కాళీ తంత్రం
శ్లో|| కైలాస శిఖరే రమ్యే దేవదేవం మహేశ్వరం |
ఉవాచ పార్వతీ చైవం భైరవం పరమేశ్వరం || 01 ||
పార్వత్యువాచ|
శ్లో|| దేవదేవ! మహాదేవ! సృష్టిస్థితిలయాత్మకా |
కాళికాఖ్యా మహావిద్యా సమస్తభేదసుంయుతా || 02 ||
భైరవ ఉవాచ।
శ్లో॥ సపర్యాభేదసంయుక్తా చతుర్వర్గఫలప్రదా ।
మహావిద్యా మహామాయా మహాభేదా మహాలయా || 03 ||
శ్లో॥ సర్వవిద్యామహారాజ్జీ సర్వసారస్వతప్రదా ।
కామత్రయం వహ్నియుక్తం రతిబిన్దువిభూషితమ్ || 04 ||
శ్లో॥ కూర్చయుగ్మం తథా లజ్ఙాయుగలం తదనన్తరమ్ ।
దక్షిణే కాలికే చోక్తా పూర్వవద్బీజముచ్చరేత్ || 05 ||
శ్లో॥ అన్తే వహ్నివధుం కుర్యాద్విద్యారాజ్లీ ప్రకీర్తితా ।
తాత్పర్యం : కకారము, రకారము, ఈంతో కూడిన (క్రీం ను మూడుసార్లు, కూర్చబీజమైన
హూంను, లజ్ఞాబీజమైన హ్రీంను, రెండు రెండుసార్లు ఉచ్చరించి, దక్షిణే కాలికే అని చేర్చి,
మరల యథాపూర్వం క్రీంను మూడుసార్లు, హూంను రెండుసార్లు, హ్రీంను రెండు సార్లు
ఉచ్చరించి స్వాహాతో ముగించి, క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం దక్తిణే కాలికే
క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం స్వాహా అని పలికితే, అది విద్యారాజ్ణీ మహామంత్రం
అవుతుంది. దీనిని పూజాభేదాలతో చేర్చి జపిస్తే, అన్ని సాహిత్యప్రక్రియలు వరప్రసాదంగా
లభిస్తాయి. పురుషార్థాల ఫలం లభిస్తుంది. ఈ మంత్రానికే మహావిద్య అనిపేరు. అధిష్టాన
దేవత దక్షిణకాళిక. ఈమెనే మహామాయ అంటారు. ప్రపంచపు భిన్నత్వదర్శనం చేయిస్తూ,
దాని అస్థిరత్వాన్ని బోధించే తల్లి కనుక. అందుకే మహాభేదా అని కూడా అంటారు.
అట్లాగే, ఈ భిన్నత్వాన్ని లయంచేసేది కూడ ఆ తల్లియే కనుక ఆమెను మహాలయా
అనిన్నీ అంటారు. పాంచభూతిక ప్రపంచ సత్యస్వరూపాన్ని దర్శింపజేసే విద్య కనుక ఇది
మహావిద్య. మానవుని జీవితానికి ఫలంగా చెప్పబడే అర్థకామాల ఫలాన్నే కాక ఆ రెండింటిని
పవిత్రీకరించే ధర్మనిష్టను, పరమఫలంగా మోక్షాన్ని కూడా ప్రసాదించేది ఈ దక్షిణ-కాళికోపాసన.
శ్లో॥ నాత్ర చిన్హా విశుద్దాది నారిమిత్రాదిలక్షణమ్ || 06 ||
శ్లో॥ నాత్ర ప్రయాసబాహుల్యం న కాయక్షేశసంభవః |
అస్యాం స్మరణమాత్రేణ సిద్ధయో౭_ష్టా భవన్తి హి || 07 ||
తాత్పర్యం: ఈ సాధనలో శుద్ధిని గురించి చింతలేదు, శత్రుత్వ మిత్రత్వాది బంధ
లక్షణం లేదు, (శ్రమపడవలసిన అవసరం లేదు, శరీరాన్ని నానావిధాల కష్టానికి గురిచెయ్య
నక్కరలేదు. ఈ విద్యారాజ్ణీ మంత్రాన్ని స్మరించినంత మాత్రాన అష్టసిద్ధులు తప్పక
లభించగలవు.
విశుద్దాది చిన్నా, అంటే, విశేషంగా శరీరశుద్ధికోసం, వాక్కు శుద్ధికోసం, మనస్సు
శుద్ధికోసం ఆలోచించటం, స్నానము, ఆహారము, శరీరశుద్ధి. మృదువైన మధురమైన
మాట వాక్కుద్ధి. అపకార చింతన, లాలస, క్రోధము, లోభము, గర్వము, అసూయ ఇత్యాది
మనోభావాలు లేకుండా ఉండటం మనఃశుద్ధి. ఈ త్రికరణ శుద్ధి సాధనకే తపస్సు అని
పేరు. దీనిని సాధించినవ్యక్తి పవిత్రుడై అవిభక్తుడవుతాడు (Integrated Personality) .
