Saturday, February 18, 2023

Shiva kavacham- శివకవచం

శివకవచం

పూర్వే పశుపతిః పాతు, దక్షిణే పాతు శంకరః|
పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠ స్థధొత్తరే |

ఈశాన్యాం పాతు మే శర్వో, పార్వతీ హ్యగ్నేయం పార్వతీ పతిః |
నైరుత్యాం పాతు మే రుద్రోణుడు, వాయవ్యాం నీలలొహితః|| 

ఊర్ధ్వే త్రిలొచనః పాతు, అధరాయం మహేశ్వరః|
ఏతోభ్యో దశ దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః||

నమశ్శివాయ సాంబాయా శాంతాయ పరమాత్మనే|
మృత్యుంజయాయ రుద్రాయ మహదేవాయతేనమః||

అర్ధము:-

తూర్పున పశుపతి, దక్షిణాన శంకరుడు, పడమరన విశ్వేశ్వరుడు, ఉత్తరాన నీలకంఠుడు, ఈశాన్యాన శర్వుడు, ఆగ్నేయంలో పార్వతీపతి, నైఋతిలో రుద్రుడు, వాయవ్యంలో నీలలోహితుడు, పైన త్రిలోచనుడు, క్రింద మహేశ్వరుడు…

ఇలా వివిధ నామాలతో పదిదిక్కులలో అన్ని విధములుగా శివుడు నన్ను కాపాడుగాక!! అంబాసమేతుడు, శాంతస్వరూపుడు, పరమాత్మ, మృత్యుంజయుడు, రుద్రుడు, మహాదేవుడు శివుడు. ఆ స్వామికి నమస్సులుఈ స్థొత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది.

ఓం..సర్వ రుద్రాయ,

మహా రుద్రాయ, కాల రుద్రాయ,
కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ,

ఘోర రుద్రాయ, అఘోర రుద్రాయ
మార్తాండ రుద్రాయ, అండ రుద్రాయ,

బ్రహ్మాండ రుద్రాయ, చంఢ రుద్రాయ,
ప్రచండ రుద్రాయ, గండ రుద్రాయ,

సూర రుద్రాయ, వీర రుద్రాయ,
భవ రుద్రాయ, భీమ రుద్రాయ,

అతల రుద్రాయ, వితల రుద్రాయ,
సుతల రుద్రాయ, మహాతల రుద్రాయ,

రసాతల రుద్రాయ, తలాతల రుద్రాయ,
పాతాళ రుద్రాయ.. నమో నమః

No comments:

Post a Comment

Budha Graham (Budhudu) Janma Vruthantham - బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం

బుధ గ్రహం (బుధుడు)  జన్మ వృత్తాంతం పురాణ కథనం ప్రకారం బుధుడు చంద్రుడి కుమారుడు. అయితే ఆయన జన్మ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. నవగ్రహాల్లో ...