధం విష్ణు అంశ కలిసిన బ్రహ్మ దేవుడికి పుట్టినవాడు స్వాయంభువమనువు. ఇతడు యశోవంతుడు.
ఆ స్వాయంభువ మనువుకి శతరూప కడుపున ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్లిద్దరూ లోకుల పొగడిక కన్నవారు. ఈ పిల్ల లిద్దరిలో ఉత్తానపాదుడు మంచిమనుగడ కలవాడు. ఇతడికి,
విదురా! విను. ఆ ఉత్తానపాదుడికి ఇద్దరు ఇల్లాళ్లు. సునీతి, సురుచి. వీళ్లల్లో ద్రువుడి కన్నతల్లి సునీతి మీద ఉత్తానపాదుడికి అపేక్ష తక్కువ. సురుచి మీద ప్రీతి ఎక్కువ. ఇలాగున ఉంటున్న సమయంలో,
(సునీతి చక్కటి నీతి మంతురాలు. సురుచి చక్కటి సొగసరి.)
ఒక దినాన ఉత్తానపాదుడు, ప్రేయసి సురుచి కన్నకొడుకును ఉల్లాసంగా తొడల మీద కూర్చోపెట్టుకుని లాలిస్తూ ఉన్నాడు. అదే వేళలో తానూ తండ్రితొడ ఎక్కాలని ఆసగొన్న ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు చూసినా, దగ్గరకు తీయలేదు. ముద్దాడ లేదు. ఉపేక్షించి కిమ్మనక ఉన్నాడు. దానితో పొగరెక్కిన సురుచి, సపత్ని కొడుకు ధ్రువుడితో ఇలా పలికింది. ఓ సవతి కొడుకా! తండ్రి తొడ ఎక్కాలని కుతూహలపడినట్లయితే విను. నువ్వు ఆనాడే నా కడుపున పడక మరొక స్త్రీ గర్భాన పడ్డావు. తండ్రి తొడ ఎక్కి కూర్చుని ఆనందించే అదృష్టం కోరుకున్నంతమాత్రాన చిక్కుతుందా?
పుణ్యాత్మా! అందుకని నువ్వు ఆ వెన్నుని పాదారవిందాల ప్రాపును విడువక పొందు. ఆ దైవం నిన్ను నా కడుపున పుట్టిస్తాడు. ఆ విధంగా వీలుపడితే ఎడతెగని సంతోషం అనుభవిస్తావు.
ఈ రకంగా పలికిన పిన తల్లిమాటలు చెవికి ఏవగింపు పుట్టించాయి. తన తండ్రి వినేటట్టుగా తననుగురించి మాట్లాడిన కానిమాటలు ఎదను కెలికి కష్ట పెట్టగా,
కన్నకొడుకునైన తనను పట్టించుకోనట్లున్న తండ్రినుండి పక్కకు తొలగాడు. కష్టాలకడలిలో మునిగివుంటూ కర్రదెబ్బ పడ్డ పెద్దపామువలె కోపంతో
పెద్దగా ఏడుస్తున్నాడు. ఆ దుఃఖానికి రెండుకళ్లనుంచి కన్నీరు బొటబొట జాలువారుతూ ఉంది. తల్లి దరికి చేరాడు. కన్నబిడ్డను చూసి తల్లి సునీతి ఎంతో ఆప్యాయంగా ఒళ్లోకి తీసుకొని ప్రేమగా మొగం అంతా అరచేతులతో అటూ ఇటూ సవరించింది. జరిగిన సంగతంతా స్త్రీలు, రాణివాసంలో ఉండే పరిచారికలూ చెప్పగా విన్నది. పెద్ద పెద్ద నిట్టూర్పులు వెంట వెంటగా నిగిడించింది. కంట నీరు పెట్టుకుని క్షోభపడిందై
సవతి సురుచి పల్కిన నిక్కుమాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంది. అలా పేర్చబడ్డ శోకాగ్నుల దొంతరలతో లోలోపల మగ్గిపోతూ కారుచిచ్చుల కాకల్లో తగుల్కొని ఆ వెలుతురులకు కమిలిపోయే మాధవీలతలాగా ఆమె కుమిలిపోయింది.
కాసేపటికే స్తిమితపడి ఆ సునీతి, తన పిల్లవాణ్ణి స్పృశిస్తూ తండ్రీ! ఏడవకు మంటూ ఊరడించి ఇలా తెలియపలికింది.
బాబూ! ఏదో నెపంగా ముందటి జన్మంలో చేసిన పాపభూయిష్ఠమైన వేదన వెనుకొని వెంటాడుతుంది. ఎట్లయినా మన ఈ వెతకు సంబంధించి బయటివారికి జంకవలసిన అగత్యం కల్గదు కదా.
కట్టుకున్న భర్త నోటను భార్య అని కాదు కదా కనీసం 'ఊడిగపుది' అనే పిలుపు కయినా నోచని దానను. భార్యగా గౌరవం పొందని నిర్భాగ్యురాల నన్పించుకోగల నా కడుపున పుట్టిన దౌర్భాగ్యానికి
ఆ సురుచి నిన్ను అన్నమాటల్లో నిజం ఉంది. నీ తండ్రి తొడలపై కూర్చోవాలనేదే నీ ఆకాంక్ష అయితే నీవు సర్వరక్షకుడగు ఆ పరాత్పరుని పాదాలు ఆశ్రయించు.
కనుక మాతృసమానురాలైన ఆ సురుచి మాటప్రకారంగానే ఆ విష్ణుని ప్రాపు చేరు అని హితవు చెప్పింది. మళ్లీ ఇలా సమర్థించి చెప్పింది.
