Sunday, August 16, 2026

Deeksha Pradanam - దీక్షా ప్రదానం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - దీక్షా ప్రదానం

నారాయణమహర్షీ! రకరకాల పూజలూ ధ్యానాలూ అనుష్ఠానాలూ వివరంగా తెలియజేశావు. కానీ వాటికి సంబంధించిన దీక్షావిధానం ఏమిటి? అది కొంచెం వివరించు.

నారదా! ఏ వ్రతానికైనా దీక్షముఖ్యం. అది లేనిదే పూజచేసే అధికారమే సిద్ధించదు. దీక్ష దివ్యజ్ఞానాన్ని ఇస్తుందనీ పాపాలను క్షయింపజేన్తుందనీ వేదతంత్రవిశారదులు నిర్వచించారు.

కనక దేవ గురు వహ్నిపూజాదులన్నింటికీ దీక్షాస్వీకారం తప్పనిసరి. దీక్షను ఇచ్చినవారూ పుచ్చుకున్నవారూ కూడా విశుద్ధులవుతారు.

దీక్షనిచ్చే గురువు ప్రాతఃకాలంలో స్నానసంధ్యాధికమంతా యథావిధిగా ముగించుకుని కమండలువులో జలం నింపుకుని మౌనిగా నదీతీరంనుంచి ఇంటికి రావాలి. సరాసరి యాగమంటపం దగ్గరలో సముచితాసనంమీద కూర్చోవాలి. ఆచమించాలి. ప్రాణాయామం చెయ్యాలి. 

కమండలుజలంలో గంధపుష్పాలు కలుపుతూ అస్త్ర మంత్రాన్ని ఏడుసార్లు జపించాలి. ఆదే మంత్రాన్ని పఠిస్తూ ఆ నీళ్ళతో యాగమంటపాన్ని సంప్రోక్షించాలి. ఊర్ద్వోదుంబరంలో గణపతిపూజ చెయ్యాలి. లక్ష్మీసరస్వతులను పువ్వులతో ఆర్చించాలి. 

ద్వార దక్షిణభాగాన గంగా గణపతులనూ వామభాగాన యమునా - క్షేత్ర పాలకులనూ నిక్షేపించి అర్చించాలి. గుమ్మంలో ఆస్త్ర మంత్రంతో అస్త్రదేవతను పూజించాలి. మంటపమంతా దేవీమయమైనట్టు భావించాలి. 

అదే మంత్రం చదువుతూ అంతరిక్షగత - భూమిగత విఘ్నాలను పారద్రోలాలి. అప్పుడు గుమ్మం ఎడమ భాగాన్ని తాకుతూ కుడికాలు మెట్టి లోపలికి ప్రవేశించాలి.

కలశం స్థాపించాలి. సామాన్యార్ఘ్యం నిర్వహించాలి. ఆ జలంతో నైరృతిదిశలో వాస్తునాథుడినీ బ్రహ్మదేవుణ్ణీ గంధపుష్పాక్షతలతో అర్చించాలి. అదే జలంతోనూ పంచగవ్యంతోనూ తోరణస్తంభం వరకూ మండపంలోపల సంప్రోక్షించాలి. అంతా దేవీమయమైనట్టు హృదయంలో భావించాలి. 

భక్తితో మూలమంత్రం జపిస్తూ దర్భలతో అంతటా నీళ్ళు చిలకరించాలి. శరమంత్రం పఠిస్తూ మంటపంలోపలి నేలను చరవాలి (తాటించాలి). హుం మంత్రం పఠిస్తూ అభ్యుక్షణం చెయ్యాలి. ధూపంవేసి వికారాలను పారద్రోలాలి. దర్భలతో మార్జని చేసి అంతటా అన్నింటినీ సమ్మార్జించాలి. ఈశాన్యదిక్కున మార్జించి "తత్పుంజం" స్థాపించి పుణ్యాహవాచనంచేసి దీనానాథులను తృప్తిపరచాలి.

అటుపైని మెత్తని ఆసనంమీద తూర్పుముఖంగా కూర్చుని తన గురువునూ దేయమంత్రదేవతనూ ధ్యానించి నమస్కరించాలి. భూతశుద్ధి చేసుకుని దేయమంత్రానికి ఋష్యాదిన్యాసం చెయ్యాలి. ఋషిని శిరోభాగాన, ఛందస్సును ముఖభాగాన, అధిదేవతను హృదయపద్మాన, బీజాక్షరాన్ని గుహ్యభాగాన, శక్తిని పాదద్వయాన విన్యసించాలి. 

మూడుసార్లు చప్పట్లు కొట్టి దిగ్బంధం చెయ్యాలి. ఛోటికాత్రయ పూర్వకంగా (చిటికెలు) ప్రాణాయామం చేసి మూలమంత్రంతో స్వశరీరంలో మాతృకాన్యానం చెయ్యాలి. 

ఓం అం శిరసే నమః ఇత్యాదిగా క్రమపద్ధతిలో ఈ న్యాసం జరగాలి. ఇలాగే మూలమంత్రాన్ని షడంగంగా కరాంగుళీ హృదయాదుల్లో న్యసించాలి. ప్రణవాక్షరపూర్వకాలూ నమః - స్వాహా - వషట్‌ - హుం - వౌషట్‌ - ఫట్‌ పదాంతాలూ అయిన ఆరుమంత్రాలతో చేసే న్యాసాన్ని షడంగకం అంటారు.

అటు పైని మూలమంత్ర వర్ణన్యాసంకూడా తత్తత్‌ కల్ఫోక్తప్రకారంగా చెయ్యాలి. అయ్యాక స్వశరీరంలో శుభాసనాన్ని సంభావించాలి. అందులో దక్షిణభుజాన ధర్మాన్ని వామభుజాన జ్ఞానాన్ని ఎడమతొడలో వైరాగ్యాన్ని కుడితొడలో ఐశ్వర్యాన్ని ముఖంలో అధర్మాన్ని - ఇలాగే ఆయా భాగాలలో ఆయా అంశాలను నియమానుసారం విన్యసించాలి. ఈ సింహాసనానికి ధర్మార్ధ కామమోక్షాలు నాలుగు కోళ్ళు. అధర్మాదులు శరీరం.

ఈ సింహాసనంలో మధ్యభాగం హృదయం. అది మృదువు. కనక అక్కడ అనంతరూపమైన ప్రపంచపద్మాన్ని విన్యసించాలి. (అనంతుణ్ణీ ప్రపంచపద్మాన్నీ అనిగానీ). ఆ నిర్మల పద్మంలో సూర్య చంద్ర - పావకులను కళలతోసహా సమంత్రకంగా న్యసించాలి.

సూర్యుడికి పన్నెండు చంద్రుడికి పదహారు అగ్నికి పది కళలుంటాయని పెద్దలు చెప్పారు. వాటితోసహా వారిని ధ్యానించాలి.

ఈ ముగ్గురికీ పైని సత్వరజస్తమోగుణాలను సంభావించాలి. ఆత్మ - ఆంతరాత్మ - పరమాత్మ - జ్ఞానాత్మలను న్యసించాలి. ఇది పీఠకల్పన. అముకాసనాయ నమః ఇత్యాది మంత్రంతో ఆసనపూజచేసి దానిమీదకు పరాంబికను ధ్యానించి ఆవాహన చెయ్యాలి.

దేయమంత్ర అధిదేవతనుకూడా ఇలాగే కల్పోక్త ప్రకారంగా ఆవాహనచేసి మానసోపచారాలతో అర్చించాలి. ముద్రలు ప్రదర్శించాలి. అవి దేవికి ఆనందకారకాలు.

అటుపైన (శరీర - మండప) వామభాగాగ్రంలో షట్కోణమండలాన్నీ దానిలో వర్తుల మండలాన్నీ దాని మధ్యలో చతురస్ర మండలాన్నీ దాని నడుమ త్రికోణమండలాన్నీ (భావనారూపంగా) లిఖించాలి.

అందులో శంఖముద్రను ప్రదర్శించాలి. షట్కోణాలలో షడంగాలను పూలతో పూజించాలి. ఆగ్నేయాది కోణాలలో ఈ షడంగకార్చన చెయ్యాలి. శంఖానికున్న ఆధారపాత్రను తీసి అస్త్రమంత్రోదకంతో ప్రోక్షించి ఆ మండలంలో స్థాపించాలి. 

మం వహ్నిమండలాయ అనే మంత్రంతో దశకళాత్మకుడైన అగ్నిని అర్చించాలి. (శంఖ) ఆధారపత్ర స్థాపనలో అముకదేవ్యా ఆర్ఘ్యపాత్రస్థానాయ నమః ఆంటూ ఆ మంత్రాన్ని పఠించాలి. ఈ ఆధారపాత్రకు తూర్పునుంచి ఆరంభించి ప్రదక్షిణక్రమంలో ఆగ్నికళలు పదింటికీ పూజచెయ్యాలి, 

అటుపైని మూలమంత్రంతో శంఖాన్ని ప్రోక్షించి ఆధారపాత్రలో ఉంచాలి. అప్పుడూ మూలమంత్రమే పఠించాలి. ఆం సూర్యమండలాయ అనే మంత్రంతో ద్వాదశకళలూ అర్చించాలి. అముకదేవ్యర్ఘ్యపాత్రాయ నమః అనాలి. 

శం శంఖాయ నమః అంటూ శంఖాన్ని ప్రోక్షించి ఆందులో సూర్యుడి పన్నెండు కళలకూ కుసుమార్చన చెయ్యాలి. విలోమమాతృకను విలోమ మూలమంత్రంతో ధ్యానించాలి. శంఖంలో నీళ్ళు నింపి చంద్రకళాన్యాసం చెయ్యాలి. 

ఉం సోమమండలాయ నమః అనే దానితో మొదలుపెట్టి అముకార్ఘ్యామృతాయ అనే హృన్మంత్రంవరకూ ఆయా మంత్రాలను ఉచ్చరిస్తూ షోడశకలాత్మకుడిని అర్చించాలి. అదే మంత్రంతో సృణిముద్రతో జలార్చన చెయ్యాలి. సకల తీర్థాలనూ శంఖజలంలోకి ఆవాహనచేసి ఎనిమిదిసార్లు మంత్రోచ్చారణ జరపాలి. 

షడంగాలనూ ఆ జలంలో విన్యసించి హృదయస్థానంలో ఈ జలార్చన చెయ్యాలి. మత్స్యముద్రతో శంఖంపైన ఆచ్చాదన పట్టి మూలమంత్రాన్ని ఎనిమిదిసార్లు జపించాలి. ఆ పైని దక్షిణదిగ్భాగంలో శంఖప్రోక్షణిని ఉంచాలి. శంఖంలోని నీళ్ళు కొంచెంగా ప్రోక్షణిలో పోసి అంతటా జల్లాలి.

ఈ సంప్రోక్షణతో ప్రదేశమూ తానూ పూజాద్రవ్యాలూ విశుద్ది పొందినట్లు భావించాలి.

అటుపైని గురువుగారు తన ఎట్టయెదుట ఉన్న వేదికపై సర్వతోభద్రమండలాన్ని లిఖించాలి. కర్ణికామధ్యం లిఖించి అందులో తెల్లటి బియ్యం నింపాలి. వాటిమీద దర్భలు పరిచి సలక్షణమైన కూర్చను ఉంచాలి. ఆధారశక్తితో ఆరంభించి పీఠమంత్రాంతంగా అర్చన చెయ్యాలి. 

