Wednesday, January 1, 2020

RAMA SABHA - రామ సభ

రామసభ

రాజసభ, రఘు రామసభ
సీతా కాంత కల్యాణ సభ |
అరిషడ్వర్గములరయు సభ
పరమపదంబును ఒసగు సభ || (రాజసభ)

వేదాంతులకే జ్ఞాన సభ
విప్రవరులకే దాన సభ |
దుర్జనులకు విరోధి సభ
సజ్జనులకు సంతోష సభ || (రాజసభ)

సురలు, అసురులు కొలచు సభ
అమరులు, రుద్రులు పొగడు సభ |
వెరువక హరివిల్లు విరచు సభ
జనకుని మది మెప్పించు సభ || (రాజసభ)

భక్తి జ్ఞానములొసగు సభ
సృష్టి రహితులై నిలచు సభ |
ఉత్తమ పురుషుల ముక్తి సభ
చిత్త విశ్రాంతినొసగు సభ || (రాజసభ)

గం-ధర్వులు గానము చేయు సభ
రం-భాదులు నాట్యములాడు సభ |
పుష్ప వర్షములు కురియు సభ
పూజ్యులైన మునులుండు సభ || (రాజసభ)

No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...