Saturday, August 8, 2026

Numerology - Number 1 - న్యూమరాలజీ - 1వ సంఖ్య

న్యూమరాలజీ - 1వ సంఖ్య

1. గ్రహము : సూర్యుడు
జన్మదినం తేది సంఖ్య - 1, 10, 19, 28

1వ సంఖ్య క్రిందకు వచ్చేవారు:
ప్రాచ్య పాశ్చాత్య రేఖా శాస్త్రజ్ఞులు, సంఖ్యా శాస్త్రజ్ఞులు వీరందరూ ఇంగ్లీషు నెలలు, తేదీలు ఆధారంగా చేసుకొని జీవిత ఫలితాలు చెబుతుండడం వల్ల సంఖ్యాశాస్త్రంలో ఇంగ్లీషు తేదీలు, నెలలు వ్యవహారంలో ఉన్నాయి.

జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలోనైనాసరే 1, 10, 19, 28 ఈ తేదీలలో పుట్టినవారిని అంటే జనన సంఖ్య 1 సంఖ్య గల వారని పిలువబడతారు.

ఇచ్చట చెప్పిన 1, 10, 19, 28 తేదీలలో
1వ తేది 1 సంఖ్యకు చెందిందనే విషయం స్పష్టముగానే తెలియుచున్నది.

10వ తేదీలో సున్నకు ప్రత్యేకంగా విలువ లేదు. అంచేత సున్న తీసివేస్తే ఒకటి మాత్రమే మిగులుతుంది.

19వ సంఖ్యను 1 + 9 అని కూడితే 10 వస్తుంది. ఆ 10 లో ఉన్న సున్న తీసివేస్తే 1 మిగులుతుంది.

అలాగే, 28 అనేదాన్ని 2 + 8 = 10 సున్న తీసేస్తే మిగిలేది 1 మాత్రమే.

అందుచేత, 1, 10, 19, 28 ఈ నాలుగు తేదీలలో పుట్టినవారు ఎవరైనా సరే, వారందరూ ఒకటి సంఖ్య వారని తెలుసుకోవాలి.

దీనితో పాటు 1వ నెంబరు అదృష్ట సంఖ్య లేదా ఫేట్ సంఖ్యగా లేదా డెస్టినీ సంఖ్యగా కలవారు కూడా ఈ 1వ నెంబరు క్రిందకు వస్తారు.

దీనితో పాటు ఒకరి పేరులోని అక్షరాలకున్న విలువల సమష్టి సంఖ్య 1గా కలవారు కూడా ఈ 1వ నెంబరు క్రిందకు వస్తారు.

(1) పుట్టిన తేదీ సంఖ్య.
(2) పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటి సమష్టి సంఖ్య.
(3) ఒకరి పేరులోని అక్షరాలకున్న విలువల సమష్టి సంఖ్య.
ఈ మూడింటిలో 1వ నెంబరు కలవారు ఈ సంఖ్య క్రిందకు వస్తారు.
పైన చెప్పిన మూడు విధానాలలో సమష్టి సంఖ్య సాధించవలసిన విధానాన్ని ముందు విభాగంలో చెప్పడం జరిగింది.

1వ సంఖ్యకు అధిపతి సూర్యుడు.
1వ సంఖ్యకు అధిపతి సూర్యుడు. సమస్త గ్రహాలకు అధిపతి సూర్యుడు. సమస్త సృష్టికి ప్రాణికోటికి మూలకారకుడు, ఆధార భూతుడైన సూర్యుడు 1వ సంఖ్యకు అధిపతి. వీరి మీద సూర్యగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే వీరిని సూర్య జాతకులు అని పిలుస్తున్నాము.

సూర్య జాతకులకు ఆత్మాభిమానం, పట్టుదల కార్యదీక్ష చాల ఎక్కువ. వీరు వారి ఆత్మ విశ్వాసాన్ని, పనినే నమ్ముకుంటారు. వీరిది ప్రాక్టికల్ లైఫ్. అందువల్ల వీరు శ్రమనే నమ్ముకొంటారు. వీరు శ్రమచేస్తే సూర్యుని వలె వెలుగుతారు.

వీరు మంచి బుద్ధికుశలత, మంచి తెలివితేటలు, మంచిసృజనాత్మకత, గొప్ప ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఉపయోగకరమైన జ్ఞానం, సమాచారాన్నే ఇష్టపడతారు. ప్రకాశవంతమైన జీవితం గల వీరు నిజాయితీ పరులుగా, గంభీరంగా, హుందాగా జీవించుటకే ఇష్టపడతారు. వీరి వేషభాషలు, నడవడిక ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి.

వీరు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. సునిశిత బుద్ధిగల వీరు ఏ పనిలో చొరబడినా ఏకాగ్రతతో ఆ పనిని పూర్తి చేస్తారు. కనుక వీరి ప్రయత్నములు నిరాటంకంగా విజయం సాధిస్తాయి. వీరు శారీరక శ్రమ కంటే మానసికంగా కష్టించి శ్రమ చేయడానికే ఇష్టపడతారు. వీరు ఏ పనిలో చేసిన బాగా ఆలోచించిన తరువాతే చేస్తారు. అలాగే మొదలుపెట్టిన కార్యం నుండి సగంలో వెనుదిరుగుట అన్నది వీరి విషయంలో జరుగదు. ఎలాంటి ఆటంకాలకు అయినా వీరు భయపడరు. వాటిని ఇంకా ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు.

సర్వ శ్రేఘ్టులు
సూర్యాధిక్య ఉన్నందున ఇల్లు, వాహనం, వృత్తి వంటివి అన్నీ శ్రేష్టముగా ఉంటాయి. కొత్త విషయాలను కనుగొనే సామర్థ్యం వీరికి ఉంటుంది. జీవిత సుఖాలనన్నిటిని అనుభవిస్తారు. విద్యా జ్ఞానము కంటే లోకజ్ఞానం, అనుభవ జ్ఞానం ఎక్కువగా ఉంటాయి.

నిజాయితీ, క్రమశిక్షణ:
దృఢమైన మనోనిశ్చయం, కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు ఉద్యోగ జీవితంలో నిజాయితీ మరియు క్రమశిక్షణ కలిగి ఉంటారు.

కపటం, నయవంచన, రహస్యాలకు వీరు ఎంతో దూరంగా ఉంటారు. మనస్సులో తోచినవి అరిమరికలు లేకుండా బయటకు చెప్పి విరోధం కూడా తెచ్చుకుంటారు.

వీరి స్నేహాలు, విరోధాలు ఎల్లప్పుడూ బట్టబయలే. వీరు తమంతట తాముగా స్నేహితులను వెదకుట జరుగదు. వీరిలోని స్నేహగుణం, ఇతర సద్గుణాలు ఇతరులను వీరి వద్దకు ఆకర్షిస్తాయి. అలా ఎందరో వీరి స్నేహాన్ని, సహాయాన్ని కోరుతూ వీరి దగ్గరకు రావటం జరుగుతుంది.

లక్ష్యసాధనలో ముందుంటారు. అందుకే జీవితంలో ముందుకుపోయే కొలది వీరికి అదృష్టం పెరుగుతుంది. విజయాలను సాధిస్తారు.

మానసిక శక్తి ఎక్కువ:
ఈ అంకె అధిక్యత గల స్త్రీ పురుషులు సువాసన గల ద్రవ్యాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. ఎటువంటి గొడవల నైనా సద్దుమణిగేట్టు చేయగల సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు వెళ్ళే చోట కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తమకంటూ ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉంటారు. హీనమైన కార్యాలను ద్వేషిస్తారు. తమ భావాలను అణచు కొగలిగిన మానసిక శక్తి వీరికి ఉంటుంది.

ఎవరికీ లొంగరు:
నాయకత్వ లక్షణాలు ఉండుటచే తాము చేపట్టే ఏ కార్యక్రమాల లోనైన, చొరవ, ధైర్యం చూపి ముందుకు దూసుకుపోయే గుణం కలిగి ఉంటారు.

పెద్ద పెద్ద వ్యాపారాలు, భారీ పరిశ్రమలు నడపకలిగే శక్తి, సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు ఇంట, బయట అందరి మీద పెత్తనం చెలాయిస్తారు. వీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఆత్మాభిమానం ఎక్కువ.

వీరు ఎవరికీ లొంగటానికి సిద్ధం కారు. తమదే పైచేయిగా ఉండాలనుకుంటారు. చేసే ఉద్యోగంలో కూడా పై అధికారి ఏ మాత్రం కించపరిచినా తట్టుకోలేరు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయటానికి కూడా సంసిద్ధులవుతారు.

వీరికి ముఖస్తుతి అంటే ఏమిటో తెలియదు. ప్రతి విషయంలో వీరు నిర్మొహమాటంగా వ్యవహరించటం సర్వసాధారణం.


వినయ విధేయతలు:
వీరు మేధావులుగా, నాయకులుగా, మార్గదర్శకులుగా ఎదుగుతారు. మంచి నిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి ఉంటారు.

వీరు నిజాయితీని గౌరవిస్తారు. మోసాన్ని కపటాన్ని, నటనను ఇష్టపడరు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి విజ్ఞులుగా వ్యవహరించటం మనం గుర్తించగలం. కాబట్టి వీరు అనేక విషయము లను ఎంతో సులభముగా గ్రహించగలరు.

వీరు ఎదుటివారి మాటలను బట్టి మనుష్యులను అంచనా వేయగలరు. కొద్ది ప్రయత్నంతోనే గొప్ప వక్తలుగా, గొప్ప రచయితలుగా పేరు పొందగలరు. వీరిలో కొందరు అన్నీ తెలిసినా, ఏదీ తెలియనట్లు ఎంతో వినయంగా ఉంటారు. వీరు గొప్ప పేరు గడించాలనో లేక ధనాశతోనో ఏ పనిచేయరు. వీరు వంశపారంపర్యంగా వ్యాపారులైనా సరే, ఎంతో న్యాయంగా వ్యాపారం చేస్తారే తప్ప అన్యాయంగా అధిక లాభాలు ఆర్జించాలని అనుకోరు.

సంపాదన: వీరు అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. వీరి సంపాదన అంతంత మాత్రంగా ఉంటుంది. డబ్బుల కొరత వీరిని ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. అవసరానికి సరిపోయే ధనం వీరికి ఉండదు.

వీరికి సుమారు 40 సంవత్సరములు దాటిన తరువాతనే వృత్తి వ్యాపారాలలో స్థిరత్వము ఏర్పడి ఆర్థికంగా కొంత పుంజుకొంటారు. అప్పటి వరకు ఆర్థికంగా నిలకడ లేని పరిస్థితి కొనసాగుతుంది.

వీరికి ధనం దానంతట అదే రావాలి. అంతేగాని వీరు దానిని వెదకి సంపాదించలేరు. వీరు పేరు ప్రతిష్ఠలు వచ్చేవరకు విసుగు, విరామం లేకుండా శ్రమిస్తారు. సామాన్యంగా వీరిలో సోమరులు ఉండరు.

తాత్విక దృక్పథం కలిగి ఉంటారు:
వీరికి తాత్విక దృక్పదం ఉంటుంది. వీరు చేయాలనుకున్న పనులను అదృష్ట దినాలలోని సూర్యోదయంలో కానీ, సూర్యాస్తమయ సమయం లో కాని ప్రారంభించడం లేదా చేయడం జరిగితే వాటిలో సంపూర్ణ విజయం సాధించగలరు. కళల పట్ల మిక్కిలి ఆసక్తి ఉంటుంది.

పరుల సొమ్ముకు ఆశపడరు:
వీరికి ఎంతో మందితో పరిచయం ఉంటుంది. అయినా కొద్దిమంది మాత్రమే వీరికి స్నేహితులుగా ఉంటారు. అలా ఆలోచించి ఎంచుకున్న స్నేహితులకు వీరు ఎంతైనా మేలు చేస్తారు. వీరు ఎన్నడూ పరుల సొమ్ముకు ఆశపడరు.

రాజకీయాల్లో తిరుగు ఉండదు:
రాజకీయాలంటే ఆసక్తి. వీరిని మహా అదృష్టవంతులుగా మార్చేది రాజకీయ రంగమే. వీరిని రాజ్యాంగచక్ర 'దత్తపుత్రులు' అని అంటే అతిశయం కాదు. సూర్యుడు వీరికి పరిపాలించే అధికారం ఇస్తున్నాడు. ఉన్నత రాజ్యాంగ పదవులలో వీరు స్థిరంగా ఉంటారు.

వేదాంత విషయాల ఆలోచన:
ఒంటరిగా ఉన్నప్పుడు వేదాంత, ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. లోకాతీత విషయాలను గ్రహించడానికి ప్రయత్నిస్తారు. విశ్వాసమే వీరి ఆయుధం. నూతన విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు.

వినోదయాత్రలపై ఆసక్తి:
వీరు ఇంటిని విలాస వస్తువులతో అలంకరిస్తారు. ఎల్లప్పుడూ వీరు పరిశుభ్రమైన తెల్లని వస్త్రములను ధరిస్తారు. వీరు ప్రకృతి ఆరాధకులు కాబట్టి అందమైన కొండ ప్రదేశాలంటే వీరికి ఎక్కువ ఇష్టం. అంతేగాక, వీరికి ప్రపంచం చుట్టివచ్చే వినోద యాత్రలలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటికి వీరు ఎంత ఖర్చు చేయవలసివచ్చినా ఎంత మాత్రం వెనుకాడరు. కొండలు, అడవులు, సెలయేళ్ళు వంటి ప్రకృతి దృశ్యాలను చూడటం అంటే ఎంతో ఆసక్తి.


సూర్యాధిక్యతలో జన్మించిన వీరు ప్రతిరోజూ ఉదయం కొన్ని నిమిషాల పాటు సూర్య కాంతిలో గడపటం వల్ల సూర్య ఆకర్షణ శక్తి శరీరంలో వృద్ది చెంది మనోబలం పెరుగుతుంది. రోగాలను పోగొడుతుంది. మెదడులో రసాయన మార్పులు జరిగి బుద్ధి కుశలత పెరిగి మేధావులవుతారు.

తగిన వృత్తి
వీరు దీర్ఘకాలంపాటు ఒకే రకమైన వృత్తి చేయడానికి ఇష్టపడరు. వృత్తిలో మార్పును కొత్తదనాన్ని కోరుకుంటారు. వీరికి విద్యుత్, కంప్యూటర్ రంగాలు అనుకూలంగా ఉంటాయి. అగ్ని సంబంధమైన పరిశ్రమలు, సూర్యుని ఆధారంగా సాగే పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయి. ఎగుమతి, దిగుమతి సంబంధమైన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ప్రమోటర్లుగాను, సర్వేయర్లుగాను, ఫోటోగ్రాఫర్లగను, కమీషన్ ఏజంట్లు గాను రాణిస్తారు. రత్నాలు, ఆభరణాలు, పరిశోధన (రీసెర్చ్) ప్రధానంగా సాగేవృత్తులలోను రాణిస్తారు. టీచర్స్, రైటర్స్, మ్యూజికల్, సైన్స్, లైబ్రరి యన్ వృత్తులలో బాగా రాణిస్తారు.

అస్ట్రోలజర్స్, వాస్తు, న్యూమరాలజిస్ట్స్ రంగాలలోనూ బాగా రాణిస్తారు. పొలిటికల్ లీడర్స్, టి.వి. మరియు సినిమా ఇండస్ట్రీ, రంగాలు బాగా రాణిస్తాయి. ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, డిజైనర్స్, జ్యూయలరి మొదలైన రంగాలు బాగా రాణిస్తాయి.


అన్ని ప్రభుత్వ రంగాలలోని వారికి జయకరంగా ఉంటుంది. కరుణ, దయ, చక్కగా మాట్లాడుటలో సమర్థులగుటచే మత సంబంధ కార్యాలలో ఆసక్తి ఉంటుంది. అర్హత, శ్రమ, నిజాయితీకి విలువనిస్తే వీరు అన్ని రంగాలలో పైకి వస్తారు. సూక్ష్మగ్రాహులు కావటం చేత వీరు చూపులతోనే వ్యాధులను పసికట్టగలరు. కాబట్టి వైద్యవృత్తి వీరికి తగినది.

హార్ట్, 'ఐ' స్పెషలిస్ట్గా ప్రత్యేకంగా రాణించగలరు. పుట్టినతేది, నెల, సంవత్సరం కలిపితే వచ్చే సంఖ్య 9 అయితే వీరు శస్త్ర చికిత్సా నిపుణులు కాగలరు. సివిల్ సర్వీసెస్ రంగాలలో కూడా బాగా రాణిస్తారు.