నిజానికి ఆలోచించి చూస్తే ఈలోకాల రక్షణకోసం ఇష్టపడి సత్త్వాదిగుణరూపాల్లో గోచరమయ్యే విష్ణుని పాద పద్మాలను కొలిచి ఆ బ్రహ్మ అంతఉన్నత పదవిని అందుకోగల్గాడు. మీ తాత స్వాయంభువమనువు ఔన్నత్యం కలవాడు ప్రఖ్యాతుడు. సర్వాంతర్యామి తత్త్వప్రధానమైన ఎరుకతో ఆ విష్ణువుని సవనరూపంలో అనేక దక్షిణలతో సేవించాడు. తానుగా భూలోకస్వర్గలోక సౌఖ్యాలతోపాటు ముక్తిసౌఖ్యాన్నీ అనుభవించాడు. అటువంటి అచ్యుతుని, పరుని, యోగివర్యుల సమితిచే గాలించబడే పాదపద్మాలజంట కలవాణ్ణి, అవిరామమైన కాంతిమయుణ్ణి, భక్తులయందు వాత్సల్యంకలవాణ్ణి లోకసంధాతను ఆ విష్ణుమూర్తిని (ఆశ్రయించు)
మళ్లీ, చేత లీలాపద్మం పట్టుకొని బ్రహ్మాది దేవతలు చూస్తుండగా లక్ష్మిచేత అన్వేషింపదగిన ఆ మహావిష్ణువును

a humbled Daksha and the assembled demigods, including Brahma, worshipped Lord Vishnu to complete the rituals - దక్షాదులు విష్ణువును స్తుతించుట
దక్షాదులు విష్ణువును స్తుతించుట
బ్రహ్మాదులంతా నొసటిపై దోసిలి ఒగ్గి నమస్కరిస్తూ ఆ ఘనమూర్తి ఘనత అంతూ పొంతూ లేనిదని గ్రహించుకున్నారు. పొగడటం వాళ్లతరం కావడం లేదు. అయినా ఆ స్వామి దయామయ, దండనమయరూపాన్ని కనిపింపచేయడంవల్ల ఎవరికి తోచినంతలో వారు కీర్తించసాగారు. వాళ్లల్లో దక్షుడు పూజాపునస్కారాది అర్చనసేవలను స్వీకరింపచేశాడు. బ్రహ్మాది దేవతలందరికి పరమపిత అయిన, నంద సునందాది అనుచర భక్తశిఖామణుల సేవలు అందుకుంటున్న తన యజ్ఞానికి, యజమాని అయిన విష్ణుదేవుని శరణుకోర దగ్గవాణ్ణిగా ఊహించుకున్నాడు. ఇలా వర్ణించాడు. "ఓ దేవా! నీవు నిజరూపంలో ఉన్నప్పుడు కాలగతినిబట్టి రాగద్వేషాది మనోదశలన్నింటికీ నిత్యమూ అతీతుడుగా ఉంటావు. నీవు సాటిలేనివాడవు. అయినా ఓ పక్కన మాయను కాదంటావు. మరో వైపున మాయను అనుసరిస్తావు. పురుషరూపంలో నటించే దైవరూపంలో స్వచ్చందుడివే. అంతలోనే మాయకు పడి పోతుంటావు. అనురాగం, ద్వేషాదులు కూడిన వాడిలా రామకృష్ణాది మానవ అవతారాల్లో ప్రత్యక్షమవుతుంటావు. ఇన్ని కారణాలవల్ల ఈ విశ్వానికంతటికీ అధినాథుడివి నువ్వే. తక్క్మిన బ్రహ్మరుద్రాదులు నీ మాయలోని ఐశ్వర్యరూపులు. కనుక లోకనాథులు కారనే వేరు భావనగల నన్ను ఆదరించు. విశ్వానికి మూలకారణులయిన శివుడూ, బ్రహ్మా లోకపాలకులూ, చేతనాచేతన జీవకోటి సర్వస్వమున్నూ నీవే. నీకంటే వేరైనది మరేదీ ఈ లోకంలో ఉండబోదు", అనే దక్షుడి విజ్ఞాపనం ముగిసిన మరుక్షణాననే తక్కిన ఋత్విగాదులందరూ స్తుతించారు.
"నందీశ్వరుని శాపబద్దులమై కేవలం యాగకర్మానుసారం మసలుకునే బతుకులు మా ఋత్విక్కులవి. దానివల్ల మా వాళ్లందరం వేదం తెల్పిన ధర్మం ప్రకారం చేపట్టగల యాగాది క్రియలలోనే వర్తిస్తుంటాం. ఇంద్రుడు మొదలైన దేవతాకృతుల వంకతో వర్తించే నిన్ను యజ్ఞస్వరూపుడవనిన్నీ ఎరుగుదుము. కాకపోతే అప్రాప్యుడవే కాదు శుద్ధస్వరూపుడవని కూడా తెలుసును. ఓ లచ్చిమగడ! గోవింద! విష్ణువ! మోక్షప్రదుడ! జ్ఞానమూర్తి! నిచ్చలూ లక్ష్మివెంట విహరించేవాడ! ఇంకా ఇంకా ఆలోచించగా నెపం ఎంచలేని అందమైన నీ అచ్చమైన చేతనాతత్తాన్ని తెలుసుకోగల తెలివి మాకు లేదని తెలిసింది."
(వ్యాసభాగవతంలోనూ పోతనభాగవతంలోనూ శివుని శాపం అని ఉన్నా శ్రీధరుడూ మొదలగు వ్యాఖ్యాతలు నందీశ్వరుడని చెప్పారు. నందీశ్వరుడు శివస్వరూపుడని తెలుస్తూ ఉంది.
సభాసభ్యులు ఇలా అన్నారు. "భక్తిపరులయందు దయకల ఓ దేవా! సంసృతిసరణి, 'దుఃఖం అనే కారుచిచ్చుకాకలతో ఎపుడూ కలవరపెట్టుంది. కడు తిప్పలనే కోటలతో దాట నలవి కానిది, యముడనే పెద్దపాముతో కూడుకొని ఉంది. పాపపు పనులనే పులులతో కమ్ముకుని ఉంది. గొప్పసుఖాలు గొప్పదుఃఖాలు అనే గరళంతో నింపిన చెలమలు కల్గిఉంది. ఇలా ఏ అండాదండాలేని ఈ సంసారంలోబడి మోటుజనులు తిరుగుతుంటారు. ఎండమావుల్లా ఆశపెట్టే ఇంద్రియరూప భోగాలన్నిటిని అహంకారహేతువైన ఒళ్లు, మమకారహేతువైన ఇల్లు అనే పెద్ద బండరాళ్లను మోస్తూ ఉంటారు. ఆ మొరకులు నీ పాదపద్మాలను ఎప్పటికి చూడగలుగుతారో కదా!"
శివుడు ఇలా అన్నాడు. "వరదాయకా దేవా! కోరికలులేని యోగులచే పూజింపబడినవాడా! నేను నీ పాదపద్మాలను నా ఎదలో ఎల్లపుడూ నిలుపుకుంటాను. భగవానుడవైన నీ నుంచి సర్వవాంఛలను పుచ్చుకునే స్ఫూర్తి కలిగిన నన్ను పరమమూర్ఖులు 'సదాచారభ్రష్టుడు' అని నిందిస్తుంటారు. ఆ మాటలను నేను నీ మీది అపేక్షవల్ల పట్టించుకోను.
పద్మగర్భుడా! నీ మాయ అతిగా కమ్మిన మనస్సులు కలవారై నీ గొప్ప తత్వమహిమను పాటించిన బ్రహ్మాదిదేవతలు దేహధారులై ఆ తత్త్వజ్ఞతను అర్ధం చేసుకోలేనివారై నిన్ను చూడలేకపోతున్నారు. తామరసాక్షా! నువ్వు నీ చూపులతోనే భక్తులసంకటాలను హరించగల గొప్పవాడవు. ఎప్పటికీ తరుగని పరమసంతసాన్ని సంఘటింప చేసేందుకు నన్ను అనుగ్రహించవలసింది."
