రోహిణి
రోహిణి నక్షత్రము కొన్ని వివరణలు
నక్షత్రం - రోహిణి
అధిపతి - చంద్రుడు
గణము - మానవ
జాతి - స్త్రీ
వృక్షం - నేరేడు
జంతువు - పాము
నాడి - అంత్య
పక్షి - గుడ్లగూబ
అధిదేవత - బ్రహ్మ
రాశి - వృషభం
రోహిణి నక్షత్ర జాతకుల గుణగణాలు :
రోహిణీ నక్షత్రము నక్షత్రములలో నాలుగవది. రోహిణీ నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ, నక్షత్రాధిపతి చంద్రుడు, మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్శిస్తారు.
ఈ నక్షత్ర జాతకులు మానసిక దృఢత్వము కలిగి ఉంటారు. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సాహస క్రీడల యందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. వీరి శక్తి సామర్థ్యాలు అదనపు బలాల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక కాగలరు. అధునాతన విద్యలయందు రాణిస్తారు.
భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. త్వరగా కోపము రాదు. చిరునవ్వుతో ఉంటారు. ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. జీవితములో ఒడిదుడుకులు సహజము.
గురుమహర్దశ, శని మహర్దశ వీరికి కలసి వస్తుంది. భార్యాభర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. వంశానికి, కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చి దిద్దుతారు.
వీరు ఎంతో గౌరవం, మర్యాద మరియు హుందాతనాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా, ఇతర వ్యక్తులకు అనుగుణంగా వ్యవహరించాలనే విషయం వీరికి బాగా తెలుసు. వీరు ఎంతో ప్రజాదరణ కలిగి ఉంటారు.
వీరు ఎంతో సరళంగా, ముక్కుసూటిగా మరియు సత్య స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి కుటుంబం, ఇల్లు, సమాజం, దేశం లేదా మొత్తం ప్రపంచానికి సేవలందించడం ద్వారా వీరు తమ సామర్థ్యాలను చాటుతారు.
వీరు కుటుంబం మరియు సమాజం యొక్క నిబంధనలు మరియు విలువలను సాధారణంగా గౌరవిస్తారు. అదేవిధంగా, లక్ష్యం పట్ల చక్కటి అంకితభావాన్ని కలిగి ఉంటారు. ప్రాణ స్నేహితులతో వీరు సంతోషాన్ని మరియు సంతృప్తిని పొందుతారు.
ఆరోగ్య విషయానికి వస్తే, వీరు ఎల్లప్పుడూ అలర్ట్ గాను మరియు అవగాహన కలిగి ఉంటారు. చాలావరకు, వీరు ఎలాంటి వ్యాధులు లేకుండా ఉంటారు మరియు దీర్ఘకాలం జీవిస్తారు. సాధారణంగా, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. వీరు వర్తమానంలో జీవిస్తారు.
జీవితంలో అనేక ఎత్తు పల్లాలుంటాయి. ప్రతి పనిని కూడా వీరు అంకితభావంతో చేస్తారు. ప్రతి పనిని కూడా సహనంగా పూర్తి చేస్తారు. అందువల్ల ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు.
రోహిణి నక్షత్రం మొదటి పాదం :
ఇతర విషయాలవైపు మనసు లాగితే చేసే పనిమీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి, అనవసర విషయాలకు ప్రాధాన్యం తగ్గించాలి. పరిస్థితుల్నిబట్టి సర్దుకోగలగడం ఒక వరం అనుకోవాలి. సానుకూలతను బట్టి మెలగాలి.
గ్రహ దశలు : తొలుత చంద్ర మహర్దశ 10 సం.లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సం.లు, రాహు మహర్దశ 18 సం.లు, ఆపై గురు మహర్దశ 16 సం.లు, శని మహర్దశ 19 సం.లు, బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : తనుమళ్లలోని శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామిని దర్శించినచో శుభాలు కలుగుతాయని నమ్మకము.
రోహిణి నక్షత్రం రెండో పాదం :
ఈ పాదంలో జన్మించిన జాతకులు అదృష్ట జాతకులు. కలిసివచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుంటారు. ఈ ప్రక్రియలో ప్రతిభావంతంగా గుర్తింపు తెచ్చుకుంటారు. మాటలాడే విషయంలో పటుత్వం కలిగిఉంటారు. ఈ ధోరణితో నెగ్గుకొని రాగలుగుతారు. ప్రతిభా సామర్థ్యాలు ఏ స్థాయిలో వినియోగించుకోవాలనే విషయంలో స్పష్టత సాధిస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి.
గ్రహ దశలు : తొలుత చంద్ర మహర్దశ ఏడున్నర సం.లు, ఆ తర్వాత కుజ 7 సం.లు, రాహు 18 సం.లు, గురు 18 సం.లు, శని 19 సం.లు, బుధ 17సం.లు, కేతు దశ 7 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : కాజులూరులోని శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామిని అర్చిస్తే శుభప్రదం అని భావన.
రోహిణి నక్షత్రం మూడో పాదం :
కళల యందు ఆసక్తి ఉంటుంది. కొంచెం పట్టు ఉన్నా ఎక్కువ పట్టు ఉన్నట్లు చూపగల నేర్పు ఉంటుంది. కానీ, శాస్త్రాన్ని, అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తే మరింత అధిక ఫలితం లభిస్తుంది. అనవసరపు ఆందోళనలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. భావోద్వేగాలను ప్రకటించే విషయంలో పరిమితి తప్పనిసరి.
గ్రహ దశలు : తొలుత చంద్ర మహర్దశ 5 సం.లు, ఆ తర్వాత కుజమహర్దశ 7 సం.లు, రాహు మహర్దశ 18 సం.లు, తదుపరి గురు మహర్దశ 18 సం.లు, శని మహర్దశ 19 సం.లు, అనంతరం బుధ దశ 17 సం.లు, కేతు దశ 7 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : ఐతపూడిలోని శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామిని అర్చించాలి అని భావన.
రోహిణి నక్షత్రం నాలుగో పాదం :
అందివచ్చిన అవకాశాల్ని పసిగట్టి నడుచుకొంటారు. జాగ్రత్తలో ఉన్నప్పటికీ ఒక్కోసా ఎదురుదెబ్బలు తగలవచ్చును. అటువంటి సందర్భాల్లో సైతం మెరుగైన అవకాశాలకోసం అన్వేషిస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో తమను తాము గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. సదా స్పష్టతకోసం ఆశిస్తారు. కాస్తంత పట్టా దొరికితే అవగాహన సంపాదిస్తారు.
గ్రహ దశలు : తొలుత చంద్ర మహర్దశ రెండున్నర సం.లు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 సం.లు, రాహు మహర్దశ 18 సం.లు, తదుపరి గురు మహర్దశ 18 సం.లు, శని మహర్దశ 19 సం.లు, అనంతరం బుధ దశ 17సం.లు, కేతు దశ 7 సం.లు ఉంటుంది.
దర్శనీయ క్షేత్రం : శ్రీశైలంలోని శ్రీ ఉమా సమేత రామలింగేశ్వరా స్వామిని అర్చించుకుంటే మంచిది.
రోహిణి నక్షత్ర జాతకులు పెంచవలసిన వృక్షములు :
రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. చంద్రుడికి ఉచ్చరాశి.
ఊర్ద్వముఖ నక్షత్రమైన రోహిణి స్థిర తారల్లో ఒకటి గనుక ఈ నక్షత్రంగల దినాలలో ముఖ్యముగా ఆది, సోమ, మంగళ, శనివారాల్లో షష్టి బుధవారం నాడు చెట్లు నాటడం, స్థంభ నిర్మాణం, మేడలు కట్టడం, వాహనారోహణం, గృహప్రవేశం, వివాహం, వస్త్రాభరణధారణ, పట్టాభిషేకం మొదలయినవి శుభప్రదం.
చంద్రుడికి అధిదేవత గౌరీదేవి. అమ్మ ఆరాధన శ్రేయస్కరం. అలాగే తాంత్రిక అధిపతి భువనేశ్వరి దేవి. ఈ అమ్మవారి ఆరాధన అతి గొప్ప ఫలితాలని ఇస్తుంది.
