Wednesday, June 10, 2026

Sri Lakshmi Kubera Temple, Rathnamangalam, Chennai, Tamil Nadu - శ్రీ లక్ష్మీ కుబేర ఆలయం, రత్నమంగళం, చెన్నై, తమిళనాడు

శ్రీ లక్ష్మీ కుబేర ఆలయం, రత్నమంగళం, చెన్నై, తమిళనాడు

శ్రీ లక్ష్మీ కుబేర దేవాలయం (రత్నమంగళం, చెన్నై):
రత్నమంగళం శ్రీ లక్ష్మీ కుబేర ఆలయం తమిళనాడులోని చెన్నై సమీపంలో వండలూరు వద్ద ఉన్న ఒక ప్రముఖ ధన ధాన్యా దేవాలయం.ఈ ఆలయం కుబేరుడికి సంబంధించిన అతికొద్ది ఆలయాలలో ఒకటి.  ఇక్కడ శ్రీ మహా లక్ష్మి, కుబేరుడు మరియు అతని భార్య చింతరిణి కలిసి కొలువై ఉన్నారు.

ఆలయ విశేషాలుప్రత్యేకత: కుబేరుడితో పాటు లక్ష్మీదేవి పూజలందుకునే అరుదైన ఆలయాలలో ఇది ఒకటి. ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.

పచ్చ కుంకుమ విశిష్టత:
ప్రత్యేకంగా కుబేర కుంకుమ పూజ ప్రత్యేకత రత్నమంగళం (చెన్నై) ఆలయం దానికి అత్యంత ప్రసిద్ధి. సాధారణంగా ఆలయాల్లో ఎరుపు రంగు కుంకుమ ఇస్తారు. కానీ ఇక్కడ పచ్చ రంగు కుంకుమ ప్రసాదంగా ఇస్తారు. బుధ గ్రహానికి పచ్చ రంగు ఇష్టం కాబట్టి, వ్యాపార అభివృద్ధి కోసం ఇక్కడ పచ్చ కుంకుమతో అర్చన చేయడం విశేషం. అక్కడ ఇచ్చే ఆ పచ్చ కుంకుమను వ్యాపార స్థలాల్లో లేదా ఇంట్లో లాకర్లలో పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు.

నాణేల పూజ:
ఇక్కడ భక్తులు కుబేరుడికి నాణేలతో కూడా పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.

పండుగలు: దీపావళి, వైకుంఠ ఏకాదశి మరియు అక్షయ తృతీయ వేడుకలను ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు.

దర్శన సమయాలు: ఉదయం 05:30 నుండి 12:00 వరకు మరియు సాయంత్రం 04:00 నుండి 08:00 వరకు తెరిచి ఉంటుంది.


స్థలం:
ఇది చెన్నైలోని వండలూర్ సమీపంలో ఉన్న రత్నమంగళం అనే ప్రాంతంలో ఉంది.

రోడ్డుమార్గం:
చెన్నై  వండలూరు-కేళంబక్కమ్ రోడ్డులో ఈ ఆలయం ఉంది.

రైలుమార్గం: వండలూరు రైల్వే స్టేషన్ దీనికి సమీపంలో ఉంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Budha Graham (Budhudu) Janma Vruthantham - బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం

బుధ గ్రహం (బుధుడు)  జన్మ వృత్తాంతం పురాణ కథనం ప్రకారం బుధుడు చంద్రుడి కుమారుడు. అయితే ఆయన జన్మ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. నవగ్రహాల్లో ...