Thursday, October 23, 2025

Usiri Chettu Kinda Deepam - ఉసిరి చెట్టు క్రింద దీపారాధన

ఉసిరి చెట్టు క్రింద దీపారాధన చేసి... వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా........!!

కార్తీకమాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా అని జనులు అన్వేషిస్తుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఉసిరి సకల మానవాళిని రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్దాప్యాన్ని దరిచేరనివ్వని ఔషద మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెపుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. 

సూత మహర్షి మునులందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కల్గిన వృక్షం మరియు దామోదరునికి (శ్రీహరికి) అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలసి వనభోజనాలను చేస్తారు. 

శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడి తోను మరియు తోటి గోప బాలకులతో కలసి ఉసిరి మొదలైన మహా వృక్షాల నీడన యమునా నదీ తీరాన, బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేసాడని భాగవతంలో వర్ణించబడినది. ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి.

ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి. ఉసిరి చెట్టుమీద ఈ కార్తీక మాసంలో నారాయణుడుంటాడనీ అందుకనే ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడుగా భావించి పూజ చెయ్యాలనీ శాస్త్రాల్లో చెప్పారు.

ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలని, ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలని పెద్దలు అంటుంటారు. ఈ కాలంలోనే ఉసిరి కాయలు బాగా వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. రోజూ ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు వున్నాయి. ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది. మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. శరీరంలో సమతుల్యం తీసుకువస్తుంది. ఈ చెట్టుగాలి కూడా చాలా మంచిది. అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వన భోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టుదగ్గర గడపాలని చెప్పారు. 

Monday, October 13, 2025

Sri Chinnamastha Sahasranama Sthothram - శ్రీ ఛిన్నమస్తా సహస్రనామ స్తోత్రం(విశ్వసార తంత్రం)

శ్రీ ఛిన్నమస్తా సహస్రనామ స్తోత్రం(విశ్వసార తంత్రం)

శ్రీగణేశాయ నమః ।

శ్రీదేవ్యువాచ
దేవదేవ మహాదేవ సర్వశాస్త్రవిదాంవర 

కృపాం కురు జగన్నాథ కథయస్వ మమ ప్రభో
  ॥ 01 ॥

ప్రచణ్డచణ్డికా దేవీ సర్వలోకహితైషిణీ ।
తస్యాశ్చ కథితం సర్వం స్తవం చ కవచాదికమ్‌
  ॥ 02 ॥

ఇదానీం ఛిన్నమస్తాయా నామ్నాం సాహస్రకం శుభమ్‌ ।
త్వం ప్రకాశయ మే దేవ కృపయా భక్తవత్సల
  ॥ 03 ॥

శ్రీ శివ ఉవాచ ।
శృణు దేవి ప్రవక్ష్యామి చ్చిన్నాయాః సుమనోహరమ్‌ ।
గోపనీయం ప్రయత్నేన యదీచ్చేదాత్మనో హితమ్‌
  ॥ 04 ॥

న వక్తవ్యం చ కుత్రాపి ప్రాణైః కణ్ఠగతైరపి
 ।
తచ్చృణుష్వ మహేశాని సర్వం తత్కథయామి తే
  ॥ 05 ॥

వినా పూజాం వినా ధ్యానం వినా జాప్యేన సిద్ధతి ।
వినా ధ్యానం తథా దేవి వినా భూతాదిశోధనమ్‌
  ॥ 06 ॥

పఠనాదేవ సిద్ధిః స్యాత్సత్యం సత్యం వరాననే ।
పురా కైలాసశిఖరే సర్వదేవసభాలయే
  ॥ 07 ॥

పరిపప్రచ్చ కథితం తథా శృణు వరాననే ।
ఓం అస్య శ్రీప్రచణ్డచణ్డికాసహస్రనామస్తోత్రస్య భైరవ ఋషిః ।

సమ్రాట్‌ ఛన్దః, ప్రచ
ణ్డణ్డికా దేవతా ।
ధర్మార్థకామమోక్షార్థే పాఠే వినియోగః
  ॥ 08 ॥

ఓం 
ప్రచణ్డణ్డికా చణ్డా చణ్డదైత్యవినాశినీ ।
చాము
ణ్డా చ సచణ్డా చ చపలా చారుదేహినీ  ॥ 09 ॥

లలజిహ్వా చలధ్రక్తా చారుచన్ద్రనిభాననా ।
చకోరాక్షీ చ
ణ్డనాదా చ్చలా చ మనోన్మదా  ॥ 10 ॥

చేతనా చితిసంస్థా చ చిత్కలా జ్ఞానరూపిణీ ।
మహాభయ్కరీ దేవీ వరదాభయధారిణీ
  ॥ 11 ॥

భవా
ఢ్యా భవరూపా చ భవబన్థవిమోచినీ ।
భవానీ భువనేశీ చ భవసంసారతారిణీ
  ॥ 12 ॥

భవాబ్ధిర్భవమోక్షా చ భవబన్థవిఘాతినీ
 ।
భాగీరథీ భగస్థా చ భాగ్యభోగప్రదాయినీ
  ॥ 13 ॥

కమలా కామదా దుర్గా దుర్గబన్థవిమోచినీ
 ।
దుర్దర్శనా దుర్గరూపా దుర్జేయా దుర్గనాశినీ
  ॥ 14 ॥

దీనదుఃఖహరా నిత్యా నిత్యశోకవినాశినీ
 ।
నిత్యానన్దమయా దేవీ నిత్యం కల్యాణకారిణీ
  ॥ 15 ॥

సర్వార్థసాధనకరీ సర్వసిద్ధిస్వరూపిణీ ।
సర్వక్షోభణశక్తిశ్చ సర్వవిద్రావిణీ పరా
  ॥ 16 ॥

సర్వర్జనశక్తిశ్చ సర్వోన్మాదస్వరూపిణీ ।
సర్వదా సిద్ధిదాత్రీ చ సిద్ధవిద్యాస్వరూపిణీ
  ॥ 17 ॥

సకలా నిష్కలా సిద్దా కలాతీతా కలామయీ ।
కులజ్ఞా కులరూపా చ చక్షురాన
న్దదాయినీ  ॥ 18 ॥

కులీనా సామరూపా చ కామరూపా మనోహరా ।
కమలస్థా క్జముఖీ క్జురేశ్వరగామినీ
  ॥ 19 ॥

కులరూపా కోటరాక్షీ కమలైశ్వర్యదాయినీ ।
కున్తీ కకుద్మినీ కుల్లా కురుకుల్లా కరాలికా
  ॥ 20 ॥

కామేశ్వరీ కామమాతా కామతాపవిమోచినీ ।
కామరూపా కామసత్వా కామకౌతుకకారిణీ
  ॥ 21 ॥

కారుణ్యహృదయా క్రీంక్రీంమన్త్రరూపా చ కోటరా
 ।
కౌమోదకీ కుముదినీ కైవల్యా కులవాసినీ
  ॥ 22 ॥

కేశవీ కేశవారాధ్యా కేశిదైత్యనిషూదినీ ।
క్లేశహా క్లేశరహితా క్లేశస్ఘవినాశినీ
  ॥ 23 ॥

కరాలీ చ కరాలాస్యా కరాలాసురనాశినీ ।
కరాలచర్మాసిధరా కరాలకలనాశినీ
  ॥ 24 ॥

క్కనీ క్కనిరతా కపాలవరధారిణీ
 ।
ఖడ్గహస్తా త్రినేత్రా చ ఖ
ణ్డముణ్డాసిధారిణీ  ॥ 25 ॥

ఖలహా ఖలహన్త్రీ చ క్షరన్తీ ఖగతా సదా ।
గ్గగౌతమపూజ్యా చ గౌరీ గన్ధర్వవాసినీ
  ॥ 26 ॥

న్ధర్వా గగణారాధ్యా గణా గన్ధర్వసేవితా ।
గణత్కారగణా దేవీ నిర్గుణా చ గుణాత్మికా
  ॥ 27 ॥

గుణతా గుణదాత్రీ చ గుణగౌరవదాయినీ ।
గణేశమాతా గమ్బీరా గగణా జ్యోతికారిణీ
  ॥ 28 ॥

గౌర్గా చ గయా గమ్యా గౌతమస్థానవాసినీ
 ।
గదాధరప్రియా జ్ఞేయా జ్ఞానగమ్యా గుహేశ్వరీ
  ॥ 29 ॥

గాయత్రీ చ గుణవతీ గుణాతీతా గుణేశ్వరీ
 ।
గణేశజననీ దేవీ గణేశవరదాయినీ
  ॥ 30 ॥

గణాధ్యక్షనుతా నిత్యా గణాధ్యక్షప్రపూజితా ।
గిరీశరమణీ దేవీ గిరీశపరివన్దితా
  ॥ 31 ॥

గతిదా గతిహా గీతా గౌతమీ గురుసేవితా ।
గురుపూజ్యా గురుయుతా గురుసేవనతత్పరా
  ॥ 32 ॥

న్ధద్వారా చ గన్ధాఢ్యా గన్ధాత్మా గన్ధకారిణీ ।
గీర్వాణపతిసమ్పూజ్యా గీర్వాణపతితుష్టిదా
  ॥ 33 ॥

గీర్వాణాధిశరమణీ గీర్వాణాధిశవన్దితా ।
గీర్వాణాధిశసంసేవ్యా గీర్వాణాధిశహర్షదా
  ॥ 34 ॥

గానశక్తిర్గానగమ్యా గానశక్తిప్రదాయినీ ।
గానవిద్యా గానసిద్దా గానసన్తుష్టమానసా
  ॥ 35 ॥

గానాతీతా గానగీతా గానహర్షప్రపూరితా ।
న్ధర్వపతిసంహృష్టా గన్ధర్వగుణమణ్డితా  ॥ 36 ॥

న్ధర్వగణసంసేవ్యా గన్ధర్వగణమధ్యగా ।
న్ధర్వగణకుశలా గన్థర్వగణపూజితా  ॥ 37 ॥

న్ధర్వగణనిరతా గన్ధర్వగణభూషితా ।
ఘర్ఘరా ఘోరరూపా చ ఘోరఘుర్ఘురనాదినీ
  ॥ 38 ॥

ఘర్మబిన్దుసముద్భూతా ఘర్మబిన్దుస్వరూపిణీ ।
ఘణ్టారవా ఘనరవా ఘనరూపా ఘనోదరీ
  ॥ 39 ॥

ఘోరసత్వా చ ఘనదా ఘ
ణ్టానాదవినోదనీ ।
ఘోరచాణ్డాలినీ ఘోరా ఘోరచణ్డవినాశినీ
  ॥ 40 ॥

ఘోరదానవదమనీ ఘోరదానవనాశినీ ।
ఘోరకర్మాదిరహితా ఘోరకర్మనిషేవితా
  ॥ 41 ॥

ఘోరతత్వమయీ దేవీ ఘోరతత్వవిమోచనీ ।
ఘోరకర్మాదిరహితా ఘోరకర్మాదిపూరితా
  ॥ 42 ॥

ఘోరకర్మాదినిరతా ఘోరకర్మప్రవర్ధినీ ।
ఘోరభూతప్రమథినీ ఘోరవేతాలనాశినీ
  ॥ 43 ॥

ఘోరదావాగ్నిదమనీ ఘోరశత్రునిషూదినీ ।
ఘోరమన్త్రయుతా చైవ ఘోరమన్త్రప్రపూజితా
  ॥ 44 ॥

ఘోరమన్త్రమనోభిజ్ఞా ఘోరమన్త్రఫలప్రదా ।
ఘోరమన్త్రనిధిశ్చైవ ఘోరమన్త్రకృతాస్పదా
  ॥ 45 ॥

ఘోరమన్త్రేశ్వరీ దేవీ ఘోరమన్త్రార్థమానసా ।
ఘోరమన్త్రార్థతత్వజ్ఞా ఘోరమన్త్రార్థపారగా
  ॥ 46 ॥

ఘోరమన్త్రార్థవిభవా ఘోరమన్త్రార్థబోధినీ
 ।
ఘోరమన్త్రార్థనిచయా ఘోరమన్త్రార్థజన్మభూః
  ॥ 47 ॥

ఘోరమన్త్రజపరతా ఘోరమన్త్రజపోద్యతా
 ।
కారవర్ణానిలయా కారాక్షరమణ్డితా
  ॥ 48 ॥

కారాపరరూపా కారాక్షరరూపిణీ ।
చిత్రరూపా చిత్రనాడీ చారుకేశీ చయప్రభా
  ॥ 49 ॥

చ్చలా చ్చలాకారా చారురూపా చ చణ్డికా
 ।
చతుర్వేదమయీ చణ్డా చణ్డాలగణమణ్డితా
  ॥ 50 ॥

చాణ్డాలచ్చేదినీ చణ్డతపోనిర్మూలకారిణీ
 ।
చతుర్భుజా చణ్డరూపా చణ్డముణ్డవినాశినీ
  ॥ 51 ॥

చన్ద్రికా చన్ద్రకీర్తిశ్చ చన్ద్రకాన్తిస్తథైవ చ ।
చన్ద్రాస్యా చన్ద్రరూపా చ చన్ద్రమౌలిస్వరూపిజీ
  ॥ 52 ॥

చన్ద్రమౌలిప్రియా చన్ద్రమౌలిసన్తుష్టమానసా ।
చకోరబన్దురమణీ చకోరబన్ధుపూజితా
  ॥ 53 ॥

చక్రరూపా చక్రమయీ చక్రాకారస్వరూపిణీ ।
చక్రపాణిప్రియా చక్రపాణిప్రీతిదాయినీ
  ॥ 54 ॥

చక్రపాణిరసాభిజ్ఞా చక్రపాణివరప్రదా ।
చక్రపాణివరోన్మత్తా చక్రపాణిస్వరూపిణీ
  ॥ 55 ॥

చక్రపాణిశ్వరీ నిత్యం చక్రపాణినమస్కృతా ।
చక్రపాణిసముద్భూతా చక్రపాణిగుణాస్పదా
  ॥ 56 ॥

చన్ద్రావలీ చన్ద్రవతీ చన్ద్రకోటి సమప్రభా
 ।
చన్దనార్చితపాదాబ్జా చన్దనాన్వితమస్తకా
  ॥ 57 ॥

చారుకీర్తిశ్చారునేత్రా చారుచన్ద్రవిభూషణా
 ।
చారుభూషా చారువేషా చారువేషప్రదాయినీ
  ॥ 58 ॥

చారుభూషాభూషిత్గా చతుర్వక్త్రవరప్రదా ।
చతుర్వక్త్రసమారాధ్యా చతుర్వక్త్రసమాశ్రితా
  ॥ 59 ॥

చతుర్వక్త్రచతుర్వాహా చతుర్ధీ చ చతుర్దశీ
 ।
చిత్రా చర్మణ్వతీ చైత్రీ చన్ద్రభాగా చ చమ్పకా
  ॥ 60 ॥

చతుర్దశయమాకారా చతుర్దశయమానుగా ।
చతుర్దశయమప్రీతా చతుర్దయమప్రియా  ॥ 61 ॥

ఛలస్థా ఛ్ఛిద్రరూపా చ ఛ్ఛద్మదా ఛ్ఛద్మరాజికా ।
ఛిన్నమస్తా తథా ఛ్ఛిన్నా ఛ్ఛిన్నముణ్డవిధారిణీ  ॥ 62 ॥

జయదా జయరూపా చ జయన్తీ జయమోహినీ ।
జయా జీవనసంస్థా చ జాలన్ధరనివాసినీ  ॥ 63 ॥

జ్వాలాముఖీ జ్వాలదాత్రీ జాజ్వల్యదహనోపమా
 ।
జగద్వన్ధ్యా జగత్పూజ్యా జగత్త్రాణపరాయణా  ॥ 64 ॥

జగతీ జగతాధారా జన్మమృత్యుజరాపహా
 ।
జననీ జన్మభూమిశ్చజన్మదా జయశాలినీ  ॥ 65 ॥

జ్వరరోగహరా జ్వాలా జ్వాలామాలాప్రపూరితా ।
జమ్భారాతీశ్వరీ జమ్భారాతివైభవకారిణీ  ॥ 66 ॥

జమ్భారాతిస్తుతా జమ్భారాతిశత్రునిషూదినీ ।
జయదుర్గా జయారాధ్యా జయకాలీ జయేశ్వరీ  ॥ 67 ॥

జయతారా జయాతీతా జయశ్కరవల్లభా ।
జయదా జహ్నుతనయా జలధిత్రాసకారిణీ  ॥ 68 ॥

జలధివ్యాధిదమనీ జలధిజ్వరనాశినీ
 ।
జ్గమేశీ జాడ్యహరా జాడ్యస్ఘనివారిణీ  ॥ 69 ॥

జాడ్యగ్రస్తజనాతీతా జాడ్యరోగనివారిణీ ।
జన్మదాత్రీ జన్మహర్త్రీ జయఘోషసమన్వితా  ॥ 70 ॥

జపయోగసమాయుక్తా జపయోగవినోదినీ ।
జపయోగప్రియా జాప్యా జపాతీతా జయస్వనా  ॥ 71 ॥

జాయాభావస్థితా జాయా జాయాభావప్రపూరణీ ।
జపాకుసుమస్కశా జపాకుసుమపూజితా  ॥ 72 ॥

జపాకుసుమసమ్ప్రీతా జపాకుసుమమణ్డితా ।
జపాకుసుమవద్భాసా జపాకుసుమరూపిణీ  ॥ 73 ॥

జమదగ్నిస్వరూపా చ జానకీ జనకాత్మజా ।
ఝవాతప్రముక్త్గా ఝేరఝ్కరవాసినీ  ॥ 74 ॥ 

ఝ్కరకారిణీ ఝవాతరూపా చ ఝ్కరీ ।
కారాణుస్వరూపా చ టనట్కరనాదినీ  ॥ 75 ॥

ట్కరీ టకువాణీ చ ఠకారాక్షరరూపిణీ ।
డిణ్డిమా చ తథా డిమ్భా డిణ్డుడిణ్డిమనాదినీ  ॥ 76 ॥

ఢక్కామయీ ఢిలమయీ నృత్యశబ్దా విలాసినీ ।
ఢక్కా ఢక్కేశ్వరీ ఢక్కాశబ్దరూపా తథైవ చ  ॥ 77 ॥

ఢక్కానాదప్రియా ఢక్కానాదసన్తుష్టమానసా ।
ణ్కరా ణాక్షరమయీ ణాక్షరాదిస్వరూపిణీ   ॥ 78 ॥

త్రిపురా త్రిపురమయీ చైవ త్రిశక్తిస్త్రిగుణాత్మీకా
 ।
తామసీ చ త్రిలోకేశీ త్రిపురా చ త్రయీశ్వరీ   ॥ 79 ॥

త్రివిద్యా చ త్రిరూపా చ త్రినేత్రా చ త్రిరూపిణీ ।
తారిణీ తరలా తారా తారకారిప్రపూజితా  ॥ 80 ॥

తారకారిసమారాధ్యా తారకారివరప్రదా ।
తారకారిప్రసూస్తన్వీ తరుణీ తరలప్రభా  ॥ 81 ॥

త్రీరూపా చ త్రిపురగా త్రిశూలవరధారిణీ ।
త్రిశూలినీ తన్త్రమయీ తన్త్రశాస్త్రవిశారదా  ॥ 82 ॥

తన్త్రరూపా తపోమూర్తిస్తన్త్రమన్త్రస్వరూపిణీ ।
తడిత్తడిల్లతాకారా తత్వజ్ఞానప్రదాయినీ  ॥ 83 ॥

తత్వజ్ఞానేశ్వరీ దేవీ తత్వజ్ఞాన ప్రబోధినీ
 ।
త్రయీమయీ త్రయీసేవ్యా త్య్రక్షరీ త్య్రక్షరేశ్వరీ  ॥ 84 ॥

తాపవిధ్వంసినీ తాపస్ఘనిర్మూలకారిణీ ।
త్రాసకర్త్రీ త్రాసహర్త్రీ త్రాసదాత్రీ చ త్రాసహా  ॥ 85 ॥

తిథీశా తిథిరూపా చ తిథిస్థా తిథిపూజితా ।
తిలోత్తమా చ తిలదా తిలప్రితా తిలేశ్వరీ  ॥ 86 ॥

త్రిగుణా త్రిగుణాకారా త్రిపురీ త్రిపురాత్మికా ।
త్రికుటా త్రికుటాకారా త్రికుటాచలమధ్యగా  ॥ 87 ॥

త్రిజటా చ త్రినేత్రా చ త్రినేత్రవరసున్దరీ ।
తృతీయా చ త్రివర్షా చ త్రివిధా త్రిమతేశ్వరీ  ॥ 88 ॥

త్రికోణస్థా త్రికోణేశీ త్రికోణయన్త్రమధ్యగా ।
త్రిసన్ధ్యా చ త్రిసన్ధ్యార్చ్యా త్రిపదా త్రిపదాస్పదా  ॥ 89 ॥

స్థానస్థితా స్థలస్థా చ ధన్యస్థలనివాసినీ ।
థకారాక్షరరూపా చ స్థలరూపా తథైవ చ  ॥ 90 ॥

స్థూలహస్తా తథా స్థూలా స్థైర్యరూపప్రకాశినీ ।
దుర్గా దుర్గార్తిహన్త్రీ చ దుర్గబన్థవిమోచినీ  ॥ 91 ॥

దేవీ దానవసంహన్త్రీ దనుజ్యేష్ఠనిషూదినీ ।
దారాపత్యప్రదా నిత్యా శ్కరార్థాధారిణీ  ॥ 92 ॥

దివ్గ్యా దేవమాతా చ దేవదుష్టవినాశినీ ।
దీనదుఃఖహరా దీనతాపనిర్మూలకారిణీ  ॥ 93 ॥

దీనమాతా దీనసేవ్యా దీనదమ్భవినాశినీ ।
దనుజధ్వంసినీ దేవీ దేవకీ దేవవల్లభా  ॥ 94 ॥

దానవారిప్రియా దీర్ఘా దానవారిప్రపూజితా ।
దీర్ఘస్వరా దీర్ఘతనుర్దీర్ఘదుర్గతినాశినీ  ॥ 95 ॥

దీర్ఘనేత్రా దీర్ఘచక్షుర్దీర్ఘకేశీ దిగమ్బరా ।
దిగమ్బరప్రియా దాన్తా దిగమ్బరస్వరూపిణీ  ॥ 96 ॥

దుఃఖహీనా దుఃఖహరా దుఃఖసాగరతారిణీ ।
దుఃఖదారిద్య్రశమనీ దుఃఖదారిద్య్రకారిణీ  ॥ 97 ॥

దుఃఖదా దుస్సహా దుష్టఖణ్డనైకస్వరూపిణీ ।
దేవవామా దేవసేవ్యా దేవశక్తిప్రదాయినీ  ॥ 98 ॥

దామినీ దామినీప్రీతా దామినీశతసున్దరీ ।
దామినీశతసంసేవ్యా దామినీదామభూషితా  ॥ 99 ॥

దేవతాభావసన్తుష్టా దేవతాశతమధ్యగా ।
దయార్దరా చ దయారూపా దయాదానపరాయణా  ॥ 100 ॥

దయాశీలా దయాసారా దయాసాగరసంస్థితా ।
దశవిద్యాత్మికా దేవీ దశవిద్యాస్వరూపిణీ  ॥ 101 ॥

ధరణీ ధనదా ధాత్రీ ధన్యా ధన్యపరా శివా ।
ధర్మరూపా ధనిష్ఠా చ ధేయా చ ధీరగోచరా  ॥ 102 ॥

ధర్మరాజేశ్వరీ ధర్మకర్మరూపా ధనేశ్వరీ ।
ధనుర్విద్యా ధనుర్గమ్యా ధనుర్ధరవరప్రదా  ॥ 103 ॥

ధర్మశీలా ధర్మలీలా ధర్మకర్మవివర్జితా ।
ధర్మదా ధర్మనిరతా ధర్మపాఖణ్డఖణ్డినీ  ॥ 104 ॥

ధర్మేశీ ధర్మరూపా చ ధర్మరాజవరప్రదా ।
ధర్మిణీ ధర్మగేహస్థా ధర్మాధర్మస్వరూపిణీ  ॥ 105 ॥

ధనదా ధనదప్రీతా ధనధాన్యసమృద్ధిదా ।
ధనధాన్యసమృద్ధిస్థా ధనధాన్యవినాశినీ  ॥ 106 ॥

ధర్మనిష్ఠా ధర్మధీరా ధర్మమార్గరతా సదా ।
ధర్మబీజకృతస్థానా ధర్మబీజసురక్షిణీ  ॥ 107 ॥

ధర్మబీజేశ్వరీ ధర్మబీజరూపా చ ధర్మగా ।
ధర్మబీజసముద్భూతా ధర్మబీజసమాశ్రితా  ॥ 108 ॥

ధరాధరపతిప్రాణా ధరాధరపతిస్తుతా ।
ధరాధరేన్ద్రతనుజా ధరాధరేన్ద్రవన్దితా  ॥ 109 ॥

ధరాధరేన్ద్రగేహస్థా ధరాధరేన్ద్రపాలినీ ।
ధరాధరేన్ద్రసర్వార్తినాశినీ ధర్మపాలినీ  ॥ 110 ॥

నవీనా నిర్మలా నిత్యా నాగరాజప్రపూజితా ।
నాగేశ్వరీ నాగమాతా నాగకన్యా చ నగ్నికా  ॥ 111 ॥

నిర్లేపా నిర్వికల్పా చ నిర్లోమా నిరుపద్రవా ।
నిరాహారా నిరాకారా నిర్జనస్వరూపిణీ  ॥ 112 ॥

నాగినీ నాగవిభవా నాగరాజపరిస్తుతా ।
నాగరాజగుణజ్ఞా చ నాగరాజసుఖప్రదా  ॥ 113 ॥

నాగలోకగతా నిత్యం నాగలోకనివాసినీ ।
నాగలోకేశ్వరీ నాగభాగినీ నాగపూజితా  ॥ 114 ॥

నాగమధ్యస్థితా నాగమోహసంక్షోభదాయినీ ।
నృత్యప్రియా నృత్యవతీ నృత్యగీతపరాయణా  ॥ 115 ॥

నృత్యేశ్వరీ నర్తకీ చ నృత్యరూపా నిరాశ్రయా ।
నారాయణీ నరేన్ద్రస్థా నరముణ్డాస్థిమాలినీ  ॥ 116 ॥

నరమాంసప్రియా నిత్యా నరరక్తప్రియా సదా ।
నరరాజేశ్వరీ నారీరూపా నారీస్వరూపిణీ  ॥ 117 ॥

నారీగణార్చితా నారీమధ్యగా నూతనామ్భరా ।
నర్మదా చ నదీరూపా నదీస్గమసంస్థితా  ॥ 118 ॥

నర్మదేశ్వరసమ్ప్రీతా నర్మదేశ్వరరూపిణీ ।
పద్మావతీ పద్మముఖీ పద్మక్జిల్కవాసినీ  ॥ 119 ॥

పట్టవస్త్రపరీధానా పద్మరాగవిభూషితా ।
పరమా ప్రీతిదా నిత్యం ప్రేతాసననివాసినీ  ॥ 120 ॥

పరిపూర్ణరసోన్మత్తా ప్రేమవిహ్వలవల్లభా ।
పవిత్రాసవనిష్పూతా ప్రేయసీ పరమాత్మికా  ॥ 121 ॥

ప్రియవ్రతపరా నిత్యం పరమప్రేమదాయినీ ।
పుష్పప్రియా పద్మకోశా పద్మధర్మనివాసినీ  ॥ 122 ॥

ఫేత్కారిణీ తన్త్రరూపా ఫేరుఫేరవనాదినీ ।
వంశినీ వంశరూపా చ బగలా వామరూపిణీ  ॥ 123 ॥

వ్మాయీ వసుధా ధృష్యా వాగ్భవాఖ్యా వరా నరా।
బుద్దిదా బుద్దిరూపా చ విద్యా వాదస్వరూపిణీ  ॥ 124 ॥

బాలా వృద్ధమయీరూపా వాణీ వాక్యనివాసినీ ।
వరుణా వాగ్వతీ వీరా వీరభూషణభూషితా  ॥ 125 ॥

వీరభద్రార్చితపదా వీరభద్రప్రసూరపి ।
వేదమార్గరతా వేదమన్త్రరూపా వషట్‌ ప్రియా  ॥ 126 ॥

వీణావాద్యసమాయుక్తా వీణావాద్యపరాయణా ।
వీణారవా తథా వీణాశబ్దరూపా చ వైష్ణవీ  ॥ 127 ॥

వైష్ణవాచారనిరతా వైష్ణవాచారతత్పరా ।
విష్ణుసేవ్యా విష్ణుపత్నీ విష్ణురూపా వరాననా  ॥ 128 ॥

విశ్వేశ్వరీ విశ్వమాతా విశ్వనిర్మాణకారిణీ ।
విశ్వరూపా చ విశ్వేశీ విశ్వసంహారకారిణీ  ॥ 129 ॥

భైరవీ భైరవారాధ్యా భూతభైరవసేవితా ।
భైరవేశీ తథా భీమా భైరవేశ్వరతుష్టిదా  ॥ 130 ॥

భైరవాధిశరమణీ భైరవాధిశపాలినీ ।
భీమేశ్వరీ భీమమాతా భీమశబ్దపరాయణా  ॥ 131 ॥

భీమరూపా చ భీమేశీ భీమా భీమవరప్రదా ।
భీమపూజితపాదాబ్జా భీమభైరవపాలినీ  ॥ 132 ॥

భీమాసురధ్వంసకరీ భీమదుష్టవినాశినీ ।
భువనా భువనారాధ్యా భవానీ భూతిదా సదా  ॥ 133 ॥

భయదా భయహన్త్రీ చ అభయా భయరూపిణీ ।
భీమనాదా విహ్వలా చ భయభీతివినాశినీ  ॥ 134 ॥

మత్తా ప్రమత్తరూపా చ మదోన్మత్తస్వరూపిణీ ।
మాన్యా మనోజ్ఞా మానా చ మ్గలా చ మనోహరా  ॥ 135 ॥

మాననీయా మహాపూజ్యా మహామహిషమర్దినీ ।
మహిషాసురహన్త్రీ చ మాత్గ మయవాసినీ  ॥ 136 ॥

మాధ్వీ మధుమయీ ముద్రా ముద్రికా మన్త్రరూపిణీ ।
మహావిశ్వేశ్వరీ దూతీ మౌలిచన్ద్రప్రకాశినీ  ॥ 137 ॥

యశఃస్వరూపిణీ దేవీ యోగమార్గప్రదాయినీ ।
యోగినీ యోగగమ్యా చ యామ్యేశీ యోగరూపిణీ  ॥ 138 ॥

యజ్ఞా చ యోగమయీ జపరూపా జపాత్మికా ।
యుగాఖ్యా చ యుగాన్తా చ యోనిమణ్డలవాసినీ  ॥ 139 ॥

అయోనిజా యోగనిద్రా యోగానన్దప్రదాయినీ ।
రమా రతిప్రియా నిత్యం రతిరాగవివర్ధినీ  ॥ 140 ॥

రమణీ రాససమ్భూతా రమ్యా రాసప్రియా రసా ।
రణోత్కణ్ఠా
 రణస్థా చ వరా ర్గప్రదాయినీ  ॥ 141 ॥

రేవతీ రణజైత్రీ చ రసోద్భూతా రణోత్సవా ।
లతా లావణ్యరూపా చ లవణాబ్ధిస్వరూపిణీ  ॥ 142 ॥

లవ్గకుసుమారాధ్యా లోలజిహ్వా చ లేలిహా ।
వశినీ వనసంస్థా చ వనపుష్పప్రియా వరా  ॥ 143 ॥

ప్రాణేశ్వరీ బుద్ధిరూపా బుద్ధిదాత్రీ బుధాత్మికా ।
శమనీ శ్వేతవర్ణా చ శ్కారీ శివభాషిణీ  ॥ 144 ॥

శ్యామ్యరూపా శక్తిరూపా శక్తిబిన్దునివాసినీ ।
సర్వేశ్వరీ సర్వదాత్రీ సర్వమాతా చ శర్వరీ  ॥ 145 ॥

శామ్భవీ సిద్ధిదా సిద్ధా సుషుమ్నా సురభాసినీ ।
సహస్రదలమధ్యస్థా సహస్రదలవర్తినీ  ॥ 146 ॥

హరప్రియా హరధ్యేయా హూంకారబీజరూపిణీ ।
ల్కశ్వరీ చ తరలా లోమమాంసప్రపూజితా  ॥ 147 ॥

క్షేమ్యా క్షేమకరీ క్షామా క్షీరబిన్దుస్వరూపిణీ ।
క్షిప్తచిత్తప్రదా నిత్యం క్షౌమవస్త్రవిలాసినీ  ॥ 148 ॥

ఛిన్నా చ చ్చిన్నరూపా చ క్షుధా క్షౌత్కారరూపిణీ ।
సర్వవర్ణమయీ దేవీ సర్వసమ్పత్ప్రదాయినీ  ॥ 149 ॥

సర్వసమ్పత్ప్రదాత్రీ చ సమ్పదాపద్విభూషితా ।
సత్త్వరూపా చ సర్వార్థా సర్వదేవప్రపూజితా  ॥ 150 ॥

సర్వేశ్వరీ సర్వమాతా సర్వజ్ఞా సురసృత్మికా ।
సిన్ధుర్మన్దాకినీ గ్గ నదీసాగరరూపిణీ  ॥ 151 ॥

