Friday, October 10, 2025

Uttarashada Nakshatra - ఉత్తరాషాఢ నక్షత్రం

ఉత్తరాషాఢ నక్షత్రము

నక్షత్రం - ఉత్తరాషాఢ
అధిపతి - రవి
గణము - మానవ
జాతి - పురుష
వృక్షం - పనస
జంతువు - ముంగిస
నాడి - అంత్య
పక్షి - గరుడము
అధిదేవత - విశ్వేదేవతలు
రాశి - 1, పాదం ధనస్సు, 2, 3, 4 పాదాలు మకరం

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో ఉత్తరాషాఢ నక్షత్రము 21వ నక్షత్రము. ఈ నక్షత్రం పూర్తిగా శుభకరం. ఇందులో 1వ పాదం ధనురాశిలో మిగతా మూడు మకర రాశిలో ఉంటాయి. ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస.

ఈ రాశివారు ప్రారంభంలో సగటువారుగా ఉన్నాసరే పోను పోను బ్రతుకులలో అలా అలా ఎదుగుచూ ఉన్నత స్థితికి చేరుకుంటారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరికెడి అవకాశాలు వీరికి దక్కుతాయి.

వీరు తక్కువగా మాట్లాడెదరు, అణకువ కలిగి ఉంటారు. సొంతవారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసి మెలిసి ఉండదలచుకొనెదరు, క్రొత్త స్నేహములు చేయుట నేర్చుకొనెదరు.

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. పై చదువులు వీరికి కలసి వస్తాయి.

వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిసివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసివస్తాయి. తక్కినవారికి వీరు వీలు కలిగిస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసివస్తాయి.

వీరు తల్లిదండ్రులని మించిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించిపోతారు. కోవెలలకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, థన సహాయాన్ని చేస్తారు.నక్షత్రములలో ఇది 21వ నక్షత్రం.

ఉత్తరాషాఢ నక్షత్రము జాతకులు స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు మరియు మృదువుగా మాట్లాడతారు. వీరు ఆధ్యాత్మికంగా ఉంటారు మరియు ఇతరులను గౌరవిస్తారు. వీరు ప్రతి పనిని నిజాయితీగా చేస్తారు మరియు ఆలోచనల పట్ల వీరు స్పష్టంగా ఉంటారు.

ఎన్నడూ ఇతరులను మోసగించడం లేదా ఏదైనా సమస్యను సృష్టించడం చేయరు. చక్కటి హృదయాన్ని కలిగి ఉండటం వల్ల, అనేకసార్లు వీరు తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొంటారు.

వీరు ఎవరినీ సులభంగా నమ్మరు, అయితే, నమ్మడం ప్రారంభించినట్లయితే, వారి కోసం ఏదైనా చేయగలుగుతారు. వీరు సులభమైన జీవితాన్ని ఇష్టపడతారు మరియు ఎలాంటి నిర్ణయాన్ని కూడా వేగంగా తీసుకోరు.

వీరు ఎవరినైనా విశ్వసించినట్లయితే, వారి వద్ద నుంచి వీరు సూచనలను తీసుకుంటారు. వీరికి ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి ఉంటుంది. జపం, తపం, వ్రతం మొదలైనవి వీరిని జీవితంలో విజయపథంలోనికి తీసుకెళతాయి. ఒక్కసారి ఆధ్యాత్మిక పథంలోనికి నడవడం ప్రారంభించిన తరువాత, అన్ని బంధాలు మరియు వైవాహిక జీవితం పట్ల విముఖత కనిపించవచ్చు.

కష్టపడి పనిచేయడమే కాకుండా, వీరు నిరంతరం పని చేయడానికి ఇష్టపడతారు. విద్య లేదా పని ఇలా ఏవిషయంలోనైనా వీరు ఇతరుల కంటే ముందుంటారు. బాల్యం నుంచి వీరు కుటుంబం యొక్క బాధ్యతలను చేపడతారు. అయితే, వీరు యువకులుగా ఉన్నప్పుడు చక్కటి సంతోషాన్ని పొందుతారు. వీరు అన్ని సమస్యలకు సిద్ధంగా ఉంటారు. ఏదైనా సంబంధం ఏర్పరుచుకోవడానికి ముందు, ఆ వ్యక్తి గురించి వీరు బాగా తెలుసుకుంటారు, లేనిపక్షంలో వీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనవచ్చు.