ఇంత తపోనిష్ట ఈ మహావిద్య విషయంలో అక్కరలేదు. అట్లే, హఠయోగ, లంబికా
యోగాదులలో చెప్పబడిన శరీరక్షేశంతో కూడిన బహుళసాధనలూ అక్కర్లేదు. మంత్రజపం
చాలును. దీనికి విధినిషేధాలు లేవు. అంతమాత్రంతోనే అణిమా, మహిమా, లఘిమా,
గరిమా, (ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం అనబడే ఎనిమిది శక్తులూ సిద్ధిస్తాయి.
వీనికే అ ష్టైశ్వర్యాలని కూడ పేరు. ఇవి ఈశ్వర శక్తులు కనుక ఐశ్వర్యాలు.
శ్లో భైరవో౭_స్య బుషిః ప్రోక్తః ఉష్టిక్ ఛన్ద ఉదాహృతమ్ I
దేవతా కాలికా ప్రోక్తా లజ్ఞాబీజం తు బీజకమ్ ॥ 08 ॥
శ్లో॥। శక్తిస్తు కూర్చబీజం స్యాదనిరుద్ధం సరస్వతీ ।
కవిత్వార్థే నియోగః స్యాదేవం బుషాదికల్పనా ॥ 09 ॥
తాత్పర్యం : ఈ మంత్రదేవత కాళిక, భైరవుడు, బుషి; ఛందస్సు ఉప్టిక్ బీజము హ్రీం;
శక్తి హూం; ఇది అడ్డగింపరాని ప్రవాహశక్తి; కవితాధారను పొందగోరువారు దీని
నుపాసిస్తారు. వారి జపసాధనకై ఈ మంత్రాని కీ విధంగా బుషి, ఛందస్సు, దేవత,
మంత్రవీజం, శక్తివీజం అనునివి భావింపబడినవి.
బుషి దర్శించినదే మంత్రము. కనుక బుషి మంత్రద్రష్ట్రృ వాని మూలమున
లోకములో ఆ మంత్రము సుప్రతిష్టితము. వారు దర్శించిన దేవతారూపము నిజమునకు
పాంచభౌతికరూపము కాదు, శక్తి రూపము. ఈ విద్యారాజ్జీమంత్రములో వీజరూపమున
దేవత, శక్తి, ఆ శక్తివినియోగము ఇమిడి యున్నవి. మంత్రస్వరూపంలో ఇది ఉష్టిక్
ఛందస్సులో నిబద్ధమైన వీజాక్షరధ్వనితరంగితమై ఉంటుంది.
ఉష్టిక్ ఛందస్సున పాదమునకు ఏడు అక్షరాలు.
లౌకికవ్యవహారములో అన్వయించి చూచినప్పుడు, చేతనాచేతనముల కన్నిటికి
తలకొక నామమున్నది. నామోచ్చారణ ధ్వనితమైనప్పుడు, వినువారి మనసులలో తాము
మున్నే ఎజిగియున్న ఆ నామధారివస్తువో, జంతువో, వృక్షమో, నరుడో, వాని తాలూకు
భౌతికరూపము ప్రకాశించును. ఆ రూపమముతోడనే దాని వైయక్తిక గుణములు భాసించును.
దానిని తానెట్లు వినియోగింపవచ్చునో పొడకట్టును. మంత్రము, బీజము, శక్తి, నియోగము
ఇట్లు లౌకికసత్యముగ నిత్యానుభవమునందున్నదే. నా పేరొక మంత్రము. నా తండ్రి
దానికి బుషి. ఆ పేరున గల అక్షర సంఖ్యను బట్టి ఆ మంత్రఛందస్సు నిర్ణీతము. ఆ
మంత్రాధిదేవతను నేను. ఆ మంత్రాక్షరములు బీజములు. వానికి నా రూపగుణముల
నాకర్షించు శక్తియున్నది. నా పేరు నుచ్చరించిన వారికి నా వలన కాదగిన కార్యమున్నది.
ఆ కార్యము నా వలన నెరవేరునదైనప్పుడు నా నామస్మరణ చేయుట జరుగును. మీ
విషయము గూడ ఇంతియే. ఇట్టిదే యంత్ర, తంత్ర, మంత్ర, బీజములాదిగా గలవాని
పారస్పరిక ప్రతిస్పందన.
శ్లో॥ అంగన్యాసకరన్యాసౌ యథావదభిధీయతే ।
షడ్డీర్ణభాజా బీజేన ప్రణవాద్యేన కల్పయేత్ ॥ 10 ॥
శ్లో॥ హృదయాయ నమః ప్రోక్తం శిరసే వహ్నివల్లభా ।
శిఖాయై వషడిత్యుక్తం కవచాయ హుమీరితమ్ ॥ 11 ॥
శ్లో నేత్రత్రయాయ వౌషట్ స్యాదస్తాయ ఫడితి క్రమః ।
తాత్పర్యం : అంగన్యాస కరన్యాసాలు ఈ క్రమంలో చెప్పబడినవి :-
అంగన్యాసము:
ఓం క్రాం హృదయాయ నమః ।
ఓం క్రీం శిరసే స్వాహా ।
ఓం క్రూం శిఖాయై వషట్ ।
ఓం క్రైం కవచాయ హుమ్ ।
ఓం క్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం క్రః అస్త్రాయ ఫట్ |
కరన్యాసము :
ఓం క్రాం అంగుష్టాభ్యాం నమః ।
ఓం క్రీం తర్జనీభ్యాం స్వాహా ।
ఓం క్రూం మధ్యమాభ్యాం వషట్ ।
ఓం క్రైం అనామికాభ్యాం హుమ్ ।
ఓం క్రౌం కనిష్టికాభ్యాం వౌషట్ |
ఓం క్రః కరతలకరపుష్టాభ్యాం ఫట్ |
శ్లో॥ ఏవం యథావిధిం కృత్వా వర్ణన్యాసం సమాచరేత్ ॥ 12 ॥
తాత్పర్యం : వేదవిహితమైన పద్ధతిలో ఇట్లు అంగన్యాస కరన్యాసములు చేసిన తరువాత
వర్ణన్యాసము చేయవలెను. ఇదెట్లు చేయవలెనో తర్వాతి శ్లోకములలో వివరించబడుచున్నది.
శ్లో॥ వర్ణన్యాసం ప్రవక్ష్యామి యేన దేవీమయో భవేత్ ।
అఆఇఈ ఉఊ బుబూ ౭౧ఒవై హృదయం స్పృశేత్ ॥ 13 ॥
శ్లో॥ ఏఐజఓ బె తతోం_ ప్యం అః క ఖగ ఘ పునస్తతః ।
ఉక్వా చ దక్షిణం భుజం స్పృశేత్ సాధక ఉత్తమః ॥ 14 ॥
శ్లో ॥ జచభఛజసముచ్చార్యరు ఇ టరఠడధఢతథా॥।
ఇతి వామభుజే న్యస్య ణ త థ ద పునః స్మరేత్ ॥ 15 ॥
శో॥ ధనపఫబ భ ఇతి దక్షిణజంఘకే న్యసేత్ |
మయరలవశషసహక్ష వామజంఘకే |
ఇతి వర్దాన్ ప్రవిన్యస్య మూలవిద్యాం సముచ్చరన్ ॥ 16 ॥
శ్లో॥ సప్తధా వ్యాపకం కుర్యాద్యేన దేవీమయో భవేత్ ।
వ్యాపకత్వేన సంన్యస్య తతో ధ్యాయేత్పరాం శివామ్ ॥ 17 ॥
తాత్పర్యం : ఈ చెప్పబడిన విధంగా వర్ణన్యాసం చేయటం వలన సాధకుడు ఉత్తమ
సాధకుడై దేవీమయుడవుతాడు. ఆ వర్ణన్యాసక్రమం ఇది :-
1) అ నుండి ౭? వరకు పలుకుతూ హృదయస్సానాన్ని (ఛాతిలో కుడివైపు) తాకవలెను;
2) ఏ నుండి ఘ వరకు పలుకుతూ కుడిభుజాన్ని తాకవలెను.
3) జ నుండి ఢ వరకు పలుకుతూ ఎడమభుజాన్ని తాకవలెను.
4) ఇ నుండి భ వరకు పలుకుతూ కుడితొడను తాకవలెను.
5) మ నుండి క్ష వరకు పలుకుతూ ఎడమతొడను తాకవలెను.
ఈ వర్ణన్యాసము తరువాత మూలమంత్రాన్ని క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం
హ్రీం దక్షిణే కాలికే క్రీం క్రీం క్రీం హూం హూం హ్రీం హ్రీం స్వాహా, అని జపిస్తూ
వ్యాపకాంజలి ముద్రను ఏడుసార్లు చేయవలెను. ఆపై పరాశక్తిని ధ్యానించవలెను. దీనివలన
సాధకుని శరీరము దేవీమయమై ఆతడు శక్తిమంతుడు కాగలడు.