సుకేశీ ముక్తకేశీ చ డాకినీ వరవర్ణినీ ।
జ్ఞానదా జ్ఞానగగనా సోమమణ్డ
లవాసినీ  ॥ 152 ॥

ఆకాశనిలయా నిత్యా పరమాకాశరూపిణీ ।
అన్నపూర్ణా మహానిత్యా మహాదేవరసోద్భవా  ॥ 153 ॥

మ్గలా కాలికా చణ్డా చణ్డనాదాతిఖీషణా ।
చణ్డాసురస్య మథినీ చాముణ్డా చపలాత్న్మికా  ॥ 154 ॥

చణ్డీ చామరకేశీ చ చలత్కుణ్డలధారిణీ ।
ముణ్డమాలాధరా నిత్యా ఖణ్డముణ్డవిలాసినీ  ॥ 155 ॥

ఖడ్గహస్తా ముణ్డహస్తా వరహస్తా వరప్రదా ।
అసిచర్మధరా నిత్యా పాశ్కాశధరా పరా  ॥ 156 ॥

శూలహస్తా శివహస్తా ఘణ్టానాదవిలాసినీ ।
ధనుర్బాణధరా
దిత్యా నాగహస్తా నగాత్మజా  ॥ 157 ॥

మహిషాసురహన్త్రీ చ రక్తబీజవినాశినీ ।
రక్తరూపా రక్తగా చ రక్తహస్తా భయప్రదా  ॥ 158 ॥

అసితా చ ధర్మధరా పాశ్కాశధరా పరా ।
ధనుర్భాణధరా నిత్యా ధూమ్రలోచననాశినీ  ॥ 159 ॥

పరస్థా దేవతామూర్తిః శర్వాణీ శారదా పరా ।
నానావర్ణవిభూష్గా నానారాగసమాపినీ  ॥ 160 ॥

పశువస్త్రపరీధానా పుష్పాయుధధరా పరా ।
ముక్తర్జతమాలాఢ్యా ముక్తాహారవిలాసినీ  ॥ 160 ॥

స్వర్ణకుణ్డలభూషా చ స్వర్ణసింహాసనస్థితా ।
సున్దర్గా సువర్ణాభా శామ్భవీ శకటాత్మికా  ॥ 162 ॥

సర్వలోకేశవిద్యా చ మోహసమ్మోహకారిణీ ।
శ్రేయసీ సృష్టిరూపా చ చ్ఛిన్నచ్ఛద్మమయీ చ్ఛలా  ॥ 163 ॥

ఛిన్నముణ్డధరా నిత్యా నిత్యానన్దవిధాయినీ ।
నన్దా పూర్ణా చ రిక్తా చ తిథయః పూర్ణషోడశీ  ॥ 164 ॥

కుహూః స్కన్త్రిరూపా చ ప్చపర్వవిలాసినీ ।
ప్చబాణధరా నిత్యా ప్చమప్రీతిదా పరా  ॥ 165 ॥

ప్చపత్రాభిలాషా చ ప్చమృతవిలాసినీ ।
ప్చలీ ప్చమీ దేవీ ప్చరక్తప్రసారిణీ  ॥ 166 ॥

ప్చబాణధరా నిత్యా నిత్యదాత్రీ దయాపరా ।
పలలాదిప్రియా నిత్యాపశుగమ్యా పరేశితా  ॥ 167 ॥

పరా పరరహస్యా చ పరమప్రేమవిహ్వలా ।
కులినా కేశిమార్గస్థా కులమార్గప్రకాశినీ  ॥ 168 ॥

కులాకులస్వరూపా చ కులార్ణవమయీ కులా ।
రుక్మా చ కాలరూపా చ కాలకమ్బనకారిణీ  ॥ 169 ॥

విలాసరూపిణీ భద్రా కులాకులనమస్కృతా ।
కుబేరవిత్తధాత్రీ చ కుమారజననీ పరా  ॥ 170 ॥

కుమారీరూపసంస్థా చ కుమారీపూజనామ్భికా ।
కుర్గనయనా దేవీ దినేశాస్యా పరాజితా  ॥ 171 ॥

కుణ్డలీకదలీ సేనా కుమార్గరహితా వరా ।
అనతరూపానన్తస్థా ఆనన్దసిన్ధువాసినీ  ॥ 172 ॥

ఇలాస్వరూపిణీ దేవీ ఇఈభేదభయ్కరీ ।
ఇడా చ ప్గిలా నాడీ ఇకారాక్షరరూపిణీ  ॥ 173 ॥

ఉమా చోత్పత్తిరూపా చ ఉచ్చభావవినాశినీ ।
ఋగ్వేదా చ నిరారాధ్యా యజుర్వేదప్రపూజితా  ॥ 174 ॥

సామవేదేన స్గతా అథర్వవేదభాషిణీ ।
ఋకారరూపిణీ ఋక్షా నిరక్షరస్వరూపిణీ  ॥ 175 ॥

అహిదుర్గాసమాచారా ఇకారార్ణస్వరూపిణీ ।
ఓంకారా ప్రణవస్థా చ ఓంకారాదిస్వరూపిణీ  ॥ 176 ॥

అనులోమవిలోమస్థా థకారవర్ణసమ్భవా ।
ప్చశద్వర్ణబీజాఢ్యా ప్చశన్ముణ్డమాలికా  ॥ 177 ॥

ప్రత్యేకా దశసంఖ్యా చ షోడశీ చ్చిన్నమస్తకా ।
షడ్గయువతీపూజ్యా షడ్గరూపవర్జితా  ॥ 178 ॥

షడ్వక్త్రసంశ్రితా నిత్యా విశ్వేశీ ఖడ్గదాలయా ।
మాలామన్త్రమయీ మన్త్రజపమాతా మదాలసా  ॥ 179 ॥

సర్వవిశ్వేశ్వరీ శక్తిః సర్వానన్దప్రదాయినీ ।
ఇతి శ్రీచ్చిన్నమస్తాయా నామసహస్రముత్తమమ్‌  ॥ 180 ॥

పూజాక్రమేణ కథితం సాధకానాం సుఖావహమ్‌ ।
గోపనీయం గోపనీయం గోపనీయం న సంశయః  ॥ 181 ॥

అర్థరాత్రే ముక్తకేశో భక్తియుక్తో భవేన్నరః ।
జపిత్వా పూజయిత్వా చ పఠేన్నామసహస్రకమ్‌  ॥ 182 ॥

విద్యాసిద్ధిర్భవేత్తస్య షణ్మాసాభ్యాసయోగతః ।
యేన కేన ప్రకారేణ దేవీభక్తిపరో భవేత్‌  ॥ 183 ॥

అభిలాన్త్సమ్భయేల్లోకాంరాజ్ఞోపి మోహయేత్సదా ।
ఆకర్షయేద్దేవశక్తిం మారయేద్దేవి విద్విషమ్‌  ॥ 184 ॥

శత్రవో దాసతాం యాన్తి యాన్తి పాపాని సంక్షయమ్‌ ।
మృత్యుశ్చ క్షయతాం యాతి పఠనాద్భాషణాత్ప్రియే  ॥ 185 ॥

ప్రశస్తాయాః ప్రసాదేన కిం న సిద్ద్యతి భూతలే ।
ఇదం రహస్యం పరమం పరం స్వస్త్యయనం మహత్‌  ॥ 186 ॥

ధృత్వా బాహౌ మహాసిద్ధిః ప్రాప్యతే నాత్ర సంశయః ।
అనయా సదృశీ విద్యా విద్యతే న మహేశ్వరి  ॥ 187 ॥

వారమేకం తు యోధీతే సర్వసిద్ధీశ్వరో భవేత్‌ ।
కులవారే కులాష్టమ్యాం కుహూస్కన్త్రిపర్వసు  ॥ 188 ॥

యశ్చేమం పఠతే విద్యాం తస్య సమ్యక్ఫలం శృణు ।
అష్టోత్తరశతం జప్త్వా పఠేన్నామసహస్రకమ్‌  ॥ 189 ॥

భక్త్యా స్తుత్వా మహాదేవి సర్వపాపాత్ప్రముచ్యతే ।
సర్వపా పైర్వినిర్ముక్తః సర్వసిద్ధీశ్వరో భవేత్‌  ॥ 190 ॥

అష్టమ్యాం వా నిశీథే చ చతుష్పథగతో నరః ।
మాషభక్తబలిం దత్వా పఠేన్నామసహస్రకమ్‌  ॥ 191 ॥

సుదర్శవామవేద్యాం తు మాసత్రయవిధానతః ।
దుర్జయః కామరూపశ్చ మహాబలపరాక్రమః  ॥ 192 ॥

కుమారీపూజనం నామ మన్త్రమాత్రం పఠేన్నరః ।
ఏతన్మన్త్రస్య పఠనాత్సర్వసిద్ధీశ్వరో భవేత్‌  ॥ 193 ॥

ఇతి తే కథితం దేవి సర్వసిద్ధిపరం నరః ।
జప్త్వా స్తుత్వా మహాదేవీం సర్వపాపైః ప్రముచ్యతే  ॥ 194 ॥

న ప్రకాశ్యమిదం దేవి సర్వదేవనమస్కృతమ్‌ ।
ఇదం రహస్యం పరమం గోప్తవ్యం పశుస్కటే  ॥ 195 ॥

ఇతి సకలవిభూతేరేతుభూతం ప్రశస్తం పఠతి ।
య ఇహ మర్త్యాశ్ఛిన్నమస్తాస్తవం చ   ॥ 196 ॥

ధనద ఇవ ధనాఢ్యో మాననీయో నృపాణాం స భవతి ।
చ జనానామాశ్రయః సిద్ధివేత్తా  ॥ 197 ॥

ఇతి శ్రీ విశ్వసారతన్త్రే శివపార్వతీ సంవాదే 
శ్రీ చ్చిన్నమస్తాసహస్రనామస్తోత్రం సంపూర్ణం
 
 


శ్రీ ఛిన్నమస్తా మహా విద్యా

Friday, October 10, 2025

Srivatsa - శ్రీవత్స

శ్రీ అనగా లక్ష్మీదేవి . లక్ష్మీదేవిని విష్ణువు హృదయమందు వుంచుకున్నాడు . అందుకు ఆయన హృదయము మీద ఒక గుర్తు యేర్పడింది . వత్స అంటే గుర్తు అనికూడా ఒక అర్థముంది . శ్రీవత్స అంటే లక్ష్మీదేవి గుర్తు . భృగువు విష్ణువు వక్షస్థలాన్ని తన్నడమువలన భృగు సంతతికి భృగుపాద గోత్రీయులనేవారు . లక్ష్మీదేవి భృగుమహర్షి కుమార్తె అందుకే విష్ణువక్షస్థలములో ఒక గుర్తుగా వున్న ఆమె పేరుమీద కాలక్రమేణా భృగుపాద గోత్రము శ్రీవత్స గోత్రముగా పిలవబడుతోంది.

భృగువు కుమారుడు 
చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్లవానుడు. అప్లవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు.

ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందశి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు. తనే కోపి. తనకన్న తన భార్య మరీ కోపి. కలహప్రియ. కటుభాషిణి కావడంతో ఆమె బాధ భరించలేక ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు.ఆ విషయం మామ యగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు.

చ్చవనునికి  పులోమజా అను పతివ్రత వలన ఋచీకుడు అను మహామునికి జన్మనిచ్చింది. ఋచీకుని భార్య సత్యవతి వారికి పుట్టిన సంతానమే జమదగ్ని.

జమదగ్నిభార్య రేణుక ఈమెయే రేణుకా ఎల్లమ్మ తల్లి, మారెమ్మ గ్రామదేవత, తమిళనాడులోని మారి అమ్మన్, దశ మహావిద్యలలో ఆరవ విద్య అయిన చిన్నమస్తా దేవి. 

రేణుక తన భర్త ఆయన జమదగ్ని వలన నలుగురు పుత్రులకు జన్మనిచ్చెను. వారు వరుసగా సులోచన , విలోచన, బృహలోచన మరియు భార్గవ రాముడు (పరశురాముడు). 

శ్రీ వత్స గోత్ర వంశములో సాక్షాత్ లక్ష్మీ దేవి కూతురు. పార్వతి దేవి స్వరూపమైన చిన్నమస్తదేవి (రేణుకా ఎల్లమ్మ తల్లి) కోడలు, పరశురాముడు కొడుకు, దుర్వాస మహాముని అల్లుడు. బ్రహ్మ మానస పుత్రులలో తూర్పు మస్తకం నుండి పుట్టిన భృగు మహర్షి మూల పురుషుడు. 

కావున శ్రీవత్స గోత్ర ప్రవరలో పంచాఋష ప్రవరాన్విత అని చెప్పి 

భార్గవ, చ్యవన, అప్లవాన, ఔర్వ, జమదగ్ని పంచాఋష ప్రవరాన్విత అని చెప్తారు. 

Parasu Ramudu - పరశురాముడు

పరశురాముని జన్మవృత్తాంతం

కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. 

ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఋచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. 

ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.

కార్తవీర్యార్జునితో వైరం
హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్ధంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.

ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.

ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.పరశురాముడు మహా పరాక్రమవంతుడు.

రామాయణంలో పరశురాముడు
సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టించుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టై మని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది

మహాభారతంలో పరశురాముడు
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధించాడు. తరువాత అంబను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మ బ్రహ్మచర్య వ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది. 

కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.

ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. 

అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.

స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడింది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు.

పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు స్కాంద పురాణంలో వివరించబడింది.

ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.

పరశురాముడు చిరంజీవి. కల్క్యవతారమునకు విద్యలుపదేశిస్తాడనీ, తరువాతి మన్వంతరములో సప్తర్షులలో ఒకడవుతాడనీ కథ.

పరశురాముడు పూర్ణావతారము కాదనీ, అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ, మందిరాలూ చాలా తక్కువ.

భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ భూమిలో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.

కేరళలో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.


Sagarudu - సగరుడు

సగరుడు హిందూ పురాణాల్లో సత్య యుగానికి చెందిన గొప్ప చక్రవర్తి. సూర్య వంశం లేదా ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. రామాయణంలో దశరథ మహారాజుకి ఈయన పూర్వీకుడు.

ఆయోధ్యను భాషుడను రాజుపాలించుచుండెను. హైహయులు దండెత్తి భాషుని రాజ్యమాక్రమించుకొన్నారు.అంత భాషుడు నిండు గర్భినియగు పట్టమహిషితో కులగురువగు ఔర్వుని ఆశ్రమమును పోయాడు. 

తన సవతి గర్భవతి అయినదని తనకా అదృష్టం లేదని భాషుని మరియొక భార్య పట్టమహిషికి విషం పెట్టింది. ఇది ఎవరకీ తెలియదు. దాంతో గర్భం స్తంభనమైంది. ఏడు సంవత్సరములైననూ ఆమెకు పురుడు రాలేదు. ఇంతలో రాజు ముసలివాడై మరణించాడు. పట్టమహిషి సహగమనానికి పాల్పడినది. కాని ఔర్వుడు నిండు గర్భణి అయినా ఆమెను అగ్ని ప్రవేశము చేయవద్దని వారించాడు. 

ఆమె గురువు వచనాల ప్రకారం ఆ ప్రయత్నం మాని ఆశ్రమమందే కాలక్షేపం చేస్తోంది. కొంతకాలమునకు ఆమె ఒక మగ బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ విషంతో సహా జన్మించాడు.ఆ విషయము తెలిసికొని ఔర్వమహర్షి ఆ బిడ్డకు సగరుడని పేరు పెట్టాడు. గరమునగా విషయు. విషముతో పుట్టుటచే ఆతనికి సగరుడు అని నామకరణం చేశాడు ఆ మహర్షి. సగురుడు, తల్లి ఆశ్రమ మందే ఉంటున్నారు. సగరుడు పెద్ద వాడయ్యాడు. సమస్త విద్యలు నేర్చుకొన్నాడు. తల్లి వల్ల విషయాలు తెలిసికొని శత్రువులపై దండెత్తి వారినందరను జయించాడు. అతడు రాజ్యాభిషిక్తుడై సప్తద్వీపసమేతముగా భూమండలాన్ని పాలించసాగాడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఒకరు విదర్భ రాజకుమారి వైదర్భి. మరొకరు శివి వంశానికి చెందిన శైబ్య. వారివల్ల సంతానం కలుగలేదు.భార్యలను వెంటబెట్టుకుని అతడు ఔర్వమహర్షి ఆశ్రమానికి వచ్చి సంతానం కావాలని అర్థించాడు. గురువు కరుణతో శైబ్యకు అసమంజసుడూ కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి.

సగరుని అశ్వమేధ యాగాన్ని చేయగా  ఆ యాగాన్ని భగ్నం చేయడానికి ఇంద్రుడు యాగదేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు. వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు దిలీపుడు. దిలీపుని కొడుకు భగీరధుడు.

భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై "నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?" అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్రమాన్ని ముంచెత్తి, "జాహ్నవి" అయ్యింది. ఆ పై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది.

Aurva Maharshi - ఔర్వ మహర్షి

భృగువు కుమారుడు చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్రవానుడు. అప్రవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు. బుచి యూరువు మరుగున పుట్టిన బిడ్డడగుటచే అతడు ఔర్వువయాడు. 

