Thursday, December 11, 2025

Anaghashtami - అనఘాష్టమి

అనఘాష్టమి

 ఓం కాళీ-తార-ఛిన్నమస్తా -షోడశీమహేశ్వరి
భువనేశ్వరీ-త్రిపురభైరవి-ధూమ్రావతి
భగళాముఖి-మాతంగి-కమలాలయ
దశమహావిద్యా స్వరూపిణి అనఘాదేవి నమోస్థుతే 


అనేక రూపాలు ధరించే గురుదత్తాత్రేయునకి ఒక గృహస్త రూపం కూడా ఉంది . అటువంటి గృహస్త రూప దత్తునకే “అనఘస్వామి” అని పేరు . ఆ స్వామి అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు.ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అనఘాదేవి లో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనఘస్వామి లో బ్రహ్మ,రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వ జ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన, ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు (అణిమా,లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం ,ఈశిత్వం, వశిత్వం, కామావసాయితా, మహిమా ) పుత్రులై అవతరించారు .

అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగంనందు ప్రీతి గలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది, కవితా శక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే “మధుమతి ” అనే పేరు కూడా కలదు. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము . “అఘము” అంటే పాపము, ఇది మూడు రకాలు. అనఘము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపజేయడం.

అనఘాస్టమీ వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశీర్షమాస కృష్ణపక్ష అష్టమి. ఈ రోజున ప్రతీ సంవత్సరం ఈ వ్రతం చేయడం చాల మంచిది . అలాగే ప్రతీ నెలా కృష్ణపక్ష బహుళఅష్టమి రోజు కుడా చేయవచ్చు. ఈ వ్రతం ప్రతీ సంవత్సరం చేసుకొనే వారుకి మూడురకముల పాపములు తొలగివారు ” అనఘులు ” గా అవుతారు. కాబట్టే ఈ వ్రతాన్ని ” అనఘాస్టమీ వ్రతం ” అంటారు. ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతము . వ్రత పీట తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి. భందుమిత్ర సమేతంగా ఈ వ్రతం చేస్తే ఉత్తమం. వ్రత పూజ పూర్తైన తరువాత ఐదు అధ్యాయాల కధలను చదవాలి, వాటిని అందరూ శ్రద్ధతో వినాలి. ప్రతి అద్యాయమునకు చివర హారతి, కొబ్బరికాయ మరియు నైవేద్యం సమర్పించాలి.

స్వామివారికి నైవేద్యంగా వివిధ ఫలాలు, పంచకర్జాయం అర్పించవచ్చు . మహా నై వేద్యం (ఎవరు ఏదైతే తింటారో అదే మహా నై వేద్యం) కూడా సమర్పించవచ్చు. వ్రతం పూర్తైన మరుసటి రోజు స్వామివారిని అర్చించి రూపాలను,మిగిలిన పూవులు , ఆకులను నదినీటిలో గాని , చెరువు లో గాని విడవాలి. శ్రీ పాదుల వారు తమ భక్తులను ఈ వ్రతం ఆచరించ వలసిందిగా చెప్పేవారు.

పనసచెట్టు లో అనఘ-దత్తాత్రేయులవారు వారి పుత్రులైన అష్టసిద్దులతోగూడి ఉంటారు. కాబట్టి అనఘాస్టమీ వ్రతం పనసచెట్టు క్రింద చేస్తే ఎంతో ప్రసస్థము.

Balaji Jayanti - బాలాజీ జయంతి

బాలాజీ జయంతి

బాలాజీ జయంతి అనేది దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగ. దీనిని మార్గశీర్ష మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఉత్తర భారత దేశంలో బాలాజీ అని పిలుస్తారు. 
హథీరాంజీ బాబా శ్రీ వేంకటేశ్వర స్వామిని బాలాజీ అని పిలిచేవారు. 

బాలాజీ జయంతి రోజును జన్మదినోత్సవాన్ని గుర్తుచేస్తుంది. ఈ పవిత్రమైన రోజున భక్తులు పురాతన తిరుపతి బాలాజీ ఆలయానికి తరలివచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కోరికలు మరియు సంతోషకరమైన జీవితం కోసం ఆయన ఆశీర్వాదం పొందడానికి భక్తులు ఈ రోజున శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తారు. దక్షిణ భారతదేశంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దేవాలయాలలో బాలాజీ జయంతి అత్యంత భక్తి తో జరుపుకుంటారు. 

బాలాజీ జయంతి సందర్భంగా ఆచారాలు:
బాలాజీ జయంతికి చాలా రోజుల ముందుగానే సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున, దేవాలయాలను శుభ్రం చేసి, పూలతో అందంగా అలంకరిస్తారు. ఈ సందర్భంగా, బాలాజీని కొత్త బట్టలు మరియు ఆభరణాలతో అలంకరిస్తారు.

