Saturday, January 11, 2025

తిరుప్పావై - ఇరవై ఏడవ పాశురము

తిరుప్పావై - ఇరవై ఏడవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈ పాశురాల్లో 20వ పాశురం నుంచి 29వ పాశురం వరకూ గోదాదేవి శ్రీకృష్ణ భగవానుడిని వర్ణిస్తుంది. నేడు 27 వ పాశురంలో శ్రీకృష్ణుడు తో కలిసి పాలు, అన్నం మునిగేలా నెయ్యి పోసి.. ఆ మధుర పాల పదార్ధం మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కుర్చుని చల్లగా హాయిగా భుజించ వలెను అని గోదాదేవి.. 27 వ పాశురంలో కోరుతుంది.

కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్ || 27 ||

దీని అర్ధం తెలుసుకుందాం..

శత్రువులను జయించే కళ్యాణ గుణ సంపన్న గోవిందా నిన్ను కీర్తించి వ్రత సాధనమగు పర అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానం లోకులందరూ పొగడెడి తీరుతో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చేడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందియలు, గజ్జెలు మొదలగు అనేక ఆభరణాలు మేము ధరించవలెను. తర్వాత మంచి వస్త్రాలు ధరించవలెను. పాలు, అన్నం మునిగేలా నెయ్యి పోసి.. ఆ మధుర పాల పదార్ధం మోచేయి వెంబడి కారునట్లు నీతో కలిసి కుర్చుని చల్లగా హాయిగా భుజించ వలెను అని గోదాదేవి.. రంగనాధుడిని తన చెలులు గోపికలతో కలిసి కోరింది.

ఆండాల్ తిరువడిగళే శరణం

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...