శ్లో॥ పీఠన్యాసం తతః కుర్యాద్యేన దేవీమయో భవేత్ ।
హృత్సరోజే సుధాసిన్లుః మధ్యే ద్వీపం సువర్ణజమ్ ॥ 18 ॥
శ్లో॥ పరితః పారిజాతాశ్చ మధ్యే కల్పతరుం తతః ।
తన్మూలే హేమనిర్మాణం ద్వాశ్చతుష్టయభూషితమ్ ॥ 19 ॥
శ్లో ॥ మబ్బపం మన్గవాతేన పరాక్రాన్తం సుధూపితమ్ ।
మన్రం తత్ర ప్రతిష్టాప్య తత్ర పూజాం సమాచరేత్ ॥ 20 ॥
శ్లో॥ శృశానం తత్ర సంపూజ్య తత్ర కల్పద్రుమం యజేత్ ।
తన్మూలే మణిపీఠం చ నానామణివిభూషితమ్ ॥ 21 ॥
తాత్పర్యం : ఇప్పుడిక ఈ విధముగా పీఠన్యాసము చేయవలెను. దీనివలన సాధకుడు
దేవీమయుడవుతాడు. పీఠన్యాస విధానం ఇది :- సాధకుడు తన హృదయంలో
అమృతసముద్రాన్ని భావించి, దానిలో సువర్ణమయమైన ఒక ద్వీపాన్ని ఆ ద్వీపంలో
అష్టదిక్కులలోను పారిజాత వృక్షాలను, వాని మధ్య ఒక కల్పవృక్షాన్నీ, దాని మొదట
బంగారపు ద్వారములను, మెల్లగా వీచే సువాసనగల గాలిని, భావించవలె. ఈ మండపమును
దాటి శృశానమును, దానిమధ్య కల్పవృక్షాన్నీ భావించి, దాని మూలంలో మంత్ర తంత్రాన్ని
స్థాపించి పూజ చేయవలె. ఆ కల్పవృక్షపు మొదట మణిమయపీఠాన్ని భావించవలె.
శ్లో ॥ నానాలంకారభూషాధ్యం మునిదేవైశ్చ భూషితమ్ ।
శివాభిర్చహుమాంసాస్థిమోదమానాభిరన్తతః ॥ 22 ॥
శ్లో ॥ చతుర్దిక్షు శవముణ్ణాశ్చిత్తాజ్ఞారాస్థిభూషితాః |
ఇచ్చాజ్ఞాన క్రియా చైవ కామినీ కామదాయినీ ॥ 23 ॥
శ్లో॥ రతీ రతిప్రియా నన్హా మధ్యే చైవ మనోన్మనీ ।
హసౌః సదాశివేత్యుక్వా మహాప్రేతేతి తత్పరమ్ |
పద్మాసనాయ హృదయాం పీఠన్యాస ఉదాహృతః ॥ 24 ॥
శ్లో॥ ఏవం దేహమయే పీఠే చిన్తయేదిష్టదేవతామ్ ।
ధ్యానమస్యాః ప్రవక్ష్యామి స్మరణాచ్చివతాం వ్రజేత్ ॥ 25 ॥
తాత్పర్యం : ముందు శ్లోకములలో చెప్పబడిన పీఠన్యాసము తరువాత, ఆ పీఠముపై సాధకుడు
తన ఇష్టదేవతను నిలుపవలెను. ఆ పీఠము వాని హృదయపద్మమే అను భావన ఉండవలెను.
ఆ ఇష్టదేవతను తాను అర్చించుచుండగా మునులు దేవతలు సూక్ష్మరూపములలో
చుట్టుమూగి యుందురు. ఈ పీఠము, అర్చన జరుగుచునే యుండగా పూర్వోక్త
శృ్మశానభావనలో మండుచున్న చితులు, శవముల మొండెములు, మాంసము, ఎముకలు,
వానిని తృప్తిగా తిని అంతటనూ తిరుగాడు నక్కలు దృశ్యమానము కావలె. వాని మధ్య
మహాప్రేతయైన శివునిపై, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, కామినీశక్తి, కామదాయినీ శక్తి,
రతిశక్తి, రతిప్రియాశక్తి, నన్గాశక్తి, అను అష్టశక్తుల నడుమ మనోన్మణిశక్తి దీపించవలె. ఈ
శక్తుల ఆధారముతోనే హసౌః అను పర్యాయనామముగల సదాశివుని శరీరపీఠముపై మహాకాళి
దర్శనమిస్తుంది. ఆమెను ధ్యానించు విధానము చెప్పబడును. ఆ ధ్యానమువలన సాధకుడు
శివత్వమును పొందగలడు.
శ్లో ॥ కరాలవదనాం ఘోరాం ముక్తకేశీం చతుర్భుజామ్ I
కాలికాం దక్షిణాం దివ్యాం ముణ్జమాలావిభూషితామ్ ॥ 26 ॥
శ్లో ॥ సదా చిన్నశిరఃఖడ్గవా మాద్యోర్థ్వకరామ్బు జామ్ I
అభయం వరదం చైవ దక్షిణోర్దాధపాణికామ్ ॥ 27 ॥
శ్లో ॥ మహామేఘప్రభాం శ్యామాం తథా చైవ దిగమ్బరీమ్ ।
కణ్ణావసక్రముణ్టాలీం గలద్రుధిరచర్చితామ్ ॥ 28 ॥
శ్లో ॥ కర్ణావతంసమానీతాం శవయుగ్మభయానకామ్ ।
ఘోరదంహ్రాం కరాలాస్యాం పీనోన్నతపయోధరామ్ ॥ 29 ॥
శ్లో ॥ శవానాం కరసంఘాతైః కృతకాజ్బీం హసన్ముఖీమ్ |
సృక్కద్వయే గలద్రక్తధారాం విస్ఫురితాననామ్ ॥ 30 ॥
శ్లో॥ ఘోరరావాం మహారౌద్రీం శ్మశానాలయవాసినీమ్ ।
బాలార్మమణ్ఞ్ణలాకారలో చన త్రితయాన్నితామ్ ॥ 31 ॥
శ్లో ॥ దన్తురాం దక్షిణవ్యాపిముక్తాలమ్బికచోచ్చయామ్ I
శవరూప మహాదేవ హృదయోపరి సంస్థితామ్ ॥ 32 ॥
శ్లో ॥ మహాకాలేన చ సమం విపరీతరతాతురామ్ ।
శివాకోటిసహ(సైస్తు యోగియోగవిరాజితామ్ ॥ 33 ॥
శ్లో ॥ రక్తపూర్ణాం రజాంతోజార మద్యపాన ప్రసన్నకామ్ ।
వహ్వ్యర్మశశినేత్రాం చ రక్తవిస్ఫురితాననామ్ ॥ 34 ॥
శ్లో ॥ యోగినీచక్రసంయుక్తాం కాలికాం భావయేత్సదా ।
ఏవం సజ్బిన్య కాలీం తు శృశానాలయవాసినీమ్ ॥ 35 ॥
తాత్పర్యం (శ్లో.26-35) : కాళి శృశానవాసిని. యోగినులామె చుట్టూ పరివేష్టించి
యుందురు. ఆమె త్రిణేతి: అగ్ని సూర్యుడు, చంద్రుడు ఆమె కన్నులు. ఆమె శరీరము,
ముఖము రక్తసిక్తమై, అరుణమై యుండును. ఆమె మద్యమును సేవించి, శాంతయి
ప్రసన్నయైన మూర్తి. ఆమె కంఠధ్వని ఆకాశమునాక్రమించునది. ఆమె చుట్టు నక్కల
గుంపులు తిరుగాడు చుండును. అవి ఆ శృశానమున రక్తమాంసభుక్తివలన సంతృప్తి
జెందినవి. ఆమె పొడవైన కోరలు చాచి, తన కుడి వైపున వ్యాపించి ముడివీడిన కేశములతో,
దట్టమైన కారుమబ్బువర్ణములో నల్లగా వెలుగొందుమూర్తి. ఆమె మెడలో తలపుట్టిల మాల,
కారుచున్న రక్తము మైపూతగా నున్న దిగంబరి. భయంకరమైన దర్శనము గలది. ఆమె
ఎడమ ప్రక్క రెండుచేతులలో, పైచేత ఖడ్గము ధరించి, (క్రింది చేత ఖండిత శిరస్సును
జుట్టుపట్టి యుండగా, కుడిప్రక్క రెండు చేతులలో పై చేత అభయ ముధ్రను, క్రింది చేత
వరదముద్రను దాల్చియుండును. ఆమె నడుముచుట్టు శవముల తెగిన చేతులు
మొలనూలుగా నుండును. రెండు చెవులకును శవములు కర్ణావతంసములై అలంకారముగ
నుండును. పెదవుల మూలల రక్తధారలు కారుచుండును. ఎత్తెన ఒత్తెన పాలిండ్లతో అలరారు
తల్లియామె. ఆమె శవరూప మహాదేవుని హృదయముపై నెక్కి మహాకాలునితో విపరీత
రతియందు ఆసక్తయై యుండును. ఈ రూపమును మనసున భావించి ధ్యానించవలెను.