వీరు ప్రకృతి ఆరాధకులు కాబట్టి భావుకులు అయి ఉండటం చేత కవులుగా కూడా కావచ్చు. వీరు నిజాయితీపరులు కనుక అన్నిటికీ తలవంచిపోలేరు. కష్టనష్టాలకు కలవరం చెందుతారు.

వ్యాపారంలో సందర్భానుసారం ప్రణాళికలను మార్చవలసి వస్తుంది. అది వీరికి చేతకాదు. కాబట్టి వ్యాపారం వీరికి పనికిరాదు. రచయితలుగా పేరు పొందగలరు. వీరు నచ్చిన శిల్ప, చిత్ర, సంగీత, జ్యోతిష, యోగ కళలో దేనినైనా వృత్తిగా చేపట్టవచ్చు.

సహకరించే వ్యక్తులు:
1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారికి అదే సంఖ్యవారు సామాన్యంగా సహాయం చేస్తారు. 4 సంఖ్య వారు జీవితాన్ని సంస్కరించే సహాయాలు మరియు 8 సంఖ్యవారు చాలాకాలం కొనసాగే నిరంతర సమాయం చేస్తారు. 2/7 సంఖ్యలవారు తాత్కాలిక సహాయం చేస్తారు. అయితే వీరి సహాయం హఠాత్తుగా ఆగిపోవచ్చు.

కుటుంబ జీవితం :
వీరు సాధారణంగా అందం వైపు ఆకర్షింపబడుటచే అందమైన వారినే వివాహం చేసుకుంటారు. వీరిలో 19వ తేదీన జన్మించినవారిలో పలువురు అందరమైన వారిని ప్రేమించి, ఎందరు అడ్డు చెప్పినా వినక, వివాహం చేసికొని సుఖంగా జీవిస్తారు.

28వ తేదివారు ప్రేమించినా వీరిలో మనోబలం తక్కువగా ఉండటం వలన, ఇతరులు వీరి ప్రేమకు అడ్డు తగులుతారు. ఇన్ని ఆశలు ఉన్నా 1వ సంఖ్య గల వీరికి అందమైన తృప్తికరమయిన జీవిత భాగస్వాములు దొరకుట కష్టమే. చాలా మందికి సంసార జీవితంలో చిక్కులు ఏర్పడ తాయి.

గ్రహప్రభావం బాగుంటే వీరి మనసుకు నచ్చినట్లే సర్దుకుపోయే గుణాలున్నవారే వీరితో జీవితం పంచుకుంటారు. పట్టుదల తగ్గించుకుంటే వీరికి వివాహ జీవితం సుఖమయంగా ఉంటుంది.


వివాహ సంబంధాలు:
1వ సంఖ్య వారు ఒకరికి అణగి ఉండే స్వభావంవారు కారు. కాబట్టి వీరు 1వ సంఖ్యలో పుట్టినవారిని వివాహమాడరాదు. పట్టుదలలు వీరి జీవితాన్ని ఎంతో మనస్తాపాన్ని గురిచేస్తాయి. వీరు 2,4,5 తేదీలలో పుట్టినవారిని వివాహమాడవచ్చు. 8 తేదీలవారిని కూడా వివాహం చేసుకోవచ్చు. 8వ తేదీన పుట్టినవారిని వివాహం ఆడితే సుఖసౌఖ్యాలు కలుగుతాయి.

ఎందుకంటే 8 సంఖ్యవారు 1 సంఖ్యవారిని మనస్ఫూర్తిగా ప్రేమించి ఆరాధిస్తారు. వారు చెప్పినదంతా చేస్తూ వారిని తృప్తిపరచటమే వీరి లక్ష్యం. 1 సంఖ్యవారు 8 సంఖ్యవారిని ఆదరంగా చూసుకుంటారు. చెట్టుని అల్లుకొనే తీగవలె 8 వారు 1 వారితో సుఖ జీవితం కొనసాగిస్తారు.

సామాన్యంగా 1 సూర్యుని సంఖ్య కావటంచేత వీరి వివాహ జీవితంలో సమస్యలు సహజమే.
ముహూర్తబలం అధికంగా ఉంటే చక్కని దాంపత్యముంటుంది.

1 సంఖ్యవారికి సంతానభాగ్యం ఉంటుంది. వీరు అన్నివిధాల సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు.

దుస్తులు మరియు రంగులు:
1 సంఖ్యవారికి మంగళకరమైనది, పసుపురంగే శ్రేష్ఠమైనది. పీతాంబరాలు అంటే పసుపు రంగు దుస్తులు ధరిస్తే అందం రెట్టింపవుతుంది. ఈ రంగు వీరికి జయం కలిగిస్తుంది. తెలుపు కలిసిన లేత పసుపుపచ్చ రంగు నుండి, ముదురు పసుపురంగు వరకు అన్నీ వీరికి అదృష్టకరమైన రంగులే.

లేత ఎరుపు, లేత నీలం కూడా మంచివే అయితే నలుపు, వక్కరంగు దురదృష్టకరమైన రంగులని వీరు గుర్తించాలి. తాము ధరించే వస్త్రాల అంచులకు కూడ ఈ రంగు వాడకుండా జాగ్రత్త తీసుకోవటం మంచిది.

సూర్యుని ప్రభావం తక్కువ ఉన్న వ్యక్తుల లక్షణాలు:
ఎవరిలోనైనా పైన పేర్కొన్న గుణములు ఉంటే వారిపై సూర్యుని ఆధిక్యత ఎక్కువగా ఉందని మనం గ్రహించవచ్చు. ఎవరిపైనైనా సూర్యుని ప్రభావం తక్కువగా ఉంటే, వారిలో క్రింద పేర్కొన్న స్వభావం కనిపిస్తుంది.

ఇతరుల మెప్పుకోసం ప్రయత్నం:
ఇతరులు చెప్పింది, వినకపోవడం, స్వార్థ బుద్ధి, మొండి వాదన, కిందివారిపై అనవసరపు పెత్తనం చెలాయించడం, సహనం లేకపోవడం. నిరంకుశత్వం, అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించడం. మూర్ఖపు పట్టుదల, అహంభావం. తమ ఉన్నతి కోసం ఇతరుల వినా శానికి కూడా ప్రయత్నించడం, నేనే నంబర్ 1 అనే అహంభావం కలిగి ఉంటారు.

ఇలాంటివారు ఇతరుల మెప్పు కోసం అనవసరపు ఖర్చులు పెడతారు. అంతేకాక, కొంచెం కూడా అణకువ లేకుండా, ప్రపంచంలో అన్నీ తమకే తెలిసినట్లు ఉంటారు. తాము చేయని పనులను కూడా తామే చేసామని చెప్పుకుంటారు. ఇలాంటివారు జీవితంలో అనేక చిక్కులు ఎదుక్కోవటం మాత్రమే కాక, తమ ప్రయత్నాలలో తరచుగా అపజయాలు పొందుతూ ఉంటారు.


అపఖ్యాతికి జంకుతారు:
వీరిలో ఎంతగా సూర్యబలం తగ్గినా, ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచన వీరికి రాదు. వీరు అపఖ్యాతికి జంకుతారు. ఆత్మబలం లోపిస్తే ఆ పరిస్థితులలో వీరు ఇతరుల మాటకు కట్టుబడి జీవిస్తారు. ఇటువంటి వారిని మనం గుమాస్తా ఉద్యోగాలలో చూడవచ్చు.

శారీరక లక్షణాలు:
సూర్యుడు హృదయం, వీపు, వెన్నెముకకు అధిపతి. గంభీరంగా కనపడే వీరు చాలామటుకు సామాన్యమైన ఎత్తుగలవారే అయి ఉంటారు. వెడల్పాటి నుదురు, విశాలమైన కండ్లు కలిగిన వీరు చూపు విషయంలో పసివారిలా అమాయకంగా ఉంటారు. వీరి శరీరం రాటుదేలి ఉంటుంది. మెడ బలిష్ఠంగా ఉంటుంది. వీరిలో స్త్రీలు సాధారణంగా బాగా బలిష్టంగా ఉంటారు.

ఆరోగ్య సమస్యలు:
ఈ సంఖ్యల కలవారు కళ్ళజోడు ధరించటం సహజం. ముఖ్యంగా 10వ తేదీన పుట్టినవారిలో 100 మందిలో 99 మంది కళ్ళజోళ్ళతోనే కనిపిస్తారు. వీరు అందానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు కనుక తరచుగా కళ్ళ అద్దాల ఫ్రేములు మారుస్తూ ఉంటారు.

వీరిలో చాలామందికి చిన్నప్పుడే కంటిచూపుకు సంబంధించిన అనా రోగ్యాలు ఉంటాయి. ఎండను భరించలేరు. వీరిలో 40 ఏళ్లకు పైబడిన వారిలో రక్తప్రసరణకు సంబంధించిన వ్యాధులు కనిపిస్తాయి.


ప్రకృతి వైద్యాన్నే ఇష్టపడతారు:
వీరు భోజన ప్రియులైనా మితంగానే భుజిస్తారు. అంతేకాక, భోజన పదార్థాలను గురించి కూడా పరిశోధిస్తారు. వీరిలో పైత్య రసం తక్కువగా ఉండుట చేత ఆకలి లేకుండా భోజనం తీసుకుంటే సరిగా జీర్ణం కాదు.

వీరు ఆహారంలో, స్నాన తైలంలో పొన్నగంటికూర చేర్చుకోవటం మంచిది. వీరు సామాస్యంగా ప్రకృతి వైద్యమునే నమ్ముతారు. డాక్టర్ల వద్దకు వెళ్ళుటకు ఇష్టపడరు.

అదృష్టం కలిగించే సంవత్సరాలు:
1వ నంబర్ వారికి 22 లేక 34 సంవత్సరాలలో అదృష్టం కలుగుతుంది. వీరికి అంతకు ముందు కష్టాలు ఎదురుకావొచ్చు. అలాగే చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది.

కానీ 22 ఏటలోకి అడుగుపెట్టగానే అదృష్టం కలిసి వస్తుంది. ఒకవేళ అప్పుడు రాకుంటే 34 ఏళ్లప్పుడు అదృష్టం వీరికి కలిసి వస్తుంది. మీరు అనుకున్న పనులు జరుగుతాయి.


అదృష్ట తేదీలు:
వీరికి ప్రతినెలలో 1, 4, 10, 19, 22, 28, 31 తేదీలు అదృష్ట సంఖ్యలు. ఈ తేదీలలో సంతోషాన్ని కలిగించే జరుగుతాయి. వశీకరణశక్తి పెరుగు తుంది. దీనితో వీరు తమ పనులను నిర్విఘ్నంగా సాధించుకోగలరు.

పైన చెప్పిన తేదీలలో ముఖ్యమైన పనులు చేయుట అలవాటు చేసుకుంటే, అపూర్వ ఫలితాలు శీఘ్రంగా పొందగలుగుతారు. వీటిలో 28 మాత్రం దీర్ఘకాలం నిలిచే ఫలితాలు ఇవ్వలేదు.

లక్కీ వారాలు : ఆది, సోమవారాలు.

లక్కీ కలర్స్ : పసుపు, కాషాయం, గులాబి, ఆరెంజ్, లేత నీలిరంగు, తెలుపు, పర్పుల్.

నప్పని నెంబర్స్: 8, 6, 17, 26.

నప్పని రంగు : నలుపు,

పూజించవలసిన దేవతలు: శివుడు, నారాయణుడు.

పఠించవలసిన మంత్రం: సూర్యదేవునికి అనుకూలంగా ఆదివార వ్రతము చేయటం, ఆదిత్య హృదయం ప్రతీరోజు పఠించడం మంచిది.

దానం చేయవలసినవి: గోధుమలు, ఎర్రని వస్త్రములు, ఎర్రని పువ్వులు, చందనం.

10వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు:
వీరు మంచి నాయకత్వ లక్షణాలు కలిగి, ఓర్పు, శాంతి స్వభావం కలిగి ఉంటారు. స్వతంత్రేచ్చ కలిగి ఉంటారు. మంచి ప్రవర్తన, ప్రేమాభిమానాల వలన స్నేహితులు ఎక్కువగానే ఉంటారు.

చురుకైన బుద్ధి, సహకార గుణం వలన శత్రువులు మిత్రులుగా మారతారు. ఏ పనినైన ఒక ప్రణాళికా బద్ధంగా చేసి విజయం సాధిస్తారు. మనసులోని భావాలను బయటకు తెలియనీయరు. వినూత్నంగా ఏదైనా చేయాలని చూస్తారు.

వీరితో వచ్చిన ఇబ్బందల్లా తాము పట్టిన కుందేటికి మూడు కాళ్ళు అంటారు. వీరి జీవితంలో వడిదుడుకులు ఉంటాయి. కనుక స్పెక్యులేషన్ వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది. వీరికి కళ్ళకు సంబంధించిన సమస్యలు వలన కళ్ళకోడు ఉండే అవకాశం ఎక్కువ.

వీరు రాజకీయాలు, రచనలు, కళలు, టి.వి.సినిమా, పరిశ్రమల రంగాలలో బాగా రాణిస్తారు. వీరు ప్రేమ వ్యవహారాలలో చిక్కుకునే అవకాశం ఎక్కువ. ప్రేమ వ్యవహారాలలో కొంతమందికి చేదు. అనుభవాలు ఎదురుకాగలవు.


19వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు:
19వ తేదీన జన్మించిన వారు దృఢ నిశ్చయం కలిగి, లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. వీరికి అధికారం, అదృష్టం, ప్రజాదరణ లభిస్తుంది. వీరికి ధైర్యం, మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి.

వీరికి ఎవరికి లోబడి పనిచేయడం ఇష్టం ఉండదు. ఉన్నతమైన భావాలు కలిగి, ఇతరులకు సమాయం చేసే గుణం కలిగి ఉంటారు. తను బ్రతుకు ఇతరులను బ్రతకనివ్వు అనే గుణం కలిగి ఉంటారు.

ఆత్మ విశ్వాసం ఎక్కువ. సాధారణంగా వీరు దేనికీ రాజీ (కాంప్రమైజ్) పదరు. ఇతరుల సంక్షేమ కొరకు పాటుపడతారు. వీరికి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలుంటాయి. మంచి పరిపాలనా దక్షత కలిగి ఉంటారు. వీరు చాలా మొండివారు. అనుకున్నది సాధించే వరకు విశ్రాంతి తీసుకోరు.

వీరు డబ్బుకంటే పేరు ప్రఖ్యాతలకు విలువనిస్తారు. వీరు స్వేచ్ఛను, సుఖభోగాలను కోరుకుంటారు. వీరు ఎక్కువగా ప్రేమ వివాహాలు కోరుకుంటారు. వీరు రాజకీయాలు, సినీ ఫీల్డ్, మిలటరీ, పోలీస్ లాంటి రంగాలలో బాగా రాణిస్తారు.

28వ తేదీన జన్మించిన వ్యక్తి లక్షణాలు:
28వ తేదీన జన్మించిన వారు గొప్ప వాక్ చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, దృఢమైన శరీరం కలిగి ఉంటారు. మంచి విశ్లేషణాత్మక, తార్కిక బుద్ధి, దైవభక్తి కలిగి ఉంటారు. వీరు ఎవరిని అంత తొందరగా నమ్మరు. నమ్మితే ప్రాణం ఇస్తారు.

వీరి చూపులో ఆకర్షణ శక్తి కలిగి, వీరి మనసులోని ప్రేమాభిమానాలను బయటకు తెలియజేస్తారు. చిన్నపిల్లలవలే ఇట్టే కరిగిపోతారు. వీరు మంచి పరిపాలన దక్షత, మంచి గుణం, అవిరళ కృషి, అంకితభావం కలిగి ఉంటారు.

వీరు ఎవరి చెంత పనిచేయదానికి ఇష్టపడరు. పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛను కోరుకుంటారు. అలా కాకుంటే స్వతంత్ర వృత్తిని ఎన్నుకుంటారు. వీరు జీవితంలో చేసిన ప్రయత్నాలే మళ్ళీ, మళ్ళీ చేయవలసి వస్తుంది.

అలానే జరిగిన సంటనే పునరావృతం కావడం జరుగుతూఉంటాయి. వీరు ముందు వెనక ఆలోచన లేకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుని సమస్యలు తెచ్చుకుంటారులేదా అవమానాలు పొందుతారు.

సాధారణంగా వీరు తమ స్నేహితులు లేదా బంధువుల, నమ్మినవారి చేతిలో మోసానికి గురి అవుతారు. కష్టపడి సంపాదించినవి అనుకోని విధంగా పొగొట్టుకుంటారు.

న్యూమరాలజీ

Numerology - న్యూమరాలజీ

న్యూమరాలజీ

న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. అంకెలకు సంబంధించిన అతి పురాతనమైన ఒక తార్కిక శాస్త్రం. అంకెల భాష, న్యూమరాలజీలోని తొమ్మిది సంఖ్యలు (1-9) మానవ జీవితంపై తిరుగులేని ప్రభావాన్ని చూపుతాయి అంటారు.

పుట్టినతేదీ, ఆ వ్యక్తి పేరు న్యూమరాలజీ పరిశీలనకు ముఖ్యమైన ఆధారాలు. వీటి ఆధారంగా మీలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను తేటతెల్లంచేసి దిశానిర్దేశనం చేయగలదు అని భావన.

న్యూమరాలజీ పూర్వరంగం, మీ పేరులో ఉన్న అంతర్గత శక్తిని ఏ విధంగా తెలుసుకోవచ్చు, అంకెలు, వాటిలో ముడిపడి ఉన్న గ్రహాలు. ఆ గ్రహ ప్రభావం వ్యకులపై ఏ విధంగా ఉంటుంది మొదలైన న్యూమరాలజీకి చెందిన ప్రాథమిక భావనలు అన్ని తెలుసుకుందాం.

న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నవి అందులో మొదటి దాని గురించి తెలుసుకుందాం.

కబాలా లేదా హిబ్రూ లేదా కీరో పద్ధతి:
కబాలా అనగా హిబ్రూ భాషలో దేవుని నుండి వచ్చినది అని అర్థము. ఈ పద్ధతిలో అక్షరాలకు సంఖ్యలను ఆపాదిస్తారు.

హెబ్రూస్ మొదటి సారిగా ఈ పద్ధతి తెలుపినందువలన ఈ పద్ధతిని హిబ్రా పద్ధతి అంటారు. హిబ్రూ భాషలో అక్షరాలకు ఉన్న ప్రకంపనలను తరువాత వచ్చిన న్యూమరాలజిస్ట్లు ఆంగ్లభాషలోని అక్షరాలకు కూడా ఆపాదించారు. ఇదే హిబ్రూ పద్ధతి లేదా కీరో పద్ధతి. ఈ పద్ధతిలో అక్షరాలకు అంకెల అమరిక ఈ విధంగా ఉంటుంది.

Letters (Left)ValueLetters (Right)Value

A, I, J, Q, Y - 1
B, K, R - 2
C, G, L, S - 3
D, M, T - 4
E, H, N, X - 5
U, V, W - 6
O, Z - 7
F, P - 8

ఇచ్చట 9 అంకెకు ఏ అక్షరము కేటాయింపబడలేదు. 9 అంకెనుదేముని అంకెగా భావించారు. ఈ పద్ధతిని కీరో ప్రచారంలోకి తీసుకొని రావడం వలన దీనినే కీరో పద్ధతి అంటారు. చాలా దేశాల సంఖ్యా శాస్త్రవేత్తలు ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు.

పైథాగరస్ పద్ధతి:
పైథాగరస్ ప్రతి అక్షరానికి ఉండే ప్రకంపన శక్తి హెబ్రూ పద్ధతిలో ఉన్న ప్రకంపనలకు కొంచెం భిన్నంగా ఉన్నట్లు గుర్తించి, అక్షరాలకు సంఖ్యలను ఈ విధంగా అమర్చాడు.


1  2  3  4  5 6 7 8 9 
A B C D E F G H I
J K L M N O P Q R
S T U V W X Y Z
ఈ పద్ధతినే ప్రపంచంలో 75 శాతం మంది న్యూమరాలజిస్ట్లు అనుసరిస్తారు.

జన్మదిన సంఖ్య:
జన్మదిన సంఖ్యను మనం ప్రత్యేక పద్ధతులలో లెక్కించవలసిన అవసరం ఉండదు. ఏ నెల అయినా ఏ తేదీన జన్మించారు అన్నదే ముఖ్యము. ఈ జన్మదిన సంఖ్య అనేది ఏకసంఖ్యలోను, ద్విసంఖ్యలోను ఉంటుంది.

ఉదాహరణకు ఒక వ్యక్తి 26వ తేదీన జన్మిస్తే అతని జన్మ సంఖ్య 2 + 6 = 8 అవుతుంది. ఇందులో రెండు సంఖ్యలు ఉన్నాయి. 2, 6. ఈ రెండు సంఖ్యలను కూడితే వచ్చే మొత్తం 8. ఈ 8 సంఖ్య ఆ వ్యక్తి యొక్క దైహిక లక్షణాలతో పాటు గుణగణాలను కూడా తెలుపుతుంది. అలాగే 2, 6 సంఖ్యలలోని ప్రత్యేక లక్షణాలు కూడా ఆ వ్యక్తిలో గోచరిస్తాయి.

అంటే జన్మదిన సంఖ్యలో రెండు సంఖ్యలు ఉన్నప్పుడు దానిని ఒకే సంఖ్యలోకి మార్చుకోవాలి. ఉదాహరణకు 27వ తేదీ జన్మదిన సంఖ్యగాగల వ్యక్తికి 2 + 7 ఈ రెండు సంఖ్యలను కలపగా వచ్చే సంఖ్య 9. 9 సంఖ్య జన్మదిన సంఖ్యగా చెప్పవచ్చు.

జన్మదినం 8, 26 తేదీలుగల వ్యక్తులకు చెందిన జన్మసంఖ్య ఒక్కటే. కానీ ఈ ఇద్దరికి లక్షణాలు ఒకే విధంగా ఉండవు. దీనికి కారణం జన్మ దినంలోని సంఖ్యల మార్పు. ఒకేవేళ ఇద్దరిపైన 8 ఒకే రకమైన ప్రభావం చూపినా 1, 4, 2, 3 సంఖ్యలు ఆయా వ్యక్తులపై విభిన్న ప్రభావాన్ని చూపిస్తాయి. దానివలన వ్యక్తుల లక్షణాలు భిన్నంగా ఉంటాయి.

అంకెలతో సంబంధం:
ఒకవ్యక్తి జన్మించిన వెంటనే అతనికి సంఖ్యలతో సంబంధం ఏర్పడుతుంది. పేరు పెట్టిన తర్వాత మరికొన్ని సంఖ్యలతో సంబంధం ఏర్పడుతుంది. పుట్టిన సంఖ్యకు, పేరులోని సంఖ్యకు మంచి సంబంధం, సారూప్యత, సహవాసం ఉన్నపుడే ఆవ్యక్తి యొక్క జీవితం బాగుంటుంది. ఈ సంబంధాన్నే న్యూమరాలజీ తెలుపుతుంది.

ఒకే సమయం, ఒకే తేది, ఒకే నెల, ఒకే సంవత్సరాన పుట్టిన ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఒకేలా ఉండవు. అలా ఎందుకు ఉండవో వేరే శాస్త్రాలలో సరైన సమాధానం కన్పించదు. కానీ న్యూమరాలజీలో సమాధానం ఉంది. ఆ ఇద్దరు వ్యక్తులకు వేరువేరు పేర్లు ఉండటం వలన వారికి ఒకేలాంటి జీవితాలు ఉండవు అని న్యూమరాలజి చెబుతుంది.

పొట్టి పేర్లు, పొడుగు పేర్లు:
తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి పేరుకి ముందు ఇంటి పేరు ఉంటుంది. ఇది వద్దు అనుకున్న మార్చుకోలేనిది. కొన్ని పేర్లు వాటిల్లో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ వలన ప్రపంచ వ్యాప్తి చెంది ఉంటాయి.

దీనివలన ఆ ఇంటి పేరు ప్రక్కనున్న అసలు పేరుకు కూడా కొంత లాభం చేకూరుతుంది. అదే ప్రక్కనున్న పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే ఇంటి పేరుకు నష్టం జరగదు కాని అసలు పేరుకి నష్టం జరుగుతుంది.

ముద్దుపేర్లు నెగిటివ్ ఎనర్జి:
దేవతల పేర్లు, పెద్దవాళ్ళ పేర్లు కలిపి పెద్ద పేర్లు పెట్టిన తల్లిదండ్రులు తమ పిల్లలను పొట్టి పేర్లుతో పిలవడం జరుగుతుంది. ఇలా చిన్నప్పటి నుండే ఆ రెండక్షరాల పేరులోని నెగిటివ్ ఎనర్జి ప్రభావం క్రమక్రమంగా ఆ వ్యక్తి స్థాయి దిగజార్చుకుంటూ వస్తుంది.

అడుగడుగునా ఆటంకాలు కలుగజేస్తూ జీవితం నత్తనడకలా సాగుతుంది. కాబట్టి పెద్దలు పెట్టిన పేరును పెద్దలే చిన్నప్పటినుండి పూర్తి పేరుతో పిలవడం అలవాటు చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడగలరు.

ఇంటి పేరుతో సహా పిలిపించుకునే పేరులో ఉన్న వైబ్రేషన్స్ మామూలు పేరులో ఉండవు. న్యూమరాలజిస్ట్ సలహా మేరకు మీ పేరులో ఉన్న వైబ్రేషన్స్ను చెక్ చేసుకోండి.

సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ పేరు లేకపోతే
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఎవరి పేరు ఐతే వ్యతిరేకంగా ఉంటుందో వారిలోని ప్రతిభను పూర్తిగా వినియోగించుకోలేరు. ప్రతి చిన్నపనికి కూడా ఎంతో కష్టపడితేగాని ఫలితం దక్కడు. ఏ తప్పు చేయకపోయిన అపనిందలు మోయాల్సి వస్తుంది.

జీవితంలో స్థిరంగా ఉండలేరు. వైవాహిక జీవితం అంతంత మాత్రంగానే ఉంటుంది. స్నేహితులు, బంధువుల చేతిలో మోసపోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎదో ఒకటి చేయాలనుకునే తలంపుతో తమ శక్తికి మించిన పనులు తలపెట్టి నష్టపోవటం, ఆస్తులు పోగొట్టుకోవడం జరుగుతుంది. జీవితంలో ఒడి దుడుకులతో మానసిక ప్రశాంతత కరువవుతుంది.

మరి కొంత మందికి ఏ పని చేయాలన్న ఆసక్తి లేకపోవటం, ఒక వేళ పని ప్రారంభించినా దాన్ని మధ్యలోనే వదిలేసి మరొక పనిమీదకి వెళ్ళడం చేస్తుంటారు. దీనివలన చంచలత్వం పెరిగిపోయి ఎవరికి చెప్పుకో లేని మానసిక అసంతృప్తితో జీవిస్తూ మనోబలాన్ని కోల్పోవడం జరుగుతుంది.

ఎలా పనిచేస్తుంది:
ప్రాథమిక లెక్కలను ఉపయోగించి మీరు మీ జీవిత సంఖ్యను మరియు మీ వ్యక్తిత్వాన్ని సులభంగా కనుగొనగలిగినప్పటికీ, ఈ సంఖ్యలు కలిసి పనిచేసే విధానం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. సాధారణంగా వివరణాత్మక మరియు ఖచ్చితమైన రీడింగులను అందించడానికి నైపుణ్యం కలిగిన న్యూమరాలజిస్ట్ అవసరం తప్పనిసరి.

న్యూమరాలజీ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, మీ పుట్టిన తేదీ మరియు ఒక వ్యక్తిగా మిమ్మల్ని చుట్టుముట్టే అనేక ఇతర కారకాల ద్వారా విశ్వం మరియు మీ జీవితం అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. సంఖ్యలు చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని అందించగలవు.

సంఖ్యాశాస్త్ర ప్రకారం వ్యాపార సంస్థలు- వాటిపేర్లు:
సంఖ్యాశాస్త్రం అనేది ఒక మనో విజ్ఞాన శాస్త్రం. దీనిని బట్టి ఒక వ్యక్తి యొక్క జన్మతేదీ, నెల, సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుని తన పేరులోని అక్షరాలను శాస్త్ర ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలించవచ్చు.

అతని మనసు ఏం ఆలోచిస్తుందో, ఎలాంటి భావాలను, గుణాన్నికలిగి ఉంటాడో, అంచనా వేయవచ్చు. కానీ ఒక వ్యాపార సంస్థ పేరు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వ్యాపారం చేసే వ్యక్తులు సామాజిక బాధ్యతలు కలిగి ఉండటంతో పాటు తన వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగి పదిమందికి ఉపాధీ కలిపించే విధంగా అభివృద్ధి చెందాలంటే ఆ వ్యాపార సంస్థ పేరు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఉందో లేదో చూసుకోవాలి.

కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్లైతే తప్పనిసరిగా వాస్తు మరియు న్యూమరాలజిస్టును సంప్రదించి వారి సలహా ప్రకారం సంస్థ పేరును నిర్ణయించుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఒక పేరు మీద వ్యాపారం కొనసాగుతుంటే అందులో ఏవైనా ఇబ్బందులున్నా లేదా బాగానే ఉన్న ఇంకా అభివృద్ధి చెందడానికి వ్యాపార సంస్థ యొక్క నామ సంఖ్యకు సరిపోయేటట్లు చేసుకొని సంపద పెంచుకోవచ్చు.

ఈరోజు ఎంతో మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు సైతం తమ సంస్థలకు, ప్రొడక్టులకు న్యూమరాలజి ప్రకారం పేర్లను నిర్ణయించు కోవడం జరుగుతుంది. అంతేకాకుండా వారి కారు నెంబర్లు, ఫోన్ నెంబర్కు కూడా న్యూమరాలజి ప్రకారమే తీసుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన సంఖ్యా శాస్త్రాన్ని అందరూ ఉపయోగించుకుని వారి జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు.


న్యూమరాలజి ప్రకారం మీ పేరు ఉంటే:
ఎవరి పేరైతే సంఖ్య శాస్త్రం ప్రకారం తప్పు లేకుండా ఉంటుందో అటువంటి వ్యక్తులు ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగి తోటివారిని ప్రేమిస్తూ సంప్రదాయ బద్ధంగా, దైవభక్తిని కలిగి ఉంటారు. కలల్లో విహరించకుండ వాస్తవంలో ఉంటు ఒక లక్ష్యాన్ని కలిగి దాన్ని నెరవేర్చుకొనుటకు ప్రయత్నిస్తూ ఉంటారు.

నాయకత్వ లక్షణాలతో పాటు మంచి వాక్చాతుర్యం, ఆకర్షణ కలిగి వుంటారు. తమ ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారు. మరొకరికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. అందరిని గౌరవిస్తారు, గౌరవాన్ని పొందుతారు. ముఖ్యంగా కుటుంబ జీవితం ఆనందమయం చేసుకుంటారు.

కళలయందు ఆసక్తి కలిగి ఎప్పటికప్పుడు పరినీతి చెందుతూ తమలోని సృజనాత్మకు పదును పెట్టుకుంటారు. తద్వారా పూర్తి స్వేచ్చా వాతావరణాన్ని సృష్టించుకుని తమ ప్రతిభతో మంచి ప్రగతిని సాధించగలుగుతారు. మధ్య మధ్యలో కొన్ని అవరోధాలు, ఆపదలు ఎదురైనా కూడా వాటిలో కూడా అవకాశాలు వెతుక్కుంటారు.

నీతి, నిజాయతితో వృత్తి, వ్యాపారాలలో ధనం సంపాదిస్తూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిని కలిగి ఉండుట వలన దైవానుగ్రహం తోడై ప్రమాదాల నుండి కూడా తప్పించుకోవటం జరుగుతుంది. శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు సంతానం అభివృద్ధి కలుగుతుంది.

న్యూమరాలజీ ప్రకారం జీవిత భాగస్వామిని ఎంచుకోవడం:
సంఖ్యా శాస్త్రం ప్రకారం అనుకూల నామ సంఖ్య గల భాగస్వామిని ఎంచుకుంటే వారి జీవితం, కుటుంబం చూడ ముచ్చటగా ఉంటుంది. ఎన్ని ఆస్తులున్న, ఎంత సంపాదిస్తున్న కుటుంబ జీవితం సంతృప్తికరంగా లేనప్పుడు అర్థాకలితో జీవిస్తున్నట్టు ఉంటుంది.

కుటుంబ, దాంపత్య జీవితం సరిగ్గా లేనివాళ్లు వారి వివాహ తేదీని వాళ్ళు జన్మతేదీలతో సరిచూసి నామసంఖ్యలో ఏవైన నెగటివ్ వైబ్రేషన్స్ ఉంటే వాటి స్థానంలో పాజిటివ్ వైబ్రేషన్స్ గల అక్షరాలతో కూడిన నామసంఖ్యను ఇస్తే కొంత దోష నివారణ జరుగుతుంది. ఈ పనికి సమర్థుడైన న్యూమరాలజిస్టు సమర్థుడు.

వివాహం కానివారికి స్త్రీ, పురుషల జన్మ తేదీని పరిశీలించి ఇద్దరికీ సరిపడ్డాయో లేదో చూడాలి. బర్త్ నెంబర్, డెస్టిని నెంబరుకు సఖ్యత కుదిరిందో లేదో తెలుసుకోవాలి. అప్పుడు వారి సహ జీవనానికి కావలసిన బలాలు, బలహీనతలు గుర్తించి బలాలు ఎక్కువగా ఉన్నప్పుడు వారిద్దరికి వివాహం జరిపించవచ్చు.

ఏ శాస్త్రమైన ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను మాత్రమే అంచనా వేయగలరు. దానిని బట్టి భవిష్యత్తులో ఎలా ఉండగలరో చెప్పగలరు. అలాగే ఈ వివాహ బంధంలోని భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు, ఆ దంపతుల ఇద్దరికీ మధ్య ఉండే ప్రేమ, సహజీవన భావం ముఖ్యం.

వివాహం అనేది ప్రతి మనిషికి జీవితంలో ఒక ప్రధానమైన, మధురమైన మరపురాని ఘట్టం. కాబట్టి న్యూమరాల జిస్టుని సంప్రదించి మంచి తేదీని నిర్ణయించుకోవాలి.

1 నుండి 9 వరకుగల సంఖ్యలు ఎందుకు :
ప్రపంచంలో ఒకటి మొదలుకొని కోట్లవరకు ఎన్నో సంఖ్యలున్నా, అవన్నీ తొమ్మిది సంఖ్యలు లోపులోనే ఇమిడిపోతాయి.

సున్నా (పూజ్యం)

సున్నాకు ప్రత్యేకంగా విలువ లేదు. అంటే తతిమ్మా సంఖ్యలతో కలిసినప్పుడే దానికి విలువ ఉంటుంది. అదికూడా, సంఖ్యకు తరువాత వస్తేనే సున్నాకు విలువ ఉంటుంది.

ఉదాహరణ :
0 ఇక్కడ విలువ లేదు.
01 ఇక్కడా విలువ లేదు.
10 ఇక్కడ 1 సంఖ్యకు తరువాత రావటం వల్ల విలువ ఉన్నది.

ఆధార సంఖ్య, విస్తార సంఖ్య
సంఖ్యలను ఆధార సంఖ్యలనీ, విస్తార సంఖ్యలనీ రెండు విధాలుగా విభజించవచ్చు.

ఆధార సంఖ్యలు:
1 మొదలు 9 వరకున్న సంఖ్యలు ఆధార సంఖ్యలు

అనగా ఈ సంఖ్యల్ని ముందూ వెనకా పెడితేనే తతిమ్మా సంఖ్యలన్నీ రూపొందుతాయి. అంటే ఒకటి మొదలు తొమ్మిది సంఖ్యలు లేకుంటే గొప్ప గొప్ప మొత్తాలు రూపొందవు. అంచేత 1 మొదలు 9 వరకున్న సంఖ్యలు ఆధార సంఖ్యలు.

ఉదా: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆధార సంఖ్యలు..

విస్తార సంఖ్యలు :
తొమ్మిదికి తరువాత కోట్ల వరకున్న మిగతా సంఖ్యలన్నీ విస్తార సంఖ్యలు. అంటే ఆధార సంఖ్యలను (1-9) వరుసగా వ్రాస్తూ పోతుంటే విస్తార సంఖ్యలు ఏర్పడతాయి.

ఉదా : 10, 1235, 2245... ఇలా కోట్లవరకు ఉండే సంఖ్యలు. న్యూమరాలజీలో ఎంత పెద్ద సంఖ్య ఉన్నా దాన్ని ఆధార సంఖ్యలోకి పరివర్తన చేసుకోవాలి. న్యూమరాలజీలో విస్తార సంఖ్యలో పని లేదు. దానికి ఆధార సంఖ్యే అవసరము.

విస్తార సంఖ్య నుంచి ఆధార సంఖ్య (1)
ఉదాహరణకు, ఒక విస్తార సంఖ్య 73425 అని ఉంటే, దీనిని 7+3+4+2+5= 21 (2+1) 3 ఆధార సంఖ్యగా మార్పు చేసుకొనవచ్చును.

ఒకటి మొదలు తొమ్మిది వరకున్న ఆధార సంఖ్యలు తొమ్మిదింటిని మాత్రం న్యూమరాలజీలో ఉపయోగించటానికి కూడా ఒక కారణం న్యూమరాలజీకి జ్యోతిషమునకు ఉన్న సంబంధం.12 రాశులు, తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలు. ఈ మూడింటి ఆధారంగానే జ్యోతిష శాస్త్రం వర్దిల్లుచున్నది.

12 రాసులలో 27 నక్షత్రాలు ఇముడుతాయి. అనగా, ఒక్కొక్క రాశికి 21 నక్షత్రాలన్నమాట.ఒక నక్షత్రానికి 4 పాదాలు. 21 నక్షత్రాలకు 9 పాదాలు. అంటే ఒక్కొక్క రాశిలో ఆ నక్షత్ర పాదాలున్నాయి. 12 రాసులకు కలిపి 108 పాదాలు ఉంటాయి.

27 నక్షత్రాలంటే 2 + 7 = 9
108 పాదాలంటే 1+0+8=9

డిగ్రీలు లెక్క చూసుకొన్ననూ, ఒక రాశికి 30 డిగ్రీలు వంతున 12 రాసులకు 360 డిగ్రీలు. వీటి ఆధార సంఖ్య 3 + 6+ 0 = 9.

కాబట్టి, గ్రహాలను, రాసులను, నక్షత్రాలను ఆధారంగా పెట్టుకొని మానవ భవిష్యత్తును చెబుతున్న జ్యోతిష శాస్త్రంలో కూడా ఒకటి మొదలు తొమ్మిది వరకున్న సంఖ్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయి అని చెప్ప వచ్చును.


న్యూమరాలజీలో మూడు రకాల ఫలితాలు:
సంఖ్యాశాస్త్రంలో మూడు రకములైన ఆధార సంఖ్యలకు అను గుణంగా ఫలితాలను చెబుతారు.

(1) పుట్టిన తేదీ సంఖ్య.
(2) పుట్టిన తేదీ, నెల, సంవత్సరం వీటి సమష్టి సంఖ్య.
(3) ఒకరి పేరులోని అక్షరా లకున్న విలువల సమష్టి సంఖ్య.
(ఈ సమష్టి సంఖ్యలు పెద్ద మొత్తంగా ఉంటే ఆధార సంఖ్యగా మార్చుకోవాలి.)

ఉదాహరణ :
(1) ఒకరు పుట్టిన తేది 4-1-1967.
(ఇందులో పుట్టినతేదీ 4. కావున మిగతా వివరాలు అక్కరలేదు. ఇచ్చట పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని ఆ జాతకుని వివరాలను అందించవచ్చు.)

(2) ఒకరు పుట్టిన తేది 4-1-1967.
(ఇందులో పుట్టిన తేదీ, నెల, సంవత్సరములోని అంకెలను ఏక సంఖ్యలోకి తీసుకురావాలి)

4+1+1+9+6+7 = 28
2 + 8 = 10 = 1 (డేస్టినీ సంఖ్య)

3) పై జన్మదినము కలవాని పేరు వెంకటేశ్వర స్వామి అనుకొనిన

V E N K A T E S W A R A S W A M I
4  5  5  2 1  2 5 1  5  1  9  1 1  5  1  4 9

4+5+5+2+1+2+5+1+5+1+9+1+1+5+1+4+9=61

6 + 1 = 7 (డెస్టినీ సంఖ్య) పేరును బట్టి.

పై విధంగా పేరును బట్టి ఒక వచ్చే సంఖ్య (పై పేరులో 7) ఆ జాతకునికి సరిపోవునా లేదా, పేరులో ఏ మార్పులు చేస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు ఆ జాతకుడు పొందచ్చా మొదలైన విషయాలు న్యూమరాల జిస్టులు తగు విధంగా పరిశీలించి పేరును కరెక్షన్ చేయగలరు. కావున అనుభవజ్ఞుడైన న్యూమరాలజిస్టులు ఈ విషయంలో మీకు చక్కని మార్గనిర్దేశనం చేయగలరు.

ఈ విధముగా మూడు మార్గముల ద్వారా సాధించిన ఒక వ్యక్తి యొక్క 1-9 సంఖ్యలలో ఏదో ఒక సంఖ్యతో ఆ జాతకుని దైహిక లక్షణములతో పాటు మానసిక, వ్యక్తిత్వ మొదలైన అంశాలు దాగి ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ముందు పేజీలలో అందించబడినవి.

రూలింగ్ నెంబరు:
వ్యక్తి జాతకంలో రూలింగ్ నెంబరు అత్యంత ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. జీవితంలోని ప్రతి సంఘటనపై ఈ సంఖ్య పాత్ర విశేషంగా ఉంటుంది.

ఉదాహరణకు 4-1-1967లో పుట్టిన ఒక జాతకుని జనన తేదీ అయిన 4వ తేదీ రూలింగ్ సంఖ్య అవుతుంది.

ఒక వేళ 14-1-1967లో పుట్టిన ఒక జాతకుని జన్య తేదీ అయిన 14 ను ఏక సంఖ్యగా మార్చితే (1 + 4 = 5) ఆ వచ్చిన సంఖ్య అయిన 5 రూలింగ్ సంఖ్యగా ఉంటుంది.

అదృష్ట సంఖ్య:-
దీనినే “ఫేట్ నెంబర్” అని, డెస్టినీ నెంబరు, విధి సంఖ్య అని వివిధ పేర్లతో పిలుస్తారు. దీనిని తెలుసు కోవటానికి జనన తేదీ సంఖ్యను మాస సంఖ్యను, సంవత్సర సంఖ్యను కలిపితే అది అదృష్ట సంఖ్య అవుతుంది.

ఉదాహరణకు : 4-1-1967 జాతకుని అదృష్ట సంఖ్యను నిర్ణయించదలిస్తే 4+1+1+9+6+7 28 దీనిని ఏక సంఖ్యగా మారిస్తే 2 + 8 = 10 సున్నకు విలువ లేదు కాబట్టి 1 అదృష్ట సంఖ్య అవుతుంది.

జన్మదిన తేదీ ద్వారా, పేరు ద్వారా సాధించిన సమష్టి సంఖ్యలు (1-9) మనకు ఏ విధంగా దిశానిర్దేశనం చేస్తాయో ఇచ్చట వివరించబడినది.

న్యూమరాలజీ - 1వ సంఖ్య

Thursday, August 6, 2026

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

నారద ఉవాచ:
భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద ।
శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥

సర్వపాపహరం దేవ యేన విద్యా ప్రవర్తతే ।
కేన వా బ్రహ్మవిజ్ఞానం కిం ను వా మోక్షసాధనమ్ ॥ 02 ॥

బ్రాహ్మణానాం గతిః కేన కేన వా మృత్యు నాశనమ్ ।
ఐహికాముష్మికఫలం కేన వా పద్మలోచన ॥ 03 ॥

వక్తుమర్హస్యశేషేణ సర్వే నిఖిలమాదితః ।

శ్రీనారాయణ ఉవాచ:
సాధు సాధు మహాప్రాజ్ఞ సమ్యక్ పృష్టం త్వయాఽనఘ ॥ 04 ॥

శృణు వక్ష్యామి యత్నేన గాయత్ర్యష్టసహస్రకమ్ ।
నామ్నాం శుభానాం దివ్యానాం సర్వపాపవినాశనమ్ ॥ 05 ॥

సృష్ట్యాదౌ యద్భగవతా పూర్వే ప్రోక్తం బ్రవీమి తే ।
అష్టోత్తరసహస్రస్య ఋషిర్బ్రహ్మా ప్రకీర్తితః ॥ 06 ॥

ఛన్దోఽనుష్టుప్తథా దేవీ గాయత్రీం దేవతా స్మృతా ।
హలోబీజాని తస్యైవ స్వరాః శక్తయ ఈరితాః ॥ 07 ॥

అఙ్గన్యాసకరన్యాసావుచ్యేతే మాతృకాక్షరైః ।
అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకానాం హితాయ వై ॥ 08 ॥

ధ్యానమ్
రక్తశ్వేతహిరణ్యనీలధవళైర్యుక్తాం త్రినేత్రోజ్జ్వలాం
రక్తాం రక్తనవస్రజం మణిగణైర్యుక్తాం కుమారీమిమామ్ ।
గాయత్రీం కమలాసనాం కరతలవ్యానద్ధకుణ్డామ్బుజాం
పద్మాక్షీం చ వరస్రజం చ దధతీం హంసాధిరూఢాం భజే ॥ 9 ॥

అచిన్త్యలక్షణావ్యక్తాప్యర్థమాతృమహేశ్వరీ ।
అమృతార్ణవమధ్యస్థాప్యజితా చాపరాజితా ॥ 10 ॥

అణిమాదిగుణాధారాప్యర్కమణ్డలసంస్థితా ।
అజరాజాపరాధర్మా అక్షసూత్రధరాధరా ॥ 11 ॥

అకారాదిక్షకారాన్తాప్యరిషడ్వర్గభేదినీ ।
అఞ్జనాద్రిప్రతీకాశాప్యఞ్జనాద్రినివాసినీ ॥ 12 ॥

అదితిశ్చాజపావిద్యాప్యరవిన్దనిభేక్షణా ।
అన్తర్బహిఃస్థితావిద్యాధ్వంసినీ చాన్తరాత్మికా ॥ 13 ॥

అజా చాజముఖావాసాప్యరవిన్దనిభాననా ।
అర్ధమాత్రార్థదానజ్ఞాప్యరిమణ్డలమర్దినీ ॥ 14 ॥

అసురఘ్నీ హ్యమావాస్యాప్యలక్ష్మీఘ్న్యన్త్యజార్చితా ।
ఆదిలక్ష్మీశ్చాదిశక్తిరాకృతిశ్చాయతాననా ॥ 15 ॥

ఆదిత్యపదవీచారాప్యాదిత్యపరిసేవితా ।
ఆచార్యావర్తనాచారాప్యాదిమూర్తినివాసినీ ॥ 16 ॥

ఆగ్నేయీ చామరీ చాద్యా చారాధ్యా చాసనస్థితా ।
ఆధారనిలయాధారా చాకాశాన్తనివాసినీ ॥ 17 ॥

ఆద్యాక్షరసమాయుక్తా చాన్తరాకాశరూపిణీ ।
ఆదిత్యమణ్డలగతా చాన్తరధ్వాన్తనాశినీ ॥ 18 ॥

ఇన్దిరా చేష్టదా చేష్టా చేన్దీవరనిభేక్షణా ।
ఇరావతీ చేన్ద్రపదా చేన్ద్రాణీ చేన్దురూపిణీ ॥ 19 ॥

ఇక్షుకోదణ్డసంయుక్తా చేషుసన్ధానకారిణీ ।
ఇన్ద్రనీలసమాకారా చేడాపిఙ్గలరూపిణీ ॥ 20 ॥

ఇన్ద్రాక్షీచేశ్వరీ దేవీ చేహాత్రయవివర్జితా ।
ఉమా చోషా హ్యుడునిభా ఉర్వారుకఫలాననా ॥ 21 ॥

ఉడుప్రభా చోడుమతీ హ్యుడుపా హ్యుడుమధ్యగా ।
ఊర్ధ్వా చాప్యూర్ధ్వకేశీ చాప్యూర్ధ్వాధోగతిభేదినీ ॥ 22 ॥

ఊర్ధ్వబాహుప్రియా చోర్మిమాలావాగ్గ్రన్థదాయినీ ।
ఋతం చర్షిరృతుమతీ ఋషిదేవనమస్కృతా ॥ 23 ॥

ఋగ్వేదా ఋణహర్త్రీ చ ఋషిమణ్డలచారిణీ ।
ఋద్ధిదా ఋజుమార్గస్థా ఋజుధర్మా ఋజుప్రదా ॥ 24 ॥

ఋగ్వేదనిలయా ఋజ్వీ లుప్తధర్మప్రవర్తినీ ।
లూతారివరసమ్భూతా లూతాదివిషహారిణీ ॥ 25 ॥

ఏకాక్షరా చైకమాత్రా చైకా చైకైకనిష్ఠితా ।
ఐన్ద్రీ హ్యైరావతారూఢా చైహికాముష్మికప్రదా ॥ 26 ॥

ఓఙ్కారా హ్యోషధీ చోతా చోతప్రోతనివాసినీ ।
ఔర్వా హ్యౌషధసమ్పన్నా ఔపాసనఫలప్రదా ॥ 27 ॥

అణ్డమధ్యస్థితా దేవీ చాఃకారమనురూపిణీ ।
కాత్యాయనీ కాలరాత్రిః కామాక్షీ కామసున్దరీ ॥ 28 ॥

కమలా కామినీ కాన్తా కామదా కాలకణ్ఠినీ ।
కరికుమ్భస్తనభరా కరవీరసువాసినీ ॥ 29 ॥

కల్యాణీ కుణ్డలవతీ కురుక్షేత్రనివాసినీ ।
కురువిన్దదలాకారా కుణ్డలీ కుముదాలయా ॥ 30 ॥

కాలజిహ్వా కరాలాస్యా కాలికా కాలరూపిణీ ।
కమనీయగుణా కాన్తిః కలాధారా కుముద్వతీ ॥ 31 ॥

కౌశికీ కమలాకారా కామచారప్రభఞ్జినీ ।
కౌమారీ కరుణాపాఙ్గీ కకువన్తా కరిప్రియా ॥ 32 ॥

కేసరీ కేశవనుతా కదమ్బకుసుమప్రియా ।
కాలిన్దీ కాలికా కాఞ్చీ కలశోద్భవసంస్తుతా ॥ 33 ॥

కామమాతా క్రతుమతీ కామరూపా కృపావతీ ।
కుమారీ కుణ్డనిలయా కిరాతీ కీరవాహనా ॥ 34 ॥

కైకేయీ కోకిలాలాపా కేతకీ కుసుమప్రియా ।
కమణ్డలుధరా కాలీ కర్మనిర్మూలకారిణీ ॥ 35 ॥

కలహంసగతిః కక్షా కృతకౌతుకమఙ్గలా ।
కస్తూరీతిలకా కమ్ప్రా కరీన్ద్రగమనా కుహూః ॥ 36 ॥

కర్పూరలేపనా కృష్ణా కపిలా కుహరాశ్రయా ।
కూటస్థా కుధరా కమ్రా కుక్షిస్థాఖిలవిష్టపా ॥ 37 ॥

ఖడ్గఖేటధరా ఖర్వా ఖేచరీ ఖగవాహనా ।
ఖట్వాఙ్గధారిణీ ఖ్యాతా ఖగరాజోపరిస్థితా ॥ 38 ॥

ఖలఘ్నీ ఖణ్డితజరా ఖణ్డాఖ్యానప్రదాయినీ ।
ఖణ్డేన్దుతిలకా గఙ్గా గణేశగుహపూజితా ॥ 39 ॥

గాయత్రీ గోమతీ గీతా గాన్ధారీ గానలోలుపా ।
గౌతమీ గామినీ గాధా గన్ధర్వాప్సరసేవితా ॥ 40 ॥

గోవిన్దచరణాక్రాన్తా గుణత్రయవిభావితా ।
గన్ధర్వీ గహ్వరీ గోత్రా గిరీశా గహనా గమీ ॥ 41 ॥

గుహావాసా గుణవతీ గురుపాపప్రణాశినీ ।
గుర్వీ గుణవతీ గుహ్యా గోప్తవ్యా గుణదాయినీ ॥ 42 ॥

గిరిజా గుహ్యమాతఙ్గీ గరుడధ్వజవల్లభా ।
గర్వాపహారిణీ గోదా గోకులస్థా గదాధరా ॥ 43 ॥

గోకర్ణనిలయాసక్తా గుహ్యమణ్డలవర్తినీ ।
ఘర్మదా ఘనదా ఘణ్టా ఘోరదానవమర్దినీ ॥ 44 ॥

ఘృణిమన్త్రమయీ ఘోషా ఘనసమ్పాతదాయినీ ।
ఘణ్టారవప్రియా ఘ్రాణా ఘృణిసన్తుష్టకారిణీ ॥ 45 ॥

ఘనారిమణ్డలా ఘూర్ణా ఘృతాచీ ఘనవేగినీ ।
జ్ఞానధాతుమయీ చర్చా చర్చితా చారుహాసినీ ॥ 46 ॥

చటులా చణ్డికా చిత్రా చిత్రమాల్యవిభూషితా ।
చతుర్భుజా చారుదన్తా చాతురీ చరితప్రదా ॥ 47 ॥

చూలికా చిత్రవస్త్రాన్తా చన్ద్రమఃకర్ణకుణ్డలా ।
చన్ద్రహాసా చారుదాత్రీ చకోరీ చన్ద్రహాసినీ ॥ 48 ॥

చన్ద్రికా చన్ద్రధాత్రీ చ చౌరీ చౌరా చ చణ్డికా ।
చఞ్చద్వాగ్వాదినీ చన్ద్రచూడా చోరవినాశినీ ॥ 49 ॥

చారుచన్దనలిప్తాఙ్గీ చఞ్చచ్చామరవీజితా ।
చారుమధ్యా చారుగతిశ్చన్దిలా చన్ద్రరూపిణీ ॥ 50 ॥

చారుహోమప్రియా చార్వాచరితా చక్రబాహుకా ।
చన్ద్రమణ్డలమధ్యస్థా చన్ద్రమణ్డలదర్పణా ॥ 51 ॥

చక్రవాకస్తనీ చేష్టా చిత్రా చారువిలాసినీ ।
చిత్స్వరూపా చన్ద్రవతీ చన్ద్రమాశ్చన్దనప్రియా ॥ 52 ॥

చోదయిత్రీ చిరప్రజ్ఞా చాతకా చారుహేతుకీ ।
ఛత్రయాతా ఛత్రధరా ఛాయా ఛన్దఃపరిచ్ఛదా ॥ 53 ॥

ఛాయాదేవీ ఛిద్రనఖా ఛన్నేన్ద్రియవిసర్పిణీ ।
ఛన్దోఽనుష్టుప్ప్రతిష్ఠాన్తా ఛిద్రోపద్రవభేదినీ ॥ 54 ॥

ఛేదా ఛత్రేశ్వరీ ఛిన్నా ఛురికా ఛేదనప్రియా ।
జననీ జన్మరహితా జాతవేదా జగన్మయీ ॥ 55 ॥

జాహ్నవీ జటిలా జేత్రీ జరామరణవర్జితా ।
జమ్బూద్వీపవతీ జ్వాలా జయన్తీ జలశాలినీ ॥ 56 ॥

జితేన్ద్రియా జితక్రోధా జితామిత్రా జగత్ప్రియా ।
జాతరూపమయీ జిహ్వా జానకీ జగతీ జరా ॥ 57 ॥

జనిత్రీ జహ్నుతనయా జగత్త్రయహితైషిణీ ।
జ్వాలాముఖీ జపవతీ జ్వరఘ్నీ జితవిష్టపా ॥ 58 ॥

జితాక్రాన్తమయీ జ్వాలా జాగ్రతీ జ్వరదేవతా ।
జ్వలన్తీ జలదా జ్యేష్ఠా జ్యాఘోషాస్ఫోటదిఙ్ముఖీ ॥ 59 ॥

జమ్భినీ జృమ్భణా జృమ్భా జ్వలన్మాణిక్యకుణ్డలా ।
ఝిఞ్ఝికా ఝణనిర్ఘోషా ఝఞ్ఝామారుతవేగినీ ॥ 60 ॥

ఝల్లరీవాద్యకుశలా ఞరూపా ఞభుజా స్మృతా ।
టఙ్కబాణసమాయుక్తా టఙ్కినీ టఙ్కభేదినీ ॥ 61 ॥

టఙ్కీగణకృతాఘోషా టఙ్కనీయమహోరసా ।
టఙ్కారకారిణీ దేవీ ఠఠశబ్దనినాదినీ ॥ 62 ॥

డామరీ డాకినీ డిమ్భా డుణ్డుమారైకనిర్జితా ।
డామరీతన్త్రమార్గస్థా డమడ్డమరునాదినీ ॥ 63 ॥

డిణ్డీరవసహా డిమ్భలసత్క్రీడాపరాయణా ।
ఢుణ్ఢివిఘ్నేశజననీ ఢక్కాహస్తా ఢిలివ్రజా ॥ 64 ॥

నిత్యజ్ఞానా నిరుపమా నిర్గుణా నర్మదా నదీ ।
త్రిగుణా త్రిపదా తన్త్రీ తులసీ తరుణా తరుః ॥ 65 ॥

త్రివిక్రమపదాక్రాన్తా తురీయపదగామినీ ।
తరుణాదిత్యసఙ్కాశా తామసీ తుహినా తురా ॥ 66 ॥

త్రికాలజ్ఞానసమ్పన్నా త్రివేణీ చ త్రిలోచనా ।
త్రిశక్తిస్త్రిపురా తుఙ్గా తురఙ్గవదనా తథా ॥ 67 ॥

తిమిఙ్గిలగిలా తీవ్రా త్రిస్రోతా తామసాదినీ ।
తన్త్రమన్త్రవిశేషజ్ఞా తనుమధ్యా త్రివిష్టపా ॥ 68 ॥

త్రిసన్ధ్యా త్రిస్తనీ తోషాసంస్థా తాలప్రతాపినీ ।
తాటఙ్కినీ తుషారాభా తుహినాచలవాసినీ ॥ 69 ॥

తన్తుజాలసమాయుక్తా తారహారావలిప్రియా ।
తిలహోమప్రియా తీర్థా తమాలకుసుమాకృతిః ॥ 70 ॥

తారకా త్రియుతా తన్వీ త్రిశఙ్కుపరివారితా ।
తలోదరీ తిలాభూషా తాటఙ్కప్రియవాదినీ ॥ 71 ॥

త్రిజటా తిత్తిరీ తృష్ణా త్రివిధా తరుణాకృతిః ।
తప్తకాఞ్చనసఙ్కాశా తప్తకాఞ్చనభూషణా ॥ 72 ॥

త్రైయమ్బకా త్రివర్గా చ త్రికాలజ్ఞానదాయినీ ।
తర్పణా తృప్తిదా తృప్తా తామసీ తుమ్బురుస్తుతా ॥ 73 ॥

తార్క్ష్యస్థా త్రిగుణాకారా త్రిభఙ్గీ తనువల్లరిః ।
థాత్కారీ థారవా థాన్తా దోహినీ దీనవత్సలా ॥ 74 ॥

దానవాన్తకరీ దుర్గా దుర్గాసురనిబర్హిణీ ।
దేవరీతిర్దివారాత్రిర్ద్రౌపదీ దున్దుభిస్వనా ॥ 75 ॥

దేవయానీ దురావాసా దారిద్ర్యోద్భేదినీ దివా ।
దామోదరప్రియా దీప్తా దిగ్వాసా దిగ్విమోహినీ ॥ 76 ॥

దణ్డకారణ్యనిలయా దణ్డినీ దేవపూజితా ।
దేవవన్ద్యా దివిషదా ద్వేషిణీ దానవాకృతిః ॥ 77 ॥

దీనానాథస్తుతా దీక్షా దైవతాదిస్వరూపిణీ ।
ధాత్రీ ధనుర్ధరా ధేనుర్ధారిణీ ధర్మచారిణీ ॥ 78 ॥

ధురన్ధరా ధరాధారా ధనదా ధాన్యదోహినీ ।
ధర్మశీలా ధనాధ్యక్షా ధనుర్వేదవిశారదా ॥ 79 ॥

ధృతిర్ధన్యా ధృతపదా ధర్మరాజప్రియా ధ్రువా ।
ధూమావతీ ధూమకేశీ ధర్మశాస్త్రప్రకాశినీ ॥ 80 ॥

నన్దా నన్దప్రియా నిద్రా నృనుతా నన్దనాత్మికా ।
నర్మదా నలినీ నీలా నీలకణ్ఠసమాశ్రయా ॥ 81 ॥

నారాయణప్రియా నిత్యా నిర్మలా నిర్గుణా నిధిః ।
నిరాధారా నిరుపమా నిత్యశుద్ధా నిరఞ్జనా ॥ 82 ॥

నాదబిన్దుకలాతీతా నాదబిన్దుకలాత్మికా ।
నృసింహినీ నగధరా నృపనాగవిభూషితా ॥ 83 ॥

నరకక్లేశశమనీ నారాయణపదోద్భవా ।
నిరవద్యా నిరాకారా నారదప్రియకారిణీ ॥ 84 ॥

నానాజ్యోతిః సమాఖ్యాతా నిధిదా నిర్మలాత్మికా ।
నవసూత్రధరా నీతిర్నిరుపద్రవకారిణీ ॥ 85 ॥

నన్దజా నవరత్నాఢ్యా నైమిషారణ్యవాసినీ ।
నవనీతప్రియా నారీ నీలజీమూతనిస్వనా ॥ 86 ॥

నిమేషిణీ నదీరూపా నీలగ్రీవా నిశీశ్వరీ ।
నామావలిర్నిశుమ్భఘ్నీ నాగలోకనివాసినీ ॥ 87 ॥

నవజామ్బూనదప్రఖ్యా నాగలోకాధిదేవతా ।
నూపురాక్రాన్తచరణా నరచిత్తప్రమోదినీ ॥ 88 ॥

నిమగ్నారక్తనయనా నిర్ఘాతసమనిస్వనా ।
నన్దనోద్యాననిలయా నిర్వ్యూహోపరిచారిణీ ॥ 89 ॥

పార్వతీ పరమోదారా పరబ్రహ్మాత్మికా పరా ।
పఞ్చకోశవినిర్ముక్తా పఞ్చపాతకనాశినీ ॥ 90 ॥

పరచిత్తవిధానజ్ఞా పఞ్చికా పఞ్చరూపిణీ ।
పూర్ణిమా పరమా ప్రీతిః పరతేజః ప్రకాశినీ ॥ 91 ॥

పురాణీ పౌరుషీ పుణ్యా పుణ్డరీకనిభేక్షణా ।
పాతాలతలనిర్మగ్నా ప్రీతా ప్రీతివివర్ధినీ ॥ 92 ॥

పావనీ పాదసహితా పేశలా పవనాశినీ ।
ప్రజాపతిః పరిశ్రాన్తా పర్వతస్తనమణ్డలా ॥ 93 ॥

పద్మప్రియా పద్మసంస్థా పద్మాక్షీ పద్మసమ్భవా ।
పద్మపత్రా పద్మపదా పద్మినీ ప్రియభాషిణీ ॥ 94 ॥

పశుపాశవినిర్ముక్తా పురన్ధ్రీ పురవాసినీ ।
పుష్కలా పురుషా పర్వా పారిజాతసుమప్రియా ॥ 95 ॥

పతివ్రతా పవిత్రాఙ్గీ పుష్పహాసపరాయణా ।
ప్రజ్ఞావతీసుతా పౌత్రీ పుత్రపూజ్యా పయస్వినీ ॥ 96 ॥

పట్టిపాశధరా పఙ్క్తిః పితృలోకప్రదాయినీ ।
పురాణీ పుణ్యశీలా చ ప్రణతార్తివినాశినీ ॥ 97 ॥

ప్రద్యుమ్నజననీ పుష్టా పితామహపరిగ్రహా ।
పుణ్డరీకపురావాసా పుణ్డరీకసమాననా ॥ 98 ॥

పృథుజఙ్ఘా పృథుభుజా పృథుపాదా పృథూదరీ ।
ప్రవాలశోభా పిఙ్గాక్షీ పీతవాసాః ప్రచాపలా ॥ 99 ॥

ప్రసవా పుష్టిదా పుణ్యా ప్రతిష్ఠా ప్రణవాగతిః ।
పఞ్చవర్ణా పఞ్చవాణీ పఞ్చికా పఞ్జరస్థితా ॥ 100 ॥

పరమాయా పరజ్యోతిః పరప్రీతిః పరాగతిః ।
పరాకాష్ఠా పరేశానీ పావనీ పావకద్యుతిః ॥ 101 ॥

పుణ్యభద్రా పరిచ్ఛేద్యా పుష్పహాసా పృథూదరీ ।
పీతాఙ్గీ పీతవసనా పీతశయ్యా పిశాచినీ ॥ 102 ॥

పీతక్రియా పిశాచఘ్నీ పాటలాక్షీ పటుక్రియా ।
పఞ్చభక్షప్రియాచారా పూతనాప్రాణఘాతినీ ॥ 103 ॥

పున్నాగవనమధ్యస్థా పుణ్యతీర్థనిషేవితా ।
పఞ్చాఙ్గీ చ పరాశక్తిః పరమాహ్లాదకారిణీ ॥ 104 ॥

పుష్పకాణ్డస్థితా పూషా పోషితాఖిలవిష్టపా ।
ప్రాణప్రియా పఞ్చశిఖా పన్నగోపరిశాయినీ ॥ 105 ॥

పఞ్చమాత్రాత్మికా పృథ్వీ పథికా పృథుదోహినీ ।
పురాణన్యాయమీమాంసా పాటలీ పుష్పగన్ధినీ ॥ 106 ॥

పుణ్యప్రజా పారదాత్రీ పరమార్గైకగోచరా ।
ప్రవాలశోభా పూర్ణాశా ప్రణవా పల్లవోదరీ ॥ 107 ॥

ఫలినీ ఫలదా ఫల్గుః ఫూత్కారీ ఫలకాకృతిః ।
ఫణీన్ద్రభోగశయనా ఫణిమణ్డలమణ్డితా ॥ 108 ॥

బాలబాలా బహుమతా బాలాతపనిభాంశుకా ।
బలభద్రప్రియా వన్ద్యా బడవా బుద్ధిసంస్తుతా ॥ 109 ॥

బన్దీదేవీ బిలవతీ బడిశఘ్నీ బలిప్రియా ।
బాన్ధవీ బోధితా బుద్ధిర్బన్ధూకకుసుమప్రియా ॥ 110 ॥

బాలభానుప్రభాకారా బ్రాహ్మీ బ్రాహ్మణదేవతా ।
బృహస్పతిస్తుతా బృన్దా బృన్దావనవిహారిణీ ॥ 111 ॥

బాలాకినీ బిలాహారా బిలవాసా బహూదకా ।
బహునేత్రా బహుపదా బహుకర్ణావతంసికా ॥ 112 ॥

బహుబాహుయుతా బీజరూపిణీ బహురూపిణీ ।
బిన్దునాదకలాతీతా బిన్దునాదస్వరూపిణీ ॥ 113 ॥

బద్ధగోధాఙ్గులిత్రాణా బదర్యాశ్రమవాసినీ ।
బృన్దారకా బృహత్స్కన్ధా బృహతీ బాణపాతినీ ॥ 114 ॥

బృన్దాధ్యక్షా బహునుతా వనితా బహువిక్రమా ।
బద్ధపద్మాసనాసీనా బిల్వపత్రతలస్థితా ॥ 115 ॥

బోధిద్రుమనిజావాసా బడిస్థా బిన్దుదర్పణా ।
బాలా బాణాసనవతీ బడబానలవేగినీ ॥ 116 ॥

బ్రహ్మాణ్డబహిరన్తఃస్థా బ్రహ్మకఙ్కణసూత్రిణీ ।
భవానీ భీషణవతీ భావినీ భయహారిణీ ॥ 117 ॥

భద్రకాలీ భుజఙ్గాక్షీ భారతీ భారతాశయా ।
భైరవీ భీషణాకారా భూతిదా భూతిమాలినీ ॥ 118 ॥

భామినీ భోగనిరతా భద్రదా భూరివిక్రమా ।
భూతవాసా భృగులతా భార్గవీ భూసురార్చితా ॥ 119 ॥

భాగీరథీ భోగవతీ భవనస్థా భిషగ్వరా ।
భామినీ భోగినీ భాషా భవానీ భూరిదక్షిణా ॥ 120 ॥

భర్గాత్మికా భీమవతీ భవబన్ధవిమోచినీ ।
భజనీయా భూతధాత్రీరఞ్జితా భువనేశ్వరీ ॥ 121 ॥

భుజఙ్గవలయా భీమా భేరుణ్డా భాగధేయినీ ।
మాతా మాయా మధుమతీ మధుజిహ్వా మధుప్రియా ॥ 122 ॥

మహాదేవీ మహాభాగా మాలినీ మీనలోచనా ।
మాయాతీతా మధుమతీ మధుమాంసా మధుద్రవా ॥ 123 ॥

మానవీ మధుసమ్భూతా మిథిలాపురవాసినీ ।
మధుకైటభసంహర్త్రీ మేదినీ మేఘమాలినీ ॥ 124 ॥

మన్దోదరీ మహామాయా మైథిలీ మసృణప్రియా ।
మహాలక్ష్మీర్మహాకాలీ మహాకన్యా మహేశ్వరీ ॥ 125 ॥

మాహేన్ద్రీ మేరుతనయా మన్దారకుసుమార్చితా ।
మఞ్జుమఞ్జీరచరణా మోక్షదా మఞ్జుభాషిణీ ॥ 126 ॥

మధురద్రావిణీ ముద్రా మలయా మలయాన్వితా ।
మేధా మరకతశ్యామా మాగధీ మేనకాత్మజా ॥ 127 ॥

మహామారీ మహావీరా మహాశ్యామా మనుస్తుతా ।
మాతృకా మిహిరాభాసా ముకున్దపదవిక్రమా ॥ 128 ॥

మూలాధారస్థితా ముగ్ధా మణిపూరకవాసినీ ।
మృగాక్షీ మహిషారూఢా మహిషాసురమర్దినీ ॥ 129 ॥

యోగాసనా యోగగమ్యా యోగా యౌవనకాశ్రయా ।
యౌవనీ యుద్ధమధ్యస్థా యమునా యుగధారిణీ ॥ 130 ॥

యక్షిణీ యోగయుక్తా చ యక్షరాజప్రసూతినీ ।
యాత్రా యానవిధానజ్ఞా యదువంశసముద్భవా ॥ 131 ॥

యకారాదిహకారాన్తా యాజుషీ యజ్ఞరూపిణీ ।
యామినీ యోగనిరతా యాతుధానభయఙ్కరీ ॥ 132 ॥

రుక్మిణీ రమణీ రామా రేవతీ రేణుకా రతిః ।
రౌద్రీ రౌద్రప్రియాకారా రామమాతా రతిప్రియా ॥ 133 ॥

రోహిణీ రాజ్యదా రేవా రమా రాజీవలోచనా ।
రాకేశీ రూపసమ్పన్నా రత్నసింహాసనస్థితా ॥ 134 ॥

రక్తమాల్యామ్బరధరా రక్తగన్ధానులేపనా ।
రాజహంససమారూఢా రమ్భా రక్తబలిప్రియా ॥ 135 ॥

రమణీయయుగాధారా రాజితాఖిలభూతలా ।
రురుచర్మపరీధానా రథినీ రత్నమాలికా ॥ 136 ॥

రోగేశీ రోగశమనీ రావిణీ రోమహర్షిణీ ।
రామచన్ద్రపదాక్రాన్తా రావణచ్ఛేదకారిణీ ॥ 137 ॥

రత్నవస్త్రపరిచ్ఛన్నా రథస్థా రుక్మభూషణా ।
లజ్జాధిదేవతా లోలా లలితా లిఙ్గధారిణీ ॥ 138 ॥

లక్ష్మీర్లోలా లుప్తవిషా లోకినీ లోకవిశ్రుతా ।
లజ్జా లమ్బోదరీ దేవీ లలనా లోకధారిణీ ॥ 139 ॥

వరదా వన్దితా విద్యా వైష్ణవీ విమలాకృతిః ।
వారాహీ విరజా వర్షా వరలక్ష్మీర్విలాసినీ ॥ 140 ॥

వినతా వ్యోమమధ్యస్థా వారిజాసనసంస్థితా ।
వారుణీ వేణుసమ్భూతా వీతిహోత్రా విరూపిణీ ॥ 141 ॥

వాయుమణ్డలమధ్యస్థా విష్ణురూపా విధిప్రియా ।
విష్ణుపత్నీ విష్ణుమతీ విశాలాక్షీ వసున్ధరా ॥ 142 ॥

వామదేవప్రియా వేలా వజ్రిణీ వసుదోహినీ ।
వేదాక్షరపరీతాఙ్గీ వాజపేయఫలప్రదా ॥ 143 ॥

వాసవీ వామజననీ వైకుణ్ఠనిలయా వరా ।
వ్యాసప్రియా వర్మధరా వాల్మీకిపరిసేవితా ॥ 144 ॥

శాకమ్భరీ శివా శాన్తా శారదా శరణాగతిః ।
శాతోదరీ శుభాచారా శుమ్భాసురవిమర్దినీ ॥ 145 ॥

శోభావతీ శివాకారా శఙ్కరార్ధశరీరిణీ ।
శోణా శుభాశయా శుభ్రా శిరఃసన్ధానకారిణీ ॥ 146 ॥

శరావతీ శరానన్దా శరజ్జ్యోత్స్నా శుభాననా ।
శరభా శూలినీ శుద్ధా శబరీ శుకవాహనా ॥ 147 ॥

శ్రీమతీ శ్రీధరానన్దా శ్రవణానన్దదాయినీ ।
శర్వాణీ శర్వరీవన్ద్యా షడ్భాషా షడృతుప్రియా ॥ 148 ॥

షడాధారస్థితా దేవీ షణ్ముఖప్రియకారిణీ ।
షడఙ్గరూపసుమతీ సురాసురనమస్కృతా ॥ 149 ॥

సరస్వతీ సదాధారా సర్వమఙ్గలకారిణీ ।
సామగానప్రియా సూక్ష్మా సావిత్రీ సామసమ్భవా ॥ 150 ॥

సర్వావాసా సదానన్దా సుస్తనీ సాగరామ్బరా ।
సర్వైశ్వర్యప్రియా సిద్ధిః సాధుబన్ధుపరాక్రమా ॥ 151 ॥

సప్తర్షిమణ్డలగతా సోమమణ్డలవాసినీ ।
సర్వజ్ఞా సాన్ద్రకరుణా సమానాధికవర్జితా ॥ 152 ॥

సర్వోత్తుఙ్గా సఙ్గహీనా సద్గుణా సకలేష్టదా ।
సరధా సూర్యతనయా సుకేశీ సోమసంహతిః ॥ 153 ॥

హిరణ్యవర్ణా హరిణీ హ్రీఙ్కారీ హంసవాహినీ ।
క్షౌమవస్త్రపరీతాఙ్గీ క్షీరాబ్ధితనయా క్షమా ॥ 154 ॥

గాయత్రీ చైవ సావిత్రీ పార్వతీ చ సరస్వతీ ।
వేదగర్భా వరారోహా శ్రీగాయత్రీ పరామ్బికా ॥ 155 ॥

ఇతి సాహస్రకం నామ్నాం గాయత్ర్యాశ్చైవ నారద ।
పుణ్యదం సర్వపాపఘ్నం మహాసమ్పత్తిదాయకమ్ ॥ 156 ॥

ఏవం నామాని గాయత్ర్యాస్తోషోత్పత్తికరాణి హి ।
అష్టమ్యాం చ విశేషేణ పఠితవ్యం ద్విజైః సహ ॥ 157 ॥

జపం కృత్వా హోమ పూజా ధ్యానం కృత్వా విశేషతః ।
యస్మై కస్మై న దాతవ్యం గాయత్ర్యాస్తు విశేషతః ॥ 158 ॥

సుభక్తాయ సుశిష్యాయ వక్తవ్యం భూసురాయ వై ।
భ్రష్టేభ్యః సాధకేభ్యశ్చ బాన్ధవేభ్యో న దర్శయేత్ ॥ 159 ॥

యద్గృహే లిఖితం శాస్త్రం భయం తస్య న కస్యచిత్ ।
చఞ్చలాపిస్థిరా భూత్వా కమలా తత్ర తిష్ఠతి ॥ 160 ॥

ఇదం రహస్యం పరమం గుహ్యాద్గుహ్యతరం మహత్ ।
పుణ్యప్రదం మనుష్యాణాం దరిద్రాణాం నిధిప్రదమ్ ॥ 161 ॥

మోక్షప్రదం ముముక్షూణాం కామినాం సర్వకామదమ్ ।
రోగాద్వై ముచ్యతే రోగీ బద్ధో ముచ్యేత బన్ధనాత్ ॥ 162 ॥

బ్రహ్మహత్యా సురాపానం సువర్ణస్తేయినో నరాః ।
గురుతల్పగతో వాపి పాతకాన్ముచ్యతే సకృత్ ॥ 163 ॥

అసత్ప్రతిగ్రహాచ్చైవాఽభక్ష్యభక్షాద్విశేషతః ।
పాఖణ్డానృతముఖ్యేభ్యః పఠనాదేవ ముచ్యతే ॥ 164 ॥

ఇదం రహస్యమమలం మయోక్తం పద్మజోద్భవ ।
బ్రహ్మసాయుజ్యదం నౄణాం సత్యం సత్యం న సంశయః ॥ 165 ॥

॥ ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే ద్వాదశస్కన్ధే గాయత్రీసహస్రనామ స్తోత్ర కథనం నామ షష్ఠోఽధ్యాయః ॥

గాయత్రీ దేవి

Wednesday, August 5, 2026

Gayatri Hridayam - గాయత్రీ హృదయం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ హృదయం

శ్రీ గాయత్రీ హృదయం
బ్రహ్మనందనా! ఇక ఇప్పుడు అత్యంత ప్రధానమైన గాయత్రీహృదయం చెబుతాను తెలుసుకో. సాధుకుడెవరైనాగానీ ఇష్టదేవతతో అభిన్నుడయ్యే అర్చించాలి. నాదేవో దేవమర్చయేత్‌ అని వేదం చెబుతోంది. కనక పిండబ్రహ్మాండాల సమైక్యాన్ని(అభిన్నతను) భావన చేస్తూ తన శరీరంలో దేవీరూపాన్ని ప్రతిష్టించుకోవాలి. గాయత్రీదేవి అంటే విరాడ్రూపిణి. మహాదేవి. వేదజనని. ఆ మూర్తిని సాధకుడు స్వశరీరంలో భావనామయంగా ప్రతిష్ఠించుకోవడమే గాయత్రీ హృదయమంటే.

పిండబ్రహ్మాండయోరైక్యాద్బావయేత్‌ స్వతనౌ తథా ।
దేవీరూపం నిజే దేహే తన్మయత్వాయ సాధకః ॥

నా
దేవోభ్యర్చయేద్దేవమితి వేదవిదో విదుః
తతో
భేదాయ కాయే స్వే భావయేద్దేవతా ఇమాః ॥

ఈ గాయత్రీహృదయానికి నారాయణుడు(అహమేవ) ఋషి. ఛందస్సు గాయత్రి. దేవత - పరమేశ్వరి. అంగషట్కం పూర్వోక్తమే. ఏకాంతంలో ఆసనబద్ధుడై ముందుగా ఏకాగ్రచిత్తంతో గాయత్రీదేవిని ధ్యానించాలి. అటుపైని అర్థన్యాసం - నా శిరస్సున ద్యులోకం, దంతపంక్తిలో అశ్వినులు, పెదవులలో ప్రాతస్సాయంసంధ్యలు, ముఖంలో ఆగ్ని, జిహ్వలో సరస్వతి, కంఠప్రదేశంలో బృహస్పతి, స్తనభాగంలో అష్టవసువులు, బాహువులలో మరుత్తులు(వాయువులు), హృదయంలో పర్జన్యుడు, ఉదరంలో ఆకాశం, నాభిలో అంతరిక్షం, కటిప్రదేశంలో ఇంద్రాగ్నులు, జఘనంలో విజ్ఞానఘనుడైన ప్రజాపతి, ఊరువులలో కైలాసమలయపర్వతాలు, జానువులలో విశ్వేదేవులు, జంఘలలో కౌశికుడు, గుహ్యంలో ఆయనాలు, ఊరువులలో పితృదేవతలు, పాదాలలో పృథివి, అంగుళులలో వనస్పతులు, రోమాలలో ఋషులు, గోళ్ళలో ముహూర్తాలు, ఎముకలలో గ్రహాలు, రక్తమాంసాలలో ఋతువులు, రెప్ప(పాటు)లలో సంవత్సరాహోరాత్రసూర్యచంద్రులు ప్రతిష్ఠింపబడుగాక - అని భావించాలి. సహస్రనేత్ర గాయత్రిని శరణువేడాలి.

ఓం తత్సవితుర్వరేణ్యాయ నమః, ఓం తత్పూర్వా జయాయ నమః, ఓం తత్ప్రాతరాదిత్యాయ నమః, ఓం తత్ప్రాతరాదిత్యప్రతిష్ఠాయ నమః - ఇలాగ నమస్కరించాలి. ప్రాతస్సంధ్యతో రాత్రిపాపమూ, సాయంసంధ్యతో పగటి పాపమూ నశించి సాయంప్రాతస్సంధ్యావందనాలు చేసినవాడు పాపరహితుడవుతాడు. సర్వతీర్థాలలోనూ స్నానంచేసిన పుణ్యాత్ముడవుతాడు. 

సకలదేవతలకూ పరిచితుడవుతాడు. అవాచ్యవచన ఆభక్ష్యభక్షణ అభోజ్యభోజన ఆచోష్యచోషణ అసాధ్యసాధన అగ్రాహ్యగ్రహణాది మహాపాపాలనుంచి విముక్తుడవుతాడు. దానప్రతిగ్రహదోషాలు తొలగిపోతాయి. పంక్తిదూషణ దోషం ఆంటదు. అనృతవచన దోషమూ అంతరిస్తుంది. అబ్రహ్మచారి బ్రహ్మచారి అవుతాడు. (అంతటి పవిత్రుడవుతాడని).

ఈ గాయత్రీ హృదయాన్ని అనుష్ఠించినవారేకాదు అధ్యయనం చేసినవారూ వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలాన్నీ అరవైవేల మంత్రజపం చేసినపుణ్యాన్నీ చిటికెలో అనాయాసంగా పొందుతారు. ఎనమండుగురు బ్రాహ్మణులను చక్కగా పోషించిన ఫలం దక్కుతుంది. దీన్ని నిత్యమూ అధ్యయనం చేసిన బ్రాహ్మణుడు, బ్రహ్మలోకం చేరుకుంటాడు.

గాయత్రీ స్తోత్రం





Gayatri Kavacham - గాయత్రీ కవచం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ కవచం

గాయత్రీ కవచానికి బ్రహ్మవిష్ణుమహేశ్వరులే ఋషులు. ఋగ్యజుస్సామాధర్వణాలే ఛందస్సులు. బ్రహ్మరూపిణి గాయత్రీదేవియే అధిదేవత. కవచమిది తద్బీజకం. భర్గశక్తికం. ధీకీలకం. (ధియ ఇత్తి కీలకమ్‌). మోక్షార్థే వినియోగః. దీనిలో నాలుగు వర్ణాలు హృదయం. మూడు వర్ణాలు శిరస్సు. నాల్గింటితో శిఖ. తర్వాత మూడింటితో కవచం. అటుపైని నాల్గింటితో నేత్రం. తక్కిన నాల్లూ అస్త్రకం. ఇక దీని ధ్యానశ్లోకమేమిటంటే -

ముక్తావిద్రుమహేమనీల ధవళచ్చాయైర్ముఖైస్త్రీక్షణై
ర్యుక్తా మిందు నిబద్ద రత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్‌ ।

గాయత్రీం వరదాభయాంకుశకశాః శుభ్రం కపాలం గదామ్‌
శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే॥

గాయత్రీదేవి తూర్పుదిక్కున రక్షించుగాక. సావిత్రి దక్షిణదిక్కునా, (బ్రహ్మ) సంధ్యాదేవి పశ్చిమదిక్కునా, సరస్వతీదేవి ఉత్తరదిక్కునా, పార్వతి ఆగ్నేయదిక్కునా జలశాయిని నైరృతిదిక్కునా పవమానవిలాసిని వాయవ్యదిక్కునా రుద్రాణి ఈశాన్యదిక్కునా బ్రహ్మాణి ఊర్ధ్వదిక్కునా వైష్ణవి అధోదిక్కునా - ఇలా దశదిశలా ఆ భువనేశ్వరి నన్ను రక్షించుగాక.

తత్పదం నా పాదాలనూ, సవితుః పదం జంఘలనూ, వరేణ్యం పదం కటిప్రదేశాన్నీ, భర్గః పదం నాభినీ, దేవస్య పదం హృదయాన్నీ ధీమహి పదం చెక్కిళ్ళనూ, ధియఃపదం నేత్రాలనూ, యఃపదం లలాటాన్ని, నః పదం శిరస్సునూ, ప్రచోదయాత్‌ పదం శిఖాభాగాన్నీ - రక్షించును గాక! ఇలాగే తత్‌వర్ణం శిరస్సునూ, సకారం ఫాలాన్నీ 'వి' వర్ణం నేత్రాలనూ, తుకారం కపోలాలనూ, వకారం నాసాపుటాలనూ, రేకారం ముఖాన్నీ, ణికారం పై పెదవిని, యమ్‌కారం కింది పెదవినీ, భకారం ఆస్య మధ్యభాగాన్నీ, ర్గోవర్ణం చిబుకాన్నీ, దేకారం కంఠప్రదేశాన్నీ, వకారం భుజస్కంధాలనూ, స్యకారం కుడి చేతినీ, ధీకారం ఎడమ చేతినీ, మకారం హృదయాన్నీ, హికారం ఉదరభాగాన్నీ, ధికారం నాభినీ, యోకారం కటి ప్రదేశాన్ని, మరొక యోకారం మర్మాంగా
న్నీ, నః వర్ణం రెండు తొడలనూ, ప్రకారం జానువులనూ, చోకారం జంఘలనూ, దకారం గుల్భాలనూ, యాకారం పాదాలనూ, తకారపు పొల్లు సర్వాంగాలనూ రక్షించుగాక!

నారదా! ఇది గాయత్రీ కవచం. దీన్ని ఇట్లా అనుసంధానం చేసుకున్నవారూ (ధరించినవారూ) విన్నవారూ అనంతకోటి బాధలనుంచి విముక్తి పొందుతారు. చతుష్షష్టి కళావేత్తలవుతారు. సర్వపాపవిముక్తులవుతారు. పరబ్రహ్మస్వరూపాన్ని అందుకుంటారు. సందేహంలేదు.

గాయత్రీ హృదయం





Gayatri Mantrakshara Mahima - గాయత్రీ మంత్రాక్షర మహిమ

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ మంత్రాక్షర మహిమ

నారదా! తక్కిన అనుష్ఠానాలను వేటిని చేసినా చెయ్యకపోయినా గాయత్రిని చేస్తే చాలు ద్విజుడు కృతకృత్యుడైనట్టే. మూడు సంధ్యల్లోనూ ఆర్ఘ్యమిచ్చి మూడువేలు గాయత్రీజపం చేస్తే ఆదే పదివేలు. దేవతలకుకూడా పూజ్యుడవుతాడు. అంగన్యాస కరన్యాసాదులు చెయ్యనీ మాననీ. సచ్చిదానందరూపిణి గాయత్రిని నిర్వ్యాజంగా ధ్యానించడం ముఖ్యం.

గాయత్రీమంత్రంలో ఒక్క అక్షరాన్ని సిద్దింపజేసుకుంటే చాలు ఆ సాధకుడు హరిహర హిరణ్యగర్భ సూర్యచంద్రాగ్నులతో పోటీపడతాడు. ఒక్కొక్క అక్షరమూ అంతంత ప్రభావం కలిగినవి. అందుకని ఆ అక్షరాల ఋషిచ్చందోదేవతలను అదేక్రమంలో అక్షరాలా చెబుతాను శ్రద్ధగా గ్రహించు. 

వామదేవుడు - అత్రి - వసిష్ఠుడు - శుక్రుడు - కణ్వుడు - పరాశరుడు - విశ్వామిత్రుడు - కపిలుడు - శౌనకుడు - యాజ్ఞవల్క్యుడు - భరద్వాజుడు - జమదగ్ని - గౌతముడు - ముధ్గలుడు - వేదవ్యాసుడు - లోమశుడు - అగస్త్యుడు - కౌశికుడు - వత్సుడు - పులస్త్యుడు - మాండూకుడు - దూర్వాసుడు - నారదుడు - కశ్యపుడు - ఈ ఇరవైనాలుగు మందీ వరసగా ఆ ఇరవైనాలుగు వర్ణాలకూ ఋషులు.

గాయత్రి - ఉష్ణిక్కు - అనుష్టుప్పు - బృహతి - పంక్తి - త్రిష్టుప్పు - జగతి - అతిజగతి - శక్వరి - అతిశక్వరి - ధృతి - అతిధృతి - విరాట్‌ - ప్రస్తారపంక్తి - కృతి - అతికృతి(ప్రకృతి) - ఆకృతి - వికృతి - సంకృతి - అక్షరపంక్తి - భూః - భువః - స్వః - జ్యోతిష్మతి - ఇవి ఇరవైనాలుగూ ఛందస్సులు. 

అదేక్రమంలో దేవతలనూ చెబుతాను. మొదటి అక్షరం అగ్నిదేవతాకం, రెండవది ప్రజాపతి దేవతాకం, మూడు సోమదేవతాకం, నాలుగు ఈశాన దేవతాకం, అయిదు సవితృదేవతాకం, ఆరు ఆదిత్యదేవతాకం, ఏడవది బృహస్పతి దేవతాకం, ఎనిమిదవది మిత్రావరుణ దేవతాకం, తొమ్మిది భగదేవతాకం, పదవది అర్యమదేవతాకం, పదకొండు గణేశదేవతాకం, పన్నెండు త్వష్టృదేవతాకం, పదమూడవది పౌష్ణదేవతాకం, పధ్నాల్గు ఇంద్రాగ్నిదేవతాకం, పదిహేనవది వాయవ్య దేవతాకం, పదహారవది వామదేవ దేవతాకం, పదిహేడవది మైత్రావరుణిదేవతాకం, పద్దెనిమిదవది వైశ్వదేవం, పంద్దొమ్మిదవది మాతృదేవతాకం, ఇరవై విష్ణుదేవతాకం, ఇరవైయొకటి వసుదేవతాకం, ఇరవై రెండవది రుద్రదేవతాకం, ఇరవైమూడవది కుబేరదేవతాకం ఇరవైనాల్గవది అశ్వినీదేవతాకం.

నారదా! ఇవీ గాయత్రీమంత్రంలో ఇరవైనాలుగక్షరాలకూ ఋషులూ ఛందస్సులూ దేవతలూ సంగ్రహంగా తెలియజేశాను. దీన్ని వింటేచాలు జపించినంత ఫలితమూ దక్కుతుంది.

ఈ వర్ణాలకు అధిదేవతలేకాదు అధిదేవీశక్తులూ ఉన్నాయి. మంత్రాక్షరాల క్రమంలో ఆ శక్తుల పేరు చెబుతాను. విను. వామదేవి - ప్రియ - సత్య - విశ్వ - భద్రవిలాసినీ - ప్రభావతి - జయ - శాంత - కాంత - దుర్గ - సరస్వతి - విద్రుమ - విశాలేశ - వ్యాపిని - విమల - తమోపహారిణి - సూక్ష్మ - విశ్వయోని - నిరయ - వశ - పద్మాలయ - పరశోభ - భద్ర - ద్రుపద - అనే ఇరవైనాలుగు శక్తులు ఆ అక్షరాలకు అధిదేవిమూర్తులు. 

ఇంక ఈ వర్ణాల వర్ణాలు(రంగులు) ఏమిటంటే - మొదటిది సంపంగిపువ్వురంగు, రెండవది అతసీవర్ణం, మూడవది పగడం రంగు, నాల్గవది స్ఫటికవర్ణం, అయిదవది పద్మం రంగు, ఆరవది తరుణాదిత్యసన్నిభం, ఏడవది శంఖచంద్రసమప్రభం, ఎనిమిదవది చిగురాకురంగు (ప్రవాళపద్మపత్రాభం), తొమ్మిదవది పద్మరాగవు రంగు, పదవది ఇంద్రనీలపు రంగు, పదకొండవది ముత్తెపురంగు, పన్నెండవది కుంకుమరంగు, పదమూడవది కాటుకరంగు, పధ్నాల్గవది రక్తవర్ణం, పదిహేనవది వైఢూర్య వర్ణం, పదహారవది క్షౌద్రవర్ణం. పదిహేడవది పసపురంగు, పద్ధెన్మిదవది మొల్లపువ్వు రంగు(కుంద దుగ్ధాభం), పంధొమ్మిదవది సూర్యకాంతి రంగు, ఇరవై చిలకతోక రంగు (శుకపుచ్చనిభం), ఇరవై యొకటి శతపత్రనిభం, ఇరవైరెండు కేతకీపుష్ప సంకాశం(మొగలిపువ్వు రంగు), ఇరవైమూడవది మల్లికాకుసుమం, ఇరవైనాల్గవ అక్షరానిది కరవీరవర్ణం.

ఈ వర్ణాలు ఇరవైనాల్గింటికీ ఇరవైనాలుగు తత్త్వాలున్నాయి. పృథివి - ఆపస్సు(జలం) - తేజస్సు - వాయువు - ఆకాశం - గంధం - రసం - రూపం - శబ్దం - స్పర్శ - ఉపస్థం - పాయువు - పాదం - పాణి - వాక్కు - ఘ్రాణం - జిహ్వ - చక్షుస్సు - త్వక్కు - శ్రోత్రం - ప్రాణం - అపానం - వ్యానం - సమానం - అనేవి వీటి తత్త్వాలు. 

ఇలాగే ఒక్కొక్క వర్ణానికీ ముద్రలున్నాయి. సుముఖం - సంపుటం - వితతం - విస్తృతం - ద్విముఖం - త్రిముఖం - చతుర్ముఖం - పంచముఖం - షణ్ముఖం - అధోముఖం - వ్యాపకాంజలికం - శకటం - యమపాశం - గ్రథితం - సన్ముఖోన్ముఖం - విలంబం - ముష్టికం - మత్స్యం - కూర్మం - వరాహం - సింహాక్రాంతం - మహాక్రాంతం - ముద్గరం - పల్లవం ఇవి ఇరవైనాలుగు ముద్రలు. 

త్రిశూలం - యోని - సురభి - అక్షమాల - లింగం - అంబుజం ఆనేవి ఆరూ మహాముద్రలు. తుర్యరూపాలు. ఇవన్నీ మహాపాపక్షయకరాలు. కీర్తి ప్రదాలు. కాంతి ప్రదాలు.

నారాయణమహర్షీ! స్వామీ! సర్వజగన్నాథా! చతుష్షష్టి కళాభిజ్ఞా! యోగవిద్యారహస్యవేత్తా! నాకొక్క సందేహం మిగిలిపోయింది. ఏ పుణ్యకార్యం చేస్తే మోక్షం వన్తుంది? బ్రహ్మరూపత్వం సిద్ధిస్తుంది? దేహం దేవతారూపాన్నీ మంత్రరూపాన్నీ పొందుతుంది? ఆ సత్కర్మ ఏమిటో దాని ఆచరణవిధానమేమిటో మంత్ర - ఋషి - చ్ఛందో - అధిదైవత - ధ్యానాలు ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ప్రభూ! దయచేసి తెలియపరచవూ!

నారదమహర్షి! తప్పకుండా తెలియపరుస్తాను. నువ్వు ఆడగడమూ నేను చెప్పకపోవడమూనా!గాయత్రీకవచమని అత్యంత గుహ్యం ఒకటి ఉంది. దాన్ని పఠించివా ధరించినా సర్వపాపాలూ నశిప్తాయి. కోరికలన్నీ తీరతాయి. అంతేకాదు - దేవీరూపుడవుతాడు.

గాయత్రీ కవచం





Peace Rituals (Shanti Homas) - శాంతి హోమాలు

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - శాంతి హోమాలు

నారదా! శమీసమిధలతో భూత రోగ గ్రహాదుల ఉపశమనంకోసం శాంతిహోమం చెయ్యాలి. పాలుగారే చెట్టునుంచి పచ్చి పేళ్ళు తెచ్చి హోమం చేస్తే ఇంకా మంచిది. శలలతో (మద్ది) చేసినా  భూతరోగశాంతి కలుగుతుంది. 

సూర్యుడికి ముందుగా జలతర్పణం చెయ్యాలి. మోకాలిబంటి నీటిలో నిలిచి. చేస్తే దోషాలన్నీ ఆంతరిస్తాయి. మెడబంటి లోతులో నిలబడి చేస్తే ప్రాణాంతకభయాలు తొలగిపోతాయి. శాంతికర్మలన్నింటికీ నీటిలో నిలిచి జపం చెయ్యడమే ఉత్తమం.

బంగారం వెండి రాగి మట్టి పాత్రల్లోగానీ బొడిపెలులేని కొయ్యపాత్రలోగానీ పంచగవ్యాన్ని నింపుకొని క్షీర వృక్షకాష్ఠాలతో జ్వలితాగ్నిలో సమంత్రకంగా హోమం చెయ్యాలి. సహస్రాహుతులు చెయ్యాలి. మిగిలిన పంచగవ్యంలో దర్భలు ముంచి ప్రదేశమంతా సంప్రోక్షించాలి. బలిప్రదానం చెయ్యాలి. పరదేవతను ధ్యానించాలి. అభిచారాలు పాపాలూ నశిస్తాయి. దేవ భూత పిశాచాదులు వశమవుతాయి. గృహ గ్రామ రాష్ట్రాలను విడిచి దుష్టగ్రహ పిశాచాదులు పారిపోతాయి.