బాలాజీ జయంతి రోజున భక్తులు తెల్లవారుజామున లేచి త్వరగా స్నానం చేస్తారు. తరువాత వారు ఆలయంలో 'అంగప్రదక్షిణ' చేసి, బాలాజీకి తమను తాము అర్పించుకుంటారు. ఈ రోజున భక్తులు ఆయనను పూర్తి భక్తి, ప్రేమ మరియు విశ్వాసంతో పూజిస్తారు. తిరుపతి బాలాజీ ఆలయంలో, సాయంత్రం మహా ఆరతి నిర్వహిస్తారు. 
కొంతమంది భక్తులు తమ ఇళ్లలో కూడా బాలాజీని పూజిస్తారు. 

ఈ రోజున ‘ఓం నమో నారాయణ’ వంటి మంత్రాలను జపించడం అత్యంత ప్రతిఫలదాయకంగా పరిగణించబడుతుంది. 

ఈ రోజున స్వామికి తలనీలాలు సమర్పిస్తారు. అహంకారం మరియు ప్రతికూల భావాల నుండి విడిపించడానికి తలనీలాలు సమర్పిస్తారు.

బాలాజీ జయంతి ప్రాముఖ్యత:

పురాణాల ప్రకారం, లక్ష్మీ దేవిని వెతుకుతూ స్వామి భూమి పైకి వచ్చారని. పద్మావతి పరిణయం తరువాత స్వామి తిరుమల కొండమీద శిలగా వెలిశారని చెప్తారు. 

తిరుపతి ఆలయాన్ని కలియుగ 'వైకుంఠం' (విష్ణువు స్వర్గపు నివాసం)గా పరిగణిస్తారు. బాలాజీని పూజించడం ద్వారా అన్ని భయాలు తొలగిపోయి జీవితంలో అంతులేని ఆనందం మరియు విజయం లభిస్తుందని నమ్ముతారు. బాలాజీ జయంతి నాడు స్వామిని  హృదయపూర్వకంగా ప్రార్థించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. బాలాజీ తన భక్తులు శాంతిని పొందడానికి మరియు ఇతరుల సంక్షేమం కోసం పనిచేయడానికి సహాయం చేస్తాడు. అంకితభావంతో బాలాజీ పూజ చేసే వ్యక్తి చివరికి 'మోక్షం' లేదా మోక్షాన్ని కూడా పొందుతాడు.శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం


Sri Matangi Devi Ashtottara Sata Nama Sthotram - శ్రీ మాతంగీ అష్టోత్తర శత నామ స్తోత్రం

శ్రీ రుద్రయామళే మాతంగీ అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీభైరవ ఉవాచ:
భగవాన్‌ శ్రోతు మిచ్చామి మాతంగ్యాః శతనామకమ్‌
యద్గుహ్యం సర్వతంత్రేషు నకస్యాపి ప్రకాశితమ్‌ ॥ 01 ॥

శ్రుణు దేవి ప్రవక్ష్యామి రహస్యాతి రహస్యకమ్‌ ।
నాఖ్యేయం యత్ర కుత్రాపి పఠనీయం పరాత్పరమ్‌ ॥ 02 ॥

యస్యైకవారపఠనాత్‌ సర్వే విఘ్నాః ఉపద్రవా ।
నశ్యంతి తక్షణాద్దేవి వహ్నినా తూలరాశివత్‌ ॥ 03 ॥

ప్రసన్నా జాయతే దేవి మాతంగీ చాస్యపాఠతః ।
సహస్ర నామపఠనే యత్ఫలం పరికీర్తితమ్‌ ॥
తత్కోటి గుణితమ్‌ దేవి నామాష్ట శతకమ్‌ శుభమ్‌ ॥ 04 ॥

వినియోగః
ఓం అస్య శ్రీ మాతంగీ శతనామ స్తోత్రస్య భగవన్‌ మతంగ ఋషిః
అనుష్టుప్ఛందః మాతంగీ దేవతా మాతంగీ ప్రీతయే పాఠే వినియోగః ।
మహామత్తమాతంగినీ సిద్ధిరూపాతథా యోగినీ భద్రకాళీ రమా చ
భవానీ భయప్రీతిదా భూతియుక్తా భవారాధితా భూతి సంపత్కరీ చ ॥ 01 ॥

జనాధీశమాతా ధనాగారదృష్టి ర్దనేశార్చితా ధీరవాపీ వరాంగీ ।
ప్రహృష్టా ప్రభారూపిణీ కామరూపా ప్రకృష్టా మహాకీర్తిదా కర్ణనాళీ ॥ 02 ॥

కరాళీ భగా ఘోరరూపా భగాంగీ భగాఖ్యా భగప్రీతిదా భీమరూపా ।
భవానీ మహాకౌశికీ కోశపూర్ణా కిశోరీ కిశోరప్రియా కాళికా నందయీహా ॥ 03 ॥

మహాకారణాకారణా కర్మశీలా కపాలీ ప్రసిద్ధా మహాసిద్ధి ఖండా ।
మకార ప్రియా మానరూపా మహేశీ మనోల్లాసినీ లాస్యలీలాలయాంగీ ॥ 04 ॥

క్షమాక్షేమశీలా క్షపాకారిణీ చా క్షయప్రీతిదా భూతి యుక్తాభవానీ ।
భవారాధితా భూతిసత్యాత్మికా చ ప్రభోద్భాసితా భానుభాస్వత్కరా చ॥ 05 ॥

దరాధీశమాతా ధనాగార దృష్టి ర్థనేశార్చితా ధీవర్ణా ధీవరాంగీ ।
ప్రకృష్ట ప్రభారూపిణీ ప్రాణరూపా ప్రకృష్ట స్వరూపా స్వరూప ప్రియా చ॥ 06 ॥

చలత్కుండలా కామినీ కాంతయుక్తా కపాలాచలా కాలకోద్దారిణీ చ ।
కదంబప్రియా కోటరీ కోటదేహా క్రమా కీర్తిదా కర్ణరూపాచ కాక్ష్మీః ॥ 07 ॥

క్షమాంగీ క్షయప్రేమరూపా క్షపా చ
క్షయాక్షా క్షయాఖ్యా క్షయా ప్రాంతరా చ ।
క్షవత్కామినీ క్షారిణీ క్షీరపూర్ణా
శివాంగీ చ శాకంభరీ శాకదేహా ॥ 08 ॥

మహాశాకయజ్ఞా ఫలప్రాశకా చ
శకాహ్వా శకాహ్వా శకాఖ్యా శకా చ ।
శకాక్షాంతరోషా సురోషా సురేఖా
మహాశేషయజ్ఞోపవీత ప్రియా చ ॥ 09 ॥

జయంతీ జయా జాగ్రతీ యోగ్యరూపా
జయాంగా జపధ్యాన సంతుష్టసంజ్ఞా ।
జయ ప్రాణరూపా జయస్వర్ణదేహా
జయజ్వాలినీ యామినీ యామ్య రూపా॥ 10 ॥

జగన్మాతృరూపా జగద్రక్షణా చ
స్వథావౌషడంతా విలంబా విళంబా ।
షడంగా మహాలంబరూపా సిహస్తా
తదాహారిణీ హారిణీ హారిణీ చ ॥ 11 ॥

మహామంగళా మంగళ ప్రేమకీర్తిర్ని
నిశుంభ క్షిదా శుంభదర్పాపహా చ ।
తథానందబీజాది ముక్తి స్వరూపా
తథా చండముండాపదా ముఖ్యచండా ॥ 12 ॥

ప్రపచండాప్రచండా మహాచండవేగా
చలచ్చామరా చామరా చంద్రకీర్తిః ।
సుచామీకరా చిత్ర భూషోజ్జ్వలాంగీ
సుసంగీత గీతం చ పాయాదపాయాత్‌ ॥ 13 ॥

ఇతి తే కథితందేవి నామ్నా మష్టోత్తరం శతమ్‌ ।
గోప్యం చ సర్వత్రంతే షు గోపనీయం చ సర్వదా ॥ 14 ॥

ఏతస్య సతతాభ్యాసా త్సాక్షాద్దేవో మహేశ్వరః ।
త్రిసంధ్యాం చ మహాభక్త్యా పఠనీయం సుఖోదయం ॥ 15 ॥

న తస్యదుష్కరం కించిజ్జాయతే స్పర్శతః క్షణాత్‌ ।
సుకృతం యత్తదేవాప్తం తస్మాదావర్తయేత్సదా ॥ 16 ॥

సదైవ సన్నిధౌ తస్యదేవీ వసతి సాదరమ్‌ ।
అయోగా యే త ఏవాగ్రే సుయోగాశ్చ భవంతి వై ॥ 17 ॥

త ఏవ మిత్ర భూతాశ్చ భవంతి తత్ప్రసాదతః ।
విషాణి నోపసర్పంతి వ్యాధయో న స్పృశంతి తాన్‌ ॥ 18 ॥

లూతా విస్ఫోటకాః సర్వేశమం యాంతి చ తక్షణాత్‌ ।
జరాపలిత నిర్ముక్తః కల్పజీవీ భవేన్నరః ॥ 19 ॥

అపికింబహునోక్తేన సాన్నిధ్యం ఫలమాప్నుయాత్‌ ।
యావన్మయాపురాప్రోక్తం ఫలం సాహస్రనామకమ్‌ ॥ 20 ॥

తత్సర్యం లభతే మర్త్యో మహామాయా ప్రసాదతః

ఇతి శ్రీ రుద్రయామళే మాతంగీ శతనామ స్తోత్రం సమాప్తం
 ॥

Sri Matangi Devi Ashtottara Sata Namavali - శ్రీ మాతంగీ అష్టోత్తర శత నామావళి

శ్రీ మాతంగీ అష్టోత్తర శత నామావళి

ఓం మహామత్త మాతంగిన్యై నమః
ఓం సిద్ధిరూపాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం భద్రకాళ్యై నమః
ఓం రమాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం భయప్రీతిదాయై నమః
ఓం భూతియుక్తాయై నమః
ఓం భవారాధితాయై నమః
ఓం భూతిసంపత్కర్యై నమః
 ॥ 10 ॥