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల జీవిత భాగస్వామికి బాధ్యత మరియు ప్రేమ ఉంటాయి, అయితే అతడి/ ఆమె ఆరోగ్యం వీరికి ఆందోళన కలిగించవచ్చు. వీరు బాగా చదువుకుంటారు మరియు టీచింగ్ లేదా బ్యాంకింగ్ రంగాల్లో వీరు అపరిమితైన విజయాన్ని సాధిస్తారు.


ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము
ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు. వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరు మానవ గణానికి చెందినవారు. కాబట్టి వీరు సమయానికి తగ్గ రీతిలో ప్రవర్తించగలిగే చాకచక్యం కలిగి ఉంటారు. ఇక వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయం కలగలుపుగా ఉంటాయి.

ప్రభుత్వపరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. ప్రజా నాయకులుగా, ప్రజా అధికారులుగా రాణించగల నేర్పు వీరికి ఉంటుంది. అగ్ని సంబంధిత, పసుపు వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు కూడా వీరికి అనుకూలిస్తాయి.

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆటంకం లేకుండా విద్య సాగుతుంది. వీరికి 5 సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత పదేళ్ళ వరకు చంద్ర దశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు.

15 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 22 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు.

రాహువు అనుకూలంగా ఉంటే, ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 40 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు క్రమంగా తగ్గుతాయి.

సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. 56 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 75 సంవత్సరాల తరువాత వచ్చే బుధదశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.


ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదము
ఉత్తరాషాఢ నక్షత్ర రెండవ పాదములో జన్మించిన జాతకులు మానవ గణానికి చెందిన వారు కనుక సమయానికి తగ్గ రీతిలో ప్రవర్తించగల నేర్పు కలిగి ఉంటారు. ఇక వీరు తండ్రి పట్ల కొంత విముఖత కలిగి ఉంటారు.

తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల, అతిశయం ఉంటుంది. ప్రభుత్వ పరిశ్రమలు, కర్మాగారాలలో ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. వీరు శ్రమించి పట్టుదలతో పని చేయగలరు. వీరు నిర్వహకులుగా చక్కగా పని చేయగలరు. పరిశ్రమలను స్థాపించి నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది.

ఈ జాతకులకు విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి 4 సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్ర దశ ఉంటుంది. ఈ సమయంలో వీరికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు.

14 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగా జరిగిపోతుంది. 21 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు.

రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు. 39 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి.

సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. 55 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శనిదశ కాలంలో ఖర్చులు అధికమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.

ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదము
ఈ పాదములో జన్మించిన వారికి తండ్రి మీద కొంత విముఖత కలిగి ఉంటారు. అయితే తల్లి పట్ల సఖ్యత కలిగి ఉంటారు. వీరికి అంతర్గతంగా పట్టుదల మెండుగా ఉంటుంది. వీరికి ప్రభుత్వ పరిశ్రమలు, కర్మాగారాలోని ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.

శ్రమించి పని చేయగల నేర్పు ఉంటుంది. వీరు నిర్వహకులుగా చక్కగా పని చేయగలరు. పరిశ్రమలను స్థాపించి నిర్వహించగల నేర్పు ఉంటుంది. ఈ జాతకులకు స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి.

ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు విద్య ఆటంకం లేకుండా సాగుతుంది. వీరికి రెండు సంవత్సరముల వరకు రవి దశ ఉంటుంది. తరువాత 10 సంవత్సరముల చంద్ర దశ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో వీరికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.

12 సంవత్సరాలకు వచ్చే 7 సంవత్సరాల కుజ దశ కాలం వరకు సాఫీగానే సాగిపోతుంది. 19 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా ఉన్నత విద్యాభ్యాసంలో కొంత ఆటంకం జరగవచ్చు. రాహువు అనుకూలంగా ఉంటే ఉన్నత విద్య విదేశాలలో కొనసాగవచ్చు. విదేశాలలో ఉద్యోగావకాశాలు కూడా ఉంటాయి. జీవితంలో నిదానంగా స్థిరపడతారు.

