హయగ్రీవుడు
హయగ్రీవుడు విష్ణువు యొక్క అవతారం. ఈ అవతారం యొక్క ఉద్దేశ్యం సంహరించడం. హయగ్రీవుడు గుర్రం యొక్క మెడ మరియు మానవ శరీరాన్ని కలిగి ఉంటాడు.
విష్ణువు యొక్క పది అవతారాలలో, వేదాలను సంరక్షించడంలో మరియు ప్రచారం చేయడంలో హయగ్రీవుడి పాత్ర కీలకమైనది. బ్రహ్మదేవుడికి సృష్టి చేయడానికి వేదాలు అవసరం. ఆ వేదాల సంరక్షణ కోసం విష్ణుమూర్తి శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవుడిగా అవతరించాడు.
హయగ్రీవుడు మేధస్సు మరియు జ్ఞానం యొక్క స్వరూపం. చిత్తశుద్ధితో హయగ్రీవుడిని పూజిస్తే మీకు సిద్ధి మరియు జ్ఞానాన్ని కూడా అందించగలడు.
హయగ్రీవుని బుధవారం పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. సాధారణంగా కష్టాలతో సతమతమవుతున్న వారిని ఆ దేవుడే కాపాడాలని అంటారు.
విష్ణుమూర్తి ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కావడం వల్ల ఆరోజు ఎవరైతే స్వామి వారిని దర్శించుకుంటారో వారికి విద్య, విజ్ఞానం లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి.
అలాగే బుధవారం రోజున హయగ్రీవుని యాలకుల మాలతో పూజించడం వల్ల మనం అనుకున్న కార్యాలు ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా నెరవేరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి.
హయగ్రీవున్ని జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి, అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు.
హయగ్రీవుడిని ఆరాధించడం వల్ల మనస్సు యొక్క స్పష్టత మరియు ఇతరులతో సంభాషించే సామర్థ్యం లభిస్తుంది. మానసిక క్షోభ, ఒత్తిడి, నిరాశ మొదలైనవాటితో బాధపడేవారికి మూల మంత్రాన్ని పఠించడం శ్రేయస్కరం.
No comments:
Post a Comment