సౌభాగ్య లక్ష్మి రావమ్మా
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా
నుదుట కుంకుమ రవి బింబముగా
కన్నులు నిండుగా కాటుక వెలుగా
కాంచన హారము గళమున మెరియగా
పీతాంబరముల శోభలు నిండగా
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా (2 )
నిండుగా కరముల బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు
గల గల గలమని సవ్వడి చేయగా
సౌభాగ్య వతుల సేవలు నందగా
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా
నిత్య సుమంగళి నిత్య కళ్యాణి
భక్త జనులకు కల్పవల్లి
కమలాసనవై కరుణ నిండగా
కనక వృష్టి కురిపించే తల్లి
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా
జనకరాజుని ముద్దుల కొమరిత
రవికుల సోముని రమణీమణివై
సాధు సజ్జనుల పూజలందుకొని
శుభములనిచ్చే దీవెన లీయగ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా
కుంకుమ శోభిత పంకజ లోచని
వేంకట రమణుని పట్టపురాణి
పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే
పుణ్యమూర్తి మా ఇంట వెలసిన
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా
సౌభాగ్యమ్ముల బంగరు తల్లి
పురందర విఠలుని పట్టపు రాణి
ప్రతి నిత్యంబున పూజలందుకొన
సర్వకాలములు శుభ ఘడియలుగా
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా
Subscribe to:
Post Comments (Atom)
Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి
శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై న...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
|| గణపత్యథర్వశీర్షోపనిషత్ (శ్రీ గణేషాథర్వషీర్షమ్) || ఓం భద్రం కర్ణే'భిః శృణుయామ' దేవాః | భద్రం ప'శ్యేమాక్షభిర్యజ'త్రాః | స...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment