శ్రీ శూలినీ దుర్గా మంత్రం
పిశాచ, బాధలు, ఆత్మ చే పీడించబడే వాళ్ళు, నిద్రలో తరచుగా లోయలో పడిపోతున్నటు భయపడే వాళ్ళు, తరచు ప్రమాదాలకు గురి అవుతున్న వాళ్ళు, వంశస్థులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుని ఆ కుటుంబాన్ని వదిలి వెళ్ళలేక ఇబంధులు పడుతున్న వారికి వారి బారి నుండి విముక్తి కి శూలిని దుర్గా ఉపసాకులు మటుకే పరిహారం చేయగలరు, అయితే ఎవరు నిజంగా అలా చేయగలరు అనేది అందరికి తెలియదు.. ఇలాంటి బాధలు ఉన్న వారు స్వయంగా ఈ మంత్రాన్ని సాధన చేసుకున్న చాలా ఉపశమనం కలిగి ఆ బాధ నుండి విముక్తి కలుగుతుంది...
అటువంటి ఇబ్బందులు పడుతున్న వారి గృహంలో ముందుగా ఆవు పంచకం తెచ్చి ఇల్లంతా చల్లాలి, అందరూ నెలపైన చల్లుతారు అటక పైన, స్టోర్ రూమ్ కూడా వదల కుండా వేపమండ తీసుకుని ఇల్లంతా చల్లాలి, తర్వాత పసుపు నీళ్లు చల్లాలి, చివరిగా సాంబ్రాణి వెలిగించి దానిపైన బిర్యానీ ఆకుని కూడా వేసి ఇల్లంతా సాంబ్రాణి వేయాలి.. ఒక నిమ్మపండు ని రెండుగా కోసి అందులో కుంకుమ పెట్టి గడపలో పెట్టాలి ఇదంతా చేశాక . ఒక నిమ్మకాయని విడిపోకుండా నాలుగు ముక్కలుగా కోసి అందులో కుంకుమ పెట్టి ఆ నిమ్మ దబ్బలో కర్పూరం వెలిగించి ఇంటికి దిష్టి తీశాఖ ఆ పండుని నాలుగు భాగాలుగా విడగొట్టి విసిరి వేసి బయటే కాళ్ళు చేతులు కడుక్కుని.. తిరిగి చూడకుండా ఇంట్లోకి రావాలి, గడపలో ఉన్న నిమ్మకాయ ముక్కలు మరుసటి రోజు వరకు అలా ఉంచి తీసేయాలి...(ఇంటికి చాలా దిష్టి ఉంది ఎప్పుడూ గొడవలు అవుతున్న కుటుంబ వాళ్ళు కూడా ఈవిధంగా చేయడం చాలా మంచిది). ఇది మంగళవారం, కానీ ఆదివారం కానీ , ఏదైనా రాహుకాలం సమయంలో కానీ చేయడం మంచిది. ఇలా చేసాక ఇక్కడ చెప్పిన పూజా విధానం చేయాలి.
ఈ మంత్రం ,ధ్యాన శ్లోకాన్ని ఎవరైనా జపం చేయవచ్చు.. మూల మంత్రం మటుకు ,గాయత్రి, బాల, శ్రీ విద్య లో ఏ మంత్రం ఉపదేశం ఉన్న వారు అయినా చేయవచ్చు.
పూజ విధానం: దుర్గా దేవి ఫోటోకి వేపమండలు గాని లేదా ఎర్రటి పుష్పలతో అలంకరించి.. సంకల్పం చెప్పుకోవాలి మీకోసం అయితే మీ గురించి వేరే వారికోసం అయితే వారి పేరు సమస్య సంకల్పములో చెప్పుకోవాలి సంకల్పానికి చాలా శక్తి ఉంటుంది అది మనసు పెట్టి చేయాలి. తర్వాత సాంబ్రాణి వెలిగించాలి ,బెల్లం అటుకులు ,ముఖ్యం(వీటితో పాటు ఉంటే ఏదైనా పండ్లు) నైవేద్యం పెట్టి ఇక్కడ ఇచ్చిన శ్లోకాన్ని జపం చేయాలి.
ధ్యానం శ్లోకం:
శ్లో : "బిభ్రాణాంశూలబాణాన పిముసలగదాచాపపాశాన్న్క రాబ్జై: మేఘశ్యామా కిరీటోల్లసితశశికళాభీషణాభూషణాఢ్యా | "
(ఈ ధ్యాన శ్లోకాన్ని రోజు 108 సార్లు జపించడం వల్ల ఆ శబ్దం ఇంట్లో పదే పదే పలకడం వల్ల త్వరగా ఆ బాధల నుండి విముక్తి కలుగుతుంది)
Subscribe to:
Post Comments (Atom)
Sri Maha Kali Kavacham - శ్రీ మహాకాళీ కవచం
శ్రీ మహాకాళీ కవచం ఓం శిరోమే కాళికా పాతుక్రీంకారైకాక్షరీ పరా క్రీం క్రీం క్రీం మే లలాటం చ కాళికా ఖడ్గ ధారిణీ ॥ 01 ॥ హూం హూం పాతు నేత్రయుగ్మం...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
|| గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) || ఓం భద్రం కర్ణే'భిః శృణుయామ' దేవాః | భద్రం ప'శ్యేమాక్షభిర్యజ'త్రాః | స...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment