Saturday, August 15, 2026

Mitrasamaagamam - మిత్రసమాగమం

రామాయణం సుందరకాండ 56, 57 సర్గలు - మిత్రసమాగమం

ఆకాశ సముద్రంలో-
చంద్రుడే కలువ
సూర్యుడు నీటి కోడి.
పుష్యమీ, శ్రవణ నక్షత్రాలు హంసలు.
పునర్వసు మహా మీనం.
అంగారకుడు మొసలి.
స్వాతి నక్షత్రం హంసపథం.
ఐరావతం ద్వీపం.
మేఘాలే శైవలిని.
చంద్రకిరణాలు వాయు విచలిత తరంగాలు.
పద్మాలు, నాగ, యక్ష, గంధర్వులు.

అటువంటి సాగరాకాశాన్ని వేగగమన నౌకతో దాటుతున్నాడు, హనుమంతుడు.

సూర్య, చంద్ర, తారామండలాలను మింగుతున్నాడా అన్నట్టు సాగుతున్నాడు. మేఘమండలాలను లాక్కుంటూ వెడుతున్నాడు.

ఒక్కసారి వాటిలో దూరి, మరొకసారి పైకివచ్చి దోబూచులాడుతున్నాడు. 
బ్బుల మాటున - ధవళ వస్త్రధారి హనుమంతుడు - చంద్రుని వలె వున్నాడు.

గరుత్మంతునివలె గోచరిస్తున్నాడు.

దారిలో మైనాకగిరిశిఖరాన్ని హస్తస్పర్శతో అనందింపజేసి ముందుకు సాగి మహేంద్రగిరిని సుదూరాన చూచి సింహనాదం చేశాడు. దీర్ఘవాలాన్ని ఆడిస్తూ ఆనందంతో చేసిన ఆ మహాధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. ఆకాశం బ్రద్ధలవుతుందా అన్నట్లుంది ఆ ధ్వని. 

ఈవలి ఒడ్డున వున్న వానరవీరులు ఆ మహాగర్జన విని, అది ఏమా అని ఎదురు చూస్తున్నారు. వారిలో వృద్ధుడైన జాంబవంతుడు వారందరినీ దగ్గరగా చేర బిలిచి:

నాయనా! విన్నారా! ఆ గర్జ! కార్యసాధకుడు కాకపోతే అలా గర్జించలేడు. నిస్సంశయంగా మనవాడు విజయం సాధించి వస్తున్నాడన్నాడు.

పర
 సంతోషంతో వారందరూ పర్వతశిఖరాల మీద, చెట్ల చివరి కొమ్మల మీద గంతులు వేస్తూ హనుమంతుని రాకకోసం నిరీక్షిస్తున్నారు. మేఘం మీద మేఘం వస్తున్నట్టు దిగే హనుమంతునికి దోసిలి ఒగ్గి నిలిచారు.

హనుమంతుడు మహేంద్రగిరిమీద రెక్కలు లేని పర్వతంలా దిగాడు. అందరూ హనుమంతుని చుట్టూ చేరారు.

అనాయాసంగా అంత ప్రయాణం చేసి వచ్చిన హనుమకు వారందరూ దుంపలూ, పళ్ళూ కానుక లర్పించారు.

వృద్దుడయిన జాంబవంతునికి, యువరాజయిన అంగదునికి అభివాదం చేశాడు. చేస్తూనే:

ఆలోచించాడు; హనుమంతుడు. 

"దృష్టాసీతా" చూశాను సీతను, అని- 

రాక్షసస్త్రీజన మధ్యంలో, ఏకవేణితో, ఉపవాస కృశీభూతదేహంతో, రా విరహ శోకంతో మలినవస్త్రంతో ఉన్నది, అన్నాడు.

చూశాను అనేమాట అమృత ప్రాయంగా విని వారందరూ సింహ నాదాలతో, కిల కిలా రావాలతో, ఉరుములతో, తోకలు పొడుగుచేస్తూ పైకెత్తుతూ. నేలమీద తాడిస్తూ, గిరిశిఖరాలకు దూకుతూ, చెట్లమీదికి ఎగురుతున్నారు. 

అంగదుడు: హనుమా! నీ వల్ల మా అందరి ప్రాణాలూ నిలిచాయి. ఇప్పుడు మనం రామ దర్శనం చెయ్యగలం. నీ పరాక్రమ, ధైర్య, ప్రభు భక్తులు ప్రశంసనియాలు, నీ అదృష్టం వల్ల నువ్వు జానకిని చూడగలిగావు. సీతా వియోగ దుఃఖం రామునికి ఉండదు, అంటూండగా మిగిలిన వారందరూ హనుమంతుని యాత్రా విశేషాలు వినడానికి చుట్టూ చేరి కూర్చున్నారు. ఆ వానరవీర మధ్యంలో అంగదుడు దేవ పరివృతుడైన దేవేంద్రుని వలె ఉన్నాడు.

ఆ వానర యోధులతో పర్వత శిఖరం శోభిస్తున్నది.

అన్వేషణ గాథ

Aascharyam - ఆశ్చర్యం

రామాయణం సుందరకాండ 55వ సర్గ - ఆశ్చర్యం

క్రుద్ధః పాపం న కుర్యాత్కః 
క్రుద్ధో హన్యా ద్గురూ నపి

క్రుద్ధః పరుషయా వాచా
నరః సాధూ నధిక్షిపేత్‌


లంక ముట్టించి హనుమంతుడు సముద్రతీరం చేరి నీటిలో తోక తడుపుకుంటూ మంటలలో మాడే లంకా నగరాన్ని చూస్తున్నాడు.

ఒక వంక భయం, మరొకవంక అసహ్యం కలిగాయి. ఈ అకార్యం ఎందుకు చేశాను. ఆగ్రహం కలిగితే దానిని వివేకంతో అణచిపెట్టాలేకాని యింత అఘాయిత్యం చెయ్యడమా! కోపాన్ని నిగ్రహించుకోగలవారే ధీమంతులు.

కోపంలో చెయ్యని పాపం వుండదు. గురుహత్య, సజ్జనహింస వంటి పనులు కోపిష్ఠి అనాయాసంగా సాగిస్తాడు. ఎవరితో ఏం మాట్లాడాలో కూడా వాడికి తెలియదు. అందుచేతనే పాముకుబుసం విడిచేటట్లు ధీమంతులు క్రోధాన్ని విసర్జించాలి.

దుర్బుద్దుడనై, లజ్జా విహీనతతో ఈ దహనకాండ సాగించాను. సీతాదేవి ఏమవుతుందో అనే ఆలోచనే లేదు నాకు. ఇప్పుడింక ఏం చెయ్యను. స్వామి ద్రోహం జరిగిపోయింది.

ఈ లంకాదహనంతో సీతాదేవికూడా తగుల బడివుంటే ఏం కావాలి? నా సర్వ ప్రయత్నం వ్యర్థం. రావణుడిమీద ఆగ్రహంతో సర్వనాశనం చేసుకున్నాను.

ఇప్పుడింక నేను అగ్నిగుండంలో దూకాలి. మహాసాగర బడబాగ్నికి ఆహుతి కావాలి. లేదా సముద్రంలో తిమింగలాలకు ఆహారం అవుతాను.

సుగ్రీవుని సమ్ముఖానికి ఎలా వెళ్ళగలను? రామ లక్ష్మణులను చూడగలనా ఈ దశలో. ఈ లంకాదహనంతో ముల్లోకాలూ కపి ప్రకృతిని పరిహసించి తీరతాయి. రాజసంతో ఎంత దారుణానికి ఒడిగట్టాను.

సీత మరణించిందని వినగానే రామ లక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు. అది చూచిన సుగ్రీవుడు బంధుకోటితో ప్రాణత్యాగం చేస్తాడు. అయోధ్యలో భరత శతృఘ్నులు మాత్రం జీవిస్తారా!

కోపం కారణంగా యింతపని చేసిన అదృష్టహీనుణ్ని, అని చింతించే, హనుమంతునికి కొన్ని శుభశకునాలు గోచరించగా:

మాంగళ్యదేవతయైన సీతను అగ్ని దహించదు. ఆవిడే అగ్ని రూపిణి. అగ్నిని అగ్ని బాధిస్తుందా! రాముని భార్యను, పతివ్రతా శిరోమణిని అగ్ని దరిజేరలేదు.

సీతా రాముల ప్రభావంచేత కాకపోతే అగ్ని నా లాంగులాన్ని మండించి నన్ను భాధించకుండా వుంటుందా! నా తోకను తగలబెట్టని అగ్ని సీతపై ప్రసరిస్తుందా!

అవసర
యితే జానకీదేవియే అగ్నిని దహిస్తుంది, కాని అగ్నికి ఆవిడను దహించే శక్తిలేదు, అనుకుంటూండగా, గగన చారులయిన చారణులు:

ఓహో! హనుమంతుడెంత భయంకర కృత్యం సాధించాడు. సర్వలంకానగరం భస్మమై ఆర్తనాదాలతో వున్నా, జానకీదేవి అచంచలంగా ఆశోకవనంలో యథాపూర్వం వున్నది.

ఆ మాటలు విన్నాడు. అతని హృదయం సంతోషతరంగిత మయింది. అయినా ఒక్కమారు తన కంటితో అమెను చూసి వెళ్ళాలని నిశ్చయించుకుని శింశుపా వృక్షం చేరి, ఆ ఛాయలో వసివాడకుండా వున్న సీతను చూసి:

అమ్మా! నేను అదృష్టవంతుడను, అని చేతులు జోడించాడు.

నాయనా! ఇంత సాహసం నీకే సాధ్యం, సత్కీర్తిని సాధించే బల పరాక్రమాలు నీకే ఉన్నాయి. ఒక్క విషయం, మరచిపోకు. రామచంద్రుడు లంకానగరాన్ని తన బాణాలతో చీకాకు పరచి నన్ను తీసుకువెళ్ళడం మంచిది. ఏది ఎలా చెయ్యాలనేది ఆయనకు 
నం చెప్పనవసరంలేదు, అని జానకీదేవి అనగా హనుమంతుడు:

అమ్మా! త్వరలోనే రామచంద్రుడు వానర భల్లూక సేనా సమేతం వచ్చి అఖిల శత్రునాశనం చేసి నీ మనస్సుకి ఆనందం కలిగిస్తాడు! ఇక నాకు సెలవమ్మా, అని బయలుదేరి సముద్రతీరాన వున్న అరిష్ట పర్వతం అధిరోహించాడు.

మహోన్నతమైన ఆ గిరి శిఖరాల మీద మేఘాలు ఉత్తరీయాలవలె వున్నాయి. రాళ్ళమీద సూర్యకిరణాలు పడి కనులు మిలమిల లాడిస్తున్నట్టుంది. సెలయేటి మంద్రధ్వనులు వేదగానాన్ని తలపించాయి. అకాశాని కెదిగిన దేవదారు వృక్షాలు పర్వతుడు మహామహులు పైకెత్తినట్లున్నాయి. గాలికి వూగిసలాడే రెల్లుతోటలతో అది కంపిస్తున్నట్టుంది. వాయుపూరితములయి వెదురువనాలు నిర్విరామంగా కూజిస్తున్నాయి. మహాసర్పాల వూపిరి పర్వతం విడిచే నిట్టూర్పులా, మంచునిండిన గండశిలలు ధ్యానసమాధులలో మునులవలె వున్నాయి.

వివిధ వర్ణశోభిత సుమరాజితో తరువులు.

ఆ పరిసరాలలో మహర్షి, యక్ష, కిన్నర, గంధర్వులు.

సింహాలతో గుహలు.

శార్దూలాల విహారాలు.

ఆ పర్వతం ఎక్కి ఒక్కమారు కలయజూసి దేహం పెంచి, కుప్పించి, గగనవీధికి లేచాడు.

