శ్రీమద్విఖ్యాతి లతా, క్రామిత రోదోஉ౦తరాళ! కమనీయ మహా
జీమూతతులితదేహ, శ్యామలరుచిజాల! రామచంద్రనృపాలా!
ఓ రామచంద్రప్రభూ! నీ కీర్తి విశ్వమంతా వ్యాపించింది. అందమైన గొప్పమేఘంతో సమానమైన నల్లని కాంతిగల నీకు నమస్కారం.
సుగుణాలతో గొప్పవారైన ఆ మునీంద్రులకు సమస్త పురాణాలను వివరించటంలో దిట్ట అయిన సూతుడు ఇలా అన్నాడు. ఆ విధంగా ప్రాయోపవేశం చేసిన పరీక్షిన్మహారాజు శుకమహర్షిని చూచి,
రాక్షసులపట్ల నారాయణునికి విరోధభావ మెందుకని పరీక్షిత్తు ప్రశ్నించుట
No comments:
Post a Comment