చిల్లులూ బొడిపెలూలేని కొత్త కుంభం తెచ్చి అస్త్రజలంతో క్షాళన చెయ్యాలి. మూడుపేటల ఎరుపుదారంతో తంతువేష్టనం చేసి తారమంత్రం ఉచ్చరిస్తూ నవరత్న కూర్చ గంధపుష్పాదుల్ని ఆ కుండంలో వెయ్యాలి. పీఠానికీ కుంభానికీ ఐక్యాన్ని భావించాలి.

ప్రతిలోమమంత్రోచ్చారణ చేస్తూ ఆ తీర్థోదకాలతో మాతృకాపూజ చెయ్యాలి. మూలమంత్రం జపిస్తూ ఆ కుంభాన్ని దేవతగా అర్చించాలి. రావి - పనస - మామిడి చిగుళ్ళతో కుంభవదనాన్ని ఆచ్చాదించాలి.

చషకంలో (చిన్నపాత్ర) పళ్ళూ అక్షతలూ ఉంచి వస్త్రయుగ్మం చుట్టి ప్రాణస్థాపనమంత్రంతో ప్రాణస్థాపన చెయ్యాలి. ఆవాహనాది ముద్రలు పట్టి ఆ పరాంబికను ఆనందపరచాలి. అటుపైని కల్పోక్త ప్రకారంగా పరమేశానిని ధ్యానించాలి. ముందుగా స్వాగతం పలికి కుశలప్రశ్నలు వెయ్యాలి. 

పాద్యం అర్ఘ్యం ఆచమనం మధుపర్కం అభ్యంగనస్నానం రక్త క్షౌమ వస్త్రయుగ్మం మణిభూషలు - ఇత్యాదిగా షోడశోపచారాలూ చెయ్యాలి. మాతృకార్చనా విధానంలో సంపుటిత వర్ణమంత్రాలతో ఈ ఉపచారాలు శ్రద్ధగా జరపాలి. ఇది అయ్యాక నైవేద్యం సమర్పించాలి.

ప్రతిద్రవ్యాన్నీ కేవలం ప్రోక్షణీజలంతోనే సంప్రోక్షించి నివేదించాలి. మరింక ఏ పాత్రలో నీరూ వాడకూడదు. ఆ తరవాత నవావరణ సాంగదేవీపూజ నిర్వర్తించి వైశ్వదేవం చెయ్యాలి. దక్షిణ దిగ్భాగాన స్థండిలం ఏర్పాటుచేసి అగ్నిని నిక్షేపించాలి.

మూర్తిలో ఉన్నదేవతను ఆక్కడకు ఆవాహన చెయ్యాలి. పూజించాలి. ఆహృతులతో మూలమ౦త్రంతో హోమం చెయ్యాలి. నేతిపాయసాన్ని పాతికసార్లు హోమంచేసి కొసరుగా వ్యాహృతులతో పునర్హొమం చెయ్యాలి. గంధాదులతో అర్చించి దేవిని మళ్ళీ పీఠంమీద పెట్టాలి. 

అగ్నికి విసర్జన చెప్పి దశదిశలకూ బలి చల్లాలి. దేవీపార్షదులకు పంచోపచారాలు చేసి తాంబూలం ఛత్రం చామరం దేవికి సమర్పించాలి. మూలమంత్రాన్ని వెయ్యిసార్లు జపించాలి. ఆ జపాన్ని అమ్మవారికి సమర్పించాలి. 

ఆటు పైని ఈశాన్యకోణంలో వికిరం చెయ్యాలి. కర్కరిని స్థాపించి దుర్గను ఆవాహనచేసి పూజించాలి. రక్ష రక్ష అనాలి. అస్త్రమంత్రమే జపిస్తూ ప్రదక్షిణగా మంత్రోదకం జల్లి అక్కడ కర్కరిని ఉంచి ఆస్త్రదేవతను ఆరాధించాలి. అంతా అయ్యాక గురుశిష్యులిద్దరూ మౌనంగా భోజనం చెయ్యాలి. ఆ రాత్రికి ఆ యాగశాలలో వేదికపై నిద్రించాలి.

స్థండిల కుండ సంస్కారాలు





Gayatri Ashtottara Sahasram - గాయత్రీ అష్టోత్తర సహస్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ అష్టోత్తర సహస్రం

గాయత్రీ సహస్ర నామావళి
నారదా! మహర్షీ! సాధు సాధు. అడగవలసింది అడిగావు. నువ్వు మహాప్రాజ్ఞుడివి. సందేహంలేదు. కనకనే చెబుతున్నాను, ఆలకించు. నీ సందేహాలు మూడింటికీ ఒక్కటే సమాధానం. ఒక్కటే సాధనం. అదే శ్రీగాయత్రీ అష్టోత్తర సహస్రనామమాల. సృష్టికి ఆదిలో భగవంతు డుపదేశించిన సహస్రనామాలను నీకు ఉపదేశిస్తున్నాను.

వీటిని జపించడం విద్యాప్రదం. బ్రహ్మజ్ఞానదాయకం. భుక్తిముక్తి ప్రదం. దీనికి ఋషి సాక్షాత్తూ చతుర్ముఖుడు. గాయత్రియే అధిదేవత. ఛందస్సు అనుష్టుప్పు. హల్లులన్నీ బీజాక్షరాలు. స్వరాలన్నీ(అచ్చులు) శక్తులు. మాతృకాక్షరాలతో అంగన్యాసకరన్యాసాలు. సాధకుల హితం కోరి ముందుగా ధ్యానశ్లోకం చెప్పి, తరవాత సహన్రనామమాల చెబుతాను. 

రక్తశ్వేతహిరణ్య నీలధవళైర్యుక్తాం త్రినేత్రోజ్జ్వలామ్‌
రక్తాం రక్తనవప్రజం మణిగణైర్యుక్తాం కుమారీమిమామ్‌ ।
గాయత్రీం కమలాసనాం కరతలన్యావద్ధకుండాంబుజామ్‌
పద్మాక్షీం చ వరస్రజం చ దధతీం హంసాధిరూఢాం భజే ॥

ఆచింత్యలక్షణా 
అవ్యక్తా అర్థమాతృమహేశ్వరీ అమృతార్ణవమధ్యస్థా అజితా ఆపరాజితా 
అణిమాదిగుణాధారా అర్కమండలసంస్థితా అజరాజా అపరాధర్మా అక్షసూత్రధరా అధరా 
అకారాది క్షకారాంతా అరిషడ్వర్గభేదినీ అంజనాద్రిప్రతీకాశా అంజనాద్రి నివాసినీ అదితిః అజపా 
అవిద్యా ఆరవిందనిభేక్షణా అంతర్బహిస్థితా అవిద్యాధ్వంసినీ అంతరాత్మికా అజా ఆజముఖావాసా 
అరవిందనిభాననా అర్ధమాత్రా అర్థదా అనజ్ఞా అరిమండలమర్దినీ ఆసురఘ్నీ ఆమావాస్యా అలక్ష్మీఘ్నీ ఆత్యజార్చితా 

ఆదిలక్ష్మీః ఆదిశక్తిః ఆకృతిః ఆయతాననా(అయుతాననా) ఆదిత్యపదవీచారా ఆదిత్యపరిసేవితా ఆచార్యావర్తనా ఆచారా ఆదిమూర్తివాసినీ ఆగ్నేయా ఆమరీ ఆద్యా ఆరాధ్యా ఆసనస్థితా ఆధారనిలయా 50) ఆధారా ఆకాశాంతనివాసినీ ఆద్యాక్షరసమాయుక్తా ఆంతరాకాశరూపిణీ ఆదిత్యమండలగతా అంతరధ్వాంతనాశినీ 

ఇందిరా ఇష్టదా ఇష్టా ఇందీవరనిభేక్షణా ఇరావతీ ఇంద్రపదా ఇంద్రాణీ ఇంద్రరూపిణీ ఇక్షుకోదండసంయుక్తా ఇషుసంధానకారిణీ ఇంద్రనీలసమాకారా ఇడాపింగళరూపిణీ ఇంద్రాక్షీ ఈశ్వరీ ఈహాత్రయవివర్జితా

ఉమా ఉషా ఉడునిభా ఉర్వారుకఫలాననా ఉడుప్రభా ఉడుమతీ ఉడుపా ఉడుమధ్యగా ఊర్ధ్వా ఊర్ధ్వకేశీ ఊర్థ్వాధోగతిభేదినీ ఊర్థ్వబాహు (క్రి) ప్రియా ఊర్మిమాలావాగ్రంథదాయినీ 

ఋతం ఋషిః ఋతుమతీ ఋషిదేవనమస్కృతా ఋగ్వేదా ఋణహర్త్రీ ఋషిమండలచారిణీ ఋద్ధిదా ఋజుమార్గస్థా ఋజుధర్మా ఋతుప్రదా ఋగ్వేదనిలయా ఋజ్వీ ఌప్తధర్మప్రవర్తినీ ఌతారివరసంభూతా ఌతాదివిషహారిణీ (100) 

ఏకాక్షరా ఏకమాత్రా ఏకా ఏకైకనిష్ఠితా ఐంద్రీ ఐరావతారూఢా ఐహికాముష్మికప్రదా 

ఓంకారా ఓతా ఓతప్రోతనివాసినీ ఔర్వా ఔషధసంపన్నా ఔపాసనఫలప్రదా, అండమధ్య స్థితా అఃకారమనురూపిణీ

కాత్యాయనీ కాళరాత్రిః కామాక్షీ కామసుందరీ కమలా కామినీ కాంతా కామదా కలకంఠినీ కరికుంభస్తనభరా కరవీరసువాసినీ కల్యాణీ కుండలవతీ కురుక్షేత్రనివాసినీ కురువిందదళాకారా కుండలీ కుముదాలయా కాలజిహ్వా కరాళాస్యా కాళికా కాలరూపిణీ కమనీయగుణా కాంతిః కాలధారా కుముద్వతీ కౌశికీ కమలాకారా కామచారప్రభంజినీ కౌమారీ కరుణాపాంగీ కకుబంతా కరిప్రియా కేసరీ కేశవనుతా కదంబ కుసుమప్రియా (150) కాళిందీ కాళికా కాంచీ కలశోద్భవసంస్తుతా కామమాతా క్రతుమతీ కామరూపా కృపావతీ కుమారీ కుండనిలయా కిరాతీ కీరవాహనా కైకేయీ కోకిలాలాపా కేతకీకుసుమప్రియా కమండలుధరా కాళీ కర్మనిర్మూలకారిణీ కలహంసగతిః కక్షా కృతకౌతుకమంగళా కస్తూరీతిలకా కమ్రా కరీంద్రగమనా కుహూః కర్పూరలేపనా కృష్ణా కపిలా కుహరాశ్రయా కూటస్థా కుధరా (కమ్రా) కుక్షిస్థాఖిలవిష్టరా 

ఖడ్గఖేటకరా ఖర్వా ఖేచరీ ఖగవాహనా ఖట్వాంగధారిణీ ఖ్యాతా ఖగరాజోపరిస్థితా ఖలఘ్నీ ఖండితజరా ఖండాఖ్యానప్రదాయినీ ఖండేందుతిలకా