శ్లో ॥ అనుష్టానవిధిం వక్ష్యే దేవ్యాస్సర్వస మృద్ధిదామ్ |
యేనానుష్టితమాత్రేణ భవాబ్దా న నిమజ్ఞతి ॥ 36 ॥
తాత్సర్యం : దేవియొక్క అనుష్టానపద్ధతిని చెప్పుదును. ఈ అనుష్టానము వలన అన్ని
విషయములలో సమృద్ధి లభించును, సంసార సముద్రంలో మునిగి పోకుండ నిలచును.
సర్వసమృద్ధి అంటే, ఒక సంసారి సాధారణంగా సుఖజీవనానికి అవసరమని
భావించే తిండి, బట్ట, ఇల్లు మాత్రమే కాక ధనధాన్య సంతాన స్థిరచరాస్తులన్నీ అవసరాన్ని
మించి లభిస్తాయని భావం. ఈ కారణంగా యోగక్షేమాలు కలిగి జీవితం సుఖమయ మవుతుంది.
శ్లో॥ అనేకకాళ్బనరత్నాది మాణిక్యరససిద్దిదమ్ ।
ఇన్లాదిసురవృన్దానాం సాధనైకఫలప్రదమ్ ॥ 37 ॥
శ్లో ॥ విపక్షకులసంహారకారణం శరణప్రదమ్ ।
శాన్తికం పౌష్టికం చైవం వశీకరణముత్తమమ్ ॥ 38 ॥
శ్లో ॥ మారణోచ్చాటనం కర్మాకర్షీకరణముత్తమమ్
సమస్తశోకశమనమానన్దవిధూదయమ్ ॥ 39 ॥
శ్లో॥ చతుః సముద్రపర్యన్హాం మేదినీం సాధకోత్తమమ్ |
ప్రీరత్నకులసందాయి పుత్రపౌత్రాదివర్ధనమ్ ॥ 40 ॥
తాత్పర్యం : పై జెప్పిన అనుష్టానము వలన బంగారము, రత్నములు, మాణిక్యములు
మొదలగు సంపద కలుగును. కాళీమాత దేవతలకు సైతము వారి సాధనల ఫలమును
ప్రసాదించునది. శత్రునాశనము చేసి, అభయమిచ్చి, శాన్తిని, పుష్టిని, వశీకరణశక్తిని
కలిగించునది. శత్రువును చంపుటకును, ఆకర్షణ కలిగించుటకును, అన్నివిధముల
దుఃఖములను శాంతింపజేయుటకును, ఆనందము పొందుటకును, నాలుగు సముద్రముల
వరకు వ్యాపించిన భూమిని సాధించుటకును, ఉత్తమస్త్రీలను, పుత్రపౌత్రాభివృద్ధిగ వంశము
నిలుచుటకును ఉత్తమమైన సాధనము ఈ అనుష్టానము. దీనివలన యే లోహమునైన
బంగారముగా మార్చగల రససిద్ధి కలుగును.
శ్లో ॥ ఆదౌ యన్రం ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా౭ మరతాం వ్రజేత్ ।
ఆదౌ త్రికోణం విన్యస్య త్రికోణన్తు బహిర్వ్యసేత్ ॥ 41 ॥
శ్లో ॥ తతో వై విలిఖేన్మస్తీ త్రికోణత్రయముత్తమమ్ ।
వృత్తం విలిఖ్య విధివల్లిఖేత్ పద్మం సులక్షణమ్ ॥ 42 ॥
తాత్పర్యం : ఏ యంత్రమును తెలిసికొనుటవలన దేవత్వము సిద్ధించునో ఆ యంత్రమును
మొదట చెప్పెదను. మొదట అధోముఖముగా నున్న త్రికోణమును వ్రాసి, దానిని కేంద్రముగా
చేసికొని నాలుగు దిక్కుల నాలుగు త్రికోణములను వ్రాయవలెను. ఇవి యన్నియు సమముగా
నుండవలయును. ఈ (త్రికోణముల కేంద్రమును స్థిరీకరించి దానినుండి వెలుపల ఒక
వృత్తమును వానిచుట్టు నుండునట్లు వ్రాయవలెను. ఆ వృత్తమునకు వెలుపల ఒక అష్టదళ
పద్మమును (ఎబ్బచందనముతో) వ్రాయవలెను. ఆ పద్మమునకు వెలుపల మరియొక
వృత్తమును వ్రాసి, ఆ వృత్తమునకు వెలుపల నాలుగు ద్వారములుగల చతురస్ర భూపురమును
వ్రాయవలెను. మొదట వ్రాసిన కేంద్రీయ త్రికోణమున ఒక ఎజ్జిని చుక్క రెండు, క్రీం క్రీం అను బీజములను వ్రాయవలయును.