ఓం జనాధీశమాత్రే నమః
ఓం ధనాగారదృష్టయే నమః
ఓం ధనేశార్చితాయై నమః
ఓం ధీరవాసిన్యై నమః
ఓం వరాంగ్యై నమః
ఓం ప్రకృష్టాయై నమః
ఓం ప్రభారూపిణ్యై నమః
ఓం కామరూపాయై నమః
ఓం ప్రహృష్టా
యై నమః
ఓం మహాకీర్తిదాయై నమః
 ॥ 20 ॥

ఓం కర్ణనాల్యై నమః
ఓం కరాళ్యై
 నమః
ఓం భగా
యై నమః
ఓం ఘోరరూపాయై నమః
ఓం భగాంగై నమః
ఓం భగాఖ్యాయై నమః
ఓం భగప్రీతిదాయై నమః
ఓం భీమరూపాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం మహాకౌశిక్యై నమః
 ॥ 30 ॥

ఓం కోశపూర్ణా
యై నమః
ఓం కిశోరీకిశోర ప్రియానంద ఈహాయై నమః
ఓం మహాకారణా కారణాయై నమః
ఓం కర్మశీలాయై నమః
ఓం కపాలిన్యై నమః
ఓం ప్రసిద్ధాయై నమః
ఓం మహాసిద్ధఖందాయై నమః
ఓం మకారప్రియాయై నమః
ఓం మానరూపా
యై నమః
ఓం మహేశ్యై 
నమః ॥ 40 ॥

ఓం మహోల్లాసిన్యై నమః
ఓం లాస్యలీలాయై నమః
ఓం లయాంగ్యై నమః
ఓం క్షమా
యై నమః
ఓం క్షేమలీలాయై నమః
ఓం క్షపాకారిణ్యై నమః
ఓం అక్షయ ప్రీతిదా
యై నమః
ఓం భూతియుక్తాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం భవారాధితా
యై నమః ॥ 50 ॥

ఓం భూతిసత్యాత్మికాయై నమః
ఓం ప్రభోద్భాసితాయై నమః
ఓం భానుభాస్వత్కరా
యై నమః
ఓం ధరాధీశమాత్రే నమః
ఓం ధనాగార దృష్ట్యై నమః
ఓం ధనేశార్చితా
యై నమః
ఓం ధీవరాయై నమః
ఓం ధీవరాంగ్యై నమః
ఓం ప్రకృష్ణాయై నమః
ఓం ప్రభారూపిణ్యై నమః
 ॥ 60 ॥

ఓం ప్రాణరూపాయై నమః
ఓం ప్రకృష్ణస్వరూపాయై నమః
ఓం స్వరూపప్రియాయై నమః
ఓం కదంబ ప్రియాయై నమః
ఓం కోటర్వ్యై నమః
ఓం కోటదేహాయై నమః
ఓం క్రమా
యై నమః
ఓం కీర్తిదాయై నమః
ఓం కర్ణరూపా
యై నమః
ఓం లక్ష్మ్యై నమః
 ॥ 70 ॥

ఓం క్షమాంగ్యై నమః
ఓం క్షయ ప్రేమరూపాయై నమః
ఓం క్షపా
యై నమః
ఓం క్షయాక్షయాయై నమః
ఓం క్షయాఖ్యాయై నమః
ఓం క్షయాప్రాంతరాయై నమః
ఓం క్షవత్కామిన్యై నమః
ఓం క్షారిణ్యై నమః
ఓం క్షీరపూషాయై నమః
ఓం శివాంగ్యై నమః
 ॥ 80 ॥

ఓం శాకంభర్యై నమః
ఓం శాకదేహాయై నమః
ఓం మహాశాకయజ్ఞాయై నమః
ఓం ఫలప్రాశకాయై నమః
ఓం శకాహ్వాయై నమః
ఓం శకథ్యాయై నమః
ఓం శకాఖ్యాయై నమః
ఓం శకాయై నమః
ఓం శకాక్షాంతరోషాయై నమః
ఓం సురోషాయై నమః
 ॥ 90 ॥

ఓం సురేఖాయై నమః
ఓం మహాశేషయజ్ఞోపవీత ప్రియాయై నమః
ఓం జయంత్యై నమః
ఓం జయాయై నమః
ఓం జాగ్రత్యై నమః
ఓం యోగ్యరూపాయై నమః
ఓం జయాంగాయై నమః
ఓం జపధ్యాన సంతుష్ట సంజ్ఞాయై నమః
ఓం జయప్రాణరూపాయై నమః
ఓం జయస్వర్ణదేహాయై నమః
 ॥ 100 ॥

ఓం జయజ్వాలిన్యై నమః
ఓం యామిన్యై నమః
ఓం యామ్యరూపాయై నమః
ఓం జగన్మాతృరూపాయై నమః
ఓం జగద్రక్షణాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం ఔషడంతాయై నమః
ఓం విలంబా
యై నమః
ఓం విళంబాయై నమః
ఓం షడంగా
యై నమః ॥ 110 ॥

ఓం మహాలంబరూపాయై నమః
ఓం అసిహస్తా
యై నమః
ఓం హరిణీ హరిణీ హారిణ్యై నమః
ఓం మహామంగళాయై నమః
ఓం ప్రేమకీర్యై నమః
ఓం నిశుంభాక్షిదాయై నమః
ఓం శుంభదర్పాపహాయై నమః
ఓం ఆనంద బీజాదిముక్తి స్వరూపాయై నమః
ఓం చండముండాపదాయై నమః
ఓం ముఖ్యచండాయై నమః
 ॥ 120 ॥

ఓం ప్రచండా ప్రచండా మహాచండవేగాయై నమః
ఓం చలచ్చామరాయై నమః
ఓం చంద్రకీర్యై నమః
ఓం శుచామీకరాయై నమః
ఓం చిత్రభూషోజ్జ్వలాంగ్యై నమః
ఓం మాతంగ్యై నమః

॥ శ్రీ మాతంగీ అష్టోత్తర శతనామావళి సమాప్తం 

శ్రీ మాతంగి మహా విద్యా

Wednesday, December 10, 2025

Sri Matangi Sthotra Pushpamjali - శ్రీ మాతంగి స్తోత్ర పుష్పాంజలిః

 శ్రీ మాతంగీ స్తోత్ర పుష్పాంజలిః

అస్తి నానావిధంశస్తం వస్తునావైణికేన వః ।
అమృతాంబునిధేర్మధ్యే మాణిక్య ద్వీపమాశ్రయే ॥ 01 ॥

సుధాతరంగ సంచారిమారుతస్పర్శ శీతలం ।
కల్పద్రుమకదంబాలి పారిజాతపటీరకైః ॥ 02 ॥

నివడీకృతముద్యానం నిషేవేనిర్భరోత్సవం ।
తదలసలతోన్మీలత్కుసుమామోద మేదురం ॥ 03 ॥

జాగర్తి మానసే మత్కేతరుణం నీపకాననం ।
తస్యాంతరాలతరలాముక్తముక్తాలతాతతేః ॥ 04 ॥

జ్యోతిర్మయమహన్నౌమిమహితం రత్నమండపం ।
సరస్వత్యా చ లక్ష్మ్యా చ పూర్వాదిద్వారభూమిషు ॥ 05 ॥

శంఖపద్మనిధిభ్యాం చ సతతాధ్యుషి సంస్తువే ।
ఇంద్రాదీన్లోకపాలాన్‌ చ సాయుధాన్‌ సపరిచ్చదాన్‌ ॥ 06 ॥

మండపస్యబహిర్భాగేప్యష్టదిక్షు క్రమస్థితాన్‌ ।
అథధ్యాయామి రత్నార్చిరయత్నాకప్తదీపికాం ॥ 07 ॥

హరిచందన సంలిప్తాం హారిణీం మణిదీపికాం ।
తత్రత్రికోణ పంచారాష్టారషోడశపత్రకైః ॥ 08 ॥

అష్టాష్టధారవేదా స్త్రైశ్చిన్మయం వక్త్ర మీమహే ।
తస్యమధ్యే కృతానాసామ సాధారణ వైభవాం ॥ 09 ॥

ఇందురేఖావతీమేణీ లోచనాం వేణిశాలినీం ।
హాసాంశూల్లాసనాసీర నాసాభరణ మౌక్తికాం ॥ 10 ॥

మదరక్తకపోలశ్రీ మగ్నమాణిక్య దర్పణాం ।
ఆనందహారిణీం తాలిదలతాటంకధారిణీం ॥ 11 ॥

ఉచ్చపీనకుచామచ్చహారాం తుచ్చవలగ్భకాం ।
సుకుమారభుజావల్లీ వేల్లత్కంకణరింఖణాం ॥ 12 ॥

వామస్తనముఖన్యస్త వీణావాదవినోదినీం ।
వలినాభినభోభూత కాంచీ హారిప్రభాం శుభాం ॥ 13 ॥

న్యస్తైకచరణాం పద్మే సలీలాసాలసాననాం ।
అనర్థ్యలావణ్యవతీం మాదినీం వర్ణ మాతృకాం ॥ 14 ॥

అనంగ శక్తిజీవాతు తద్విక్షేప హరాంగనాం ।
త్య్రస్రేరతిం ప్రీతిమపి ప్రణమామి మనోభవాం ॥ 15 ॥

ద్రావణంరోషణంచైవ బంధనం మోహనం తథా ।
అస్త్రమున్మాదనాఖ్యం చ పంచమం పాతుమే హృది ॥ 16 ॥

కామరాజం చ కందర్పం మన్మథం మకరధ్వజం ।
మనోభవం చ పంచార కోణాగ్రావస్థితం స్తుమః ॥ 17 ॥

బ్రాహ్మీం మాహేశ్వరీం చైవకౌమారీం వైష్ణవీమపి ।
వారాహీమపి మాహేంద్రీం చ చాముండాం చండికాం నుమః ॥ 18 ॥

లక్ష్మీః సరస్వతీచైవ రతిః ప్రీతిస్తథైవ చ ।
కీర్తిశ్శాంతిచ పుష్టిశ్చతుష్టిరిత్యష్టకం భజే ॥ 19 ॥

వామాజ్యేష్ఠా చ రౌద్రీ చ శాంతిః శ్రద్ధాసరస్వతీ ।
క్రియాశక్తిశ్చ లక్ష్మీశ్చ సృష్టిశ్చైవతు మోహినీ ॥ 20 ॥

తథాపుర్ణాదినే చాశ్వాసినీవాలీ తథైవ చ ।
విద్యున్మాలిన్యథసురా నందాద్యా నాగవద్ధికా ॥ 21 ॥

ఇతిషోడశ శక్తీనాం మండలం మానయామహే ।
అసితాంగో రురుశ్చండ క్రోధనోన్మత్తభైరవాః ॥ 22 ॥

కపాలీభీషణశ్చైవ సంహారశ్చేతి పాంత్వమీ ।
మాతంగీం సిద్ధలక్ష్మీం చ మహామాతంగికామపి ॥ 23 ॥

మహతీం సిద్ధలక్ష్మీం చ తుర్యాం చ తదుపాస్మహే ।
గణనాథశ్చ దుర్గా చ వటుకః క్షేత్రపోవతు ॥ 24 ॥

శక్తిరూపాణి చాంగాని మనసాంగీ కరోమ్యహం ।
హంసమూర్తిః స చ పరః ప్రకాశానంద దేశికః ॥ 25 ॥

పూర్ణోనిత్యశ్చవరుణః పాతు మాం పంచదేశికీ ।
శివేత్వాంశేషకాదేవి మాతంగేశ్వరి మానయే ॥ 26 ॥

ఈక్షే చ మానసేమత్కే క్షేత్రపాలం కృపాలయం ।
శుకినీ శోకనిర్హంత్రీ సవీణావేణి భాసురా ॥ 27 ॥

సురార్చితా ప్రసన్నా చ సంవిద్భవతి శాంభవీ ॥ 28॥

మదేనశోణా పదపాంగకోణా విభక్తవీణా నిగమప్రవీణా ।
ఏణాంక చూడాకరుణాధురీణా ప్రీణాతు వః పోషిత పుష్పవాణా ॥ 29 ॥

సంవిన్మయంరుద్ర వసన్నతోషినః సాధకీంద్ర భృంగకులః ।
కమపుష్పాంజలి రేషమతాం మాతంగకన్యకా యాః ॥ 30 ॥

ఇతి శ్రీమాతంగీస్తోత్ర పుష్పాంజలిః సమాప్తం 

శ్రీ మాతంగి మహా విద్యా

Sri Matangi Devi Hrudaya Sthotram - శ్రీ మాతంగి దేవి హృదయ స్తోత్రం

శ్రీ మాతంగి దేవి హృదయ స్తోత్రం

ఏకదాకౌతుకావిష్టా భైరవం భూతసేవితం
ఖైరవీ పరిపప్రచ్చ సర్వభూతహితే రతా ॥ 01 ॥

భగవన్‌ సర్వధర్మజ్ఞ భూతవాత్సల్యభావన
అహం వేదితుమిచ్చామి సర్వభూతోపకారకమ్‌ ॥ 02 ॥

కేన మంత్రేణ జప్తేన స్తోత్రేణ పఠితేన చ
సర్వథా శ్రేయసాం ప్రాప్తి ర్భూతానాం భూతిమిచ్చతామ్‌ ॥ 03 ॥

శ్రీ బైరవ ఉవాచ:
శృణు దేవి తవ స్నేహాత్ప్రాయో గోప్యమపి ప్రియే
కథయిష్యామి తత్సర్వం సుఖసంపత్కరం శుభమ్‌ ॥ 04 ॥

పఠతాం శృణ్వతాం నిత్యం సర్వసంపత్తిదాయకమ్‌
విద్యైశ్వర్య సుఖావ్యాప్తి మంగళప్రదముత్తమమ్‌ ॥ 05 ॥

మాతంగ్యా హృదయ స్తోత్రం దుఃఖదారిద్య భంజనమ్‌
మంగళం మంగళానాం చ అస్తి సర్వసుఖప్రదమ్‌ ॥ 06 ॥

ఓం అస్య శ్రీ మాతంగీహృదయస్తోత్ర మంత్రస్య-దక్షిణామూర్తి
ఋషిః విరాట్ఛందః శ్రీ మాతంగీ దేవతా హ్రీం బీజం - క్లీం శక్తిః
హ్రూం కీలకం సర్వవాంఛితార్థసిద్ధ్యర్థే జపే వినియోగః.

కరాంగన్యాసః
ఓంహ్రీం హృదయాయ నమః 
ఓం క్లీం శిరసే స్వాహా 
ఓం హ్రూం శిఖాయై వషట్‌ 
ఓం హ్రీం నేత్రత్రయాయ వౌషట్‌ 
ఓం క్లీం కవచాయ హుం 
ఓం హ్రూం అస్త్రాయ ఫట్‌ 
ఏవం కరన్యాసః

ధ్యానమ్‌
శ్యామాం శుభ్రాం సుఫాలాం త్రికమలనయనాం రత్నసింహాసనస్థాం
భక్తాభీష్టప్రదాత్రీం సురనీకరకరాసేవ్య కంజాంఘ్రియుగ్మాం
నీలాంభోజాతకాంతిం నిశిచరనికరారన్య దావాగ్నిరూపాం
మాతంగీమావహంతీ మభిమతఫలదాం మోహినీం చింతయామి ॥ 07 ॥

నమస్తే మాతంగ్యై మృదుముదితతన్వై తనుమతాం
పరశ్రేయోదాయై కమలచరణధ్యానమనసాం
సదా సంసేవ్యాయై సదసి విబుధైర్థి వ్యధిషణైః
దయార్ద్రాయై దేవ్యై దురితదలనోద్దండ మనసే ॥ 08 ॥

పరం మాతస్తే యో జపతి మనుమేవోగ్రహృదయః
కవిత్వం కల్పానాం కలయతి సుకల్పః ప్రతిపదం
అపిప్రాయో రమ్యామృతమయపదా తస్య లలితా
నటీ చాద్యా వాణీ నటనరసనాయాం చ ఫలితా ॥ 09 ॥

తవ ధ్యాయంతో యే వపురనుజపంతి ప్రవలితం
సదా మంత్రం మాతర్నహి భవతి తేషాం పరిభవః
కదంబానాం మాల్యైరపి శిరసి యుంజంతి యది
యే భవంతి ప్రాయస్తే యువతి జనయూథస్వవశగాః ॥ 10 ॥

సరోజై స్సాహస్త్రైస్సరసిజపదద్వంద్వమపి యే
సహస్రం నా మోక్త్వా తదపిచ తవాంగే మనుమితం
పృథజ్నామ్నా తేనాయుతకలితమర్చంతి ప్రసృతే సదా
దేవవ్రాత ప్రణమిత పదాం భోజయుగళాః ॥ 11 ॥

తవ ప్రీత్యైర్తా ర్దదతి బలిమాదాయ సలిలం
సమత్స్యం మాంసం వా సురుచిరసితం రాజరుచితం
సుపుణ్యాయై స్వాంతస్తవ చరణప్రేమైకరసికాః
అహోభాగ్యం తేషాం త్రిభువన మలం వశ్యమఖిలమ్‌ ॥ 12 ॥

లసల్లోలశ్రోత్రాభరణకిరణక్రాంతి లలితం
మితస్మేరజ్యోత్స్నా ప్రతిఫలితభాభిర్వికిరితం ముఖాంభోజం
మాతస్తవ పరిలుఠ ద్భ్రుమధుకరం రమే యే
ధ్యాయంతి త్యజసి నహి తేషాం సుభవనమ్‌ ॥ 13 ॥

పరశ్శ్రీమాతంగ్యా జపతి హృదయాఖ్యస్సుమనసా
మయం సేవ్యస్సద్యోభిమతఫలదశ్చాతి లలితః
నరా యే శృణ్వంతి స్తవమపి పఠంతీమ మనునిశం
న తేషాం దుష్ప్రాప్యం జగతి యద లభ్యం దివిషదామ్‌ ॥ 14 ॥

ధనార్ధీ ధనమాప్నోతి దారార్థీ సుందరీః ప్రియాః
సుతార్థీ లభతే పుత్రం స్తవస్యాస్య ప్రకీర్తనాత్‌ ॥ 15 ॥

విద్యార్థీ లభతే విద్యాం వివిధాం విభవప్రదాం
జయార్ధీ పటనాదస్య జయం ప్రాప్నోతి నిశ్చితమ్‌ ॥ 16 ॥

నష్టరాజ్యో లభేద్రాజ్యం సర్వసంపత్సమాణశ్రితం
కుబేర సమసంపత్తిః స భవేర్దృదయం పఠన్‌ ॥ 17 ॥

కిమత్ర బహునోక్తేన యద్యదిచ్చతి మానవః
మాతంగీ హృదయస్తోత్ర పఠనా త్సర్వమాప్నుయాత్‌ ॥ 18 ॥