బ్రహ్మ ఇలా అన్నాడు. "జోలి కల్పించుకొని వస్తుతారతమ్యాది విశేషాలను గుర్తించే కళ్లు మొదలైన ఇంద్రియాలతో వరుసగా అతికష్టం మీద నీరూపం గోచరిస్తుంది. ఆ రూపం, మాయామయమైనది. అది లేనిది ఉన్నట్టుగాను, జ్ఞానానికి పదార్థానికి మూలమైన సత్వాది త్రిగుణాలకు ఆశ్రయమైనట్టిదిగానూ ఒప్పుతుంటుంది. దీటు లేని రూపం నీ కంటే వేరై ఉంటుంది. అని చెప్పుకుంటూ నాకు నేను గుర్తు చేసుకుంటుంటాను. మానసిక శారీరక పరిణామాలు పొందనివాడా! పరమాత్ముడా! కళంకంలేనివాడా! నిక్కు లేనివాడా! చేయని సంకల్పం కలవాడా! మలినం తాకనివాడా! జనంచే పిలువదగ్గవాడా! శ్రేష్టుడా! వేదాలవల్ల తెలియదగ్గవాడా! రమ్యమైన ఆనందరూపుడా! భవభయ విదూరా!"
ఇంద్రుడిలా పలికాడు. "దైవమా! విష్ణువా! దైవతోత్తమా! నీ మేను దైత్యజాతి సంహారంకోసం ఆయుధాన్ని చేపట్టిన ఎనిమిది బాహువులతో గూడి నీ దేహం మెరుస్తూ ఉంటుంది. అది యోగిజనుల అంతరంగప్రేమకు నిధానమైనట్టిది. విపులమైన విశ్వంవలె కల్ల కానిది, సత్యమైనది, శాశ్వతమైనది అనే యావతో యోచిస్తుంటాను."
(శ్రీమహావిష్ణువు యొక్క ఎనిమీది చేతుల్లోని శత్రు సంహారక సాధనాలు. 1.శంఖం 2.చక్రం 3.డాలు 4.ఖడ్గం 5.గద 6.బాణాలు 7.చాపం 8.పాశం.)
ఋత్విక్కుల భార్యలు ఇలా అన్నారు, "చ్యుతిలేని ఓ విష్ణు! కావాలని నీ పాదసేవకోసమే ఇలా ఈ యాగం అప్పట్లో దక్షునిచే కూర్చబడింది. శివుడి ఆగ్రహంవల్ల అదంతా వల్లకాడయి నాశనమై పోయింది. పూర్తిగా నిలిపివేసిన బలికర్మలతో ఉత్సవకళ తప్పిపోయింది. నీ కాంతిమంతమైన నేత్రాలతో స్పష్టంగా ఒక్కమారు తేరిపార పరికించు. అది తప్పక పవిత్రకర్మగా ప్రకాశిస్తుంది."
ఋషు లిలా కీర్తించారు. "ఓ సుకృతుడా! లక్ష్మీపతీ! విను. నువ్వూ మా లోకుల వలెనే పనులు తలపెడుతూ ఉంటావు. కాని ఆ పని ఫలితాన్ని పొందవు. ఈ లోకంలో నువ్వు తప్ప మిగతావాళ్లు ఐశ్వర్యం కోసరం ఎల్లకాలం లక్ష్మిని అవలంబిస్తుంటారు. అలాంటి లక్ష్మి చాలఇష్టంగా నీ చెంతకు చేరితే నువ్వు సమ్మతించవు. ఓ గోవిందా! ఓ పద్మగర్భా! నీ ప్రవర్తనం గురించి మేం ఏమనగలం?"
సిద్దు లిలా ప్రార్ధించారు. "ఓ విష్ణూ! మా మనస్సనే మదపుటేనుగు సంసారపీడ అనే దారుణమైన కార్చిచ్చుతో కాలి పోయింది. దప్పికతో అల్లల్లాడింది. మంగళకరమూ పరిశుద్ధమూ అయిన నీ గాథలనే అమృతప్రవాహాల్లో మునిగింది. భవతాపాన్ని తోసేసుకుంది. పద్మగర్భా! పరమాత్మ సాక్షాత్కారం పొందిన నిర్వికారచిత్తుడివలె ఆ మనస్సు తిరిగి వెనక్కి మళ్లిపోదు."
యాగ యజమాని ప్రసూతి ఇలా అంది. "చేతులూ, కాళ్లూ వంటి అంగాలు అన్నీ పొందికగా ఉన్నా తలకాయ లేని మొండెం జీవనానికి తగనిదే అవుతుంది. పూజాద్రవ్యాది యాగాంగాలు ఎన్నో ఉన్నాా శీర్షప్రాయుడవైన నువ్వు లేని యజ్ఞం అందగించదు. ఈ అవసరంలో నువ్విటుగా విచ్చేయడం చాలామేలు అయింది. లక్ష్మీ ప్రియునిగా భక్తురాండ్రమైన మా అందరినీ ఆదుకో.
(యాగోపకారకాలైన దర్శపూర్ణమాసాదులకు ఒక అంగం ప్రయాజం. ఇది అయిదువిధాలు. ప్రయాజాద్యంగాని సమిధోయజతి, ఇడాంయజతి, వహ్నిర్యజతి, తనూనపాతం యజతి, స్వాహాకారం యజతీతి పంచ విధాని (దీపికా).
దిక్పాలకులు ఇలా సన్నుతించారు "దేవరలకు తొలిదేవరా! కంటితో కానగల సహజస్థితి కలిగి, ఎంతో సువిశాలమైన ఈ సమస్తవిశ్వానికి సాక్షిభూతమైన ప్రాణిస్వరూపుడవు నువ్వు నీ బహిర్ముఖాలైన నామరూపాలతో మా నేత్రాది ఇంద్రియాలచేత ఓ దేవ! కపటాన్ని పులుముతుంటావు. పంచభూతాత్మకమైన జీవి వలెనె మాకంటికి అగపడుతుంటావు. కాకపోతే తద్భిన్నమైన నీశుద్ధ సత్త్వమూర్తిమత్వంతో మాత్రం మాకు గోచరించవు. ఓ పరబ్రహ్మమా! శాశ్వతసంతోషసంధాయీ!, గోరక్షకా! అలాకాక గోచరించేట్టు కటాక్షించినట్లయిన మా బోటివాళ్ల బతుకులు ఉపమించుటకేమి మిగిలిఉంటాయి. ఎల్లప్పటికీ మాకు అగోచరుడవనే బుద్ధితోనే జీవిస్తుంటాం సుమా!"
యోగిపుంగవులు ఇలా పలికారు. "ఓ పరబ్రహ్మరూపా! దయామయుడా! లక్ష్మీపతీ! పుండరీకాక్షా! ఎల్లప్పుడు సమస్తలోకాలనూ రక్షించేవాడా సమస్త విశ్వంయొక్క సృష్టి స్థితి లయలను చేస్తున్న కారణంగా దైవీశక్తితో సత్వరజస్తమో గుణాలతో కూడిన నీ మాయచే బ్రహ్మ శివుడు మొదలగు అనేక భేదాలను పొందుతావు. అయినా, నీవు ఎప్పుడూ స్వస్వరూపంలోనే ఉంటావు. నీవు సర్వమోహాలను విడిచిన వాడవు కదా! అట్టి నిన్ను అనన్యభక్తితో దాసభావంతో ప్రేమతో ఆరాధించే మమ్మల్ని రక్షించు."
శబ్ద బ్రహ్మ(వేదపురుషుడు) ఇలా అన్నాడు " ఓ వెన్నుడ! నీ నిజసంగతినిశ్రద్ధగా సవ్యంగా ఆకళించుకోవడానికి నేనే కాదు బ్రహ్మా శివుడూ, ఇతరులూ శక్తిచాలని వారలే. నువ్వు సత్త్వగుణానికి ప్రాపు అయిన వాడవూ తద్విలక్షణుడవూ నిర్గుణుడవున్నూ అయిన పరబ్రహ్మ తత్త్వానివి. ధర్మార్ధ కామ మోక్షాలను కటాక్షించేవాడా! నీకు ప్రతినిత్యమూ ఇందరము జోతలుపెడ్తూ ఉన్నాం. మమ్మల్ని కరుణించు."
అగ్నిదేవుడు ఇలా అన్నాడు "ఓ హరీ! నువ్వు యాగ రక్షణకార్యాన్ని నీ కనుసన్నతో శ్రద్ధతో నడపుతుంటావు. యాగాగ్నులను అయిదు విధాలుగా సృష్టించావు. పూజకు అయిదు మంత్రాలను సృజించావు. వీటి హోమాలతో ఒప్పే యాగమూర్తివి నువ్వు. నీకునా మొక్కులు. నీ ప్రదీప్తిని పుచ్చుకొని నీ నియోగంతో హవ్యవాహుడిగా భూతలంలో యాగాదులను, దేవతల కందిచ్చే హవ్యాన్ని స్తోత్రసముదాయాలను పొందుతాను.
(పంచాగ్నులు : 1. గార్హపత్యం, 2. ఆహవనీయం, 3. దక్షిణాగ్ని, 4. సభ్యం, 5. ఆవసథ్యం)
దేవతలు ఇలా అన్నారు "గతంలో ప్రళయం ముగిసేవేళ మిగిలిన సర్వజగత్తునూ నీ కడుపులో పదిలపరిచావు. నువ్వు ఒక్కడివిగా ఉన్నపుడు పాలసముద్రంలో శేషశయ్యమీద పవలించావు. జనలోకానికి పైలోకంలో ఉంటున్న సిద్ధజనులు నీ సృష్ట్యవయవ భూతపదార్థ శైలిని పదే పదే ధ్యానించారు. శ్రీకాంత! దైవశ్రేష్ఠమా! అప్పటి నీ ఆదిదేవస్వరూపాన్ని ఈ దినం మాకు సాక్షాత్కరింప చేశావు."
గంధర్వులు ఇలా వినుతించారు "పద్మలోచనా! లక్ష్మీమనోవల్లభా! దేవా! ఈశ్వరా! దేవాధీశా! శివుడు, బ్రహ్మ మొదలయిన దేవతలు, మరీచి మొదలయిన ప్రజాపతులు, నీ అంశలోని భాగాలై జన్మించినవారే. నీ విలాసమైన ఈ బ్రహ్మాండాన్ని రక్షించు. నీకు ఎంతో భక్తితో కైమోడ్పులు చేస్తున్నాము. మమ్మల్ని ఏలుకో."
విద్యాధరులు ఇలా అన్నారు "ఓ పుండరీకాక్ష! జీవుడు నీదైన అవిద్యా ప్రకృతికి లోబడి శరీరం పొందుతాడు. ఆ శరీరంపై నేను, నాది అనే తగులమును ఏర్పరచుకుంటాడు. పెళ్లాం, పిల్లలూ, ఇల్లూ, పొలం, చుట్టం పక్కం, డబ్బూ, గొడ్డూ వంటి విషయ వాంఛల పరంపరలో కలయడం, వీడడం వంటి పీడలు పొందుతుంటాడు. ధైర్యం లేని వాడవుతాడు. అశాశ్వతమైన ఇంద్రియార్థాలపట్ల వల్లమాలిన అపేక్ష కలవాడవుతాడు. ద్రోహబుద్ధి అతిశయించిన వాడవుతాడు. అలాంటి మనిషికూడ, దయ గూడుకట్టుకున్నవాడా! లక్ష్మీ మనోహరా! కోరి మరీ నీ నైజాన్ని తెలిపే గాథలకు పరవశుడయితే ఇంతకాలం నుంచి కల్గిన ఒంటిమీది వలపును వదల్చుకో గల్గుతాడు. ఆ ఇచ్చ విశేషజ్ఞానం మీదికి మళ్లి సాధువర్తనుడవుతాడు."
బ్రాహ్మణప్రజలు ఇలా ప్రణమిల్లారు, యజ్ఞం, దేవతల కీయదగ్గ అన్నం, అగ్ని సంహితలూ, సమిధలు, కుశలూ, యాగపాత్రలూ, యజ్ఞవిధి పరీక్షాధికారులు, యాగకర్మలు చేసే బ్రాహ్మణులు, యాగయజమాని, యజమానిభార్య, దేవతలూ, అగ్నిహోత్రాలూ, స్వధాదేవీ, సోమరసం, నేయి, బలిపశువూ ఈ అన్నింటి రూపమూ నువ్వే పూర్వకాలాన (స్వాయంభువ మన్వంతరం తొలినాళ్లలో) యజ్ఞవరాహస్వామి స్వరూపాన్ని వహించావు. కర్రలవంటి కోరలచే అట్టడుగులోకానికి పోయిన భూమిని 'పెద్ద ఏనుగు పద్మాన్ని ఎత్తి పట్టినట్టు నువ్వు ఎత్తిపట్టావు. అలాంటి యోగి సముదాయంచే కీర్తించబడేవాడివి, యాగరూపుడవు. యాగకర్మ సంకల్పరూపుడవున్నూ అయిన నువ్వు, చేజారిపోయిన మా యాగకర్మాచరణలు, సవ్యకర్మాచరణలు సంపూర్తికావాలని వేడుకపడుతున్న మమ్మల్ని కనికరించు. నీ నామసంకీర్తనల చేతనే యాగంలో ఎదురైన అడ్డంకులన్నీ నశించి పోతాయి. అంతటి మహిమాన్వితుడవైన నీకు మా జేజేలు.
ఈ ప్రకారాన యాగపాలకుడిగా విష్ణుమూర్తిని అన్ని రకాల ప్రజ శ్లాఘించింది. శివుడి అవరోధంవల్ల ఆగిపోయిన దక్షయాగాన్ని ఎంతో పెద్దఎత్తున ఏ లోటూ వాటిల్లని విధంగా శ్రీహరి కొనసాగింప చేశాడు.
