'శ్రీ శుకమహర్షి తన తండ్రి వ్యాస భాగనుడు తనకుపదేశించిన భాగవతాన్ని పరీక్షన్మహారాజునకు వినిపిస్తున్నాడు' అంటూ సూతుడు శౌనకాది మహర్షులకు చెబుతున్నాడు.
వైవస్వత మనువుకి ఇక్ష్వాకుడు మొదలైన కొడుకులు పదిమంది కలిగారని చెబుతారు కదా! ఇక్ష్వాకువంశం ఎలా ప్రవర్తిల్లింది? ఆ వంశంలో వెనుకటివాళ్లను గూర్చి, ఇప్పటివాళ్లనుగూర్చి, పుట్టబోయే వాళ్ళను గూర్చి దయతో నాకు విశదీకరించు అని పరీక్షిత్తు ప్రార్థించకగా శుకమహర్షి ఇక్ష్వాకు మహారాజునుండి అభిమన్యుని చేతిలో మరణించిన బృహద్బలుడి వరకు వంశచరిత్రను, వారి వంశంలో విశేష చరిత్ర గలవారిని గూర్చి ఇంతవరకు చెప్పాడు. ఇక్ష్వాకువంశంలో బృహద్బలుని తరువాత జన్మించబోయే రాజులను గూర్చి తెలియజేస్తున్నాడు శుకమహర్షి.
ఓ పరీక్షన్మహారాజా! నీ వంశంలో ఇక్ష్వాకుడు మొదలుగా బృహద్బలునివరకు ఉన్న రాజుల చరిత్రను నీకింతవరకు చెప్పాను. ఇక్ష్వాకువంశంలో ఇకపై పుట్టబోయే రాజులనుగూర్చి తెలియజేస్తాను.
ఆ బృహద్బలుడికి బృహద్రణుడు, ఉరుక్షతుడు, వత్సప్రీతుడు, ప్రతివ్యోముడు, భానుడు, సహదేవుడు, బృహదశ్వుడు, భానుమంతుడు, ప్రతీకాశ్వుడు, సుప్రతీకుడు, మేరుదేవుడు, సుతక్షత్రుడు, ఋక్షకుడు, అంతరిక్షుడు, సుతపుడు, అమిత్రజిత్తు, బృహద్వాజి, బర్హి, ధనంజయుడు, రణంజయుడు, సృంజయుడు, శాక్యుడు, శుద్దాదుడు, లాంగలుడు, ప్రసేనజిత్తు, క్షుద్రకుడు, ఋణకుడు, సురథుడు, సుమిత్రుడు క్రమంగా జన్మిస్తారు, సుమిత్రుని తరువాత సూర్యవంశం నశిస్తుంది. వీళ్ళు బృహద్బలుడి నుండి క్రమంగా జన్మించేవారు అని శుకుడు ఇలా అన్నాడు.
ధన్యుడైన ఇక్ష్వాకు పుత్రుడు నిమి యాగం చేయాలనే ఆలోచనతో ఆ యజ్ఞానికి వసిష్ఠుని ఋత్విక్కుగా ఉండి నిర్వహింపుమని కోరాడు. వసిష్ఠుడు ఇంద్రుని యజ్ఞం చేయించడానికి ఇంతకుముందే ఒప్పుకొని ఉన్నాను. అది పూర్తి అయిన తరువాత వస్తాను. ఏ లోటూ ఉండదు అన్నాడు. ఇంటికి వచ్చిన నిమి “సంసారం నిలకడలేనిది. కాలయాపనం చేయడం మంచిది కాదు". యజ్ఞం చేద్దామని ఆలోచించి ఇతర ఋత్విక్కులను పిలిచి వారిచే యజ్ఞం చేయించాడు.
వసిష్ఠుడు ఇంద్రుని యాగం పూర్తి చేయించి వచ్చి తాను లేకుండా యజ్ఞం పూర్తి చేయటాన్ని చూసి సహించలేక ఆయన శిష్యునిపై ఆగ్రహించి 'ఓరీ నేను వచ్చేదాక ఆగలేకపోయావు' అంటూ అతని శరీరం కూలిపోవాలని నిమి చక్రవర్తిని శపించాడు.
ఈ విధంగా వసిష్ఠుడు తనను శపించగా, నిమి కూడా వసిష్ఠుని దేహం కూలిపోవుగాక! అని తిరిగి శపించాడు. ఆ వసిష్ఠుడు ఊర్వశి అనే అప్పరసకు మిత్రావరుణుల వలన జన్మించాడు. శాపాంతకాలంలో బ్రహ్మజ్ఞాని నిమి గురుశాపంవల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఆ నిమిదేహాన్ని మునీశ్వరులు సుగంధవస్తువులతో భద్రపరచి, ప్రారంభించిన సత్రయాగాన్ని పూర్తి చేశారు. యాగం పూర్తి అయిన తరువాత మెచ్చి వచ్చిన దేవతాబృందానికి నిమిదేహాన్ని చూపించి 'ఇతనిని బ్రతికించండి' అని ప్రార్ధించారు. 'నిమి ప్రాణం వచ్చుగాక' అని దేవతలు ఆశీర్వదించారు. కాని నిమి మాత్రం తన శరీరాన్ని పొందడానికి ఇష్టపడక ఇలా అన్నాడు.
