Wednesday, January 1, 2020

JATIKI OOPIRI SWATANTRYAM జాతికి ఊపిరి స్వాతంత్య్రం

జాతికి ఊపిరి స్వాతంత్య్రం

జాతికి ఊపిరి స్వాతంత్య్రం, అది జ్యోతిగ వెలిగే చైతన్యం
ఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యం ||

శిఖరంలా , ప్రతి మనిషీ, శిరసెత్తిన నాడే,
జలనిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే,
మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయం ||

ఎప్పటి ఎప్పటి రుచిరస్వప్నం, ఈ స్వాతంత్ర్యం
ఎందరి ఎందరి త్యాగ ఫలం, ఈ స్వాతంత్ర్యం
అందక అందక అందిన ఫలమును అందరికీ అందివ్వండి ||

స్వరాజ్య సిద్ధికి లక్ష్యమేమిటో స్మరించుకోండి
జాతి విధాత వినూత్న ఫలాలను సాధించండి
సమస్యలన్నీ పరిష్కరించే సౌమ్య మార్గం చూపండి ||

కలతలు కక్షలు రేపొద్దు ఏ కులం పేరుతో
మారణ హోమం జరపొద్దు ఏ మతం ముసుగులో
సమైక్య భారత సౌధాగ్రం పై, శాంతి దీపం నిలపండి ||

No comments:

Post a Comment

Tuesday Subrahmanya Swamy - మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి

మంగళవారం సుబ్రహ్మణ్య  స్వామి పార్వతీపరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి సకల శుభకారకుడు. సర్వ దోష నివారకుడు. ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు...