Tuesday, November 18, 2025

ARABIAN NIGHTS STORIES - అరేబియా రాత్రులు

 అరేబియా రాత్రులు

పర్షియా దేశంలో ఒక సుల్తాన్ ఉండేవాడు.

అతను ఎన్నోచోట్ల వెతికి ఒక గుణవంతురాలైన అందమైన స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు.

అతను ఒక్క క్షణం కూడా భార్యను విడవకుండా కాలం గడిపాడు.

కొంతకాలం తర్వాత పరిపాలన గాలికి ఒదిలేయడం మంచిది కాదు అని గుర్తు చేశాడు వజీరు.

అప్పటినుంచి సుల్తాను రాణితో గడిపే సమయం తగ్గించి పాలన చూసుకోవడం ప్రారంభించాడు.

శరీర సుఖానికి రుచి మరిగిన రాణి కొంతకాలం ఆగింది. ఆ తర్వాత ఆగలేకపోయింది.

కోటలో ఎంతోమంది నీగ్రో బానిసలు సేవకులుగా ఉన్నారు.

వారిలో ఒకడ్ని చూసుకొని రంకు ప్రారంభించింది.

ఈ వ్యవహారం కొంతకాలం గుట్టుగా సాగింది.

ఒక దురదృష్టకరమైన రోజున .. రాణి తన ప్రియుడితో కులుకుతుండగా రాజు చూడనే చూశాడు.

అతని హృదయం బద్దలైపోయింది.

రాణిని ప్రాణం కన్నా‍ ఎక్కువగా ప్రేమించాడు అతను.

ఆమె కలలో కూడా తనను మోసం చేయదని నమ్మాడు అతను.

బాధ కోపంగా మారింది సుల్తాన్‌కు.

రాణి, ఆమె నీగ్రో ప్రియుడు రాజు కోపానికి బలైపోయారు.

రాణి చేసిన నమ్మకద్రోహంతో సుల్తాన్ రాక్షసుడిగా మారిపోయాడు.

లోకంలోని స్త్రీలందరూ ఇంతే .. భర్తను నమ్మించి చాటుమాటుగా రంకు నడుపుతారు అని అతను నమ్మాడు.

అంతే .. ఒక క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు.

ప్రతిరోజు ఒక అమ్మాయిని వివాహం చేసుకొనేవాడు.

ఆ రాత్రి ఆమెతో సుఖపడేవాడు.

ఉదయాన్నే ఆమెకు మరణశిక్ష విధించేవాడు.

ఇలా ఎందరో స్త్రీలను చంపేశాడు సుల్తాన్.

అందులో చెడ్డవాళ్ళున్నారు. మంచివాళ్ళున్నారు.

చివరకు వజీరు కూతురు సుల్తాన్‌ని కోరి వివాహం చేసుకుంది.

శోభన కార్యం ముగిసిన తర్వాత ఆమె ఒక కథ చెప్పడం ప్రారంభించింది.

కథ పూర్తి కాకుండానే రాత్రి గడిచి ఉదయం అయింది.

కథ వినాలన్న కోరికతో రాజు ఆమెకు ఆ రోజు ప్రాణభిక్ష ప్రసాదించాడు.

ఇలా వెయ్యి రాత్రులు కథ చెప్పింది కొత్తరాణి.

ఆ కథలు రాజులో మార్పు తెచ్చాయి.

స్త్రీలలో చెడ్డవాళ్ళే కాదు మంచివాళ్ళు కూడా ఉంటారని అతనికి బోధపడింది.

రాజు మునుపటిలా మంచివాడయ్యాడు.

ఇక మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు.

కథల ద్వారా తనలో మార్పు తెచ్చిన వజీరు కూతురు షెహర్జాదాతోనే శేషజీవితం గడిపాడు సుల్తాన్ షహర్యార్.

ఆ షెహర్జాదె సుల్తాన్‌కు వెయ్యిరాత్రులు చెప్పిన కథలే .. వెయ్యిన్నొక్క రాత్రులు లేదా అరేబియన్ నైట్స్ కథలు.

PVRK PRASAD IAS - ఐఏఎస్ అధికారి PVRK

ఐఏఎస్ అధికారి PVRK

1983 లో ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు ఆ ఐ.ఏ.ఎస్ అధికారికి పోస్టింగు ఇవ్వలేదు. అప్పటికే పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా కొందరు ఐఏఎస్ అధికారుల్ని ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ జాబితాలో ఈ అధికారి పేరు కూడా ఉందని, నేడో రేపో జరుగుతుందని ప్రచారం. అలాంటి దశలో ఆ అధికారి పోస్టింగు కొరకు వెళ్తే, ముఖ్యమంత్రి మూడు "అవినీతి నేరాల" ప్రశ్నలతో నిలదీశారు.

ముఖ్యమంత్రి: మీరు టిటిడి నిధుల్లోంచి లక్షలాది రూపాయల్ని కేవలం బ్రాహ్మణులకే దోచిపెట్టారట. నిజమా? కాదా?

ఐ.ఏ.ఎస్: కొంతవరకు నిజమే సర్. కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి సలహా ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో టిటిడి అమలు చేసిన పథకం క్రింద చేశాను. ఎవరైతే 12-16 సంవత్సరాల పాటు వేదాధ్యయనం చేసి, ఘనాపాటీలుగా, క్రమాపాటీలుగా గుర్తింపు పొంది ఉన్నారో, వారిలో ఎవరు ప్రతిరోజూ ఎనిమిది గంటల చొప్పున తమకి సమీపంలోని దేవాలయంలో సమాజ క్షేమం కోసం వేదపారాయణ చేస్తారో వాళ్ళకి నెలకి 600 నుంచి 800 వందల రూపాయల గౌరవ వేతనాన్ని టిటిడి చెల్లిస్తుంది. అటెండర్ ఉద్యోగం చేసే వాళ్ళే నెలకి 15 వేలు సంపాదింకుంటున్నారు. 16 సంవత్సరాల పాటు కంఠ నరాలు తెగిపోయేలా వేదాధ్యయనం చేయటం అంటే ఒక పోస్ట్ గ్రాద్యుయేషన్ చేయటం వంటిది. అలా నేర్చుకున్న వేద విద్యని సమాజ శ్రేయస్సు కోసం దేవాలయాల్లో పారాయణ చేసినందుకు టిటిడి నుంచి లబ్ధి పొందిన వేదపండితుల సంఖ్య 370. ఆ పండితులకు నెలకు రూ.800 చెల్లించటం దోచిపెట్టడం అనీ, నేరమనీ నేను అనుకోవట్లేదు.

ముఖ్యమంత్రి: మీరు తిరుమల కొండ మీద పాపనాశనం డ్యాం నిర్మాణం విషయంలో నిబంధనల్ని కాంట్రాక్టరుకి అనుకూలంగా సవరించేసి, లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారట గదా!

ఐ.ఏ.ఎస్: నేను 1978లో టిటిడిలో చేరాను. అప్పటికే డ్యాం నిర్మాణానికి హెచ్.సి.సి అనే కంపెనీ ఎంపికయింది. వాళ్ళు పని ప్రారంభించబోయే సమయంలో ఇంజనీరింగ్ నిపుణులు - మరో 100-150 మీటర్లు దిగువన డ్యాం కడితే, నీటి నిల్వ సామర్ధ్యం మూడు రెట్లు పెరుగుతుందని చెప్పారు. అప్పటికే చాలా సమయం గడిచిపోయింది.

కొండ మీద యాత్రికులకు నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. కొత్తగా టెండర్లు పిలవాలంటే ఇంకో ఆరుమాసాలు పడుతుంది. పైగా పాత కాంట్రాక్టరుకి నష్ట పరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంశాలన్నీ నేను అప్పటి ధర్మకర్తల మండలిగా ఉన్న 'పెర్సన్స్ ఇంచార్జీ‘ కమిటీ ముందు పెట్టాను. వాళ్ళ ఆమోదంతో, కొండమీద యాత్రికులకు నీటి కొరతని త్వరగా తీర్చే ప్రయత్నంలో హెచ్.సి.సి కంపెనీకే పాత రేట్లే చెల్లించే ఒప్పందం మీద ఆ ప్రాజెక్టు కేటాయించాలని 'పెర్సన్స్ ఇంచార్జి ' అంగీకరించింది. ఫలితంగా, రెండున్నర ఏళ్ళలో పూర్తి కావలసిన డ్యాం ఒకటిన్నర సంవత్సరంలోనే పూర్తయింది. మీరు రికార్డులు తెప్పించుకొని చూడవచ్చు. ఒక్క రూపాయి కూడా హెచ్.సి.సి కి అదనంగా చెల్లించకుండా, రికార్డు సమయంలో డ్యాం నిర్మాణాన్ని పూర్తిచేయించటమే నేరమైతే, అది నేను చేశాను.

ముఖ్యమంత్రి: సరే. పెద్ద నేరం ఒకటుంది. తిరుమల శ్రీనివాసుడికి వజ్ర కిరీటం చేయించటంలో మీరు కస్టమ్స్ శాఖవారి వజ్రాలు వద్దని, ప్రయివేటు వ్యాపారుల దగ్గర వజ్రాలు కొన్నారనీ, అందులో చాలా వజ్రాలను మీరు మూటగట్టుకున్నారనీ, మీ ఇంట్లో పరుపుల్లో, తలగడల్లో ఈ వజ్రాలు దాచుకున్నారనీ అంటున్నారు. ఇలా జరిగి ఉంటే అది పాపం కూడా ? నిజం చెప్పండి.

ఐ.ఏ.ఎస్: అవునండి. వజ్రాల కిరీటానికి వజ్రాలకోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు వచ్చారు. అక్రమ రవాణాల్లో కస్టమ్స్ వారికి పట్టుబడిన వజ్రాలు టిటిడికి తక్కువధరకు వస్తాయని ఆశపడి ప్రధానమంత్రిని అడిగాను. ఆవిడ అంగీకరించారు. కొన్ని రోజులకి ఆవిడ ముఖ్య కార్యదర్శి కృష్ణస్వామి రావ్ సాహెబ్ గారు ఫోన్ చేసి, కస్టమ్స్ స్వాధీనం చేసుకునే వజ్రాలు స్మగ్లర్లు మర్మాంగాల్లో దాచి తెచ్చినవై ఉంటాయి కాబట్టి అలా అపవిత్రమైన వజ్రాలను పవిత్రమైన స్వామి వారి కిరీటానికి వాడవద్దని ప్రధానమంత్రి చెప్పారని అన్నారు. అందుకు బదులుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హిందూస్తాన్ డైమండ్ కార్పొరేషన్ (హెచ్.డి.సి) ద్వారా హాలండ్ నుంచి వజ్రాలు కొనుకోలు చేయించే ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరక్టరుతో మౌలికమైన ఇన్సూరెన్స్ వగైరా అంశాలమీద మా అధికార బృందానికి మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ వజ్రాలు దిగుమతి అయ్యేనాటికి చాలా ముందుగానే నాకు టిటిడి నుండి బదిలీ అయింది. ఆ వజ్రాలను చూసే అవకాశమే నాకు లేదే. ఇంక ....!!!

ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆలోచనలో పడిపోయారు.

అవమాన భారంతో రగిలిపోతున్న ఆ ఐ.ఏ.ఎస్ అధికారి తన సీట్లోంచి ఉద్వేగంతో లేచి ముఖ్యమంత్రి మీద తన ఆవేశాన్ని కుమ్మరించారు:

"సర్. మీ ప్రభుత్వం ఏర్పడే సమయానికి నేను లండన్లో ఒక కోర్సు చేస్తున్నాను. నేనంటే అసూయతో ఎవరెవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మీరు నా మీద నేరాలు మోపుతున్నారు. టిటిడి లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా నేను ప్రతి పనినీ ఆ స్వామి మీద విశ్వాసంతోనే చేశాను. సత్ప్రయోజనాన్ని ఆశించే చేశాను. స్వామి ప్రేరణతో నా విధ్యుక్త ధర్మంగా భావించి మాత్రమే చేశాను. నా చిత్తశుద్ధిని, నిజాయితీని ఆ శ్రీనివాసుడు ఆమోదించినంతకాలం ఈ ప్రభుత్వం నాలో వెంట్రుక ముక్క కూడా కదిలించలేదు. మీ ఇష్టమొచ్చినన్ని విచారణలు జరిపించుకోండి... నేను నేరస్థుణ్ణి అని మీరు నమ్ముతుంటే, ఎలాంటి శిక్ష అనుభవించటానికైనా నేను సిద్ధమే. అది కూడా శ్రీనివాసుడి ప్రసాదమే అనుకుంటాను... శలవు..."

చటుక్కున ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ లేచి, ఆ ఐ.ఏ.ఎస్ అధికారి చేతులు పట్టుకొని, "ఆవేశపడకండి బ్రదర్. మేం పాలనకి కొత్తగా వచ్చాం. ఎవరో మీమీద ఈ అభియోగాలు చేశారు. అయితే, మా కార్యదర్శులు మోహన్ కందా గారు, బెనర్జీ గారు మీమీద ఎలాంటి చర్య తీసుకోదల్చినా, అందుకు ముందుగా మీతో మేం మాట్లాడితీరాలని పదే పదే చెప్పారు. అందుకే మాట్లాడాం. అపార్థం చేసుకోవద్దు బ్రదర్..."

ఇది జరిగిన గంటలోనే ఆ ఐ.ఏ.ఎస్ అధికారికి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు ఎండిగా పాత పోస్టింగు ఇచ్చారు. రెండు మాసాల్లో 'సమాచార, పౌర సంబంధాల, సాంస్కృతిక, చలనచిత్ర అభివృద్ధి శాఖల కమీషనరుగా, కార్యదర్శి’ గా అదే ఐ.ఏ.ఎస్ అధికారి శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ ని నియమించింది ప్రభుత్వం.

పాలనా సామర్ధ్యం, దూరదృష్టి, ప్రణాళికా రచనలో పరిణతి, నీతి నియమాలు, నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, సాహిత్యం-లలిత కళల పట్ల మక్కువ, విజయం పరాజయం - రెండూ భగవంతుడి అనుగ్రహమే అని నమ్మే భక్తి విశ్వాసాలు, చివరి శ్వాస వరకూ సనాతన ధర్మ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తిత్వం .... ఇవన్నీ కలబోస్తే వచ్చే రూపం శ్రీ పి వి.ఆర్.కె.ప్రసాద్. ప్రధానమంత్రి కార్యాలయం, ఎక్సయిజ్ శాఖ, విశాఖ పోర్టు, పంచాయతీ రాజ్, ఉన్నత విద్య, ప్రకృతి వైపరీత్యాలు-పునరావాసం, మానవ వనరుల శిక్షణ తదితర ఏ పోస్టులో పని చేసినా కేవలం తన పని తీరుతో ఆ పోస్టుకి వైభవం, గుర్తింపు తీసుకు వచ్చిన విశిష్ట వ్యక్తి ప్రసాద్. టిటిడిలో పనిచేసిన 54 మాసాల కాలంలో (1978-82) అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి నిత్యాన్నదాన పథకం దాకా శాశ్వతంగా నిలిచిపోయే 27 ప్రాజెక్టులను అమలు చేసి, తనదంటూ ఒక చెరగని ముద్ర వేసిన కారణజన్ముడు.

ఇప్పటి తరం ఐఏఎస్ అధికారులకు స్ఫూర్తి ప్రదాత.

