పురాణాల ప్రకారం మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. చైత్ర మాసంలో కృష్ణ పక్ష ఏకాదశిన వరుత్తిని ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున, భక్తులు విష్ణువు యొక్క ఐదవ అవతారమైన వామనుని పూజిస్తారు.
'వరుత్తిని' అనగా 'రక్షిత లేదా కవచం' అని అర్థం. ఈ ఏకాదశి రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మరియు ఉపవాసం వంటివి చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశంతో పాటు ఇంతవరకు మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణ వాక్యం.
పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మంధత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు, ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ ఎలుగుబంటిని రాజును చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణు మూర్తిని ప్రార్థించడం వలన సాక్షాత్ విష్ణుమూర్తి ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు.
అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేటప్పటికి రాజు కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు. ‘ప్రభూ, ఇలా నాకు ఎందుకు జరిగింది". అప్పుడు రాజుకు పూర్వ జన్మకర్మల ఫలాలకు ఇదంతా కారణమని విష్ణువు చెప్పాడట.
అయితే అదే సమయంలో శ్రీవిష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం కోరగా. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతారన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు. ఆ దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట. తదుపరి వైకుంఠం చేరాడు
అప్పటి నుండి వరూధిని ఏకాదశిని భక్తులు పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ ఏకాదశికి ఎంతో నిష్టతో ఉపవాసం చేస్తారు. అలాగే విష్ణు పురాణం, విష్ణు సహస్రనామం, మహాభాగవతం ఆరోజంతా శ్రవణం లేదా పఠిస్తారు.
శ్రీ కృష్ణుడు యుధిష్టరనకు వరూధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. వరుత్తిని ఏకాదశిని భక్తితో ఆచరించే ఎవరైనా అదృష్టం మరియు ఆరోగ్యం ఎలా ప్రసాదిస్తారో ఆయన వివరించాడు. వరుత్తిని ఏకాదశి వ్రతం ఆచరించడం అన్ని చెడులకు వ్యతిరేకంగా ఒక కవచంగా వంటిది. అంతేకాక భక్తులకు ఆనందాన్ని మరియు మోక్షాన్ని ఇస్తుంది. కావున ఉపవాసం చేసేవారు ఎవరైనా పునర్జన్మ నుండి విముక్తి లభిస్తుంది.
వరుథినీ ఏకాదశి తెలియక లేదా తెలిసి చేసిన ఘోరమైన పాపాలను కూడా నాశనం చేస్తుంది. అంతేకాక దేవతల యొక్క ఆశీర్వాదం కూడా కల్గుతుంది. ఈ ఏకాదశి వ్రతం భూదానం, సువర్ణ దానం లేక కన్యాదానం కన్నా కూడా గొప్ప ఫలం ఇస్తుంది. కన్యాదానాన్ని అతిపెద్ద దానంగా పరిగణిస్తారు. కానీ, వరుత్తిని ఏకాదశి 100 కన్యాదానాలు చేయడంతో సమానం. వరుత్తిని ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే చివరికి 'వైకుంఠంలో స్థానం' లభిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి, తాము చేసిన పాపానికి స్పృహలో ఉన్నవారు మరియు భయపడేవారు వరుత్తిని వ్రతాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో ఆచరించాలి.
ఏకాదశి రోజు దగ్గరలోనున్న విష్ణు ఆలయాన్ని దర్శిస్తే విశేషంగా విష్ణు అనుగ్రహం కల్గుతుంది. ఏకాదశి నాడు పూర్తిగా మన మనసు విష్ణువు పై లగ్నం చేసి కనీసం గోవిందనామాలు అయినా పలకాలి. వరుత్తిని ఏకాదశి నాడు విష్ణు అవతారమైన వామనవతరంను పూజిస్తారు.
ఏకాదశి రోజున ఆహారం నిషిద్ధము. కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు.
శ్రీ మహావిష్ణుకు తులసి మాల సమర్పించాలి. లక్ష్మీదేవిని ఆరాధించాలి.
పసుపు రంగు పండ్లు లేదా విష్ణువుకు సమర్పించాలి. దక్షిణావృత శంఖంలో గంగా జలం నింపి విష్ణువు అభిషేకం చేయాలి.
వరుత్తిని ఏకాదశి నాడు, నిద్ర, కోపం, జూదం, శరీరంపై నూనె పూయడం మరియు ఇతరులపై ఏదైనా చెడు భావాన్ని పెంపొందించడం వంటి వాటికి దూరంగా ఉండాలి.
విష్ణు సహస్రనామము, విష్ణు అష్టోత్తరము, 'భగవద్గీత' చదవడం వలన మంచి శుభ ఫలితాలు వస్తాయి.
వరుత్తిని ఏకాదశి నాడు దానాలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది అదృష్టాన్ని తెస్తుంది. ఈ ఏకాదశి రోజున తిలాదానం, గోదానం, భూదానం వంటి దానాలు మరియు బ్రాహ్మణ సమారాధన ఎంతో పుణ్యప్రదం

No comments:
Post a Comment