Wednesday, January 1, 2020

DEVI MAHATYAM MANGALA HAARATI - దేవీ మహత్యం మంగళ హారతి

దేవీ మహత్యం మంగళ హారతి

శ్రీ చక్ర పుర మందు స్థిరమైన 
శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

బంగారు హారాలు సింగారమొలకించు 
అంబికా హృదయకు నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

శ్రీ గౌరి శ్రీమాత శ్రీమహారాజ్ఞి 
శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

కల్పతరువై మమ్ము కాపాడు 
కరములకు కవకంబు కాసులతో నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

పాశాంకుశ పుష్ప బాణచాపధరికి 
పరమ పావనమైన నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

కాంతి కిరణాలతో కలికి మెడలో 
మెరిసె కల్యాణ సూత్రమ్ము నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

చిరునవ్వు లొలికించు శ్రీదేవి 
అధరాన శతకో టి నక్షత్ర నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

కలువరేకుల వంటి కన్నుల తల్లి 
శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

ముదమార మోమున ముచ్చటగ 
దరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

చంద్రవంకనికిదె నీరాజనం

శుక్రవారమునాడు శుభములొసగే 
తల్లి శ్రీ మహాలక్ష్మి కిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

ముగ్గురమ్మలకును మూలమగు 
పెద్దమ్మ ముత్యాలతో నిత్య నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

శృంగేరి పీఠాన సుందరాకారిణి 
సౌందర్యలహరికిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

సకల హృదయాలలో బుద్ధిప్రేరణ 
జేయు తల్లి గాయత్రికిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

దాన నరసింహుని దయతోడ రక్షించు 
దయగల తల్లికిదె నీరాజనం
ఆత్మార్పణతో నిత్య నీరాజనం

శ్రీ చక్ర పుర మందు స్థిరమైన 
శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
బంగారుతల్లికిదె నీరాజనం

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...