మన పూర్వీకులు నిర్ణయించిన మరియు పాటించిన సంప్రదాయాలకు ఎన్నో కారణాలు మరియు శాస్త్రీయత వుంది.
ఈ భరతభూమిలో పుట్టిన సర్వమానవులూ బ్రాహ్మణుణ్ణి చూచి, ఆచారాలు నేర్చుకోండి — అని వ్యాసమహర్షి/మనువు చెప్పారు.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్
అని భగవద్గీతలో చెప్పారు.
మన అందరి ఉదరంలోనూ వైశ్వానరాగ్ని (జఠరాగ్ని) ఉన్నది .
భోజనం గూడా ఒక యజ్ఞమే. ప్రాణాహుతులను ఆ వైశ్వానరాగ్నిలో వేల్చడం భోజనం చేయడంలో తొలి ప్రక్రియ.
మన అందరి ఉదరంలోనూ వైశ్వానరాగ్ని (జఠరాగ్ని) ఉన్నది .
భోజనం గూడా ఒక యజ్ఞమే. ప్రాణాహుతులను ఆ వైశ్వానరాగ్నిలో వేల్చడం భోజనం చేయడంలో తొలి ప్రక్రియ.
మంత్రోచ్చారణతో తినబోయే ఆహారాన్ని సంప్రోక్షణ చేసి, ప్రాణాహుతులు ఉదరంలో ఉన్న అగ్నికి సమర్పిస్తున్నాం . భోజనానంతరం గూడా ఆ యజ్ఞవిధిపూరణమంత్రాలు ఉచ్చరించడం పాటిస్తూ ఉన్న విధిలో భాగమే.
భోజనాన్ని గూడా యజ్ఞంగా భావనచేయడమే ఈ చర్యల వెనక ఉన్న ఆంతర్యం.
యజమాని శుచియై (పాదప్రక్షాళన అనంతరం) కింద కూర్చుండి యజ్ఞం ఆరంభిస్తాడు. అపుడు చెప్పులు ధరించడం చేయరు.
అది మంత్రోచ్చారణ చేసే సమయం కాబట్టి చెప్పులు విప్పేయడం చేస్తున్నాం.
అందుచేతనే కనీసం భోజనానికి ముందు పాదప్రక్షాళనైనా చేసుకోమని పెద్దలు చెబుతూ ఉంటారు
ఆ పూర్వసంప్రదాయాన్నే యథాశక్తి అందరూ భోజనవిధిలో పాటిస్తున్నారు.
ప్రాణాహుతులు అగ్నిలో వేల్చేవి గాబట్టి నేతితో తడిపి సమర్పించవలె. అందుకోసమే వడ్డించిన అన్నం మీద నెయ్యి వేసి , ఆ తర్వాత దాన్ని మంత్ర పూర్వకంగా(రుచి చూడకుండా), నోట్లో వేసుకొంటున్నాం.
ఇంత విధానం తెలియక పోయినా, నెయ్యి వేసిన తర్వాతే భోజనం ఆరంభించడం మాత్రం అన్ని వర్ణాల వారూ హోటళ్ళలో గూడా నేటికీ పాటిస్తున్నారు.
బ్రాహ్మణాచారాలపై గౌరవంతోనే వాటిని అనుసరించడం జరుతున్నది.
No comments:
Post a Comment