Thursday, August 21, 2025

Sri Tara Devi Sahsra Nama Stottram - శ్రీ తారా దేవి సహస్రనామ స్తోత్త్రం

శ్రీ తారా దేవి సహస్రనామ స్తోత్త్రం 


వశిష్ట ఉవాచ
నామ్నాం సహస్ర మాం తారాయా ముఖాంభోజాద్వినిర్గతామ్‌
మంత్ర సిద్ధికరమ్‌ ప్రోక్తం తన్మే వద పితామహ ॥ 01 


బ్రహ్మ ఉవాచ
శృణు వత్స ప్రవక్ష్యామి రహస్యం సర్వసిద్ధిదమ్‌
యస్యోపదేశ మాత్రేణ సర్వసిద్ధి ర్భవిష్యతి ॥ 02 


మహాప్రళయ కాలాదౌ నష్టే స్థావర జంగమే
మహాతారాం సమాకర్ణ్య కృపయా సంహృతం తనౌ ॥ 03 


నామ్నా తేన మహాతారా ఖ్యాతా సా బ్రహ్మరూపిణీ
మహాశూల త్రయం కృత్వా తత్ర చైకాకినీ స్థితా ॥ 04 


పున స్పృష్టే శ్చికీర్షా భూత్‌ దివ్యసామ్రాజ్య సంజ్ఞకమ్‌
నామ్నాం సహస్ర మస్యాస్తు తకారాద్య మ్మయా స్మృతమ్‌ ॥ 05 


తత్ప్రభావేన బ్రహ్మాండం నిర్మితమ్‌ సుదృఢ మ్మహత్‌
ఆవిర్భూతా వయం తంత్ర యంత్రై స్తస్యాః పురాద్విజ ॥ 06 


స్వస్యకార్యార్థిన స్తత్ర భ్రాంతా భూమ్యాం యథా వయమ్‌
తయోపదిష్టాః కృపయా భవామ సృష్టి కారకాః ॥ 07 


తస్యా ప్రసాదా ద్వినేంద్ర త్రయో బ్రహ్మాండనాయకాః
అన్యాస్సుర గణాస్సర్వే తస్యాః పాద ప్రసేవకాః ॥ 08 


పఠనా ద్ధారణా త్సృష్టేః కర్తాహం పాలకో హరిః
తత్వాక్షరోపదేశేన సంహర్తా శంకర స్వయమ్‌ ॥ 09 


ఋషిచ్చందాదిక ధ్యానమ్మూలవత్పరికీర్తితమ్‌
నియోగ మాత్ర సిద్దౌ చ పురుషార్ధ చతుష్టయమ్‌ 
॥ 10 

తారా తారాది పంచార్ణా తారాన్యావేద వీర్యజా
తారా తారహితా వర్ణా తరాద్యా తారరూపిణీ ॥ 11 


తారా రాత్రి సముత్పన్నా తారా రాత్రి పరోద్యతా
తారా రాత్రి జపాసక్తా తారా రాత్రి స్వరూపిణీ ॥ 12 


తారా రా
జ్ఞీ స్వసంతుష్టా తారా రాజ్ఞీ వరప్రదా
తారా రా
జ్ఞీ స్వరూపా చ తారా రాజ్ఞీ ప్రసిద్దదా ॥ 13 

తారా హృత్పంకజాకారా తారా హృ
త్పంకజా పరా
తారా హృ
త్పంకజా ధారా తారా హృత్పంకజా తథా ॥ 14 

తారేశ్వరీ చ తారా భా తారాగణ స్వరూపిణీ
తారాగణ సమాకీర్ణా తారాగణ నిషేవితా ॥ 15 


తారా తారాన్వితా తారా రత్నాన్విత విభూషణా
తారాగణ రణాసన్నా తారా కృత్య ప్రపూజితా ॥ 16 


తారాగణ కృతాహారా తారాగణ కృతాశ్రయా
తారాగణ కృతాగారా తారా గణన తత్పరా ॥ 17 


తారాగుణ గణాకీర్ణా తారాగుణ గణప్రదా
తారాగుణ గణాసక్తా తారాగుణ గణాలయా ॥ 18 


తారేశ్వరీ తారపూజ్యా తారా జప్యాతు కారణా
తారా ముఖ్యాతు తారాఖ్యా తారా దక్షాతు తారిణీ ॥ 19 


తారాగమ్యాతు తారస్థా తారామృత తరంగిణీ
తారాభవ్యా తు తారార్ణా తార హవ్యాతు తారిణీ ॥ 20 


తారకా తారకాంతస్థా తారకా రాశి భూషణా
తారకాహార శోభాఢ్యా తారకావేష్టితాంగణా 
॥ 21 

తారకా హంసకాకీర్ణా తారకా కృత భూషణా
తారకాంగద శోభాంగీ తారకా శ్రితకంకణా ॥ 22 


తారకాంచిత కాంచీచ తారకాన్విత భక్షణా
తారకాచిత్ర వసనా తారకాసన మండలా ॥ 23 


తారకా కీర్ణముకుటా తారకాశ్రిత కుండలా
తారకాన్విత తాటంక యుగ్మ గండస్థలో జ్వలా ॥ 24 


తారకాశ్రిత పాదాబ్జా తారకా వరదాయికా
తారకా దత్త హృదయా తారకాంచిత సాయకా ॥ 25 


తారకాన్యాస కుశలా తారకాన్యాస విగ్రహా
తారకాన్యాస సంతు
ష్టా తారకాన్యాస సిద్ధిదా ॥ 26 

తారకాన్యాస నిలయా తారకాన్యాస పూజితా
తారకాన్యాస సంహృష్టా తారకాన్యాస సిద్ధిదా ॥ 27 


తారకాన్యాస సమ్మగ్రా తారకాన్యాస వాసినీ
తారకాన్యాస సంపూర్ణా మంత్రసిద్ధి విధాయినీ ॥ 28 


తారకోపాసక ప్రాణా తారకోపాసక ప్రియా
తారకోపాసకైః సాధ్యా తారకోపాస వేషదా ॥
 29 

తారకోపాసకాసక్తా తారకోపాసకార్థినీ
తారకోపాసకారాధ్యా తారకోపాసకాశ్రయా ॥
 30 

తారకాసుర సంతు
ష్టా తారకాసుర పూజితా
తారకాసుర నిర్మాణ కర్త్రీ తారక వందితా ॥
 31 

తారకాసుర సమ్మాన్యా తారకాసుర మానదా
తారకాసుర సంసిద్దా తారకాసుర దేవతా ॥
 32 

తారకాసుర దేహస్థా తారకాసుర స్వర్గదా
తారకాసుర సంసృష్టా తారకాసుర గర్వదా ॥
 33 

తారకాసుర సంహంత్రీ తారకాసుర మర్ధినీ
తారకాసుర సంగ్రామ నర్తకీ తారకాపహా ॥
 34 

తారకాసుర సంగ్రామ తారిణీ తారకారి భృత్‌
తారకాసుర సంగ్రామ కబంధ బృందవందితా ॥
 35 

తారకారి ప్రసూస్తార కారిమాతాతు తారికా
తారకారి మనోహారి వస్త్ర భూషాను శాసికా 
 36 

తారకారి విధాత్రీ చ తారకారి నిషేవితా
తారకారి వచస్తుష్టా తారకారి సు శిక్షితా ॥
 37 

తారకారి సుసంతుష్టా తారకారి విభూషితా
తారకారి కృతోత్సాంగీ తారకారి ప్రహర్షితా 
 38 

తమః సంపూర్ణ సర్వాంగీ తమోలిప్త కళేబరా
తమో వ్యాప్త స్థలా సంగీ తమః పటల సన్నిభా ॥
 39 

తమోహంత్రీ తమః కర్త్రీ తమః సంచార కారిణీ
తమోగాత్రీ తమోదాత్రీ తమః పాత్రీ తమోపహా ॥
 40 

తమోరాశేః పూర్ణరాశి స్తమోరాశి వినాశిని
తమోరాశి కృతధ్వంసీ తమోరాశి భయంకరీ ॥
 41 

తమోగుణ ప్రసన్నాస్యా తమోగుణ సుసిద్ధిదా
తమోగుణోక్త మార్గస్థా తమోగుణ విరాజితా ॥
 42 

తమోగుణ స్తుతిపరా తమోగుణ వివర్ధినీ
తమోగుణాశ్రితపరా తమోగుణ వినాశినీ ॥
 43 

తమోగుణ క్షయకరీ తమోగుణ కళేబరా
తమోగుణ ధ్వంసతుష్టా తమః పారే ప్రతిష్టితా ॥
 44 

తమోభవ భవప్రీతా తమోభవ భవప్రియా
తమోభవ భవశ్రద్ధా తమోభవ భవశ్రియా ॥
 45 

తమోభవ భవప్రాణా తమోభవ భవార్చితా
తమోభవ భవప్రీత్యా
లీఢ కుంభస్థల స్థితా ॥ 46 

తపస్వి బృంద సంతుష్టా తపస్వి బృంద పుష్టిదా
తపస్వి బృంద సంస్తుత్యా తపస్వి బృంద వందితా ॥
 47 

తపస్వి బృంద సంపన్నా తపస్వి బృంద హర్షదా
తపస్వి బృంద సంపూజ్యా తపస్వి బృంద భూషితా ॥
 48 

తపస్వి చిత్త తల్పస్థా తపస్వి చిత్త మధ్యగా
తపస్వి చిత్త చిత్తార్హా తపస్వి చిత్త హారిణీ ॥
 49 

తపస్వి కల్ప వల్లాభా తపస్వి కల్పపాదపా
తపస్వి కామధేనుశ్చ తపస్వి కామపూర్తిదా ॥
 50 

తపస్వి త్రాణ నిరతా తపస్వి గృహ సంస్థితా
తపస్వి గృహ రాజశ్రీ స్తపస్వి రాజ్య దాయికా ॥
 51 

తపస్వి మానసారాధ్యా తపస్వి మానదాయికా
తపస్వి తాప సంహంత్రీ తపస్వి తాపశాంతి కృత్‌ ॥
 52 

తపస్వి సిద్ధి విద్యా చ తపస్వి మంత్ర సిద్ధి కృత్‌
తపస్వి మంత్ర తంత్రేశీ తపస్వి మంత్ర రూపిణీ 
 53 

తపస్వి మంత్ర నిపుణా తపస్వి కర్మకారిణీ
తపస్వి కర్మ సంభూతా తపస్వి కర్మసాక్షిణీ ॥
 54 

తపస్సేవ్యా తపోభవ్యా తపోభావ్యా తపస్వినీ
తపోవశ్యా తపోగమ్యా తపోగేహ నివాసినీ ॥
 55 

తపోధన్యా తపోమాన్యా తపఃకన్యా తపోవృతా
తపస్తధ్యా తపోగోప్యా తపోజప్యా తపోవృతా 
 56 

తపస్సాధ్యా తపోరాధ్యా తపోవంద్యా తపోమయీ
తపస్సాధ్యా తపోవంధ్యా తపస్సాన్నిధ్య కారిణీ ॥
 57 

తపోధేయా తపోజ్ఞేయా తపస్తప్తా తపోబలా
తపోగేయా తపోదేయా తపస్తత్వ ఫలప్రదా ॥
 58 

తపో విఘ్నా వరఘ్నీ చ తపో విఘ్న వినాశినీ
తపో విఘ్న చయ ధ్వంసీ తపో వి
ఘ్నభయంకరీ ॥ 59 

తపోభూమి వరప్రాణా తపోభూమి పతిస్తుతా
తపోభూమి పతిధ్యేయా తపోభూమి పతీష్టదా ॥ 60 


తపోవన కురంగస్థా తపోవన వినాశినీ
తపోవన గతిప్రీతా తపోవన విహారిణీ ॥ 61


తపోవన ఫలాసక్తా తపోవన ఫలప్రదా
తపోవన సుసాధ్యా చ తపోవన సుసిద్ధిదా ॥ 62 


తపోవన సుసేవ్యా చ తపోవన నివాసినీ
తపోధన సుసంసేవ్యా తపోధన సుసాధితా ॥ 63 


తపోధన సుసంలీనా తపోధన మనోమయీ
తపోధన నమస్కారా తపోధన విముక్తిదా ॥ 64 


తపోధన ధనాసాధ్యా తపోధన ధనాత్మికా
తపోధన ధనారాధ్యా తపోధన ఫలప్రదా ॥ 65 


తపోధన ధనాఢ్యా చ తపోధన ధనేశ్వరీ
తపోధన ధనప్రీతా తపోధన ధనాలయా ॥ 66 


తపోధన జనాకీర్ణా తపోధన జనాశ్రయా
తపోధన జనారాధ్యా తపోధన జనప్రసూః ॥ 67 


తపోధన జనప్రాణా తపోధన జనేష్టదా
తపోధన జనాసాధ్యా తపోధన జనేశ్వరీ 
 68 

తరుణాసృక్‌ ప్రవాసార్తా తరుణా సృక్ప్రతర్చితా
తరుణా సృక్‌ సముద్రస్థా తరుణా సృక్‌ ప్రహర్షదా ॥ 69 


తరుణా సృక్‌ సంతుష్టా తరుణా సృగ్విలేపితా
తరుణా సృఙ్ఞదీప్రాణా తరుణా సృగ్విభూషణా ॥ 70 


తరుణైణ బలిప్రీతా తరుణాజ బలిప్రియా
తరుణైణ బలిప్రాణా తరుణైణ బలీష్టదా ॥ 71 


తరుణాజ బలిప్రీతా తరుణాజ బలిప్రియా
తరుణాజ బలిఘ్రాణా తరుణాజ బలిప్రభుక్‌ ॥ 72 


తరుణాదిత్య సంకాశా తరుణాదిత్య విగ్రహా
తరుణాదిత్య రుచిరా తరుణాదిత్య నిర్మలా ॥ 73 


తరుణాదిత్య నిలయా తరుణాదిత్య మండలా
తరుణాదిత్య లలితా తరుణాదిత్య కుండలా ॥ 74 


తరుణార్క సమజ్యోత్స్నా తరుణార్క సమప్రభా
తరుణార్క ప్రతీకాశా తరుణార్క ప్రవర్థితా ॥ 75 


తరుణాతరుణ నేత్రా చ తరుణాతరుణ లోచనా
తరుణాతరుణ గాత్రాచ తరుణాతరుణ భూషణా ॥ 76 


తరణీదత్త సంకేతా తరణీదత్త భూషణా
తరణీ గణసంతుష్టా తరణీతరుణీ మణిః ॥ 77 


తరణీమణి సంసేవ్యా తరణీమణి మండితా
తరణీమణి సంతుష్టా తరణీమణి పూజితా ॥ 78 


తరణీబృంద సంవంద్యా తరణీబృంద వందితా
తరణీబృంద సంస్తుత్యా తరణీబ్బంద మానదా ॥ 79 


తరణీబృంద మధ్యస్థా తరణీబ్బంద వేష్టితా
తరణీబృంద సంప్రీతా తరణీబృంద భూషితా ॥ 80 


తరణీజయ సంసిద్ధా తరుణీ జయ మోక్షదా
తరణీ పూజకాసక్తా తరణీ పూజకార్థినీ ॥
 81 

తరణీ పూజక శ్రీదా తరణీ పూజాకార్తిహా
తరణీ పూజక ప్రాణా తరణీ నిందకార్తిదా ॥
 82 

తరణీ కోటనిలయా తరణీ కోటివిగ్రహా
తరణీ కోటిమధ్యస్థా తరణీ కోటివేష్టితా 
 83 

తరణీ కోటిదుస్సాధ్యా తరణీ కోటివిగ్రహా
తరణీ కోటిరుచిరా తరణీ తరుణీశ్వరీ ॥
 84 

తరుణీ మణిహారా
ఢ్యా తరుణీ మణికుండలా
తరుణీ మణిసంతుష్టా తరుణీ మణిమండితా ॥ 85 


తరణీ సరణీప్రీతా తరణీ సరణీరతా
తరణీ సరణీస్థానా తరణీ సరణీరతా ॥ 86 


తరణీ మండల శ్రీదా తరణీ మండలేశ్వరీ
తరణీ మండలశ్రద్ధా తరణీ మండలస్థితా ॥ 87 


తరణీ మండలార్థా
ఢ్యా తరణీ మండలార్చితా
తరణీ మండలధ్యేయా తరణీ భవసాగరా ॥ 88 


తరణీ కారణాసక్తా తరణీ తక్షకార్చితా
తరణీ తక్షక శ్రీదా తరణీ తక్షకార్ధినీ ॥ 89 


తరణీ తరుణశీలా చ తరణీ తరుణతారిణీ
తరీతరణ సంవేద్యా తరీతరణ కారిణీ ॥ 90 


తరురూపా తరూపస్థా తరుస్తరులతామయీ
తరురూపా తరుస్థా చ తరుమధ్య నివాసినీ ॥ 91 


తప్తకాంచన గేహస్థా తప్తకాంచన భూమికా
తప్తకాంచన ప్రాకారా తప్తకాంచన పాదుకా ॥ 92 


తప్తకాంచన దీప్తాంగీ తప్తకాంచన సన్నిభా
తప్తకాంచన గౌరాంగీ తప్తకాంచన మంచగా ॥ 93 


తప్తకాంచన వస్త్రాఢ్యా తప్తకాంచన రూపిణీ
తప్తకాంచన మధ్యస్థా తప్తకాంచన కారిణీ ॥ 94 


తప్తకాంచన మాసార్చ్యా తప్తకాంచన పాత్రభుక్‌
తప్తకాంచన శైలస్థా తప్తకాంచన కుండలా ॥
 95 

తప్తకాంచన క్షేత్రా
ఢ్యా తప్తకాంచన దండధ్భక్‌
తప్తకాంచన భూషా
ఢ్యా తప్తకాంచన దానదా ॥ 96 

తప్తకాంచన దేవేశీ తప్తకాంచన చాపధృక్‌
తప్తకాంచన తూణాఢ్యా తప్తకాంచన బాణభృత్‌ ॥
 97 

తలాతల విధాత్రీ చ, తలాతల విధాయినీ
తలాతల స్వరూపేశీ తలాతల విహారిణీ ॥
 98 

తలాతల జనాసాధ్యా తలాతల జనేశ్వరీ
తలాతల జనారాధ్యా తలాతల జనార్థదా 
 99 

తలాతల జయాభాక్షీ తలాతలజ చంచలా
తలాతలజ రత్నాఢ్యా తలాతలజ దేవతా ॥
 100 

తటినీ స్థానరసికా తటినీ తటవాసినీ
తటినీ తటినీ తీరగామినీ తటినీ ప్రియా ॥
 101 

తటినీ ప్లవనప్రీతా తటినీ ప్లవనోద్యతా
తటినీ ప్లవనశ్లాఘ్యా తటినీ ప్లవనార్థదా ॥ 102 

తటలాస్యా తటస్థానా తటేశీ తటవాసినీ
తటపూజ్యా తటారాధ్యా తటరోమ ముఖార్థినీ ॥ 103 

తటజా తటరూపా చ తటస్థా తటచంచలా
తటసన్నిధి దేహస్థా సహితా తటశాయినీ ॥ 104 

తరంగిణీ తరంగాభా తరంగాయతలోచనా
తరంగ సమదుర్ధర్షా తరంగ సమచంచలా ॥ 105 

తరంగ సమదీర్ఘాంగీ తరంగ సమవర్ధితా
తరంగ సమసంవృద్ధి తరంగ సమనిర్మలా ॥ 106 

తడాగమధ్య నిలయా తడాగమధ్య సంభవా
తడాగ రచనశ్లాఘ్యా తడాగ రచనోద్యతా ॥ 107 

తడాగ కుముదామోదీ తడాగేశీ తడాగినీ
తడాగ నీరసస్నాతా తడాగ నీరనిర్మలా ॥ 108 

తడాగ కమలాగారా తడాగ కమలాలయా
తడాగ కమలాంతస్థా తడాగ కమలోద్యతా ॥ 109 

తడాగ కమలాంగీ చ తడాగ కమలాసనా
తడాగ కమలప్రాణా తడాగ కమలేక్షణా ॥ 110 

తడాగ రక్తపద్మస్థా తడాగ శ్వేతపద్మగా
తడాగ నీలపద్మాభా తడాగ నీలపద్మభృత్‌ ॥ 111 

తనుస్తనుగీతా తన్వీ తన్వంగీ తనుధారిణీ
తనురూపా తనుగతా - తనుధృక్తనురూపిణీ ॥ 112 

తనుస్థా తనుమధ్యాంగీ తనుకృత్తనుమంగళా
తనుసేవ్యాతు తనుజా తనుజా తనుసంభవా ॥ 113 

తనుభృత్తను సంభూతా తనుదా తనుకారిణీ
తనుభృత్తను సంహంత్రీ తను సంచార కారిణీ ॥ 114 

తథ్యవాక్‌ తథ్యవచనా తథ్యకృత్‌ తథ్యవాదినీ
తథ్యభృత్‌ తథ్యచరితా తథ్యధర్మాను వర్తినీ ॥ 115 ॥

తథ్యభుక్‌ తథ్యగమనా తథ్యభక్తి వరప్రదా
తథ్య తర్క్య స్వభావా చ తర్కదాయాతు తర్కకృత్‌ ॥ 116 ॥

తర్క్యా తర్క్య స్వభావా చ తర్కదాయాతు తర్కకృత్‌
తర్కాధ్యాపన మధ్యస్థా తర్కాధ్యాపనకారిణీ ॥ 117 ॥

తర్కాధ్యాపన సంతుష్టా తర్కాధ్యాపన రూపిణీ
తర్కాధ్యాపన సంశీలా తర్కార్థ ప్రతిపాదితా ॥ 118 ॥

తర్కాధ్యాపన సంతృప్తా తర్కార్థ ప్రతిపాదికా
తర్కవాదాశ్రితపదా తర్కవాద వివర్ధినీ ॥ 119 ॥

తర్కవాదైకనిపుణా తర్కవాద ప్రచారిణీ
తమాలదశ శ్యామాంగీ తమాలదళమాలినీ ॥ 120 ॥

తమాలవన సంకేతా తమాల పుష్పపూజితా
తగరీ తగరారాధ్యా తగరార్చిత పాదుకా ॥ 121 ॥

తగర స్రక్సు సంతుష్టా తగర స్రగ్విరాజితా
తగరాహుతి సంతుష్టా తగరాహుతి కీర్తిదా ॥ 122 ॥

తగరాహుతి సంసిద్ధా తగరాహుతి మానదా
తడిత్తడిల్లతాకారా తడిచ్చంచలలోచనా ॥ 123 ॥

తడిల్లతా తడిత్తన్వీ తడిద్దీప్తా తడిత్ప్రభా
తద్రూపా తత్స్వరూపేశీ తన్మయీ తత్త్వరూపిణీ ॥ 124 ॥

తత్‌స్థాన దాననిరతా తత్కర్మ ఫలదాయినీ
తత్త్వకృత్తత్త్వదా తత్త్వ తత్త్వవిత్తత్త్వ తర్పితా ॥ 125 ॥

తత్త్వార్చ్యా తత్త్వపూజ్యా చ తత్త్వార్ఘ్యా తత్త్వరూపిణీ
తత్త్వజ్ఞాన ప్రదానేశీ తత్వజ్ఞాన మోక్షదా ॥ 126 ॥

త్వరితాత్వరిత ప్రీతా త్వరితార్తి వినాశినీ
త్వరితాసన సంతుష్టా త్వరితాసవ తర్చితా ॥ 127 ॥

త్వగ్వస్త్రా త్వక్పరీధానా తరళా తరళేక్షణా
తరక్షుచర్మవసనా తరక్షుత్వగ్విభూషణా ॥ 128 ॥

తరక్షుస్తరక్షు ప్రాణా తరక్షు పృష్ఠగామినీ
తరక్షు పృష్ఠసంస్థానా తరక్షు పృష్ఠవాసినీ ॥ 129 ॥

తర్పితో దైస్తర్పణాశా తర్పణాసక్త మానసా
తర్పణానంద హృదయా తర్పణాధిపతిఃస్త తిః॥ 130 ॥

త్రయీమయీ త్రయీసేవ్యా త్రయీపూజ్యా త్రయీకథా
త్రయీభవ్యా త్రయీభావ్యా త్రయీహవ్యా త్రయీయుతా ॥ 131 ॥

త్య్రక్షరీ త్య్రక్షరేశానీ త్య్రక్షరీ శీఘ్రసిద్ధిదా
త్య్రక్షరేశీ త్య్రక్షరీస్థా త్య్రక్షరీ పురుషాస్పదా ॥ 132 ॥

తపనా తపనేష్టా చ తపస్తపన కన్యకా
తపనాంశుసమా సహ్యా తపన కోటి కాంతి కృత్‌ ॥ 133 ॥

తపనీయా తల్పగతా తల్పాతల్ప విధాయినీ
తల్పకృత్తల్పగా తల్పదాత్రీ తల్పతలాశ్రయా ॥ 134 ॥

తపనీయా తలా రాత్రీ తపనీయాంశు ప్రార్థినీ
తపనీయప్రదా తప్తా తపనీయాద్రి సంస్థితా ॥ 135 ॥

తల్పేశీ తల్పదా తల్పసంస్థితా తల్పవల్లభా
తల్పప్రియా తల్పరతా తల్ప నిర్మాణ కారిణీ ॥ 136 ॥

తరసా పూజనాసక్తా తరసా వరదాయినీ
తరసా సిద్ధి సంధాత్రీ తరసా మోక్షదాయినీ ॥ 137 ॥

తాపసీ తాపసారాధ్యా తాపసార్తి వినాశినీ
తాపసార్తా తాపసశ్రీ స్తాపన ప్రియవాదినీ ॥ 138 ॥

తాపసానంద హృదయా తాపసానంద దాయినీ
తాపసాశ్రిత పాదాబ్జా తాపసాసక్త మానసా ॥ 139 ॥

తామసీ తామసీపూజ్యా తామసీ ప్రణయోత్సుకా
తామసీ తామసీ సీతా తామసీ శీఘ్రసిద్ధిదా ॥ 140 ॥

తాలేశీ తాల భుక్తాలదాత్రీ తాలోపమస్తనీ
తాల వృక్షస్థితా తాలవృక్షజా తాలరూపిణీ ॥ 141 ॥

తార్‌క్ష్య తార్‌క్ష్య సమారూఢా తార్‌క్ష్యేశీ తార్త్యపూజితా
తార్‌క్ష్యేశ్వరీ తార్‌క్ష్యమాతా తార్‌క్ష్యేశీ వరదాయినీ ॥ 142 ॥

తాపీతు తపినీ తాప సంహంత్రీ తాపనాశినీ
తాపదాత్రీ తాపకర్త్రీ తాప విధ్వంసకారిణీ ॥ 143 ॥

త్రాసకర్త్రీ త్రాసదాత్రీ త్రాసహర్త్రీ చ త్రాసహా
త్రాసితా త్రాసరహితా త్రాస నిర్మూలకారిణీ  ॥ 144 ॥

త్రాణకృత్త్రాణ సంశీలా తానేశీ తానదాయినీ
తానగానరతా తానకారిణీ తానగాయినీ  ॥ 145 ॥

తారుణ్యామృత సంపూర్ణా తారుణ్యామృత వారిధిః
తారుణ్యామృత సంతుష్టా తారుణ్యామృత తర్చితా ॥ 146 ॥

తారుణ్యామృత పూర్ణాంగీ తారుణామృత విగ్రహా
తారుణ్య గుణసంపన్నా తారుణ్యోక్తి విశారదా ॥ 147 ॥

తాంబూలీ తాంబూలేశానీ తాంబూల చర్వణోద్యతా
తాంబూల పూరితాస్యా చ తాంబూలారుణితా ధరా ॥ 148 ॥

తాటంక రత్నవిఖ్యాతి స్తాటంక రత్నభూషిణీ
తాటంక రత్నమధ్యస్థా తాటంక ద్వయభూషిణీ ॥ 149 ॥

తిథీశా తిథిసంపూజ్యా తిథిస్థా తిథిరూపిణీ
త్రితిథి వాసినీ సేవ్యా తిథీశ వరదాయినీ ॥ 150 ॥

తిలోత్తమాది కారాధ్యా తిలోత్తమాదిక ప్రభా
తిలోత్తమా తిలప్రేక్ష్యా తిలారాధ్యా తిలార్చితా ॥ 151 ॥

తిలభుక్‌ తిలసందాత్రీ తిలతుష్టా తిలాలయా
తిలదా తిలసంకాశా తిలతైల విధాయినీ ॥ 152 ॥

తిలతైలోపలిప్తాంగీ తిలతైల సుగంధినీ
తిలాజ్య హోమసంతుష్టా తిలాజ్య హోమసిద్ధిదా ॥ 153 ॥

తిలపుష్పాంజలి ప్రీతా తిలపుష్పాంజలి ప్రియా
తిలపుష్పాంజలి శ్రేష్ఠా తిలపుష్పా ఘనాశినీ ॥ 154 ॥

తిలకాశ్రిత సిందూరా తిలకాంకిత చందనా
తిలకాహృత కస్తూరీ తిలకామోద మోదినీ ॥ 155 ॥

త్రిగుణా త్రిగుణాకారా త్రిగుణాన్విత విగ్రహా
త్రిగుణాకార విఖ్యాతా త్రిమూర్తి స్త్రిగుణాత్మికా ॥ 156 ॥

త్రిశిరా త్రిపురేశానీ త్రిపురా త్రిపురేశ్వరీ
త్రిపురేశీ త్రిలోకస్థా త్రిపురీ త్రిపురాంబికా ॥ 157 ॥

త్రిపురారి సమారాధ్యా త్రిపురారి వరప్రదా
త్రిపురారి శిరోభూషా (త్రిపురారి వరప్రదా ॥ 158 ॥

త్రిపురారీష్ట సందాత్రీ త్రిపురారీష్ట దేవతా
త్రిపురారి కృతర్ధాంగీ త్రిపురారి విలాసినీ ॥ 159 ॥

త్రిపురాసుర సంహంత్రీ త్రిపురాసుర మర్దినీ
త్రిపురాసుర సంసేవ్యా త్రిపురాసుర వర్యపా ॥ 160 ॥

త్రికుటా త్రికుటారాధ్యా త్రికూటార్చిత విగ్రహా
త్రికుటాచల మధ్యస్థా త్రికుటాచల వాసినీ ॥ 161 ॥

త్రికుటాచల సంజాతా త్రికుటాచల నిర్గతా
త్రిజటా త్రిజటేశానీ త్రిజటా వరదాయినీ ॥ 162 ॥

త్రినేత్రేశీ త్రినేత్రా చ త్రినేత్ర వరవర్ణినీ
త్రివళీ త్రివళీయుక్తా త్రిశూల వరధారిణీ ॥ 163 ॥

త్రిశూలేశీ త్రిశూలీశీ త్రిశూలభృత్త్రిశూలినీ
త్రిమనుస్త్రిమనూపాస్యా త్రిమనూపాసకేశ్వరీ ॥ 164 ॥

త్రిమను జపసంతుష్టా త్రిమనుస్తూర్ణ సిద్ధిదా
త్రిమను పూజనప్రీతా త్రిమను ధ్యానమోక్షదా ॥ 165 ॥

త్రివిధా త్రివిధా భక్తి స్త్రిమతా త్రిమతేశ్వరీ
త్రిభావస్థా త్రిభావేశీ త్రిభావ పరిపూరితా ॥ 166 ॥

త్రితత్వాత్మా త్రితత్వేశీ త్రితత్వజ్ఞాత్రి తత్వధృక్‌
త్రితత్వా చ మనప్రీతా త్రితత్వా చ మనేష్టదా ॥ 167 ॥

త్రికోణస్థా త్రికోణేశీ త్రికోణ చక్రవాసినీ
త్రికోణ చక్రమధ్యస్థా త్రికోణ బిందురూపిణీ ॥ 168 ॥

త్రికోణయంత్ర సంస్థానా త్రికోణ యంత్రరూపిణీ
త్రికోణ యంత్రసంపూజ్యా త్రికోణ యంత్రసిద్ధిదా ॥ 169 ॥

త్రివర్ణాఢ్యా త్రివర్ణేశీ త్రివర్ణోపా స్వరూపిణీ
త్రివర్ణస్థా త్రివర్ణాఢ్యా త్రివర్ణ వరదాయినీ ॥ 170 ॥

త్రివర్ణాఢ్యా త్రివర్ణార్చ్య త్రివర్గ ఫలదాయినీ
త్రివర్గాఢ్యా త్రివర్గేశీ త్రివర్గాద్య ఫలప్రదా ॥ 171 ॥

త్రిసంధ్యార్చ్యా త్రిసంధ్యేశీ త్రిసంధ్యారాధనేష్టదా
త్రిసంధ్యార్చన సంతుష్టా త్రిసంధ్యా జపమోక్షదా ॥ 172 ॥

త్రిపదారాధితప్రదా త్రిపదా త్రిపదేశ్వరీ
త్రిపదా ప్రతిపాద్యేశీ త్రిపదా ప్రతిపాదికా ॥ 173 ॥

త్రిశక్తిశ్చ త్రిశక్తీశీ త్రిశక్తీష్ట ఫల ప్రదా
త్రిశక్తేష్టా త్రిశక్తీష్టా త్రిశక్తి పరివేష్టితా ॥ 174 ॥

త్రివేణీ చ త్రివేణీ స్త్రీః త్రివేణీ మాధవార్చితా
త్రివేణీ జలసంతుష్టా త్రివేణీ స్నానపుణ్యదా ॥ 175 ॥

త్రివేణీ జలసంస్నాతా త్రివేణీ జలరూపిణీ
త్రివేణీ జలపూతాంగీ త్రివేణీ జలపూజితా ॥ 176 ॥

త్రినాడీస్థా త్రినాడీశీ త్రినాడీ మధ్యగామినీ
త్రినాడీ సంధ్య సంఛేద్యా త్రినాడీ చ త్రికోటినీ ॥ 177 ॥

త్రిపంచాశ స్త్రిరేఖా చ త్రిశక్తి పథగామినీ
త్రిపదస్థా త్రిలోకేశీ త్రికోటి కులమోక్షదా ॥ 178 ॥

త్రిరామేశీ త్రిరామార్చ్యా త్రిరామ వరదాయినీ
త్రిదశాశ్రిత పాదాబ్జా త్రిదశాలయ చంచలా ॥ 179 ॥

త్రిదశా త్రిదశప్రార్ధ్వా త్రిదశాశు వరప్రదా
త్రిదశైశ్వర్య సంపన్నా త్రిదశేశ్వర సేవితా ॥ 180 ॥

త్రియామార్చ్యా త్రియామేశీ త్రియామానంత సిద్ధిదా
త్రియామేశాధిక జ్యోత్స్నా త్రియామేశాధికాననా ॥ 181 ॥

త్రియామానాధవ త్సౌమ్యా త్రియామానాధ భూషణా
త్రియామానాధ లావణ్యా రత్నకోటి యుతాననా ॥ 182 ॥

త్రికాలస్థా త్రికాలజ్ఞా త్రికాలజ్ఞత్వ కారిణీ
త్రికాలేశీ త్రికాలార్చ్యా త్రికాలజ్ఞత్వ దాయినీ ॥ 183 ॥

తీరభుక్తీరగా తీరసరితా తీరవాసినీ
తీరభుగ్దేశ సంజాతా తీరభుగ్దేశ సంస్థితా ॥ 184 ॥

తిగ్మా తిగ్మాంశు సంకాశా తిగ్మాంశు క్రోడసంస్థితా
తిగ్మాంశు కోటిదీప్తాంగీ తిగ్మాంశు కోటివిగ్రహా ॥ 185 ॥

తీక్ష్ణా తీక్ష్ణతరా తీక్ష్ణ మహిషాసుర మర్దినీ
తీక్ష్ణా కర్త్రీలసత్పాణి స్తీక్ష్ణాసి వరధారిణీ ॥ 186 ॥

తీవ్రా తీవ్రగతి స్తీవ్రాసుర సంఘవినాశినీ
తీవ్రాష్ట నాగాభరణా తీవ్రముండ విభూషణా ॥ 187 ॥

తీర్దాత్మికా తీర్దమయీ తీర్ధేశీ తీర్దపూజితా
తీర్ధ రాజేశ్వరీ తీర్ధఫలదా తీర్ధ దానదా ॥
 188 ॥

తుములీ తుములప్రాజ్ఞీ తుములాసుర ఘాతినీ
తుముల క్షతజప్రీతా తములాంగణ నర్తకీ  189 ॥

తురగీ తురగారూఢా తురంగ పృష్ఠగామినీ
తురంగ గమనాహ్లాదా తురంగ వేగగామినీ  190 ॥

తురీయా తులనా తుల్యాతుల్య వృత్తిస్తుతుల్య కృత్‌
తులనేశీ తులారాశి స్తులారాశిత్వ సూక్ష్మ విత్‌ ॥ 191 ॥

తుంబికా తుంబికాపాత్ర భోజనా తుంబికార్థినీ
తులసీ తులసీవర్యా తులజా తులజేశ్వరీ ॥ 192 ॥

తుషాగ్నివ్రత సంతుష్టా తుషాగ్ని స్తుషరాశికృత్‌
తుషార కరశీతాంగీ తుషారకర పూర్తికృత్‌ ॥ 193 ॥

తుషారాద్రి స్తుషారాద్రిసుతా తుహినదీధితిః
తుహినాచలకన్యా చ తుహినాచల వాసినీ ॥ 194 ॥

తుర్యవర్గేశ్వరీ తుర్యవర్గదా తుర్యవేదదా
తుర్యవర్యాత్మికా తుర్యతుర్యేశ్వర స్వరూపిణీ ॥ 195 ॥

తుష్టిదా తుష్టి కృత్తుష్టి స్తూణీరద్వయ పృష్టదృక్‌
తుంబురా జ్ఞానసంతుష్టా తుష్ట సంసిద్ది దాయినీ ॥ 196 ॥

తూర్ణరాజ్యప్రదా తూర్ణగద్గదా తూర్ణపద్యదా
తూర్ణ పాండిత్య సందాత్రీ తూర్ణపూర్ణ బలప్రదా ॥ 197 ॥

తృతీయాచ తృతీయేశీ తృతీయా తిధిపూజితా
తృతీయా చంద్రచూడేశీ తృతీయా చంద్రభూషణా ॥ 198 ॥

తృప్తిప్తాప్తికరీ తృస్తృ తృష్ణా తృష్ణా వివర్ధినీ
తృష్ణాపూర్ణకరీ తృష్ణానాశినీ తృషితా తృషా ॥ 199 ॥

త్రేతా సంసాధితా త్రేతా త్రేతాయుగ ఫలప్రదా
త్రైలోక్యపూజ్యా త్రైలోక్యదాత్రీ త్రైలోక్య సిద్ధిదా ॥ 200 ॥

త్రైలోక్యైశ్వరతాదాత్రీ త్రైలోక్య పరమేశ్వరీ
త్రైలోక్యమోహనేశానీ త్రైలోక్య రాజ్యదాయినీ ॥ 201 ॥

త్రైత్రిశాఖేశ్వరి తైత్రిశాఖాతైత్ర వివేకదా
తోరణాన్విత గేహస్థా తోరణాసక్త మానసా ॥ 202 ॥

తోలకా స్వర్ణ సందాత్రీ తోలకాస్వర్ణ కంకణా
తోమరాయుధరూపా చ తోమరాయుధ ధారిణీ ॥ 203 ॥

తౌర్య త్రికేశ్వరీ తౌర్య త్రికీ తౌర్యత్రికోత్సుకీ
తంత్రకృత్‌ తంత్రవత్సూక్ష్మా తంత్రమంత్ర స్వరూపిణీ ॥ 204 ॥

తంత్రకృత్తంత్ర సంపూజ్యా తంత్రేశీ తంత్రసమ్మతా
తంత్రజ్ఞా తంత్రవత్తంత్రసాధ్యా తంత్రస్వరూపిణీ ॥ 205 ॥

తంత్రస్థా తంత్రజా తంత్రీ తంత్రభృత్తంత్ర మంత్రదా
తంత్రాద్యా తంత్రగా తంత్రా తంత్రార్చ్యా తంత్రసిద్ధిదా ॥ 206 ॥

ఫలశ్రుతి
ఇతితే కథితం దివ్యం ఋతుకోటి ఫలప్రదమ్‌
నామ్నాం సహస్రం తారాయాస్తకాద్యం సుగోపితమ్‌ ॥ 207 ॥

దానం యజ్ఞః తపస్తీర్థం వ్రతం చానశనాదికమ్‌
ఏకైక నామజం పుణ్యం సంధ్యాసుగది తమ్మయా ॥ 208 ॥

గురౌ దేవే తథా మంత్రే యస్యస్యాన్నిశ్చలా మతిః
తస్యైవ స్తోత్ర పాఠేస్మిన్‌ సంభవే దధికారితా ॥ 209 ॥

మహాచీన క్రమాభిన్న షోడన్యస్త కళేబరః
క్రమదీక్షాన్వితో మంత్రీ పఠేదేతన్నచాన్యధా ॥ 210 ॥

గంధపుష్పాదిభి ర్ద్రవైః మకారైః పంచకైర్ద్విజః
సంపూజ్య తారాం విధివ త్పఠేదేత దనన్యధీః ॥ 211 ॥

అష్టమ్యాంచ చతుర్దశ్యాం సంక్రాంతౌ రవివాసరే
శని భౌమదినే రాత్రౌ గ్రహణే చంద్ర సూర్యయోః ॥ 212 ॥

తారారాత్రౌ కాలరాత్రౌ మోహరాత్రౌ విశేషతః
పఠనాన్మంత్ర సిద్ధిస్యాత్‌ సర్వజ్ఞత్వం ప్రజాయతే ॥ 213 ॥

శ్మశానే ప్రాంతరే రమ్యే శూన్యాగారే విశేషతః
దేవాగారే గిరౌ వాపి స్తవపారాయణం చరేత్‌ ॥ 214 ॥

బ్రహ్మహత్యా సురాపానం స్తేయం స్త్రీ గమనాదికమ్‌
గురుతల్పే తథా చాన్యత్‌ పాతకంనశ్యతి ధ్రువమ్‌ ॥ 215 ॥

లతా మధ్యగతో మంత్రీ శ్రద్దయా చార్చయేద్యది
ఆకర్షయేత్తదా రంభా మ్మేనా మపిత థోర్వశీమ్‌ ॥ 216 ॥

సంగ్రామ సమయే వీరస్తారా సామ్రాజ్య కీర్తనాత్‌
చతురంగ చయం జిత్వా సర్వసామ్రాజ్య భాగ్భవేత్‌ ॥ 217 ॥

నిశార్ధే పూజనాంతే చ ప్రతినామ్నా ప్రపూజయేత్‌
ఏకైకం కరవీరాద్యై ర్మందారై ర్నీలవారిజైః ॥ 218 ॥

గద్యపద్యమయీ వాణీ భూభోజ్యా చ ప్రవర్తతే
పాండిత్యం సర్వశాస్త్రేషు వాదీ త్రస్యతి దర్శనాత్‌ ॥ 219 ॥

వహ్నిజాపాంతకై రేతైస్తారాద్యైః ప్రతినామభిః
రాజన్యం సర్వరాజేషు పరకాయ ప్రవేశనమ్‌ ॥ 220 ॥

అంతర్థానం ఖేచరత్వం బహుకాయ ప్రకాశనం
గుటికాపాదుకా పద్మావతీ మధుమతీ తథా ॥ 221 ॥

రసం రసాయనాః సర్వాః సిద్ధయః సముపస్థితాః
కర్పూరాగురు కస్తూరీ చందనై స్సంయుతైర్జలైః ॥ 222 ॥

మూల సంపుటి తేనైవ ప్రతినామ్నా ప్రపూజయేత్‌
యక్ష రాక్షస గంధర్వా విద్యాధర మహోరగాః ॥ 223 ॥

భూతప్రేత పిశాచాద్యా డాకినీ శాకినీ గణాః
దుష్టా భైరవ భేతాళా కూష్మాండా కిన్నరీ గణాః ॥ 224 ॥

భయభీతాః పలాయంతే తేజసా సాధకస్య చ
మంత్రజ్ఞానే సముత్పన్నే ప్రతినామ్నా విచారయేత్ ॥ 225 ॥

మంత్రసంపుటి తేనైవ తస్య శాంతిర్భవేద్ద్రువమ్‌ 
వనితా వశమాయాంతి దాస్యతా యాంతిపార్థివాః ॥ 226 ॥

అగ్నయః శీతతాం యాంతి జాపకస్య చ భాషణాత్‌
ఏకావర్తన మాత్రేణ రాజభీతి నివారణమ్‌ ॥ 227 ॥

వేలావర్తన మాత్రేణ పశువృద్ధిః ప్రజాయతే
దశావృత్యా ధనప్రాప్తిః వింశత్యా రాజ్య మాప్నుయాత్‌ ॥ 228 ॥

శతావృత్యా గృహేతస్య చంచలా నిశ్చలా భవేత్‌
గంగా ప్రవాహవద్వాణీ ప్రలాపాదపి జాయతే ॥ 229 ॥

పుత్రపౌత్రాన్వితో మంత్రీ చిరంజీవీ తు దేవవత్‌
శతద్వయా వర్తనేన దేవవత్పూజ్యతే జనైః ॥ 230 ॥

శతపంచక మావర్త్య సభవేత్‌ భైరవోపమః
సహస్రవర్తనేనైవ మంత్ర తస్య స్వసిద్ధిదః ॥ 231 ॥

తస్మిన్‌ ప్రవర్తతే సర్వసిద్ధి స్సర్వార్థసాధినీ
పాదుకాం చ వేతాళా పాతాళ గమనాదికమ్‌ ॥ 232 ॥

వివిధా యక్షిణీ సిద్ధిర్వాక్‌ సిద్ధిస్తస్య జాయతే
శోషణం సాగరానాంచ ధరాయా భ్రమణం తథా ॥ 233 ॥

నవీన సృష్టి నిర్మాణం సర్వ కర్తుం క్షమోభవేత్‌
అయుతా వర్తనేనైవ తారాం పశ్యతి చక్షుషా ॥ 234 ॥

లక్షావర్తన మాత్రేణ తారాపతి సమోభవేత్‌
నకించిద్దుర్లభం తస్య జీవన్ముక్తే ర్హిభూతలే ॥ 235 ॥

కల్పాంతే న తు తత్పశ్చాత్‌ తారా సాయుజ్య మాప్నుయాత్‌
యద్ధితారా సమా విద్యా నాస్తి తారుణ్య రూపిణీ ॥ 236 ॥

న చైతత్సదృశం స్తోత్రం భవేద్‌ బ్రహ్మాండమండలే
వక్త్రకోటి సహస్రైస్తు జిహ్వాకోటి శతైరపి ॥ 237 ॥

నశక్యతే ఫలం వక్తు మయాకల్ప శతైరపి
చుంబకే నిందకే దుష్టే పిశునే జీవహింసకే ॥ 238 ॥

సంగోప్యం స్తోత్రమేతత్త ద్దర్శనేనైవ కుత్రచిత్‌
రాజ్యం దేయం ధనం దేయం శిరోదేయ మధాపి వా ॥ 239 ॥

న దేయం స్తోత్రవర్యంతు మంత్రాదపి మహోద్యతమ్‌
అనులోమ విలోమాభ్యా మ్మూల సంపుటితం త్విదమ్‌ ॥ 240 ॥

లిఖిత్వా భూర్జపత్రాదౌ గంధాష్టక పురస్సరైః
ధారయేద్దక్షిణే బాహౌ కంఠే వామభుజే తథా ॥ 241 ॥

తస్య సర్వార్థ సిద్ధి స్యా ద్వహ్నినా నైవ దహ్యతే
తద్గాత్రం శస్త్ర సంఘైశ్చ భిద్యతేన కదాచన ॥ 242 ॥

సభూమి వలయే పుత్ర విచరే ద్భైరవోపమః
వంధ్యాపి లభతే పుత్రా న్నిర్ధనో ధన మాప్నుయాత్‌
నిర్విఘ్నో లభతే విద్యాంతర్క వ్యాకరణాదికామ్‌ ॥ 
243 

ఇత నిగదితమస్యాస్తాది నామ్నాం సహస్రం
వరద మనునిధానమ్‌ దివ్యసామ్రాజ్య సంజ్ఞమ్‌
విధిహరిగిరిశాదౌ శక్తిదానైక దక్షం
సమవిధి పఠనీయం కాళితారా సమజ్ఞైః ॥ 244 ॥

ఇతి శ్రీ బ్రహ్మ యామళే తారాయాస్తకారాది సహస్రనామస్తోత్రం సంపూర్ణం 

Wednesday, August 20, 2025

Sri Tara Devi Ashtottara Sata Namavali - శ్రీ తారా దేవి అష్టోత్తర శత నామావళి

శ్రీ తారా దేవి అష్టోత్తర శత నామావళి


ఓం తారాయై నమః
ఓం తారిణ్యై 
నమః
ఓం తీక్షణాయై నమః
ఓం తీక్ష్ణదంష్ట్రా
యై నమః
ఓం తిలప్రభా
యై నమః
ఓం కరాళవదనాయై నమః
ఓం కాళ్యై నమః
ఓం కులమార్గప్రవర్ధిన్యై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కౌమార్యై నమః || 10 || 

ఓం రాజరాజేశ్వర్యై నమః
ఓం రమాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శక్తిభైరవ్యై నమః
ఓం భయహారిణ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాలక్ష్మ్యే నమః
ఓం మహావాణ్యై నమః
ఓం మహోదర్యై నమః || 20 || 

ఓం యింద్రాక్ష్యై 
నమః
ఓం చ్చిన్నమస్తాయై నమః
ఓం శ్యామలాంగ్యై నమః
ఓం కృశోదర్యై నమః
ఓం పునీతా
యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పుణ్యా
యై నమః
ఓం ప్రళయాంగారలోచనా
యై నమః
ఓం కాళరాత్రై నమః
ఓం మహాకాళకామిన్యై నమః || 30 || 

ఓం క్రియాయై నమః
ఓం కళాయై నమః
ఓం దళితేందీవరా
క్ష్యై నమః
ఓం దానవేంద్రమర్థిన్యై నమః
ఓం లోకక
ర్త్యై నమః
ఓం కర్తృహస్తాయై నమః
ఓం కపాలోత్పలధారిణ్యై నమః
ఓం ముండహస్తాయై నమః
ఓం భుజంగ కృతకుండలాయై నమః
ఓం సకల విద్యాప్రదాత్య్రై నమః || 40 || 

ఓం అర్దేందుమౌలిరమలాయై నమః
ఓం పరమా
యై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం పూర్ణేందుబింబవదనాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం ఇందుకళాయై నమః
ఓం వరాయై నమః
ఓం చాముండాయై నమః
ఓం చండవీర్యాయై నమః
ఓం చండదోర్దండ ఖండిన్యై నమః || 50 || 

ఓం భైరవవ్రజసేవితాయై నమః
ఓం గణేశగుహమాతాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గుర్వ్యై నమః
ఓం గణప్రియాయై నమః
ఓం దినే మండలగతాయై నమః
ఓం చంద్రమండలమధ్యగాయై నమః
ఓం నక్షత్రాయై నమః
ఓం క్షత్రహస్తా
యై నమః
ఓం వహ్నిమండల వాసిన్యై నమః || 60 || 

ఓం వాయుమండలస్థితాయై నమః
ఓం నదిరూపిణ్యై నమః
ఓం మరుత్యై నమః
ఓం బ్రహ్మా
ణ్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం శివాయై నమః
ఓం శాంతా
యై నమః
ఓం సనాతన్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం భీమరూపాయై నమః
 || 70 ||

ఓం భీమాయై నమః
ఓం భవతారి
ణ్యై నమః
ఓం అంబికాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చండ్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం దుర్గార్తినాశిన్యై నమః
ఓం విశ్వవాగ్రూపి
ణ్యై నమః
ఓం నీలాయై నమః
ఓం కాళింద్యై నమః
 || 80 ||

ఓం జాహ్నవ్యై నమః
ఓం మహ్యై నమః
ఓం ఆకాశవాసిన్యై నమః
ఓం భుంజగవరమాలిన్యై నమః
ఓం గంగా
యై నమః
ఓం బాలాయై నమః
ఓం ధూమావత్యై నమః
ఓం ధన్యాయై నమః
ఓం బగళాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
 || 90 ||

ఓం షోడశకళాయై నమః
ఓం ఖడ్గఖర్పరధారి
ణ్యై నమః
ఓం ఉద్యదిందు ప్రతీకాశాయై నమః
ఓం కోటి సూర్య సమప్రభాయై నమః
ఓం మహారాజ్ఞై నమః
ఓం ప్రభావిన్యై నమః
ఓం కపర్దిన్యై నమః
ఓం మహామాయా
యై నమః
ఓం మహోత్సాహాయై నమః
ఓం మంత్రసిద్ధిదాయిన్యై నమః
 || 100 ||

ఓం తమోరాశి వినాశిన్యై నమః
ఓం నిశుంభహరాయై నమః
ఓం తపఃసిద్ధిదా
యై నమః
ఓం తపఃఫలదాయి
న్యై నమః
ఓం తపోవశ్యాయై నమః
ఓం తపోవిఘ్నవినాశిన్యై నమః
ఓం జ్ఞానప్రదాయిన్యై నమః
ఓం శ్రీ నీలసరస్వత్యై నమః
 || 108 ||

|| శ్రీ తారాదేవి అష్టోత్తర శతనామావళి సమాప్తం || 

Sri Tarambha Ashtottara Sata Nama Stotram - శ్రీ తారామ్భా అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ తారామ్భా అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ శివ ఉవాచ
తారిణీ తరళా తన్వీ తారా తరుణవల్లరీ ।
తారరూపా తరీ శ్యామా తనుక్షీణపయోధరా ॥ 01


తురీయా తరుణా తీవ్రగమనా నీలవాహినీ ।
ఉగ్రతారా జయా చండీ శ్రీమదేకజటాశిరా ॥ 02


తరుణీ శాంభవీ ఛిన్నఫాలా స్యాద్భద్రదాయినీ ।
ఉగ్రా ఉగ్రప్రభా నీలా కృష్ణా నీలసరస్వతీ 
॥ 03 

ద్వితీయా శోభనా నిత్యా నవీనా నిత్యభీషణా ।
చండికా విజయారాధ్యా దేవీ గగనవాహినీ 
॥ 04 

అట్టహాసా కరాళాస్యా చరాస్యాదీశపూజితా ।
సగుణా
సగుణారాధ్యా హరీంద్రాదిప్రపూజితా ॥ 05 

రక్తప్రియా చ రక్తాక్షీ రుధిరాస్యవిభూషితా |
బలిప్రియా బలిరతా దుర్గా బలవతీ బలా 
॥ 06 

బలప్రియా బలరతా బలరామప్రపూజితా ।
అర్థకేశేశ్వరీ కేశా కేశవా స్రగ్విభూషితా 
॥ 07 

పద్మమాలా చ పద్మాక్షీ కామాఖ్యా గిరినందినీ |
దక్షిణా చైవ దక్షా చ దక్షజా దక్షిణేరతా 
॥ 08 

వజ్రపుష్పప్రియా రక్తప్రియా కుసుమభూషితా ।
మాహేశ్వరీ మహాదేవప్రియా పన్నగభూషితా 
॥ 09 

ఇడా చ పింగళా చైవ సుషుమ్నాప్రాణరూపిణీ |
గాంధారీ పంచమీ పంచాననాదిపరిపూజితా 
॥ 10 

తథ్యవిద్యా తథ్యరూపా తథ్యమార్గానుసారిణీ ।
తత్త్వరూపా తత్త్వప్రియా తత్త్వజ్ఞానాత్మికా
నఘా ॥ 11 

తాండవాచారసంతుష్టా తాండవ ప్రియకారిణీ ।
తాలనాదరతా క్రూరతాపినీ తరణిప్రభా 
॥ 12 

త్రపాయుక్తా త్రపాముక్తా తర్చితా తృప్తికారిణీ ।
తారుణ్యభావసంతుష్టా శక్తిర్భక్తానురాగిణీ 
॥ 13 

శివాసక్తా శివరతిః శివభక్తిపరాయణా ।
తామ్రద్యుతిస్తామ్రరాగా తామ్రపాత్రప్రభోజినీ 
॥ 14 

బలభద్రప్రేమరతా బలిభు-గ్బలికల్పనీ ।
రామప్రియా రామశక్తీ రామరూపానుకారిణీ 
॥ 15 

ఇత్యేతత్కథితం దేవి రహస్యం పరమాద్భుతం |
శ్రుత్వామోక్షమవాప్నోతి తారాదేవ్యాః ప్రసాదతః 
॥ 16 

య ఇదం పఠతి స్తోత్రం తారాస్తుతిరహస్యజం ।
సర్వసిద్ధియుతో భూత్వా విహరేత్‌ క్షితి మండలే 
॥ 17 

తస్యైవ మంత్రసిద్ధిః స్యాన్మయి భక్తిరనుత్తమా ।
భవత్యేవ మహామాయే సత్యం సత్యం న సంశయః 
॥ 18 

మందే మంగళవారే చ యః పఠేన్నిశి సంయుతః ।
తస్యైవ మంత్రసిద్ధిస్స్యాద్గాణాపత్యం లభేత సః 
॥ 19 

శ్రద్ధయా
శ్రద్ధయా వాపి పఠేత్తారా రహస్యకం ।
సో
చిరేణైవకాలేన జీవన్ముక్తశ్శివో భవేత్‌ ॥ 20 

సహస్రావర్తనాద్దేవి పురశ్చర్యాఫలం లభేత్‌ 1
ఏవం సతతయుక్తా యే ధ్యాయన్తస్త్వాముపాసతే 
॥ 21 

తే కృతార్థా మహేశాని మృత్యుసంసారవర్త్మనః 
॥ 22 

॥ ఇతి శ్రీ స్వర్ణమాలాతంత్రే తారామ్బాష్టోత్తరశతనామ స్తోత్రమ్‌ 

Sri Tara Devi Ashtottara Sata Nama Stottram - శ్రీ తారా దేవి అష్టోత్తర శతనామ స్తోత్త్రం

శ్రీ తారా దేవి అష్టోత్తర శతనామ స్తోత్త్రం

ప్రత్యాలీఢపదాం ఘోరాం ముండ మాలా విభూషితామ్‌
ఖర్వాం లంబోదరీం భీమాం వ్యాఘ్ర చర్మావృతాం కటౌ ॥ 01 


నవయౌవన సంపన్నాం పంచముండ విభూషితామ్‌
చతుర్భుజాం లలజ్జిహ్వాం మహాభీమాం వర ప్రదామ్‌ ॥ 02 


ఖడ్గ క
ర్త్రీధరాం సవ్యే వామే ముండోత్పలాన్వితామ్‌
బాలార్క మండలాకార లోచనత్రయ భూషితామ్‌ ॥ 03 


పింగోగ్రైక జటాం ధ్యాయే మౌలా వక్షోభ్య భూషితామ్‌
నీలనాగ జటాజూటాం శ్వేతాహికృత కుండలామ్‌ ॥ 04 


పీతాహికం కణోపేతాం ధూమ్రాహి బాహు భూషణాం
శ్యామ నాగోపవీతాం చ శుభ్రాహి హార భూషణామ్‌ ॥ 05 


శ్వేతనాగ లసత్కాంచీం పాటలా హి పదద్వయామ్‌
పార్శ్వద్వయే లంబమాన నీలేందీవరమాలికామ్‌ ॥ 06 


ప్రజ్వలత్ప్రేత భూమధ్య స్థితాం దంష్ట్రా కరాళినీమ్‌
శవకంఠ పదద్వంద్వ వామదక్ష పదద్వయామ్‌ ॥ 07 


సావేశ స్మేరవదనాం భక్తానామభయ ప్రదామ్‌
ఏకదాంకస్థితాయావై నిశమ్య వచనం శ్రియః ॥ 08 


ఉవాచ కృశ మధ్యాం గాం పీనోన్నత పయోధరామ్‌
జఘనాభర భరితామ్‌ సర్వాభరణ భూషితామ్‌ ॥ 09 


సముద్యదించు వదనాం విలసన్నేత్ర పంకజః
విష్ణు స్త్రీలోకాధిపతిస్సు గతస్త్వం వదస్వమే ॥ 10 


శ్రీ విష్ణు ఉవాచ :
ప్రీత్యాసత్యం దయాగార యద్యహం తవవల్లభా
సాధ్విత్వం సుకుమారాంగి ఉన్నత స్తనమండలే 
॥ 11 

సాధువాదం భవత్యాత్ర కథితం మాం ప్రతిప్రియే
శృణుష్వేదం భద్రమూర్తే చంచలే చటులేక్షణే ॥ 12 


నామేదం నీలతారిణ్యా అష్టోత్తర శతం పరమ్‌
ఇదమేవ పురావజ్రీ పృష్టవాన్‌ చంద్రశేఖరమ్‌ ॥ 13 


ఉపదిష్టం తేన తస్మై తేనజాత 
స్త్రిలోకరాట్‌
శృణుష్వ సావధానేన చేతసా చంచలే ధ్రువం ॥ 14 


అపరీక్షిత శిష్యాయ నదేయం సత్యమేవహి
కులీనాయ ప్రదాతవ్యం సుధియేశాంత చేతసే ॥ 15 


అభక్తో
భ్యోపి పుత్రేభ్యో నదేయం యస్యకస్యచిత్‌
మంత్రోద్దారమిమం భద్రే ఆదావుచ్చార్య సాధకః ॥ 16 


తదేతన్నీల తారాయా స్త్సవ రాజం పఠేత్సుధీః
మంత్రోద్దారం ప్రవక్ష్యామి సావధానేన త
ఛ్చృణు ॥ 17 

ఉద్దారో మంత్రరాజస్య సర్వపాప ప్రణాశకః
జీమూత వర్త్మ దహనస్థిత మిందు యుక్త ॥ 18 

ముద్యద్దినేశ్వర నిభం తల దేవిబీజమ్‌
ఆద్యం జనో యది జపేజ్జగతాం భవాని ॥ 19 

లోకత్రయం సవశయే త్స్వ సరస్వతీభిః
శుక్రం హరిస్థల మనలేందు శాంత యుక్తం ॥ 20 

స్త్రీం బీజమంబ తవ నాజపతే కదాచిత్‌
ముక్తావళీలసదురోజ భరాః సునేత్రా ॥ 21 

రంభాదయోపి వశగాః ప్రభవంతి తస్య
ఖం వామకర్ణ కలితం శశిశేఖరాధ్యం ॥ 22 

కూర్చాభిధం జనని భీజమిదం జపేద్యః
పంచాశ దుగ్ర నరముండ విశాలమావే
సంహత మస్య చరణః క్షమతే త్రిలోకీమ్‌ ॥
 23 

వర్ణత్రయాత్మకో మంత్రః త్త్రిలోక మోహన క్షమః
సచాయం నీలతారిణ్యా మూలమంత్ర ఉదాహృతః ॥
 24 

ప్రణవాద్యా మహావిద్యా షడంతా చోగ్ర తారిణీ
ఆదిబీజం వినాదేవి ప్రోదితైకజటా పునః ॥ 25 

ఋషిన్యాసం కరన్యాస మంగన్యాసం విధాయ చ
ధ్యాయేత్తారాం మహాదేవీం మానసే హంసగామినీమ్‌ ॥ 26 

ప్రళయజలధి మధ్యే స్ఫీత పుల్లాంబుజ
స్ధాం 
జలదపటలనీలాం లోలజిహ్వాం త్రినేత్రాం ॥ 27 

శివశవ హృదివాసాం ఆసవా చ్చూర్ణితాక్షీ
ముడుగణ కృతహారా మాశ్రయే నీలతారాం ॥ 28 

ఏవం ధ్యాయన్మహా విద్యాం పిబన్నపి చ కారణమ్‌
అదన్నపి చ మాంసం చ స్వరాజం పఠేత్సుధీః ॥ 29 

అస్య స్తోత్రస్యాబ్ధిసుతే ఋషి రాస్తే స్వయం హరిః
ఛందోనుష్టుప్‌ తథాప్రోక్తం దేవతా భవతారిణీ ॥ 30 

స్త్రీం తారా తారిణీ తీక్ష్ణా తీక్ష్ణ దంష్ట్రా తిలప్రభా
కరాళ వదనా కాళీ కులమార్గ ప్రవర్థినీ ॥ 31 

కాత్యాయనీ చ కౌమారీ రాజరాజేశ్వరీ రమా
శ్రీవిద్యా శాంభవీ శక్తిః భైరవీ భయహారిణీ ॥ 32 

మహాకాళీ మహాలక్ష్మీ ర్మహావాణీ మహోదరీ
ఇంద్రాక్షీ ఛిన్నమస్తా చ శ్యామలాంగీ కృశోదరీ ॥ 33 

పునీతా పార్వతీ పుణ్యా ప్రళయాంగారలోచనా
కాలరాత్రి ర్మహాకాల కామినీ చ క్రియా కలా ॥ 34 

దళితేందీవరాక్షీ చ దానవేంద్ర విమర్దినీ
లోకకర్త్రీ కర్తృహస్తా కపాలోత్పల ధారిణీ ॥ 35 
  
ముండహస్తా ముండమాలా భుజంగ కృతకుండలా
అర్థేందు మౌళిరమలా పరమా పరమేశ్వరీ ॥ 36 

పూర్ణేందు బింబవదనా వారాహేందు కళా వరా
చాముండా చండవీర్యా చ చండదోర్దండ ఖండినీ ॥ 37 

ప్రేతమండల మధ్యస్థా భైరవ వ్రజసేవితా
గణేశ గుహమతా చ గౌరీ గుర్వీ గణ ప్రియా ॥ 38 

దినేశ మండలగతా చంద్రమండల మధ్యగా
నక్షత్రా క్షత్రహస్తా చ వహ్నిర్వాయుర్జలం మరుత్‌ ॥ 39 

బ్రహ్మణీ వైష్ణవీ శైవీ శివా శాంతా సనాతనీ
భవానీ భీమరూపా చ భీమాచ భవతారిణీ ॥ 40 

అంబికా చండికా చండీ దుర్గాదుర్గారి నాశినీ
విశ్వ వాగ్రూపిణీ నీతా కాళిందీ జాహ్నవీ మహీ ॥ 41 

ఆకాశవాసినీ గంగా భుజంగ పరమాలినీ
బాలా ధూమవతీ ధన్యా బగళా భువనేశ్వరీ ॥ 42 

షోడశీ షోడశకళా ఖడ్గ కర్పర ధారిణీ
ఉద్యదిందు ప్రతీకాశా కోటిసూర్య సమప్రభా ॥ 43 

ఠక్కురాజ్ఞీ మహారాజ్ఞీ పట్టరాజ్ఞీ ప్రభావినీ
కపర్దినీ కోటిమూర్తి ర్మహామాయా మహోత్సవా ॥ 44 

ఇతి తే కథితం లోలకుండలోన్మండితాననే
అష్టోత్తర శతం నామ తారాయా స్తూర్ణ సిద్ధిదమ్‌ ॥ 45 

ఫలశ్చతి :
స్తవరాజం పఠే దేవమనాకుల మనోనరః
షణ్‌మాసాంత స్త్రి సంధ్యాయాం రాజానం వశమానయేత్‌ ॥ 46 

షోఢావిన్యస్త దేహాయ క్రమదీక్షాన్వితాయ చ
మహాచీన క్రమజ్ఞాయ దేయ మేతం చ నా న్యథా ॥ 47 

ఏకైక నామజం పుణ్యమసంఖ్య ఫలదం మహత్‌
నిశీధే త్రిరిదం జస్త్వా మహామాహేశ్వరో భవేత్‌ ॥ 48 

విధానమధ వక్ష్యామి విధేయం భక్త సత్తమైః
తాంబూల పూరిత ముఖః సుదృఢః సాధకాగ్రణీః ॥ 49 

ఉపచారైరనేకైశ్చ పూజయేత్‌ పరమేశ్వరీమ్‌
సింధూర వేదికామధ్యే పాదావుల్లిఖ్య యత్నతః ॥ 50 

మహాదేవీం యజేత్తత్ర జగదీశ నమస్కృతామ్‌
సింధూర కరవీరాద్యైః కుసుమైః లోహితైః సితైః ॥ 51 

జవాజన్యై ర్భిల్వదళైః విష్ణు క్రాంత తరూద్భవైః
జలస్థల సరోజైశ్చ పారిజాత ప్రసూనకైః ॥ 52 

కుందైశ్చ కర్ణికారైశ్చ ప్రసన్న వదన ప్రియే
నైవేద్యై రాసవాద్యైశ్చ పంచభిర్మైశ్చ పూపకైః ॥ 53 

అన్యైశ్చ వివిధైర్ద్రవ్యైః ఘృతాక్తైర్విశ్వమాతరమ్‌
పూజయేత్సాధక శ్రేష్ఠో భక్త్యా నిశ్చల మానసః ॥ 54 

కరవీర రక్తపుప్పైః సతిలైః సయవాక్షతైః
మధుసిక్తైః శర్కరాద్యైః పాయసాన్నేన సంయుతైః ॥ 55 

ప్రతినామ నిశీధేహి ఘృతాక్తై ర్హవనం చరేత్‌
నమస్కృత్య మహాదేవీం బలిం దద్యాద తంద్రితః ॥ 56 

మాంస మాషాన్న శాకాజ్య పాయసా పూపకాదికైః
చతుష్పధే ముక్త కేశ ఆసవా చూర్ణితేక్షణః ॥ 57 

ఉక్తమేతద్విధత్తే యః ససాక్షాచ్చంకరో భవేత్‌
గద్యపద్యమయీ వాణీ తస్యగంగా ప్రవాహవత్‌ ॥ 58 

వక్త్ర శుభ్రాంశు బింబే వై ప్రలాపాదపి జాయతే
నేత్రారవిందయుగళే కమలా నిశ్చలా భవేత్‌ ॥ 59 

చక్రవర్తి శిరోరత్న నిర్ఘృష్ట చరణోజనః
భవేత్తమను గచ్చంత్యః సేవంతే ఊర్వశీ ముఖాః ॥ 60 

స్తంభనం జంభనం చేందోర్మోహనం జగతామపి
శోషణం సాగరాణాం చ కర్తుం స క్షమతే పుమాన్‌ ॥ 61 

మహాత్మా స చిరంజీవన్ముక్త స్త్యక్త వికల్పనః
కీర్త్యా శీతద్యుతిః తస్యా చ్చండరశ్మిః ప్రతాపతః ॥ 62

తత్సౌందర్యేణ వృత్తోరు లజ్జాకృన్మీన కేతనః
రిపూణాం కాలరూపస్యా త్సర్వ శక్త్యా స్వయం శివః ॥ 63 ॥

గురుః శాస్త్రార్థవే త్తౄణాం జ్ఞాతాభూత భవిష్యయోః
నిర్భయో విచరేల్లోకే విహారీ భైరవో యథా ॥ 64 ॥

భూర్జపత్రే లిఖిత్వేదం రసేన జతు జన్మనా
రక్తవర్ణేన నవ్యేన వేష్టయేత్పట్టవాససా ॥ 65 ॥

సువర్ణ గుటికాస్థం చ దోషిదక్షే నిదారయేత్‌
పుమాం స్త్రీ వామబాహౌ తచ్చిత్తేప్సిత ఫలప్రదమ్‌ ॥ 66 ॥

యః పఠేత ప్రయతః ప్రాతః ప్రియ ఆవర్ష ముత్సుకః
స లక్ష్మీరాజిత గృహః సర్వవిద్యా విశారదః ॥ 67 ॥

య ఇదం ద్వాదశావృత్యా జపే జ్జఘనమధ్యగః
నిత్యం నిధువనాసక్తః సవాచాపటుతాం వ్రజేత్‌ ॥ 68 ॥

ఈశామీశ గణేశ వందిత పదాం సంసార విద్యామయీం
పైష్టీపాన పరాయణాం యదఖిల బ్రహ్మాండ వాగ్రూపిణీం ॥ 69 ॥

ఉద్యద్దీప్త కళాం పరాపరకలాం సంసార సారాం పరామ్‌
తారాం నీలసరోజ రాజిత కరాం తామీశ్వరీ మాశ్రయే ॥ 70 ॥

ఇతి శ్రీ విష్ణు యామళే శ్రీ తారాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం 

Kubera Mantra - కుబేర మంత్రం

కుబేర మంత్రం:
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యధిపతయే
ధన ధాన్య సమృద్ధి మే దేహి దాపయా స్వాహా 

లక్ష్మీ కుబేర మంత్రం:
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం శ్రీం క్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమః
 

ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట-లక్ష్మీ
మమ గృహే ధనం పురయ పూరయ నమః ॥

॥ ఓం శ్రీం హ్రీం ఐం కుబేరాయ లక్ష్మ్యై కమలా ధారిణై ధన ఆకర్షిణ్యై స్వాహా ॥

శ్రీ కుబేర మంత్రం:
ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం శ్రీం క్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః 

ఓం ధనాధ సౌభాగ్య లక్ష్మీకుబేర 
వైశ్రవణాయమమకార్య సిద్ధిం కురుస్వాహా

కుబేర గాయత్రీ మంత్రం:
ఓం యక్ష రాజాయ విద్మహే ।
వైశ్రవణయ ధీమహి।
తన్నో కుబేర ప్రచోదయాత్ 

కుబేర గాయత్రీ మంత్రం:
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యధిపతయే।
ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్ ॥

Friday, August 1, 2025

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి


శ్రీతారిణ్యై
 నమః ।
శ్రీతరలాయై నమః ।
శ్రీతన్వ్యై నమః 

శ్రీతారాయై నమః ।
శ్రీతరుణవల్లర్యై నమః ।
శ్రీతీవ్రరూప
యై నమః ।
శ్రీతర్యై నమః ।
శ్రీశ్యామాయై నమః ।
శ్రీతనుక్షీణాయై నమః ।
శ్రీపయోధరాయై నమః । 10

శ్రీతురీయాయై నమః ।
శ్రీతరుణాయై నమః ।
శ్రీతీవ్రాయై నమః ।
శ్రీతీ
వ్రగమనాయై నమః ।
శ్రీనీలవాహిన్యై నమః ।
శ్రీఉగ్రతారాయై నమః ।
శ్రీజయాయై నమః ।
శ్రీచణ్డ్యై నమః ।
శ్రీశ్రీమదేకజటాయై నమః ।
శ్రీశివా
యై నమః । 20

శ్రీతరుణ్యై 
నమః ।
శ్రీశామ్భవ్యై నమః ।
శ్రీఛిన్నభాలా
యై నమః ।
శ్రీభద్రతారి
ణ్యై నమః |
శ్రీఉగ్రా
యై నమః ।
శ్రీఉగ్రప్రభా
యై నమః ।
శ్రీనీలా
యై నమః ।
శ్రీకృష్ణా
యై నమః ।
శ్రీనీలసరస్వత్యై నమః ।
శ్రీద్వితీయాయై నమః । 30

శ్రీశోభిన్యై నమః ।
శ్రీనిత్యాయై నమః ।
శ్రీనవీనాయై నమః ।
శ్రీనిత్యనూతనాయై నమః ।
శ్రీచణ్డికాయై నమః ।
శ్రీవిజయాయై నమః ।
శ్రీఆరాధ్యాయై నమః ।
శ్రీదేవ్యై నమః ।
శ్రీగగనవాహిన్యై నమః |
శ్రీఅట్టహాస్యాయై నమః । 40

శ్రీకరాలాస్యాయై నమః ।
శ్రీచతురాస్యాపూజితాయై నమః ।
శ్రీఅదితిపూజితాయై నమః ।
శ్రీరుద్రాయై నమః ।
శ్రీరౌద్రమయ్యై నమః ।
శ్రీమూర్యై నమః ।
శ్రీవిశోకాయై నమః ।
శ్రీశోకనాశిన్యై నమః ।
శ్రీశివపూజ్యాయై నమః ।
శ్రీశివారాధ్యాయై నమః । 50

శ్రీశివధ్యేయాయై నమః ।
శ్రీసనాత
న్యై నమః ।
శ్రీబ్రహ్మవిద్యాయై నమః ।
శ్రీజగద్దా
త్య్రై నమః ।
శ్రీనిర్గుణా
యై నమః ।
శ్రీగుణపూజితాయై నమః ।
శ్రీసగుణా
యై నమః ।
శ్రీసగుణారాధ్యాయై నమః ।
శ్రీహరిపూజితా
యై నమః ।
శ్రీఇన్ద్రపూజితా
యై నమః । 60

శ్రీదేవపూజితాయై నమః ।
శ్రీరక్తప్రియాయై నమః ।
శ్రీరక్తాక్ష్యై నమః ।
శ్రీరుధిరభూషితాయై నమః ।
శ్రీఆసవభూషితాయై నమః ।
శ్రీబలిప్రియాయై నమః ।
శ్రీబలిరతాయై నమః ।
శ్రీదుర్గాయై నమః ।
శ్రీబలవత్యై 
నమః |
శ్రీబలాయై నమః । 70

శ్రీబలప్రియాయై నమః ।
శ్రీబలరతాయై నమః ।
శ్రీబలరామప్రపూజితాయై నమః ।
శ్రీఅర్ధకేశాయై నమః |
శ్రీ ఈశ్వర్యై నమః ।
శ్రీకేశాయై నమః ।
శ్రీకేశవవిభూషితాయై నమః ।
శ్రీఈశవిభూషితాయై నమః ।
శ్రీపద్మమాలాయై నమః ।
శ్రీపద్మాక్ష్యై నమః । 80

శ్రీకామాఖ్యా
యై నమః ।
శ్రీగిరినన్దిన్యై నమః |
శ్రీదక్షిణాయై నమః ।
శ్రీదక్షాయై నమః ।
శ్రీదక్షజాయై నమః ।
శ్రీదక్షిణేరతాయై నమః ।
శ్రీవజ్రపుష్పప్రియామయై నమః ।
శ్రీరక్తప్రియాయై నమః ।
శ్రీకుసుమభూషితాయై నమః ।
శ్రీమాహేశ్వర్యై నమః | 90

శ్రీమహాదేవప్రియాయై నమః ।
శ్రీపఞ్చవిభూషితాయై నమః ।
శ్రీఇడాయై నమః ।
శ్రీపింగళాయై నమః ।
శ్రీసుషుమ్ణాయై నమః ।
శ్రీప్రాణరూపిణ్యై నమః ।
శ్రీగాన్ధార్యై నమః ।
శ్రీప
ఞ్చమ్యై నమః ।
శ్రీప
ఞ్చననపరిపూజితాయై నమః ।
శ్రీఆదిపరిపూజితాయై నమః । 100

Sri Tara Sata Nama Stottram - శ్రీ తారా శతనామ స్తోత్త్రం (బృహన్నీలా తంత్రం)

శ్రీ తారా శతనామ స్తోత్త్రం (బృహన్నీలా తంత్రం)

శ్రీదేవ్యువాచ ।
సర్వం సంసూచితం దేవ నామ్నాం శతం మహేశ్వర 

యత్త్నైః శతైర్మహాదేవ మయి నాత్ర ప్రకాశితమ్‌ || 01 || 

పఠిత్వా పరమేశాన హఠాత్‌ సిద్ధ్యతి సాధకః 

నామ్నాం శతం మహాదేవ కథయస్వ సమాసతః 
|| 02 ||

శ్రీభైరవ ఉవాచ ।
శృణు దేవి ప్రవక్ష్యామి భక్తానాం హితకారకమ్‌ ।
యజ్ఞాత్వా సాధకాః సర్వే జీవన్ముక్తిముపాగతాః 
|| 03 ||

కృతార్థాస్తే హి విస్తీర్ణా యాన్తి దేవీపురే స్వయమ్‌ ।
నామ్నాం శతం ప్రవక్ష్యామి జపాత్‌ స(అ)ర్వజ్ఞదాయకమ్‌ 
|| 04 ||

నామ్నాం సహస్రం సంత్యజ్య నామ్నాం శతం పఠేత్‌ సుధీః 

కలౌ నాస్తి మహేశాని కలౌ నాన్యా గతిర్భవేత్‌ 
|| 05 ||

శృణు సాధ్వి వరారోహే శతం నామ్నాం పురాతనమ్‌ ।
సర్వసిద్ధికరం పుంసాం సాధకానాం సుఖప్రదమ్‌ 
|| 06 ||

తారిణీ తారసంయోగా మహాతారస్వరూపిణీ 

తారకప్రాణహ
ర్త్రీ చ తారానన్దస్వరూపిణీ || 07 ||

మహానీలా మహేశానీ మహానీలసరస్వతీ ।
ఉగ్రతారా సతీ సాధ్వీ భవానీ భవమోచినీ 
|| 08 ||

మహాశ్ఖరతా భీమా శ్కారీ శ్కరప్రియా ।
మహాదానరతా చణ్డీ చణ్డాసురవినాశినీ 
|| 09 ||

చన్ద్రవద్రూపవదనా చారుచ
న్ద్రమహోజ్జ్వలా ।
ఏకజటా కుర్గక్షీ వరదాభయదాయినీ 
|| 10 ||

మహాకాళీ మహాదేవీ గుహ్యకాళీ వరప్రదా ।
మహాకాలరతా సాధ్వీ మహైశ్వర్యప్రదాయినీ 
|| 11 ||

ముక్తిదా స్వర్గదా సౌమ్యా సౌమ్యరూపా సురారిహా ।
శఠవిజ్ఞా మహానాదా కమలా బగలాముఖీ 
|| 12 ||

మహాముక్తిప్రదా కాళీ కాళరాత్రిస్వరూపిణీ ।
సరస్వతీ సరిచ్శ్రేష్టా స్వర్గ స్వర్గవాసినీ 
|| 13 ||

హిమాలయసుతా కన్యా కన్యారూపవిలాసినీ ।
శవోపరిసమాసీనా ము
ణ్డమాలావిభూషితా || 14 ||

దిగమ్బరా పతిరతా విపరీతరతాతురా ।
రజస్వలా రజఃప్రీతా స్వయమ్భూకుసుమప్రియా 
|| 15 ||

స్వయ
మ్భూకుసుమ ప్రాణా స్వయమ్భూకుసుమోత్సుకా ।
శివప్రాణా శివరతా శివదాత్రీ శివాసనా 
|| 16 ||

అట్టహాసా ఘోరరూపా నిత్యానన్దస్వరూపిణీ ।
మేఘవర్ణా కిశోరీ చ యువతీస్తనక్కుమా 
|| 17 ||

ఖర్వా ఖర్వజనప్రీతా మణిభూషితమ
ణ్డనా I
క్కిణీశబ్దసంయుక్తా నృత్యన్తీ రక్తలోచనా 
|| 18 ||

కృశ్గా కృసరప్రీతా శరాసనగతోత్సుకా ।
కపాలఖర్పరధరా ప్చశన్ము
ణ్డమాలికా || 19 ||

హవ్యకవ్యప్రదా తుష్టిః పుష్టిశ్చైవ వర్గానా ।
శాన్తిః క్షాన్తిర్మనో బుద్ధిః సర్వబీజస్వరూపిణీ 
|| 20 ||

ఉగ్రాపతారిణీ తీర్ణా నిస్తీర్ణగుణవృన్దకా ।
రమేశీ రమణీ రమ్యా రామానన్దస్వరూపిణీ 
|| 21 ||

రజనీకరసమ్పూర్ణా రక్తోత్పలవిలోచనా 

ఇతి తే కధితం దివ్యం శతం నామ్నాం మహేశ్వరి 
|| 22 ||

ప్రపఠేద్‌ భక్తిభావేన తారిణ్యాస్తారణక్షమమ్‌ ।
సర్వాసురమహానాదస్తూయమానమనుత్తమమ్‌ 
|| 23 ||

షణ్మాసాద్‌ మహదైశ్వర్యం లభతే పరమేశ్వరి 

భూమికామేన జప్తవ్యం వత్సరాత్తాం లభేత్‌ ప్రియే 
|| 24 ||

ధనార్థీ ప్రాప్నుయాదర్ధం మోక్షార్థీ మోక్షమా
ప్నుయాత్‌ ।
దారార్థీ ప్రాప్నుయాద్‌ దారాన్‌ సర్వాగమ(పురో
ప్రచో)దితాన్‌ || 25 ||

అష్టమ్యాం చ శతావృత్త్యా ప్రపఠేద్‌ యది మానవః ।
సత్యం సిద్ద్యతి దేవేశి సంశయో నాస్తి కశ్చన 
|| 26 ||

ఇతి సత్యం పునః సత్యం సత్యం సత్యం మహేశ్వరి 

అస్మాత్‌ పరతరం నాస్తి స్తోత్రమధ్యే న సంశయః 
|| 27 ||

నామ్నాం శతం పఠేద్‌ మన్త్రం సంజప్య భక్తిభావతః ।
ప్రత్యహం ప్రపఠేద్‌ దేవి యదీచ్చేత్‌ శుభమాత్మనః 
|| 28 ||

ఇదానీం కథయిష్యామి విద్యోత్పత్తిం వరాననే ।
యేన విజ్ఞానమాత్రేణ విజయీ భువి జాయతే 
|| 29 ||

యోనిబీజత్రిరావృత్త్యా మధ్యరాత్రౌ వరాననే ।
అభిమన్త్య్ర జలం స్నిగ్ధం అష్టోత్తరశతేన చ
|| 30 ||

తజ్జలం తు పిబేద్‌ దేవి షణ్మాసం జపతే యది ।
సర్వవిద్యామయో భూత్వా మోదతే పృథివీతలే 
|| 31 ||

శక్తిరూపాం మహాదేవీం శృణు హే నగనన్దిని ।
వైష్ణవః శైవమార్గో వా శాక్తో వా గాణపో
పి వా || 32 ||

తథాపి శక్తేరాధిక్యం శృణు భైరవసున్దరి 

సచ్చిదానన్దరూపాచ్చ సకలాత్‌ పరమేశ్వరాత్‌ 
|| 33 ||

శక్తిరాసీత్‌ తతో నాదో నాదాద్‌ బిన్దుస్తతః పరమ్‌ ।
అథ బిన్ద్వాత్మనః కాలరూపబిన్దుకలాత్మనః 
|| 34 ||

జాయతే చ జగత్సర్వం సస్థావరచరాత్మకమ్‌ ।
శ్రోతవ్యః స చ మన్తవ్యో నిర్ధ్యాతవ్యః స ఏవ హి 
|| 35 ||

సాక్షాత్కార్యశ్చ దేవేశి ఆగమైర్వివిధైః శివే ।
శ్రోతవ్యః శ్రుతివాక్యేభ్యో మన్తవ్యో మననాదిభీః 
|| 36 ||

ఉపపత్తిభిరేవాయం ధ్యాతవ్యో గురుదేశతః ।
తదా స ఏవ సర్వాత్మా ప్రత్యక్షో భవతి క్షణాత్‌ 
|| 37 ||

తస్మిన్‌ దేవేశి ప్రత్యక్షే శృణుష్వ పరమేశ్వరి ।
భావైర్బహువిధైర్దేవి భావస్తత్రాపి నీయతే 
|| 38 ||

భక్తేభ్యో నానాఘాసేభ్యో గవి చైకో యథా రసః ।
సదుగ్ధాఖ్యసంయోగే నానాత్వం లభతే ప్రియే 
|| 39 ||

తృణేన జాయతే దేవి రసస్తస్మాత్‌ పరో రసః ।
తస్మాత్‌ దధి తతో హవ్యం తస్మాదపి రసోదయః 
|| 40 ||

స ఏవ కారణం తత్ర తత్కార్యం స చ లక్ష్యతే ।
దృశ్యతే చ మహాదే(వ
వి)న కార్యం న చ కారణమ్‌ || 41 ||

తథైవాయం స ఏవాత్మా నానావిగ్రహయోనిషు ।
జాయతే చ తతో జాతః కాలభేదో హి భావ్యతే 
|| 42 ||

స జాతః స మృతో బద్ధః స ముక్తః స సుఖీ పుమాన్‌ ।
స వృద్ధః స చ విద్వాంశ్చ న స్త్రీ పుమాన్‌ నపుంసకః 
|| 43 ||

నానాధ్యాససమాయోగాదాత్మనా జాయతే శివే ।
ఏక ఏవ స ఏవాత్మా సర్వరూపః సనాతనః 
|| 44 ||

అవ్యక్తశ్చ స చ వ్యక్తః ప్రకృత్యా జ్ఞాయతే ధ్రువమ్‌ 

తస్మాత్‌ ప్రకృతియోగేన వినా న జ్ఞాయతే క్వచిత్‌ 
|| 45 ||

వినా ఘటత్వయోగేన న ప్రత్యక్షో యథా ఘటః ।
ఇతరాద్‌ భిద్యమానో
పి స భేదముపగచ్చతి|| 46 ||

మాం వినా పురుషే భేదో న చ యాతి కథ్చన 

న ప్రయోగైర్న చ జ్ఞానైర్న శ్రుత్యా న గురుక్రమైః 
|| 47 ||

న స్నానైస్తర్ప
ణ్త్య్రర్వాపి నచ దానైః కదాచన ।
ప్రకృత్యా జ్ఞాయతే హ్యాత్మా ప్రకృత్యా లుప్యతే పుమాన్‌ 
|| 48 ||

ప్రకృత్యాధిష్ఠితం సర్వం ప్రకృత్యా వ్చతం జగత్‌ 

ప్రకృత్యా భేదమాప్నోతి ప్రకృత్యాభేదమాప్నుయాత్‌
|| 49 ||

నరస్తు ప్రకృతిర్నైవ న పుమాన్‌ పరమేశ్వరః 

ఇతి తే కథితం తత్త్వం సర్వసారమనోరమమ్‌ 
|| 50 ||

|| ఇతి శ్రీబృహన్నీలతన్త్రే భైరవభైరవీసంవాదే 
తారాశతనామ తత్త్వసారనిరూపణం వింశః పటలః || 

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...