ఔర్వుడు బాల్యము నుండియు తపస్సులో మునిగి యుండెడివాడు. అతని తపశ్శక్తి అనలముగా మారినది. ఆ అగ్ని వలన ఉపద్రవము కలుగునని అతని పితృదేవతలు ఔర్వుని చేరి కుమారా?నీ తపోశ్శక్తిచే జనించిన అగ్నిని సముద్రమున విడిచిపెట్టు. అది సముద్రమును దహించును. లేకున్న ఉపద్రవములు కలుగును అని పలకగా ఔర్వుడు దానిని సముద్రమున విడిచిపెట్టాడు. అది ఔర్వానలమై గుర్రం ముఖంతో సముద్ర జలమును త్రాగనారంభించెను. అదే బడబానలం. అనంతరం ఔర్వుడు బ్రహ్మచర్యవ్రత చేయసాగాడు. అంత దేవతలు, రాక్షసులు ఆ మహర్షి వద్దకు వచ్చి పెండ్లి చేసికొని పిల్లలను కనుమని పలికారు. అతడు అందుకు అంగీకరింపలేదు. అతని బ్రహ్మచర్య దీక్షకు అచెరువంది హిరణ్యకశిపుడు శ్రద్ధాభక్తులతో ఆ మహర్షి నమస్కరించి శిష్యునిగా స్వీకరించమని కోరాడు. ఔర్వుడు సంతసించి హిరణ్యకశిపునకు కోరిన వరాలిచ్చి సంతుష్టిపరచి శత్రుభీతి ఉండదని అభయమిచ్చి పంపాడు.

ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందశి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. దుర్వాసుడు తన భార్యయగు కందనితో సమస్త భోగములు అనుభవింపసాగాడు. తనే కోపి. తనకన్న తన భార్య మరీ కోపి. కలహప్రియ. కటుభాషిణి కావడంతో ఆమె బాధ భరించలేక ఆ మహర్షి ఆమెను భస్మం చేశాడు.ఆ విషయం మామ యగు ఔర్వ మహర్షికి తెలియగా వచ్చి అల్లుని నిందించి అవమానాల పాలగుదవని శపించాడు.

ఆయోధ్యను భాషుడను రాజుపాలించుచుండెను. హైహయులు దండెత్తి భాషుని రాజ్యమాక్రమించుకొన్నారు.అంత భాషుడు నిండు గర్భినియగు పట్టమహిషితో కులగురువగు ఔర్వుని ఆశ్రమమును పోయాడు. 

తన సవతి గర్భవతి అయినదని తనకా అదృష్టం లేదని భాషుని మరియొక భార్య పట్టమహిషికి విషం పెట్టింది. ఇది ఎవరకీ తెలియదు. దాంతో గర్భం స్తంభనమైంది. ఏడు సంవత్సరములైననూ ఆమెకు పురుడు రాలేదు. ఇంతలో రాజు ముసలివాడై మరణించాడు. పట్టమహిషి సహగమనానికి పాల్పడినది. కాని ఔర్వుడు నిండు గర్భణి అయినా ఆమెను అగ్ని ప్రవేశము చేయవద్దని వారించాడు. 

ఆమె గురువు వచనాల ప్రకారం ఆ ప్రయత్నం మాని ఆశ్రమమందే కాలక్షేపం చేస్తోంది. కొంతకాలమునకు ఆమె ఒక మగ బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డ విషంతో సహా జన్మించాడు.ఆ విషయము తెలిసికొని ఔర్వమహర్షి ఆ బిడ్డకు సగరుడని పేరు పెట్టాడు. గరమునగా విషయు. విషముతో పుట్టుటచే ఆతనికి సగరుడు అని నామకరణం చేశాడు ఆ మహర్షి. సగురుడు, తల్లి ఆశ్రమ మందే ఉంటున్నారు. సగరుడు పెద్ద వాడయ్యాడు. సమస్త విద్యలు నేర్చుకొన్నాడు. తల్లి వల్ల విషయాలు తెలిసికొని శత్రువులపై దండెత్తి వారినందరను జయించాడు. అతడు రాజ్యాభిషిక్తుడై సప్తద్వీపసమేతముగా భూమండలాన్ని పాలించసాగాడు. ఆయనకి ఇద్దరు భార్యలు ఒకరు విదర్భ రాజకుమారి వైదర్భి. మరొకరు శివి వంశానికి చెందిన శైబ్య. వారివల్ల సంతానం కలుగలేదు.భార్యలను వెంటబెట్టుకుని అతడు ఔర్వమహర్షి ఆశ్రమానికి వచ్చి సంతానం కావాలని అర్థించాడు. గురువు కరుణతో శైబ్యకు అసమంజసుడూ కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుడు గురువుకు నమస్కరించి వెళ్ళిపోయాడు.

సగరుడు చాలాకాలం రాజ్యం చేసి చివరకు ఔర్వుని చేరి తత్త్వముపదేసించమని అర్థించాడు. అంత ఆ మహర్షి అనేక విషయాలు తెలిపాడు. ఔర్వునికి తెలియని విషయాలు లేవు. అతడు మేధావి అస్ఖలిత బ్రహ్మచారి, తపోనిధి, ఉపకారి. అటువంటి మహర్షి చరిత్ర నిజంగా చాలా గొప్పది.

Chyavana Maharshi - చ్యవన మహర్షి

చ్యవన మహర్షి వృత్తాంతము మహాభారతము, దేవీభాగవతము, అష్టాదశ పురాణాలలో చెప్పబడింది చ్యవన మహర్షి తల్లిదండ్రులు భృగు మహర్షి పులోమ దంపతులు. ఒకనాడు భృగు మహర్షి స్నానానికి వెళుతు అగ్నిహోత్రాన్ని సిద్దము చేయమని భార్యకు చెప్పుతాడు అప్పటికే ఆవిడ గర్భవతి ఆవిడ తనకు పుట్టబోయే బిడ్డ బ్రహ్మర్షి కావాలని కోరుకుంటూ ఉంటుంది. అగ్నిహోత్రము వెలుగుతుండగా పులోముడు అనే రాక్షసుడు ఆవిడ ఎవరు అని అగ్నిహోత్రుడిని అడుగుతాడు నిజము చెపితే మహర్షికి కోపము వస్తుంది అబద్ధము చెపితే పాపము వస్తుంది ఏమి చేయాలో తోచని అగ్నిహోత్రుడు భృగు మహర్షి భార్య అని చెపుతాడు. ఆ రాక్షసుడు పంది రూపములో ఆవిడను ఎత్తుకుపోతుండగా గర్భము లోని శిశువు భూమిపై పడతాడు ఆ పిల్లవాడి తేజస్సుకు రాక్షసుడు భస్మము అవుతాడు. అలా క్రిందపడిపోవటం వలన ఆ బాలుడికి చ్యవనుడు అనే పేరు వచ్చింది విషయము తెలుసుకున్న భృగు మహర్షి అగ్నిహోత్రుడిని సర్వము భక్షించేవాడిగాను, అతి క్రూరుడిగాను అవమని శపిస్తాడు దేవతలు బ్రతిమాలగ మహర్షి శాపాన్ని ఉపసంహరించు కుంటాడు. 

ఉపనయనము తరువాత చ్యవనుడు తపస్సు చేసుకోవటానికి అరణ్యానికి వెళ్లి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఉండగా చుట్టూ పుట్టలు పెరిగి ముసలివాడు అవుతాడు.  ఒకనాడు ఇక్ష్వాకు వంశస్తుడైన శర్వాతి సైన్యము భార్య కూతురులతో అరణ్యానికి వస్తాడు అతనికి కూతురు సుకన్య చాలా అందగత్తె ఆవిడ పుట్టలో మెరుస్తున్న కళ్లను చూచి మిణుగురు పురుగులని భావించి పుల్లతో పొడుస్తుంది ఫలితముగా చ్యవనుడి కళ్ళు పోతాయి ఆగ్రహించిన మహర్షి శర్వాతి సైన్యానికి అందరికి మలమూత్రాలు రాకుండా శపిస్తాడు. రాజు చ్యవనుడిని, తనకూతురు తప్పును క్షమించమని వేడుకుంటాడు భవిష్యత్తు తెలిసినవాడు అవటం వలన చ్యవనుడు సుకన్యను తనకు ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు అంతటి మహర్షి తనకు భర్తగా రావటము తన అదృష్టముగా భావించి సుకన్య చ్యవనుడిని వివాహము చేసుకోవటానికి సంతోషముగా అంగీకరిస్తుంది. 

సుకన్య ముసలి వాడైన భర్తను భక్తి శ్రద్దలతో సేవిస్తూ ఉంటుంది. వీరికి ప్రమతి, దధీచి అప్రవానుడు అనే ముగ్గురు కుమారులు ఉంటారు. ఒక రోజు సుకన్య నదికి నీరు తెచ్చు కోవడానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళ్ళుతున్న అశ్వనీ దేవతలు సుకన్యని చూసి ఏవరీ నవయవ్వన సుందరాంగి అని అనుకొని పరిచయం అడుగగా సుకన్య చ్యవన మహర్షి భార్యనని చెబుతుంది. అప్పుడు వారు ఆ గుడ్డి మునితో కాలం వెలిబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలు అనుభవించమని కోరుతారు. దానికి సుకన్య అంగీకరించక తన పాతివ్రత్య ధర్మాన్ని తెలుపుతుంది. అప్పుడు అశ్వనీ దేవతలు ఒక పరీక్ష పెట్టదలచి ముసలి వాడు గుడ్డి వాడు అయిన చ్యవన మహర్షిని తాము తమ వైద్యశక్తులతో తమ వలే నవయవ్వనుడిని చేస్తామని ఆమె తన భర్తని గుర్తించమని పల్కుతారు. ఆ విషయం చ్యవన మహర్షికి తెలుపగా చ్యవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు. ఆ ముగ్గురు నదిలో స్నానము చేసి బయటకు వస్తారు. ఆ ముగ్గురు చూడడానికి ఒకే విధంగా నవయవ్వనంలో ఉంటారు. ఆ ముగ్గురుని చూసి మొదట తన పతి ఎవరని సంశయించి జగన్మాతని ప్రార్థించి చ్యవనుడీని గుర్తిస్తుంది. దానికి అశ్వనీ దేవతలు కూడా సంతసించి తమకు సెలవు ఇవ్వమని చ్యవన మహర్షిని కోరుతారు. అప్పుడు చ్యవన మహర్షి తనకు యవ్వనము ప్రసాదించిన కారణమున ఏదైన వరము కోరుకోమంటాడు. అప్పుడు అశ్వనీదేవతలు తమకు యజ్ఞయాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ సోమరస పానం కావాలని కోరుకుంటారు. చ్యవనుడు మామగారి అభివృద్ధికి ఒకయజ్ఞము చేయిస్తూ అశ్వని దేవతలకు సోమపానము ఇస్తుంటే ఇంద్రుడు అడ్డుపడతాడు అయిన చ్యవనుడు అశ్వనీదేవతలతో సోమపానము చేయిస్తాడు ఆగ్రహించిన ఇంద్రుడు చ్యవనుడిని చంపటానికి వజ్రాయుధాన్ని తీస్తాడు. కానీ చ్యవనుడు అగ్ని నుంచి ఒక భయంకర రాక్షసుడిని పుట్టించి ఇంద్రుడి మీదకు వదులుతాడు భయపడ్డ ఇంద్రుడు చ్యవనుడిని క్షమించమని అడుగుతాడు ఆరాక్షసుడిని మద్యము త్రాగేవారిలోని జంతువులలో ఉండమని మహర్షి ఆదేశిస్తాడు ఇంత జరిగినా ఆగ్రహము తగ్గని ఇంద్రుడు ఒకపర్వతాన్ని చ్యవనుడు పైకి విసురుతాడు కానీ ఆ మహర్షి తపోబలము వల్ల ఆ పర్వతము ఇంద్రుడిపైకే వస్తుంది అప్పుడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి మహర్షుల జోలికి పోరాడు అని నిర్ణయించుకుంటాడు. 

కొంతకాలము తరువాత చ్యవనుడు గంగా యమునా సంగమములో నీటిలో మునిగి తపస్సు చేస్తుండగా అయన చుట్టూ నీటిలోని చేపలు నీరు ప్రదక్షిణాలు చేస్తుంటాయి అలా 12 ఏళ్ళు తపస్సు చేసినాక ఒకనాడు జాలర్లు విసిరినా వలలో చేపలతో పాటు చ్యవనుడు కూడా చిక్కుంటాడు ఆయనను వలలో చూసిన జాలర్లు తమ తప్పుని మన్నించమని వేడుకుంటారు కానీ చ్యవనుడు మీరు చేసిన తప్పు ఏమిలేదు మీరు మీ కుల వృత్తిని మీరు చేశారు చేపలతో పాటు నన్నుకూడ అమ్ముకోండి అని అంటాడు జాలర్లకు ఏమిచేయాలో పాలుపోక రాజు నహుషుడు దగ్గరకు వెళతారు రాజు చ్యవనుడికి ఏమి ఇస్తానన్న అంగీకరించడు ఆ సమయములో రాజు దగ్గరకు మరో మహర్షి కవిజాతుడు వచ్చి గోవు బ్రాహ్మణులకు సమానము కాబట్టి గోవును జాలర్లకు ఇమ్మని సలహా ఇస్తాడు గోవు మహత్యము తెలుసుకున్న రాజు గోవును జాలర్లకు ఇస్తాడు జాలర్లు మేము ఆవును ఏమి చేసుకుంటాము అని ఆగోవును చ్యవనునికి దానము గా ఇచ్చి నమస్కరిస్తారు ప్రసన్నుడైన చ్యవనుడు జాలర్లకు స్వర్గలోక ప్రాప్తి నహుషునికి ఇంద్రపదవి దక్కుతుంది అని దీవిస్తాడు. 

మునులు దేవతలు ఇష్టాగోష్టి జరుపుతున్న సమయములో బ్రహ్మ భృగు, కుశిక వంశాలలో బ్రాహ్మణక్షత్రియ సంకరము జరిగి బ్రహ్మర్షి పుడతాడని చెపుతాడు.  

కానీ ఈ సంకరము ఇష్టము లేని చ్యవనుడు కుశిక వంశాన్ని నాశనము చేస్తే సంకరము తప్పుతుందని భావించి కుశిక రాజును ఎన్నో విధాలుగా పరీక్షించిన కుశికరాజు వినయవిధేయలతో భక్తితో చ్యవనుడిని సేవించగా నీ వంశములో బ్రహ్మర్షి పుడతాడు అని దీవిస్తాడు. ఆయనే విశ్వామిత్రుడు. 

ఒకసారి చ్యవనుడు నర్మదా నదిలో స్నానము చేస్తుండగాఒక పెద్దపాము ఆయనను పాతాళలోకానికి లాక్కుపోతుంది. అక్కడ ఆయనకు నాగ కన్యలు భక్తి శ్రద్దలతో సేవచేస్తారు పాతాళరాజు అయినా ప్రహ్లాదుడు మహర్షిని చూసి ఇంద్రుడు తనను చంపటానికి పంపాడని అనుమానిస్తాడు. కానీ ఆ మహర్షితో మాటాడినాక తన భయము నిరాధారం అని భావించి ఆయనకు నమస్కారము చేసి ,"మహాత్మా మీరు అనేక నదులలో స్నానమాచరించి ఉంటారు ఏ నది స్నానము పుణ్యమైనది" అని అడుగుతాడు దానికి చ్యవనుడు ,"రాజా నీవు విష్ణుభక్తుడివి మనస్సు పవిత్రముగాలేకుండా ఏ నదిలో స్నానము చేసినా ఉపయోగము ఉండదు. తీర్ధయాత్రలకంటే నదీస్నానములకన్నా సత్యము, భూతదయ, శుచిత్వము కలిగి ఉండటం ముఖ్యము ఇవన్నీ ఉంటె అటువంటి వారి పాదాల వద్దకు అన్ని తీర్ధాలు వస్తాయి. అయినా నీవు అడిగావు కాబట్టి ముఖ్యమైన మూడు తీర్ధాలు చెపుతాను అవి నైమిశము, చక్రతీర్ధము, పుష్కరమునే ఈ మూడు భూలోకము లోని పవిత్రమైన తీర్ధాలు." అని చెపుతాడు విన్న ప్రహ్లాదుడు సంతుష్టుడై భక్తి ప్రపత్తులతో చ్యవన మహర్షిని సేవించి ఆశ్రమానికి పంపుతాడు.

Druvudu - ధ్రువుడు

భారత ఇతిహాసములలో శ్రీ మహావిష్ణువు చేత ఆశీర్వదించబడి అంతరిక్షంలో ఇప్పటికి ధ్రువ నక్షత్రముగా ధ్రువక్షితిలో మనకు కనిపిస్తున్న స్వాయంభువ మనువు వంశ రాకుమారుడు. పెద్దలు ఇప్పటికి చిన్న పిల్లలకు భక్తికి, కార్య నిశ్చయానికి ఉదాహరణగా ధ్రువోపాఖ్యానం (ధ్రువ చరిత్ర) చెబుతారు. ధ్రువోపాఖ్యానం విష్ణు పురాణములోను, మహాభాగవతము నాల్గవ స్కందములో ముఖ్యముగా ప్రస్తుతించబడుతుంది. ఋగ్వేదం ప్రకారము ధ్రువ అంటే రెండు అర్థాలు కనిపిస్తున్నాయి.ఒకటి ధ్రువ నక్షత్రము, మరొకటి నిలకడ స్థితి. గృహ్యసూత్ర, మహాభారతం, సూర్యసిద్ధాంతం ధ్రువ నక్షత్రం గురించి ప్రస్తుతించడింది. ధ్రువ అంటే ఒక నిలకడ స్థానము నుండి బయలు దేరే ప్రదేశాన్ని ధ్రువ అని పిలుస్తారు.

ధ్రువుడి వంశ చరిత్ర
స్వాయంభువ మనువుకి ప్రియవతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యల వలన ధ్రువుడు (సునీతి) ఉత్తముడు (సురుచి) అనే ఇద్దరు కుమారులు కలిగారు. కాలప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రి నవ్వు నవ్వి నీకు తండ్రి తొడ పై ఎక్కే అధృష్టం లేదు, అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. నీకా అధృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెబుతుంది. 

ఆ పరుష భాషణానికి చింతాక్రాంతుడై ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు సునీతి ధ్రువుడితో నాయనా కాలప్రభావం వలన నీ తండ్రి తనను దాసీ కంటే తక్కువగా చూస్తున్నదని, కష్టం కలిగించే పలుకులైన సవతి సరైన విషయం చెప్పిందని, శ్రీహరి పాదధ్యానము వలన జరగనివి ఉండవని స్వాయంభువ మనువు శ్రీహరిని ధ్యానించి ఉత్తమ గతి పొందాడని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి రాజధాని నుండి అడవికి బయలుదేరాడు.

ధ్రువుడికి నారదుడు నారాయణ మంత్రొపదేశం
అప్పుడు మార్గమధ్యములో నారదుడు కనిపించి ఎక్కడికి వెళ్ళుతున్నావు అని అడుగగా ధ్రువుడు అప్పటి వరకు జరిగిన వృత్తాంతం తన సవతి తల్లి చేత పొందిన అవమానం చెబుతాడు. నారదుడు ధ్రువుడిని ఓదార్చి రాజధాని నగరం పంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ధ్రువుడి పట్టుదలకు మెచ్చి యమునా నది తీరములో ఉన్న మధువనంలో ధర్భాసీనుడవై ప్రాణాయామ నిష్ఠతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రము ఉపదేశిస్తాడు. 

ధ్రువుడు యమునానదిలో త్రికరణ శుద్ధిగా స్నానము చేసి దర్భాసీనుడై నారాయణు గురించి తపస్సు చేస్తాడు. ముందు మూడు రోజులకు ఒకమారు వెలగ పండు లేదా రేగి పండు తినేవాడు తరువాత ఆరు రోజులకు ఒకమారు పండి రాలిన ఆకులు తింటు తపస్సు చేశాడు. ఆ తరువాత మూడు నెలలు తొమ్మిది రోజులకు ఒకమారు మంచి నీరు త్రాగి తపస్సు చేశాడు. ఆ తరువాత 12 రోజులకు ఒకమారు గాలి పీల్చి తపస్సు చేశాడు. మరికొన్ని రోజులకు గాలి కూడా పీల్చకుండా తపస్సు చేస్తూండగా సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం సృష్టించబడి దేవతలు నారాయణుడి వద్దకు వెళ్ళి విషయం విన్నవిస్తారు. అప్పుడు నారాయణుడు ధ్రువుడు తన గురించి తపస్సు చేస్తున్నాడని, వాని వలన ఈ ఉపద్రవం వస్తున్నదని చెప్పి వానికి ప్రత్యక్షం అయ్యి దీక్ష విరమింప జేస్తానని చెబుతాడు.

శ్రీమహా విష్ణువు దర్శనం
నారాయణుడు ధ్రువుడికి శంఖ చక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమిరగా ధ్రువుడు 12 శ్లోకాలతో నారాయణుడిని స్తుతిస్తాడు. దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్తఋషులు, నిఖిల తారాగణాలు, సూర్యచంద్రులు నిరంతరం ప్రదక్షిణం చేసే ధ్రువక్షితి అనే స్థానం కలిపిస్తున్నానని చెప్పి, ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్యపరిపాలన చేయమంటాడు. 

ఆ విధంగా నారాయణుడిని ప్రసన్నం చేసుకొని ఆశీర్వాదం పొందిన ధ్రువుడు తిరిగి రాజధాని చేరుకొంటాడు. రాజధాని చేరుకొనిన ధ్రువుడిని చూసి తండ్రి ఉత్తానపాదుడు సంతోషం పొంది, రాజ్యానికి పట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమమునకు వెళ్తాడు. శింశుమాన ప్రజాపతి కుమార్తె అయిన భ్రమి అనే గుణవతిని వివాహం చేసుకొని కల్ప, వస్తర అనే కుమారులను సంతానంగా పొందుతాడు. అనంతరం వాయివు కుమార్తె అయిన ఇలా అనే కన్యకని వివాహం చేసుకొని ఆమె వలన కుమారుడిని, కుమార్తెని పొందుతాడు.

యక్షులతో యుద్ధం
ఒకరోజు తన సోదరుడైన ఉత్తముడు అరణ్యానికి వేటకు వెళ్ళి ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఆ వార్త విన్న సురుచి అగ్నిలో ప్రవేశించి ప్రాణ త్యాగం చేసింది. ఈ రెండు విషయాలు మనస్థాపం కలిగించి ధ్రువుడు హిమయత్పర్వతం లోయలో ఉన్న అలకపురిలో ఉన్న యక్షుల మీద యుద్ధం ప్రకటించాడు. కొద్ది సేపటి తరువాత యుక్షులు మాయ యుద్ధం చేయట మొదలుపెట్టారు. వారితొ మాయాయుద్ధం చేసే దారి తోచక ఆలోచిస్తుంటే మునులు ప్రత్యక్షమై నిఖిపలోకాలకు మూల కారకుడైన నారాయణుడిని స్మరించమని చెబుతారు. నారాయణుడిని స్మరించి నారాయాణాస్త్రం సంధించగా యక్షుల శక్తి సన్న గిల్లి వారి కాళు చేతులు మొండలు విరిగి క్రింద పడి పోయాయి.

అప్పుడు ధ్రువుడి తాత స్వాయంభువ మనువు ప్రత్యక్షం అయి దేహాభిమానం కలిగిన పశుపక్ష్యాదులు చేసే కిరాతక కృత్యాన్ని చేస్తున్నడని, నారాయణుడిని ప్రసన్నం చేసుకొనిన నీకు అది సరికాదని హితబోధ చేశాడు. అంతేకాక యక్షులతో యుద్ధం వల్ల శివునికి సన్నిహితుడైన కుబేరుడికి ఆగ్రహం వచ్చిందని చెబుతాడు. 

ధ్రువుడు తన తాత మాటలు విని విరమించాడని తెలుసుకొని కుబేరుడు సంతోషించి, ధ్రువుడు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు కుబేరుడికి నమస్కరించగా కుబేరుడు ధ్రువునితో మీతతా మాటలు విని యుద్ధం ఆపినందుకు సంతోషంగా ఉన్నది, నిర్మలమైన శ్రీమహావిష్ణువును సదా స్మరిస్తూ జీవననం జరపమని సెలవిచ్చి వెళ్ళిపోతాడు.

ధ్రువుడు ధ్రువ నక్షత్ర ముక్తి
ధ్రువుడు రాజధాని చేరి భూరి దానాలతో యజ్ఞాలు సాగించి కొంత కాలం పరిపాలన చేశాడు. తరువాత రాజ్యాన్ని తన కూమారుడికి అప్పగించి, తపస్సు చేసుకోవడానికి బదరికావనములో పద్మాసీనుడై శ్రీ మహావిష్ణువు స్మరిస్తూ కాలం వెల్లబుచ్చుతుండగా ఒకరోజు నందసునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్యవిమానం మీద ధ్రువుడిని తీసుకొని వెళ్ళడానికి వస్తారు. ధ్రువుడా దివ్యవిమానం ఎక్క లేకపోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెబుతాడు. అలా వెళ్ళుతుండగా ధ్రువుడు నారాయణ సేవకులతో తన తల్లిని చూడవలెనని కోరిక ఉన్నదని తెలుపగా వారి ముందు ఉన్న విమానం పైనున్న సునీతిని చూపించగా ధ్రువుడు ఆనందిస్తాడు.నేటికి మనకు కనిపించే ధ్రువనక్షత్రము ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్యపాలన ఫలంగా లభించనదే అని చెబుతారు.

Uttarashada Nakshatra - ఉత్తరాషాఢ నక్షత్రం

నక్షత్రములలో ఇది 21వ నక్షత్రం.

నక్షత్రం    -    
ఉత్తరాషాఢ

అధిపతి    -    
రవి

గణము    -    
మానవ

జాతి        -    
పురుష

జంతువు -    
ముంగిస    

చెట్టు        -    
పనస

నాడి        -    
అంత్య

అధిదేవత-    
విశ్వేదేవతలు

రాశి        -    
1 పాదం ధనస్సు
                    2, 3, 4పాదాలు మకరం

ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో తక్కువగా ఉన్నాసరే పెరిగేకొద్ది ఎదుగుతూ ఉన్నత స్థితికి చేరుతారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరికెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువగా మాట్లాడెదరు, అణకువ కలిగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుం
టారు. క్రొత్త స్నేహములు చేయుటలో ముందుంటారు.  కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకానొకప్పుడు వీరు నేరప్రవృత్తి అయిన నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి, బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. గోప్యత పాటిస్తారు. పై చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తోటి వారికి కూడా సహాయం చేస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మించిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. మీరు గౌరవప్రదమైన ప్రవర్తన, ఆధ్యాత్మిక అంతర్దృష్టి, నీతి బలం, నిజాయితీ కలవారు. తరచూ 'బ్రహ్మాంశ' (దైవసారం)తో పుట్టినవారిగా చెబుతారు, సహజంగా మంచి, సున్నితమైన ప్రవర్తన చూపిస్తారు, ఇది మీకు గౌరవం, ఆరాధన తెస్తుంది. దేవాలయాకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, ధన సహాయాన్ని చేస్తారు. కానీ, అప్పు ఇవ్వరు. ఆర్థికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు.

ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్లు గొప్ప గుణాలు కలిగి, నిజాయితీ, స్వచ్ఛత, జ్ఞానానికి చిహ్నంగా ఉంటారని బృహత్ జాతకం, సారావళి, జాతక పారిజాతం లాంటి ప్రాచీన జ్యోతిష గ్రంథాలు చెబుతాయి.  

మీ ఉనికి ప్రభావవంతంగా ఉంటుంది, స్వతంత్ర ఆలోచనలు, గట్టి నమ్మకాల వల్ల స్నేహితులు, సమాజంలో తరచూ చర్చలు లేదా భిన్నాభిప్రాయాలకు కేంద్రంగా ఉంటారు. శారీరకంగా చురుకుగా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి, క్రమంగా వ్యాయామం, క్రమశిక్షణ జీవనంతో దేహదారుఢ్యం కాపాడుకుంటారు. 

ఉత్తరాషాఢ జాతకులు సహజంగా ఉదారులు, పరోపకారులు, తమ వనరులు, జ్ఞానాన్ని ఇష్టంగా పంచుకుంటారు. మీ జీవితం సాధారణంగా ఆనందం, శ్రేయస్సు, సంతృప్తితో నిండి ఉంటుంది, ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఆప్యాయ సంబంధాల వల్ల ఇది మరింత బాగుంటుంది. వాళ్లు మీ మానసిక సంతృప్తికి ఎంతో దోహదం చేస్తారు.

ఇతరుల సహాయాన్ని గుర్తుంచుకుని, సహాయం చేసినవాళ్ల పట్ల జీవితకాల కృతజ్ఞత, విధేయత చూపిస్తారు. మీ ఆధ్యాత్మిక ఆసక్తి, విధేయత సవాళ్లను సున్నితంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. 

మీకు ఎక్కువ మంది పిల్లలు, బలమైన కుటుంబ బంధాలు ఉంటాయని గ్రంథాలు చెబుతాయి.

మీరు స్వతంత్రులు, ఆకర్షణీయంగా, సంపన్నులుగా ఉంటారు. ధైర్యం, జ్ఞానం, సున్నితమైన ప్రవర్తనతో కూడిన అందమైన రూపం కలిగి ఉంటారు. గ్రంథాలు పొడవైన ముక్కు, శరీరంలో చేప ఆకారంలో ప్రతీకాత్మక గుర్తులు ఉండవచ్చని చెబుతాయి, ఇవి అదృష్టం, సంతాన భాగ్యం, వ్యక్తిగత ఆకర్షణను సూచిస్తాయి. వినయం, ఓర్పు, ఇతరుల పట్ల సున్నితత్వం పెంచుకోవడం మీ సద్గుణాలను మెరుగుపరుస్తుంది, సంపన్న, గౌరవనీయ, సంతృప్తికర జీవితాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మీ గట్టి అభిప్రాయాలు మొండితనంగా మారకుండా చూసుకోవాలి.

ఉత్తరాషాఢ నక్షత్రపు అధిదేవత - విశ్వదేవుళ్ళు .వీరు మొత్తం పది మంది సోదరులు. 
వారు - వసు, సత్య, క్రతు, దక్ష, కాళ, కామ, ధ్రితి, కురు, పురురవ, మాద్రవ.


ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల నక్షత్రపు ఫలములు

నక్షత్రపు పేరు                    నక్షత్రములు                                        ఫలం

పుట్టిన నక్షత్రము                కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ    ఒంటికి శ్రమ

సంపత్తు నక్షత్రము            రోహిణి, హస్త, శ్రవణం                    డబ్బుల లాభం

ముంపు తెచ్చు                  మృగశిర, చిత్త, ధనిష్ఠ                    పనికి చేటు
నక్షత్రము

సంపత్తు నక్షత్రములు    ఆరుద్ర, స్వాతి, శతభిష                    బాగు

వేఱైన నక్షత్రములు        పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర        ప్రయత్నము పాడు అగుట

సాధన నక్షత్రములు        పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర    పని నెఱవేరుట, మంచిది

నైత్య నక్షత్రములు        ఆశ్లేష, జ్యేష్ట, రేవతి                            బంధనం

వీరితో బాగా పడిన             
అశ్విని, మఖ, మూల                        హాయి
నక్షత్రములు

మిక్కిలి బాగా పడిన         
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ    హాయి, కలిసి వచ్చును

Thursday, October 9, 2025

Sukra - శుక్రుడు

స్వభావము - మృదు, శుభుడు
అధిపతి -పరమశివుడు
లింగము -స్త్రీ
తండ్రి - భృగు, విష్ణుద్వేషి.
తల్లి: - హిరణ్య కశిపుని కుమార్తె ఉష
భార్య - 
పిల్లలు -
వారం - శుక్రవారం లేదా భృగువాసరే 
రుచి -పులుపు
జాతి -బ్రాహ్మణ
వర్ణము - తెలుపు, మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక.
ఇతర నామాలు కావ్యుడు, సితుడు, భృగుసుతుడు, దానవాచార్యుడు, ఉశనుడు 
శరీరంభాగం - సంతానోత్పత్తి వ్యవస్థ
అధి దేవత -ఇంద్రియాని. ఏడు వయసును సూచిస్తాడు.
నక్షత్రాలు  - భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ
రాశులు - వృషభం, తులా
దిక్కు -ఆగ్నేయము
వాహనం - రథం
తత్వం - జలతత్వం,
జీవులు -
ప్రకృతి -శ్లేష్మ, వాత
ఋతువు -వసంతం
లోహము -వెండి
రత్నము -వజ్రము
గ్రహ సంఖ్య -
గుణం -రజోగుణము
ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం
జప సంఖ్య - 16000
మిత్రులు -శని, బుధులు
శత్రువులు -రవి, చంద్రులు
సములు - కుజుడు, గురువులు
శుక్ర మహా దశ - 20 సంవత్సరములు

జ్యోతిషశాస్త్రంలో, శుక్రుడు (వీనస్) మీన రాశిలో ఉచ్ఛ స్థితిని పొందుతాడు, అంటే మీన రాశిలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు. కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.

శుక్రుడికి అనుకూలమైన ఇతర స్థానాలు 1, 2, 3, 4, 5, 7, 9, 10, 11 స్థానాలు, 

అలాగే గురువు, బుధుడు వంటి శుభ గ్రహాలతో కలిసి పంచమ స్థానంలో ఉండటం.