ఈ జగం అంతటికి ఆత్మరూపుడు తానే కావడంవల్ల ఆ విష్ణుమూర్తి హవ్యపదార్థాలన్నిటిని భుజించేవాడు అయినప్పటికిన్నీ తనకు కేటాయించిన త్రికపాల పురోడాశమంత్రభాగంతోనే తృప్తి పడ్డాడు. దక్షుణ్ణి ఇలా పల్కరించాడు.(యజ్ఞంలో విష్ణువును ఉద్దేశించి సమర్పించే దానిని త్రికపాలపురోడాశం అంటారు.)
ఓ పూజ్యుడ! దక్షా! నేనూ, బ్రహ్మా శివుడూ ముగ్గురం ఈ విశ్వానికి మూలం, అందులో నేను దొరను. నేను కర్మ సాక్షిని. నేను స్వయం ప్రకాశుణ్జి. నేను సత్త్వరజస్తమోగుణాత్మకమైన మాయలోకి ప్రవేశించి సృష్టి స్థితి, లయాలకు మూలభూతమైన ఆ యా యాగకృత్యాలకు తగ్గట్టుగా బ్రహ్మ శివాదిపేర్లను పొందుతుంటాను. అలా ఏకరూపమైన బ్రహ్మరూపుడను నేను. నాలోని బ్రహ్మా శివుడూ ఇతరజీవ సమూహాన్ని అవివేకి నాకంటే ఇతరం అనుకుంటాడు. మానవుడు చేతులూ కాళ్లూవంటి అవయవాలను తన దేహంకంటే వెరైనవని ఊహమాత్రంగా కూడా ఎలా తలవడో ఆ రకంగానే నా భక్తుడు నా లోనిప్రాణి సమూహాన్ని విడిగా యోచించడు. కనుక మా ముగ్గురిని ఏకరూపంగా ఎంచేవాడు ధన్యజీవి అని చెప్పగానే దక్షుడున్నూ,
విష్ణువు పలికిన మాటలు విని, ఆ యాగం 'విష్ణుదేవత'కు సంబంధించిన మూడు కపాలాల పురోడాశంతో కూడుకున్నది అనే తెలివిని పొంది, దానికి తగ్గట్టుగా ఆ విష్ణుమూర్తి చరణారవిందాలను ఎడతెగని భక్తిభావంతో, సేవించుకున్నాడు.
(కపాలం అంటే యజ్ఞపాత్ర, పురోడాశం అంటే పిండితో తయారుచేసిన హోమద్రవ్యం.)
అంగయాగం, ప్రధానయాగం అనే రెండు యాగాలతోనూ దేవతలను పూజించాడు. పవిత్రయాగకర్మయొక్క శిష్ట భాగంతో శివుణ్ణి ఇష్టంగా కొలిచాడు. తదాసక్తంగా 'సమాప్తి ఇష్టి' కర్మ ఉదవసానాన్ని ముగించాడు. తాను, ఋత్విక్కులూ సోమపానం చేసిన వారితోనూ కలసి అవభృథస్నానాలు కానిచ్చాడు. ఇంత పూనికవల్ల సిద్ధించిన సమస్త కార్యాలవల్ల కోరికలు తీరిన దక్షుణ్జి 'ధర్మమతితో ఆనందంగా జీవనం సాగించు' అని దీవించి దేవతలు, ఋత్విక్కులు, బ్రాహ్మణులు వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. విష్ణువూ, శివుడూ తమ తమ భవంతులకు తరలిపోయారు.
ఆ తర్వాత దక్షుడి కూతురు సతీదేవి తన ముందటి శరీరాన్ని వీడింది. హిమవంతుడికి మేనకాదేవి గర్భాన మళ్లీ పుట్టింది. ప్రళయకాలంలో భగవంతుడిలో లీనమై ఆదమరచి నిద్రించిన శక్తి, సృష్టి ఆరంభ సమయంలో భగవంతుణ్ణి చేరుకునే విధంగా ఇదివరలో తనపెనిమిటి అయిన శివుణ్ణి తిరిగి పరిణయమాడింది. దక్షుడి యాగాన్ని ప్రధ్వంసం చేసిన శివుడి జీవనగాథ నంతా పూర్వం బృహస్పతి తన వద్ద విద్యనేర్చిన ఉద్ధవుడికి చెప్పాడు. ఆ ఉద్ధవుడు నాకు వినిపించాడు. నేను నీకు చెప్పాను. అని మైత్రేయుడు చెప్పి మళ్లీ విదురుడితో ఇలా చెప్పసాగాడు.
ఇంతదాకా చెప్పిన ఈ కథను చదివిన మతిమంతులకూ, చెవిన వేసుకున్న విద్వాంసులకూ సంపదలు, ఆయుస్సు, యశస్సు లభిస్తాయి. పాపాలు తొలగిపోతాయి. సంసారపు కట్టు ముళ్లన్నీ విడిపోతాయి.
మైత్రేయుడు ఆ కథనంతా విన్పించి మళ్లీ ఇలా ప్రారంభించాడు, విదుర! ఈ మాటవిను. సనకమహర్షి మొదలైన వాళ్లూ, నారదుడు, హంసుడు, అరుణి, ఋభుడు, యతి అనే వాళ్లూ బ్రహ్మ కొడుకులు. కాని వాళ్లంతా గృహస్థాశ్రమం స్వీకరించని ఆజన్మ బ్రహ్మచారులు. కనకనే వాళ్ల వంశ పరంపర కొనసాగలేదు.
ఇంకనూ అధర్ముడికి మృష అనే అంగన గర్భాన దంభుడు, మాయ అనే స్త్రీ పుట్టారు. ఈ అధర్ముడి బిడ్డలిద్దరూ జంట అయ్యారు. వీళ్లను నిస్సంతువైన నిరృతి పెంచుకున్నాడు. ఈ దంభు మాయ అనే దంపతులకు లోభుడు అనే అబ్బాయి, నికృతి అనే అమ్మాయి పుట్టారు. వాళ్లిద్దరూ జత అయ్యారు. ఈ దంపతులకు క్రోధుడనే కొడుకు, హింస అనే కూతురూ కలిగారు. ఈ అన్నా చెల్లెళ్లూ ఆలూమగలయ్యారు. వీరి దాంపత్యానికి కలి, దురుక్తి అనే పిల్లలు పుట్టారు. ఈ ఇద్దరూ భార్యాభర్త లయ్యారు. ఈ దంపతులకు భయం, మృత్యువు అనే సంతానం కల్గింది. వీళ్లూ జోడుకట్టారు. వీరికి యాతన, నిరయం అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. వీళ్లంతా వంశపరంపరకు కుదురు అయిన అధర్ముడి వంశవృక్షానికి శాఖలుగా ఒప్పారు. శుభం కోరే ప్రతి మనిషి కించిత్తుకూడా ఈ పద్ధతిని అనుసరించకూడదు. ఈ తీరున ప్రతిసర్గనూ సారవంతంగా కుదించి నీ చెవిని వేశాను. ఈ పుణ్య కథను మూడుసార్లు విన్నవాడు ఎవ్వడైనా పాపం తొలగిపోయిన వాడవుతాడు. అని కథా సారాంశం చెప్పాడు. తిరిగి మళ్లీ ఇలా అందుకున్నాడు. (ఇది ఫలశ్రుతి)

Amalaki Ekadashi - అమలక(అమలకి) ఏకాదశి
అమలక(అమలకి) ఏకాదశి
ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. దీనిని ఉసిరి ఏకాదశి మరియు రంగభరీ ఏకాదశి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం, విష్ణువు స్వయంగా ఉసిరి చెట్టులో నివసిస్తాడు. అందుకే ఆమలకి ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువుతో పాటు ఉసిరి చెట్టును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏకాదశి నాడు శ్రీ హరికి ఉసిరికాయను నైవేద్యంగా పెడితే మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

దీన్ని ఉత్తర భారత్ లో రంగభరీ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడు, రాధాతో కలసి హోలీ ఆడతారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే అక్కడ విగ్రహాలను ప్రత్యేకంగా రంగులతో అలంకరిస్తారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.
ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణగాథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాలలో. ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వటమే కాదు శారీరికంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పదిహేను రోజులకొకసారి ఒక రోజు మొత్తం ఏమి తినకుండా ఉండటం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి, ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. విష్ణు మూర్తి ఈ రోజు ఉసిరి చెట్టులో కొలువుతీరి ఉంటాడని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాదు లక్ష్మి దేవి, కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసముంటారని ప్రతీతి. రాధా కృష్ణులు కూడా హోలికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణగాథలు చెపుతున్నాయి.
ఈ ఏకాదశికి సంబంధించిన కథని చూసినట్లయితే చిత్రసేనుడు అనే రాజు, ఆ రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారట. ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేన మహారాజు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకుంటాడు. వాళ్ళు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకొని వెళ్తారు. స్పృహతప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహం లో నుండి ఒక కాంతి పుంజం బయటకి వచ్చి ఆ రాక్షసులని హతమారుస్తుంది. కొద్ది సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసులని చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నువ్వు సురక్షితంగా రక్షించబడ్డావు అని ఆకాశవాణి పలుకుతుంది. ఇది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జైజైలు కొట్టి అప్పటినుంచి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఒకే ఉసిరి చెట్టు కింద ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించారు.
ఈ ఏకాదశి రోజున భక్తీ శ్రద్ధలతో ఉసిరిచెట్టుని పూజించిన వారికి సకల సంపదలు కలిగి, దేహాన్ని విడిచాకా మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అవకాశం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా, ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేష ఫలితాలు లభిస్తాయట. మనం కూడా ఆ నారాయణుడి కృపకి పాత్రులం అవుదాము.
ఈ కథ యొక్క రూపాంతరం బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ ఋషి చెప్పినట్లుగా కనిపిస్తుంది . వైదిస రాజు చైత్రరథుడు మరియు అతని పౌరులు విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందారు. ఒకసారి, అమలకి ఏకాదశి నాడు, చైత్రరథుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని విష్ణువు మరియు ఉసిరి చెట్టును పూజించారు. అతను విష్ణువు యొక్క ఋషి-అవతారమైన పరశురాముడిని కూడా పూజించాడు. భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని ఉండి, విష్ణువును స్తుతిస్తూ భజనలు (భక్తి గీతాలు) పాడుతూ ఉన్నారు. ఆకలితో ఉన్న వేటగాడు ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు. ఫలితంగా, అతని మరణం తరువాత అతను వసురథ రాజుగా పునర్జన్మ పొందాడు. ఎలాంటి కోరికలు లేకుండా మరియు స్వచ్ఛమైన భక్తి లేకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం తదుపరి జన్మలలో విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.

తదుపరి జన్మలో 'బలవంతుడు మరియు నిర్భయుడు అయిన రాజు వసురథుడు సూర్యుడిలా ప్రకాశవంతంగా, చంద్రుడిలా అందంగా ఉండేవాడు. బలంలో, అతను శ్రీ విష్ణువులా, క్షమాగుణంలో భూమిలా ఉన్నాడు. దానగుణం మరియు సత్యసంధుడు అయిన రాజు వసురథుడు నిరంతరం పరమాత్మ శ్రీ విష్ణువుకు ప్రేమపూర్వక భక్తితో సేవ చేసేవాడు. అతను వేద జ్ఞానంలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. రాచ వ్యవహారాల్లో చురుకైనవాడు, తన సొంత పిల్లలలా తన ప్రజలను చూసుకోవడంలో ఆనందించాడు. అతను అహంకారాన్ని ఇష్టపడలేదు మరియు దుష్టులను ధర్మవిరోధులను క్షించించేవాడు. అతని దానధర్మాలు అంతే లేదు'.
"ఒకసారి, అరణ్యంలో వేటాడుతుండగా, వసురథుడు దారి తప్పిపోయాడు. చుట్టూ తిరుగుతూ దారి తెలియక అలసిపోయాడు. అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఇంతలో, కొంతమంది ఆటవికులు అక్కడికి వచ్చారు. రాజుతో శత్రుత్వం కలిగి ఉన్న వారు, అతన్ని చంపడానికి పూనుకున్నారు.
తదుపరి నిద్రలో ఉన్న వసురథుడిని చంపడానికి ప్రయత్నించగా వారి ఆయుధాలు ఏవీ నిద్రిస్తున్న రాజును తాకలేకపోయాయి. అంతేకాక వారు వారి శక్తిని కూడా కోల్పోయారు. శక్తిని కోల్పోయి జడులుగు కదలలేని స్థితికి చేరుకున్నారు.
'అకస్మాత్తుగా, అలంకరణలతో ప్రకాశిస్తూ, అద్భుతమైన సువాసనను వెదజల్లుతూ, మెడలో అద్భుతమైన పూలమాలతో, తీవ్రమైన కోపంతో కనుబొమ్మలు, మరియు మండుతున్న ఎర్రటి కళ్ళు కలిగిన ఒక అందమైన స్త్రీ రాజు శరీరం నుండి దూకింది. ఆమె మృత్యువు స్వరూపంలా కనిపించింది. ఆమె మండుతున్న చక్ర చక్రంతో, ఆమె రాజును చంపాలని ప్రయత్నించిన ఆటవికులను తుదముట్టించింది'.
'రాజు మేల్కొని తన చుట్టూ పడి ఉన్న ఆటవికులు మృతదేహాలను చూసి ఆశ్చర్యపోగా, అశరీర వాణి పలికి జరిగినదంతా వివరించి " రాజా వసురథ నీ పూర్వజన్మ పుణ్యం వల్ల దేవాదిదేవుడైన శ్రీ కేశవుడు. తనను నమ్మి కొలిచే భక్తులను సదా రక్షిస్తుంటాడు!" అని పలికింది. అంత వసురథడు సంతోషించి కేశవుడు, మాధవుడు గోవిందుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువును తలచుకొని స్తుతించాడు.
“అతను తన రాజధానికి తిరిగి వచ్చి ఇంద్రుడిలా ఎటువంటి అడ్డంకులు లేకుండా పరిపాలించాడు. ఇది పురాణ కథ.
ముఖ్యంగా శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం తులసీమాలలతో పూజించుకొవాలి. దీనితో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకొవాలి. విష్ణు సహస్రనామా పారాయణలు చేయాలి. ఈరోజు చాలా మంది నదీస్నానాలు చేస్తారు. దీనితో పాటు అన్నార్థులకు అన్నదానం, వేసవి నేపథ్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి.
నెయ్యితో దీపారధన చేస్తే మంచిది. నవగ్రహాల దోషాల పరిహరంకు ఏడు శనివారాల వ్రతంను ఆచరించాలి. ఆవుకు ఏదైన గ్రాసం పెట్టాలి. శునకాలకు, చీమలకు ఏదైన ఆహరం పెట్టాలి. ఈ రోజున క్షవరం, గోర్లను తీసుకొవడం వంటివి చేయకూడదు. రోజంతా ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తు ఆయనను శక్తిమేరకు పూజించుకొవాలని పురాణ ప్రవచనం.
నిత్య స్తోత్రావళి
పంచాంగం
నిత్య స్తోత్రావళి
పంచాంగం
Shiva was implored by deities to restore Daksha - ఈశ్వరుండు బ్రహ్మాదులచే. బ్రార్థితుండై దక్షాదుల ననుగ్రహించుట
ఈశ్వరుండు బ్రహ్మాదులచే. బ్రార్థితుండై దక్షాదుల ననుగ్రహించుట
అని ఇలా చతుర్ముఖుడు అననయిస్తూ శివుణ్ణి వేడుకున్నాడు. ఆ వెంటనే శివుడు ఎంతో ఆనందపడి చిరునవ్వు చిందిస్తూ ప్రసన్నంగా ఇలా మాట్లాడాడు. హరిమాయలో పడిన అమాయకులు మళ్లీ మళ్లీ చేసే తప్పుల మీది తప్పులను నేను ఎప్పుడూ మనస్సున పెట్టుకోను.
(ఇందుమౌళి: చంద్రుడు సిగయందు కలవాడు - శివుడు.)
అలా తలంచనప్పటికిన్ని బలవంతులను శిక్షించడం, బలహీనులను రక్షించడం న్యాయమార్గం. కాబట్టి దుష్టుల తప్పులను బట్టియే నేను పట్టుబట్టి దండన విధిస్తూ ఉంటాను.
తల కాలిపోయి మొండెం మాత్రంగా ఉన్న దక్షుడు గొర్రెముఖం పొందుతాడు. భగుడు దర్భసంబంధి యాగాంశాన్ని అంది మిత్రుడని పిలిచే కంటితో మిగతా యాగాన్ని చూస్తాడు. పూషుడు పిండి ఉండలను యాగకర్తదంతాలతో తింటాడు. యాగశేషభాగాన్ని దేవతలు నాకు ఒప్పగించడం వల్ల దేవతలందరూ యథావిథిగా సంపూర్ణ దేహులవుతారు. విరిగిన అవయవాలుగల ఋత్విక్కులూ, ఇతరులూ అశ్వినీదేవతల భుజాలతోనూ, పూషుని చేతులతోనూ తిరిగి తమ తమ బాహువులనూ చేతులనూ పొంది జీవవంతులవుతారు. భృగుముని మేక మీసాలూ గడ్డాలూ పొందుతాడు. అని చెప్పిన శివుడి మాటలు విని జీవులందరూ అమితంగా ఆనందించారు. తండ్రీ! మేలు అయింది. బాగుంది బాగుంది అనే అరుపులతో ప్రశంసించారు. ఆ పై శివుడి పిలుపు మేరకు ఇంద్రుడు మొదలైన దేవతలు, మునులను కలుపుకుని వచ్చారు. శివుడు ముందరవరుసలో నడుస్తుండగా వేలుపుల పెద్ద 'బ్రహ్మా' వాళ్లందరితో దక్షవాటికకు నడిచాడు
పెద్దలకే పెద్ద అయిన ఓ విదురుడా! ఆ సమయంలో శివుడి యోగసాధన తీరులో అన్ని అవయవాలతో కూడినవారై మునులూ, ఋత్విక్కులూ, దేవతా ముఖ్యులూ మునుపటివలెనే అదే శరీర సంపదతో శోభిల్లారు.
(గీర్వాణులు వాక్కులే బాణంగా గలవారు = వేలుపులు.)
విదురా! బాగా విను, అంతలోన దక్షుని మేక ముఖం కలవాణ్ణిగా చేశాడు. శివుడు లోలోపల కుతూహలపడుతూ ఆ ఘటనను వీక్షిస్తూ ఉండగా, దక్షుడు అప్పుడే నిద్ర మేల్కాంచిన వాడివలె లేచాడు.
ఇలా నిద్ర నుంచి తుళ్లిపడ్డట్టు లేచి నించున్న దక్షుడు ఎదురుగా ఉన్న శివుణ్ణి దర్శించినంత మాత్రాననే శరత్కాలంలో బురదలేని తేటనీటికొలను వలె ఇతఃపూర్వం శివుడి మీద పగవల్ల కల్గిన వాని పాపాలు ప్రక్షాళితమయ్యాయి. మనస్సు తేరుకుంది. శివుణ్ణి స్తుతించాలనుకునేంతలో చచ్చిపోయిన ముద్దుబిడ్డ సతి తలపులోకి వచ్చింది. ఆ అమితమైన ప్రేమకూ, ఆ వగపుకూ కంటి నిండా నీళ్లు కమ్ముకున్నాయి. గొంతు పూడుకొని పోయింది. నోటి మాట పెగలడంలేదు. అతి కష్టం మీద, పొర్లుకువచ్చే ఆ బాధనంతా బీగబట్టుకున్నాడు. పట్టలేని ప్రేమతో ఎంతో విలవిల లాడుతూ శివుడితో ఇలా అన్నాడు.
ప్రభూ! అభవ! పురహర! శివ! ఆలకించు. నేను చేసిన తీరని అపరాధానికి నన్ను శిక్షించడం ధర్మమే. నీ అభిప్రాయంలో అది నన్ను మన్నించడానికే అని నా మనస్సు చెప్తుంది.
