Wednesday, January 1, 2020

TEERUGA NANU DAYA CHOOCHEDAVO ఏ తీరుగ నను దయ చూచెదవో

ఏ తీరుగ నను దయ చూచెదవో

తాళం
రాగం
రూపకర్త: రామదాసు


పల్లవి

ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా

చరణము

శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా || 1 ||

క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా || 2 ||

వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా || 3 ||
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా

No comments:

Post a Comment

Method of external worship - బాహ్యపూజా విధానం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - బాహ్యపూజా విధానం శ్రీదేవి యిట్లనెను: సాధకుడు ప్రొద్దుప్రొద్దుననే మేల్కాంచి తన బ్రహ్మరంధ్రమున కర్పూరవర్ణముగ...