అ పాదతాడనానికి పర్వతం, ముక్కముక్క అయింది. పిడుగుపడి మోడువారి నట్లయాయి మహావృక్షాలు. విరిగిపడే గుహలలో సింహాల గర్జనలు దిక్కులు దద్దరిల్ల జేశాయి.

ఆ కొండమీది విద్యాధర స్త్రీలు భయభీతలై జారిన వస్త్రాలతో చెదరిన అలంకారాలతో గగన మార్గానికి లేచారు.

కాకోల విషసర్పాలు తలలు చుట్టుకుని, నడుములు విరిగి మరణించాయి. అంత ఎత్తయిన కొండ హనుమంతుని పాదపీడనంతో పాతాళానికి దిగి, అక్కడ ఒక కొండ వుండేదని గుర్తులేకుండా పోయింది. గగన వీధిని బయలుదేరాడు హనుమంతుడు.

మిత్రసమాగమం

Lanka Dahanam - లంకా దహనం

రామాయణం సుందరకాండ 53, 54 సర్గలు - లంకా దహనం

ఆలోచించాడు హనుమంతుడు.

ఈ వనం విధ్వంసం చేశాను.

రాక్షసయోధులు కొందరు నేలకూలారు.

ఇంక ఈ దుర్గం కూడా ధ్వంసం చేస్తే నేను వచ్చిన పని పూర్తి అవుతుంది.

అగ్నిహోత్రునికి తృప్తి కలిగేలా రాక్షస భవనాలు దహిస్తాను, అనుకుని ఒక్క అంగలో సేనాపతి ప్రహస్తుని భవనం నలుమూలలా అంటించి, మహాపార్శ్వ, వజ్రదంష్ట్ర, శుక, సారణ, జంబుమాలి, ఇంద్రజిత్తు, రశ్మికేతు, మకరాక్ష, కుంభకర్ణ, కుంభ, నికుంభాది మహావీరుల భవనాలన్నీ అగ్నికి ఆహుతి చేశాడు.

విభీషణ సౌధం ఒక్కటే విడిచిపెట్టాడు.

రావణభవనం ముట్టించి ప్రళయవేళ మేఘపంక్తులు ఉరిమినట్లు గర్జించాడు.

ఆయన నిప్పు ముట్టిస్తుంటే వాయువు తీవ్ర వేగంతో చలిస్తున్నాడు. దానితో అగ్ని మరింతగా మండడం ఆరంభించాడు. లంక అంతా అగ్ని జ్వాలలే. పెటపెట ధ్వనులతో మహాభవనాలు నేల కూలుతున్నాయి. ఆర్తనాదాలతో రాక్షసులు వీధులలో పడ్డారు. పుణ్యక్షయం కాగా భూమికి జారే సిద్ధసౌధాలవలె వున్నాయవి.

పసిపిల్లలకు పాలిస్తూన్న తల్లులు తమ బిడ్డలను గట్టిగా పట్టుకుని వీధులవెంట పరుగులు తీస్తున్నారు. సౌధాగ్రాలమీది స్త్రీలు తమ బట్టల మంటలవేడి భరించలేక క్రిందికి దూకుతున్నారు. వేడికి కరిగి రత్న మాణిక్యాలు ప్రవహిస్తున్నాయి.

క్వచి త్కింశుక సంకాశాః
క్వచిత్‌ శాల్మలీ సన్నిభాః ।
క్వచిత్‌ కుంకుమ సంకాశాః
శిఖా వహ్నేశ్చ కాసిరే ॥

ఆ మంటలు

ఒకచోట నిండుగా విరిసిన మోదుగుపూలవలె, మరొకచోట బూరుగు పుష్పాలవలె, ఇంకొకచోట కుంకుమ కాంతితో వున్నాయి.

త్రిపుర దాహదృశ్యం గోచరించింది లంకాదహనవేళ, వాయు ప్రేరితమైన అగ్నిజ్వాలలు వలయాలు తిరుగుతున్నాయి. రాక్షసుల దేహాలే అజ్యధారలుగా అగ్ని మండుతున్నది. మంటలు ఆకాశం అంటుతున్నాయి. మండి మండి ఆరిన భవనాల నుండి ధూమం వల్ల కలువల తోరణంలా వున్నది. లంక అంతా ఆర్తనాదాలతో నిండింది.

వీడు వానరుడు కాడు.

వజ్రపాణియో, త్రిన్రేత్రుడో, యముడో, వరుణుడో, రుద్రుడో, సూర్య, కుబేర, చంద్ర అగ్నులలో ఎవడో ఈ రూపంతో వచ్చి వుండాలి. కాకుంటే సాక్షాత్తూ చతుర్ముఖ ప్రజాపతికి కలిగిన ఆగ్రహం వానర రూపంతో లంకా నాశనానికి దిగి ఉంటుంది. లేకపోతే వైష్టవతేజం అవతరించి వుండాలి అనుకున్నారు రాక్షసులు.

లంక అంతా అంటించి హనుమంతుడు త్రికూటగిరి శిఖరంమీద సింహంలా కూర్చున్నాడు. ఒక్కసారి రాముని స్మరించాడు.

హనుమంతుని ఈ అద్భుత కార్యం తిలకించిన దేవ, గంధర్వ, సిద్ధ, సాధ్య గణాలు హర్షంతో అభినందించాయి.

ఆశ్చర్యం

Vibhishana - విభీషణుడు

రామాయణం సుందరకాండ 52వ సర్గ - విభీషణుడు

హనుమంతుని మాటలు విని రావణుని క్రోధం అంచులు దాటింది.

ఈ వానరునికి శిరశ్ఛేదం చేయండి, అన్నాడు.

అది విని విభీషణుడు:

రాక్షసేశ్వరా! ఆవేశాన్ని విడిచి క్షమా హృదయంతో ఈ విషయం పరిశీలించాలి. విచక్షణకల ప్రభువులు దూతకు శిర
శ్ఛేదం చెయ్యరు. అది రాజనీతి విరుద్ధం. లోకం దానిని గర్హిస్తుంది.

నువ్వు ధర్మవిదుడవు. ముఖ్యంగా రాజనీతి నీకు కరతలామలకం. మంచి చెడ్డలు ఒకరు నీకు చెప్పనవసరము లేదు. నీ అంతటి వాడే రోషావేశాలకు లోబడితే ఇక విద్యా ప్రయోజనం ఏమిటి? సర్వశత్రు సంహార సమర్ధుడవైన నువ్వు దూతను తగు రీతిని దండించాలే కాని ఇలా శిక్షించరాదు;
అని చెపుతూంటే రావణుడు:

విభీషణా! పాపులను వధించడం పాపం కాదు. వీడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం శిర
శ్ఛేదమే అన్నాడు.

లంకేశ్వరా! ధర్మార్థ యుక్తంగా చెపుతూన్న నా మాటను ప్రశాంత చిత్తంతో ఆలకించు. యుద్దాలలో కూడా దూతను వధించరాదని పెద్దలు చెప్పారు. వీడు బాగా విర్రవీగుతున్న శత్రువని నేనూ అంగీకరిస్తాను. వీడు మనకు చాలా నష్టం కలిగించి, ఎంతో అపకారం చేశాడు. అయినా వీడు దూత.

కొరడాతో కొట్టడం.
బుర్ర గొరిగించడం.

కాలో, చెయ్యో విరిచేయడం - ఇవీ దూతకు విధించే శిక్షలు, అంతే తప్ప దూతను వధించినట్టు మనం వినలేదు, ఎప్పుడూ.

యుక్తా యుక్తా లెరిగి, వినీతుడవుగా ప్రఖ్యాతి పొందిన నువ్వే ఆవేశానికి లొంగితే ఏం కావాలి. నిగ్రహం వివేక లక్షణం. ధర్మనిర్ణయంలో నిన్ను మించినవారులేరు. శాస్త్ర జ్ఞానంతో లోక వ్యవహారం ఎరిగిన ధీమంతుడవు.

నీ పరాక్రమం దేవాసురుల తల వంచింది.

ఇంకొక్కమాట-

ఈ వానరుని చంపి మనం సాధించగలిగింది లేదు. వీడి ప్రభువును పట్టి చంపాలి. ఇప్పుడు వీనిని చంపితే ఈ విశాల సముద్రం దాటి మరొక చారుడు వచ్చే అవకాశం కనపడదు.

విడు తిరిగి వెడితే తప్ప ఆ మానవ వానర ప్రభువులు లంకకు యుద్దానికి రాలేరు.

పరాక్రమం, ఉత్సాహం, ధైర్యం కల నీకు యుద్ధ ప్రీతులయిన అనుచరులు కోట్ల సంఖ్యలో వున్నారు. వారిలో కొందరుపోయి ఆ మానవుడికి నీ శక్తి ఏమిటో వివరిస్తారు. మిగిలిన వ్యవహారం అప్పుడు తేలుతుంది. అందుచేత ఈ వానరుని సంహరించకుండా విడిచిపెట్టాలి, అన్నాడు.

విన్నాడు రావణుడు.

దేశ కాల యుక్తంగా కనపడింది, విభీషణుని మాట.

నువ్వు చెప్పినట్లు దూతవధ నింద్యమే. వీడికి శిక్ష వెయ్యాలి. వానరులకు తోక చాలా యిష్టమయినది, అది తగులబెట్టండి. అప్పుడు వీడి వికారాకృతి చూసి వీడి బంధుమిత్రులు ఆనందిస్తారు. తోక అంటించి శృంగాటకాలలో నిలబెట్టండి, అని ఆజ్ఞాపించాడు.

అది విన్న క్షణంలో రాక్షసులు తమ తమ గృహాలలోని పాతగుడ్డలు తెచ్చి హనుమంతుని వాలానికి చుట్టడం ఆరంభించారు. హనుమంతుడు శరీరాన్ని పెంచుతున్నాడు. వారు తాము చుట్టిన గుడ్డలు నూనెతో తడిపి నిప్పు అంటించారు.

లంకలోని ఆబాల గోపాలం హనుమంతుని చూడడానికి వచ్చి సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు. తోక మండుతోంది. హనుమంతుడు ఆలోచించాడు.

ఈ లంకలో రాత్రి తిరగడంవల్ల వీరి దుర్గ రక్షణ విధానం తెలియలేదు. ఈ శిక్షతో వీరు నగరం అంతా తిప్పి నాకు మేలుచేస్తారు, అని సంతోషించాడు.

శంఖ, భేరీ ధ్వానాలతో నగరమంతా హనుమంతుని త్రిప్పుతున్నారు.

"వీడు గూఢచారి" అని అరుస్తున్నారు. వీధులన్నీ వేడుకగా హనుమంతుని చూచే రాక్షస స్త్రీలతో నిండాయి.

ఈ వార్త సీతాదేవికి చెప్పి సంతోషించారు, మరికొందరు స్త్రీలు. వింటూనే సీతాదేవి మనసా అగ్నిహోత్రుని ప్రార్థించింది.

యద్యస్తి సతి శుశ్రూషా
యద్యస్తి చరితం తపః

యదివా స్త్యేక పత్నీత్వం
శీతో భవ హనూమతః


పతిశుశ్రూషలో, తపస్సులో నేను సాధించిన ఫలం, ఆయన ఏకపత్నీ వ్రతఫలం, హనుమంతునికి చల్లదనం కలిగించాలి. అగ్ని బాధించరాదు. ధీమంతుడైన రామునికి నామీద దయ ఉంటే, నా అదృష్టలేశం ఏమయినా మిగిలితే, నా మనస్సు సత్వరం రామ సమాగమకాంక్షతో ఉన్నదని ఆయన గ్రహిస్తే సుగ్రీవుడు సత్య ప్రతిజ్ఞుడై నన్ను ఉద్ధరించే సంకల్పంతో ఉంటే అగ్నిజ్వాలలు హనుమంతునికి మలయ పవనాలు కావాలి, అని అనుకుంటున్నది.

ఆ ప్రార్థన ఆలకించి అగ్నిహోత్రుడు మంగళప్రదంగా ప్రదక్షిణం చేశాడు. వాయువు సైతం చల్లగా కదలి సీతాదేవికి సంతోషం కలిగించాడు.

కణకణలాడుతూ శిఖలు లేచే అగ్ని చల్లగా సోకుతూ మారుతికి ఆశ్చర్యం కలిగించింది.

వాలాగ్రం మీద మరీ చల్లగా ఉన్నది.

నిన్న సముద్రం దాటుతూంటే మైనాకుడు సాయపడటానికి వచ్చాడు, వాడే అలా వచ్చినపుడు రామకార్యార్థినైన నాయందు అగ్ని అనుగ్రహం చూపకుండా ఉంటాడా!

రాముని తేజస్సు, సీతాదేవి సౌశీల్యం, నా తండ్రి వాయువుతో ఉన్న సఖ్యం - ఈ కారణాలచేత అగ్నిహోత్రుడు నన్ను అనుగ్రహించి ఉండాలి, అని భావించి సింహగర్జన చేసి ఒక్క గంతులో నగరద్వారానికి ఎగిరాడు.

దేహాన్ని సంకుచితం చేశాడు.

అంతతో ఆయనకు కట్టిన త్రాళ్ళన్నీ జారిపోయాయి. మళ్ళీ పర్వత మంత పెంచాడు దేహాన్ని, ద్వారానికున్న దూలంలాగి ద్వారపాలకులను నేలకూల్చాడు.

ఒక్కసారి లంకానగరం అంతా కలయచూశాడు.

అగ్ని శిఖలతో నిండిన లాంగూలంతో హనుమంతుడు ఆదిత్య మండలంలా కనిపిస్తున్నాడు.

లంకా దహనం

Sandesham Message - సందేశం

రామాయణం సుందరకాండ 51వ సర్గ - సందేశం

మా ప్రభువు ఏమన్నాడో వినిపిస్తాను.

రథ, గజ తురగ పదాతి బల సంపన్నుడు దశరథ మహారాజు.

ఆయన లోక ప్రజలందరినీ పితృవాత్సల్యంతో చూసుకునేవాడు. ఇంద్రునితో సమమయిన తేజస్సు కల ఆ మహారాజు ఆజ్ఞానుసారం ఆయన పెద్దకొడుకు దండకారణ్యానికి వచ్చాడు.

ధర్మవర్తనుడూ, తీవ్ర బలపరాక్రమ సంపన్నుడూ, అయిన ఆ రా
చంద్రుని వెంట తమ్ముడు లక్ష్మణుడూ, భార్య సీత వచ్చారు.

జనకరాజపుత్రి, పతివ్రత అయిన ఆ సీత ఒకనాడు దండకారణ్యంలో కనిపించలేదు. ఆమెను అన్వేషిస్తూ ఆ రాకుమారులు కిష్కింధచేరి ఋశ్యమూక పర్వతం మీద సుగ్రీవుని కలిశారు. సీతాన్వేషణ భారం వహించాడు మా ప్రభువు.

వానర రాజ్యం సుగ్రీవునకు ధారవోశాడు రాముడు.

మా కపిలోక ప్రభువు మహావీరుడు వాలి.

నువ్వెరుగని వాడుకాదు వాలి,

అటువంటి యోధుని ఒకే ఒక్క బాణంతో నేల కూల్చాడు రాముడు.

ఆడిన మాట ప్రకారం వానరసేనలను నాలుగు దిక్కులకూ పంపించాడు సుగ్రీవుడు.

మా వానర యోధులలో కొందరు వైనతేయులు, 
రికొందరు వాయుదేవసములు, అందరూ తీవ్రగమనం కలవారే.

వారిలో నేను వాయువునకు ఔరసుడనయిన హనుమంతుడను. నూరుయోజనాల సముద్రం దాటి లంకలో సీతాదేవిని చూశాను. 

నిన్ను చూశాను. నువ్వు కూడా ధర్మం ఎరిగినవాడవు తపస్వివి. ప్రాజ్ఞుడవు. అటువంటి నీకు పరభార్యాపహరణం ఉచితంకాదు. నీ వంటి ధీమంతులు ధర్మాన్ని అతిక్రమించి ప్రమాదాలు కొని తెచ్చుకోరు.

రామ లక్ష్మణులు ధనుర్బాణధరులై నిలబడితే దేవాసురులు వారికి ఎదురు నిలవలేరు. రాముని మనసుకు కష్టం కలిగించిన వాడెవడూ సుఖంగా ఊపిరి తీసుకోలేడు.

ఈ విషయాన్ని విస్మరించకుండా త్రికాలహితమూ, ధర్మార్థ సంయుతమూ అయిన నా మాట విని ఆయన భార్యను ఆయనకు అప్పగించు. ఆయనెవరనుకుంటున్నావో! మానవరూపం ధరించిన దైవం.

ఇక-

నేను సీత జాడ తెలుసుకున్నాను.

మిగిలిన పని అవలీలగా సాగిస్తాడాయన.

నువ్వు సీతను అపహరించడం అంటే అయిదు పడగల పాముతో చెలగాటమే. విషాన్ని తిని బ్రతికే వాడుండడు కదా! అలానే సీతను అపహరించడమూ.

తీవ్ర సాధనతో తపస్సు చేసినవాడవు, ధర్మపరుడవు. 

కనక నీ ప్రాణాలు తీయడం అంత న్యాయం కాదు.

దేవాసురులకు నిన్ను చంపడం సాధ్యంకాదు కాని, మానవుడైన రాముడు, వానరుడయిన సుగ్రీవుడు వస్తున్నారు. అధర్మం మీద ధర్మం విజయం సాధించి తీరుతుంది.

నిన్నటివరకూ నువ్వు ధర్మకర్మల ఫలం అనుభవించావు. ఇప్పుడీ సీతాపహరణమనే అధర్మ ఫలాన్ని అనుభవించే సమయం ఆసన్నమయింది.

జనస్థాన వధం బుద్ధ్వా
బు
ద్ధ్వా వాలి వధం తథ
రామ సుగ్రీవ సఖ్యం చ
బుద్ధ్యస్య హిత మాత్మనః॥

జనస్థానంలో నీ యోధులందరూ రాముని చేతులలో నేల కూలిన విషయం విన్నావు.

మహావీరుడైన వాలి మరణించిన వార్త విన్నావు.

రామ సుగ్రీవ మైత్రి తెలిసింది. ఇప్పుడింక నీ శ్రేయెమార్గం తెలుసుకోవాలి.

ఇంత చెప్పడం దేనికంటావేమో!

నేనే నీ లంకా నగరాన్ని సర్వనాశనం చెయ్యగలను, కాని రాముడి కది అభి
తం కాదు.

సీతాపహరణం చేసిన వానిని తనే స్వయంగా హతమారుస్తానని శపథం చేశాడు. ఆయన మాట తప్పనివాడు.

పయిగా సీతాదేవి ఎవరో నీకు తెలిసినట్లు లేదు.

సర్వ లంకా నాశన రూపిణి అయిన కాళరాత్రి అవిడ.

కాలపాశాన్ని ఆవిడ రూపంలో నీ మెడకు తగిలించుకున్నావు.

రామ క్రోధాగ్ని
సీతా తేజోగ్ని

ఈ రెండూ నీ లంకను సర్వనాశనం చేస్తూంటే చూడక తప్పదు నీకు.

నా మాట వను.

నీ సచివ, సామంత, బంధు మిత్రక్రోటిని రామ బాణాగ్నికి ఇంధనం చెయ్యకు.

ఈ సర్వభూతాలనూ ఉపసంహరించి మళ్ళీ యథాపూర్వం సృష్టించగలవాడు రాముడు.

విష్ణు సమ పరాక్రముడైన రాముని ఎదుట నిలవగలవాడు లేడు.

చతుర్ముఖుడు, త్రినేత్రుడు, సహస్రాక్షుడు వీరెవరూ రాముని ముందు నిలవరు. ఆయన తలచుకుంటే వీరెవ్వరూ అభయంకూడా యివ్వలేరు, అన్నాడు.

విభీషణుడు

Mimamsa - మీమాంస

రామాయణం సుందరకాండ 50వ సర్గ - మీమాంస

లోక కంటకుడైన రావణుడు హనుమంతుని చూసి:

ఈ మహాతేజస్వంతుడైన వానరుడు ఎవడై ఉంటాడు, నాడు నేను కైలాసాన్ని చలింపజేసిననాడు నన్ను శపించిన నందీశ్వరుడా!

కాకుంటే-

బాణాసురుడా! అని ఆలోచిస్తూ ప్రహస్తుని వైపు తిరిగి: 

వీడెవడో! ఎక్కడనుంచి వచ్చాడో, అశోకవనం ఎందుకు ధ్వంసం చేశాడో, రాక్షస జనాన్ని ఎందుకు భయపెట్టాడో! మన వారితో పోరాటానికి ఎందుకు తలపడ్డాడో వివరంగా అడుగు, అన్నాడు. 

ప్రహస్తుడు: ఓ వానరా! నువ్వు భయపడకుండా నిజం చెప్పు. సత్యం పలికితే నీకు విముక్తి లభిస్తుంది. 

దేవేంద్రుని దూతగా వచ్చావా! యమ, వరుణ, కుబేరులలో ఎవరయినా చారకృత్యానికి పంపారా! విజయకాంక్షతో విష్ణువే పంపించాడా? ఆకారంలో వానరత్వం వున్నా నీ తేజస్సు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. 

ఈ లంకా నగరంలో ఎందుకు అడుగుపెట్టావో, నిజం చెపితే నిన్ను విడిచిపెడతాం, లేదా నీ ప్రాణాలు దక్కవు, అన్నాడు. 

హనుమ: ఇంద్ర, యమ, వరుణ, కుబేరులతో నాకు ఏ సంబంధమూ లేదు. విష్ణు ప్రేరణతో నేను రాలేదు. నేను వానరుడను. ఆ వానర ప్రకృతితోనే ఇలా వచ్చాను. మీ రాజును దర్శించే కోరికతో ఈ వనం ధ్వంసం చేశాను. బలవంతులైన మీ రాక్షసులు నన్ను ఎదుర్కోబోతే ప్రాణరక్షణార్థం వారితో యుద్ధం చేశాను. దేవ, దానవులు నన్ను బంధించలేరు. శస్త్రాస్త్రాలు నన్ను బాధించవు. అది నాకు పితాహుడిచ్చిన వరం. మీ హారాజును చూడాలనే కోరికతో నేను బంధితుడనైనట్లు నటించి ఇలా వచ్చాను, అని రావణుని వెపు తిరిగి:

లంకేశ్వరా! సుగ్రీవ సందేశంతో నీ దగ్గరకు వచ్చాను. ఆయన సోదరప్రే
తో నీ కుశలం అడగన్నాడు. ఆయన చెప్పిన మాటలు సావధానంగా వింటే ఇహపరాలలో నీకు శ్రేయస్సు కలుగుతుంది.

సందేశం

Purvabhadra Nakshatra - పూర్వాభాద్ర నక్షత్రము

పూర్వాభాద్ర నక్షత్రము

నక్షత్రం - పూర్వాభాద్ర
అధిపతి - గురువు
గణము - మానవ
జాతి - పురుష
వృక్షం - మామిడి
జంతువు - సింహము
నాడి - ఆది
పక్షి - మయూరము
అధిదేవత - అజైక పాదుడు
రాశి - 1,2,3 పాదాలు కుంభం, 4వ పాదం మీనం
సే, /సో,/ దా./ ఈ,/దీ,

పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో పూర్వాభాద్ర నక్షత్రము 25వ నక్షత్రము. పూర్వాబాధ్ర నక్షత్రాధిపతి గురువు, అధిదేవత అజైకపాదుడు, మానవగణము, జంతువు సింహము, రాశ్యాధిపతులు శని, గురువులు.

