Sunday, July 13, 2025

Vara Lakshmi Vratham - వరలక్ష్మీ వ్రతము

వరలక్ష్మీ వ్రతము

ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ చేయవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః |
శ్రీ గురుభ్యో నమః |
హరిః ఓం |

శుచిః
(తలమీద నీళ్ళను జల్లుకోండి)

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వా
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష ||

ప్రార్ధన 
(నమస్కారం చేస్తూ ఇవి చదవండి)

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||

దేవీం వాచమజనయన్త దేవాస్తాం విశ్వరూపాః పశవో వదన్తి |
సా నో మన్ద్రేషమూర్జo దుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు ||

యశ్శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా
తయోః సంస్మరణాన్నిత్యం సర్వదా జయ మంగళం ||

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః |

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ||

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః | 
ఉమా మహేశ్వరాభ్యాం నమః |
వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః | 
శచీ పురందరాభ్యాం నమః |
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః | 
శ్రీ సీతారామాభ్యాం నమః |
మాతా పితృభ్యో నమః | 
సర్వేభ్యో మహాజనేభ్యో నమః |

ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా |
ఓం నారాయణాయ స్వాహా |
ఓం మాధవాయ స్వాహా |
ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః |
ఓం శ్రీ కృష్ణాయ నమః |

దీపారాధనం
(దీపం వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి, ఇది చదివి, నమస్కారం చేయండి)

దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే ||

భో దీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్ |
యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ ||

దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు ||
పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే ||

భూతోచ్ఛాటనం
(అక్షింతలు తీసుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని, ఇది చదివి, మీ వెనుక వేసుకోండి)

ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే |
అపసర్పన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః |
యే భూతా విఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా |

ప్రాణాయామం
(ప్రాణాయామం చేయండి)

ఓం భూః | ఓం భువః | ఓగ్^మ్ సువః | ఓం మహః |
ఓం జనః | ఓం తపః | ఓగ్^మ్ సత్యమ్ |
ఓం తథ్స'వితుర్వరే''ణ్యం భర్గో' దేవస్య' ధీమహి |
ధియో యో నః' ప్రచోదయా''త్ ||
ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||

సంకల్పం
(అక్షింతలు తీసుకుని, ఇది చదివి, నీటితో విడిచిపెట్టండి)

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ___ ప్రదేశే ___, ___ నద్యోః మధ్య ప్రదేశే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష  ఋతౌ శ్రావణ మాసే శుక్ల పక్షే  ___ తిథౌ భృగు వాసరే  ___ నక్షత్రే  ___ యోగే  ___ కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ ___ గోత్రః ___ నామధేయః (మమ ధర్మపత్నీ శ్రీమతః ___ గోత్రస్య ___ నామధేయః సమేతస్య) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ _____ ఉద్దిశ్య శ్రీ _____ ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవతా నియమేన సంభవితా ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార* పూజాం కరిష్యే ||

(ఆదౌ నిర్విఘ్న పూజా పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే |)

తదంగ కలశారాధనం కరిష్యే |

కలశారాధనం

కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య | కలశే ఉదకం పూరయిత్వా |
కలశస్యోపరి హస్తం నిధాయ |

(కలశానికి ఒకటిగాని, మూడుగాని, అయిదుగాని బొట్ట్లు పెట్టి, ఒక పువ్వు వేసి, చేయి వేసి ఇది చదవండి)

ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితా ||

కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ||
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః |

ఓం ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే |
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే |

ఆపో వా ఇదగ్‍ం సర్వo విశ్వా భూతాన్యాప:
ప్రాణా వా ఆపః పశవ ఆపోఽన్నమాపోఽమృతమాపః
సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్ఛందాగ్స్యాపో
జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాపః సత్యమాపః
సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప ఓం ||

గంగేచ యమునే కృష్ణే గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ
భాగీరథీ చ విఖ్యాతాః పంచ గంగాః ప్రకీర్తితాః ||

