వేంకటేశ నిను సేవింపను పది
తాళం: ఆది
రాగం: మధ్యమావతి ( మేళకర్త __,__ జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ:
అవరోహణ:
పల్లవి
వేంకటేశ నిను సేవింపను పది
వేల కనులు కావలెనయ్య || వేం..||
అను పల్లవి:
పంకజాక్ష పరిపాలిత మునిజన
భావుకమగు దివ్యరూపమును కొన్న || వేం..||
చరణము(లు):
ఎక్కువ నీవని దిక్కులఁ బొగడఁగ
అక్కఱగొని మది సొక్కి కనుంగొన
నిక్కము నీవె గ్రక్కునఁ బ్రోవు త
ళుక్కని మెఱసే చక్కతనముగల || వేం..||
ఏ నోము ఫలమో నీ నామామృత
పానము అను సోపానము దొరికెను
శ్రీనాయక పరమానంద నీ సరి
గానము శోభాయమానాంఘ్రులుగల || వేం..||
యోగిహృదయ నీవే గతియను జన
భాగధేయ వరభోగీశశయన
భాగవతప్రియ త్యాగరాజనుత
నాగాచలముపై బాగుగ నెలకొన్న || వేం..||
No comments:
Post a Comment