శుభ గ్రహాల కలయిక: శుభ గ్రహాలైన గురువు (బృహస్పతి), బుధుడు వంటి గ్రహాలు శుక్రుడితో కలిసి పంచమ స్థానంలో (ఫైన్త్ హౌస్) ఉన్నప్పుడు అది మంచి యోగంగా పరిగణిస్తారు.

శుక్రుడు జాతకంలో బలహీనంగా లేదా అశుభ స్థానాల్లో ఉంటే ఆర్థిక సమస్యలు, సంబంధాలలో ఇబ్బందులు, మరియు సౌభాగ్యం లేకపోవడం వంటివి తలెత్తుతాయి. ఈ దోష నివారణకు పరిహారాలు పాటించవలసి ఉంటుంది.

శ్రీకృష్ణుడు కుచేలుడికి అనుగ్రహించిన అపార ధన సంపత్తిని ఉశనుడు అపహరించబూనడంతో ఈశ్వరుడు ఆగ్రహించి శుక్రుడిని సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఉశనుడు తన తపశ్శక్తితో ఈశ్వరుడి ఉదరంలో ప్రవేశించి అతడిని స్తుతించసాగాడు. బోళాశంకరుడైన ఈశ్వరుడు ఉశనుడికి అభయం ఇచ్చి, శుక్ర శోణిత రూపంలో బయటకు పంపాడు. అప్పటి నుండి అతడికి శుక్రుడన్న పేరు సార్థకమయింది. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు మఖ నక్షత్రంలో మన్మధ సంవత్సరంలో ఉశనుడు శుక్రుడిగా అవతరించాడు. శివుడు అతడి స్తుతికి మెచ్చి ధన్వీర్యాలకు అధిపతిగానూ, రాక్షసులకు గురువుగానూ చేసి గ్రహమండలంలో స్థానం కల్పించాడు. అసురుల గురువైన శుక్రుడు వారి అభ్యున్నతి కొరకు ఘోర తపస్సు చేసాడు. ఈశ్వరుడిని మెప్పించి మృతసంజీవనీ విద్యను సాధించాడు. శుక్రుడు సంపదలకు, మంత్రాలకు, రసాలకు, ఔషధులకు అధిపతి. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన శుక్రుడు తన సంపదలను దానవ శిష్యులకు అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. వర్షాలపై ఆధిపత్యం వహిస్తూ అతివృష్టి, అనావృష్టికి కారకుడౌతాడు. వర్షాలను నిరోధించే వారిని శాంతింపచేస్తాడు.

శుక్రుడు శారీరక సుఖము, భార్య, యౌవనం, సౌందర్యం, రాజసము, వినోదము, స్త్రీలు, ఐశ్వర్యం, జలవిహారం, ఆభరణములు, సౌందర్య సాధనములు, చతుష్షష్టి కళలు, వీర్యము, మన్మధుడు, సుగంధద్రవ్యములు, గౌరి, లక్ష్మి ఆలయములు, క్రీడా ప్రదేశములు, పాలు, పాల కేంద్రాలు, పాలకు సంబంధించిన వస్తు విక్రయము, వస్త్రములు దానికి సంబంధించిన వృత్తులు, అలంకార సామాగ్రి, పరిమళ ద్రవ్యములు వాటికి సంబంధించిన వృత్తులు, పానీయములు, పండ్లరసాలు వాటికి సంబంధించిన సంస్థలు, పెట్రోలు వాహనములు, నౌకలు, సముద్ర యానం, రస సంబంధం ఉన్న నిమ్మ, నారింజ, కమలా, బత్తాయి మొదలైన పండ్లు, నేత్ర, సుఖ, చర్మ, కంఠముకు సంబంధించిన రోగములు, దర్జీ, కళాసంబంధ వృత్తులు, సౌందర్య సంబంధిత వృత్తులు, స్నేహితులు, బహుమతులు, హనీమూన్, ప్రేమ, విందులు విలాస విహారాదులు, పూలు, అలంకరణ సామాగ్రి, లౌక్యము, లాభము, ఒప్పందము, ఆకర్షణ మొదలైన వాటికి కారకుడు.

వ్యాధులు-  
గర్భాశయ, మూత్ర పిండ వ్యాధులు, సుఖ వ్యాధులు మొదలైన వాటికి కారకుడు.

కుజుడితో కలిసిన గొంతు నొప్పి, టాన్సిల్స్, గొంతు కాన్సర్, గొంతు వాపు మొదలైనవి కలుగుతాయి.

బుధుడితో కలిసిన నపుంసకత్వం, చర్మ వ్యాధులు, మధుమేహం,

శనితో కలిసిన సుఖ వ్యాధులు,

రాహువుతో కలిసిన గర్భ సంబంధిత వ్యాధులు,

కేతువుతో కలిసిన సంతాన లేమి.

ద్వాదశ స్థానాలలో శుక్రుడు
1.    శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందరశరీరం కలిగిన వాడు, సుఖజీవి, చిరంజీవి ఔతడు.

2.    శుక్రుడు ద్వితీయస్థానమున ఉన్న బహువిధములుగా సంపదలు కలవాడు, కవి ఔతాడు.

3.    తృతీయముస్థానమున శుకృడు ఉన్న జాతకుడు భార్యాహీనుడు, కష్టవంతుడు, బీదవాడు, దుఃఖవంతుడు, అపకీత్రి కలవాడు ఔతాడు.

4.    చతుర్ధస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు వాహనములు కలవాడు, మంచిగృహం కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు కలవాడు ఔతాడు.

5.    పంచమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు అపారధనవంతుడు, ఇతరులను రక్షించు వాడు, బహుమేధావి, పుత్రులు కలవాడు ఔతాడు, భార్య వల్ల లాభం, సుఖ సంసార జీవితంలో లాభం

6.    షష్టమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు శతృవులు లేని వాడు, ధనమును లేని వాడు, యువతుల చేత వంచింపబడిన వాడు, విచారగ్రస్తుడు ఔతాడు.

7.    సప్తమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు మంచి కళత్రం ఉన్న వాడు, పరస్త్రీ ఆసక్తుడు, కళత్రం లేని వాడు, ధనవంతుడు ఔతాడు.

8.    అష్టమ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, రాజు ఔతాడు.

9.    నవమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాబిడ్డలు, సంతానం, ఆప్తులు కలిగి రాజాశ్రయం కలిగి అభివృద్ధి చెందుతూ ఉంటాడు.

10.    దశమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగినవాడు, మిత్రులు కలిగిన వాడు, ప్రభువు ఔతాడు.

11.    ఏకాదశ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, బహు సుఖవంతుడు ఔతాడు.

12.    ద్వాదశము స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతుడు, ధనవంతుడూ ఔతాడు.


శ్రీ శుక్ర అష్టోత్తరశతనామ స్తోత్రం


Monday, October 6, 2025

Karthaveeryarjunudu - కార్తవీర్యార్జునుడు

కార్తవీర్యార్జునుడు త్రేతాయుగానికి చెందిన రాజు షట్చక్రవర్తులలో ఒకడు. గొప్ప చక్రవర్తి. వీరాధి వీరుడు. సత్ప్రవర్తనుడు. ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలించిన పాలకుడు.

యదువు పెద్దకుమారుడు సహస్రజిత్, చిన్నకుమారుడు క్రోష్టుడు. బలరామకృష్ణులు, యాదవులందరూ ఈక్రోష్టుడి వంశంవారే. సహస్రజిత్ కొడుకు శతాజిత్, అతని కొడుకు హెహయుడు. ఇతని వలనే హైహయవంశం ఏర్పడింది. హైహయవంశంలో మహిష్మవంతుడు, కృతవీర్యుడు, కార్తావీర్యార్జునుడు గొప్ప చివరి రాజులు. పరశురాముడు కార్తావీర్యార్జునుడిని అతని కుమారులను సంహరించడం వలన హైహయవంశం అంతమైంది.

హైహయ వంశీయుడైన కృతవీర్యుడు వింధ్య పర్వత ప్రాంతంలో ఉన్న అరూప దేశాన్ని మహిష్మతిపురంను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజు కుమారుడే కార్తవీర్యార్జునుడు. పుట్టుకతోనే శాపవశాన చేతులు లేకుండా పుట్టాడు వీరి గురువు గర్గమహర్షి.

కొంత కాలానికి కృతవీర్యుడు వయసు పైబడి వార్డక్యంతో మరణించాడు. ప్రజలు కార్తవీర్యార్జునుడిని రాజై రాజ్యాన్ని పరిపాలించమని కోరారు.

"నేను వికలాంగుడిని. రాజ్యాన్ని ఎలా పాలించగలను. నాకు రాజ్యం వలదు. రాజ భోగములు వలదు" అని వైరాగ్య భావనతో ప్రజల కోరికను తిరస్కరించాడు కార్తవీర్యార్జునుడు.

గురువు గర్గమహర్షి " కార్తవీర్యార్జునా! నీకు ఈ అవిటితనం పోవాలంటే దత్తాత్రేయుడిని ఆశ్రయించి ఆయన కృపను, కరుణను పొందితే ఆ మహాత్ముడి కటాక్షం వలన నీకు వికలాంగత్వం పోయి తేజోవంతమైన మహావీరుడవుతావు. అయితే ఆయన అనుగ్రహం అంత సులువు కాదు. ఆయన చూడడానికి అసహ్యంగా కనబడుతాడు. కుక్కలతో ఆడుకుంటూ ఒకసారి, మధువు సేవిస్తూ ఒకసారి, బంగి తాగుతూ ఒకసారి, స్త్రీలతో కలిసి చిందులేస్తూ ఒకసారి కనిపిస్తాడు. అవేవి పట్టించుకోకుండా ఆయనను సేవిస్తే కరుణించి వరాలు వొసగి అనుగ్రహిస్తాడు. " అని తెలిపి దత్తాత్రేయుడి సన్నిధికి కార్తవీర్యార్జునుడిని పంపుతాడు.

గురువు మాట తలదాల్చి శ్రద్ధాభక్తులను హృదయంలో నిలుపుకొని దత్తాత్రేయుడి ఆశ్రమానికి బయలుదేరుతాడు కార్తవీర్యార్జునుడు. దత్తాత్రేయుడు ఎన్ని వన్నెలు చిన్నెలు చూపిన, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆయన చరణాలు పట్టుకొని ఇడువకుండా ఎన్నో సంవత్సరాలు సేవ చేశాడు కార్తవీర్యార్జునుడు. ఎట్టకేలకు కార్తవీర్యార్జునుడి అకుంఠిత దీక్షకు, అమేయ భక్తి ప్రపత్తులకు అనుగ్రహించి, నిజరూపం దాల్చి వరములు కోరుకోమన్నాడు దత్తాత్రేయుడు.

కార్తవీర్యార్జునుడు " స్వామి! దయామయా! కరుణాసాగరా! ఇన్నాళ్లకు నాపై కృప కల్గిందా దేవా!

పరందామా! నాకు నాలుగు వరములు అనుగ్రహించండి పరమాత్మా!" అంటూ అనేక విధాలుగా వేడుకున్నాడు.

"కోరుకో! కార్తవీర్యార్జునా! నీకు వరములను ప్రసాదిస్తాను" అని అభయం ఇచ్చాడు దత్తాత్రేయుడు.

"1. నాకు వెయ్యి చేతులు కావలెను. యుద్ధభూమిలో నేను వెయ్యి చేతులతో కనిపించవలెను. వెయ్యి చేతులతో ఆయుధాలు ప్రయోగించ గలగవలెను. ఇంట్లో మామూలుగా కనిపించవలెను

2. ఈ భూమండలాంతటినీ జయించి సామర్థ్యంతో పాలించవలెను

3. నేను చెడుగా ప్రవర్తించినప్పుడు మునులు మహర్షులు నన్ను మంచి మార్గంలో పెట్టవలెను.

4. నేను యుద్ధభూమిలో యుద్ధం చేస్తూ నా కంటే గొప్ప వీరుని చేతిలో మరణించవలెను. ఈ వరములను దయతో ప్రసాదించండి ప్రభు!" కోరుకున్నాడు కార్తవీర్యార్జునుడు.

"తదాస్తు! నీవు కోరుకున్న వరములన్నీ ప్రసాదిస్తున్నాను. ఉత్తమ పరిపాలకుడవై ప్రజలను ఏలి ప్రసిద్ధి గాంచు కార్తావీర్యార్జునా!" దీవించి దత్తాత్రేయుడు వరములను వొసగినాడు. తక్షణం కార్తావీర్యార్జునుడికి సహస్ర బాహువులు, దివ్య తేజస్సు, అద్భుత లావణ్య రూపం, సకలాయుధ సహితంగా స్వర్ణరథం సిద్ధించింది.

అంతట దత్తాత్రేయుడికి సాష్టాంగ నమస్కారం చేసి, అనేక స్తోత్రంలతో కీర్తించి, సెలవు గైకొని తన రాజ్యంనకు పోయాడు కార్తావీర్యార్జునుడు. రాజ్యాభిషేక్తుడై, అశ్వమేధ యాగం చేసి, వరబలంతో భూమండలాంతటినీ జయించి, సమస్త జీవులపై అదుపు అధికారం సాధించి ధర్మధీక్షతో, న్యాయ బద్దంగా పాలించసాగాడు కార్తావీర్యార్జునుడు.

కార్తావీర్యార్జునుడు ఒకసారి తన దేవేరులతో కలిసి నర్మదా నదిలో క్రీడిస్తూ, నర్మదా నది ప్రవాహానికి తన సహస్ర బాహువులను అడ్డుగా పెట్టి నదీ గమనాన్ని నిలువరించాడు. నదీ ప్రక్కగా ప్రవహిచి సమీపములో ఉన్న రావణుని సైనిక శిబిరాల మీదుగా ప్రవహించింది. రావణుడు కోపించి కార్తావీర్యార్జునుడిపైకి యుద్ధానికి దండెత్తి వచ్చాడు. కార్తావీర్యార్జునుడు రావణుడిని యుద్దంలో ఓడించి చెరశాలలో బంధించాడు. రావణుడి తాత పులస్త్యుడు కార్తావీర్యార్జునుడి దగ్గరికి వచ్చి రావణుడిని విడిచి పెట్టుమని కోరగా రావణుడిని బంధవిముక్తుని చేసి సగౌరవంగా సాగనంపాడు.

కార్తావీర్యార్జునుడి పాలనను కిన్నెర కింపురుష గంధర్వులు ప్రశంసించారు. సకల లోకాలలో కీర్తించ బడినాడు. దానితో అతని లోనికి గర్వం అహంకారం అహంభావం ప్రవేశించి విర్రవీగాడు. వరబలంతో బలగర్వంతో దేవలోకాలను జయించాడు. ఇంద్రుడిని కూడ పీడించాడు కార్తావీర్యార్జునుడు.

ఒకనాడు అగ్ని దేవుడు కార్తావీర్యార్జునుడి దగ్గరకు వచ్చి "రాజా! నాకు ఆకలిగా ఉంది. ఆహారం కావాలి. నీవు రక్షణగా నిలబడితే ఈ గిరినగరారణ్యాన్ని స్వాహా చేసి నా ఆకలి తీర్చుకుంటాను" అర్థిస్తూ అడిగాడు.

మదోన్మత్తుడై ఉన్న కార్తావీర్యార్జునుడు " ఈ గిరినగరారణ్యాన్ని స్వాహా చేసి నీ ఆకలి తీర్చుకో అగ్నిబట్టారకా! " అంటూ అనుమతినిచ్చి అండగా నిలిచాడు కార్తావీర్యార్జునుడు.

అగ్ని గిరినగరారణ్యాన్ని యథేచ్ఛగా స్వాహా చేస్తూ అడవిలోని పల్లెలను, ఆశ్రమాలను కూడా కాల్చివేశాడు. ఆ అరణ్యంలోనే ఉన్న వశిష్టుని
 ఆశ్రమాన్ని కూడా దహనం చేశాడు. దానితో వశిష్టుడు కోపించి రక్షణగా నిలిచిన రాజును "కార్తావీర్యార్జునా! దురాంకారముతో, బలమదంతో చెలరేగిపోతున్నావు! నీ అంతం సమీపించింది. నిన్ను ఒక ముని కుమారుడు నీ సహస్ర బాహువులను తెగ నరికి నీ మస్తకాన్ని త్రుంచుతాడు" అని శపించాడు వశిష్ట మహర్షి. కార్తావీర్యార్జునుడు బలమదంతో శాపాన్ని లెక్క చేయలేదు

దేవతలందరూ వైకుంఠం చేరి కార్తావీర్యార్జునుడి ఆగడాలు శృతి మించి, మితిమీరాయని, అతని పీడ నుండి తమను రక్షించమని శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. వారికి అభయం ఇస్తూ
" కార్తావీర్యార్జునుడిని సంహరించే సమయం ఆసన్నమైంది. నేను పరశురామావతారం ఎత్తి హతమార్చుతాను. కార్తావీర్యార్జునుడు నా సుదర్శన చక్రాయుధమే. ఒకనాడు సుదర్శనుడు ' నా వలనే నీవు ఎందరినో రాక్షసులను, లోకకంటకులను సంహరించావు. నేను లేకుంటే నీవు చంపలేక పోయేవాడివి' అని మిడిసిపడినాడు. అట్లైన కార్తావీర్యార్జునుడిగా నీవు భూలోకమునందు జన్మించు! నేను పరశురాముడిగా అవతారం దాల్చి నీతో తలపడతాను. అప్పుడు నీవు లేకున్నా నేను జయించలేనేమో నీవే చూస్తావు" అని సంఘర్షించాము. ఆకారణంగానే సుదర్శనుడు భూమిపై జన్మించాడు" అని గతాన్ని చెప్పి దేవతలను పంపించాడు శ్రీమహావిష్ణువు.

అనంతరం విష్ణుమూర్తి భూలోకంలో పరశురాముడిగా జమదగ్ని రేణుకా ముని దంపతులకు జన్మించి, పెరిగి పెద్ద అవుతాడు. సకల విద్యలు, శాస్త్రాలు అభ్యసించి మహావీరుడుగా ఎదుగుతాడు పరశురాముడు.

చాల కాలం తరువాత ఒకనాడు అడవిలో క్రూర మృగాలు గ్రామాలపై బడి బాధిస్తుండగా వాటిని వేటాడుటకు బయలుదేరుతాడు కార్తావీర్యార్జునుడు. దినమంతా క్రూర జంతువులను వేటాడి, అక్కడే వున్న జమదగ్నిమహర్షిని దర్శించడానికి ఆశ్రమానికి తన సైన్యంతో సహా వెళ్తాడు కార్తావీర్యార్జునుడు.

జమదగ్ని కుమారుడు పరశురాముడు ఇంట్లోలేని సమయంలో జమదగ్ని మహర్షి, ఆశ్రమవాసులు రాజును, సైన్యాన్ని ఆదరించి, సేదదీర్చి, రాజుకు సైనికులకు పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించి సంతృప్తి పరుస్తారు. రాజు - ఇంతమంది సైనికులకు భోజనాలు పెట్టిన ఆశ్రమవాసుల్ని చూసి విస్మయం చెంది కార్తావీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని సమీపించి "మహర్షి! ఇంత పెద్ద సైన్యానికి ఎలా భోజనం ఏర్పాటు చేశారు. మీ దగ్గర అంత ధాన్యం లేదు కదా! ఎలా సాధ్యం అయింది. " అడిగాడు.

" మహారాజా! ఇది నా గొప్పతనం కాదు. నా దగ్గర దైవ ప్రసాదితమైన కామదేనువు సంతతికి చెందిన ఒక గోవు ఉన్నది. దాని మహిమ వలననే మీకు ఆతిథ్యం ఇయ్యడం సాధ్యమైంది. " అని వివరించాడు జమదగ్ని మహర్షి.

" ఇలాంటివి రాజు దగ్గర వుంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలడు. కాబట్టి మహర్షి! ఈ గోవును నాకు ఇవ్వండి. బదులుగా మీకు ఏమి కావాలంటే అవి ఇస్తాను. భూమి, ధాన్యం, ధనం, బంగారం ఏది కోరుకుంటే అది ఇస్తాను. ఆవును మాత్రం నాకివ్వండి. మీరివ్వకపోతే బలవంతంగానైనా తీసుకపోవలసి వస్తుంది. కాబట్టి మీరే సగౌరవంగా ఇచ్చి పంపుతే గౌరవంగా ఉంటుంది" నయానా భయానా చెప్పాడు కార్తావీర్యార్జునుడు. జమదగ్ని మహర్షి నిర్ద్వంద్వంగా నిరాకరించాడు.

కార్తావీర్యార్జునుడు బలవంతంగా గోవును తోలుకొని తన రాజధాని మహిష్మతి నగరాన్ని చేరుతాడు. ఇంటికి వచ్చిన పరశురాముడు విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడై మహిష్మతి నగరంపై దండెత్తి, భీకరాకృతి దాల్చి కార్తావీర్యార్జునుడి సమస్త సైన్యాన్ని సంహరించాడు. కార్తావీర్యార్జునుడితో జరిగిన మహభయంకర యుద్ధంలో అతడి సహస్ర బాహువులను, తలను ఖండిస్తాడు పరశురాముడు.

"అసువులు బాసిన కార్తావీర్యార్జునుడి పార్థీవ దేహం నుండి సుదర్శనుడు బయటికి వచ్చి పరశురాముడికి నమస్కరించి "నా గర్వం, అహంకారం, అహంభావం తొలగి పోయాయి ప్రభు. విశ్వప్రభువైన నీతోనే గర్వించి ఆత్మస్థుతి చేసుకున్నాను. నా గొప్పదనం నీ వలన సంప్రాప్తించినదే అని గుర్తించలేని అజ్ఞానిని. క్షమించు ప్రభు!" అని పరశురామావతారమూర్తిని స్థుతించి, వైకుంఠం జేరి, చక్రాయుధ రూపు ధరించి శ్రీ మహావిష్ణు దివ్యహస్తంను అలంకరించాడు సుదర్శనుడు.

Renuka Devi - రేణుక దేవి

హిందూ పురాణాల ప్రకారము ఈ విశాల భారతదేశం ఎందరో దేవీ దేవతలకు పుట్టినిల్లు. విష్ణుమూర్తి యొక్క దశావతారాలు, షట్చక్రవర్తులుగా పేరుగాంచిన హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, మరియు కార్తవీర్యుడు. పంచ పతీవ్రతలు అయినటువంటి సీత, ద్రౌపతి, మండోదరి, తారాదేవి అహల్య ఈ నెల పైనే జన్మముందిరి. యాగ యజ్ఞ ఫలాలుగా ఎందరో దేవతలు జన్మించి అందరికీ ఆదర్శప్రాయంగా మారి అందరి పాలిట దైవంగా పరిగణించ బడుతున్నారు. వారిలో రేణుక ఎల్లమ్మ కూడా ఒకరు.

రేణుక దేవిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పిలుస్తారు. త్రిమూర్తులను సృష్టించి పసిపాపలుగా ఆడించినందున తనని జగదంబ అని పిలుస్తా ఎల్లరకు అమ్మ కనుక ఎల్లమ్మ అని ఊరికి ఎల్లల్లో ఉండటం వలన ఎల్లారమ్మ అని చండాల వాటికలో ఉద్భవించినందున మాతంగి అని లజ్జా గౌరీ అని క్షేమకరీమాత అని కుంకుడు చెట్టు కింద వెలుచుట వలన కుంకుళ్లమ్మ అని ఆటలమ్మ మసూచి వంటి వ్యాధుల నివారణ చేయటం వలన మారెమ్మ అని పోచమ్మ అని ముత్యాలమ్మ అని ఇలా వివిధ పేర్లతో కొనియాడుతారు భక్తులు దక్షిణ భారతదేశంలోనే కాక ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఉత్తరాఖండ్ కాశ్మీరు ప్రాంతంలో అమ్మవారి యొక్క తంత్ర సాధన చాలా ప్రసిద్ధిగాంచినది విదేశాలు అయినటువంటి థాయిలాండ్, మలేషియా సింగపూర్ ఇండోనేషియా మొదలగు ప్రాంతాలలో అమ్మవారి పూజ చాలా వైభవంగా జరుపుకుంటారు ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ దేవేరి త్రికాలజ్ఞాని త్రినేత్రదారుడు బృగు వంశమునందు జన్మించినటువంటి సప్తర్షి జమదగ్ని మహర్షి యొక్క ఇల్లాలు జమదగ్ని మహాముని క్రోధ దేవతల యొక్క ఆశీర్వాదము వలన నేరము చేసిన వారిని తన యొక్క కోపోజ్వాలలో భస్మిపట్లము చేయగల సమర్థులు.

జమదగ్ని జననము
బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులలో ఒకరైనటువంటి భృగు మహర్షి వంశము చాలా ప్రాశస్తం పొందినది అమ్మవారిని సేవించి లక్ష్మీదేవినే తనకు కుమార్తెగా పొందిన మహా ఋషులు భృగు మహర్షి ఆయనకు 
చ్యవనుడు అనే కుమారుడు జన్మించెను ఆయన పులోమజా అను పతివ్రత వలన ఋచీకుడు అను మహామునికి జన్మనిచ్చింది. ఋచీకుని భార్య సత్యవతి వారికి పుట్టిన సంతానమే జమదగ్ని.

సత్యవతి గాది మహారాజు యొక్క ఏకైక పుత్రిక తమకు ఒక్కగానొక్క సంతానము అయినటువంటి సత్యవతికి వివాహము జరిపించి రాజ్యమునంతటిని సామంతులకు అప్పగించి నిశ్చయించారు సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి ముని వంశస్థుడు సత్శీలత కలిగినటువంటి ఋచీకునికి ఇచ్చి వివాహము జరిపించెను తాను క్షత్రియ కులకాంత అవుట వలన తమకి జన్మించే సంతానము కూడా క్షత్రియ గుణములతో పుడతాడు అది ముని అయిన తన భర్త వంశమునకు కీడు వంటిది అని భావించి ఋచీకునికి తనకు కేవలం సాత్విక గుణములు కలిగిన బిడ్డ కావాలన్న కోరికను విన్నవించెను. అలానే మగసంతానము లేని తన తల్లిదండ్రులకు కూడా క్షత్రియ గుణములు కలిగిన బిడ్డను ప్రసాదించమని అడిగాను. సత్యవతి కోరిక మేరకు అత్తకు భార్యకు సంతానము నివ్వదలిచి యాగము చేసి రెండు కుండలలో పరమాన్నముతో నింపి ఒకటి అత్తగారిని ఇంకొకటి భార్యని భుజించమని అత్తగారికి ఇచ్చి పంపెను. ఆ రెండు కుండలలో క్షత్రియకుల సతి అయిన గాది యొక్క భార్యకి క్షత్రియ గుణములు గల బిడ్డను, ముని భార్య అయిన సత్యవతికి సాత్విక గుణములుగల బాలుడు పుట్టవలెను అనే ఉద్దేశంతో రెండు కుండలను విడివిడిగా ఇచ్చిన కానీ అల్లుడు ఋచీకుడు యందు అనుమానం కలిగిన సత్యవతి తల్లి తనకు మంచి బిడ్డ పుట్టవలెను అను ఉద్దేశంతో ఋచీకుడు తన భార్య కుండలో ఏవైనా శక్తులు నింపాడేమో అనుకొని స్వార్థంతో సత్యవతికి ఇచ్చిన కుండా భుజించి తనకు ఇచ్చిన ప్రసాదాన్ని సత్యవతికి ఇచ్చెను. అవి భుజించిన వారి గర్భంలో మారు బిడ్డలు పెరుగుచుండరి. అది గ్రహించిన ఋచీకుడు తన భార్య క్షత్రియ బిడ్డను మోస్తుంది అన్న విషయం తనకి తెలియజేశాను. అంతట భయమొందిన సత్యవతి ఆ బిడ్డను తన కుటుంబ తరువాతి తరమునకు చెందనున్న తన కోడలి గర్భమునకు మార్చమని ఋచీకుడుని అడిగింది. ఋచీకుడు అలాగే చేశాడు. అత్తకు మరియు భార్యకు కూడా సాత్విక గుణములు కలిగిన సంతానము కలిగిరి. గాది తన బిడ్డకు విశ్వామిత్రుడు అని నామకరణము చేసినది. సత్యవతి తన బిడ్డకు జమదగ్ని అను నామకరణం చేసినది అలా సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు, సత్యవతికి జమదగ్ని జన్మించితిరి. ఆ ముని బిడ్డ జమదగ్ని క్రోధ దేవతల ఆశీర్వాదంతో తనకు కోపం కలిగించిన వారిని తన క్రోధాగ్ని జ్వాలలతో భస్మము చేయగల శక్తి పొందెను.

రేణుక జననము
పూర్వం మధ్య భారత దేశము నందు వైగంగా నది తీరాన విదర్భ రాజ్యము విలసిల్లుతుండేది.  ఆ రాజ్యము ఇష్వాకు వంశస్తులైనటువంటి ప్రశ్నజిత్తు మహారాజు ఏలుబడిలో ఉండేది రాజ్యం అంతటినీ తన కుటుంబంలా భావించి పాలించే రాజుకి సంతానం లేకపోవడం ఒక తీరని లోటులా మారిపోయింది. తన ఆస్థాన అర్చకుల ఆదేశం మేరకు రాజుగారు పుత్రకామేష్టి యాగం చేయించి అమ్మవారి కృప వలన యాగశికల నుండి తేజవంతమైనటువంటి ఒక పసిపాప కాంతులనీనుతూ ఆవిర్భవించెను. సంతోషించిన రాజు ఆ పాపకు రేణుక అను నామకరణం చేసిరి

రేణుక పుట్టిన తర్వాత తన తల్లి చనిపోవటం వలన రేణుక యొక్క పోషణ భారం ఆస్థాన పరిచారకురాలు అయినటువంటి మాతంగికి అప్పగించారు రాజుగారు. మాతంగి పర్యవేక్షణలో ఆస్థానంలో అందరి ప్రేమ అభిమానాలతో అల్లారుముద్దుగా పెరగసాగింది. క్షత్రియ కాంత అయినందున సమస్త యుద్ధ విద్యలు నేర్చుకొని మహారాగ్నికి ఉండవలసిన అన్ని లక్షణాలను ఇనుమడింప చేసుకొనెను.  వేదవేదాంగాలు, ధనుర్విద్య మొదలగు విద్యలను అవపాసన చేసుకొనెను. యుద్ధ విద్యలతో పాటు భగవంతునిపై ఎనలేని భక్తి నమ్మకం తో కొంతకాలం తపస్సు ఆచరించెను. అలా కొన్ని కాలం గడిచిన తరుణంలో అగస్త్య మహాముని కోరిక మేరకు ప్రశ్నజిత్తు రేణుకను భృగుకులా వంశస్తుడైనటువంటి జమదగ్ని మహామునికి ఇచ్చి పరిణయము చేయనిచయించిరి.

రేణుక జమదగ్నిల కళ్యాణం (కుండలినీపురం)
జమదగ్ని మహాముని యొక్క గొప్పదనం తెలుసుకోదలిచిన రేణుక తనని పెంచి పెద్ద చేసినటువంటి పరిచారకురాలు మాతంగితో కలిసి జమదగ్ని ఆశ్రమనకు వెలుటకు దక్షిణాన ఉన్న పాండ్య దేశమందలి కుండలిపురమునకు బయలుదేరును అది దట్టమైన అటవీ ప్రాంతం పచ్చని చెట్లు పొదలతో పక్షుల రాగములతో శోభిస్తున్న సుందర ప్రదేశం. ఆ వాతావరణము ప్రకృతి శోభను చూసి అమ్మవారు రేణుక ఎంతో చకితురాలాయెను. ఆశ్రమమునకు చేరుకున్న తరువాత రేణుక, మాతంగి లోపలకి అడుగుపెట్టే సమయానికి కొందరు జమదగ్ని శిష్యులు స్త్రీకి లోపలికి అనుమతి లేదు అని అడ్డుకొనెను. వాళ్లు రేణుకతో వాగ్వివాదమునకు దిగెను. రేణుకా మాత కోపించి తన తపశక్తితో త్రినేత్రాన అగ్ని రగిల్చెను. వనమంతా మంటలు వ్యాపించినవి. ధ్యాన నిమగ్నుడైన జమదగ్ని దీనిని గమనించి వెంటనే తన యొక్క కమండలం నుంచి ఒక నీటి ధారను ఆ మంటలపై వ్యాపింపజేసెను. అంతటా ఆ మంటలు చల్లారిపోగా ఆ నీటి దార మాత్రం ఆగకుండెను. జమదగ్ని ముని ఆ నీటి ప్రవాహానికి కమండలు నది అని నామకరణం చేసెను. అప్పుడు శిష్యులు జమదగ్నిని చేరి అమ్మవారి యొక్క విషయము తెలియజేసెను. రేణుకాదేవి అత్యంత శాంతముతో తాను వచ్చిన వివరములు మునివర్యులకు తెలియజేసెను. జమదగ్ని వెంటనే మీరు రాజపుత్రిక ఋషులను పరిణయ మాడి మీరు ఏం సుఖాన్ని అనుభవిస్తారు.  ఆశ్రమ ధర్మాలు అత్యంత కఠినముగా ఉంటాయి అవి మీరు పాటించలేకపోవచ్చు అనెను. వెంటనే రేణుక తాను ఇక్కడే కొన్ని రోజులు ఉండి మునికి పరిచర్యలు చేస్తాను అప్పుడు నిర్ణయించండి అని వేడుకొనెను. అందుకు సమ్మతించిన జమదగ్ని రేణుకను అనుమతించెను. 

రేణుక తన యొక్క తపో బలముతో ఆశ్రమ కార్యక్రమాన్ని చక్కగా నెరవేర్చుచు జమదగ్ని మునియొక్క మనస్సు చూరగొనేను. కొంతకాలానికి జమదగ్ని మనసు మారి వివాహమునకు సమ్మతించెను. వారి యొక్క వివాహమునకు ఎందరో ఋషులు,దేవతలు విచేసినారు. వారి వివాహమునకు విచ్చేసిన ఇంద్రుడు వివాహ కానుకగా జమదగ్నికి కామధేనువును బహుమతిగా ఇచ్చెను. 

సన్యాశ్రమము నుండి గృహస్థాశ్రమము లోకి అడుగు పెట్టిన జమదగ్ని మహర్షి సతీ సమేతుడై నిత్య కర్మలను అనుష్టానము చేయసాగెను. మాతంగి కూడా రేణుకాదేవి తోనే సహాయకురాలిగా ఆశ్రమము నందే ఉండసాగెను. తన పాతివ్రత్య శక్తితో నదీ తీరానికి వెళ్లి పోడి ఇసుకతో కుండలు చేసి వాటిలో నీటిని నింపి తీసుకువస్తూ ఉండేది. 

రేణుక జమదగ్నుల గృహస్థాశ్రమం జమదగ్నికి సూర్యుని శాపం 
వివాహ అనంతరము రేణుక జమదగ్ని మహర్షి యొక్క నిత్య కర్మలలో సహకరిస్తూ ఉండేది. ఒకరోజు జమదగ్నిముని రేణుకా సమేతుడై కమండలు నది తీరాన పయనిస్తుండెను. రేణుక యందు  కామ వంచ కలిగిన జమదగ్ని రేణుకను త్వరత్వరగా నడిపించ సాగెను. అప్పుడు రేణుక ఎండవేడికి ఇసుక తినెల్లో నడవలేక నిలుచుండి పోయాను. కారణం తెలుసుకున్న జగదగ్ని సూర్యునిపై కన్నెరజేసెను. వెంటనే సూర్యుని తలుచుకొని నీ యొక్క తీక్షణ వెలుగు రేఖలు కృషించిపోవును గాక అని శపించెను. అప్పుడు సూర్యుడు కోపోద్రిక్తుడు అయి సూర్యుని ఎదుట రతి జరపరాదు అన్న నియమమును మరిచిన నీవు పాలించు రాజు చేతిలో ఘోరమరణం పొందుగాక అని శపించెను. అప్పుడు నారదుడు వచ్చి మహర్షి శాపం సూర్యునికి గ్రహణం రూపంలో సూర్యుని శాపం మహర్షికి ఉత్తమ గతులు కలిగించినట్లుగా ఒక ఉపశమనము చేశాను. శాంతించిన సూర్యుడు తన వేడిని తట్టుకొనుటకు కాళ్ళకి పాదుకలు తలకి ఛత్రము జమదగ్ని రేణుకలకు కానుకగా ఇచ్చి అంతర్దానమయ్యేను.  

కొన్ని సంవత్సరముల తరువాత రేణుక తన భర్త ఆయన జమదగ్ని వలన నలుగురు పుత్రులకు జన్మనిచ్చెను. వారు వరుసగా సులోచన , విలోచన, బృహలోచన మరియు భార్గవ రాముడు. ఆఖరివాడైన భార్గవ రాముడు శివుని గూర్చి ఘోర తపమాచరించెను. అంత శివుడు ప్రత్యక్షము కాగా వరము కోరామని అడిగెను. భార్గవ రాముడు వరములు ఏమియునూ కోరక శివుని భక్తితో స్తుతించెను. అంత శివుడు సంతసించి ఆయుధములలో శ్రేష్టమైన పరుశువుని ప్రసాదించి ధర్మాన్ని  రక్షించ మని ఆజ్ఞాపించెను. అప్పటి నుండి భార్గవ రాముడు పరశురాముడు గా మారెను. పరశురాముడు బహుపరాక్రమశాలి.

రేణుక తన యొక్క రాజమందిరపు భోగాలన్నీ విడిచి కేవలం పతిభక్తితో నార చీరలు రుద్రాక్ష మాలలు ధరించి సాధువుల జీవితాన్ని గడుపుతూ ఉండేది ఈ అవతారంలో ఉన్న రేణుకాదేవిని శబరి రేణుక అని తంత్రమందు అభివర్ణిస్తారు అమ్మవారి యొక్క పంచాక్షర మంత్రము యొక్క ఉపాసన అత్యంత ఫలదాయకము మరియు మోక్షదాయకం. అయితే కఠిన నిష్టలతో పాతివ్రత్యం వలన రేణుక ప్రతిరోజు  కమండలుని నదీతీరానికి వెళ్లి పొడి ఇసుకతో కుండలు తయారు చేసి వాటిలో నింపి నీటిని నింపి ఆదిశేషుడిని తలచుట్టగా పెట్టుకుని దానిపై ఈ కుండను ఆశ్రమం వద్దకు మోసుకు వెళ్ళేది. ఒక కథనం ప్రకారం ఇసుక వేణువులన్నీ తన తపశక్తితో కుండగా మార్చడం వలన ఈవిడకీ రేణుక అని నామం ఏర్పడింది అని ప్రస్ఫుటించబడును. 

పరశురాముని అవతార రహస్యం:
పరశురాముడు జమదగ్ని రేణుకల నాలుగవ సంతానం సత్యవతి కోరిక మేరకు క్షత్రియ గుణములు కలిగిన బిడ్డ తన తరువాతికి మార్చబడిన కోరిక ఇలా రేణుక గర్భమున పరుశురాముని రూపంలో వ్యక్తమైంది. అయితే పరశురాముడు అలా జన్మించుటకు వెనుక ఒక అవతార రహస్యము ఉన్నది పూర్వము పాలసముద్రమున పవళిస్తున్న లక్ష్మీ సమేతుడైన నారాయణుడి వద్దకు నారద ముని వచ్చును. నారాయుని యొక్క తరువాతి అవతారం గురించి తెలుసుకోవాలని ఉత్సుకత కలిగిన వాడై నారాయణుడిని శతధా పొగుడుచున్నారు. అది విన్న సుదర్శన చక్రం కోపంతో నేను లేనిదే విష్ణుమూర్తి అంతటి కార్యములు చేయగలడా అది కేవలం నా గొప్పతనమే అని అహంకారము వెళ్ళబుచ్చెను. అది విన్న శ్రీహరి ఫక్కున నవ్వి నాయనా సుదర్శన నీవు అవివేకంతో మాట్లాడుచున్నావు అది ఎంత పరమేశ్వరుని లీల నా శక్తిని ప్రయోగించుటకు నీవు ఒక సాధనము వంటివాడివి అంతియే అని అనెను. అప్పుడు సుదర్శనుడు కోపముతో అయితే నీ యొక్క తరువాతి అవతారంలో నా సహాయము లేకుండా మీ కార్యముని నిర్వహింపుడు అని అనెను. సరే నేను రానున్న కృతయుగములో భృగు వంశమునందు భార్గవరామునిగా జన్మించి అదే సమయంలో కార్తవీర్యార్జునుడిగా జన్మించిన నిన్ను ఓడించి శత్రుసంహారము చేసెద అని అనెను. ఆ ఆజ్ఞ వల్లే విష్ణుమూర్తి తన దశావతారాలలో ఆరవధి అయిన పరుశురామునిగా జన్మించెను. 

రేణుకకు జమదగ్ని శాపం మరియు రేణుక చిన్నమస్తగా(ప్రచండ చండిక) మారుట:
మహర్షి జమదగ్ని ఋషివర్యులు అందరి సమక్షంలో గృహస్థాశ్రమ ధర్మాలను త్యజించి వాన ప్రస్తాశ్రమం తీసుకునెను. అప్పుడు వాళ్లు కుండలినీపురం వదిలి ప్రస్తుత వైశాఖవనంగా చెప్పబడే నల్లమల అడవులలో ఉన్న అలంపూర్ సంస్థానానికి చేరుకున్నారు. అక్కడ తమ ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే కొలువై ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామిని శక్తిమాత అలంపూర్ యోగినీ దేవతలకు అధినేత్రి అయినటువంటి జోగులాంబని సేవిస్తూ నిత్య కర్మలను అనుష్టించేవారు. ఒకానొక రోజు రేణుక ఎప్పటి వలె నీరు తెచ్చుకొనుటకు తుంగభద్రా నది తీరానికి వెళ్ళెను అక్కడ నీటిలో గంధర్వలోకంలో తమ చెలికత్తెలతో శృంగార కేళీ జరుగుతున్న చిత్రరథుడు అను గంధర్వుడి నీడ కనిపించెను. ఆ కామకేళిని చూసి మనస్సు చెల్లించిన రేణుక ఒకసారె తేరుకొని పొడి ఇసుకతో కుండను చేయుటకు ప్రయత్నించెను. కానీ ఇసుక నిలువటలేదు. వెంట వచ్చిన సర్పము చేతికి అందక మాయమయ్యాను. తాను పాతివ్రత్యముని మరిచి వానప్రస్థాశ్రమంలో ఉండగా ఇటువంటి ఆలోచన చేసి ఘోర పాపము చేసితిని అని భావించి ఒట్టి చేతులతో ఆశ్రమానికి చేరుకొనెను. అది అంతయు జ్ఞానదృష్టితో తెలుసుకొని జమదగ్ని కోపోద్రిక్తుడై రేణుకకు వెంటనే ఆశ్రమ బహిష్కరణ విధించెను. అంతియేకాక భయంకరమైన చర్మవ్యాధితో బాధపడుతూ పంచభూతాల నిరాదరణకు లోనుకమ్ము అని శపించెను.  దిక్కుతోచని రేణుక తన సేవకురాలు మాతంగితో అడవులబాట పట్టెను. మాతంగి రేణుకకు సేవలు చేస్తూ కాలము గడుపుతుండగా ఒకనాడు దారిలో ఏకనాథ్, జోగినాథ్ అని ఇద్దరు సాధుపుంగవులు రేణుకని గుర్తించి ఆమె ఈ స్థితికి కారణం తెలుసుకొని బాధపడెను. రేణుకను రక్షించి దలచిన వారు రేణుకకు ఒక పాతివ్రత్య వ్రతమును బోధించెను. 

"అమ్మా రేణుక నీ దుర్భరస్థితి నుండి కేవలం పరమశివుడు మాత్రమే రక్షించగలడు వెంటనే మేము చెప్పినట్లుగా చేయుము నీవు ఐదు గ్రామములలో సమస్త వర్ణాల వారి నుండి బిక్షపొందు, వచ్చిన దానితో అగ్ని లేకుండా పరమాన్నము వండి ఆ శివునికి నివేదించి తపస్సులో నిమగ్నమవ్వు అనెను". 

మునుల మాట విన్న రేణుక వెంటనే అలా ధాన్యమును బిక్షగా పొంది ఏడుకుండలలో ధాన్యము,  నీరు నింపి తన కటి భాగముపై నిలిపి సూర్యుని వేడితో అన్నము వండెను. ఏడు బోనాలు ఎత్తుకొని పరమశివుడు గంగాసమేతుడిగా ఉన్న ప్రదేశానికి వెళ్లి పరమాన్నము నివేదించి తపస్సులో నిమగ్నమాయెను. అమ్మవారు అలా కొంత కాలం ఆచరించగా తన చుట్టూ చెదలు పుట్టలు పెట్టి అమ్మవారిని కప్పేసేను. తన తపోనిష్ఠకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై రేణుకను శాప విముక్తురాలు చేసెను. అలా చేశాక రేణుకకు హెచ్చరికగా ఇలా అనెను అమ్మా రేణుక ఇప్పుడు నీవు ఆశ్రమముకి వెళ్ళు అక్కడ నీవు ఒక కఠిన పరీక్ష ఎదురు అవుతుంది ధైర్యంగా ఎదుర్కొని ఆహ్వానించి తర్వాత నువ్వు ఉత్తమ గతులు పొందుతావు అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాను. 

రేణుక మిక్కిలి సంతోషముతో మాతంగిని తోడుకొని ఆశ్రమముకి వెళ్ళెను సమస్తము తన దివ్య దృష్టితో తెలుసుకున్న మహర్షి తన కూతురు జాడ తెలుపమని రేణుకా దేవి తండ్రి జమదగ్ని ని నిలదీస్తున్నసమయంలో వచ్చిన శాప విముక్తురాలైన రేణుకా ఎల్లమ్మ ను చూసి , జమదగ్ని కోపంతో ఆశ్రమ ప్రవేశం లేదని చెప్పినా మళ్ళీ ఎందుకు వచ్చావని అంటున్నా, అతని మాట వినకుండా నా భర్త పాదాల దగ్గరే నేను ఉంటాను అని పట్టు బట్టిన రేణుకా ఎల్లమ్మ ను భస్మం చేయ తీర్థ జలం ప్రయోగించబోతుంటే, మీ చేతుల్లో భస్మం కావడం నాకు వరమే అని నిలుచున్న ఎల్లమ్మని చూసి, నీకు ఈ పవిత్ర జలాన్ని తాకే అర్హత కూడా లేదు అని కుమారులను పిలిచి , భర్త ఆజ్ఞ మీరిన భార్య మీ తల్లి. శిరచ్ఛేదం చేయమని కొడుకులను ఆజ్ఞాపించినాడు.

రేణుక వెంటనే పరమేశ్వరుని మాటలు గుర్తుతెచ్చుకొని మిక్కిలి సంతుష్టురాలై తన అంగీకారము తెలిపినది.  అప్పుడు జమదగ్ని వెంటనే కుమారులను పిలిచి రేణుక శిరస్సును ఖండించమని అడిగెను.  దిగ్భ్రాంతి చెందిన మాతంగి మరియు కుమారులు దీనిని వ్యతిరేకించెను. కన్నతల్లిని చంపే అంత ఘోర పాపము మేము చేయజాలము అని పలికెను. అప్పుడు నాలుగవ వాడైన పరుశురాముని పిలిచెను తండ్రి మాటలోని అంతరార్థమును గమనించిన రాముడు వెంటనే తన గండ్రగొడ్డలితో రేణుకా శిరస్సును ఖండించ ముందుకు సాగెను కన్నులు మూసుకుని గొడ్డలి పైకెత్తగా భయపడిన మాతంగి రేణుకకు అడ్డుగా నుంచుంటుంది అప్పుడు రామభద్రుడు చూడక మాతంగి తల నరికి వేస్తాడు. ఆశ్చర్యపడిన రాముడు తండ్రి మాట పాటించుటకు రేణుకను కూడా నరుకుతారు రేణుక ముండెం ఆనందంతో తాండవం చేస్తుంది అలా శిరస్సులేని రూపముగా చిన్నమస్తగా మారింది అమ్మవారు. 

రేణుకా దేవి, రేణుకా ఎల్లమ్మగా  మారుట
పితృవాక్య పాలన చేసిన పరుశురాముని చూసి మహర్షి తల్లిని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న పరుశురామును చూసి మూడు కోరికలు కోరుకోమనెను. అంతట సంతోషించిన పరశురాముడు తన తల్లిని బ్రతికించమని వేడుకొను జమదగ్ని కుమారునికి కొంత పుణ్య జలముని తన కమండలం నుండి తీసి పరుశురామునికి ఇచ్చి తలాముండెం జోడించి వాటిపై చల్లమని ఆదేశించిన పరశురాముడు కంగారులో మాతంగి తల రేణుకకు రేణుక తల మాతంగి జోడించి నీరు చల్లుతాడు.  ఇద్దరు స్త్రీలు తమ యొక్క మారిన దేహములతో పైకి లేస్తారు అది చూసి చికిత్యుడైన పరుశురాముడు వాళ్ళని మారిన అమ్మలు మారెమ్మగా పిలుస్తాడు అలా మారెమ్మ యొక్క ఆవిర్భావం జరిగింది ఆ మారమ్మయే తమిళనాడులో మారీ అమ్మన్ గా ప్రసిద్ధి చెందినది. 

అయితే మహర్షి ఈ గతాన్ని మర్చిపోవటకు తన నివాసముని హిమాలయములకు మార్చుటకు పయనం అయ్యెను. అయితే అప్పటికే వృద్ధాప్యంలోకి చేరుకున్న మాతంగి శరీరం మిగులు ప్రయాణానికి సహకరించకపోవడంతో తాను అక్కడికి రాలేను ఇక్కడే ఉంటాను అని చెప్పాను. అప్పుడు మహర్షి రేణుకా శిరస్సు కలిగిన మాతంగిని పరలోక సాయం చేస్తూ నీ మహిమ వలన ఇక్కడి ప్రజలను కాపాడుచూ ఇక్కడే వుండు అని చెప్పిను. రేణుక శిరస్సు కలిగిన నీవు ఎల్లరకు అమ్మవై రేణుక ఎల్లమ్మగా మారి పూజలు అందుకొనుము అని పలికెను. అప్పుడు ఆ మారిన మాతంగి వనములకు పయనమయెను. ఆవిడను ప్రజలు తోట మారెమ్మ దండు మారెమ్మగా రేణుక ఎల్లమ్మగా అభివర్ణిస్తారు.

Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి

శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...