Wednesday, April 23, 2025

Thiruttani - తిరుత్తణి

సుబ్రమణ్య స్వామి ఆలయం, తిరుత్తణి.

తిరుత్తణి ఆలయం సుబ్రమణ్య స్వామి ఆలయం. ఇది తమిళనాడులోని తిరుత్తణి కొండపై ఉంది. ఇది సుబ్రమణ్య స్వామి యొక్క ఆరు నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని ఆరుపాదవీడు అని పిలుస్తారు. ఇది సంవత్సరంలో 365 రోజులను సూచించే 365 మెట్లు కలిగి ఉంటుంది. శ్రీ వల్లిమలై స్వామిగళ్ 1917 లో పడిపూజ ప్రారంభించారు. నూతన సంవత్సర సమయంలో, ప్రతి మెట్టును కడిగి, దానికి పసుపు మరియు కుంకుమను పూస్తారు.

తిరుత్తణి చరిత్ర

కటరకం వేదాల రాజు నంబిరాజనుడు తన భార్యతో కలిసి శివుడిని సంతానం కోసం ప్రార్థించాడు. ఒకరోజు రాజు అడవిలో ఒక ఆడ శిశువును కనుగొని ఆమెను తన రాజభవనానికి తీసుకెళ్లి తన సొంత కుమార్తెగా పెంచుకున్నాడు.

ఆమె సుబ్రమణ్య స్వామి యొక్క గొప్ప భక్తురాలు. వల్లి సుబ్రమణ్య స్వామిని  ఎంతో ఆరాధించేది చివరకు అతన్ని వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది.

వల్లిని పరీక్షించడానికి, సుబ్రమణ్య స్వామి వృద్ధుడి రూపంలో కనిపించాడువల్లిని భయపెట్టడానికి గణేశుడు అడవి ఏనుగుగా కనిపించాడు. వల్లి భయపడి ఆ వృద్ధుడి వద్దకు పారిపోయింది అతను వల్లిని రక్షించాడు. తనను కాపాడినందుకు ఆమె అతనికి కృతజ్ఞతలు చెప్పి, బహుమతిగా ఏదైనా అడగమని కోరింది. అతను వల్లిని వివాహం చేసుకోమని కోరాడు.

కానీ వల్లి నిరాకరించింది. తరువాత సుబ్రమణ్య స్వామి ఆమెకు తన నిజరూపంలో దర్శనమిచ్చాడు. అప్పుడు ఆమె వివాహం చేసుకోడానికి అంగీకరించింది. కాబట్టి సుబ్రమణ్య స్వామి మరియు వల్లి వివాహం తిరుత్తణిలో జరిగిందని నమ్ముతారు.

తిరుత్తణి మురుగన్ ఆలయం వెనుక కథ:

దేవదేవుడు ఇంద్రుడు తన కుమార్తె దేవసేన వివాహ కట్నంలో భాగంగా తన ఏనుగు ఐరావతాన్ని సుబ్రమణ్య స్వామికి  బహుమతిగా ఇచ్చాడు. ఐరావతం వెళ్ళిపోయిన తరువాత, ఇంద్రుని సంపద క్షీణిస్తూ వచ్చింది. కాబట్టి సుబ్రమణ్య స్వామి ఇంద్రుడిని తన తెల్ల ఏనుగును తిరిగి తీసుకోమని కోరెను, కానీ ఇంద్రుడు ఇచ్చిన బహుమతిని తిరిగి తీసుకోవడానికి నిరాకరించాడు.

బదులుగా, ఆలయంలోని ఏనుగుల విగ్రహాల తలలు తన దిశ వైపు ఉండాలని అతను అభ్యర్థించాడు. అందువల్ల, ఈ ఆలయంలోని ఏనుగులు ఇంద్రుని దిశ అయిన తూర్పు వైపు ముఖంగా ఉంటాయి.

Varuthini Ekadashi - వరూత్తిని ఏకాదశి

వరూత్తిని ఏకాదశి

పురాణాల ప్రకారం మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. చైత్ర మాసంలో కృష్ణ పక్ష ఏకాదశిన వరుత్తిని ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున, భక్తులు విష్ణువు యొక్క ఐదవ అవతారమైన వామనుని పూజిస్తారు.

'వరుత్తిని' అనగా 'రక్షిత లేదా కవచం' అని అర్థం. ఈ 
ఏకాదశి రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మరియు ఉపవాసం వంటివి చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశంతో పాటు ఇంతవరకు మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణ వాక్యం.

పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మంధత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు, ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ ఎలుగుబంటిని రాజును చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణు మూర్తిని ప్రార్థించడం వలన సాక్షాత్ విష్ణుమూర్తి ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు.

అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేటప్పటికి రాజు కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు. ‘ప్రభూ, ఇలా నాకు ఎందుకు జరిగింది". అప్పుడు రాజుకు పూర్వ జన్మకర్మల ఫలాలకు ఇదంతా కారణమని విష్ణువు చెప్పాడట.

అయితే అదే సమయంలో శ్రీవిష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం కోరగా. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతారన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు. ఆ దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట. 
తదుపరి వైకుంఠం చేరాడు 

అప్పటి నుండి వరూధిని ఏకాదశిని భక్తులు పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ ఏకాదశికి ఎంతో నిష్టతో ఉపవాసం చేస్తారు. అలాగే విష్ణు పురాణం, విష్ణు సహస్రనామం, మహాభాగవతం ఆరోజంతా శ్రవణం లేదా పఠిస్తారు.

శ్రీ కృష్ణుడు యుధిష్టరనకు వరూధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. వరుత్తిని ఏకాదశిని భక్తితో ఆచరించే ఎవరైనా అదృష్టం మరియు ఆరోగ్యం ఎలా ప్రసాదిస్తారో ఆయన వివరించాడు. వరుత్తిని ఏకాదశి వ్రతం ఆచరించడం అన్ని చెడులకు వ్యతిరేకంగా ఒక కవచంగా వంటిది. అంతేకాక భక్తులకు ఆనందాన్ని మరియు మోక్షాన్ని ఇస్తుంది. కావున ఉపవాసం చేసేవారు ఎవరైనా పునర్జన్మ నుండి విముక్తి లభిస్తుంది.

వరుథినీ ఏకాదశి తెలియక లేదా తెలిసి చేసిన ఘోరమైన పాపాలను కూడా నాశనం చేస్తుంది. అంతేకాక దేవతల యొక్క ఆశీర్వాదం కూడా కల్గుతుంది. ఈ ఏకాదశి వ్రతం భూదానం, సువర్ణ దానం లేక కన్యాదానం కన్నా కూడా గొప్ప ఫలం ఇస్తుంది. కన్యాదానాన్ని అతిపెద్ద దానంగా పరిగణిస్తారు. కానీ, వరుత్తిని ఏకాదశి 100 కన్యాదానాలు చేయడంతో సమానం. వరుత్తిని ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే చివరికి 'వైకుంఠంలో స్థానం' లభిస్తుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి, తాము చేసిన పాపానికి స్పృహలో ఉన్నవారు మరియు భయపడేవారు వరుత్తిని వ్రతాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో ఆచరించాలి.

ఏకాదశి రోజు దగ్గరలోనున్న విష్ణు ఆలయాన్ని దర్శిస్తే విశేషంగా విష్ణు అనుగ్రహం కల్గుతుంది. ఏకాదశి నాడు పూర్తిగా మన మనసు విష్ణువు పై లగ్నం చేసి కనీసం గోవిందనామాలు అయినా పలకాలి. వరుత్తిని ఏకాదశి నాడు విష్ణు అవతారమైన వామనవతరంను పూజిస్తారు.

ఏకాదశి రోజున ఆహారం నిషిద్ధము. కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం స్వీకరించవచ్చు.

శ్రీ మహావిష్ణుకు తులసి మాల సమర్పించాలి. లక్ష్మీదేవిని ఆరాధించాలి.

పసుపు రంగు పండ్లు లేదా విష్ణువుకు సమర్పించాలి. దక్షిణావృత శంఖంలో గంగా జలం నింపి విష్ణువు అభిషేకం చేయాలి.

వరుత్తిని ఏకాదశి నాడు, నిద్ర, కోపం, జూదం, శరీరంపై నూనె పూయడం మరియు ఇతరులపై ఏదైనా చెడు భావాన్ని పెంపొందించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. 

విష్ణు సహస్రనామము, విష్ణు అష్టోత్తరము, 'భగవద్గీత' చదవడం వలన మంచి శుభ ఫలితాలు వస్తాయి.

వరుత్తిని ఏకాదశి నాడు దానాలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది అదృష్టాన్ని తెస్తుంది. ఈ ఏకాదశి రోజున తిలాదానం, గోదానం, భూదానం వంటి దానాలు మరియు బ్రాహ్మణ సమారాధన ఎంతో పుణ్యప్రదం

Wednesday, April 9, 2025

guru pradosha vratham - గురు ప్రదోష వ్రతం

గురు ప్రదోష వ్రతం

గురువారం నాడు వచ్చే ప్రదోష వ్రతాన్ని గురు ప్రదోష వ్రతం అంటారు. గురువారం ప్రదోష వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు తమ పూర్వీకుల అనుగ్రహాన్ని పొందుతారు.

గురు ప్రదోష వ్రతం యొక్క కథ:

ఒకసారి ఇంద్రుడు మరియు వృత్రాసుర సేనల మధ్య భీకర యుద్ధం జరిగింది. దేవతలు రాక్షస సైన్యాన్ని ఓడించి నాశనం చేశారు. అది చూసిన వృత్రాసురుడు చాలా కోపించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాక్షస మాయ కారణంగా, అతను ఒక భయంకరమైన రూపాన్ని ధరించాడు. దేవతలందరూ భయపడి బృహస్పతిని ఆశ్రయించారు. బృహస్పతివారికీ  వృత్రాసురుని అసలు వృతాంతం వివరిస్తాడు.

వృత్రాసురుడు ఘోర తపస్వి. గంధమాదన పర్వతం మీద ఘోర తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు. పూర్వకాలంలో చిత్రరథుడు అనే రాజు ఉండేవాడు. ఒకసారి అతను తన విమానంలో కైలాస పర్వతానికి వెళ్ళాడు. పరమశివుని ఎడమవైపున కూర్చున్న పార్వతి తల్లిని చూసి వెక్కిరిస్తూ - ఓ దేవ! ప్రేమ మరియు ఆప్యాయతలో చిక్కుకోవడం వల్ల, మేము స్త్రీల ప్రభావంలో ఉంటాము మీరు కూడా అతీతులు కారు.

చిత్రరథుని ఈ మాటలు విని, సర్వవ్యాపి అయిన శంకరుడు నవ్వుతూ ఇలా అన్నాడు - ఓ రాజా! నా విధానం వేరు. నేను ప్రాణాంతక విషాన్ని సేవించాను, అయినా నువ్వు నన్ను సామాన్యుడిలా ఎగతాళి చేస్తున్నావు!

తల్లి పార్వతి కోపించి చిత్రరథుడిని ఉద్దేశించి – ఓ దుర్మార్గుడా! సర్వవ్యాపకుడైన మహేశ్వరునితో పాటు నీవు నన్ను వెక్కిరించావు. అందువల్ల, నీవు  రాక్షస రూపాన్ని ధరించు అని పార్వతి మాత శాపమిస్తుంది 

జగదాంబ భవాని శాపం కారణంగా చిత్రరథుడు అనే రాక్షసుడు గా జన్మించాడు మరియు త్వష్ట అనే ముని యొక్క శాపం కారణంగా అతను వృత్రాసురుడు అయ్యాడు.

వృత్రాసురుడు ప్రజలను, దేవతలను, మునులను హింసిస్తూ ఆనందిస్తుండేవాడు 

బృహస్పతి ఇంద్రునితో వృత్తాసురుడు చిన్నప్పటి నుండి శివ భక్తుడు. కావున, ఓ ఇంద్రా, బృహస్పతి ప్రదోష నాడు ఉపవాసం చేసి శంకరుడిని ప్రసన్నం చేసుకోండి. 

దేవరాజు  గురుదేవుని ఆజ్ఞను అనుసరించి బృహస్పతి ప్రదోష ఉపవాసం పాటించాడు. గురు ప్రదోష ఉపవాస మహిమతో, ఇంద్రుడు వృత్రాసురుడిని జయించాడు.


గురు ప్రదోష వ్రతం నాడు చేయవలసినవి 

గురు ప్రదోష వ్రతం నాడు భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర స్నానం చేస్తారు.

శివ పరివార విగ్రహాలని  ఉంచి, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తారు. 

సాయంత్రం సమయంలో ప్రదోషపూజ చేస్తారు.

సాయంత్రం ప్రదోష వ్రత కథ పారాయణం, మహామృత్యుంజయ మంత్రం మరియు పంచాక్షరీ మంత్రం జపిస్తారు.


శివ పరివారానికి ప్రసాదం సమర్పించి నివేదన చేస్తారు.

హారతితో పూజ పూర్తయిన తర్వాత, కుటుంబ సభ్యులందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టి, ఆపై వారు ఉపవాసం విరమిస్తారు. 

మంత్రం

1. ఓం నమః శివయ..!!

2. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్-మృత్యోర్-ముక్షీయ మాఽమృతాత్

ANANGA TRAYODASHI VRATHAM - అనంగ త్రయోదశి వ్రతం

అనంగ త్రయోదశి వ్రతం

అనంగ త్రయోదశి వ్రతం అనేది శివుడికి గురించి చేసే పవిత్రమైన ఉపవాస దీక్ష. భారతదేశంలోని దక్షిణ భారత దేశంలో, గుజరాత్ మరియు మహారాష్ట్రలలో, దీనిని హిందూ చాంద్రమాన మాసం 'చైత్ర'లోని 'శుక్ల పక్ష' (పౌర్ణమి కి ముందు కాలం) సమయంలో 'త్రయోదశి' (13వ రోజు) నాడు ఆచరిస్తారు. గ్రెగోరియన్ క్యాలెండర్‌లో, ఈ తేదీ మార్చి మధ్య నుండి ఏప్రిల్ మధ్య వరకు ఉంటుంది. అయితే అనంగ త్రయోదశి వ్రతం ఆచరించే వారు ఒక సంవత్సరం పాటు అనంగ మరియు రతిని పూజిస్తారు. పూర్తి భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించే వ్యక్తికి సంపద, మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తాయని బలమైన నమ్మకం ఉంది.

అనంగ త్రయోదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత:
‘గరుడ పురాణం’ వంటి అనేక గ్రంథాలలో అనంగ త్రయోదశి వ్రతం యొక్క ప్రాముఖ్యత వివరించబడింది. ‘అనంగ’ అనేది ‘శరీరం లేనివాడు’ అని అర్థం. ఇతిహాసాల ప్రకారం, తారకాసుర వధకు ముందు శివుడు 
మన్మథుడుని బూడిదగా కాల్చినందున అతన్ని ‘అనంగ’ అని పిలుస్తారు. మన్మథుడి భార్య రతి దేవి శివుడి గురించి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు సంతోషించిన శివుడు మన్మథుడుని ‘అనంగ’గా తిరిగి ఇచ్చాడు. రతిదేవి మన్మథుడుని పూర్తి శరీరంతో మాత్రమే చూడగలిగింది, మిగిలిన వారు అతని తలను మాత్రమే చూడగలిగారు.

ఈ పవిత్రమైన రోజున, భక్తులు శివుడిని, 
మన్మథుడుని మరియు అతని భార్య రతిదేవితో కలిసి పూజిస్తారు. అనంగ త్రయోదశి నాడు ఉపవాసం మరియు ఇతర ఆచారాలను భక్తితో ఆచరించే వ్యక్తి శివుడి ఆశీస్సులు పొందుతాడని మరియు చివరికి మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు. అనంగ త్రయోదశి వ్రతాన్ని ఆచరించేవారికి జీవితాంతం ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది. ఫలవంతమైన కుటుంబ సంబంధాలు మరియు వైవాహిక ఆనందం అనేవి అనంగ త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే మరికొన్ని గొప్ప ప్రయోజనాలు.

ఆచారాలు:

అనంగ త్రయోదశి వ్రతం కోసం భక్తులు ఉదయాన్నే లేచి సూర్యోదయానికి ముందు స్నానం చేస్తారు.

అనంగ త్రయోదశి వ్రతం రోజున, భక్తులు శివుడికి అభిషేకం నిర్వహించి తదుపరి శివుడితో పాటు, భక్తులు కామదేవుడు మరియు దేవి రతిని కూడా పూజిస్తారు.

ఉపవాసం రోజులో ఒక ముఖ్యమైన ఆచారం. అనంగ త్రయోదశి వ్రతాన్ని పాటించేవారు రోజంతా ఏమీ తినరు మరియు త్రాగరు. దీక్ష మరియు పూజలు పూర్తి చేసిన తర్వాత రాత్రి ఉపవాసం విరమిస్తారు.

బ్రాహ్మణులను ఇళ్లకు ఆహ్వానిస్తారు. అనంగ త్రయోదశి వ్రతం నాడు ప్రత్యేక భోజనం తయారు చేసి ముందుగా బ్రాహ్మణులకు భోజనం పెడతారు. తరువాత వారికీ దాన ధర్మాలతో వారిని సత్కరించి వారి ఆశీర్వచనములు స్వీకరిస్తారు.


పంచాంగం

నిత్య స్తోత్రావళి

Monday, April 7, 2025

KAMADA EKADASHI - కామదా ఏకాదశి

కామదా ఏకాదశి

మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకతను చోటుచేసుకుని ఉంటుంది. అందులో చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి. దీనినే దమన ఏకాదశి అని పిలుస్తుంటారు. ఇది పాపాలను హరిస్తుంది.

ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది.

వరాహ పురాణం లో శ్రీ కృష్ణ పరమాత్ముడు యుధిష్టరునికి కామదా ఏకాదశి మహత్యం, విశిష్టతను వివరించాడు. వశిష్ట మహాముని దిలీప మహారాజు కి ఏకాదశి వ్రత కథను ఇలా వివరించాడు. పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని హండరీరుడు అనే రోజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, అప్సరసలు రాజ్య సభలో పాటలు, నాట్యాలు చేసి రాజును సంతోషపరిచేవారు. ఒకానొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు, తన భార్యతో చాల అనోన్యంగా, ప్రేమగా ఉండేవాడు.

రాజ్యసభలో ఒకసారి అందరు కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తను ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మరచిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు. అది గమనించిన రాజు 
ఆగ్రహించి గంధర్వుడిని,  నీ అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీకు ఉన్న కళా అంత నాశనమై పోవాలి అని శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య ఎంతో బాధపడి దుఖంతో భర్తను తీసుకోని అడవులోకి ప్రయాణమైంది.అలా వింధ్యాచల అడవిలో ప్రయాణిస్తూ వుండగా శ్రింగి ఆశ్రమం ఒకటి కనపడుతుంది. అక్కడికి వెళ్ళిన గంధర్వుడి భార్య శ్రింగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయును చెప్పి,

తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడింది. అప్పుడు శ్రింగి మహర్షి కామదా ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించాడు. ఆ కధ మహాత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరించి, ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుని మనసులో తలచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్దలతో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి. మనసులో తలచుకోని నమస్కరించి తన ప్రక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే చూస్తేనే భయపడే ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. అలా ఇద్దరు చివరకు మోక్షం పొందారు. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెబుతున్నాయి.