37 సంవత్సరాల తరువాత వచ్చే 16 సంవత్సరాల గురు దశ కారణంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంపాదనలో అభివృద్ధి కనిపిస్తుంది. 53 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ సమయంలో ఖర్చులు అధికమవుతాయి. 72 సంవత్సరాల తరువాత వచ్చే బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. వృద్ధాప్యం సాఫీగా జరుగుతుంది.

ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగవ పాదము
ఉత్తరాషాఢ నక్షత్ర నాల్గవ పాదములో జన్మించిన వీరి మీద సూర్య గురు గ్రహ ప్రభావం ఉంటుంది. మానవ గణానికి చెందిన జాతకులు కనుక వీరికి సమయానుకూలంగా ప్రవర్తించగలిగే నేర్పు ఉంటుంది. ఇక వీరికి ఆత్మవిశ్వాసం, అతిశయం కలగలుపుగా ఉంటాయి.

ప్రభుత్వ పరమైన సంస్థలలో ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. ఉపాధ్యాయ రంగంలో పని చేయడం వీరికి అనుకూలం. ప్రజానాయకులుగా, ప్రజా అధికారులుగా వీరు సమర్ధతతో పని చేయగలరు. మధ్యవర్తులుగా కూడా నేర్పుతో వ్యవహరించగలరు. అగ్ని సంబంధిత, పసుపు వర్ణ వస్తువులకు చెందిన వృత్తులు, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.

ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో తక్కువగా ఉన్నాసరే పెరిగేకొద్ది ఎదుగుతూ ఉన్నత స్థితికి చేరుతారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరికెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువగా మాట్లాడెదరు, అణకువ కలిగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుంటారు. క్రొత్త స్నేహములు చేయుటలో ముందుంటారు.  కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకానొకప్పుడు వీరు నేరప్రవృత్తి అయిన నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి, బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. గోప్యత పాటిస్తారు. పై చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తోటి వారికి కూడా సహాయం చేస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మించిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. మీరు గౌరవప్రదమైన ప్రవర్తన, ఆధ్యాత్మిక అంతర్దృష్టి, నీతి బలం, నిజాయితీ కలవారు. తరచూ 'బ్రహ్మాంశ' (దైవసారం)తో పుట్టినవారిగా చెబుతారు, సహజంగా మంచి, సున్నితమైన ప్రవర్తన చూపిస్తారు, ఇది మీకు గౌరవం, ఆరాధన తెస్తుంది. దేవాలయాకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, ధన సహాయాన్ని చేస్తారు. కానీ, అప్పు ఇవ్వరు. ఆర్థికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు.

ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్లు గొప్ప గుణాలు కలిగి, నిజాయితీ, స్వచ్ఛత, జ్ఞానానికి చిహ్నంగా ఉంటారని బృహత్ జాతకం, సారావళి, జాతక పారిజాతం లాంటి ప్రాచీన జ్యోతిష గ్రంథాలు చెబుతాయి.  

మీ ఉనికి ప్రభావవంతంగా ఉంటుంది, స్వతంత్ర ఆలోచనలు, గట్టి నమ్మకాల వల్ల స్నేహితులు, సమాజంలో తరచూ చర్చలు లేదా భిన్నాభిప్రాయాలకు కేంద్రంగా ఉంటారు. శారీరకంగా చురుకుగా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి, క్రమంగా వ్యాయామం, క్రమశిక్షణ జీవనంతో దేహదారుఢ్యం కాపాడుకుంటారు. 

ఉత్తరాషాఢ జాతకులు సహజంగా ఉదారులు, పరోపకారులు, తమ వనరులు, జ్ఞానాన్ని ఇష్టంగా పంచుకుంటారు. మీ జీవితం సాధారణంగా ఆనందం, శ్రేయస్సు, సంతృప్తితో నిండి ఉంటుంది, ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఆప్యాయ సంబంధాల వల్ల ఇది మరింత బాగుంటుంది. వాళ్లు మీ మానసిక సంతృప్తికి ఎంతో దోహదం చేస్తారు.