గంగా గణేశగుహపూజితా గాయత్రీ గోమతీ గీతా గాంధారీ గానలోలుపా (200) గౌతమీ గామినీ గాథా గంధర్వాప్సరసేవితా గోవిందచరణాక్రాంతా గుణత్రయవిభావితా గంధర్వీ గహ్వారీ గోత్రా గిరీశా గహనా గమీ గుహావాసా గుణవతీ గురుపాపప్రణాశినీ గుర్వీ గుణవతీ గుహ్యా గోప్తవ్యా గుణదాయినీ గిరిజా గుహ్యమాతంగీ గరుడధ్వజవల్లభా గర్వాపహారిణీ గోదా గోకులస్థా గదాధరా గోకర్ణనిలయాసక్తా గుహ్యమండలవర్తినీ ఘర్మదా ఘనదా ఘంటా ఘోరదానవమర్దినీ ఘృణిమంత్రమయీ ఘోషా ఘనసంపాతదాయినీ ఘంటారవప్రియా ఘ్రాణా ఘృణిసంతుష్టకారిణీ ఘనారిమండలా ఘూర్ణా ఘృతాచీ ఘనవేగినీ జ్ఞనధాతుమయీ

చర్చా చర్చితా చారుహాసినీ చటులా చండికా చిత్రా (250) చిత్రమాల్యవిభూషితా చతుర్భుజా చారుదంతా చాతురీ చరితప్రదా చూళికా చిత్రవస్త్రాంతా చంద్రమఃకర్ణకుండలా చంద్రహాసా చారుదాత్రీ చకోరీ చంద్రహాసినీ చంద్రికా చంద్రధాత్రీ చౌరీ చౌరా చండికా చంచద్వాగ్వాదినీ చంద్ర చూడా చోరవినాశినీ చారుచందనలిప్తాంగీ చంచచ్చామరవీజితా చారుమధ్యా చారుగతిః చండిలా చంద్రరూపిణీ చారుహోమప్రియా చార్వాచరితా చక్రబాహుకా చంద్రమండలమధ్యస్థా చంద్రమండలదర్పణా చక్రవాకస్తనీ చేష్టా చిత్రా చారువిలాసినీ చిత్స్వరూపా చంద్రవతీ చంద్రమాః చందనప్రియా చోదయిత్రీ చిరప్రజ్ఞా చాతకా చారు హేతుకీ ఛత్రయాతా ఛత్రధరా ఛాయా ఛందఃపరిచ్చదా ఛాయాదేవీ ఛిద్రనఖా ఛన్నేంద్రియవిసర్పిణీ (300) ఛందో
నుష్టుప్ప్రతిష్ఠాంతా ఛిద్రోపద్రవభేదినీ ఛేదా ఛత్రేశ్వరీ ఛిన్నా ఛురికా ఛేదనప్రియా

జననీ జన్మరహితా జాతవేదా జగన్మయీ జాహ్నవీ జటిలా జేత్రీ జరామరణవర్జితా జంబూద్వీపవతీ జ్వాలా జయంతీ జలశాలినీ జితేంద్రియా జితక్రోధా జితామిత్రా జగత్ప్రియా జాతరూపమయీ జిహ్వా జానకీ జగతీ జరా జనిత్రీ జహ్నుతనయా జగత్త్రయహితైషిణీ జ్వాలాముఖీ జపవతీ జ్వరఘ్నీ జితవిష్టపా జితాక్రాంతమయీ జ్వాలా జాగ్రతీ జ్వరదేవతా జ్వలంతీ జలదా జ్యేష్ఠా జ్యాఘోషాస్ఫోటదిఙ్ముఖీ జంభిని జృంభణా జృంభా జ్వలన్మాణిక్యకుండలా ఝిం
ఝికా ఝణనిర్ఘోషా ఝంఝామారుతవేగినీ (350) ఝల్లరీవాద్యకుశలా ఞరూపా ఞభుజా

టంకబాణసమాయుక్తా టంకినీ టంకభేదినీ టంకీగుణకృతాఘోషా టంకనీయమహోరసా టంకారకారిణీ ఠఠశబ్దనినాదినీ డామరీ డాకినీ డింభా డుండుమారైకనిర్జితా డామరీతంత్రమార్గస్థా డమడ్డమరునాదినీ డిండీఖసహా డింభలసత్క్రీడాపరాయణా డుంఠివిఘ్నేశజననీ ఢక్కహస్తా ఢిలివ్రజా నిత్యజ్ఞానా నిరుపమా నిర్గుణా నర్మదా నదీ

త్రిగుణా త్రిపదా తంత్రీ తులసీ తరుణా తరుః త్రివిక్రమపదాక్రాంతా తురీయపదగామినీ తరుణాదిత్యసంకాశా తామసీ తుహినాతురా త్రికాలజ్ఞానసంపన్నా త్రివళీ త్రిలోచనా త్రిశక్తిః త్రిపురా తుంగా తురంగవదనా తిమింగిలగిలా తీవ్రా త్రిప్రోతా తామసాదనీ తంత్రమంత్రవిశేషజ్ఞా (400) తనుమధ్యా త్రివిష్టపా త్రిసంధ్యా త్రిస్తనీ తోషాసంస్థా తాళప్రతాపినీ తాటంకినీ తుషారాభా తుహినాచలవాసినీ తంతుజాలసమాయుక్తా తారహారావళిప్రియా తిలహోమప్రియా తీర్థా తమాలకుసుమాకృతిః తారకా త్రియుతా తన్వీ త్రిశంకుపరివారితా తలోదరీ తిరోభూ(భా)షా తాటంకప్రియవాదినీ త్రిజటా తిత్తిరీ తృష్ణా త్రివిధా తరుణాకృతిః తప్తకాంచనసంకాశా తప్తకాంచనభూషణా త్రైయంబకా త్రివర్ణా త్రికాలజ్ఞానదాయినీ తర్పణా తృప్తిదా తృప్తా తామశీ తుంబురుస్తుతా తార్‌క్ష్యస్థా త్రిగుణాకారా త్రిభంగీ తనువల్లరిః థాత్కారీ థారవా థాంతా

దోహినీ దీనవత్సలా దానవాంతకరీ దుర్గా దుర్గాసురనిబర్హిణీ దేవరీతిః దివారాత్రిః ద్రౌపదీ (450)
దుందుభిస్వనా దేవయానీ దురావాసా దారిద్య్రోద్భేధిని దివా దామోదరప్రియా దీప్తా దిగ్వాసా దిగ్విమోహినీ దండకారణ్యనిలయా దండినీ దేవపూజితా దేవవంద్యా దివిషదా ద్వేషిణీ దానవాకృతిః దీనానాథస్తుతా దీక్షా దైవతాదిస్వరూపిణీ ధాత్రీ ధనుర్ధరా ధేనుః ధారిణీ ధర్మచారిణీ ధరంధరా ధరాధారా ధనదా ధాన్యదోహినీ ధర్మశీలా ధనాధ్యక్షా ధర్మవేదవిశారదా ధృతిః ధన్యా ధృతపదా ధర్మరాజప్రియా ధ్రువా ధూమావతీ ధూమకేశీ ధర్మశాస్త్రప్రకాశినీ

నందా నందప్రియా నిద్రా నృనుతా నందనాత్మికా నర్మదా నళినీ నీలా నీలకంఠసమాశ్రయా నారాయణప్రియా నిత్యా (500) నిర్మలా నిర్గుణా నిధిః నిరాధారా నిరుపమా నిత్యశుద్ధా నిరంజనా నాదబిందుకళాతీతా నాదబిందుకళాత్మికా నృసింహినీ నగధరా నృపనాగవిభూషితా నరకక్లేశశమనీ నారాయణపదోద్భవా నిరవద్యా నిరాకారా నారదప్రియకారిణీ నానాజ్యోతిస్సమాఖ్యాతా నిధిదా నిర్మలాత్మికా నవసత్రధరా నీతిః నిరుపద్రవకారిణీ నందజా నవరత్నాఢ్యా నైమిశారణ్యవాసినీ నవనీతప్రియా నారీ, నీలజీమూతనిస్వనా, నిమేషినీ నదీరూపా నీలగ్రీవా నిశీశ్వరీ నామావళిః నిశుంభఘ్నీ నాగలోకనివాసినీ తప్తజాంబూనదప్రఖ్యా నాగలోకాధిదేవతా నూపురాక్రాంతచరణా నరచిత్తప్రమోదినీ నిమగ్నారక్తనయనా నిర్ఘాతసమనిస్వనా నందనోద్యాననిలయా నిర్వ్యూహోపరిచారిణీ

పార్వతి పరమోదారా పరబ్రహ్మాత్మికా పరా పంచకోశవినిర్ముక్తా (550) పంచపాతకనాశినీ పరచిత్తవిధానజ్ఞా పంచికా పంచరూపిణీ పూర్ణిమా పరమా ప్రీతిః పరతేజఃప్రకాశినీ పురాణీ పౌరుషీ పుణ్యా పుండరీకనిభేక్షణా పాతాళతలనిర్మగ్నా ప్రీతా, ప్రీతివివర్ధిన, పావనీ పాదసహితా పేశలా పవనాశినీ ప్రజాపతిః పరిశ్రాంతా పర్వతస్తనమండలా పద్మప్రియా పద్మసంస్థా పద్మాక్షీ పద్మసంభవా పద్మపత్రా పద్మపదా పద్మినీ ప్రియభాషిణీ, పశుపాశ వినిర్ముక్తా, పురంధ్రీ పురవాసినీ పుష్కలా పురుషా పర్వా, పారిజాత సుమప్రియా, పతివ్రతా పవిత్రాంగీ పుష్పహాసపరాయణా, ప్రజ్ఞావతీ - సుతా, పౌత్రీ పుత్రపూజ్యా పయస్వినీ పట్టిపాశధరా పంక్తిః పితృలోకప్రదాయినీ పురాణీ పుణ్యశీలా ప్రణతార్తివినాశినీ (600) ప్రద్యుమ్నజననీ పుష్టా పితామహపరిగ్రహా పుండరీకపురావాసా పుండరీకసమాననా పృథుజంఘా పృథుభుజా పృథుపాదా పృథూదరీ ప్రవాళశోభా పింగాక్షీ పీతావాసాః ప్రచాపలా ప్రసవా పుష్టిదా పుణ్యా ప్రతిష్ఠా ప్రణవాగతిః పంచవర్ణా పంచవాణీ పంచికా పంజరస్థితా పరమాయా పరజ్యోతిః పరప్రీతిః పరాగతిః పరాకాష్ఠా పరేశానీ పావినీ పావకద్యుతిః పుణ్యభద్రా పరిచ్చేదా పుష్పహాసా (పృథూదరీ) పీతాంగీ పీతవసనా పీతశయ్యా పిశాచినీ పీతక్రియా పిశాచఘ్సీ పాటలాక్షీ పటుక్రియా పంచభక్షప్రియాచారా పూతనాప్రాణఘాతినీ పున్నాగవనమధ్యస్థా పుణ్యతీర్దనిషేవితా పంచాంగీ పరాశక్తిః పరమాహ్లాదకారిణీ పుష్పకాండ స్థితా పూషా (650) పోషితాఖిలవిష్టపా పానప్రియా పంచశిఖా పన్నగోపరిశాయినీ పంచమాత్రాత్మికా పృథ్వీ పథికా పృథుదోహనీ పురాణన్యాయమీమాంసా పాటలీపుష్పగంధినీ పుణ్యప్రజా పారదాత్రీ పరమార్గైకగోచరా ప్రవాళశోభా పూర్ణాశా ప్రణవా పల్లవోదరీ ఫలినీ ఫలదా ఫల్గుః పూత్కారీ ఫలకాకృతిః ఫణీంద్రభోగశయనా ఫణిమండలమండితా

బాలబాలా బహుమతా బాలాతపనిభాంశుకా బలభద్రప్రియా వంద్యా బడబా బుద్దిసంస్తుతా బందీ బిలవతీ బడిశఘ్నీ బలిప్రియా బాంధవీ బోధితా బుద్ధిః బంధూక కుసుమప్రియా బాలభానుప్రభాకారా బ్రాహ్మీ బాహ్మణదేవతా బృహస్పతిస్తుతా బృందా బృందావనవిహారిణీ బలాకినీ బిలాహారా బిలవాసా బహూదకా బహునేత్రా (700) బహుపదా బహుకర్ణావతంసికా బహుబాహుయుతా బీజరూపిణీ బహురూపిణీ బిందునాదకళాతీతా బిందునాదస్వరూపిణీ బద్ధగోధాంగుళిత్రాణా బదర్యాశ్రమవాసినీ బృందారకా బృహత్‌స్కంధా బృహతీ బాణపాతినీ బృందాధ్యక్షా బహునుతా బనితా బహువిక్రమా బద్ధపద్మాసనాసీనా బిల్వపత్రతలస్థితా బోధిద్రుమనిజావాసా బడిస్థా బిందుదర్పణా బాలా బాణాసనవతీ బడబానలవెగినీ బ్రహ్మాండబహిరంతఃస్థా బ్రహ్మకంకణ సూత్రిణీ

భవానీ భీషణవతీ భావినీ భయహారిణీ భద్రకాళి భుజంగాక్షీ భారతీ భారతాశయా భైరవి భీషణాకారా భూతిదా భూతిమాలినీ భామినీ భోగనిరతా భద్రదా భూరివిక్రమా భూతవాసా భృగులతా భార్గవీ భూసురార్చితా భాగీరథీ భోగవతీ భవనస్థా (750) భిషగ్వరా (భామినీ) భోగినీ భాషా భవానీ భూరిదక్షిణా భర్గాత్మికా భీమవతీ భవబంధనమోచనీ భయనీయా భూతధాత్రీ (రంజితా) భువనేశ్వరీ భుజంగవలయా భీమా భేరుండా భాగధేయినీ

మాతా మాయా మధుమతీ మధుజిహ్వా మధుప్రియా మహాదేవీ మహాభాగా మాలినీ మీనలోచనా మాయాతీతా మధుమతీ మధుమాంసా మధుధ్రువా మానవీ మధుసంభూతా మిథిలాపురవాసినీ మధుకైటభసంహర్త్రీ మేదినీ మేఘమాలినీ మందోదరీ మహామాయా మైథిలీ మసృణప్రియా మహాలక్ష్మీః మహాకాళీ మహాకన్యా మహేశ్వరీ మాహేంద్రీ మేరుతనయా మందారకుసుమార్చితా మంజుమంజీరచరణా మోక్షదా మంజుభాషిణీ మధురద్రావిణీ ముద్రా (800) మలయా మలయాన్వితా మేధా మరకతశ్యామా మాగధీ మేనకాత్మజా మహామారీ మహావీరా మహాశ్యామా మనుస్తుతా మాతృకా మిహిరాభాసా ముకుందపదవిక్రమా మూలాధారస్థితా ముగ్ధా మణిపూరకవాసినీ మృగాక్షీ మహిషారూఢా మహిషాసురమర్దినీ

యోగాసనా యోగగమ్యా యోగా యౌవనకాశ్రయా యౌవనీ యుద్దమధ్యస్థా యమునా యుగధారిణీ యక్షిణీ యోగయుక్తా యక్షరాజప్రసూతినీ యాత్రా యానవిధానజ్ఞా యదువంశసముద్భవా యకారాదిహకారాంతా యాజుషీ యజ్ఞరూపిణీ యామినీ యోగనిరతా యాతుధానభయంకరీ

రుక్మిణీ రమణీ రామా రేవతీ రేణుకా రతిః రౌద్రీ రౌద్రప్రియాకారా రామమాతా రతిప్రియా రోహిణీ [850) రాజ్యదా రేవా రమా రాజీవలోచనా రాకేశీ రూపసంపన్నా రత్నసింహాసనస్థితా రక్తమాల్యాంబరధరా రక్తగంధానులేపనా రాజహంససమారూఢా రంభా రక్తబలిప్రియా రమణీయయుగాధారా రాజితాఖిలభూతలా రురుచర్మపరీధానా రథినీ రత్నమాలికా రోగేశీ రోగశమని రావిణీ రోమహర్షిణీ రామచంద్రపదాక్రాంతా రావణచ్చేదకారిణీ రక్తవస్త్రపరిచ్చిన్నా రథస్థా రుక్మభూషణా

లజ్జాధిదేవతా లోలా లలితా లింగధారిణీ లక్ష్మీః (లోలా) లుప్తవిషా లోకినీ లోకవిశ్రుతా లజ్జా లంబోదరీ (దేవీ) లలనా లోకధారిణీ

వరదా వందితా విద్యా వైష్ణవీ విమలాకృతిః వారాహీ విరజా వర్షా వరలక్ష్మీః విలాసినీ వినతా వ్యోమమధ్యస్టా (900) వారిజాసనసంస్థితా వారుణీ వేణుసంభూతా వీతిహోత్రా విరూపిణీ వాయుమండలమధ్యస్థా విష్ణురూపా విధిప్రియా విష్ణుపత్నీ విష్ణుమతీ విశాలాక్షీ వసుంధరా వామదేవప్రియా వేలా వజ్రిణీ వసుదోహినీ వేదాక్షరపరీతాంగీ వాజపేయఫలప్రదా వాసవీ వామజననీ వైకుంఠనిలయా వరా వ్యాసప్రియా వర్మధరా వాల్మీకిపరిసేవితా

శాకంభరీ శివా శాంతా శారదా శరణాగతిః శాతోదరీ శుభాచారా శుంభాసురవిమర్దినీ శోభావతీ శివాకారా శంకరార్ధశరీరిణీ శోణా శుభాశయా శుభ్రా శిరస్సంధానకారిణీ శరావతీ శరానందా శరత్‌ జ్యోత్స్నా శుభాననా శరభా శూలినీ శుద్ధశబరీ శుకవాహనా శ్రీమతీ శ్రీధరానందా (950) శ్రవణానందదాయినీ శర్వాణీ శర్వరీవంద్యా షడ్భాషా షడృతుప్రియా షడాధారస్థితా షణ్ముఖప్రియకారిణీ షడంగరూపా 

సుమతిః సురాసురనమస్కృతా సరస్వతీ సదాధారా సర్వమంగళకారిణీ సామగానప్రియా సూక్ష్మా సావిత్రీ సామసంభవా సర్వవాసా సదానందా సుస్తనీ సాగరాంబరా సర్వైశ్వర్యప్రియా సిద్ధిః సాధుబంధుపరాక్రమా సప్తర్షిమండలగతా సోమమండలవాసినీ సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా సర్వోత్తుంగా సంగహీనా సద్గుణా సకలేష్టదా సరఘా సూర్యతనయా సుకేశీ సోమసంహతిః

హిరణ్యవర్ణా హరిణీ హ్రీంకారీ హంసవాహినీ క్షౌమవస్త్రపరీతాంగీ క్షీరాబ్ధితనయా క్షమా

గాయత్రీ సావిత్రీ పార్వతీ సరస్వతీ వేదగర్భా వరారోహా (1000) శ్రీగాయత్రీ పరాంబికా

ఇతి సాహస్రకం నామ్నాం గాయత్య్రాశ్చైవ నారద ।
పుణ్యదం సర్వపాపఘ్నం మహాసంపత్తిదాయకమ్‌ ॥ 

నారదా! ఇది గాయత్రీదేవి నామసహస్రం. అత్యంత పుణ్యప్రదం. సర్వపాప నివారకం. మహాసంపత్ప్రదాయకం. వీటిని జపిస్తే గాయత్రీదేవి ఎంతగానో ఆనందిస్తుంది. అనుగ్రహించి అభీష్ట వరాలు కురిపిస్తుంది. 

అష్టమి తిథినాడు పఠిస్తే విశేషంగా ఫలిస్తుంది. జపం చేసుకుని పూజలూ హోమాలూ ధ్యానాలూ ముగించి ఈ వెయ్యి నామాలనూ పఠిస్తే చాలు భుక్తీ ముక్తీ లభిస్తాయి. ఇది అత్యంత గుహ్యమైన నామసహస్రం. ఎవరికిబడితే వారికి చెప్పెయ్యకూడదు. మంచి భక్తుడవునా కాదా, మంచి శిష్యుడవునా కాదా పరిశీలించి పరీక్షించి అప్పుడు ఉపదేశించాలి. 

భ్రష్టులైన సాధకులకూ బంధువులకూ అస్సలు చెప్పకూడదు. ఈ లిఖితప్రతి ఎవరి ఇంటిలో ఉంటే వారికింక భయమనేదే లేదు. అతిచంచల అనిపించుకునే లక్ష్మీదేవి వారి ఇంటిలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుంది. దరిద్రులకు ఇది నిధి వంటిది. 

ముముక్షువులకు ముక్తిరూపం. రోగార్తులకు దివ్యౌషధం. బంధితులకు బంధవిమోచకం. బ్రహ్మహత్యాది మహాపాపాలను సైతం నశింపజేస్తుంది. అంతేకాదు బ్రహ్మసాయుజ్యాన్ని అందిస్తుంది. ఇది సత్యం. సత్యం. తిరుగులేని నత్యం.

దీక్షా ప్రదానం





Saturday, August 15, 2026

Madhuvanam - మధువనం

రామాయణం సుందరకాండ 61వ సర్గ - మధువనం

అందరూ మహేంద్రగిరి శిఖరం నుండి గగన వీధికి ఎగిరారు.

మత్తేభాలవలె, మహాగిరులవలె వారు ఆకాశమంతా క్రమ్ముకున్నారు. వారందరూ సాగి సాగి నందన వనంలా ఉండే మధువనంలో ప్రవేశించారు. వివిధ తరు లతా శోభతో అది సుగ్రీవ రక్షితమై సర్వమనోహరంగా వుంది. ఆ వనంలో ఎవరూ అడుగు పెట్టడానికి వీలులేదు.

సుగ్రీవుని మేనమామ దధిముఖుడు ఆ వనపాలకుడు. ఆయన అప్రమత్తంగా రక్షించే వనంలో ప్రవేశిస్తూనే వానరులందరూ అంగదుని ఛేరి మధుపాన కాంక్ష వెలిబుచ్చగా, ఆ యువరాజు జాంబవంతాది వృద్దులతో సంప్రదించి వానరులకు అనుమతి యిచ్చాడు.

అంతతో పట్టరాని సంతోషం కలిగిన ఆ వానరులు.

గాయన్తి కేచిత్‌ ప్రణమంతి కేచిత్‌
నృత్యన్తి కేచిత్‌ ప్రహసన్తి కేచిత్‌ ।
పతన్తి కేచిత్‌ విచర
న్తి కేచిత్‌
ప్లవంతి కేచిత్‌ ప్రలపంతి కేచిత్‌ః ॥

కొందరు పాటలు మొదలుపెట్టారు. కొందరు ప్రణామాలు, నాట్యాలు, నవ్వులు, తిరుగుళ్ళు, దూకుళ్ళు, అతి ప్రసంగాలు అలా సాగిస్తున్నారు.

ఒక చెట్టుమీది నుండి మరొక చెట్టుకు దూకుతూ, చివరి కొమ్మనుండి నేలకు దుముకుతూ, నేలనుండి వృక్షాగ్రాలకు ఎగురుతూ గడిపారు. ఒకడు పాడుతూంటే ఒకడు నవ్వుతున్నాడు, నవ్వే వానిని చూచి ఏడిచే వాడొకడు, అరిచే వాడొకడు, వాడికి ప్రోత్సాహం ఒకడు:

మధుపానమత్తులై వారు మతులుపోయి చరిస్తున్నారు.

పాన మత్తతలో వారు కొమ్మలు విరిచారు, చెట్లు ధ్వంసం చేస్తున్నారు. చూశాడు దధిముఖుడు, వనపాలుడు.

క్రోధంతో వచ్చి వారించబోయోడు. కొందరిని మందలించాడు, దూషించాడు, దెబ్బలు వేశాడు. వారందరూ ఆ మ
త్తులో దధిముఖుని దండించడం ఆరంభించారు.

గోళ్ళతో రక్కి, పళ్ళతో పీకి, కాళ్ళతో తన్ని నానా హింసలూ పెట్టారు.

అది చూసి హనుమంతుడు మీరందరూ మధుపానం సాగించండి. వీరి విషయం నేను చూస్తాను, అనవిని అంగదుడు కార్యసాధకుడైన హనుమంతుడు చెపితే అకార్యం అయినా చెయ్యవలసిందే, అనగా వారందరూ అంగదుని కొనియాడి మధువనంలో మిగిలిన వృక్షాలవైపు సాగి ఫలాలు భక్షిస్తూ, మధువు త్రాగుతూ అడ్డు వచ్చిన వారిని చావగొడుతున్నారు.

దోసెళ్ళతో కొందరు త్రాగుతూంటే మధుభాండాలు చంకలలో పట్టుకుపోతున్నారు కొందరు, త్రాగి కొట్టుకోవడం మొదలు పెట్టారు, కొందరు చెట్టు మొదట నిలిచారు. కొందరు ఎండుటాకుల మీద దొర్లుతున్నారు. తూలే వారు కొందరు, త్రోసుకునేవారు కొందరు.

కూతలు కూసేవారు, నిద్రపోయేవారు, సింహనాదాలు చేసేవారు, అట్టహాసాలు, తాడనాలు అలా మత్తులో ఉన్నారు వారు.

వారి చేత దెబ్బలు తిన్న వన పాలకులు పిక్కబలం చూపారు.

తన సేవకుల పరాభవం విని దధిముఖుడు వారందరినీ తీసుకుని 
హావృక్షాలు పెరికి వానరయోధులను వారించరాగా హనుదాదులు ఎదురు వచ్చారు,

పానమత్తుడై వున్న యువరాజు అంగదుడు ఒళ్ళు తెలియని దశలో దధిముఖుని నేలమీద పడగొట్టి చితకబొడిచాడు.

ఆ యువకుడి దెబ్బలకు మూర్చపోయాడు దధిముఖుడు. కొంత సేపటికి తేరుకొని తన అనుచరులను వెంటబెట్టుకుని సుగ్రీవుని చేరి మధువనంలో జరుగుతున్న విషయం వివరించి తలవంచి దోసిలి ఒగ్గి, యింత అకార్యానికీ కారకుడు అంగదుడు, అంటూ పాదాలమీద పడ్డాడు.

సుగ్రీవుడు వానిని లేవనెత్తి:

నీకు అభయమిస్తున్నాను. విషయం వివరంగా చెప్పు, అన్నాడు.

వానరేశ్వరా! నీ తండ్రి ఋక్షరజసుడుగానీ, మీ అన్న వాలిగానీ మధువనంలో అడుగుపెట్టలేదు. నువ్వు కూడా ఎప్పుడూ ఆ వనంలో దిగలేదు. అటువంటి వనాన్ని ధ్వంసం చేసి మధువంతా పానం చేశారు అంగదాదులు. మేమందరం వారించబోగా బాగా మాకు పాదతాడనాలు లభించాయి. చక్రవర్తివి నువ్వుండగా మాకు వారే శిక్ష వేశారు, అని దుఃఖిస్తూంటే, చూచి లక్ష్మణస్వామి:

వానరేశ్వరా! ఎందు కీయన దుఃఖిస్తున్నాడు, అని ప్రశ్నించాడు.

లక్ష్మణా! అంగదాదులు 
ధువనంలో ప్రవేశించి యధేచ్భగా త్రాగుతూ తిరుగుతున్నారని చెపుతున్నాడు.

వారందరూ దక్షిణదిశకు అన్వేషణకు వెళ్ళినవారు. ఆ వనంలో వారు స్వేచ్చగా చరిస్తున్నారంటే కార్యసాధకులై వచ్చారన్నమాట. కాకపోతే ఆ సాహసం వారికి రాదు. నిస్సందేహంగా వారు సీతను చూశారు.

హనుమంతుడే ఆ కార్యం సాధించి ఉంటాడు. కార్యసాధనకు యోగ్యమయిన ఆలోచనా శక్తి అతనికే ఉంది. వివేకవంతుడయిన పరాక్రమ సంపన్నుడు మా హను
. అదీకాక-

జాంబవా న్యత్ర నేతాస్యాత్‌
అంగదశ్చ బలేశ్వరః
హనుమాం శ్చాప్యధిష్ఠాతా
న తస్య గతి రన్యధా

నాయకుడు జాంబవంతుడు.
బలాధిపతి అంగదుడు.
అధిష్ఠాత హనుమంతుడు. ఇక కార్యసాధనకు అడ్డేమిటి!

వీరందరూ 
ధుపానానికి ఉపక్రమించారంటే సీతాదేవిని చూసి వచ్చారన్నమాటే.

కాకపోతే బ్రహ్మదత్త
యిన ధువనంలో కాలు పెట్టడానికి అంగదాధులకు ఎన్ని గుండెలు కావాలి. వారు సీతను చూశారు, అనడంతో రామ లక్ష్మణులు పరమానందం పొందారు:

అప్పుడు సుగ్రీవుడు:

కార్యసాధకులయి వచ్చిన అంగదాదులు ఏం చేసినా క్షమించాలి. సింహసదృశులయిన హనుమదాదులందరినీ మేము చూడగోరుతున్నాం. సీతాన్వేషణ విశేషాలు వినగోరుతున్నాం, అన్నాడు.

ఆ మాట విని దధిముఖుడు సుగ్రీవ రామ లక్ష్మణులకు నమస్కరించి తన అనుచరులతో మధువనం చేరాడు.

అప్పటికి మత్తు వదులుతూన్న వానరవీరులను సమీపించి, చేతులు జోడించి, అంగదుని సమీపించి:

యువరాజా! మా అపరాధం మన్నించండి. ఈ వనం మీద మీకూ అధికారముంది. ఒకనాడు వాలి వానరేశ్వరుడు, అదే రీతిగా సుగ్రీవుడు, ఆ తరువాయి నువ్వు. అందువల్ల క్షమాభిక్ష కోరుతున్నాను.

ఇప్పుడు మేము సుగ్రీవునికి ఈ వార్త నివేదించగా ఆయన సంతోషంతో అందరినీ రమ్మన్నాడు. త్వరగా మిమ్మల్ని చూడగోరుతున్నాడు అనగా, 

అంగదుడు: వానర వీరులారా! రామచంద్రుని కీ విషయం తెలిసివుంటుంది. అందువల్ల మనం త్వరగా వెళ్ళాలి. మధుపానముత్తులై హాయిగా నిద్రించే వానరవీరులను తీసుకుని సుగ్రీవ సన్నిధానానికి వెళ్ళాలి. పెద్దలు ఎలా చెపితే అలా నడుచుకుంటాను, నేను యువరాజునయినా కార్యసాధకులను అజ్ఞాపించడం ఉచితం కాదు, అన్నాడు.

ప్రభువయినవాడెవ్వడూ యింత వినయంగా మాట్లాడడం మేమెరగం. ప్రభుత్వమదం వినయాన్ని దరిజేరనివ్వదు. అహంకారం దాని లక్షణం. ఇది నీ భావిశ్రేయస్సుకు మంచిది.

నీ మాట మీద మే మందరం సుగ్రీవ సన్నిధానానికి రావడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నారు వారు.

అయితే నడవండి, అని అంగదుడు ఎగిరాడు.

ఒక్కమారుగా యంత్ర ఉక్షిప్తమయిన పర్వతాలవలె వానరయోథులు ఎగిరారు.

వాయు విచలితములయిన మేఘసముదాయంలా గర్జిస్తూ వస్తూంటే సుగ్రీవుడు:

రామభద్రా! నువ్వు నిశ్చింతగా వుండు. 
నవారు సీతను చూసే వస్తున్నారు. ఎలా అంటావా! నేను పెట్టిన గడువు దాటిన తరువాయి నా ఎదుటపడగల వానరుడు లేడు. గడువుదాటి వస్తున్నారంటే పనిచేసుకు వచ్చారన్నమాట, ఆలా కాకపోతే మా అంగదుడు నా ముందుకు రానే రాడు. పయిగా వారు మహోత్సాహంలో వున్నారని విన్నాంకదా! దాని అర్థం కార్యం సాధించారనే. అదీకాక మా తాత తండ్రులు ప్రాణప్రదంగా రక్షించే మధువనం ధ్వంసం చేశారంటే ఎంత ఉత్సాహంతో వున్నారో యోచించు.

నిస్సందేహంగా సీత కనిపించి వుంటుంది, హనుమంతుడే చూచి వుంటాడు. మా హనుమ ధీశాలి, కార్యసాధకుడు.

హనూమతిహి సిద్ధిశ్చ
తిశ్చ తి సత్తమ-

జాంబవంతుడు నాయకుడు, అంగదుడు బలేశ్వరుడు, హనుమంతుడు సాధకుడు. అటువంటప్పుడు 
రోలా జరగడానికి వీలులేదు. నువ్వు నిశ్చింతగా వుండు, అంటూండగా కిలకిల ధ్వానం చేరింది.

ఆ ఉత్సాహధ్వానం వినే సుగ్రీవుని వాలం పెరిగింది; 
నసు సంతోషంతో పొంగింది.

వానరు లందరూ రామదర్శన లాలసులై అంగదునీ, హనుమంతునీ ముందుంచుకుని క్రిందికి దిగారు.

హనుమంతుడు చేతులు జోడించి, రాముని ముందు నిలిచి:

స్వామీ! సీతాదేవి క్షేమంగా వుంది, అన్నాడు.

