Sunday, July 13, 2025

Ganesha Chaturthi Pooja Vidhanam - గణేశ చతుర్థి పూజా విధానం, వ్రత కల్పం

గణేశ చతుర్థి పూజా విధానం, వ్రత కల్పం

ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥

అయం ముహూర్తస్సుముహూర్తోఽస్తు ।
తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం 
చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ, 
లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి, సుముహూర్తోఽస్తు ।

యశ్శివో నామరూపానభ్యాం యాదేవీ సర్వమంగళా ।
తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళమ్ ॥

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ।
యేషామిందీవరశ్ష్యామో హృదయస్థోజనార్థనః ॥

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ।
లోకాభిరామం శ్రీరామం భూయో భూయోనమామ్యహమ్ ॥

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ॥

ధూమ్రకేతు-ర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండ-శ్శూర్పకర్ణో హేరంబ-స్స్కందపూర్వజః ॥

షోడశైతాని నామాని యః పఠే-చ్ఛృణు-యాదపి ।
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥

అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి ।
సర్వవిఘ్నచ్చిదేతస్మై శ్రీ మహాగణాధిపతయే నమః ॥

ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః ।
ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః ।
ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ।
ఓం శచీపురందరాభ్యాం నమః ।
ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ।
ఓం శ్రీ సితారామాభ్యాం నమః ॥
నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః 
అయం ముహూర్త-స్సుముహూర్తోఽస్తు ॥

శరీర శుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపివా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ॥
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః ।

ఆచమనః
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా)
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య)
ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య)
ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య)
ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య)
ఓం వాసుదేవాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా)
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా)
ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా)
ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా)
ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య)
ఓం హరయే నమః
ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా)
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు । భూత పిశాచాః । యే తే భూమిభారకాః । 
యే తేషామవిరోధేన । బ్రహ్మకర్మ సమారభే । 
ఓం భూర్భువస్సువః ।
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

ప్రాణాయామః
ఓం భూః । ఓం భువః । ఓగ్ం సువః । 
ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓగ్ం స॒త్యమ్ ।
ఓం తథ్సవితుర్వరేణ్యం॒ భర్గో॑ దేవస్య ధీమహి ।
ధియో యోనః ప్రచోదయాత్ ॥
ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ॥

సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర-ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః - జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా - క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, ... సంవత్సరే, ... అయనే, ... ఋతే, ... మాసే, ... పక్షే, ... తిథౌ, ... వాసరే, ... శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, ... గోత్రః, ... నామధేయః, ... గోత్రస్య, ... నామధేయోహం ... మమ ధర్మపత్నీ సమేతస్య, అస్మాకం సహకుటుంబస్య, క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృధ్హ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్థం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం కరిష్యే ।

కలశ పూజ
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర-స్సమాహితః ।
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః ॥

కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వ్వీపా వసుంధరా ।
ఋగ్వేదోధ యజుర్వేద-స్సామవేదో-హ్యధర్వణః ॥
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ।

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ ।
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ॥

ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః ।
(కలశోదకేన పూజాద్రవ్యాణి, ఆత్మానం, దేవం చ సంప్రోక్ష్య)

ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవమ్ । 
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ॥

శ్రీ వరసిద్ధి వినాయక దేవతాయే నమః ।
అథ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే ।

షోడశోపచార పూజా

ప్రార్థన
భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణమ్ ।
విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే ॥

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ ।
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధివినాయకమ్ ॥

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్ ।
భక్తాభీష్టప్రదం తస్మాద్ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ॥

షోడసోపచార పూజా

ధ్యానం
ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభమ్ ।
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి ।

ఆవాహనం
అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర ।
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి ।

ఆసనం
మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ ।
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి ।

అర్ఘ్యం
గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరప్రియనందన ।
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి ।

పాద్యం
గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక ।
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి ।

ఆచమనీయం
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత ।
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి ।

మధుపర్కం
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ ।
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి ।

పంచామృత స్నానం
స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక ।
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి ।

శుద్ధోదక స్నానం
గంగాదిసర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః ।
స్నానం కురుష్య భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ।
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి ।

వస్త్రం
రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్ ।
శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి ।