ఓ! మహాత్మా! నువ్వూ, విష్ణుమూర్తీ, ఎటుగా, ఎంతగా, గాలించి చూచినా బ్రహ్మబంధులను పట్టీపట్టనట్లు ఉంచరట కదా. మంచి నియమం నిష్ఠగల బ్రాహ్మలపట్ల తటస్థ భావం మీకు ఎందుకు ఉంటుంది? తరతరాల నుంచి అలవాటు పడ్డ వేదధర్మాన్ని అలవరించడానికి అటు అమర్త్యుల పర/ఆత్మ విద్యలోనూ, ఇటు మర్త్యుల అపర/ధర్మ విద్యలోనూ వ్రతదీక్షగల బ్రాహ్మణులను వంశంగా జన్మలనెత్తించావు. ఆ కారణాన ఓ శివా! నువ్వూ చేతకర్ర పట్టీ పసుల కాపరి కదుపును కావలి కాచినట్లు ఆ బ్రాహ్మణ వ్రతులను ఎపుడూ ఓ కంట కనిపెడ్తూనే ఉంటావు కదా.
నీచుల తుదముట్టించేవాడా! ఆర్ద్ర హృదయుడా! భయంకరుడా! నీ బ్రహ్మమయత్వం అవగతంకాని పరమదుర్వివేకిని అని యోచించగా యోచించగా నాకు తెలియవచ్చింది. నువ్వు ఆనాటి సదస్సు మధ్యలో నా పెళుసు మాటలనే బాణాలచే దెబ్బతిన్నావు. అయినా కూడ నేను చేసిన పొరపాటును ఒక మాటు అయినా మనస్సులో కూడ తలవ లేదు. ఓ ముక్కంటీ! ఆ నిందారోపణం వలని అపరాధం కారణంగా అట్టడుగుకు కూరుకొని పోతున్న నా వంటి పాపిని దయతో కాచావు. అంతటి నీకు నేను ప్రత్యామ్నాయంగా తెలిసి తెలిసి ఉపకారం చేయపూనుకో గలంతవాడినా, ఆదర్శప్రాయమైన వర్తనుడవు నువ్వు. ఎదటివారిపై దయతలచి తలపడి చేయ పూనే పనులచేతనే నీ మనస్సు సంతుష్టి చెందుగాక! "నిస్స్వార్ధమైన ద్వేషరహితమైన మంచికార్యం పరమసంతృప్తికి మార్గం" అని హిత భావన.
ఇలాంటి పశ్చాత్తాపంతో దక్షుడు రుద్రుణ్ణి క్షమాపణను కోరాడు. బ్రహ్మ ఆదేశాన్ని అంది పుచ్చుకున్నాడు. వేద పండితుల, పురోహితుల చెంతకు వచ్చి యాగకార్యానికి సిద్ధం అయ్యాడు. అపుడు బ్రాహ్మణులందరూ క్రతువు ఏ అడ్డూ లేకుండ సక్రమంగా జరిగిపోవడానికీ, శివదండువల్ల వాటిల్లిన యాగ విధ్వంసదోషాన్నీ ఉపశమింపచేయడానికీ పురోడాశ హోమకర్మను కావించాడు. ఈ కర్మ విష్ణుదేవతాసంబంధసంస్కారం కలది. దీన్ని బ్రాహ్మణులు "మూడు కపాలాల్లో వండిన అన్నం, అపూపం వంటి పదార్థాలతో తయారు చేసిన పురోడాశం" అనే హవిస్సుతో నిర్వర్తించారు. ఆ పిమ్మట యాగ అధ్వర్యుడు భృగుముని తోడుగా యజమాని దక్షుడు నిర్మలమైన మనస్సుతో హవిస్సును సమర్పించాడు. అందుచే విష్ణుమూర్తి అనుగ్రహించినవాడై
నీలదేహచ్చాయలు ఆదరణ యోగ్యంగా నాలుగు దిక్కులా వ్యాపించాయి. బంగారు మొలతాడు మెరుపులు, కట్టిన పట్టుపంచె వన్నెలతో జతగూడాయి. లక్ష్మితో కూడిన మనోజ్ఞమైన ఎదమీద వైెజయంతిమాల సొగసు తీరి ఉంది. నెత్తిన రత్నాలు తాపిన బంగారు కిరీటపుకాంతి పుంజాలు ఉదయసూర్యుని రోచిస్సులతో వేళాకోళాలాడ్తున్నాయి. ముందటి కురులు చక్కనైన నీలిమబ్బుల వన్నెలతో శోభిల్లుతున్నాయి. జగదేక గురువు విష్ణుమూర్తి
తీరైన శంఖం, చక్రం, పద్మం, గద, బాణం, విల్లు, కత్తుల అచ్చపు కాంతులతోనూ, కనక కాంతుల మణులు పొదిగిన చేతి కడియాల వేలి ఉంగరాల మెరుగులు చిమ్ముతూ, విశృంఖలంగా విరగబూచిన కొండగోగు పూలచెట్టును పోలుచూ భుజాలు మెరుస్తూ ఉన్నవి.
సరసమై, గంభీరమైన చిరునవ్వు ఒలికే చూపులతో సమస్త జగత్తును రమింపచేస్తున్నాడు. అదిపెద్ద పండువుగా ప్రకాశించగా లోకబాంధవుడు అవుతూ
దేవకాంతలు విసన కర్రలవలె ఊపుతున్న వింజామరలు తెల్లటి రాజహంస కాంతుల్లో తిరుగాడుతున్నాయి. శ్వేతచ్చత్రం తెల్లని చల్లని చంద్రుడివలె వెలుగులు విరజిమ్ముతుంది. బృహత్తు, రథంతరం అనే సోమస్తోత్రాలు రెండూ రెండు రెక్కలుగాగల గరుత్మండుడిపై పయనిస్తూ కరివరదుడు విష్ణువు విచ్చేశాడు.
మహాతేజస్సు ఉట్టిపడ్తూ అలా వేంచేసిన విష్ణుమూర్తిని, భావ వికారాలకు దూరమైన వానిని, బ్రహ్మ ఇంద్రుడు, శివుడూ, మిగతా దేవతాముఖ్యులు దర్శించారు. ఆ వెంటనే భక్తితో ఆదరాబాదరాగా లేచి నిలబడ్డారు. ఉత్సాహం ఉరుకులెత్తుతుండగా, దయాసముద్రుడవైన ఓ సామీ! నీకు మా దండాలు నీకు మా దండాలు అని నోట పలుకుతూ ఆపుకోలేని భక్తితో ఒక్కసారిగా మోకరిల్లారు.
అలా నమస్కరించిన వెనువెంటనే తామర పూవులవలె విప్పారిన కందోయి కల విష్ణుని అపారమైన సామర్థ్యంచే కళ్లు గుచ్చి చూచినా కనలేని మిరుమిట్లచేత వారివారి కాంతుల్ని కోల్పోయారు. స్తోత్రం చేసే స్తోమత లేని వారయ్యారు. “జడుపు” అనే జబ్బు పట్టుకున్నవారయ్యారు. ఆ బాధ వల్ల కన్నీళ్లు పొంగి పొర్లాయి. గొంతు గద్గదమయింది. శరీరం చలనం తప్పింది. చాలసేపటికి ఆ దైవం ఆదరం లభించి.

Subscribe to:
Posts (Atom)
Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య
న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...