సుగ్రీవునికి తన ఊహ నిజ
యినందుకు ఆనందం కలిగింది. లక్ష్మణుడు ఆదరనయనాలతో హనుమంతుని చూశాడు. రామభద్రుడు సంతోష వదనంతో చూశాడు.

చూడామణి

Chudamani - చూడామణి

రామాయణం సుందరకాండ 69వ సర్గ వరకు - చూడామణి

రామభద్రుడు:

ఓ వానర వీరులారా! సీతాదేవి ఏ స్థితిలో వుంది. నా యందు ఆవిడ ఏ దృష్టితో వుంది. అంతా వివరంగా చెప్పండి, అన్నాడు.

అప్పుడు వానరులందరూ సర్వవృత్తాంతం ఎరిగిన హనుమంతుని రాముని ముందుకు నడిపించారు.

హనుమంతుడు దక్షిణ దిశగా తిరిగి మనసా సీతాదేవికి నమస్కరించి రాముని చూచి:

రామభద్రా! అమ్మవారిని అన్వేషించడానికి దక్షిణ సముద్రం నూరు యోజనాలు దాటి లంకలో అడుగుపెట్టాను. అక్కడ సీతాదేవిని దర్శించాను.

ఆ పతివ్రతా శిరోమణి తన మనస్సు నీ మీదనే లగ్నంచేసి నీకోసమే జీవిస్తున్నది. రావణుని ఉద్యానవనంలో రాక్షసీ జనమధ్యంలో వారి పరుష భాషణలతో హింస పడుతున్నది. ఆమెకు వారే రక్షకులుగా వున్నారు.

దీనురాలై, ఏకవేణితో, భూమిమీదనే శయనిస్తూ, మంచుదెబ్బతిన్న పద్మంలా వుంది.

క్రూర రావణుని హీంసలు పడలేక ప్రాణత్యాగానికి సన్నద్ధమవుతూండగా నేను వారించి ఓదార్చడానికి ప్రాతిపదికగా ఇక్ష్వాకువంశ కీర్తనం ఆరంభించాను.

అప్పుడు నన్ను విశ్వసించి నాతో మాట్లాడింది. నేను విషయమంతా వివరించాను.

మీ మైత్రిమాట విని సంతోషించింది. మీకు గుర్తుగా చిత్రకూటం మీద వాయసం కథ చెప్పింది. ఆవిడ తిలకం జారినప్పుడు మణిశిలతో మీరు తిలకం దిద్దిన వృత్తాంతం గుర్తుచేసింది.

ఇదిగో ఈ చూడామణి ఆనవాలుగా యిచ్చింది. ఆ రాక్షసా వాసంలో మరొక్క మాసంకంటె జీవించనని చెప్పింది, అని విషయాలు విస్తరంగా చెప్పాడు.

రాముడు చూడామణిని అందుకుంటూనే గుండెలకు హత్తుకుని కన్నీరు విడుస్తూ సుగ్రీవుని వైపు తిరిగి:

లేగదూడ కోసం ఆవు ఎంత తపన పడుతుందో ఈ మణిని చూడడంతో నేను సీతకోసం అంత బాధ పడుతున్నాను. కల్యాణ వేదిక మీద ఆ జనక మహారాజు దీనిని ఆమెకు శిరోభూషణంగా అలంకరించాడు, ఈ మణి పవిత్ర జల సంభూత, దీనిని దేవేంద్రుడు కానుకగా యిచ్చాడు. దీన్ని చూస్తూంటే మా తండ్రిగారినీ, మా మామగారినీ చూసినట్లనిపిస్తున్నది. ఇది ఆమెకే అలంకారం, అని హనుమంతునివైపు తిరిగి:

మారుతీ! దాహపీడితుడికి స్వాదుజలంవలె నీ మాటలు నా బాధకు ఉపశమనం కలిగిస్తున్నాయి. నా జానకి యింకా ఏం చెప్పిందో వివరించు; జానకి లేని జీవితం క్షణం కూడా భరించలేను. నన్ను కూడా ఆమె దగ్గరకు తీసుకువెళ్ళు. ఆ రాక్షసుల మధ్య ఏం బాధలు పడుతున్నదో, మేఘాచ్చాదిత శరచ్చంద్రునివలె వుండి వుంటుంది. రోగికి ఔషధంలా నాకు నీ మాటలే, జీవనాధారం, ఆ ప్రియభాషిణి చెప్పిన మాటలన్నీ వినిపించు, అన్నాడు.

రామభద్రా! చిత్రకూటం మీద మీరుభయులూ విశ్రాంతి తీసుకునే వేళ నువ్వు నిద్రపోయేవేళ ఒక వాయసం వచ్చి జానకమ్మను హింసిస్తుండగా నువ్వు మేలుకాంచి దర్భను బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి విడిచావట, ఆ కాకికి ముల్లోకాలలోనూ అభయం దొరకక నిన్నే శరణువేడితే అప్పుడు అమోఘ
యిన ఆ అస్త్రానికి లక్ష్యంగా కన్ను వదులుకున్నదట.

అలనాడు వాయసంమీద అస్త్రం ప్రయోగించిన రాముడు రాక్షసుల విషయంలో ఎందుకు ఉపేక్ష వహిస్తున్నాడు. లక్ష్మణుడయినా ఎందుకు రావడంలేదు.

బహుశ నేను చేసిన పాపకర్మలు పూర్తికాలేదేమో! లేకుంటే యింత కాలం ఆ 
హావీరులు ఉదాసీనంగా ఎందుకుంటారు, అని కన్నీరు విడిస్తుంటే నేను:

తల్లీ! రాముడు నీ విరహవ్యధతో నిశ్చేష్టుడై వున్నాడు. లక్ష్మణుడు అన్నగారి దుఃఖం చూడలేక బాధపడుతున్నాడు.

ఇంతకాలం నీ జాడ తెలియలేదు. ఇప్పుడింక నువ్వు చింతించకు. వారుభయులూ హుటాహుటిని వచ్చి లంక దహించి, ఈ రావణుని బంధుకోటితో సహా కడతేర్చి తమతో తీసుకువెడతారు. ఆయనకు ఆనవాలుగా ఏదయినా ఇయ్యి, అని అడిగాను.

అప్పుడావిడ అటూ యిటూ చూసి, జుట్టు ముడిలోని ఈ మణి యిచ్చింది.

నేను తీరుగు ప్రయాణానికి బయలుదేరుతూంటే,

హనుమా! సింహసదృశ పరాక్రమ సంపన్నులయిన రామ లక్ష్మణులనూ వానరేశ్వరునీ అడిగానని చెపుతూ, రా
లక్ష్మణులను దర్శించగలగడం నీ అదృష్టం, అని నన్ను అభినందించింది.

అప్పుడు నేను:

తల్లీ! నా వీపుమీద కూర్చో. ఈ క్షణంలో వారి దగ్గర దింపుతాను, అన్నాను.

అప్పుడావిడ!

హనుమా! ఈ 
నస్సు నా స్వాధీనంలో వుండగా పరపురుష స్పర్శ సహించను. అలనాడు కాలం ఎదురు తిరగడంవల్ల, ఆ రాక్షసుడు నన్ను ముట్టగలిగాడు, ఇక రాముడు నన్నీ దుఃఖసాగరం నుండి ఎలా ఉద్దరించాలో అదంతా అయనతో నువ్వు ఆలోచించు. ఈ రాక్షసపీడ చూశావుగదా! అంతా ఆయనకు చెప్పు. నీకు శుభమగుగాక! అని క్షణం ఆగి:

పోనీ ఈ రోజు యిక్కడెక్కడయినా విశ్రాంతి తీసుకుని వెళ్ళరాదా! నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవరకూ నేను వుంటానో వుండనో! నా దుఃఖాలకు అంతు కనబడడంలేదు, మీ వానర, భల్లూక సేనలు ఈ అనంత విశాల సాగరాన్ని ఎలా దాటగలవయ్యా!

దాశరథులకు మాత్రం యిది సాధ్యమా!

వాయుదేవుడు, గరుత్మంతుడు, నువ్వూ తప్ప మరెవరూ ఈ సముద్రం దాటలేరు కదా.

మరి ఈ అసాధ్యాన్ని నువ్వు ఎలా సాధిస్తావో చూడాలి. అందుకు నువ్వే స
మర్థుడవు. రాముడు స్వయంగా వచ్చి రాక్షస సంహారం చేసి నన్ను తీసికెళ్ళడం ఆయనకు యశస్కరం.

ఈ రాక్షసుడు రామునికి భయపడినందువల్లనే కపట మార్గాన నన్ను హరించాడు. రాముడు తన పరాక్రమం ప్రదర్శించాలి. అదంతా నువ్వు చెప్పాలి, అని అన్నది,

అప్పుడు నేను:

అమ్మా! వానరేశ్వరుడు సుగ్రీవుడు కృత నిశ్చయుడై వున్నాడీ విషయుంలో

వానర భల్లూక పతులందరూ ఆయన కను సన్నలలో నడుస్తారు. వారు సంకల్పించారంటే సాధించి తీరతారు. వారికి అవరోధం లేదు. వాయుమార్గాన భూ ప్రదక్షిణం చేయగల యోధులు వారందరూ.

అక్కడ నా కంటె మహామహులూ, నాతో సమానులూ వున్నారే తప్ప తక్కువ వారెవరూ లేరు. దూతగా నన్ను పంపారు. అంటే వారికంటె తక్కువ వాడీనే కదా, పెద్దలను దూతకృత్యానికి పంపరు కదా!

ఈ వానరయూధనాధులు ఒక్క ఊపులో లంకలో వ్రాలుతారు. ఇక ఆ రాజ సింహులు నా వీపుమీద వచ్చి యిక్కడ సూర్య చంద్రునివలె దిగుతారు.

సర్వశత్రు సంహార సమర్దుడు, సింహసమ పరాక్రమోపేతుడు, రామ భద్రుడు ధనుర్ధారియై లంకానగర ద్వారంలో నిలబడడం త్వరలోనే నువ్వు చూడగలవు,

వాడి గోళ్ళూ, నిశిత దంతాలూ, ఆయుధాలుగా మా వానర గణాధిపతులు సింహ శార్దూల బలసంపన్నులు. వారు మత్తగజ సన్నిభులై నీ ముందుంటారు.

వార్షుకాభ్రాలవలె, మహాపర్వతాలవలె వారు ఈ లంకానగర సమీప గిరి సానువులమీద సింహనాదాలు చేస్తూంటే వినే రోజు ఎంతో దూరంలో లేదు.

రామభద్రుడు శత్రుసంహారం చేసి వనవాసం ముగించి నిన్ను వెంట బెట్టుకుని అయోధ్యానగరం చేరి తీరతాడు, అని జానకీదేవిని ఓదార్చాను;

అని హనుమంతుడు పలకడంతో రా
భద్రుడు సంతుష్ట చిత్తుడయాడు.

అరిఘ్నం సింహ సంకాశం
క్షిప్రం ద్రక్ష్యసి రాఘవం
లక్ష్మణంచ ధను ష్పాణిం
లంకాద్వార ముపస్థితం


సుందరకాండ సమాప్తం

(అదికవి వాల్మీకి అనుగ్రహించిన శ్రీ మద్రామాయణంలో సుందరకాండకు ఇది ఉషశ్రీ స్వేచ్చానువాదం.)

యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం సమత రాక్షసాంతకం.


(రామనామం వినిపించే ప్రతిప్రాంతంలో ఆనంద బాష్పాలతో తలవంచి నిలబడే మూరుతికి నమస్కారం. ఇది భక్తుల దృష్టిలో హనుమంతుని రూపం)

అంజనా నందనం - వీరం
జానకీ శోకనాశనం
కపీశం అక్ష హంతారం
వందే లంకా భయంకరం
.

అదీ ఆయన రూపం.

Angada - అంగదుడు

రామాయణం సుందరకాండ 60వ సర్గ - అంగదుడు

మారుతి మాటలు విని అంగదుడు:

సీతను చూసి వచ్చామే కాని ఆవిడను తీసుకురాలేదని చెప్పడం మనవంటి మహాపరాక్రమ సంపన్నులకు ఉచితంకాదేమో! మన హనుమ రాక్షస సంహారంచేసే వచ్చాడు కనక మనం సీతను తీసుకువెళ్ళడం మంచిది. సీతను రా
లక్ష్మణుల ముందుంచి న పరాక్రమం చాటుకుందాం, అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు.

నాయనా! సుగ్రీవుడు కాని, రాముడు కాని మనకు అన్వేషణ కార్యం అప్పగించారే తప్ప మరేమీ చెప్పలేదు. అయినా 
నం సాహసించి సీతను తీసుకువెడితే ఆ రాజశార్దూలుడు మనలను ఏ దృష్టితో చూస్తాడో! అది తన వంశ ప్రతిష్ఠకు భంగకరం అనుకుంటాడేమో! మనకు తెలీదు.

ఏమంటే సీతను తాను తెచ్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడాయన. ఆ మాట చెల్లించుకోవాలి. ఇప్పుడు మనం నువ్వు చెప్పినట్లు చేశామో అయన మనస్సు వికలమయి తీరుతుంది. మన శ్రమ వ్యర్థమవుతుంది.

అందువల్ల వెళ్ళి జరిగిన విషయం చెప్పడమే 
న కర్తవ్యం. అప్పుడాయన ఏం చెపితే అలా చెయ్యడానికి మనం సిద్ధంగానే ఉన్నాం కదా! అనగా అంగద, హనుమదాదులందరూ అంగీకరించారు.

మధువనం

Aalochanalu - ఆలోచనలు

రామాయణం సుందరకాండ 59వ సర్గ - ఆలోచనలు

హనుమంతుడు ఇంకా చెపుతున్నాడు:

రామకార్యం, సుగ్రీవయత్నం సఫలమయినట్లే. సీతాదేవిని చూసిన అనంతరం ఆ శీలవతి పట్ల నా మనస్సు నిర్మల భక్తి భావంతో వుంది. ఇక రావణుడు, వాని తపశ్శక్తి ఎంతటి దంటే ఈ సర్వలోకాలనూ రక్షించనూ గలడు, దహింపజెయ్యనూ గలడు. అంత శక్తిమంతుడు. ఆ తపశ్శక్తి కారణంగానే వాడు సీతను తాకినా నశించలేదు. ఆవిడ నిజంగా ఆగ్రహిస్తే అగ్నికంటె తీక్షణ మయింది. వాని తపో
గ్ని ఎంత!

సరే. ఇప్పుడింక మనం రామ లక్ష్మణులను తీసుకుని సీతాదేవిని దర్శించాలి.

లంకా నగరాన్ని ధ్వంసంచేసి, మూలబలంతో రావణుని కడతేర్చే శక్తి నాకు లేకపోలేదు. మీ వంటి మహాయోధులు కూడా కలిస్తే వేరే చెప్పవలసింది లేదు.

ఐంద్ర, రౌద్ర, వాయవ్య, బ్రహ్మాస్త్రాలు నన్నేమీ చెయ్యలేవు. మరి మీ ఆజ్ఞలేదు కనక కాని, అప్పుడే రావణ వంశ నాశనం, చేసేవాడిని.

మన మహానాయకుడు జాంబవంతుడు విజృంభిస్తే ఎదురేముంది.

అందాకా ఎందుకు! 
న యువరాజు అంగదుడు చాలు. వీరులు పనస, నీలులు కదిలితే మందరగిరిని పిండిచేస్తారు. మైంద ద్వివిదులను ఎదుర్కొనే శక్తి దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస నాగజాతులలో ఎవరికుంది? వీరు బ్రహ్మ వర ప్రభావ సంపన్నులు. అమృతం అందుకున్నవారు. వీరిద్దరూ చాలు లంకను కూల్చడానికి, నేనే లంకానగరాన్ని బూడిదచేసి వచ్చాను. అక్కడ రామలక్ష్మణ సుగ్రీవ జయనాదాలు చేశాను; అన్నాడు.

అంగదుడు

Anveshana Gaadha - అన్వేషణ గాథ

రామాయణం సుందరకాండ 58వ సర్గ - అన్వేషణ గాథ

మహేంద్రగిరి మీద అందరూ సుఖాసీను లయారు.

అప్పుడు జాంబవంతుడు చిరునవ్వుతో హనుమంతుని చూస్తూ:

నాయనా! సీతాదేవిని ఎలా చూడగలిగావు! క్రూర రావణుని లంకలో ఆవిడ ఎలా వున్నది? అసలు నువ్వు ఎలా వెళ్ళావు? ఈ వివరాలన్నీ మాకు యథాతథం వినిపించు. విన్నాక తరువాయి కథ ఆలోచిద్దాం, అన్నాడు.

ఆ మాట వినగానే హనుమంతునికి శరీరం పులకించింది.

సీతాదేవికి మనసా నమస్కరించి, కథ ఆరంభించాడు.

మీ రందరూ చూస్తూండగానే మహేంద్రగిరి మీద బయలుదేరి గగన వీధికి లేచాను కదా! సముద్రం మీద వెడుతూండగా నా దారికడ్డుగా ఒక సువర్ణగిరి కనిపించింది. అది నాకు అవరోధంగా నిలబడుతున్నదనే అనుమానం కలిగి దాన్ని ముక్కలు చేసి తీరాలనుకొని నా వాలంతో కొట్టగా దాని శిఖరం వేయి ముక్కలయింది.

అప్పుడా గిరి: నాయనా! నీ తండ్రి వాయుదేవుడూ నా స్నేహితుడు. నన్ను మైనాకుడంటారు. ఈ సముద్రం నా నివాసం. పర్వతాలకు రెక్కలుండేవని నువ్వు విని ఉంటావు. వాటితో ఎగురుతూ అవి భూత కోటిని నాశనం చే
స్తూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు నరికాడు. అప్పుడు వాయువు సాయపడి నన్ను ఈ సముద్రంలో చేర్చాడు.

ధర్మపరుడయిన రామునికి సాయం చేయడం నా విధి. మీ తండ్రి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా నీకు సాయపడాలని ఉంది, అన్నాడు.

నా ప్రయాణ ప్రాధాన్యం వివరించి వాని సెలవు పొంది బయలుదేరాను. తీవ్రవేగుడనై వెడుతూంటే దారిలో నాగమాత సురస అడ్డుపడి:

ఓ వానరా! దేవతలు నిన్ను నాకు ఆహారంగా అనుగ్రహించారు. చిరకాలానికి నా ఆకలి తీరుతున్నది, అనగా నేను చేతులు జోడించి:

అమ్మా: నేను దాశరథియైన రాముని పనిమీద వెడుతున్నాను. భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో రాముడు దండకారణ్యానికి రాగా అక్కడ దుష్టరావణుడు సీతను అపహరించాడు. రాముని దూతనై నేను సీతాన్వేషణకు వెడుతున్నాను. ఆవిడను దర్శించి, ఆ వృతాంతం రామునికి నివేదించి వచ్చి నేను నీ నోట పడతాను, నన్ను నమ్ము అన్నాను.

ఆ కామరూపిణి సురస: ఓరీ! నన్ను దాటి వెళ్ళడం ఏ ప్రాణికీ తరం కాదు, అంది.

నేను పది ఆమడలు పెరిగాను.

సురస అంతకంటె పెద్ద నోరు తెరిచింది.

ఉత్తర క్షణంలో నేను అంగుష్ఠ దేహుడనై ఆమె గర్భంలో ప్రవేశించి అంతలోనే ఈవలకు రాగా, నన్ను చూసి నాగమాత:

వానరా! నాకు సంతోషంగా వుంది. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నీ సంకల్పం ఫలిస్తుంది. సీతా రాములకు సమాగమం కలిగించు, అంది.

గరుత్మంతునివలే గగనవీధికిఎగిరాను.

దక్షిణముఖంగా సాగుతున్నాను,

అంతలో నన్ను క్రిందికి లాగుతున్నట్లనిపించింది ఎదో శక్తి,

క్రిందికి చూశాను. ఏమీ కనబడలేదు. అటూ యిటూ చూశాను. ఏ ప్రాణీలేదు. నా వేగం ఆగిపోయి క్రిందికి దిగిపోతున్నాను. బాగా నీటిలోకి చూశాను. 

ఆ సాగరంలో భయంకర రూపంతో అట్టహాసంతో ఒక రాక్షసి కనిపించింది.

ఓ మహాకాయుడా! ఎక్కడికి పోతున్నావు. చిరకాలంగా ఆహారం లేక ఆకలితో బాధపడుతున్నాను. నిన్ను తిని నా బాధ తీర్చుకుంటాను, అంది.

ఆ రాక్షసి నోరుకంటె విశాలంగా నా దేహం పెంచాను. అది దాని నోరు విశాలం చేస్తున్నది. పెరిగి పెరిగి ఒక్కసారిగా నా శరీరాన్ని సంకోచింపజేసి దాని ఉదరంలోకిపోయి గుండె చీల్చి బయటపడ్డాను. పర్వత దేహంతో అది నీటి మీద తేలింది. చూసిన చారణులు:

భయంకర రూపిణి అయిన సింహిక హనుమంతుని చేతులలో ప్రాణాలు వదిలింది, అనుకుంటూంటే వింటూ సాగి సాగి లంకా నగరపు సరిహద్దులో ప్రవేశించాను.

సూర్యుడు అస్తమిస్తున్నాడు.

లంకలో దిగాను.

దిగుతూన్న సమయంలో-

ప్రళయకాలమేఘంలా ఒక మహారాక్షసి భీకరాట్టహాసంతో నా ఎదుట నిలబడింది. దాని శిరోజాలు అగ్ని శిఖలవలె వున్నాయి. అది నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా ఎడమ పిడికిలి బిగించి ఒక్క పోటు పాడిచాను.

నేల కూలుతూ: ఓ మహావీరుడా! నేను లంకా నగర అధిష్ఠానాన్ని. నన్ను జయించిన నీకు లంకలో ఎదురులేదు, అని కన్ను మూసింది.

చీకటి పడింది. నగరంలో అన్వేషణ ప్రారంభించాను. లంక అంతా చుట్టబెట్టినా సీత జాడలేదు. విపరీత దుఃఖంతో నగర ప్రాకారంతో సమంగా వున్న మరొక సువర్ణ ప్రాకారాన్ని చూశాను. అందులో ఉద్యానవనం. దాని పేరు అశోకవనం. దానిలో శింశుపావృక్షం మీద కూర్చుని చూడడం మొదలు పెట్టాను.