(ఇది చదువుతూ కలశం లో నీళ్ళను పూజా సామాగ్రి, దేవతా ప్రతిమ, మీ మీద జల్లుకోండి)

ఆయాంతు శ్రీ ____ పూజార్థం మమ దురిత క్షయకారకాః
ఓం ఓం ఓం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య,
దేవం సంప్రోక్ష్య, ఆత్మానం చ సంప్రోక్ష్య ||

శంఖ పూజా – (శంఖం ఉంటేనే ఇది చేయండి)

కలశోదకేన శంఖం పూరయిత్వా ||
శంఖే గంధకుంకుమపుష్పతులసీపత్రైరలంకృత్య ||

శంఖం చంద్రార్క దైవతం మధ్యే వరుణ దేవతాం |
పృష్ఠే ప్రజాపతిం వింద్యాదగ్రే గంగా సరస్వతీమ్ ||

త్రైలోక్యేయాని తీర్థాని వాసుదేవస్యదద్రయా |
శంఖే తిష్ఠంతు విప్రేంద్రా తస్మాత్ శంఖం ప్రపూజయేత్ ||

త్వం పురా సాగరోత్పన్నో విష్ణునా విధృతః కరే |
పూజితః సర్వదేవైశ్చ పాంచజన్య నమోఽస్తు తే ||

గర్భాదేవారినారీణాం విశీర్యంతే సహస్రధా |
నవనాదేనపాతాళే పాంచజన్య నమోఽస్తు తే ||

ఓం శంఖాయ నమః | ఓం ధవళాయ నమః |
ఓం పాంచజన్యాయ నమః | ఓం శంఖ దేవతాభ్యో నమః |
సకల పూజార్థే అక్షతాన్ సమర్పయామి ||

ఘంట పూజా

ఓం జయధ్వని మంత్రమాతః స్వాహా |
ఘంటదేవతాభ్యో నమః |
సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి |

ఘంటనాదం |
(గంటకి బొట్టు పెట్టి, ఇది చదువుతూ గంట వాయించండి)

ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం |
ఘణ్టారవం కరోమ్యాదౌ దేవ ఆహ్వాన లాంచనం ||

ఇతి ఘంటానాదం కృత్వా ||

శ్రీ పసుపు గణపతి పూజ

అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ||

ప్రాణప్రతిష్ఠ

ఓం అసునీతే పునరస్మాసు చక్షుః 
పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్ |
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరన్త
మనుమతే మృడయా నః స్వస్తి ||
అమృతం వై ప్రాణా అమృతమాపః
ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ||
శ్రీ మహాగణపతయే నమః |
స్థిరో భవ వరదో భవ |
సుముఖో భవ సుప్రసన్నో భవ |
స్థిరాసనం కురు |

ధ్యానం

హరిద్రాభం చతుర్బాహుం
హరిద్రావదనం ప్రభుమ్ |
పాశాంకుశధరం దేవం
మోదకం దంతమేవ చ |
భక్తాఽభయప్రదాతారం
వందే విఘ్నవినాశనమ్ |
ఓం హరిద్రా గణపతయే నమః |

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||

ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ||

ఓం మహాగణపతయే నమః |
ధ్యాయామి | ధ్యానం సమర్పయామి | 01 ||

ఓం మహాగణపతయే నమః |
ఆవాహయామి | ఆవాహనం సమర్పయామి | 02 ||

ఓం మహాగణపతయే నమః |
నవరత్నఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి | 03 ||

ఓం మహాగణపతయే నమః |
పాదయోః పాద్యం సమర్పయామి | 04 ||

ఓం మహాగణపతయే నమః |
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి | 05 ||

ఓం మహాగణపతయే నమః |
ముఖే ఆచమనీయం సమర్పయామి | 06 ||

స్నానం

ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన |
మహేరణాయ చక్షసే |
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః |
ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చ నః |
ఓం మహాగణపతయే నమః |
శుద్ధోదక స్నానం సమర్పయామి | 07 ||
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం

అభి వస్త్రా సువసనాన్యర్షాభి ధేనూః సుదుఘాః పూయమానః |
అభి చంద్రా భర్తవే నో హిరణ్యాభ్యశ్వాన్రథినో దేవ సోమ ||
ఓం మహాగణపతయే నమః |
వస్త్రం సమర్పయామి | 08 ||

యజ్ఞోపవీతం

"ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః "
ఓం మహాగణపతయే నమః |
యజ్ఞోపవీతం సమర్పయామి | 09 ||

గంధం

గంధద్వారాం దురాధర్షాo నిత్యపుష్టాం కరీషిణీమ్ | 
ఈశ్వరీగ్ం సర్వభూతానాo తామిహోపహ్వయే శ్రియమ్ ||
ఓం మహాగణపతయే నమః |
దివ్య శ్రీ గంధం సమర్పయామి | 10 ||

పుష్పైః పూజయామి |

ఓం సుముఖాయ నమః | 
ఓం ఏకదంతాయ నమః |
ఓం కపిలాయనమః | 
ఓం గజకర్ణికాయ నమః |
ఓం లంబోదరాయనమః | 
ఓం వికటాయ నమః |
ఓం విఘ్నరాజాయ నమః | 
ఓం గణాధిపాయనమః |
ఓం ధూమకేతవే నమః | 
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం ఫాలచంద్రాయ నమః | 
ఓం గజాననాయ నమః |
ఓం వక్రతుండాయ నమః | 
ఓం శూర్పకర్ణాయ నమః |
ఓం హేరంబాయ నమః | 
ఓం స్కందపూర్వజాయ నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
ఓం మహాగణపతయే నమః |

నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి | 11 ||

ధూపం

వనస్పత్యుద్భవిర్దివ్యైః నానా గంధైః సుసంయుతః |
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతాం ||
ఓం మహాగణపతయే నమః |
ధూపం ఆఘ్రాపయామి | 12 ||

దీపం

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం |
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ ||
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే |
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోఽస్తు తే ||
ఓం మహాగణపతయే నమః |
ప్రత్యక్ష దీపం సమర్పయామి | 13 ||

ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి |

నైవేద్యం

ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ |
భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |

శ్రీ మహాగణపతయే నమః ______ సమర్పయామి |

ఓం ప్రాణాయ స్వాహా” | 
ఓం అపానాయ స్వాహా” |
ఓం వ్యానాయ స్వాహా” | 
ఓం ఉదానాయ స్వాహా” |
ఓం సమానాయ స్వాహా” |

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |

అమృతాపి ధానమసి | 
ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | 
పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |
ఓం మహాగణపతయే నమః |
నైవేద్యం సమర్పయామి | 14 ||

తాంబూలం

పూగీఫలశ్చ కర్పూరైః నాగవల్లీదళైర్యుతం |
ముక్తాచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం మహాగణపతయే నమః |
తాంబూలం సమర్పయామి | 15 ||

నీరాజనం

వేదాహమేతం పురుషం మహాన్తమ్ |
ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః |
నామాని కృత్వాఽభివదన్, యదాస్తే |
ఓం మహాగణపతయే నమః |
నీరాజనం సమర్పయామి | 16 ||

మంత్రపుష్పం

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః ||
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ||
ఓం మహాగణపతయే నమః |
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణం

యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ||
ఓం మహాగణపతయే నమః |
ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి |

ఓం మహాగణపతయే నమః |

ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి ||

క్షమాప్రార్థన

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ||

ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా 
భగవాన్ సర్వాత్మికః
శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||

ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు |
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు ||

తీర్థం

అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం |
సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం ||
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి ||

ఉద్వాసనం

ఓం యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః |
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచన్తే |
యత్ర పూర్వే సాధ్యాః సన్తి దేవాః ||
ఓం శ్రీ మహాగణపతి నమః యథాస్థానం ఉద్వాసయామి ||
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

ఓం శాంతిః శాంతిః శాంతిః |

(వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు 
తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను 
ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.)

