Friday, July 25, 2025

Sowbhagya Lakshmi Ravamma - సౌభాగ్య లక్ష్మి రావమ్మా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా


నుదుట కుంకుమ రవి బింబముగా
కన్నులు నిండుగా కాటుక వెలుగా

కాంచన హారము గళమున మెరియగా
పీతాంబరముల శోభలు నిండగా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 )

నిండుగా కరముల బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు

గల గల గలమని సవ్వడి చేయగా
సౌభాగ్య వతుల సేవలు నందగా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

నిత్య సుమంగళి నిత్య కళ్యాణి
భక్త జనులకు కల్పవల్లి

కమలాసనవై కరుణ నిండగా
కనక వృష్టి కురిపించే తల్లి

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

జనకరాజుని ముద్దుల కొమరిత
రవికుల సోముని రమణీమణివై

సాధు సజ్జనుల పూజలందుకొని
శుభములనిచ్చే దీవెన లీయగ

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా


కుంకుమ శోభిత పంకజ లోచని
వేంకట రమణుని పట్టపురాణి

పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే
పుణ్యమూర్తి మా ఇంట వెలసిన

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

సౌభాగ్యమ్ముల బంగరు తల్లి
పురందర విఠలుని పట్టపు రాణి

ప్రతి నిత్యంబున పూజలందుకొన
సర్వకాలములు శుభ ఘడియలుగా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా

No comments:

Post a Comment

Sri Maha Kali Kavacham - శ్రీ మహాకాళీ కవచం

శ్రీ మహాకాళీ కవచం ఓం శిరోమే కాళికా పాతుక్రీంకారైకాక్షరీ పరా క్రీం క్రీం క్రీం మే లలాటం చ కాళికా ఖడ్గ ధారిణీ ॥ 01  ॥ హూం హూం పాతు నేత్రయుగ్మం...