ఈ నక్షత్రములో జన్మించిన వారికి గురువుల సహకారము, మేధావుల సహకారము, సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు. అనేక రంగాల గురించి అవగాహన ఉంటుంది. పెద్దల పట్ల గౌరవం, భయం ఊంటాయి.

వృత్తి, ఉద్యోగాల పరంగా ఎవరి సలహాలు తీసుకోరు. ఏక పక్ష ధోరని వలన కష్టాలు ఎదుర్కొంటారు. స్నేహాలు, విరోధాలు వెంట వెంటనే ఏర్పడతాయి. వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచి సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగపరంగా నిజాయితీ, సత్ప్రవర్తన కారణంగా విరోధాలు వస్తాయి. వీరి శక్తిని వీరికి ఇతరులు చెప్పే వరకు వీరికి తెలియదు.

సాహిత్య, కళారంగాలలో రాణిస్తారు. దేశదేశాలలో విహరిస్తారు. జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కాని ధనం అప్పటికప్పుడు అందివస్తుంది. అదృష్టం వలన పైకి వచ్చారన్న ప్రచారం సదా ఉంటుంది.


ఆర్థిక స్థిరత్వం సాధించిన తరువాత దానగుణం ఉంటుంది. పిసినారితనం ఉండదు. సామాజిక సేవలో పేరు వస్తుంది. వైవాహిక జీవితం సాధారణం. బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది. తరువాత జీవితం సాధారణంగా ఉంటుంది.

పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు తెలివైనవారు. సరళమైన జీవితాన్ని గడుపుతారు. దేవుడిపైనా పూర్తి విశ్వాసం ఉంటుంది. హృదయం స్వచ్ఛంగా ఉంటుంది కనుక, వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.

నిజమైన సంపద కంటే, మంచి పేరు ప్రఖ్యాతులు మరియు విశ్వసనీయతలు వీరికి సంపదలుగా ఉంటాయి. వీరు నిజం మాట్లాడటంతో పాటుగా నిజాయితీగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు.

నిజాయితీగా ఉండటం వల్ల, అక్రమాలకు మరియు చౌకబారు ఎత్తుగడలకు వీరు దూరంగా ఉంటారు. వీరిలో ఆశావహన దృక్పథం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వీరు ఆశను వదులుకోరు. వీరు దయాళువు కనుక ఎల్లప్పుడూ ఇతరులకు సహాయపడటానికి సిద్ధంగా ఉంటారు.

ఎవరైనా ప్రమాదాల్లో ఉన్నట్లయితే, వారికి వీరు సహాయం చేస్తారు. వీరు అధునాతనంగాను మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. అందువల్లనే వీరిని కలిసే ప్రజలు ప్రేమగాను మరియు అభిమానంగా ఉంటారు.

పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు స్నేహం విషయంలో నిజాయితిగా తీసుకుంటారు. చక్కటి ప్రవర్తనతో వీరి హృదయం స్వచ్ఛంగా ఉంటుంది మరియు ఎన్నడూ ఎవరిని బాధించడానికి వీరు ప్రయత్నించరు. వీరి వ్యక్తిత్వంలోని ఈ ప్రత్యేక లక్షణం వల్ల ప్రజలు వీరిని విశ్వసిస్తారు.

విద్య మరియు జ్ఞానం కోణంలో చూసినట్లయితే, వీరు చాలా తెలివైనవారు. వీరికి సాహిత్యంలో కూడా ఆసక్తి ఉంటుంది. దీనితో పాటుగా సైన్సు, ఖగోళశాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రంలో ఆసక్తులుంటాయి. అదేవిధంగా వీరు ఈ విషయాల్లో నిపుణులుగా ఉండవచ్చు. వీరి ఆలోచనలు నిష్పాక్షికంగా ఉంటాయి.

ఆధ్యాత్మికతకు అదనంగా, వివిధ విషయాల్లో వీరు జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా, జ్యోతిష్యశాస్త్రంలోనూ వీరికి ప్రావీణ్యం ఉంటుంది. వీరు ఒక ఆదర్శవాది, డబ్బు కంటే జ్ఞానానికి వీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. జీవించడానికి అవసరమైన డబ్బు కొరకు ఉద్యోగం లేదా వ్యాపారం రెండు వీరికి సానుకూలంగా ఉంటాయి.

ఉద్యోగం కంటే వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు మరియు ఉద్యోగంలో ఉన్నతస్థానంలో ఉంటారు. ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్లయితే, ఎదుగుదల కొరకు అన్నిరకాల చర్యలు తీసుకుంటారు. వీరు భాగస్వామ్యంలో వ్యాపార చేయడానికి ఇష్టపడతారు. బాధ్యతల విషయానికి వస్తే, వాటిని బాగా అర్థం చేసుకుంటారు మరియు వీరి విధిని వీరు నిజాయితీగా నెరవేరుస్తారు.


పూర్వాభాద్ర నక్షత్రం మొదటి పాదము
పూర్వాభాద్ర నక్షత్రము మొదటి పాదము జాతకుల మీద కుజ, గురు ప్రభావం ఉంటుంది. ఇది దేవగణ నక్షత్రము. ఈ నక్షత్ర జాతకులు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. కుజ ప్రభావం కారణంగా ఆవేశం ఉన్నా దాని మీద నియంత్రణ కలిగి ఉంటారు. వీరికి ధైర్యసాహసాలు అధికం. అధ్యాత్మిక విశ్వాసం కలిగి ఉంటారు.

ఈ జాతకులకు భూ సంబంధిత, సైనికపరమైన, సాహసాలు ప్రదర్శించ గలిగిన రక్షణ శాఖ అగ్నిమాపకం, ఆటవిక సంబంధిత ఉద్యోగాలు అనుకూలిస్తాయి. శిక్షకులు, ఉపాధ్యాయులు వంటి ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, రక్తవర్ణ సంబంధ ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. వీరికి వ్యవసాయం కూడా కలిసి వస్తుంది.