కలశపూజ

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు పూజార్థం దురితక్షయకారకాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి 
నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥

(శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, 
పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.)

పునః సంకల్పం |

పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

ధ్యానం |

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే |
నారాయణప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా ||
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధ్యాయామి || 01 ||

ఆవాహనం |

సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్స్థలాలయే |
ఆవహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆవహయామి || 02 ||

సింహాసనం |

సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్నవిభూషితే |
సింహాసనమిదం దేవీ స్థీయతాం సురపూజితే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః రత్నసింహాసనం సమర్పయామి || 03 ||
(అక్షింతలు చల్లండి)

అర్ఘ్యం |

శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం |
అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహ్యతాం హరివల్లభే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి || 04 ||
(నీళ్ళు చల్లండి )

పాద్యం |

సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం |
పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పాద్యం సమర్పయామి || 05 ||
(నీళ్ళు చల్లండి )

ఆచమనీయం |

సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం |
గృహాణాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి || 06 ||
(నీళ్ళు చల్లండి )

పంచామృత స్నానం |

పయోదధి ఘృతోపేతం శర్కరామధు సంయుతం |
పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పంచామృతస్నానం సమర్పయామి || 07 ||
(పంచామృతం చల్లండి )

శుద్ధోదకస్నానం |

గంగాజలం మయాఽనీతం మహాదేవశిరస్స్థితం |
శుద్ధోదక స్నానమిదం గృహాణ విధుసోదరి ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి || 08 ||
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |
(నీళ్ళు చల్లండి )

వస్త్రయుగ్మం |

సురార్చితాంఘ్రి యుగళే దుకూలవసనప్రియే |
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి || 09 ||
( కొత్త బట్టలు లేదా పత్తి సమర్పించండి)

ఆభరణాని |

కేయూర కంకణా దివ్యే హార నూపుర మేఖలాః |
విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషిపూజితే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి || 10 ||
(కొత్త ఆభరణాలు ఉంటె అమ్మవారికి వేయండి)

మాంగళ్యం |

తప్తహేమకృతం దేవీ మాంగళ్యం మంగళప్రదం |
మయా సమర్పితం దేవీ గృహాణ త్వం శుభప్రదే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మాంగళ్యం సమర్పయామి || 11 ||
(అమ్మవారికి మాంగల్యం సమర్పించండి)

గంధం |

కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం |
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి || 12 ||
(అమ్మవారికి శ్రీ గంధం, కుంకుమ సమర్పించండి)

అక్షతాన్ |

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శూభాన్ |
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి || 13 ||
(అమ్మవారికి అక్షింతలు, పసుపు,కుంకుమ చల్లండి)

పుష్పపూజ |

మల్లికా జాజికుసుమైశ్చంపకైర్వకుళైరపి |
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పాణి పూజయామి || 14 ||
(అమ్మవారికి పుష్పములు చల్లండి)

అథాంగ పూజ |

ఓం చంచలాయై నమః | పాదౌ పూజయామి |
ఓం చపలాయై నమః | జానునీ పూజయామి |
ఓం పీతాంబరధరాయై నమః | ఊరూ పూజయామి |
ఓం కమలవాసిన్యై నమః | కటిం పూజయామి |
ఓం పద్మాలయాయై నమః | నాభిం పూజయామి |
ఓం మదనమాత్రే నమః | స్తనౌ పూజయామి |
ఓం లలితాయై నమః | భుజద్వయం పూజయామి |
ఓం కంబుకంఠ్యై నమః | కంఠం పూజయామి |
ఓం సుముఖాయై నమః | ముఖం పూజయామి |
ఓం శ్రియై నమః | ఓష్ఠౌ పూజయామి |
ఓం సునాసికాయై నమః | నాసికాం పూజయామి |
ఓం సునేత్రాయై నమః | నేత్రౌ పూజయామి |
ఓం రమాయై నమః | కర్ణౌ పూజయామి |
ఓం కమలాయై నమః | శిరః పూజయామి |
ఓం వరలక్ష్మై నమః సర్వాణ్యంగాని పూజయామి || 15 ||

అష్టోత్తర శతనామావళిః |

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)

ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)

ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)

ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)

ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)

ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)

ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)

ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)

ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)

ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)

ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)

|| ఇతి శ్రీలక్ష్మ్యష్టోత్తరశతనామావళిః సమాప్తా ||

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పుష్పాణి సమర్పయామి || 16 ||

ధూపం |

దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం |
ధూపం దాస్యామి తే దేవీ గృహాణ కమలప్రియే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ధూపమాఘ్రపయామి || 17 ||

దీపం |

ఘృతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం |
దీపం దాస్యామి తే దేవీ గృహాణముదితా భవ ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః దీపం సమర్పయామి || 18 ||

నైవేద్యం |

నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్వాజ్య సంయుతం |
నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి || 19 ||

పానీయం |

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం |
పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరం ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి || 20 ||

తాంబూలం |

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం |
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి || 21 ||

నీరాజనం |

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం |
తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి || 22 ||

మంత్రపుష్పం |

పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే |
నారయణప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి || 23 ||

ప్రదక్షిణ |

యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవా
త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష జనార్దని ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి ||

నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే |
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి || 24 ||

తోరగ్రంధి పూజ |

కమలాయై నమః | ప్రథమ గంథిం పూజయామి |
రమాయై నమః | ద్వితీయ గ్రంథిం పూజయామి |
లోకమాత్రే నమః | తృతీయ గ్రంథిం పూజయామి |
విశ్వజనన్యై నమః | చతుర్థ గ్రంథిం పూజయామి |
మహాలక్ష్మై నమః | పంచమ గ్రంథిం పూజయామి |
క్షీరాబ్ధితనయాయై నమః | షష్ఠ గ్రంథిం పూజయామి |
విశ్వసాక్షిణ్యై నమః | సప్తమ గ్రంథిం పూజయామి |
చంద్రసోదర్యై నమః | అష్టమ గ్రంథిం పూజయామి |
హరివల్లభాయై నమః | నవమ గ్రంథిం పూజయామి |

తోరబంధన మంత్రం |

బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం |
పుత్ర పౌత్రాభి వృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే || 25 ||

వాయన విధిః |

ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తతః |
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే ||

వాయనదాన మంత్రం |

ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ |
ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః ||
(వాయనం ఇచ్చి అక్షతలు పుచ్చుకుని వ్రతకథను చదువుకోవాలి)

వరలక్ష్మీ వ్రత కధ 
సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. ‘ఓ మునీశ్వరు లారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి’.

ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి’ అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. ‘ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను’.

పార్వతీదేవి ‘ నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి’ అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను.

పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.

ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ‘ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను’ అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి ;

నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయేశరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసింది.

‘ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది’. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.

ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ‘ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి’ అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.

వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితేనారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా
అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేసారు.

తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి.వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.

చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.

వారు త్రోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.

అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ‘ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును’ అన్నాడు పరమశివుడు.

సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో ‘మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది’ అన్నారు.

క్షమాప్రార్థన |

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం ||

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి |
యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా కల్పోక్త ప్రకారేణ కృతయా షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీ వరలక్ష్మీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు ||
మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తుః ||

(అక్షతలు, నీళ్ళు విడిచి పెట్టాలి)

లక్ష్మీ దేవి

No comments:

Post a Comment

Parvathi Vallabha Ashtakam - పార్వతీ వల్లభ అష్టకం

పార్వతీ వల్లభ అష్టకం నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజమ్ । నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ 0 1 ॥ ...