శ్లో ॥ పీఠపూజాం తతః కృత్వా వామే చార్హ్యం ప్రకల్పయేత్ ।
మూలవిద్యాం షడజ్లేన మూలమన్రేణ పూజయేత్ ॥ 43 ॥
శ్లో॥ తతో హృదయపద్మాన్తే స్ఫురన్తీం సంవిదాకలామ్ ।
యన్రమధ్యే సమావాహ్య న్యాసజాలం ప్రవిన్యసేత్ ॥ 44 ॥
శ్లో॥ తతో ధ్యాత్వా మహాదేవీముపచారాన్ ప్రకల్పయేత్ ।
నమస్కృత్య మహాదేవీం తతశ్చావరణం చరేత్ ॥ 45 ॥
తాత్పర్యం : ఆ తరువాత పీఠపూజ చేసి, ఎడమవైపున అర్థ్య్య జలాన్నుంచి, మూలవిద్యను
మూలమంత్రంతో షడంగపూజచేసి, ఆపై సాధకుని హృదయపద్మంలో ప్రకాశించే
సంవిద్రూపదేవిని యంత్రమధ్యంలో (శ్రద్ధగా ఆవాహన చేసి, అంగన్యాస కరన్యాస
వర్ణన్యాసాదులతో అర్చించి, అటుపై మహాదేవిని ధ్యానించి, షోడశోపచారాలను చేసి,
నమస్కరించి, ఆపై ఆవరణాన్ని కూడ పూజింపవలెను.
మూలవిద్య అంటే మంత్రాధిష్టాన దేవత. మూలమంత్రం ద్వావింశత్యక్షరీ విద్యారాజ్జీ
మంత్రం. అంగన్యాసాదులు ముందు వివరించబడినవే. ఆవాహన, ఆసన, పాద్య, అర్హ్య,
ఆచమనీయ, అభిషేక, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, తాంబూల,
ప్రదక్షిణ, నమస్కారాలు షోడశోపచారాలు. యంత్రం మధ్యలోని త్రికోణం చుట్టూ ఉన్నవి
ఆవరణం.
శ్లో ॥ అన్తరాత్మావశేషాత్తు నతో బ్రహ్మాదికాం జపేత్ |
కాలీం కపాలినీం కుల్లాం కురుకుల్లాం విరోధినీమ్ ॥ 46 ॥
శ్లో ॥ విప్రచిత్తాం చ సంపూజ్య షట్మోణేషు బహిస్తతః ।
ఉ(గ్రాముగ్రప్రభాం దీప్తాం తథా త్రికోణకే యజేత్ ॥ 47 ॥
శ్లో ॥ నీలాం ఘనాం బలాకాం చ తథా త్రికోణకే యజేత్ ।
మాతాం ముద్రాం మితాం చైవ తథా బాహ్యత్రికోణకే ॥ 48 ॥
శ్లో ॥ సర్వశ్యామామసికరాం ముణ్జమాలోపశోభితామ్ I
తర్ణన్యా వామహస్తేన ధారయేత్ తాం శుచిస్మితాః ॥ 49 ॥
తాత్సర్యం : చెదరని శ్రద్ధతో వినయంగా అంతరాత్మయందు ప్రణవబ్రహ్మాదులను నిల్పి,
జపించి, ఆ యంత్రమున గల అయిదు త్రికోణములకు సంబంధించిన దేవతలను
పూజించవలెను. ఈ పూజాక్రమము ఎడమవైపు నుండి కాలిని, కపాలినిని, కుల్లను,
కురుకుల్లను, విరోధినిని, విప్రచిత్తను, ఉగ్రను, ఉగ్రప్రభను, దీప్తను, నీలను, ఘనను,
బలాకను, మాత్రను, ముద్రను, మితను - ఈ పదునెనుగురు దేవతలను పూజింపవలెను.
ఈ దేవతలందజు నల్లనివారు. కుడిచేత ఖడ్గమును ధరించి, ఎడమ భుజముపై శిక్షించు
దండముతో నుందురు. వీరి కంఠములలోను తల పుజ్టిలమాల యుందగా ముఖమున
నవ్వు విరాజిల్లుచుండును.
శ్లో॥ తతో వై మాతరః పూజ్యాః బ్రహ్మీ నారాయణీ పురా |
మాహేశ్వరీ చ చాముణ్డా కౌమారీ చైవ వల్లభా ॥ 50 ॥
శ్లో॥ వారాహీ చ తథా పూజ్యా నారసింహీ తథైవ చ ।
సర్వాసాం దేవతానాం చ బలిపూజా తథెవ చ ॥ 51 ॥
శ్లో ॥ శృజ్ఞానులేపనం గన్గపుష్పధూపాదికం తథా |
త్రిస్త్రీః పూజా ప్రకర్తవ్యా సర్వాసామపి సాధకైః ॥ 52 ॥
శ్లో ॥ ఏవం పూజాం పురా కృత్వా మూలేనైవ యథావిధిమ్ |
నైవేద్యం చ తథా శక్త్యా దేవ్యై దద్యాద్యథా పునః ॥ 53 ॥
శ్లో॥ తతో వై దశవారం తు దీపం దద్యాత్తు సాధకః ।
పుష్పాదికం పునః దద్యాన్మూలేనైవ యథావిధి ॥ 54 ॥
తాత్పర్యం : ఆ తరువాత బ్రహ్మీ నారాయణీ, మాహేశ్వరీ, చాముండా, కౌమారీ, వల్లభా
(అపరాజితా), వారాహీ, నారసింహీ అనుపేర్లుగల అష్టమాతృకలను పూజింపవలెను.
ప్రతిదేవతకు ముమ్మారు చందనలేపన, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాలను
సమర్పించవలెను. విధివిహితముగ శక్తికొలది పూజింపవలెను. ఆపై మూలదేవతారాధనచేసి,
నైవేద్యమిడి, పదిసార్లు దీపదర్శనము చేయించవలెను. మరల మూలమంత్రంతో యథావిధి
పుష్పాదులర్పింపవలెను.
సప్తమాతృకలుగా ప్రసిద్ధియున్నను, అష్టమాతృకలుగా పేర్మొనుట కద్దు. పై శ్లోకంలో
చెప్పబడినట్లే కాక మతభేదాలూ కన్పిస్తాయి. ఇక్కడ చెప్పబడిన వారిలో అపరాజిత స్థానంలో
చండీ, నారాయణీ స్థానంలో వైష్ణవీ, వారాహీ స్థానంలో చర్చికా అనుపేర్లు కొంద-
బుదహరింతురు. సప్తమాతృకలలో మాహేశ్వరీ బదులు యోగేశ్వరీ, నారాయణీ బదులు
వైష్ణవీ, చాముండా బదులు చాముండీ, చర్చికా బదులు వారాహీ, చండీ బదులు ఇంద్రాణిని
చెప్పి, బ్రాహ్మీ, కౌమారీని చెప్పుదురు. నామరూపభేదాలుగానే భావింపబడువారు. శ్లోకంలో
అపరాజితా, చండీయను శక్తిమాతృకకే వల్లభాయని కూడ పేరున్నట్లు కనబడు తూన్నది.
శ్లో ॥ తతో సావహితో భూత్వా గురూన్నత్వా శిరః స్థితాన్ I
ఏవం దేవీం తతో ధ్యాత్వా ఇతి మన్రేణ మన్రవిత్ ॥ 55 ॥
శ్లో ॥ తతః శిరసి వై పుష్పం దత్వాష్టాజ్ఞం ప్రణమ్య చ ।
విసృజ్య పరయా భక్త్యా సంహారేణెవ ముద్రయా ॥ 56 ॥
శ్లో ॥ దేవీం ధ్యాత్వా తు హృదయే తన్మయో భవతి ధృవమ్ I
పురశ్చరణ కాలే తు పూజా చైవ ప్రకీర్తితా ॥ 57 ॥
తాత్పర్యం : అంతట మంత్రసాధకుడు మనస్సును లగ్నము చేసి గురువులను నమస్మరించి,
దేవిని ధ్యానించి మంత్రమును జపిస్తూ, పుష్పమును శిరస్సుపై ధరించి, అమవ్టాంగప్రణామం
చేసి, పరమభక్తితో చేతులు జోడించి, హృదయంలో దేవిని ధ్యానించి, దేవీమయుడగును.
పురశ్చరణకాలంలో కూడా పై జెప్పబడిన పూజావిధానమునే అనుసరించుట సంప్రదాయము.
సంప్రదాయానుసారం, మూలమంత్రజపం 1008 సార్లు చేసి, చివరలో దేవికే ఆ జపఫలాన్ని సమర్పిస్తూ,
శ్లో ॥ గుహ్వాతి గుహ్యగోప్రీ త్వం గృహాణాస్మత్మృతం జపమ్ |
సిద్ధిర్భవతు మే దేవి! త్వత్రసాదాన్మహేశ్వరి ॥ 58 ॥
అను ఈ నివేదన శ్లోకాన్ని పఠించి, అప్పుడు దేవీ ప్రసాదంగా పుష్పాన్ని తన
తలపై ఉంచి, దేవిని హృదయంలో నింపి, సాధకుడు, దేవీమయుడవుతాడు. ఇది సత్యం.
No comments:
Post a Comment