Thursday, June 26, 2025

Lakshmi Gavvali - లక్ష్మీ గవ్వలు

లక్ష్మీ గవ్వలు

లక్ష్మీ గవ్వలనులక్ష్మీదేవిని పూజించే సమయంలో ఉపయోగిస్తారు. ఇవి ధనవంతులు కావడానికి, దుష్ట శక్తులను దూరం చేయడానికి, ఇంట్లో శుభం, శాంతి నెలకొనడానికి సహాయపడతాయని నమ్ముతారు.

లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు

చిన్నపిల్లలకి దృష్టిదోష నివారణకు మెడలోగాని మొలతాడులోగాని కడతారు.

వాహనాలకు నల్లని త్రాడుతో గవ్వలను కడితే దృష్టి దోషం ఉండదు.

భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి.

కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గవ్వలను గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏమిటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం.

పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రనామాలతో కుంకుమార్చాన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది.

డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వలన రోజు రోజుకీ ధనాభివృద్ధి ఉంటుంది.

వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి.

గవ్వలు శుక్ర గ్రహానికి సంబంధించినది కావడంతో శుక్రుడుని గవ్వలతో పూజిస్తారు.

ఎక్కడైతే ఎప్పుడూ గవ్వల గలగలలు వినిపిస్తుంటాయో అక్కడ శ్రీమహాలక్ష్మీదేవి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...