Monday, June 30, 2025

Dattatreya - దత్తాత్రేయ

దత్తాత్రేయ

త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయ స్వామి ఆరాధనకు సనాతన సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యం ఉంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన వలన జ్ఞానం, కీర్తి, ఆరోగ్యం, సంపద వంటివన్నీ లభిస్తాయని శాస్త్ర వచనం. ముఖ్యంగా గురువారం దత్తాత్రేయ స్వామి ఆరాధనకు ఎంతో విశేషమైనది. దత్తాత్రేయ స్వామిని ఎలా ఆరాధించాలి, ఎలా పూజిస్తే స్వామి అనుగ్రహాన్ని పొందగలమో తెలుసుకుందాం.

అత్రిఅనసూయల కోరిక మేరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ అంశాలతో వారికి వర పుత్రుడుగా జన్మించారు. అనసూయ మాత పాతివ్రత్యాన్ని, అత్రి మహర్షి నియమ నిబద్ధతకు త్రిమూర్తులు వారికి దాసోహమై తమను తాము సమర్పించుకున్నారు. త్రిమూర్తుల స్వరూప వర పుత్రుడు కాబట్టి 'దత్త' అని, అత్రి మహర్షి సంతానం కాబట్టి 'ఆత్రేయ' అని రెండూ కలిపి దత్తాత్రేయ స్వామి అయ్యాడు.

అనీర్వచనీయం దత్తాత్రేయ స్వరూపం
దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా కూడా భావిస్తారు. మూడు తలలు, ఆరు చేతులతో, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు ధరించి తన వెంట నాలుగు శునకాలు, గోమాతను వెంట బెట్టుకొని అవధూత లాగా కనిపించే దత్తాత్రేయ స్వామి ఘోటక బ్రహ్మచారి. దత్తాత్రేయ స్వామిని సన్యాసి అని కూడా కొందరు అంటారు. దత్తాత్రేయ స్వామి వెంట ఉండే గోమాత గాయత్రీ దేవి స్వరూపమనీ, నాలుగు శునకాలు నాలుగు వేదాల స్వరూపమనీ పెద్దలు అంటారు.

దత్తాత్రేయ స్వామిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే దత్తాత్రేయ స్వామి పూజ వలన దత్తుని అనుగ్రహంతో పాటు త్రిమూర్తుల అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చు.

గురువారం దత్తాత్రేయ స్వామిని ఎలా పూజించాలి
గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని దత్తాత్రేయ స్వామికి పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి గంధంతో బొట్టు పెట్టాలి. స్వామికి పసుపు రంగు పువ్వులతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. దత్తాత్రేయ స్తోత్రం కానీ, దత్తాత్రేయ స్వామి వజ్రకవచం కానీ చదువుకుంటే ఎంతటి భయంకరమైన అనారోగ్య సమస్యలైనా పారిపోతాయి. పూజ పూర్తి అయ్యాక స్వామికి నివేదనగా పసుపు రంగు పండ్లను కానీ పసుపు రంగు ఆహార పదార్థాలు కానీ సమర్పించాలి.

ఇంట్లో పూజ చేయడం కుదరని వారు దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్లి స్వామికి పసుపు రంగు పూలను సమర్పించాలి. అలాగే స్వామికి నైవేద్యంగా పసుపు రంగు పండ్లను సమర్పించాలి. దేవాలయంలో ప్రశాంతంగా కూర్చొని దత్తాత్రేయ స్వామి చరిత్ర అయిన గురు చరిత్రను పారాయణ చేయాలి.

గురువుకు ఐదు సంఖ్య ఎంతో కీలకం కాబట్టి నియమ నిష్ఠలతో దత్తాత్రేయ స్వామిని ఐదు గురువారాలు పూజిస్తే సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, జ్ఞానం కలుగుతాయి అని నమ్మకం.


దత్తాత్రేయ సిద్ధ మంగళ స్తోత్రం

దత్తాత్రేయ అష్టోత్తర శత నామావళీ

శ్రి దత్తాత్రేయ స్తోత్రం

శ్రీ దత్తాత్రేయ వజ్ర కవచం

శ్రీ దత్త స్తవం

దత్తాత్రేయ అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ దత్త భవానీ (గుజరాతీ మూల)

దత్త షోడశి

శ్రీ దత్త మాలా మంత్ర

శ్రీ పాద శ్రీ వల్లభ సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీ నృసింహ సరస్వతీ అష్టకం

రావిచెట్టు అశ్వత్థ వృక్షము

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...