రావిచెట్టు
శాస్త్రాల ప్రకారం రావిచెట్టు విష్ణుస్వరూపం. శనిదోషాలు పోగొడుతుంది. అందువల్లే ఆలయాల్లో రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
అశ్వత్థ వృక్షము
రావిచెట్టుకే మరో పేరు అశ్వత్థ వృక్షము. మర్రి జాతికి చెందిన ఒక చెట్టు. భారతదేశం, నేపాల్,
దక్షిణ చైనా, ఇండో చైనా ప్రాంతాలలో ఈ చెట్టు అధికంగా పెరుగుతుంది. ఇది
పొడి ప్రాంతలలోనూ, తేమ ప్రాంతాలలోనూ కూడా పెరిగే పెద్ద చెట్టు. ఇది సుమారు 30
మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం వ్యాసం 3 మీటర్ల వరకు
పెరుగుతుంది. అశ్వత్థ పత్రి రావి చెట్టుకు చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే
వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు 19 వది.
దత్తాత్రేయ చరిత్ర
దత్తాత్రేయ చరిత్రలో అశ్వత్థ వృక్షము గురించి చాలా ప్రముఖంగా చెప్తారు. దత్తాత్రేయ స్వామి తపస్సు చేసిన వృక్షం.
రావిచెట్టును ఇంట్లో పెంచకూడదా ?
అయితే రావిని ఇంట్లో పెంచకూడదని పెద్దలు, శనివారం తప్పించి మిగతా రోజుల్లో రావిచెట్టును తాకకూడదని శాస్త్రాలు అనాదిగా చెబుతున్నా, రావిని ఇంట్లో పెంచకూడదనడానికి ఆధ్యాత్మిక కారణాలేవీ లేవు.
సామాజిక కారణాలు
రావిచెట్టు చాలాకాలం ఉంటుంది. పైగా అది పెరిగేకొద్దీ దాని వేళ్లు భూమిలోపల చాలా దూరం బలంగా పాకుతాయి. దానివల్ల పునాదులు దెబ్బతిని ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే రావి చెట్టు భారీ వృక్షంగా పెరుగుతుంది కాబట్టి వాటిమీద పక్షులు గూళ్లు కట్టి, గుడ్లు పెడతాయి. వాటికోసం పాములు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
అందుకే రావిచెట్టును ఇంట్లో పెంచవద్దని చెబుతారు. నిజానికి రావిచెట్టే కాదు, ఏ పెద్ద చెట్టును పెంచినా ఈ సమస్య వస్తుంది. అది మనం గమనించుకోవాలి.
No comments:
Post a Comment