మోహంవల్ల కలతపొంది, మమతాహంకారాలకు మూలమై, సుఖదుఃఖాలతో పీడింపబడి, అశాశ్వతమైన ఈ దేహంతో సంసర్గం నాకెందుకు? ఎప్పుడు, ఎవరిచేతికి, ఎలా చిక్కి ప్రాణం కోల్పోతుందో తెలియక భయపడే చేప బ్రతుకులాంటి జీవనాన్ని విజ్ఞులు అంగీకరించరు. కావున నేను పరమేశ్వరుని మనసులో సేవిస్తాను.
నిమి పల్కిన మాటలు విన్న దేవతలు కాదనలేక, శరీరధారులు కళ్ళు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు నిమి అస్తిత్వం కానవస్తుంది అని చెప్పి వెళ్ళారు. అంత
మునీశ్వరులు రాజ్యానికి రాజు లేకపోతే అరాజకత్వం వస్తుందని భావించి నిమి శరీరాన్ని మథించగా దానినుండి ఒక కొడుకు పుట్టాడు. ఆ కుమారుణ్ణి లోకాలన్నీ జనకుడు అని పిలిచాయి.
నిమిని మధించగా పుట్టినవాడు వైదేహుడని, మథించడంవల్ల పుట్టడంచేత మిథిలుడని పేరు పొందాడు. మిథులుడు నిర్మించడంవల్ల ఆ నగరానికి మిథిలానగరం అని పేరు వచ్చింది. ఆ జనకునకు ఉదావసుడు, వానికి నందివర్ధనుడు, వానికి సుకేతుడు, వానికి దేవరాతుడు, వానికి బృహద్రథుడు, వానికి మహావీర్యుడు, వానికి సుధృతి, వానికి ధృష్టకేతుడు, వానికి హర్యశ్వుడు, వానికి మరువు, అతనికి ప్రతింధకుడు, వానికి కృతరయుడు, వానికి దేవమీధుడు, వానికి విధృతి, వానికి మహాధృతి, వానికి కీర్తిరాతుడు, వానికి మహారోముడు, వానికి స్వర్ణరోముడు, వానికి హ్రస్వరోముడు, వానికి సీరధ్వజుడు జన్మించారు.
సీరధ్వజుడు యజ్ఞభూమిని దున్నిస్తూ ఉండగా, నాగేటి కర్రుకొనకు తగిలి, సీత లభించింది. ఆమె శుభలక్షణాలు గల దేహం కలిగింది. ఈ కారణంచేత సీరధ్వజుడు అనే ప్రశస్తి కలిగి అతడు ధన్యు డయ్యాడు.
(జనక, వైదేహ, మిథిల, సీరధ్వజ అనే పేర్ల వ్యుత్పత్తిని గుర్తిస్తే జనకచక్రవర్తి జీవిత విశేషాల మౌలిక విషయాలు తెలుసాయి.)
ఆ సీరధ్వజునకు కుశధ్వజుడు, కుశధ్వజునకు ధర్మధ్వజుడు, ధర్మధ్వజునకు కృతధ్వజుడు, మితధ్వజుడు అనే ఇరువురు కొడుకులు పుట్టారు. వారిలో కుశధ్వజనికి కేశిధ్వజుడు జన్మించాడు. అతడు ఆత్మవిద్యలో నేర్పరి, మితధ్వజునకు ఖాండిక్యుడు జన్మించాడు. అతడు తండ్రివల్ల యజ్ఞయాగాది కర్మకాండలను గూర్చి తెలిసికొని, కేశిధ్వజునకు భయపడి పారిపోయాడు.
ఖాండిక్యునకు భానుమంతుడు, భానుమంతునకు శతద్యుమ్నుడు, శతద్యుమ్నునకు శుచి, శుచికి సనద్వాజుడు, సనద్వాజునకు ఊర్థ్వకేతుడు, ఊర్థ్వకేతునకు అజుడు, అజునకు కురుజిత్తు, కురుజిత్తుకు అరిష్టనేమి, అరిష్టనేమికి శ్రుతాయువు, శ్రుతాయువుకు పార్శ్వుడు; వానికి చిత్రరథుడు, చిత్రరథునకు క్షేమాపి, క్షేమాపికి హేమరథుడు, హేమరథునకు సత్యరథుడు, సత్యరథునకు ఉపగురుడు, ఉపగురునకు అగ్నిదేవుని దయవల్ల ఉపగుర్వుడు, ఉపగుర్వునకు సావనుడు, సావనునకు సువర్చసుడు జన్మించారు. ఈ సువర్చసుడే సుభూషణుడని కీర్తింపబడతాడు. ఆ సుభూషణునకు జయుడు, జయునకు విజయుడు, విజయునకు ధృతుడు, ధృతునకు అనఘుడు, అనఘునకు వీతిహవ్యుడు, వీతిహవ్యునకు ధృతి, ధృతికి బహుళాశ్వుడు, బహుళాశ్వునకు కృతి, కృతికి మహావశి జన్మించారు వీరందఱు మైథిలులు అని పిలువబడతారు. యోగీశ్వరుని దయవల్ల వీరు గృహస్థులై ఉండి కూడా కర్మబంధముక్తులై ఆత్మజ్ఞానంతో, ఎల్లప్పుడు పరబ్రహ్మానుసంధానంతో ఉంటారు అని శుకుడు ఇలా అన్నాడు.

శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
No comments:
Post a Comment