ఆ చెట్టు మొదట ఉపవాసంతో కృశించి, ఏకవేణితో దీనవదనంతో భర్తృ చింతాపరాయణయై వున్న సీతను చూశాను.

ఆమెచుట్టూ వికృతాకారాలతో క్రూరస్వభావంతో రాక్షసీజనం.

రక్త మాంసాలతో బ్రతికే పెద్ద పులుల మధ్య ఆడు లేడిలా వుంది.

ఈ రాక్షస స్త్రీల బాధలు భరించలేక ప్రాణాలు వదిలి పెట్టె దశలో వుండగా చూశాను.

అంతలో రావణ భవనం నుండి అందెల ధ్వనులు అశోక వనముఖంగా వస్తున్నట్లు వినిపించింది.

నేను కొంచెం జంకి ఎవరికీ కనిపించకుండా కొమ్మల చాటున చేరి చూస్తున్నాను.

రావణుడు తన పత్నీ సమూహంతో వచ్చాడు.

సీతాదేవి ఆ రావణుని చూస్తూనే భయంతో ముడిచిపెట్టుకు కూర్చుంది.

గజ గజలాడే ఆమెను చూస్తూ రావణుడు.

ఓ సుందరీ! ఇంక నీకు రెండు మాసాలు గడువుంది. ఈ లోపున నీ మనసు నాపై మరలదో నీ రక్తం త్రాగక తప్పదు, అని గర్జించాడు.

సీత: రాక్షసాధమా! అమిత తేజశ్శాలి రాముడు నా భర్త. ప్రఖ్యాత మయిన ఇక్ష్వాకుల ఇంటి కోడలిని. అటువంటి నన్ను నోటికి వచ్చినట్లు ఆడుతున్న నీ నాలుక ఊడి నేలపడకుండా ఉన్నదే!

నాడు పర్ణశాలలో ఆయన లేనప్పుడు వచ్చావు కనక ఇంకా బ్రతికి వున్నావు. ఆయన కొలువులో సేవకత్వం కూడా నీకు దొరకదు. ఆయన అజేయుడు. అని క్రోధంతో మాట్లాడుతూంటే రావణుడు కన్నుల నిప్పులు కురుస్తూ పిడికిలి బిగించి ఆమెను సంహరించబోగా అక్కడి నారీజనం హా హా రవాలు చేశారు.

వారి మధ్యనున్న మండోదరి వచ్చి వారించి:

నీకు ఈ సీత దేనికి! దేవ గంధర్వ యక్ష కాంత లెందరు లేరు నీ అంతఃపురంలో.

వారితో హాయిగా భోగా లనుభవించు, అని తీసుకువెళ్ళింది. వాడు వెళ్ళాడు.

ఇక్కడి రాక్షస స్త్రీలు పరిపరి విధాల వినరాని మాటలతో సీతను హింసిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడే నిద్రనుంచి లేచి త్రిజట వారందరినీ చేర బిలిచి:

ఓసీ! మీ కాలం మూడింది. ఈ సీతను ఎవరూ ఏమీ చెయ్యలేరు. మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈ బాల జనక రాజపుత్రి, దశరథుని కోడలు, మహాపతివ్రత.

ఇప్పుడే నాకు కల వచ్చింది.

ఈమె భర్త లంకకువచ్చి రాక్షసులను ఓడించాడు. ఆయనను విజయలక్ష్మి వరించింది. ఈ సమయంలో వచ్చిన కల నిజమయి తీరుతుంది. కనుక మనం ఇప్పుడే ఈమెను ప్రార్థించి ప్రాణభిక్ష కోరుకోవాలి, అనగానే అందరూ ఆమె పాదాలమీద పడ్డారు.

మీ మాట నిజమే అయితే మీ అందరికీ నేను అభయం ఇస్తున్నాను, అంది సీత.

అప్పుడే నేను పరాక్రమం ప్రదర్శించి వారికి ప్రాయశ్చిత్తం చెయ్యాలనుకున్నాను. కాని బాగా ఆలోచిస్తే అది వుచితం అనిపించలేదు.

అప్పుడు ప్రశాంత సమయంలో ఇక్ష్వాకు వంశకీర్తనంతో ప్రసంగం ప్రారంభించాను.

నా మాటలు వింటూ సీతాదేవి కన్నీరు విడుస్తూ:

ఓ వానరోత్తమా! నువ్వెవరవు? ఇక్కడకు నిన్నెవరు పంపారు? రామునితో నీకెలా స్నేహమయింది? అని అడిగింది.

అప్పుడు నేను:

అమ్మా! బలశాలియైన వానరేశ్వరుడు సుగ్రీవుడు. నేనాయన భృత్యుడను. నీ భర్త రామచంద్రుని ఆదేశానుసారం వచ్చానిక్కడికి. ఇదిగో ఈ ఉంగరం ఆనవాలుగా యిచ్చాడు. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాను, నీ అభిమతమయితే వారి దగ్గరకు నిన్ను తీసుకువెడతాను అన్నాను. 

జానకి: నాయనా! ఆయన స్వయంగా వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకువెళ్ళాలి. అప్పుడు నేను; అమ్మా! అయనకు ఆనవాలుగా ఏమయినా యిస్తావా, అని అడిగాను.

ఆవిడ ఈ మణి యిచ్చింది.

అది అందుకుని, ఆవిడకు ప్రదక్షిణం చేసి తిరిగి రావడానికి సన్నద్ధమయ్యాను.

అప్పుడావిడ : నాయనా! నా అవస్థ అంతా వివరంగా చెప్పి, రెండు మాసాలలోగా వారు రాకపోతే నేను జీవించనని చెప్పు, అని విచారించింది. నేను ఓదార్చాను.

ఓదార్చి నా శరీరం పర్వతమంత పెంచాను.

ఆవిడ శోకం చూసిన నాకు రావణునిపై క్రోధం రేగింది. ముందుగా ఆ వనాన్ని ధ్వంసం చేయడం ఆరంభించాను. అది చూసి రాక్షస స్త్రీలు రావణునితో చెప్పారు. ఆయన మహాబలిష్ఠులయిన కింకర గణాన్ని పంపాడు. శూల ముద్గరాయుధాలతో వచ్చారు వారు. నేను తోరణ ద్వారం మీది దూలం అందుకుని వారిని యమపురికి పంపాను, హతశేషులు వార్తాహరులయ్యారు.

నేను నెమ్మదిగా అక్కడున్న చైత్యద్వారం మీదికి చేరాను. దానికి కాపలా ఉన్నవారిని ఒక స్తంభంతో కడతేర్చాను,

రావణుడు జంబుమాలిని పంపించాడు.

వీడు, వారి సేనాపతి ప్రహస్తుడున్నాడే వాడి కొడుకు.

వాడు తన బలగంతో దిగాడు. అందరినీ ఒక దూలానికి ఎరచేశాను.

అప్పుడు మంత్రి కుమారులు వచ్చారు.

వారిని కూడా అంతకు ముందు వచ్చిన వారికి తోడు పంపాను. సేనాపతులు వచ్చారు. వారు అయిదుగురు, మహాయోధులు, వారు కూడా యమపురి చేరారని విని రావణుడు తన ముద్దులకొడుకయిన అక్షుని పంపాడు. వాడు చతురంగబలాలతో వచ్చాడు. వీడు మండోదరి కుమారుడు.

వచ్చిన అక్షుని రెండు కాళ్ళూ పట్టి గిర్రున త్రిప్పి విసిరేశాను. అది విన్న లంకేశ్వరుడు ఆగ్రహంతో ఇంద్రిజిత్తును వదిలాడు. వీడు చాలా ఘటికుడు. ముందుగా వాని సేనను చిత్తు చేశాను. చూశాడు ఇంద్రజిత్తు, ఈ వానరుడు సామాన్యుడు కాడనుకుని బ్రహ్మాస్త్రంతో బంధించాడు. అది చూసి మిగిలిన సేవకులు నన్ను త్రాళ్ళతో బంధించి రావణుని కొలువుకూటానికి కొనిపోయారు.

ఆ దుష్టుడు నన్ను చాలా ప్రశ్నలు వేశాడు. జానకీ దర్శనార్థం వచ్చాననీ, అందుకే యింత చేశాననీ చెప్పి, నేను సుగ్రీవ సచివుడను, రామదూతను, వాయుదేవుని ఔరసపుత్రుడను.

మా రాజు సుగ్రీవుడు నీ క్షేమ సమాచారాలు తెలుసుకు రమ్మని, ఇంకా ఏమన్నాడంటే;

రావణా! రాముడు నా స్నేహితుడు. ఆయన భార్యను అపహరించిన రాక్షసుని సంహరించడానికి నేనంగీకరించాను. వాలిని సంహరించడానికి అయన అంగీకరించాడు. అగ్ని సాక్షిగా మైత్రి ఏర్పడింది మాకు.

రాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని నేల కూల్చాడు, సుగ్రీవుడు వానరేశ్వరుడయ్యాడు. మమ్ము దశ దిశలకూ పంపాడు, నేను నీ దగ్గరకు దూతగా వచ్చాను.

వానర వీరుల సంగతి మీరెవరూ ఎరుగరు. వారు దేవసమ పరాక్రములు. వారందరూ వచ్చి నీసేనను నాశనం చెయ్యకముందే సీతాదేవిని రామునికి అప్పగించు, అని మా ప్రభువు సందేశం.

ఇలా నేను చెపుతూంటే రావణుడు క్రోధతామ్రాక్షుడై నన్ను తక్షణం సంహరించమని ఆజ్ఞాపించాడు,

ఆయన తమ్ముడున్నాడు ధీమంతుడు విభీషణుడు. ఆయన రాజనీతి చెపుతూ దూతవధ చాలా అన్యాయమనీ, దూతకు అంగవికలత్వం పెద్ద శిక్ష అనీ అనగా ఆ రాజు నా తోకకు నిప్పు పెట్టమన్నాడు.

రాక్షసులందరూ నా తోకకు గుడ్డలు చుట్టి అంటించారు, నన్ను కర్రలతో, పిడికిళ్ళతో హింసించారు. అలా రాజవీధులుత్రిప్పుతూంటే నగరం అంతా చూసాను. చూడడం అయింది.

శరీరాన్ని సంకుచితం చేసి కట్లు సడలించి, అంతలో పర్వతాకారుడనై మండుతున్న తోకతో లంకానగర సౌధ, భవన, ప్రాసాదాలన్నీ తగులబెట్టాను, అంతా అయాక సీత ఏమయిందో అని చింతలో పడ్డాను.

అప్పుడు ఆకాశచారులమాటలను బట్టి సీతాదేవి సురక్షితంగా వుందని గ్రహించాను. నా లాంగూలాన్నే దహించని అగ్ని సీతాదేవికి. హానిచేస్తాడా, అనుకుంటూ మళ్ళీ ఓ మారు ఆవిడను దర్శించి లంకలోని అరిష్టపర్వతం ఎక్కి గగనమార్గాన ఇలా వచ్చాను, ఇది యింతవరకూ జరిగిన కథ.

ఇక జరగవలసింది ఆలోచించండి, అన్నాడు.

ఆలోచనలు

Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...