ఇతరుల సహాయాన్ని గుర్తుంచుకుని, సహాయం చేసినవాళ్ల పట్ల జీవితకాల కృతజ్ఞత, విధేయత చూపిస్తారు. మీ ఆధ్యాత్మిక ఆసక్తి, విధేయత సవాళ్లను సున్నితంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. 

మీకు ఎక్కువ మంది పిల్లలు, బలమైన కుటుంబ బంధాలు ఉంటాయని గ్రంథాలు చెబుతాయి.

మీరు స్వతంత్రులు, ఆకర్షణీయంగా, సంపన్నులుగా ఉంటారు. ధైర్యం, జ్ఞానం, సున్నితమైన ప్రవర్తనతో కూడిన అందమైన రూపం కలిగి ఉంటారు. గ్రంథాలు పొడవైన ముక్కు, శరీరంలో చేప ఆకారంలో ప్రతీకాత్మక గుర్తులు ఉండవచ్చని చెబుతాయి, ఇవి అదృష్టం, సంతాన భాగ్యం, వ్యక్తిగత ఆకర్షణను సూచిస్తాయి. వినయం, ఓర్పు, ఇతరుల పట్ల సున్నితత్వం పెంచుకోవడం మీ సద్గుణాలను మెరుగుపరుస్తుంది, సంపన్న, గౌరవనీయ, సంతృప్తికర జీవితాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మీ గట్టి అభిప్రాయాలు మొండితనంగా మారకుండా చూసుకోవాలి.

ఉత్తరాషాఢ నక్షత్రపు అధిదేవత - విశ్వదేవుళ్ళు .వీరు మొత్తం పది మంది సోదరులు. 
వారు - వసు, సత్య, క్రతు, దక్ష, కాళ, కామ, ధ్రితి, కురు, పురురవ, మాద్రవ.


ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల నక్షత్రపు ఫలములు

నక్షత్రపు పేరు                    నక్షత్రములు                                        ఫలం

పుట్టిన నక్షత్రము                కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ    ఒంటికి శ్రమ

సంపత్తు నక్షత్రము            రోహిణి, హస్త, శ్రవణం                    డబ్బుల లాభం

ముంపు తెచ్చు                  మృగశిర, చిత్త, ధనిష్ఠ                    పనికి చేటు
నక్షత్రము

సంపత్తు నక్షత్రములు    ఆరుద్ర, స్వాతి, శతభిష                    బాగు

వేఱైన నక్షత్రములు        పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర        ప్రయత్నము పాడు అగుట

సాధన నక్షత్రములు        పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర    పని నెఱవేరుట, మంచిది

నైత్య నక్షత్రములు        ఆశ్లేష, జ్యేష్ట, రేవతి                            బంధనం

వీరితో బాగా పడిన             
అశ్విని, మఖ, మూల                        హాయి
నక్షత్రములు

మిక్కిలి బాగా పడిన         
భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ    హాయి, కలిసి వచ్చును
నక్షత్రములు

నక్షత్ర శాంతి:

నక్షత్ర మంత్రం:
।। ఓం ।।
తన్నో విశ్వే ఉప' శృణ్వంతు దేవాః ।
తద’షాఢా అభిసంయంతు యజ్ఞమ్ ।
తన్నక్షత్రం ప్రథతాం పశుభ్యః' ।
కృషిర్వృష్టిర్యజ'మానాయ కల్పతామ్ ।
శుభ్రాః కన్యా' యువతయ' స్సుపేశ’సః ।
కర్మకృత'స్సుకృతో' వీర్యా'వతీః ।
విశ్వా”న్ దేవాన్, హవిషా' వర్ధయ'౦తీః ।
అషాఢాః కామముపా'యంతు యజ్ఞమ్ ॥

నక్షత్ర గాయత్రి
ఓం విశ్వేదేవాయ విద్మహే 
మహాషాఢాయ ధీమహి 
తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

దర్శించవలసిన ఆలయములు
మొదటి పాదం – తాతపూడిలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి.
రెండవ పాదం – మచర శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి.
మూడవ పాదం – సత్యవాడలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి.
నాలుగవ పాదం – సుందరపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి.




No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...