రోహిణి నక్షత్ర జాతకుల తారా ఫలాలు
తార నామం - తారలు - ఫలం
జన్మ తార - రోహిణి, హస్త, శ్రవణం - శరీరశ్రమ
సంపత్తార - మృగశిర, చిత్త, ధనిష్ట - ధన లాభం
విపత్తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - కార్యహాని
సంపత్తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - క్షేమం
ప్రత్యక్ తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - ప్రయత్న భంగం
సాధన తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - కార్యసిద్ధి, శుభం
నైత్య తార - అశ్విని, మఖ, మూల - బంధనం
మిత్ర తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - సుఖం
అతిమిత్ర తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - సుఖం, లాభం

రోహిణి నక్షత్ర ప్రయోజనాలు:
ఆకర్షణ శక్తి పెరుగుతుంది - వ్యక్తిత్వానికి ప్రత్యేక ఆకర్షణ కలుగుతుంది.
వాణిజ్య విజయాలు - వ్యాపారం లేదా ఉద్యోగ రంగాలలో అభివృద్ధి పొందుతారు.
కళాత్మక నైపుణ్యం - కళలు, సంగీతం, నటన వంటి రంగాలలో ప్రతిభ చూపే అవకాశం ఎక్కువ.
ఆరోగ్య పరిరక్షణ - శరీర ధృఢత్వం, ఆరోగ్య క్షేమం మెరుగవుతుంది.
సౌందర్యం, వైభవం - భౌతిక వసతులు, చక్కనితనంతో కూడిన జీవనశైలి లభిస్తుంది.
చంద్ర అనుగ్రహం - మానసిక శాంతి, చింతలు తొలగడం వంటి శుభఫలాలు.
ఈ నక్షత్రంలో జన్మించినవారు సున్నిత మనసు కలవారు, ప్రేమపూరితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. శ్రీ చంద్రుని పూజ చేయడం, సోమవారం వ్రతాలు చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు.
రోహిణి నక్షత్రం వారు దర్శించవలసిన ముఖ్యమైన దేవాలయాలు
రోహిణి నక్షత్రం వారు దర్శించవలసిన అత్యంత ముఖ్యమైన మరియు విశేషమైన దేవాలయం శ్రీ పాండవ దూత పెరుమాళ్ ఆలయం.
ఆలయ విశేషాలు: ప్రాంతం: ఈ క్షేత్రం తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాంచీపురం (శివ కాంచి లేదా పెద్ద కాంచీపురం) లో ఏకాంబరేశ్వర ఆలయానికి సమీపంలో ఉంది.
ప్రధాన దైవం: ఇక్కడ శ్రీకృష్ణుడు (విష్ణుమూర్తి) 'పాండవ దూత పెరుమాళ్' రూపంలో సుమారు 25 అడుగుల భారీ పరిమాణంలో, కూర్చున్న భంగిమలో దర్శనమిస్తాడు.
రోహిణి నక్షత్రానికి - ఈ ఆలయానికి ఉన్న సంబంధం:
రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అధిదేవత బ్రహ్మ దేవుడు. శ్రీకృష్ణుడు జన్మించింది కూడా రోహిణి నక్షత్రంలోనే.
పురాణాల ప్రకారం, రోహిణి దేవి (చంద్రుని భార్యలలో ఒకరు) ఈ క్షేత్రంలోనే శ్రీమహావిష్ణువును పూజించి, ఆయన అనుగ్రహం పొందిందని నమ్ముతారు.
ఈ ఆలయంలోని గర్భగుడి పైన ఉన్న విమానాన్ని "భద్ర విమానం" అంటారు. రోహిణి నక్షత్రం వారు ఈ విమానాన్ని మరియు ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి.
రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు తమ జీవితంలో వచ్చే ఒడిదుడుకులు, మానసిక ఆందోళనల నుండి ఉపశమనం పొందడానికి ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలి.
జాతకంలో చంద్ర దోషాలు ఉన్నవారు, వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వారు, మరియు విద్యార్థులు ఇక్కడి పెరుమాళ్ను దర్శించుకుని ప్రార్థిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం.
ఇతర పరిహారాలు: రోహిణి నక్షత్రం వారు ఆలయ దర్శనంతో పాటు క్రమం తప్పకుండా శ్రీకృష్ణుడిని పూజించడం, సోమవారాల్లో శివునికి లేదా చంద్రునికి క్షీరాభిషేకం (పాలతో అభిషేకం) చేయడం వల్ల జాతక దోషాలు తొలగి, సుఖసంతోషాలు కలుగుతాయి.
No comments:
Post a Comment