॥ ఇతి శ్రీ దక్షిణామూర్తి సంహితాయాం 

Sumukhee Athava Matangi Kavacham - సుముఖీ అథవా మాతంగీకవచం

సుముఖీ అథవా మాతంగీకవచం

శ్రీగణేశాయ నమః ।

శ్రీపార్వత్యువాచ ।
దేవదేవ మహాదేవ సృష్టిసంహారకారక ।
మాతంగ్యాః కవచం బ్రూహి యది స్నేహోஉస్తి తే మయి॥ 01 ॥

శివ ఉవాచ ।
అత్యంతగోపనం గుహ్యం కవచం సర్వకామదం ।
తవ ప్రీత్యా మయాఖ్యాతం నాన్యేషు కథ్యతే శుభే ॥ 02 ॥

శపథం కురు మే దేవి యది కించిత్రకాశసే ।
అనయా సదృశీ విద్యా న భూతా న భవిష్యతి ॥ 03 ॥

శవాసనాం రక్తవస్త్రాం యువతీం సర్వసిద్ధిదాం ।
ఏవం ధ్యాత్వా మహాదేవీం పఠేత్కవచముత్తమం ॥ 04 ॥

ఉచ్చిష్టం రక్షతు శిరః శిఖాం చండాలినీ తతః ।
సుముఖీ కవచం రక్షేద్దేవీ రక్షతు చక్షుషీ ॥ 05 ॥

మహాపిశాచినీ పాయాన్నాసికాం హ్రీం సదావతు ।
ఠః పాతు కంఠదేశం మే ఠః పాతు హృదయం తథా ॥ 06 ॥

ఠో భుజౌ బాహుమూలే చ సదా రక్షతు చండికా ।
ఐం చ రక్షతు పాదౌ మే సౌః కుక్షిం సర్వతః శివా ॥ 07 ॥

ఐం హ్రీం కటిదేశం చ ఆం హ్రీం సంధిషు సర్వదా ।
జ్యేష్ఠమాతంగ్యంగులిర్మే అంగుల్యగ్రే నమామి చ ॥ 08 ॥

ఉచ్చిష్టచాండాలి మాం పాతు త్రైలోక్యస్య వశంకరీ ।
శివే స్వాహా శరీరం మే సర్వసౌభాగ్యదాయినీ ॥ 09 ॥

ఉచ్చిష్టచాండాలి మాతంగి సర్వవశంకరి నమః ।
స్వాహా స్తనద్వయం పాతు సర్వశత్రువినాశినీ ॥ 10 ॥

అత్యంతగోపనం దేవి దేవైరపి సుదుర్లభం ।
భ్రష్టేభ్యః సాధకేభ్యోపి ద్రష్టవ్యం న కదాచన ॥ 11 ॥

దత్తేన సిద్ధిహానిః స్యాత్సర్వథా న ప్రకాశ్యతాం ।
ఉచ్చిష్టేన బలిం దత్వా శనౌ వా మంగలే నిశి ॥ 12 ॥

రజస్వలాభగం స్పృష్ట్వా జపేన్మంత్రం చ సాధకః ।
రజస్వలాయా వస్త్రేణ హోమం కుర్యాత్సదా సుధీః ॥ 13 ॥

సిద్ధవిద్యా ఇతో నాస్తి నియమో నాస్తి కశ్చన ।
అష్టసహస్రం జపేన్మంత్రం దశాంశం హవనాదికం ॥ 14 ॥

భూర్జపత్రే లిఖిత్వా చ రక్తసూత్రేణ వేష్టయేత్‌ ।
ప్రాణప్రతిష్ఠామంత్రేణ జీవన్యాసం సమాచరేత్‌ ॥ 15 ॥

స్వర్ణమధ్యే తు సంస్థాప్య ధారయేద్దక్షిణే కరే
సర్వసిద్ధిర్భవేత్తస్య అచిరాత్పుత్రవాన్భవేత్‌ ॥ 16 ॥

స్త్రీభిర్వామకరే ధార్యం బహుపుత్రా భవేత్తదా ।
వంద్యా వా కాకవంద్యా వా మృతవత్సా చ సాంగనా॥ ॥ 17॥

జీవద్వత్సా భవేత్సాపి సమృద్ధిర్భవతి ధ్రువం ।
శక్తిపూజాం సదా కుర్యాచ్చివాబలిం ప్రదాపయేత్‌ ॥ 18 ॥

ఇదం కవచమజ్ఞాత్వా మాతంగీ యో జపేత్సదా ।
తస్య సిద్ధిర్న భవతి పురశ్చరణలక్షతః ॥ 19 ॥

ఇతి శ్రీరుద్రయామలే తంత్రే మాతంగీసుముఖీకవచం సమాప్తం

Anaghashtami - అనఘాష్టమి

అనఘాష్టమి ॥  ఓం కాళీ-తార-ఛిన్నమస్తా -షోడశీమహేశ్వరి భువనేశ్వరీ-త్రిపురభైరవి-ధూమ్రావతి భగళాముఖి-మాతంగి-కమలాలయ దశమహావిద్యా స్వరూపిణి అనఘాదేవ...