కామద ఏకాదశి ని హిందువులు చైత్ర శుద్ధ ఏకాదశి రోజున జరుపుకుంటారు. దీనినే సౌమ్య ఏకాదశి, కామద ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని విష్ణపూజ, ఉపవాసం, జాగరణ మొదలైన వాటితో చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సింధులో చెప్పబడింది. పాపాలను హరింపచేసే ఏకాదశి కాబట్టి యిది పాపవిమోచన ఏకాదశి అయింది.స్త్రీలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యం రాదని చెప్పబడింది.

ఈ రోజునే శ్రీకృష్ణుని ఆందోళికోత్సవము జరుపుతారు. ఉయ్యాలలోని కృష్ణుని దర్శించినంత మాత్రమున కలికాలపు దోషాలు పాతాయి. కృష్ణ ప్రతిమగల ఉయ్యాలను ఊపితే, వేయి అపరాధాలైనా క్షమింపబడతాయి, కోటి జన్మల పాపాలు తొలగడమే కాక అంతమునందు విష్ణు సాయుజ్యము లభించగలదు.

Sunday, April 6, 2025

DHARMARAJA DHASHAMI - ధర్మరాజ దశమి

ధర్మరాజ దశమి

ధర్మరాజ దశమి అంటే ఏమిటి..? యమధర్మ రాజుకు ప్రత్యేక పూజలు ఎందుకు చేయాలి..?

ధర్మరాజ దశమి లేదా యమ ధర్మరాజ దశమి మరణానికి దేవుడు అయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది. యమధర్మరాజు అని కూడా పిలువబడే యమకు అంకితం చేసిన పూజ ఆ రోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని 10 వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు. ప్రాథమికంగా రోజు చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించడంపై దృష్టి పెడతాయి. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ ఉపనిషత్తులోని యువ నాచికేతుల కథ వినడం ఆనందంగా ఉంటుంది.

నచికేతుని కథ కఠోపనిషత్తులో కనిపిస్తుంది. పూర్వం గౌతముని వంశానికి చెందిన వాజశ్రవసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి, వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతాండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా సాగి, నిరాటంకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా వాజశ్రవసుడు ఆరోగ్యంగానూ, దృఢంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని వట్టిపోయిన ముసలి ఆవులనూ, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవాటినీ దానం చేయడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతలివాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ, తన దగ్గర ఉన్నవాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైంది. పైగా బాల్యచాపల్యంతో తండ్రి దగ్గరకు వెళ్లి ఇలా నీకు పనికిరానివాటన్నింటినీ దానం చేస్తున్నావు సరే! ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు? అని అడగడం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికీ అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది, నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు.

తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చష్టుడయ్యాడు. తొందరపడి తాను అన్నమాటకు తండ్రి కూడా పశ్చాత్తాపపడ్డాడు. ఏదో పొరపాటున అనేశాను. ఊరుకో అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞసమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు.

పొరపాటున అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యమునికి తనను తాను అర్పించుకునేందుకు బయల్దేరాడు. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ, సమయం వచ్చినప్పడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడి తలమునకలుగా ఉన్నాడు. ఎప్పుడో మూడు రోజుల తరువాత నచికేతుని గమనించాడు యముడు.

ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి? ఇంటికి ఫో! అన్నాడు యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా, జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. ఏదో తొందరపాటుగా అన్నంతమాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను.

పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి, నేనే నీకు మూడు వరాలను ఇస్తాను తీసుకో! అన్నాడు యముడు, నచికేతుని సత్యనిష్ఠకు ముచ్చటపడి. నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా, నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు. దానికి యముడు తథాస్తు అన్నాడు.

ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు నచికేతుడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది- స్వర్గలోకే న భయం కించనాస్తి అంటాడు నచికేతుడు, అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు. దాంతో యముడు నాచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక మూడవ కోరికగా చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు? అని అడుగుతాడు నచికేతుడు.

తనంతటివాడు ప్రత్యక్షమై కావల్సిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి, భయాన్ని జయించే స్వర్గం కావాలి, మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే నువ్వు చిన్నపిల్లవాడివి. అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. ఈ జననమరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదన్నా కోరుకో. నీకు ఏం కావాలన్నా వరమిస్తాను. అని నచికేతునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు యముడు. కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదు. తనకి ఇస్తేగిస్తే ఆ మరణజ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరుకున్నాడు.

నచికేతుని పట్టుదల, తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది. సరే చెబుతా విను. మీ మానవులు అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక, పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోనూలేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే! దానిని అశాశ్వతమైనవాటితో ఎలా పొందగలరు?.... అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు.

ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు. ఆత్మజ్ఞానం గురించి యముడికీ, నచికేతునికీ జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్యభాగం. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది. అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం. నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ పదిపన్నెండు మంది పిల్లలు ఉంటే, ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను అంటారు వివేకానంద. అంతేకాదు ఆయన తరచూ స్మరించే ఉత్తిష్ఠత జాగ్రత( లేవండి, మేలుకోండి ) అన్న మాటలు కూడా కఠోపనిషత్తులోనివే.

Tuesday, March 25, 2025

Papamochani Ekadashi - పాపమోచని ఏకాదశి

పాపమోచని ఏకాదశి


ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం 'చైత్ర' మాసంలో కృష్ణ పక్షంలో (క్షీణ దశ) 'ఏకాదశి' (11వ రోజు) వస్తుంది. అయితే దక్షిణ భారత క్యాలెండర్‌లో ఈ ఏకాదశి హిందూ నెల 'ఫాల్గుణ'లో జరుపుకుంటారు. 

పాపమోచని ఏకాదశి అనేది హిందూ క్యాలెండర్‌లోని 24 ఏకాదశులలో చివరి ఏకాదశి. ఇది హోలికా దహనం మరియు చైత్ర నవరాత్రి వేడుకల మధ్య వస్తుంది. పాపమోచని ఏకాదశి గురువారం నాడు వస్తే, దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మరియు దీనిని 'గురువర ఏకాదశి' అని పిలుస్తారు. హిందూవులలో 'పాప' అనే పదానికి 'దుర్మార్గాలు' లేదా 'పాపాలు' అని అర్థం మరియు 'మోచన్' అంటే 'విడుదల' అని అర్థం మరియు అందువల్ల ఈ ఏకాదశి అన్ని పాపాల నుండి విముక్తిని ఇస్తుంది. అంతేకాకుండా ఈ ఏకాదశి ఆచారం ఒక వ్యక్తిని పాపాలు చేయకుండా ఉండటానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి పాపమోచని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం చాలా శుభప్రదమని భక్తులు నమ్ముతారు.

పద్మ పురాణంలో వివరించబడిన పాపమోచని ఏకాదశి వ్రత కథ ఇలా ఉంది:
యుధిష్ఠిరుడు "ఓ ప్రభూ! ఫాల్గుణ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి నేను విన్నాను. ఇప్పుడు, దయచేసి ఫాల్గుణ కృష్ణ పక్షంలోని ఏకాదశి గురించి తెలిపి నన్ను అనుగ్రహించు" అని అడిగాడు.

శ్రీ కృష్ణుడు ఇలా జవాబిచ్చాడు, "ఓ రాజా! వినండి, ఈ ఏకాదశికి సంబంధించిన పాపాలను నాశనం చేసే కథను నేను చెబుతాను, దీనిని మాంధాత చక్రవర్తి అడిగినప్పుడు మహర్షి లోమాషుడు చెప్పాడు."

మాంధాత ఇలా అన్నాడు, "ఓ ప్రభూ! ప్రజల సంక్షేమం కోసం, ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షంలో ఏ ఏకాదశి వస్తుందో వినాలనుకుంటున్నాను. దాని ఆచారాలు ఏమిటి మరియు దాని నుండి ఏలా ప్రయోజనాలను పొందుతారు? దయచేసి ఈ వివరాలను వివరించండి."

లోమాషుడు ఇలా అన్నాడు, "ఓ రాజులలో శ్రేష్ఠుడా! ఈ సంఘటన పురాతన కాలం నాటిది. గంధర్వుల కుమార్తెలు తమ సకులతో ఆనందంగా తిరుగుతున్న అప్సరసలచే అలంకరించబడిన చైత్రరథ అనే అడవిలో, తన మంత్రముగ్ధమైన స్వరానికి ప్రసిద్ధి చెందిన దేవలోక వనదేవత మంజుఘోష, మేధవి ఋషిని ఆకర్షించడానికి వెళ్ళింది. అతను బ్రహ్మచర్యాన్ని అభ్యసిస్తూ ఆ అడవిలోనే నివసించాడు.

ఆ మహర్షికి భయపడి, మంజుఘోషు తన ఆశ్రమానికి ఒక మైలు దూరంలో ఉండి, మధురమైన శ్రావ్యాలను పాడుతూ వీణను అందంగా వాయించడం ప్రారంభించింది. మహర్షి వేరే చోట తిరుగుతూ, ఆమె గానం విని దానిని అనుసరించాడు. ఆమె అందానికి ముగ్ధుడైన మహర్షి ఆమె వద్దకు చేరుకుని, తన సన్యాసాన్ని విడిచిపెట్టి, కోరికకు లొంగిపోయాడు. అలాంటి స్థితిలో ఉన్న మహర్షిని చూసి, మంజుఘోషు ఆమె వీణను పక్కన పెట్టి, అతని దగ్గరికి వచ్చి, అతనిని లాలించడం ప్రారంభించింది. మహర్షి కూడా ఆమెతో శృంగారంలో నిమగ్నమైనాడు.

కోరికలో మునిగిపోయి, వారు రాత్రి పగలు అనే తేడా లేకుండా పోయారు. ఆ విధంగా, ఋషుల ధర్మమార్గాన్ని వదిలి, అతను చాలా రోజులు స్వర్గపు అప్సరసతో ఆనందంలో మునిగిపోయాడు. మంజుఘోషు స్వర్గలోకానికి బయలుదేరడానికి సిద్ధమయింది. వెళ్ళే ముందు, ఆమె మేధవి ఋషితో, 'ఓ బ్రాహ్మణా! ఇప్పుడు నా నివాసానికి తిరిగి వెళ్లడానికి నాకు అనుమతి ఇవ్వండి' అని చెప్పింది.

మేధవి, "ఓ దేవీ! తెల్లవారుజాము వరకు నాతో కొంచెంసేపు ఉండు" అని చెప్పాడు.

ఆకాశ వనదేవత, "ఓ బ్రాహ్మణులలో శ్రేష్ఠుడా! ఎన్ని సాయంత్రాలు గడిచాయో ఎవరికి తెలుసు! దయచేసి నాతో గడిచిన సమయాన్ని పరిగణించండి."

"లోమాష్జీ ఇలా అంటున్నాడు," ఓ రాజా! స్వర్గపు అప్సరస మాటలు విన్న మేధవి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆ క్షణంలో, అతను గడిచిన సమయాన్ని లెక్కించి, ఆమెతో ఉన్నప్పుడు యాభై ఏడు సంవత్సరాలు గడిచిపోయాయని గ్రహించాడు. ఆమెతో ఉండటం వల్ల తన తపస్సు నాశనమైందని గ్రహించిన ముని చాలా కోపంగా ఉన్నాడు. 'ఓ పాపి! నువ్వు రాక్షసి అవుతావు' అని ఆమెను శపించాడు. ముని శాపంతో కాలిపోయిన ఆమె వినయంగా నమస్కరించి, 'ఓ బ్రాహ్మణులలో ఉత్తముడా! దయచేసి నా పాపం నుండి నన్ను విముక్తి చేయుము. ఏడు మాటలు మాట్లాడటం ద్వారా లేదా ఏడు అడుగులు కలిసి నడవడం ద్వారా సద్గుణవంతులతో స్నేహం ఏర్పడుతుంది. ఓ బ్రాహ్మణుడా! నేను మీతో చాలా సంవత్సరాలు గడిపాను; కాబట్టి, ప్రభూ! దయచేసి నన్ను కరుణించు.''

ఋషి ఇలా అన్నాడు, "ప్రియమైనదాన , నా మాట వినండి. ఈ శాపాన్ని పరిష్కరించవచ్చు. నేను ఏమి చేయగలను? నువ్వు నా విస్తృత తపస్సును నాశనం చేశావు. ఫాల్గుణమాసంలోని చీకటి పక్షంలో వచ్చే శుభ ఏకాదశిని 'పాపమోచని' అంటారు. అది అన్ని పాపాలను నశింపజేసేది. ఆ ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా, మీ రాక్షస స్థితి తొలగిపోతుంది. నీ అందం! తిరిగి ప్రాప్తిస్తుంది

ఇలా చెప్పి, మేధవి తన తండ్రి చ్యవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అతన్ని చూసి, చ్యవనుడు, "కుమారా! ఏం చేశావు? నువ్వు సంపాదించిన పుణ్యాన్ని నాశనం చేసుకున్నావు!" అని అడిగాడు. మేధవి, "తండ్రీ! నేను ఒక దివ్య అప్సరసతో సుఖంలో మునిగిన పాపాన్ని చేశాను. ఈ పాపానికి పరిహారం పొందగల ఒక తపస్సును దయచేసి నాకు చెప్పు" అని జవాబిచ్చాడు. చ్యవనుడు, "కుమారా! ఫాల్గుణమాసంలోని చీకటి పక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసం ఆచరించడం ద్వారా, పాపాల ఫలం నశిస్తుంది" అని అన్నాడు. తన తండ్రి మాట విన్న మేధవి ఆ ఉపవాసం ఆచరించాడు. దీనితో అతని పాపం పోయింది, మరియు అతను మళ్ళీ తపస్సుతో పరిపూర్ణుడయ్యాడు. అదేవిధంగా, మంజుగోషు కూడా ఈ అద్భుతమైన ఉపవాసాన్ని ఆచరించింది. పాపమోచని ఉపవాసం ఆచరించడం వల్ల, ఆమె రాక్షస ఉనికి నుండి విముక్తి పొంది, దివ్యమైన అప్సరసగా రూపాంతరం చెంది, స్వర్గలోకాలకు చేరుకుంది. ఓ రాజా! పాపమోచని ఏకాదశి ఉపవాసం ఆచరించే సద్గురువుల పాపాలన్నీ నశించిపోతాయి. దాని గురించి చదవడం లేదా వినడం వల్ల వెయ్యి ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. బ్రాహ్మణ హత్య, బంగారం దొంగతనం, మద్యం సేవించడం మరియు గురువు భార్యతో వ్యభిచారం వంటి ఘోరమైన పాపాలు కూడా ఈ ఉపవాసం ఆచరించడం ద్వారా తొలగిపోతాయి. ఈ ఉపవాసం అత్యంత పుణ్యప్రదమైనది.

భక్తులు ఏకాదశి నాడు సూర్యోదయ సమయంలో మేల్కొని కుశ మరియు నువ్వులతో పవిత్ర స్నానం చేస్తారు. విష్ణు భక్తులలో చాలామంది ఈ రోజున తమ దేవత యొక్క శాశ్వత కరుణను పొందేందుకు ఉపవాసం ఉంటారు.

పాపమోచని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏమీ తినకుండా లేదా కేవలం నీరు త్రాగకుండా ఉపవాసం ఉండటం ఉత్తమం. అయితే ఇది అందరికీ సాధ్యం కానందున, ధాన్యంకాని ఆహారాలు పాలు, గింజలు మరియు పండ్లు తినడం ద్వారా కూడా ఉపవాసం పాటించవచ్చు. విష్ణువుకు ప్రార్థనలు చేసిన తర్వాత మరుసటి రోజు ఉపవాసం విరమిస్తారు.

ఉపవాసం లేని వారు కూడా, ఏకాదశి నాడు పప్పులు, బియ్యం మరియు మాంసాహారం తినడం ఖచ్చితంగా నిషేధించబడింది. పాపమోచని ఏకాదశి నాడు 'శ్రీ విష్ణు సహస్రనామం' చదవాలి.

ఈ రోజున, భక్తులు విష్ణువును పూర్తి అంకితభావంతో పూజిస్తారు. భక్తులు తులసి ఆకులు (ఒక రోజు ముందు కోసినవి), పువ్వులు, పండ్లు, దీపం మరియు ధూపం కర్రలను విష్ణువుకు సమర్పిస్తారు. మోగ్రా లేదా మల్లె పూలు సమర్పించడంతో పాటు, చాలా పుణ్యప్రదమని నమ్ముతారు. వీలైతే, ఈ వ్రతాన్ని ఆచరించే వారు సాయంత్రం విష్ణువు ఆలయాలను కూడా సందర్శించాలి. పవిత్ర భగవద్గీతలోని ముఖ్యమైన అధ్యాయాలను పఠించడం వంటి ప్రత్యేక కార్యక్రమాలు దేవాలయాలలో నిర్వహించబడతాయి.

పాపమోచని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత:
పాపమోచని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను ‘భవిష్యోత్తర పురాణం’ మరియు ‘హరివాసరం’ లలో వివరించారు. దీనిని మొదట లోమాస మహర్షి మాంధాత రాజుకు, తరువాత శ్రీకృష్ణుడు పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడికి వివరించారు. పాపమోచని ఏకాదశి అన్ని పాపాలను నాశనం చేస్తుందని మరియు గమనించేవారిని అపరాధ భావన నుండి విముక్తి చేస్తుందని నమ్ముతారు. ఈ ఏకాదశిని పూర్తి భక్తితో పాటించడం ద్వారా, వ్యక్తి ఎప్పటికీ రాక్షసులు లేదా దయ్యాల ప్రభావానికి గురికాడు. పాపమోచని ఏకాదశిని పాటించడం హిందూ తీర్థయాత్ర స్థలాలను సందర్శించడం లేదా వెయ్యి ఆవులను దానం చేయడం కంటే ఎక్కువ పుణ్యప్రదం. ఈ శుభప్రదమైన వ్రతాన్ని ఆచరించే వ్యక్తి అన్ని ప్రాపంచిక సుఖాలను ఆస్వాదిస్తాడు మరియు చివరికి విష్ణువు యొక్క స్వర్గపు రాజ్యమైన ‘వైకుంఠం’లో చోటును కనుగొంటాడు. పాపమోచని వ్రతాన్ని ఆచరించడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒకరి శరీర అవసరాలను నియంత్రించడం మరియు విష్ణువుకు అంకితం చేయబడిన వేద మంత్రాలను జపించడం, వినడం మరియు పఠించడంలో తగినంత సమయం గడపడం.

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...