ఈ జాతకులకు 14 సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. ఈ కారణం వల్ల మొదటి నుంచి విద్యాభ్యాసంలో రాణిస్తారు. అయినప్పటికీ 14 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. వివాహంలో జాప్యం జరగవచ్చు. సంపాదన కంటే ఖర్చులు అధికం. 33 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది.

50 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధ యాత్రలు అనుకూలిస్తాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలువుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.

పూర్వాభాద్ర నక్షత్రం రెండవ పాదము
వీరు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. పసుపు వర్ణ, శ్వేత వర్ణ సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. జల సంబంధిత, పర్యాటక సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఈ జాతకులకు పది సంవత్సరాల వరకు గురు దశ ఉంటుంది. కనుక ఆరంభం నుంచి విద్యలో రాణిస్తారు. అయినప్పటికీ 10 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యా భ్యాసంలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. జీవితంలో నిదానంగా స్థిరపడతారు.

29 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం లభిస్తుంది. 46 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 53 సంవత్సరాల తరువాత వచ్చే శుక్ర దశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖం మొదలవుతుంది. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది. వృద్ధాప్య దశ కూడా సుఖంగా గడిచిపోతుంది.


పూర్వాభాద్ర నక్షత్రం మూడవ పాదము
పూర్వాభాద్ర నక్షత్ర మూడవ పాద జాతకులు సత్వగుణ ప్రధానులుగా ఉంటారు. ఉపాధ్యాయులు, ఉన్నత ఉపాధ్యాయులు వంటి వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. భూ సంబంధిత, విద్యా సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలం.

ఈ జాతకులకు 6 సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. ఆరు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు.

25 సంవత్సరాలలో వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో జీవితం సాఫీగా సాగిపోతుంది. 42 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలిస్తాయి. 49 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా జీవితంలో మళ్లీ సుఖ జీవనం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదము
పూర్వాభాద్ర నక్షత్ర నాల్గవ పాద జాతకులకు ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పసుపు వర్ణ, శ్వేతవర్ణ వస్తు సంబంధిత ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాలు అనుకూలం. ఔషధ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఈ జాతకులకు 2 సంవత్సరాల వరకు మాత్రమే గురు దశ ఉంటుంది. రెండు సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కారణంగా విద్యలో మందకొడితనం నెలకొంటుంది. పట్టుదలతో విద్యలో విజయం సాధించవచ్చు. జీవితంలో నిదానంగా స్థిరపడతారు.

21 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో ఉన్నత విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది. సకాలంలో జీవితంలో స్థిరపడతారు. జీవితం సాఫీగా సాగిపోతుంది. 38 సంవత్సరాల తరువత వచ్చే కేతు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కేతు దశ అనుకూలంగా ఉంటే విదేశీ పర్యటనలు, తీర్ధయాత్రలు అనుకూలమవుతాయి. 45 సంవత్సరాల తరువాత వచ్చే శుక్రదశ కారణంగా మళ్లీ సుఖ జీవనం మొదలవుతుంది. మిగిలిన జీవితం, వృద్ధాప్య దశ సాఫీగా సాగిపోతుంది.

పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పెంచవల్సిన చెట్టు
పూర్వాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టుని పెంచడం చాలా మంచిది మరియు శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి, కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్థిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది. గురువుకు అధిపతి దక్షిణామూర్తి, దత్తుడు. గురువుకు శనగలు దానం, పసుపు రంగు వస్త్రం దానం మంచిది.

పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల తారా ఫలాలు :
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - శరీరశ్రమ

సంపత్తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - ధన లాభం

విపత్తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - కార్యహాని

సంపత్తార - అశ్విని, మఖ, మూల - క్షేమం

ప్రత్యక్ తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - ప్రయత్న భంగం

సాధన తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - రోహిణి, హస్త, శ్రవణం - బంధనం

మిత్ర తార - మృగశిర, చిత్త, ధనిష్ట - సుఖం

అతిమిత్ర తార - ఆరుద్ర, స్వాతి, శతభిష - సుఖం, లాభం

అంశ గుణాలు :
1. సేవాంశ : పూర్వాభాద్ర నక్షత్ర ప్రధమ పాదం కుజుడిది. ఈ జాతకులు ఉద్యోగస్తులు, పూజ చేయువారు.

2. భోగాంశ : పూర్వాభాద్ర నక్షత్ర ద్వితీయ పాదం శుక్రుడిది. ఈ జాతకులు సాహసవంతులు, మంత్రోపాసన చేయువారు.

3. విచక్షణాంశ : పూర్వాభాద్ర నక్షత్ర తృతీయ పాదం బుధుడిది. ఈ జాతకులు పితృ ప్రియులు, జ్ఞానవంతులు.

4. ధనాంశ : పూర్వాభాద్ర నక్షత్ర చతుర్ధ పాదం చంద్రుడిది. ఈ జాతకులు అందరిచేత కీర్తింపబడేవారు, ధనవంతులు, మాతృ సేవకులుగా ఉంటారు.

నక్షత్ర శాంతి: 
కొంత నెయ్యి ఒంటరిగా జీవించే సత్పురుషులకి ఇవ్వవలెను.

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
అజ ఏక పాదుద'గాత్పురస్తా”త్ ।
విశ్వా' భూతాని' ప్రతి మోద'మానః ।
తస్య' దేవాః ప్రసవం యంతి సర్వే" ।
ప్రోష్ఠపదాసో' అమృత'స్య గోపాః ।
విభ్రాజ’మానస్సమిధా న ఉగ్రః ।
ఆంతరి'క్షమరుహదగంద్యామ్ ।
తగ్మ్ సూర్యం' దేవమజమేక' పాదమ్ ।
ప్రోష్ఠపదాసో అను’యంతి సర్వే" ॥

నక్షత్ర గాయత్రి
ఓం తేజస్కరాయ విద్మహే 
అజరక పాదాయ ధీమహి 
తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – ముక్తేశ్వరంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి.
రెండవ పాదం – శాసనపల్లి లంకలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి.
మూడవ పాదం – తానెలంకలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి.
నాలుగవ పాదం ఎర్రపోతవరంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి.

Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...