మండలంలో శూలముద్ర లిఖించి అభిమంత్రించి ఇలాగే సహస్రహోమం చేసి నిఖనం చేస్తే సర్వశాంతులూ సిద్ధిస్తాయి. పూర్వోక్తమైన పాత్రకు సూత్రవేష్టనం చేసి నేలలోగానీ ఇసుకలోగానీ పాతిపెట్టి మంత్రజలాలు నింపి నాలుగు దిక్కులనుంచీ తీరజలాలను ఆవాహనచేసి వివిధపుష్పాలూ బిల్వపత్రాలూ బియ్యమూ నువ్వులూ ఆవాలూ పాలుగారే చెట్ల చిగురాకులూ అందులో వెయ్యాలి. 

కుశకూర్చంతో(దర్భలతో చేసిన పొడవుపాటి ముడి) మంత్రాలు చదువుతూ కలియద్రిప్పాలి. అటుపైని ఆనీరు జల్లుకోవాలి. బ్రాహ్మణులపై జల్లాలి. అందరూ పవిత్రులవుతారు. భూతరోగాదులూ చేతబడులూ(అభిచారాలు) తొలగిపోతాయి.

ఈ అభిషేకంతో విప్రుడు మృత్యువు నోటినుంచికూడా బయట పడగలడు. దీర్ఘాయుర్దాయం కోరుకునేవారందరూ ఈ అభిషేకం జరిపించుకోవాలి. ఇది చేసిన విప్రులకి నూరుగోవులూ సంతృప్తికరంగా దక్షిణలూ ఇవ్వాలి.

శనివారంనాడు రావిచెట్టు దగ్గర మంత్రజపం చెయ్యడం, భూతరోగాభిచారాది శాంతికరం. పాలుగారే గుడూచి సమిధలతో(తిప్పతీగ) హోమం చేస్తే సర్వరోగాలూ ఉపశమిస్తాయి. దీన్ని మృత్యుంజయహోమమంటారు.

ఇలాగే జ్వరశాంతికి చూతహోమం క్షయరోగోపశమనానికి వచాహోమం. రాచపుండు(రాజయక్ష్మ) తగ్గడానికి మధుత్రితయహోమం - చెప్పబడ్డాయి. అన్నంతో పాయసం వండి సూర్యుడికి నివేదించి హోమంచేసి మిగిలినదాన్ని భుజిస్తే రాజయక్ష్మ (రాచపుండు) తగ్గుతుంది.

తిప్పతీగ కణుపులతో సోమదేవతాకంగా హోమంచేస్తే క్షయరోగం ఉపశమిస్తుంది. శంఖవృక్ష పుష్పాలతో హోమం కుష్ఠురోగనివారిణి. అపామార్గ పుష్పాలను బియ్యంతోకలిపి చేసే హోమం అపస్మారరోగానికి ఉపశమనం. 

క్షీరవృక్ష సమిధలతో హోమం ఉన్మాదరోగ నివారకం. ఔదుంబర సమిధలతో చేసే హోమం ఆతిమేహరోగాన్ని నయం చేస్తుంది. ఇక్షుమధుహోమంతో ప్రమేహరోగశాంతి. మధుత్రితయహోమం మసూరికా నివారకం. కపిలాహోమంకూడా ఇంతే. 

ఇంటిలో చీమలూ దోమలూ వగైరా క్రిమి క్రీటకాలు నశించాలంటే శమీసమిధలు హోమం చెయ్యాలి. వనవేతనహోమం(అడవి పుబ్బలి) వారంరోజులు చేస్తే పిడుగుపాటుల నుంచీ భూకంపాలనుంచీ నివారణ లభిస్తుంది. శతమంత్రజపం చేసి లోష్టాన్ని తాకిన్తూ ఏ దిక్కున ఎంతదూరం వెడితే ఆ మార్గంలోని ప్రదేశాలన్నీ ఆగ్ని - మారుత - శత్రుభయ రహితాలవుతాయి. 

మనస్సులోనే ఈ జపం చేస్తే బంధవిమోచన కలుగుతుంది. అభిమంత్రితజలపానం భూతపిశాచవిమోచకం. అలాగే అభిమంత్రించి విభూతి పెట్టినా శిరసున జల్లినా సర్వవ్యాధులూ సర్వభయాలూ తొలగిపోతాయి. నూరేళ్ళు సుఖంగా జీవిస్తాడు.

ఈ హోమాలన్నీ ఎవరికివారే చేసుకోవడం ఉత్తమం. అశక్తులు భూరిదక్షిణలిచ్చి బ్రాహ్మణులతో చేయించుకోవచ్చు. పుష్పాలతో చేసే హోమాలు కొన్ని ఉన్నాయి. అవి పుష్టికరాలు. లక్ష్మీప్రదాలు. 

ఎర్రకలువలతో హోమం చేస్తే సంపదలు పెరుగుతాయి. బంగారం దొరుకుతుంది. బిల్వపత్ర, బిల్వపుష్ప, బిల్వఫల, బిల్వ సమిధలతో చేసే హోమాలు ఏవైనా సంపత్ప్రదాలే. వీటిని నేతితో అభిమంత్రించి నూరుచొప్పున సప్తాహహోమం చేస్తే లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఇంటిలో తిష్ఠవేస్తుంది. 

త్రిమధులాజహోమం(పేలాలు) కన్యాలాభం కలిగిస్తుంది. ఇదే స్త్రీలు చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. సూర్యదేవతాకంగా జలహోమం చేస్తే నీటిలో పడిపోయిన బంగారం చేతికందుతుంది. అన్నహోమం అన్నవర్ధకం. వ్రీహిహోమం(బియ్యం) వ్రీహివర్ధకం. పిడకలతో చేసే హోమాలు పశుసంపదను పెంచుతాయి. 

ప్రియంగు - పాయస - ఆజ్యహోమాలు సంతాన ప్రాప్తికరాలు. భాస్కరుడికి హోమంచేసి మిగిలిన పాయసాన్నం ఋతుస్నాతలు భుజిస్తే గర్భధారణ జరుగుతుంది. పుత్రసంతానం కలుగుతుంది. మొలకలు వచ్చిన తడిగింజలతో హోమం ఆయుర్వర్ధకం. ఇటువంటి ఎర్రగింజలూ మధుత్రయమూ వ్రీహి - కలిపి శతహోమం చేస్తే పట్టిందల్లా బంగారమవుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది.

సువర్ణకుట్మలాలు(సంపంగి మొగ్గలు) హోమం చేసినా కర్తకు ఆయుర్దాయం పెరుగుతుంది. గరిక పాలు తేనె నెయ్యి - సప్తాహహోమం చేస్తే అపమృత్యువు తొలగిపోతుంది. అన్నమూ పాలూ నెయ్యి వీటితో చేసిన హోమానికీ ఇదే ఫలం. న్యగ్రోధసమిధలూ(మర్రి) పాయసమూ రోజుకి నూరుగా ఏడురోజులు హోమం చేసి ఆ ఏడురోజులూ పాలుత్రాగి గడిపి మంత్రజపం చేస్తే మృత్యువును జయిస్తాడు.

నిరాహారుడై మౌనియై మూడురేయింబవళ్ళు జపించినా యముడు దరిదాపులకి రాడు. నీటిలోదిగి జపించినా బిల్వవృక్ష సన్నిధిలో జపించినా విశేషఫలితాలుంటాయి. ఒక్క నెలపాటు ఇలా జపిస్తే చాలు వాడు రాజ్యాధికారి అవుతాడు. సమూలఫల పల్లవంగా బిల్వవృక్షాన్ని హోమంచేసినా రాజ్యం దక్కుతుంది. నూరు పద్మాల చొప్పున నెలనాళ్ళు చేసినా ఈ ఫలం లభిస్తుంది. 

గంజితోహోమం చేస్తే పంటలు పండే గ్రామం దక్కుతుంది. యుద్దాలకు వెళ్ళబోయేముందు రావి సమిధలతో హోమం నిర్వహిస్తే విజయం వరించి వస్తుంది. పాలతో కలిపి వేతసపత్రపుష్ప హోమం సప్తాహదీక్షగా చేస్తే వానలు కురుస్తాయి. బొడ్డులోతు నీళ్ళల్లో నిలిచి మంత్రజపం ఏడురోజులు చేస్తే వానలు పడతాయి. నీటితో విభూతి శతహోమం చేసి అతివృష్టిని నివారించవచ్చు.

మోదుగు సమిధలతో చేసే హోమం బ్రహ్మవర్చస్సును అందిస్తుంది. పలాశకుసుమాలతో హోమం సర్వాభీష్టప్రదాయకం. పాలతో హోమం మేధాశక్తినీ నేతితో హోమం బుద్ధిశక్తినీ పెంపాందిస్తాయి. ఉప్పూ తేనె కలిపి హోమం చేస్తే కోరిన వస్తువునల్లా వశపరుచుకోవచ్చు. 

ఇలాగా కోరికలు తీర్చే హోమాలు చాలా ఉన్నాయి. ఆయా నియమాలను పాటిస్తూ మంత్రాలను ఉచ్చరిస్తూ నిర్వహించాలి. బ్రాహ్మణుడు తనకోసంగానీ ఇతరులకోసంగానీ వీటిని చెయ్యవచ్చు. అన్యులకోసం చేసినా ఇవి విప్రుడికీ పుష్టిదాయకాలేకావడం మరీ విశేషం.

రోజుకి వెయ్యిగా నెలనాళ్ళు మంత్రజపం చేస్తే ఆయుష్కాముడి కోరిక నెరవేరుతుంది. ఆయురారోగ్యాలు రెండూ కావాలనుకుంటే రెండు నెలలు జపం చెయ్యాలి. సంపదలుకూడా కావలిస్తే మూడునెలలు, దారపుత్రులుకూడా కావలిస్తే నాలుగునెలలూ, వారికీ ఆరోగ్యం కావాలంటే అయిదునెలలు, వారికీ సంపదలు కావాలంటే ఆరునెలలు, వారికీ విద్యలు కావాలంటే ఏడునెలలు - ఇలాగ కోరికలు పెరుగుతున్నకొద్దీ మంత్రజపం చెయ్యాల్సిన నెలలూ పెరుగుతుంటాయి. 

ఒంటికాలుమీద నిలబడి చేతులు పైకెత్తి నిరాశ్రయుడుగా నిలిచి మూడునెలలు రోజుకి మూడువందలు చొప్పున మహామంత్రం జపిస్తే ఆ విప్రుడికింక తీరని కోరికలంటూ ఉండవు. అలాగే శతోత్తర సహస్రం చొప్పున(పదకొండువందలు) జపించగలిగితే సిద్ధించనిదంటూ ఉండదు. 

నీటిలో మునిగి నూరుచొప్పున నెలనాళ్ళు జపిస్తే ఇష్టఫలావాప్తి. మూడువందల చొప్పున జపిస్తే సర్వవాంఛిత సిద్ధి. రాత్రిపూట భోజనం చేస్తూ ఇదే పద్దతిలో ఏడాదిపాటు మంత్రం జపిస్తే ఋషి అవుతాడు. రెండేళ్ళు జపిస్తే అమోఘవాక్కు అవుతాడు. మూడేళ్ళు జపిస్తే త్రికాలవేత్త అవుతాడు. నాలుగేళ్ళు జపిస్తే భగవంతుడు తోడై నిలుస్తాడు. అయిదేళ్ళకి అణిమాది శక్తులు సిద్ధిస్తాయి. ఆరేళ్ళకి కామరూపధారణశక్తి వస్తుంది. ఏడేళ్ళకి అమరత్వం లభిస్తుంది. తొమ్మిదేళ్ళకి మనుత్వం, పదేళ్ళకి ఇంద్రత్వం, పదకొండేళ్ళకి ప్రజాపతిత్వం, పన్నెండేళ్ళకి బ్రహ్మత్వం సిద్ధిస్తాయి. 

ఈ తపస్సుతోనే నీవంటివారు లోకాలను జయిస్తున్నారు. కొందరు శాకాలు తిని, కొందరు కందమూలాలు తిని, కొందరు ఫలాలు తిని, కొందరు పయస్సులుగ్రోలి, కొందరు నెయ్యిత్రాగి, కొందరు సోమరసం పుచ్చుకుని, కొందరు చరువు(హవిష్యం) ఆరగించి, కొందరు పదిహేను రోజులకు ఒక్కసారి మాత్రమే భుజించి, కొందరు భిక్షాన్నం తిని - ఇలాగ కఠోర నియమాలతో తపస్సులు చేస్తున్నారు. మహర్షు లనిపించుకుంటున్నారు.

ఇటువంటి దీక్షతో మంత్రజపం మూడువేలు చేస్తే రహస్యంగా చేసిన పాపాలు తొలగిపోతాయి. వెయ్యిచొప్పున నెలనాళ్ళు చేస్తే బంగారం దొంగిలించిన పాపమైనా అంతరిస్తుంది. మూడువేలు చొప్పున నెలనాళ్ళు చేస్తే సురాపానదోషం నశిస్తుంది. గురుపత్నీ సంగమదోషమైనా తొలగిపోతుంది. 

అడవిలో పర్జశాల వేసుకుని ఇలా జపం చేస్తే బ్రహ్మహత్యాపాతకమూ అంతరిస్తుంది. నీళ్ళల్లో మునిగి రోజుకి వెయ్యి చొప్పున పన్నెండురోజులు జపిస్తే సర్వమహాపాతకాలూ తొలగిపోయి విప్రుడు విశుద్ధుడవుతాడు.

ప్రాణాయామానికికూడా ఇంతటి శక్తి ఉంది. అది సర్వపాప వినాశకం. నూరు ప్రాణాయామాలు చేస్తే అన్ని పాపాలూ తొలగి శుచి అవుతాడు. పర్ణశాలలో ఉంటూ రోజుకి వెయ్యిచొప్పున నెలవాళ్ళు ఉపవాసం ఉండి మంత్రజపం చేసినవాడిని నిత్యజాపి అంటారు. అతడు పవిత్రుడు. 

ఇరవైనాలుగు వేలు చేస్తే అది కృచ్భసంజ్ఞితం. అరవైనాలుగువేలు చేస్తే చాంద్రాయణసమానం. ఉభయ సంధ్యల్లోనూ ప్రాణాయామం చేసి కనీసం నూరుసార్లు(గాయత్రి) మంత్రజపం చెయ్యాలి. ఇది గృహస్థుకి కర్తవ్యం తదిత్యాదిఋక్కు సర్వపాపహారం. 

నీటిలోమునిగి ఈ ఋక్కును రోజుకి నూరుసార్లు జపించాలి. జపిస్తూ సూర్యరూప గాయత్రీదేవిని ధ్యానిస్తే సర్వపాప విముక్తి కలుగుతుంది. 

నారదా! శాంతి శుద్ధ్యాది కల్పాలన్నీ రహస్యాతిరహస్యాలైనా నీకు సవిస్తరంగా సవ్యాఖ్యానంగా తెలియజేశాను. ఇది సదాచార సంగ్రహం. క్లుప్తంగా చెప్పాను. ఈ పద్దతిలో జీవిక సాగించినవారిని మాయాదుర్గ అనుగ్రహిస్తుంది. నిత్య - నైమిత్తిక - కామ్యకర్మలన్నింటినీ యథావిధిగా ఆచరించినవారికి భుక్తిముక్తిఫలాలు కొంగుబంగారాలు. 

ఆచారమే మొట్టమొదటి ధర్మం. ధర్మానికి ప్రభువు(రక్షణ) జగదీశ్వరి అని సర్వశాస్తాలూ ఆచార ఫలాన్నీ మహత్తునూ శతధా కొనియాడుతున్నాయి. ఆచారవంతుడు ఎప్పుడూ పరిపూతుడే. అతడే సుఖి. అతడే ధన్యుడు. ఇది సత్యం. 

సత్యం, సదాచారం పాటించడంకన్నా దేవీ అనుగ్రహ సంపాదనకు మరొక సులభమార్గం లేదు. దీన్ని వినడంకూడా సంపత్తి సాఖ్యదాయకమే. సదాచారంవల్ల ఐహికాముష్మిక సుఖాలు అన్నీ చేకూరుతాయనడం సారాంశం. అదే నీకు చెప్పాను, మరింకేమి వినాలనుకుంటున్నావో చెప్పు అని నారాయణమహర్షి ముగించాడు.

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము




Rukminidevi Anidyothanuniki Namaskarinchuta - రుక్మిణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  రు క్మి ణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట బ్రాహ్మణవంశానికే రత్నంవంటివాడా; నీ బంధువులపాలిటి చింత...