2009 నాటి లోక్ సభ, అవిభక్త ఆంద్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఒక అసాధారణమైన చరిత్ర సృష్టించి, జాతీయ స్థాయిలో ‘ఆదర్శ ఛీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ 'గా గుర్తింపు పొందిన ఐఏఎస్

అధికారి డాక్టర్ ఐ.వి.సుబ్బారావు మాటల్లో చెప్పాలంటే - "సంపూర్ణ మానవుడు అంటూ ఎవరన్నా ఉండి ఉంటే, అది పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారే." *(ఆగష్టు 21 పి.వి.ఆర్.కె.ప్రసాద్ వర్ధంతి, 22 జయంతి)*

*🙏మహానుభావులు... నభూతో నభవిష్యతి*🙏

Monday, November 3, 2025

Sri Dhumavati Sthotram - శ్రీ ధూమావతి స్తోత్రం

శ్రీ ధూమావతి స్తోత్రం

కల్పాదౌయా కాళికాద్యాచీ కలన్మధుకైటభౌ
కల్పాంతే త్రిజగత్సర్వం ధూమవతీం భజామి తాం ॥ 01 ॥

ఘూర్ణా ఘూర్ణ కరా ఘోరా ఘూర్ణితాక్షీ ఘనస్వనా
ఘూతినీ ఘాతుకానాం యా ధూమవతీ భజామితాం ॥ 02 ॥

చర్వంతీం అస్థిఖండానం చండ ముండ విదారిణీం
చండాట్టహాసినీం దేవీం భజే ధూమావతీ మహమ్‌ ॥ 03 ॥

ఢమరూ డిండిమారావాం ఢాకినీ గణమండితామ్‌
డాకినీం భోగసంతుష్టాం భజే ధూమవతీ మహమ్‌ ॥ 04 ॥

శంకరీం శంకర ప్రాణాం సంకట ధ్వంసం కారిణీం
శత్రు సంహారిణీం శుద్ధాం శ్రయే ధూమవతీ మహమ్‌ ॥ 05 ॥

ప్రాతర్యాస్యాత్కుమారీ కుసుమకళికయా జాపమాలాం జపంతీ
మధ్యాహ్నే ప్రౌఢ రూపా వికసిత వదనా చారునేత్రా నిశాయామ్‌॥ 06 ॥

సంధ్యాయాం వృద్ధ రూపా గలితకుచయుగా ముండమాలాం వహంతీ
సా దేవీ దేవదేవీ త్రిభువన జననీ కాళికా పాతు యుష్మాన్‌ ॥ 07 ॥

Thursday, October 23, 2025

Usiri Chettu Kinda Deepam - ఉసిరి చెట్టు క్రింద దీపారాధన

ఉసిరి చెట్టు క్రింద దీపారాధన చేసి... వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా........!!

కార్తీకమాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా అని జనులు అన్వేషిస్తుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఉసిరి సకల మానవాళిని రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్దాప్యాన్ని దరిచేరనివ్వని ఔషద మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెపుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. 

సూత మహర్షి మునులందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కల్గిన వృక్షం మరియు దామోదరునికి (శ్రీహరికి) అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలసి వనభోజనాలను చేస్తారు. 

శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడి తోను మరియు తోటి గోప బాలకులతో కలసి ఉసిరి మొదలైన మహా వృక్షాల నీడన యమునా నదీ తీరాన, బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేసాడని భాగవతంలో వర్ణించబడినది. ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి.

ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి. ఉసిరి చెట్టుమీద ఈ కార్తీక మాసంలో నారాయణుడుంటాడనీ అందుకనే ఆ చెట్టుని ధాత్రీ నారాయణుడుగా భావించి పూజ చెయ్యాలనీ శాస్త్రాల్లో చెప్పారు.

ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలని, ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలని పెద్దలు అంటుంటారు. ఈ కాలంలోనే ఉసిరి కాయలు బాగా వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. రోజూ ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు వున్నాయి. ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది. మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. శరీరంలో సమతుల్యం తీసుకువస్తుంది. ఈ చెట్టుగాలి కూడా చాలా మంచిది. అందుకే ఈ నెలలో ఈ చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వన భోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టుదగ్గర గడపాలని చెప్పారు. 

Monday, October 13, 2025

Sri Chinnamastha Sahasranama Sthothram - శ్రీ ఛిన్నమస్తా సహస్రనామ స్తోత్రం(విశ్వసార తంత్రం)

శ్రీ ఛిన్నమస్తా సహస్రనామ స్తోత్రం(విశ్వసార తంత్రం)

శ్రీగణేశాయ నమః ।

శ్రీదేవ్యువాచ
దేవదేవ మహాదేవ సర్వశాస్త్రవిదాంవర 

కృపాం కురు జగన్నాథ కథయస్వ మమ ప్రభో
  ॥ 01 ॥

ప్రచణ్డచణ్డికా దేవీ సర్వలోకహితైషిణీ ।
తస్యాశ్చ కథితం సర్వం స్తవం చ కవచాదికమ్‌
  ॥ 02 ॥

ఇదానీం ఛిన్నమస్తాయా నామ్నాం సాహస్రకం శుభమ్‌ ।
త్వం ప్రకాశయ మే దేవ కృపయా భక్తవత్సల
  ॥ 03 ॥

శ్రీ శివ ఉవాచ ।
శృణు దేవి ప్రవక్ష్యామి చ్చిన్నాయాః సుమనోహరమ్‌ ।
గోపనీయం ప్రయత్నేన యదీచ్చేదాత్మనో హితమ్‌
  ॥ 04 ॥

న వక్తవ్యం చ కుత్రాపి ప్రాణైః కణ్ఠగతైరపి
 ।
తచ్చృణుష్వ మహేశాని సర్వం తత్కథయామి తే
  ॥ 05 ॥

వినా పూజాం వినా ధ్యానం వినా జాప్యేన సిద్ధతి ।
వినా ధ్యానం తథా దేవి వినా భూతాదిశోధనమ్‌
  ॥ 06 ॥

పఠనాదేవ సిద్ధిః స్యాత్సత్యం సత్యం వరాననే ।
పురా కైలాసశిఖరే సర్వదేవసభాలయే
  ॥ 07 ॥

పరిపప్రచ్చ కథితం తథా శృణు వరాననే ।
ఓం అస్య శ్రీప్రచణ్డచణ్డికాసహస్రనామస్తోత్రస్య భైరవ ఋషిః ।

సమ్రాట్‌ ఛన్దః, ప్రచ
ణ్డణ్డికా దేవతా ।
ధర్మార్థకామమోక్షార్థే పాఠే వినియోగః
  ॥ 08 ॥

ఓం 
ప్రచణ్డణ్డికా చణ్డా చణ్డదైత్యవినాశినీ ।
చాము
ణ్డా చ సచణ్డా చ చపలా చారుదేహినీ  ॥ 09 ॥

లలజిహ్వా చలధ్రక్తా చారుచన్ద్రనిభాననా ।
చకోరాక్షీ చ
ణ్డనాదా చ్చలా చ మనోన్మదా  ॥ 10 ॥

చేతనా చితిసంస్థా చ చిత్కలా జ్ఞానరూపిణీ ।
మహాభయ్కరీ దేవీ వరదాభయధారిణీ
  ॥ 11 ॥

భవా
ఢ్యా భవరూపా చ భవబన్థవిమోచినీ ।
భవానీ భువనేశీ చ భవసంసారతారిణీ
  ॥ 12 ॥

భవాబ్ధిర్భవమోక్షా చ భవబన్థవిఘాతినీ
 ।
భాగీరథీ భగస్థా చ భాగ్యభోగప్రదాయినీ
  ॥ 13 ॥

కమలా కామదా దుర్గా దుర్గబన్థవిమోచినీ
 ।
దుర్దర్శనా దుర్గరూపా దుర్జేయా దుర్గనాశినీ
  ॥ 14 ॥

దీనదుఃఖహరా నిత్యా నిత్యశోకవినాశినీ
 ।
నిత్యానన్దమయా దేవీ నిత్యం కల్యాణకారిణీ
  ॥ 15 ॥

సర్వార్థసాధనకరీ సర్వసిద్ధిస్వరూపిణీ ।
సర్వక్షోభణశక్తిశ్చ సర్వవిద్రావిణీ పరా
  ॥ 16 ॥

సర్వర్జనశక్తిశ్చ సర్వోన్మాదస్వరూపిణీ ।
సర్వదా సిద్ధిదాత్రీ చ సిద్ధవిద్యాస్వరూపిణీ
  ॥ 17 ॥

సకలా నిష్కలా సిద్దా కలాతీతా కలామయీ ।
కులజ్ఞా కులరూపా చ చక్షురాన
న్దదాయినీ  ॥ 18 ॥

కులీనా సామరూపా చ కామరూపా మనోహరా ।
కమలస్థా క్జముఖీ క్జురేశ్వరగామినీ
  ॥ 19 ॥

కులరూపా కోటరాక్షీ కమలైశ్వర్యదాయినీ ।
కున్తీ కకుద్మినీ కుల్లా కురుకుల్లా కరాలికా
  ॥ 20 ॥

కామేశ్వరీ కామమాతా కామతాపవిమోచినీ ।
కామరూపా కామసత్వా కామకౌతుకకారిణీ
  ॥ 21 ॥

కారుణ్యహృదయా క్రీంక్రీంమన్త్రరూపా చ కోటరా
 ।
కౌమోదకీ కుముదినీ కైవల్యా కులవాసినీ
  ॥ 22 ॥

కేశవీ కేశవారాధ్యా కేశిదైత్యనిషూదినీ ।
క్లేశహా క్లేశరహితా క్లేశస్ఘవినాశినీ
  ॥ 23 ॥

కరాలీ చ కరాలాస్యా కరాలాసురనాశినీ ।
కరాలచర్మాసిధరా కరాలకలనాశినీ
  ॥ 24 ॥

క్కనీ క్కనిరతా కపాలవరధారిణీ
 ।
ఖడ్గహస్తా త్రినేత్రా చ ఖ
ణ్డముణ్డాసిధారిణీ  ॥ 25 ॥

ఖలహా ఖలహన్త్రీ చ క్షరన్తీ ఖగతా సదా ।
గ్గగౌతమపూజ్యా చ గౌరీ గన్ధర్వవాసినీ
  ॥ 26 ॥

న్ధర్వా గగణారాధ్యా గణా గన్ధర్వసేవితా ।
గణత్కారగణా దేవీ నిర్గుణా చ గుణాత్మికా
  ॥ 27 ॥

గుణతా గుణదాత్రీ చ గుణగౌరవదాయినీ ।
గణేశమాతా గమ్బీరా గగణా జ్యోతికారిణీ
  ॥ 28 ॥

గౌర్గా చ గయా గమ్యా గౌతమస్థానవాసినీ
 ।
గదాధరప్రియా జ్ఞేయా జ్ఞానగమ్యా గుహేశ్వరీ
  ॥ 29 ॥

గాయత్రీ చ గుణవతీ గుణాతీతా గుణేశ్వరీ
 ।
గణేశజననీ దేవీ గణేశవరదాయినీ
  ॥ 30 ॥

గణాధ్యక్షనుతా నిత్యా గణాధ్యక్షప్రపూజితా ।
గిరీశరమణీ దేవీ గిరీశపరివన్దితా
  ॥ 31 ॥

గతిదా గతిహా గీతా గౌతమీ గురుసేవితా ।
గురుపూజ్యా గురుయుతా గురుసేవనతత్పరా
  ॥ 32 ॥

న్ధద్వారా చ గన్ధాఢ్యా గన్ధాత్మా గన్ధకారిణీ ।
గీర్వాణపతిసమ్పూజ్యా గీర్వాణపతితుష్టిదా
  ॥ 33 ॥

గీర్వాణాధిశరమణీ గీర్వాణాధిశవన్దితా ।
గీర్వాణాధిశసంసేవ్యా గీర్వాణాధిశహర్షదా
  ॥ 34 ॥

గానశక్తిర్గానగమ్యా గానశక్తిప్రదాయినీ ।
గానవిద్యా గానసిద్దా గానసన్తుష్టమానసా
  ॥ 35 ॥

గానాతీతా గానగీతా గానహర్షప్రపూరితా ।
న్ధర్వపతిసంహృష్టా గన్ధర్వగుణమణ్డితా  ॥ 36 ॥

న్ధర్వగణసంసేవ్యా గన్ధర్వగణమధ్యగా ।
న్ధర్వగణకుశలా గన్థర్వగణపూజితా  ॥ 37 ॥

న్ధర్వగణనిరతా గన్ధర్వగణభూషితా ।
ఘర్ఘరా ఘోరరూపా చ ఘోరఘుర్ఘురనాదినీ
  ॥ 38 ॥

ఘర్మబిన్దుసముద్భూతా ఘర్మబిన్దుస్వరూపిణీ ।
ఘణ్టారవా ఘనరవా ఘనరూపా ఘనోదరీ
  ॥ 39 ॥

ఘోరసత్వా చ ఘనదా ఘ
ణ్టానాదవినోదనీ ।
ఘోరచాణ్డాలినీ ఘోరా ఘోరచణ్డవినాశినీ
  ॥ 40 ॥

ఘోరదానవదమనీ ఘోరదానవనాశినీ ।
ఘోరకర్మాదిరహితా ఘోరకర్మనిషేవితా
  ॥ 41 ॥

ఘోరతత్వమయీ దేవీ ఘోరతత్వవిమోచనీ ।
ఘోరకర్మాదిరహితా ఘోరకర్మాదిపూరితా
  ॥ 42 ॥

ఘోరకర్మాదినిరతా ఘోరకర్మప్రవర్ధినీ ।
ఘోరభూతప్రమథినీ ఘోరవేతాలనాశినీ
  ॥ 43 ॥

ఘోరదావాగ్నిదమనీ ఘోరశత్రునిషూదినీ ।
ఘోరమన్త్రయుతా చైవ ఘోరమన్త్రప్రపూజితా
  ॥ 44 ॥

ఘోరమన్త్రమనోభిజ్ఞా ఘోరమన్త్రఫలప్రదా ।
ఘోరమన్త్రనిధిశ్చైవ ఘోరమన్త్రకృతాస్పదా
  ॥ 45 ॥

ఘోరమన్త్రేశ్వరీ దేవీ ఘోరమన్త్రార్థమానసా ।
ఘోరమన్త్రార్థతత్వజ్ఞా ఘోరమన్త్రార్థపారగా
  ॥ 46 ॥

ఘోరమన్త్రార్థవిభవా ఘోరమన్త్రార్థబోధినీ
 ।
ఘోరమన్త్రార్థనిచయా ఘోరమన్త్రార్థజన్మభూః
  ॥ 47 ॥

ఘోరమన్త్రజపరతా ఘోరమన్త్రజపోద్యతా
 ।
కారవర్ణానిలయా కారాక్షరమణ్డితా
  ॥ 48 ॥

కారాపరరూపా కారాక్షరరూపిణీ ।
చిత్రరూపా చిత్రనాడీ చారుకేశీ చయప్రభా
  ॥ 49 ॥

చ్చలా చ్చలాకారా చారురూపా చ చణ్డికా
 ।
చతుర్వేదమయీ చణ్డా చణ్డాలగణమణ్డితా
  ॥ 50 ॥

చాణ్డాలచ్చేదినీ చణ్డతపోనిర్మూలకారిణీ
 ।
చతుర్భుజా చణ్డరూపా చణ్డముణ్డవినాశినీ
  ॥ 51 ॥

చన్ద్రికా చన్ద్రకీర్తిశ్చ చన్ద్రకాన్తిస్తథైవ చ ।
చన్ద్రాస్యా చన్ద్రరూపా చ చన్ద్రమౌలిస్వరూపిజీ
  ॥ 52 ॥

చన్ద్రమౌలిప్రియా చన్ద్రమౌలిసన్తుష్టమానసా ।
చకోరబన్దురమణీ చకోరబన్ధుపూజితా
  ॥ 53 ॥

చక్రరూపా చక్రమయీ చక్రాకారస్వరూపిణీ ।
చక్రపాణిప్రియా చక్రపాణిప్రీతిదాయినీ
  ॥ 54 ॥

చక్రపాణిరసాభిజ్ఞా చక్రపాణివరప్రదా ।
చక్రపాణివరోన్మత్తా చక్రపాణిస్వరూపిణీ
  ॥ 55 ॥

చక్రపాణిశ్వరీ నిత్యం చక్రపాణినమస్కృతా ।
చక్రపాణిసముద్భూతా చక్రపాణిగుణాస్పదా
  ॥ 56 ॥

చన్ద్రావలీ చన్ద్రవతీ చన్ద్రకోటి సమప్రభా
 ।
చన్దనార్చితపాదాబ్జా చన్దనాన్వితమస్తకా
  ॥ 57 ॥

చారుకీర్తిశ్చారునేత్రా చారుచన్ద్రవిభూషణా
 ।
చారుభూషా చారువేషా చారువేషప్రదాయినీ
  ॥ 58 ॥

చారుభూషాభూషిత్గా చతుర్వక్త్రవరప్రదా ।
చతుర్వక్త్రసమారాధ్యా చతుర్వక్త్రసమాశ్రితా
  ॥ 59 ॥

చతుర్వక్త్రచతుర్వాహా చతుర్ధీ చ చతుర్దశీ
 ।
చిత్రా చర్మణ్వతీ చైత్రీ చన్ద్రభాగా చ చమ్పకా
  ॥ 60 ॥

చతుర్దశయమాకారా చతుర్దశయమానుగా ।
చతుర్దశయమప్రీతా చతుర్దయమప్రియా  ॥ 61 ॥

ఛలస్థా ఛ్ఛిద్రరూపా చ ఛ్ఛద్మదా ఛ్ఛద్మరాజికా ।
ఛిన్నమస్తా తథా ఛ్ఛిన్నా ఛ్ఛిన్నముణ్డవిధారిణీ  ॥ 62 ॥

జయదా జయరూపా చ జయన్తీ జయమోహినీ ।
జయా జీవనసంస్థా చ జాలన్ధరనివాసినీ  ॥ 63 ॥

జ్వాలాముఖీ జ్వాలదాత్రీ జాజ్వల్యదహనోపమా
 ।
జగద్వన్ధ్యా జగత్పూజ్యా జగత్త్రాణపరాయణా  ॥ 64 ॥

జగతీ జగతాధారా జన్మమృత్యుజరాపహా
 ।
జననీ జన్మభూమిశ్చజన్మదా జయశాలినీ  ॥ 65 ॥

జ్వరరోగహరా జ్వాలా జ్వాలామాలాప్రపూరితా ।
జమ్భారాతీశ్వరీ జమ్భారాతివైభవకారిణీ  ॥ 66 ॥

జమ్భారాతిస్తుతా జమ్భారాతిశత్రునిషూదినీ ।
జయదుర్గా జయారాధ్యా జయకాలీ జయేశ్వరీ  ॥ 67 ॥

జయతారా జయాతీతా జయశ్కరవల్లభా ।
జయదా జహ్నుతనయా జలధిత్రాసకారిణీ  ॥ 68 ॥

జలధివ్యాధిదమనీ జలధిజ్వరనాశినీ
 ।
జ్గమేశీ జాడ్యహరా జాడ్యస్ఘనివారిణీ  ॥ 69 ॥

జాడ్యగ్రస్తజనాతీతా జాడ్యరోగనివారిణీ ।
జన్మదాత్రీ జన్మహర్త్రీ జయఘోషసమన్వితా  ॥ 70 ॥

జపయోగసమాయుక్తా జపయోగవినోదినీ ।
జపయోగప్రియా జాప్యా జపాతీతా జయస్వనా  ॥ 71 ॥

జాయాభావస్థితా జాయా జాయాభావప్రపూరణీ ।
జపాకుసుమస్కశా జపాకుసుమపూజితా  ॥ 72 ॥

జపాకుసుమసమ్ప్రీతా జపాకుసుమమణ్డితా ।
జపాకుసుమవద్భాసా జపాకుసుమరూపిణీ  ॥ 73 ॥

జమదగ్నిస్వరూపా చ జానకీ జనకాత్మజా ।
ఝవాతప్రముక్త్గా ఝేరఝ్కరవాసినీ  ॥ 74 ॥ 

ఝ్కరకారిణీ ఝవాతరూపా చ ఝ్కరీ ।
కారాణుస్వరూపా చ టనట్కరనాదినీ  ॥ 75 ॥

ట్కరీ టకువాణీ చ ఠకారాక్షరరూపిణీ ।
డిణ్డిమా చ తథా డిమ్భా డిణ్డుడిణ్డిమనాదినీ  ॥ 76 ॥

ఢక్కామయీ ఢిలమయీ నృత్యశబ్దా విలాసినీ ।
ఢక్కా ఢక్కేశ్వరీ ఢక్కాశబ్దరూపా తథైవ చ  ॥ 77 ॥

ఢక్కానాదప్రియా ఢక్కానాదసన్తుష్టమానసా ।
ణ్కరా ణాక్షరమయీ ణాక్షరాదిస్వరూపిణీ   ॥ 78 ॥

త్రిపురా త్రిపురమయీ చైవ త్రిశక్తిస్త్రిగుణాత్మీకా
 ।
తామసీ చ త్రిలోకేశీ త్రిపురా చ త్రయీశ్వరీ   ॥ 79 ॥

త్రివిద్యా చ త్రిరూపా చ త్రినేత్రా చ త్రిరూపిణీ ।
తారిణీ తరలా తారా తారకారిప్రపూజితా  ॥ 80 ॥

తారకారిసమారాధ్యా తారకారివరప్రదా ।
తారకారిప్రసూస్తన్వీ తరుణీ తరలప్రభా  ॥ 81 ॥

త్రీరూపా చ త్రిపురగా త్రిశూలవరధారిణీ ।
త్రిశూలినీ తన్త్రమయీ తన్త్రశాస్త్రవిశారదా  ॥ 82 ॥

తన్త్రరూపా తపోమూర్తిస్తన్త్రమన్త్రస్వరూపిణీ ।
తడిత్తడిల్లతాకారా తత్వజ్ఞానప్రదాయినీ  ॥ 83 ॥

తత్వజ్ఞానేశ్వరీ దేవీ తత్వజ్ఞాన ప్రబోధినీ
 ।
త్రయీమయీ త్రయీసేవ్యా త్య్రక్షరీ త్య్రక్షరేశ్వరీ  ॥ 84 ॥

తాపవిధ్వంసినీ తాపస్ఘనిర్మూలకారిణీ ।
త్రాసకర్త్రీ త్రాసహర్త్రీ త్రాసదాత్రీ చ త్రాసహా  ॥ 85 ॥

తిథీశా తిథిరూపా చ తిథిస్థా తిథిపూజితా ।
తిలోత్తమా చ తిలదా తిలప్రితా తిలేశ్వరీ  ॥ 86 ॥

త్రిగుణా త్రిగుణాకారా త్రిపురీ త్రిపురాత్మికా ।
త్రికుటా త్రికుటాకారా త్రికుటాచలమధ్యగా  ॥ 87 ॥

త్రిజటా చ త్రినేత్రా చ త్రినేత్రవరసున్దరీ ।
తృతీయా చ త్రివర్షా చ త్రివిధా త్రిమతేశ్వరీ  ॥ 88 ॥

త్రికోణస్థా త్రికోణేశీ త్రికోణయన్త్రమధ్యగా ।
త్రిసన్ధ్యా చ త్రిసన్ధ్యార్చ్యా త్రిపదా త్రిపదాస్పదా  ॥ 89 ॥

స్థానస్థితా స్థలస్థా చ ధన్యస్థలనివాసినీ ।
థకారాక్షరరూపా చ స్థలరూపా తథైవ చ  ॥ 90 ॥

స్థూలహస్తా తథా స్థూలా స్థైర్యరూపప్రకాశినీ ।
దుర్గా దుర్గార్తిహన్త్రీ చ దుర్గబన్థవిమోచినీ  ॥ 91 ॥

దేవీ దానవసంహన్త్రీ దనుజ్యేష్ఠనిషూదినీ ।
దారాపత్యప్రదా నిత్యా శ్కరార్థాధారిణీ  ॥ 92 ॥

దివ్గ్యా దేవమాతా చ దేవదుష్టవినాశినీ ।
దీనదుఃఖహరా దీనతాపనిర్మూలకారిణీ  ॥ 93 ॥

దీనమాతా దీనసేవ్యా దీనదమ్భవినాశినీ ।
దనుజధ్వంసినీ దేవీ దేవకీ దేవవల్లభా  ॥ 94 ॥

దానవారిప్రియా దీర్ఘా దానవారిప్రపూజితా ।
దీర్ఘస్వరా దీర్ఘతనుర్దీర్ఘదుర్గతినాశినీ  ॥ 95 ॥

దీర్ఘనేత్రా దీర్ఘచక్షుర్దీర్ఘకేశీ దిగమ్బరా ।
దిగమ్బరప్రియా దాన్తా దిగమ్బరస్వరూపిణీ  ॥ 96 ॥

దుఃఖహీనా దుఃఖహరా దుఃఖసాగరతారిణీ ।
దుఃఖదారిద్య్రశమనీ దుఃఖదారిద్య్రకారిణీ  ॥ 97 ॥

దుఃఖదా దుస్సహా దుష్టఖణ్డనైకస్వరూపిణీ ।
దేవవామా దేవసేవ్యా దేవశక్తిప్రదాయినీ  ॥ 98 ॥

దామినీ దామినీప్రీతా దామినీశతసున్దరీ ।
దామినీశతసంసేవ్యా దామినీదామభూషితా  ॥ 99 ॥

దేవతాభావసన్తుష్టా దేవతాశతమధ్యగా ।
దయార్దరా చ దయారూపా దయాదానపరాయణా  ॥ 100 ॥

దయాశీలా దయాసారా దయాసాగరసంస్థితా ।
దశవిద్యాత్మికా దేవీ దశవిద్యాస్వరూపిణీ  ॥ 101 ॥

ధరణీ ధనదా ధాత్రీ ధన్యా ధన్యపరా శివా ।
ధర్మరూపా ధనిష్ఠా చ ధేయా చ ధీరగోచరా  ॥ 102 ॥

ధర్మరాజేశ్వరీ ధర్మకర్మరూపా ధనేశ్వరీ ।
ధనుర్విద్యా ధనుర్గమ్యా ధనుర్ధరవరప్రదా  ॥ 103 ॥

ధర్మశీలా ధర్మలీలా ధర్మకర్మవివర్జితా ।
ధర్మదా ధర్మనిరతా ధర్మపాఖణ్డఖణ్డినీ  ॥ 104 ॥

ధర్మేశీ ధర్మరూపా చ ధర్మరాజవరప్రదా ।
ధర్మిణీ ధర్మగేహస్థా ధర్మాధర్మస్వరూపిణీ  ॥ 105 ॥

ధనదా ధనదప్రీతా ధనధాన్యసమృద్ధిదా ।
ధనధాన్యసమృద్ధిస్థా ధనధాన్యవినాశినీ  ॥ 106 ॥

ధర్మనిష్ఠా ధర్మధీరా ధర్మమార్గరతా సదా ।
ధర్మబీజకృతస్థానా ధర్మబీజసురక్షిణీ  ॥ 107 ॥

ధర్మబీజేశ్వరీ ధర్మబీజరూపా చ ధర్మగా ।
ధర్మబీజసముద్భూతా ధర్మబీజసమాశ్రితా  ॥ 108 ॥

ధరాధరపతిప్రాణా ధరాధరపతిస్తుతా ।
ధరాధరేన్ద్రతనుజా ధరాధరేన్ద్రవన్దితా  ॥ 109 ॥

ధరాధరేన్ద్రగేహస్థా ధరాధరేన్ద్రపాలినీ ।
ధరాధరేన్ద్రసర్వార్తినాశినీ ధర్మపాలినీ  ॥ 110 ॥

నవీనా నిర్మలా నిత్యా నాగరాజప్రపూజితా ।
నాగేశ్వరీ నాగమాతా నాగకన్యా చ నగ్నికా  ॥ 111 ॥

నిర్లేపా నిర్వికల్పా చ నిర్లోమా నిరుపద్రవా ।
నిరాహారా నిరాకారా నిర్జనస్వరూపిణీ  ॥ 112 ॥

నాగినీ నాగవిభవా నాగరాజపరిస్తుతా ।
నాగరాజగుణజ్ఞా చ నాగరాజసుఖప్రదా  ॥ 113 ॥

నాగలోకగతా నిత్యం నాగలోకనివాసినీ ।
నాగలోకేశ్వరీ నాగభాగినీ నాగపూజితా  ॥ 114 ॥

నాగమధ్యస్థితా నాగమోహసంక్షోభదాయినీ ।
నృత్యప్రియా నృత్యవతీ నృత్యగీతపరాయణా  ॥ 115 ॥

నృత్యేశ్వరీ నర్తకీ చ నృత్యరూపా నిరాశ్రయా ।
నారాయణీ నరేన్ద్రస్థా నరముణ్డాస్థిమాలినీ  ॥ 116 ॥

నరమాంసప్రియా నిత్యా నరరక్తప్రియా సదా ।
నరరాజేశ్వరీ నారీరూపా నారీస్వరూపిణీ  ॥ 117 ॥

నారీగణార్చితా నారీమధ్యగా నూతనామ్భరా ।
నర్మదా చ నదీరూపా నదీస్గమసంస్థితా  ॥ 118 ॥

నర్మదేశ్వరసమ్ప్రీతా నర్మదేశ్వరరూపిణీ ।
పద్మావతీ పద్మముఖీ పద్మక్జిల్కవాసినీ  ॥ 119 ॥

పట్టవస్త్రపరీధానా పద్మరాగవిభూషితా ।
పరమా ప్రీతిదా నిత్యం ప్రేతాసననివాసినీ  ॥ 120 ॥

పరిపూర్ణరసోన్మత్తా ప్రేమవిహ్వలవల్లభా ।
పవిత్రాసవనిష్పూతా ప్రేయసీ పరమాత్మికా  ॥ 121 ॥

ప్రియవ్రతపరా నిత్యం పరమప్రేమదాయినీ ।
పుష్పప్రియా పద్మకోశా పద్మధర్మనివాసినీ  ॥ 122 ॥

ఫేత్కారిణీ తన్త్రరూపా ఫేరుఫేరవనాదినీ ।
వంశినీ వంశరూపా చ బగలా వామరూపిణీ  ॥ 123 ॥

వ్మాయీ వసుధా ధృష్యా వాగ్భవాఖ్యా వరా నరా।
బుద్దిదా బుద్దిరూపా చ విద్యా వాదస్వరూపిణీ  ॥ 124 ॥

బాలా వృద్ధమయీరూపా వాణీ వాక్యనివాసినీ ।
వరుణా వాగ్వతీ వీరా వీరభూషణభూషితా  ॥ 125 ॥

వీరభద్రార్చితపదా వీరభద్రప్రసూరపి ।
వేదమార్గరతా వేదమన్త్రరూపా వషట్‌ ప్రియా  ॥ 126 ॥

వీణావాద్యసమాయుక్తా వీణావాద్యపరాయణా ।
వీణారవా తథా వీణాశబ్దరూపా చ వైష్ణవీ  ॥ 127 ॥

వైష్ణవాచారనిరతా వైష్ణవాచారతత్పరా ।
విష్ణుసేవ్యా విష్ణుపత్నీ విష్ణురూపా వరాననా  ॥ 128 ॥

విశ్వేశ్వరీ విశ్వమాతా విశ్వనిర్మాణకారిణీ ।
విశ్వరూపా చ విశ్వేశీ విశ్వసంహారకారిణీ  ॥ 129 ॥

భైరవీ భైరవారాధ్యా భూతభైరవసేవితా ।
భైరవేశీ తథా భీమా భైరవేశ్వరతుష్టిదా  ॥ 130 ॥

భైరవాధిశరమణీ భైరవాధిశపాలినీ ।
భీమేశ్వరీ భీమమాతా భీమశబ్దపరాయణా  ॥ 131 ॥

భీమరూపా చ భీమేశీ భీమా భీమవరప్రదా ।
భీమపూజితపాదాబ్జా భీమభైరవపాలినీ  ॥ 132 ॥

భీమాసురధ్వంసకరీ భీమదుష్టవినాశినీ ।
భువనా భువనారాధ్యా భవానీ భూతిదా సదా  ॥ 133 ॥

భయదా భయహన్త్రీ చ అభయా భయరూపిణీ ।
భీమనాదా విహ్వలా చ భయభీతివినాశినీ  ॥ 134 ॥

మత్తా ప్రమత్తరూపా చ మదోన్మత్తస్వరూపిణీ ।
మాన్యా మనోజ్ఞా మానా చ మ్గలా చ మనోహరా  ॥ 135 ॥

మాననీయా మహాపూజ్యా మహామహిషమర్దినీ ।
మహిషాసురహన్త్రీ చ మాత్గ మయవాసినీ  ॥ 136 ॥

మాధ్వీ మధుమయీ ముద్రా ముద్రికా మన్త్రరూపిణీ ।
మహావిశ్వేశ్వరీ దూతీ మౌలిచన్ద్రప్రకాశినీ  ॥ 137 ॥

యశఃస్వరూపిణీ దేవీ యోగమార్గప్రదాయినీ ।
యోగినీ యోగగమ్యా చ యామ్యేశీ యోగరూపిణీ  ॥ 138 ॥

యజ్ఞా చ యోగమయీ జపరూపా జపాత్మికా ।
యుగాఖ్యా చ యుగాన్తా చ యోనిమణ్డలవాసినీ  ॥ 139 ॥

అయోనిజా యోగనిద్రా యోగానన్దప్రదాయినీ ।
రమా రతిప్రియా నిత్యం రతిరాగవివర్ధినీ  ॥ 140 ॥

రమణీ రాససమ్భూతా రమ్యా రాసప్రియా రసా ।
రణోత్కణ్ఠా
 రణస్థా చ వరా ర్గప్రదాయినీ  ॥ 141 ॥

రేవతీ రణజైత్రీ చ రసోద్భూతా రణోత్సవా ।
లతా లావణ్యరూపా చ లవణాబ్ధిస్వరూపిణీ  ॥ 142 ॥

లవ్గకుసుమారాధ్యా లోలజిహ్వా చ లేలిహా ।
వశినీ వనసంస్థా చ వనపుష్పప్రియా వరా  ॥ 143 ॥

ప్రాణేశ్వరీ బుద్ధిరూపా బుద్ధిదాత్రీ బుధాత్మికా ।
శమనీ శ్వేతవర్ణా చ శ్కారీ శివభాషిణీ  ॥ 144 ॥

శ్యామ్యరూపా శక్తిరూపా శక్తిబిన్దునివాసినీ ।
సర్వేశ్వరీ సర్వదాత్రీ సర్వమాతా చ శర్వరీ  ॥ 145 ॥

శామ్భవీ సిద్ధిదా సిద్ధా సుషుమ్నా సురభాసినీ ।
సహస్రదలమధ్యస్థా సహస్రదలవర్తినీ  ॥ 146 ॥

హరప్రియా హరధ్యేయా హూంకారబీజరూపిణీ ।
ల్కశ్వరీ చ తరలా లోమమాంసప్రపూజితా  ॥ 147 ॥

క్షేమ్యా క్షేమకరీ క్షామా క్షీరబిన్దుస్వరూపిణీ ।
క్షిప్తచిత్తప్రదా నిత్యం క్షౌమవస్త్రవిలాసినీ  ॥ 148 ॥

ఛిన్నా చ చ్చిన్నరూపా చ క్షుధా క్షౌత్కారరూపిణీ ।
సర్వవర్ణమయీ దేవీ సర్వసమ్పత్ప్రదాయినీ  ॥ 149 ॥

సర్వసమ్పత్ప్రదాత్రీ చ సమ్పదాపద్విభూషితా ।
సత్త్వరూపా చ సర్వార్థా సర్వదేవప్రపూజితా  ॥ 150 ॥

సర్వేశ్వరీ సర్వమాతా సర్వజ్ఞా సురసృత్మికా ।
సిన్ధుర్మన్దాకినీ గ్గ నదీసాగరరూపిణీ  ॥ 151 ॥

సుకేశీ ముక్తకేశీ చ డాకినీ వరవర్ణినీ ।
జ్ఞానదా జ్ఞానగగనా సోమమణ్డ
లవాసినీ  ॥ 152 ॥

ఆకాశనిలయా నిత్యా పరమాకాశరూపిణీ ।
అన్నపూర్ణా మహానిత్యా మహాదేవరసోద్భవా  ॥ 153 ॥

మ్గలా కాలికా చణ్డా చణ్డనాదాతిఖీషణా ।
చణ్డాసురస్య మథినీ చాముణ్డా చపలాత్న్మికా  ॥ 154 ॥

చణ్డీ చామరకేశీ చ చలత్కుణ్డలధారిణీ ।
ముణ్డమాలాధరా నిత్యా ఖణ్డముణ్డవిలాసినీ  ॥ 155 ॥

ఖడ్గహస్తా ముణ్డహస్తా వరహస్తా వరప్రదా ।
అసిచర్మధరా నిత్యా పాశ్కాశధరా పరా  ॥ 156 ॥

శూలహస్తా శివహస్తా ఘణ్టానాదవిలాసినీ ।
ధనుర్బాణధరా
దిత్యా నాగహస్తా నగాత్మజా  ॥ 157 ॥

మహిషాసురహన్త్రీ చ రక్తబీజవినాశినీ ।
రక్తరూపా రక్తగా చ రక్తహస్తా భయప్రదా  ॥ 158 ॥

అసితా చ ధర్మధరా పాశ్కాశధరా పరా ।
ధనుర్భాణధరా నిత్యా ధూమ్రలోచననాశినీ  ॥ 159 ॥

పరస్థా దేవతామూర్తిః శర్వాణీ శారదా పరా ।
నానావర్ణవిభూష్గా నానారాగసమాపినీ  ॥ 160 ॥

పశువస్త్రపరీధానా పుష్పాయుధధరా పరా ।
ముక్తర్జతమాలాఢ్యా ముక్తాహారవిలాసినీ  ॥ 160 ॥

స్వర్ణకుణ్డలభూషా చ స్వర్ణసింహాసనస్థితా ।
సున్దర్గా సువర్ణాభా శామ్భవీ శకటాత్మికా  ॥ 162 ॥

సర్వలోకేశవిద్యా చ మోహసమ్మోహకారిణీ ।
శ్రేయసీ సృష్టిరూపా చ చ్ఛిన్నచ్ఛద్మమయీ చ్ఛలా  ॥ 163 ॥

ఛిన్నముణ్డధరా నిత్యా నిత్యానన్దవిధాయినీ ।
నన్దా పూర్ణా చ రిక్తా చ తిథయః పూర్ణషోడశీ  ॥ 164 ॥

కుహూః స్కన్త్రిరూపా చ ప్చపర్వవిలాసినీ ।
ప్చబాణధరా నిత్యా ప్చమప్రీతిదా పరా  ॥ 165 ॥

ప్చపత్రాభిలాషా చ ప్చమృతవిలాసినీ ।
ప్చలీ ప్చమీ దేవీ ప్చరక్తప్రసారిణీ  ॥ 166 ॥

ప్చబాణధరా నిత్యా నిత్యదాత్రీ దయాపరా ।
పలలాదిప్రియా నిత్యాపశుగమ్యా పరేశితా  ॥ 167 ॥

పరా పరరహస్యా చ పరమప్రేమవిహ్వలా ।
కులినా కేశిమార్గస్థా కులమార్గప్రకాశినీ  ॥ 168 ॥

కులాకులస్వరూపా చ కులార్ణవమయీ కులా ।
రుక్మా చ కాలరూపా చ కాలకమ్బనకారిణీ  ॥ 169 ॥

విలాసరూపిణీ భద్రా కులాకులనమస్కృతా ।
కుబేరవిత్తధాత్రీ చ కుమారజననీ పరా  ॥ 170 ॥

కుమారీరూపసంస్థా చ కుమారీపూజనామ్భికా ।
కుర్గనయనా దేవీ దినేశాస్యా పరాజితా  ॥ 171 ॥

కుణ్డలీకదలీ సేనా కుమార్గరహితా వరా ।
అనతరూపానన్తస్థా ఆనన్దసిన్ధువాసినీ  ॥ 172 ॥

ఇలాస్వరూపిణీ దేవీ ఇఈభేదభయ్కరీ ।
ఇడా చ ప్గిలా నాడీ ఇకారాక్షరరూపిణీ  ॥ 173 ॥

ఉమా చోత్పత్తిరూపా చ ఉచ్చభావవినాశినీ ।
ఋగ్వేదా చ నిరారాధ్యా యజుర్వేదప్రపూజితా  ॥ 174 ॥

సామవేదేన స్గతా అథర్వవేదభాషిణీ ।
ఋకారరూపిణీ ఋక్షా నిరక్షరస్వరూపిణీ  ॥ 175 ॥

అహిదుర్గాసమాచారా ఇకారార్ణస్వరూపిణీ ।
ఓంకారా ప్రణవస్థా చ ఓంకారాదిస్వరూపిణీ  ॥ 176 ॥

అనులోమవిలోమస్థా థకారవర్ణసమ్భవా ।
ప్చశద్వర్ణబీజాఢ్యా ప్చశన్ముణ్డమాలికా  ॥ 177 ॥

ప్రత్యేకా దశసంఖ్యా చ షోడశీ చ్చిన్నమస్తకా ।
షడ్గయువతీపూజ్యా షడ్గరూపవర్జితా  ॥ 178 ॥

షడ్వక్త్రసంశ్రితా నిత్యా విశ్వేశీ ఖడ్గదాలయా ।
మాలామన్త్రమయీ మన్త్రజపమాతా మదాలసా  ॥ 179 ॥

సర్వవిశ్వేశ్వరీ శక్తిః సర్వానన్దప్రదాయినీ ।
ఇతి శ్రీచ్చిన్నమస్తాయా నామసహస్రముత్తమమ్‌  ॥ 180 ॥

పూజాక్రమేణ కథితం సాధకానాం సుఖావహమ్‌ ।
గోపనీయం గోపనీయం గోపనీయం న సంశయః  ॥ 181 ॥

అర్థరాత్రే ముక్తకేశో భక్తియుక్తో భవేన్నరః ।
జపిత్వా పూజయిత్వా చ పఠేన్నామసహస్రకమ్‌  ॥ 182 ॥

విద్యాసిద్ధిర్భవేత్తస్య షణ్మాసాభ్యాసయోగతః ।
యేన కేన ప్రకారేణ దేవీభక్తిపరో భవేత్‌  ॥ 183 ॥

అభిలాన్త్సమ్భయేల్లోకాంరాజ్ఞోపి మోహయేత్సదా ।
ఆకర్షయేద్దేవశక్తిం మారయేద్దేవి విద్విషమ్‌  ॥ 184 ॥

శత్రవో దాసతాం యాన్తి యాన్తి పాపాని సంక్షయమ్‌ ।
మృత్యుశ్చ క్షయతాం యాతి పఠనాద్భాషణాత్ప్రియే  ॥ 185 ॥

ప్రశస్తాయాః ప్రసాదేన కిం న సిద్ద్యతి భూతలే ।
ఇదం రహస్యం పరమం పరం స్వస్త్యయనం మహత్‌  ॥ 186 ॥

ధృత్వా బాహౌ మహాసిద్ధిః ప్రాప్యతే నాత్ర సంశయః ।
అనయా సదృశీ విద్యా విద్యతే న మహేశ్వరి  ॥ 187 ॥

వారమేకం తు యోధీతే సర్వసిద్ధీశ్వరో భవేత్‌ ।
కులవారే కులాష్టమ్యాం కుహూస్కన్త్రిపర్వసు  ॥ 188 ॥

యశ్చేమం పఠతే విద్యాం తస్య సమ్యక్ఫలం శృణు ।
అష్టోత్తరశతం జప్త్వా పఠేన్నామసహస్రకమ్‌  ॥ 189 ॥

భక్త్యా స్తుత్వా మహాదేవి సర్వపాపాత్ప్రముచ్యతే ।
సర్వపా పైర్వినిర్ముక్తః సర్వసిద్ధీశ్వరో భవేత్‌  ॥ 190 ॥

అష్టమ్యాం వా నిశీథే చ చతుష్పథగతో నరః ।
మాషభక్తబలిం దత్వా పఠేన్నామసహస్రకమ్‌  ॥ 191 ॥

సుదర్శవామవేద్యాం తు మాసత్రయవిధానతః ।
దుర్జయః కామరూపశ్చ మహాబలపరాక్రమః  ॥ 192 ॥

కుమారీపూజనం నామ మన్త్రమాత్రం పఠేన్నరః ।
ఏతన్మన్త్రస్య పఠనాత్సర్వసిద్ధీశ్వరో భవేత్‌  ॥ 193 ॥

ఇతి తే కథితం దేవి సర్వసిద్ధిపరం నరః ।
జప్త్వా స్తుత్వా మహాదేవీం సర్వపాపైః ప్రముచ్యతే  ॥ 194 ॥

న ప్రకాశ్యమిదం దేవి సర్వదేవనమస్కృతమ్‌ ।
ఇదం రహస్యం పరమం గోప్తవ్యం పశుస్కటే  ॥ 195 ॥

ఇతి సకలవిభూతేరేతుభూతం ప్రశస్తం పఠతి ।
య ఇహ మర్త్యాశ్ఛిన్నమస్తాస్తవం చ   ॥ 196 ॥

ధనద ఇవ ధనాఢ్యో మాననీయో నృపాణాం స భవతి ।
చ జనానామాశ్రయః సిద్ధివేత్తా  ॥ 197 ॥

ఇతి శ్రీ విశ్వసారతన్త్రే శివపార్వతీ సంవాదే 
శ్రీ చ్చిన్నమస్తాసహస్రనామస్తోత్రం సంపూర్ణం
 
 


శ్రీ ఛిన్నమస్తా మహా విద్యా

Friday, October 10, 2025

Srivatsa - శ్రీవత్స

శ్రీ అనగా లక్ష్మీదేవి . లక్ష్మీదేవిని విష్ణువు హృదయమందు వుంచుకున్నాడు . అందుకు ఆయన హృదయము మీద ఒక గుర్తు యేర్పడింది . వత్స అంటే గుర్తు అనికూడా ఒక అర్థముంది . శ్రీవత్స అంటే లక్ష్మీదేవి గుర్తు . భృగువు విష్ణువు వక్షస్థలాన్ని తన్నడమువలన భృగు సంతతికి భృగుపాద గోత్రీయులనేవారు . లక్ష్మీదేవి భృగుమహర్షి కుమార్తె అందుకే విష్ణువక్షస్థలములో ఒక గుర్తుగా వున్న ఆమె పేరుమీద కాలక్రమేణా భృగుపాద గోత్రము శ్రీవత్స గోత్రముగా పిలవబడుతోంది.

భృగువు కుమారుడు 
చ్యవనుడు. చ్చవనుని పుత్రుడు అప్లవానుడు. అప్లవానునకు బుచి యగు భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు.

ఔర్వుడు తన తపోమహిమచే ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెను తన మోకాలి నుండి సృజింపచేశాడు. ఆమెకు 'కందని' (కందళి) అని నామకరణం చేశాడు. కందని అందగత్తె గాని కటుభాషిణి. సుగుణఖనియే కాని కలహప్రియ. కానీ ఆమెకు దైవభక్తి ఎక్కువ.ఎప్పుడూ ధ్యానం లో నిమజ్ఞురాలై ఉండేది. ఆమె పెరిగి పెద్దదైంది. యుక్తవయస్సు రాగానే ఆమెను దర్వాసునకు యిచ్చి వివాహం చేశాడు తండ్రి. కుమార్తెను అల్లుని వద్ద విడిచి తాను తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు.

చ్చవనునికి  పులోమజా అను పతివ్రత వలన ఋచీకుడు అను మహామునికి జన్మనిచ్చింది. ఋచీకుని భార్య సత్యవతి వారికి పుట్టిన సంతానమే జమదగ్ని.

జమదగ్నిభార్య రేణుక ఈమెయే రేణుకా ఎల్లమ్మ తల్లి, మారెమ్మ గ్రామదేవత, తమిళనాడులోని మారి అమ్మన్, దశ మహావిద్యలలో ఆరవ విద్య అయిన చిన్నమస్తా దేవి. 

రేణుక తన భర్త ఆయన జమదగ్ని వలన నలుగురు పుత్రులకు జన్మనిచ్చెను. వారు వరుసగా సులోచన , విలోచన, బృహలోచన మరియు భార్గవ రాముడు (పరశురాముడు). 

శ్రీ వత్స గోత్ర వంశములో సాక్షాత్ లక్ష్మీ దేవి కూతురు. పార్వతి దేవి స్వరూపమైన చిన్నమస్తదేవి (రేణుకా ఎల్లమ్మ తల్లి) కోడలు, పరశురాముడు కొడుకు, దుర్వాస మహాముని అల్లుడు. బ్రహ్మ మానస పుత్రులలో తూర్పు మస్తకం నుండి పుట్టిన భృగు మహర్షి మూల పురుషుడు. 

కావున శ్రీవత్స గోత్ర ప్రవరలో పంచాఋష ప్రవరాన్విత అని చెప్పి 

భార్గవ, చ్యవన, అప్లవాన, ఔర్వ, జమదగ్ని పంచాఋష ప్రవరాన్విత అని చెప్తారు. 

Parasu Ramudu - పరశురాముడు

పరశురాముని జన్మవృత్తాంతం

కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. 

ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఋచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. 

ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.

కార్తవీర్యార్జునితో వైరం
హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి, అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి, ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్ధంచేసి అతని వెయ్యిచేతులు, తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.

ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.

ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.పరశురాముడు మహా పరాక్రమవంతుడు.

రామాయణంలో పరశురాముడు
సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టించుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టై మని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది

మహాభారతంలో పరశురాముడు
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధించాడు. తరువాత అంబను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మ బ్రహ్మచర్య వ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది. 

కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.

ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. 

అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.

స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడింది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు.

పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు స్కాంద పురాణంలో వివరించబడింది.

ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.

పరశురాముడు చిరంజీవి. కల్క్యవతారమునకు విద్యలుపదేశిస్తాడనీ, తరువాతి మన్వంతరములో సప్తర్షులలో ఒకడవుతాడనీ కథ.

పరశురాముడు పూర్ణావతారము కాదనీ, అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ, మందిరాలూ చాలా తక్కువ.

భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ భూమిలో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.

కేరళలో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.


Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...