Tuesday, July 15, 2025

Prahlada - ప్రహ్లాదుడు

ప్రహ్లాదుడు

ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన హిరణ్యకశిపుని కుమారుడు. దేవతులకు బద్ధ శత్రువులైన రాక్షస జాతిలో జన్మించి, తన తండ్రికి విరోధియైన శ్రీమహావిష్ణువునే స్మరించి ముక్తి పొందిన వాడు.

ప్రహ్లాదుని తల్లి లీలావతి. 

జననము
హిరణ్య కశిపుడు రాక్షస రాజు. తన సోదరుడు హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతడిని ఏం వరం కావాలో కోరుకొమ్మని అంటాడు. దాంతో రాక్షస రాజు తనకు ఇంటగాని బయట గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని పగలు గాని, దేవ దానవ మనుషుల చేత గాని చంప బడకుండుటకు వరము కావాలని కోరుతాడు. బ్రహ్మ ఆ వరానిస్తాడు. అప్పటి నుండి హిరణ్య కశిపుడు తనకు తిరుగు లేదని, తనకు మరణము లేదని విర్ర వీగుతూ దేవతలను, ఋషులను అనేక విధముల బాదింప సాగెను. హిరణ్య కశిపుని బాధలను భరింప లేక దేవతలందరు శ్రీహరికి మొర పెట్టుకోగా విషయమును గ్రహించిన శ్రీ హరి వారికి అభయమిస్తాడు.

రాక్షసులకు దేవతలకు ఎల్లప్పుడు యుద్ధాలు జరుగు తుండేవి. రాక్షసుల శత్రువైన ఇంద్రుడు గర్భవతియైన హిరణ్య కశిపుని భార్యను ఎత్తుకొని వెళతాడు. ఆమె గర్బములోనున్న వాడిని చంపడానికి. ఇది చూచిన నారదుడు ఇంద్రున్ని వారించి ఆమె గర్భములో పుట్ట బోయే వాడు దేవతలకు మిత్రుడౌతాడని నచ్చజెప్పి ఆమెను తన ఆశ్రమములో సేద దీర్చుతాడు. నారదుడు ఆమెకు విష్ణు భక్తి మాటలు నేర్పి, ఆమె గర్భములో వున్న ప్రహ్లదునికి విష్ణు గీతములు బోధించి అతడిని విష్ణు భక్తునిగ తీర్చి దిద్ది అమెను, భర్థ హిరణ్య కశిపుని ఇంట విడిచి పెట్టెను. కొంతకాలానికి లీలావతి ప్రసవిస్తుంది.ఆ శిశువుకు ప్రహ్లాదుడని నామ కరణము చేస్తారు. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను నారద ముని ఆశ్రమమునుండి తీసుకెళ్ళి, సమస్త లోకాలనూ జయించి దేవతలను బానిసలుగా చేసుకొంటాడు.

విద్యాబ్యాసం
ఆ బాలుడెప్పుడు విష్ణు నామమును జపించు చుండెను. గురువుల విద్య నేర్చుకుంటూనే విష్ణు నామ జపాన్ని విడువలేదు. ప్రహ్లాదుడు గురువులు చెప్పినవి వినుచు గూడా తన హరినామస్మరణము మానలేదు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని చదువు పరీక్షి౦చ దలచి పిలచి యడుగగా, “చక్రహస్తుని ప్రకటించు చదువే చదువు”అనుచు విష్ణుమహిమను గుర్చి యుపన్యసించేను. రాక్షసరాజు గురువులపై కోపి౦చగా వారాతనిని మరల గురుకులమునకు దిసుకుపోయి రాక్షసోచితవిద్యలు నేర్పసాగిరి. తిరిగి కొన్నాళ్ళకు తండ్రి పరీక్షించగా ప్రహ్లాదుడు “చదువులో మర్మమెల్ల చదివినా”ననుచు “విష్ణుభక్తియే తరణోపాయ”మనెను. అదివిని హిరణ్యకశిపుడు మహా కోపముతో భటులను పిలిచి వీనిని చంపుడని యజ్ఞాపించేను.

వారు శూలముతో పొడిచారు. పాములచే కరిపించారి. ఏనుగులతో తొక్కించారు. కొండకొమ్ముల మీది నుండి పడదోసిరి. విషము బెట్టిరి. అగ్నిలో త్రోసిరి. సముద్రములో ముంచివేసిరి. అన్నము నీరు పెట్టక మాడ్చిరి. ఎన్నిచేసినను ప్రహ్లాదుడు చావలేదు. హరినామస్మరణ మానలేదు. కొంచెము గూడా భయపడలేదు. ఎన్నిచేసినను చావని కొడుకును చూచి రాక్షసరాజు ఆశ్చర్యపడి, చిన్న పిల్లవాడైనందున ఇట్లు చేయు చున్నాడని తలచి పెద్దైనచో మార గలడని తలచి రాక్షస గురువులను పిలిపించి వీనికి మరలా విద్య బోధించమని ఆజ్ఞాపించెను.

రాక్షస గురువులు వీనికి మరల విద్యలు బోధించెదమని తిసికొనిపోగా, ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షసబాలురను ప్రోగుచేసి వారిచేతగూడా హరినామస్మరణ చేయసాగాడు. గురువులు అందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో నీకొడుకును మేము చదివించలేము.వీడు మిగిలిన రాక్షసబాలకులను గూడా చెడగోట్టుచున్నాడు అనిచెప్పిరి. హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని బిలిపించి, నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి యెచ్చట నున్నడో చూపగలవా? అని యడుగగా ఆ భక్తుడు, ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందేండు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణి! అని సమాధానమిస్తాడు. దానికి దానవ రాజు మరింత మండిపడి యీ స్తంభమున వానిని జూపుమనుచు ఒక స్తంభమును గదతో పగుల గొట్టెను. దానినుండి నరసింహమూర్తి యావిర్భవించెను. స్తంభమునుండి నృసింహావతారమున వెలువడిన శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో (సగం మానవ రూపం, సగం సింహ రూపం), సంధ్యా సమయంలో (పగలు కాదు, రాత్రి కాదు), హిరణ్యకశిపుని ఒక గుమ్మం వద్దకు తీసుకువెళ్లాడు (ఇంటిలో కాదు, బయటికి కాదు), అతని ఒడిలో (అది భూమి కాదు, ఆకాశం కాదు, నీరు కాదు) పడుకోబెట్టి, ఆపై హిరణ్యకశపుడిని తన సింహపు గోళ్లతో పెకిలించి చంపాడు (అస్త్ర, శస్త్రాలు కాదు). ఈ రూపంలో, హిరణ్యకశిపునికి లభించిన ఐదు ప్రత్యేక అధికారాల వరం ఉపయోగపడలేదు. ప్రహ్లాదుడు, మానవులు హిరణ్యకశిపుని భయం నుండి విముక్తి పొందారు, ఇది చెడుపై మంచి విజయాన్ని చూపుతుంది.

No comments:

Post a Comment

Parvathi Vallabha Ashtakam - పార్వతీ వల్లభ అష్టకం

పార్వతీ వల్లభ అష్టకం నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజమ్ । నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ ॥ 0 1 ॥ ...