యజ్ఞోపవీతం
రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ ।
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి ।

గంధం
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ ।
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి ।

అక్షతాన్
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ ।
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి ।

పుష్పాణి
సుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ ।
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి ।

అథాంగపూజా
ఓఓ గణేశాయ నమః - పాదౌ పూజయామి ।
ఓఓ ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి ।
ఓఓ శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి ।
ఓఓ విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి ।
ఓఓ ఆఖువాహనాయ నమః - ఊరూం పూజయామి ।
ఓఓ హేరంబాయ నమః - కటిం పూజయామి ।
ఓఓ లంబోదరాయ నమః - ఉదరం పూజయామి ।
ఓఓ గణనాథాయ నమః - నాభిం పూజయామి ।
ఓఓ గణేశాయ నమః - హృదయం పూజయామి ।
ఓఓ స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి ।
ఓఓ స్కందాగ్రజాయ ణమహ శ్కంధౌ పోఓజయామి ।
ఓఓ పాశహస్తాయ ణమహ హస్థౌ పోఓజయామి ।
ఓఓ గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి ।
ఓఓ విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి ।
ఓఓ శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి ।
ఓఓ ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి ।
ఓఓ సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి ।
ఓఓ విఘ్నరాజాయ నమః - సర్వాంగాణి పూజయామి ।

అథైకవింశతి పత్రపూజ
సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి (దర్భ) ।
గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి ।
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి (మారేడు) ।
గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి(గరిక) ।
హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త) ।
లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి (రేగు) ।
గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి) ।
గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి ।
ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి (ఆమ్ర) ।
వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి (గన్నేరు)।
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి ।
వటవేనమః - దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ) ।
సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి ।
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి ।
హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి ।
శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి ।
సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి ।
ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి (జమ్మి) ।
వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి (రావి) ।
సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి (మద్ది) ।
కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి (జిల్లేడు) ।
శ్రీ గణేశ్వరాయ నమః - ఏకవింశతి పత్రాణి పూజయామి ।

ఏకవింశతి పుష్ప పూజా
ఓం పంచాస్య గణపతయే నమః - పున్నాగ పుష్పం సమర్పయామి ।
ఓం మహా గణపతయే నమః - మందార పుష్పం సమర్పయామి ।
ఓం ధీర గణపతయే నమః - దాడిమీ పుష్పం సమర్పయామి ।
ఓం విష్వక్సేన గణపతయే నమః - వకుళ పుష్పం సమర్పయామి ।
ఓం ఆమోద గణపతయే నమః - అమృణాళ(తామర) పుష్పం సమర్పయామి ।
ఓం ప్రమథ గణపతయే నమః - పాటలీ పుష్పం సమర్పయామి ।
ఓం రుద్ర గణపతయే నమః - ద్రోణ పుష్పం సమర్పయామి ।
ఓం విద్యా గణపతయే నమః - ధత్తూర పుష్పం సమర్పయామి ।
ఓం విఘ్న గణపతయే నమః - చంపక పుష్పం సమర్పయామి ।
ఓం దురిత గణపతయే నమః - రసాల పుష్పం సమర్పయామి ।
ఓం కామితార్థప్రద గణపతయే నమః - కేతకీ పుష్పం సమర్పయామి ।
ఓం సమ్మోహ గణపతయే నమః - మాధవీ పుష్పం సమర్పయామి ।
ఓం విష్ణు గణపతయే నమః - శమ్యాక పుష్పం సమర్పయామి ।
ఓం ఈశ గణపతయే నమః - అర్క పుష్పం సమర్పయామి ।
ఓం గజాస్య గణపతయే నమః - కల్హార పుష్పం సమర్పయామి ।
ఓం సర్వసిద్ధి గణపతయే నమః - సేవంతికా పుష్పం సమర్పయామి ।
ఓం వీర గణపతయే నమః - బిల్వ పుష్పం సమర్పయామి ।
ఓం కందర్ప గణపతయే నమః - కరవీర పుష్పం సమర్పయామి ।
ఓం ఉచ్ఛిష్ఠ గణపతయే నమః - కుంద పుష్పం సమర్పయామి ।
ఓం బ్రహ్మ గణపతయే నమః - పారిజాత పుష్పం సమర్పయామి ।
ఓం జ్ఞాన గణపతయే నమః - జాతీ పుష్పం సమర్పయామి ।

ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా
ఓం గణాధిపాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం పాశాంకుశధరాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఆఖువాహనాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం వినాయకాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఈశపుత్రాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఏకదంతాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఇభవక్త్రాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం మూషకవాహనాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం కుమారగురవే నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం కపిలవర్ణాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం బ్రహ్మచారిణే నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం మోదకహస్తాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సురశ్రేష్ఠాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం గజనాసికాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం కపిత్థఫలప్రియాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం గజముఖాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సుప్రసన్నాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం సురాగ్రజాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం ఉమాపుత్రాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।
ఓం స్కందప్రియాయ నమః - దూర్వాయుగ్మం సమర్పయామి ।

ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి

శ్రీ వినాయక అష్టోత్తరశత నామ పూజా
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః (10)

ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)

ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః (30)

ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః (40)

ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వసిద్ధాయ నమః
ఓం సర్వవంద్యాయ నమః (50)

ఓం నర్వసిద్ది-ప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసుర-భంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః (60)

ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః (70)

ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంత-పదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః (80)

ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్క్షిప్త-వారణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః (90)

ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః (100)

ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షా-విధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
శ్రీ మహాగణాధిపతయే నమః ।
నానావిధ పరిమళ పత్రపుష్ప పూజాం సమర్పయామి ।

ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ ।
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి ।

దీపం
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా ।
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః దీపం దర్శయామి ।

నైవేద్యం
సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ ।
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ॥
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ।
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి ।

తాంబూలం
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతమ్ ।
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి ।
తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి ।

నీరాజనం
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా ।
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి ।
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి ।

మంత్రపుష్పం
గణాధిప నమస్తేఽస్తు ఉమాపుత్రాఘనాశన ।
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక ॥
ఏకదంతైకవదన తథా మూషకవాహన ।
కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్ ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి ।

ప్రదక్షిణం
ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ ।
మద్విఘ్నం హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక ॥
ఆఖువాహన దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక ।
ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద వరదో భవ ॥
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ ।
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః ।
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష వినాయక ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః 
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।

సాష్టాంగ నమస్కారం
నమో నమో గణేశాయ నమస్తే విశ్వరూపిణే ।
నిర్విఘ్నం కురు మే కామం నమామి త్వాం గజాననా ॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ ।
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ॥
నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే ।
మమాభీష్టప్రదో భూయో వినాయక నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి ।

ప్రార్థన
ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక ।
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్ ॥
వినాయక వరం దేహి మహాత్మన్ మోదకప్రియ ।
అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ।

రాజోపచార పూజా
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । ఛత్రమాచ్ఛాదయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । చామరైర్వీజయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । గీతం శ్రావయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । నృత్యం దర్శయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । వాద్యం ఘోషయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । ఆందోళికాన్ ఆరోహయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । అశ్వాన్ ఆరోహయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । గజాన్ ఆరోహయామి ।
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః । సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి ।

పునరర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ హేరంబ వరప్రద వినాయక ।
గంధపుష్పాక్షతైర్యుక్తం భక్త్యా దత్తం మయా ప్రభో ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాయక ।
పునరర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

నమస్తే భిన్నదంతాయ నమస్తే హరసూనవే ।
యిదమర్ఘ్యం ప్రదాస్యామి గృహాణ గణనాయక ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

గౌర్యంగమలసంభూత స్వామి జ్యేష్ఠ వినాయక ।
గణేశ్వర గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే ॥
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యమ్ ।

సమర్పణం
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు ।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ ॥
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక ।
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥

అనయా ధ్యానావహనాది షోడశోపచార పూజయా భగవాన్ 
సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ।

విఘ్నేశ్వర కథా

వినాయక వ్రత కథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి. పూర్వం చంద్ర వంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని, పోగొట్టుకుని.. భార్య, సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి.. తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం, వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకున్నాడు. అంతట ఆ సూతమహర్షి.. శకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోషకారణం, శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగేను. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుడ్ని మెప్పించి.. తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. దీంతో అసరుడు అతడు అజేయుడైనాడు.

తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖితురాలైంది.. దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి.. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు. గంగిరెద్దును ఆడించి గజాసరుడ్ని మెప్పించాడు ఈ ఆనందంలో ‘ఏమి కావాలో కోరుకో’ అని గజాసరుడు అనగా.. అదే సమయం కోసం ఎదురుచూస్తోన్న శ్రీమన్నారాయణుడు.. నీ ఉదరమందున్న శివుడ్ని తమ వశం చేయమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షియందున్న శివుని ఉద్దేశించి ‘ప్రభూ శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియుచున్నది.. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు.. నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కల్గించాడు. శివుడు గజాసురుని శిరస్సు, చర్మం తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు.

తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.

దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు....ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు...గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు.

సర్వవిఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుని కోరతారు. ఈ విషయంలో గణపతి, కుమారస్వామి ఎవర్ని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు.. ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలివాహనంపై రువ్వున ఎగిరిపోగా.. వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆవిధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి, మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు.

గణేశుడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.

శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు.. గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజ‌దృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయి.. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.

పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషి పత్నుల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్తఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు. తర్వాత పార్వ‌తీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.


శ్యమంతకోపాఖ్యానం:
ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని ఓ నారద మహర్షి కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వామీ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు. రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.

శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన మీద నింద పడిందనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు. ‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.

కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి... అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి.

.ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః
తాని ధర్మాణి ప్రధమాన్యాసన్!
తే హ నాకం మహిమానః సజంతే
యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః
శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామిన్‌ యథాస్థాన ముద్వాసయామి ఈ మంత్రం చెబుతూ ఉద్వాసన చెప్పాలి. (వినాయక చవితి రోజునే విగ్రహం నిమజ్జనం చేయాలంటే పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పొచ్చు.. లేదంటే ఏ రోజు విగ్రహం నిమజ్జనం చేస్తారో అప్పుడు మాత్రమే ఉద్వాసన చెప్పాలి)

వినాయక మంగళాచరణం

॥ తొండమునేకదంతము తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిపా! నీకు మ్రొక్కెదన్

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిను ప్రార్ధన జేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!

॥ తలచితినే గణనాథుని
తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని
దలచిన నా విఘ్నములను తొలగుట కొరకున్

అటుకులు కొబ్బరి పలుకులు
చిటి బెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్
నిటలాక్షునగ్ర సుతునకు
పటుకరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య – 
ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు ।
కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును – 
బొజ్జవిరుగగ దినుచు పొరలుకొనుచు। 
|| జయ మంగళం నిత్య శుభ మంగళమ్ || 

వెండిపళ్ళెరములో వెయివేల ముత్యాలు – 
కొండలుగ నీలములు కలియబోసి ।
మెండుగను హారములు మెడనిండ వేసికొని – 
దండిగా నీకిత్తు ధవళారతి ॥ జయ

శ్రీమూర్తివంద్యునకు చిన్మయానందునకు - 
భాసురస్తోత్రునకు శాశ్వతునకు ।
సోమార్కనేత్రునకు సుందరాకారునకు - 
కామరూపునకు శ్రీ గణనాధునకును ॥ జయ

ఏకదంతంబును ఎల్లగజవదనంబు – 
బాగయిన తొండంబు వలపు కడుపు ।
జోకయున మూషికము సొరిదినెక్కాడుచును – 
భవ్యుడగు దేవగణపతికి నిపుడు ॥ జయ

చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు 
తామరలు తంగేడు తరచుగాను ।
పుష్పజాతులు తెచ్చి పూజింతు 
నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ॥జయ

No comments:

Post a Comment

Arunachala Akshara Mani Mala Stotram - అరుణాచల అక్షర మణి మాలా స్తోత్రం

అరుణాచల అక్షర మణి మాలా స్తోత్రం ఓం నమో భగవతే శ్రీ రమణాయ అరుణాచల అక్షర-మణిమాల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ ...