Wednesday, January 8, 2025

వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు

వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు

తాళం: 
రాగం: సామంతం (మేళకర్త 28, హరి ఖంభోజి   జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స రి2 మ1 ప ద2 స
అవరోహణ: స ద2 ప మ1 గ3 రి2 స

పల్లవి
వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు
కలికి మరుఁడు సేసినాజ్ఞ కడవఁగ రాదురా ॥వలచి॥

చరణము
అంగడి కెత్తినట్టి దివ్వె లంగన ముఖాంబుజములు
ముంగిటి పసిఁడి కుంభములును ముద్దుల కుచయుగంబులు
యెంగిలి సేసినట్టి తేనె లితవులైన మెఱుఁగుమోవులు
లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు ॥వలచి॥

కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలు
యెంచఁగ నెండలో నీడలు యెడనెడ కూటములు
తెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడని లేఁతనవ్వులు
మంచితనములోని నొప్పులు మాటలలోని మాటలు ॥వలచి॥

నిప్పులమీఁద జల్లిన నూనెలు నిగిడి తనివిలేని యాసలు
దప్పికి నేయి దాగినట్లు తమకములోని తాలిమి
చెప్పఁగరాని మేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు
అప్పని కరుణ గలిగి మనుట అబ్బురమైన సుఖములు ॥వలచి॥

No comments:

Post a Comment

Tuesday Subrahmanya Swamy - మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి

మంగళవారం సుబ్రహ్మణ్య  స్వామి పార్వతీపరమేశ్వరుల తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి సకల శుభకారకుడు. సర్వ దోష నివారకుడు. ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు...