నవగ్రహ ఆరాధన
సూర్యుడు
సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది.
సూర్యునికోసం ఉపవాసముండేవారు సూర్యాస్తమయం లోపల రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఏమీ తీసుకోరు. తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. తామసిక ఆహారం ఉపవాసమున్నవారు తినరు.
సూర్యుడికి ప్రార్థనలుచేసి సూర్యునికి సంబంధించిన కథను చదవడంగానీ, వినడంగానీ చేస్తారు. అలా చదివిన తరువాతే ఆహారం తీసుకుంటారు.
సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి.
దానాలు:
గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి, ఆభరణాల్లో కెంపు దానమివ్వాల్సి ఉంటుంది. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం.
చంద్రుడు
సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం శివపార్వతులకు పూజలు చేస్తారు. ఆనందకరమైన వివాహజీవితం కావాలనుకునేవారు సోమవారం నాడు శివపార్వతులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.
పెళ్ళి కావల్సినవారు సరైన జీవితభాగస్వామి కోసం శివపార్వతులకు పూజలు చేసి ఉపవాసం ఉంటారు. భోజనం రోజుకి ఒకసారే చేస్తారు. తృణధాన్యాలు తీసుకోవచ్చు. శివపార్వతులకు ప్రార్థనలు చేసిన తర్వాత తగిన కథ చదువుకోవాలి.
చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు, వెండి ధరించాలి.
దానాలు:
బియ్యం, తెల్లటిదుస్తులు, శంఖం, వెండి, ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి.
కుజుడు
మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోషనివారణకు పన్నెండు మంగళవారాల ఉపవాసముండటం శుభప్రదం. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయాలి. దుస్తులు, పూలు ఎర్రటివి ధరించడం శ్రేయస్కరం.
గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒక సారి మాత్రమే తినాలి. హనుమంతుడికి పూజ చేసిన పిదప కథ చదువుకోవాలి.
కుజుడి అనుగ్రహం కోసం పగడపు ఉంగరం ధరించాలి.
దానాలు:
బుధుడు
బుధవారానికి అధిపతి బుధుడు. బుధవారం ఉపవాసం ఉండదల్చుకున్నవారు రోజుకి ఒకసారి ఆకుపచ్చటి ఆహార పదార్థాలు తినాలి. విష్ణుమూర్తికి పూజచేసుకుని కథ చదువుకోవాలి.
దానాలు:
బుధగ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు పెసలు, కస్తూరి, నీలపు దుస్తులు, బంగారం, రాగి వంటి వాటిని దానమివ్వాలి.
బృహస్పతి
గురువారానికి అధిపతి బృహస్పతి. సంపదకు గురుగ్రహం అనుగ్రహం ముఖ్యం. పసుపు పచ్చని దుస్తులు ధరించి గురువుకు ప్రార్థనలు చేసి కథ చదువుకోవాలి. రోజుకి ఒకసారే భోజనం చేయాలి.
బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని ధరించాలి.
దానాలు:
పసుపు, ఉప్పు, పసుపచ్చని దుస్తులు, బియ్యం వంటివాటిని దానమివ్వాలి.
శుక్రుడు
శుక్రవారానికి అధిపతి శుక్రుడు. రోజుకి ఒకపూటే భోజనం చేయాలి. భోజనంలో పాయసం ఉండాలి.
శుక్రుడి అనుగ్రహం పొందాలనుకునేవారు వజ్రాన్ని ధరించాలి. శుక్రవారం సంతోషిమాతకు పూజ చేసుకుని కథ చదువుకోవాలి. అమ్మవారికి హారతివ్వాలి. కటిక ఉపవాసముండాలి. పుల్లటి పదార్థాలు తినకపోవడమేకాదు, ఎవరికీ శుక్రవారం దానమివ్వకూడదు.
దానాలు:
బియ్యం, తెల్లటి దుస్తులు దానమివ్వలి.
శని
శనివారానికి అధిపతి శని. శనికి నల్లటి వస్తువులు, నల్లని దుస్తులు, నల్లని నువ్వులు, ఇనుము, నూనె లాంటి పదార్థలు ఇష్టం. శనిదేవతకు పూజచేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి.
శని ప్రీతికోసం నీలం రాయిని ధరించాలి.
దానాలు:
నల్ల గొడుగు, నల్లటి చెప్పులు, నల్లటి దుస్తులు, నల్ల నువ్వులు మొదలైన వాటిని దానమివ్వాలి.
రాహు
కేతు
ఇలా మన ఉపవాసంలో ఆరోగ్యరహస్యాలతో పాటు కుంటుంబక్షేమమూ దాగుంది.
No comments:
Post a Comment