Wednesday, January 1, 2020

MANA SWATANTRYA BHARATA మన స్వాతంత్య్ర భారతం

మన స్వాతంత్య్ర భారతం

మన స్వాతంత్య్ర భారత కేతనమునెత్తి నడువరా
కటి బిగించి రిపుధాటిని కాల రాచి నిలువరా ||

ఆర్ధిక సమతా ఘంటిక అల్లదిగో మ్రోగెనురా
అందరమొక కుటుంబమై ఆనందము కనవలెరా ||

మతసమైక్యతా నినాదమే మనకు బలమురా
గతచరిత్ర తలచి జగద్~హితము నేడు కనుమురా ||

ఉదయోజ్వల భాస్కర కిరణోదంచితమురా నభం
భువన మానవాభ్యుదయ విజయమదే మనకు శుభం ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...